నిన్న కురిసిన వర్షం సృష్టించిన అస్తవ్యస్త పరిస్థితి నుంచి కోలుకోక ముందే శనివారం సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షం హైదరాబాద్ నగరాన్ని రెండోరోజు అతలాకుతలం చేస్తోంది. సాయంత్రం 6 గంటల నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా వర‍్షం కురుస్తోంది. దీంతో జీహెచ్ఎంసీ విపత్తు నిర్వాహణ విభాగం రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.