vijayawada highway
-
హైవేపై ‘సంక్రాంతి’ రద్దీ.. కిక్కిరిసిన వాహనాలు
సాక్షి, చౌటుప్పల్: హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు కిక్కిరిసిపోయాయి. హైదరాబాద్‌తోపాటు పరిసర ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలు పండుగ కోసం స్వస్థలాలకు వెళ్తున్న క్రమంలో ఈ రద్దీ ఏర్పడింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచే వాహనాల రద్దీ పెరిగిపోయింది. పంతంగి టోల్‌ప్లాజా వద్ద గురువారం అర్ధరాత్రి 12 నుంచి శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు 53 వేల వాహనాల రాకపోకలు సాగించాయి. గతేడాది రోజంతా(24 గంటలు) కలిపి అరవై వేల వాహనాలు మాత్రమే ప్రయాణించగా.. ఈ ఏడాది కేవలం 18 గంటల్లోనే 50వేలకుపైగా వాహనాలు వెళ్లడం గమనార్హం. సంక్రాంతికి భారీగా సొంతూళ్లకు జనాలు వెళ్తున్నారు. పంతంగి టోల్ ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ కొనసాగుతున్నారు. పంతంగి టోల్ ఫ్లాజా వద్ద హైదరాబాద్- విజయవాడ వైపు పది టోల్ బూత్‌లను జీఎంఆర్ ఓపెన్ చేసింది. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్ల పహాడ్ వద్ద రద్దీ కొనసాగుతోంది. కొర్లపహాడ్ వద్ద ఎనిమిది టోల్ బూత్‌లను సిబ్బంది తెరిచారు. తెలుగు రాష్ట్రాల్లో బస్స్టేషన్లు, రైల్వేస్టేషన్లు ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. తిరుపతి, విజయవాడ,విశాఖపట్నం బస్స్టేషన్లల్లో ప్రయాణికులు కిక్కిరిసిపోయారు. రద్దీ కారణంగా ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసింది. అదనపు చార్జీలు లేకుండానే సర్వీసులను నడుపుతున్నారు. సంక్రాంతి ప్రయాణికులతో రాజమండ్రి, వైజాగ్, విజయవాడ విమానాలు ఫుల్ శంషాబాద్: సంక్రాంతి పండుగ ప్రయాణ సందడి ఆకాశయానంపై కూడా పడింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి, విశాఖపట్నం, విజయవాడకు హైదరాబాద్ నుంచి బయలుదేరే విమానాలు ప్రయాణికులతో రద్దీగా ఉంటున్నాయి. శని, ఆది, సోమవారాల్లో ఆయా ప్రాంతాలకు వెళ్లాల్సిన విమానాల్లో దాదాపుగా సీట్లన్నీ బుక్ అయ్యాయి. ఆకాశాన్నంటుతున్న ఫ్లైట్ చార్జీలు.. ఒకటి, రెండు సీట్లు ఉన్న వాటిలోని ప్రయాణచార్జీలు చుక్కలనంటుతున్నాయి. విశాఖపట్టానికి సాధారణ సమయాల్లో మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు ఉండగా ఇప్పుడు ఏకంగా ముౖప్పైవేల పైచిలుకు చార్జీలు వసూలు చేస్తున్నారు. విజయవాడ, రాజమండ్రి వెళ్లే విమానాల్లో కూడా కనీసం పదివేల రూపాయలకు తగ్గకుండా చార్జీలున్నాయి. ఇందులో కూడా నేరుగా కాకుండా వయా ఢిల్లీ, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి వెళ్లే విమానాలు మాత్రమే ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రయాణ సమయం కనీసం 10 నుంచి 16 గంటల వరకు ఉంది. ఇదీ చదవండి: అద్దె బ్యాచ్ దిగింది ! -
సంక్రాంతి ఎఫెక్ట్: విజయవాడ హైవేపై కదలని వాహనాలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి సంక్రాంతి కోసం సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. హయత్ నగర్ నుంచి కొత్తగూడెం వరకు భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. టోల్గేట్ల దగ్గర వాహనాలు బారులు తీరాయి. శుక్రవారం నుంచి పండగ సెలవులు కావడంతో ప్రజలు నగరం నుంచి పల్లెబాట పట్టారు. నగరవాసులంతా సొంత ప్రాంతాలకు క్యూ కట్టడంతో హైదరాబాద్ నగరం అంతా ఖాళీ అవుతుంది. లక్షలాది కుటుంబాలు సంక్రాంతి పండుగకు తమ స్వంత ఊర్లకు పయనమయ్యారు. ముఖ్యంగా ఏపీ వైపు వెళ్లే వాహనాలతో హైవేపై రద్దీ కనిపిస్తోంది. రద్దీ నియంత్రణకు పోలీసులు చర్యలు చేపట్టారు. టోల్ ప్లాజాలు దాటేందుకు సుమారు 15 నిమిషాలకుపైనే టైం పడుతోంది. హైదరాబాద్‌కు సమీపంలోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా నిలిచిపోయాయి. రద్దీ దృష్ట్యా అధికారులు అదనంగా 10 గేట్లను తెరిచారు. రానున్న రెండు రోజుల్లో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. రద్దీని తగ్గించేందుకు హైదరాబాద్ నుంచి రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు, బస్సులు నడుపుతున్నారు. ఇదీ చదవండి: ధాన్యం రైతులకు సీఎం జగన్ సంక్రాంతి కానుక -
ఆమె కేవలం ఫ్రెండ్ అంతే!: నవీన్ తండ్రి
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ ఎంజీ యూనివర్సిటీ ఇంజనీరింగ్ విద్యార్థి నవీన్ దారుణ హత్యోదంతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. తాను ప్రేమించిన అమ్మాయితో.. చనువుగా ఉండటం భరించలేకే స్నేహితుడిని దారుణంగా హతమార్చినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు నిందితుడు హరిహర కృష్ణ. అయితే స్నేహితుడే తన కొడుకుపై ఇంతటి ఘాతుకానికి పాల్పడతాడని ఊహించలేదని నవీన్ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాక్షి టీవీతో మృతుడు నవీన్ తండ్రి శంకర్ నాయక్ పోలీసులతో మాట్లాడుతూ.. గెట్ టు గెదర్ పేరుతో నా కొడుకుని పిలిచి హత్య చేశాడు. కాకపోతే.. హరిహర కృష్ణ పద్ధతి నచ్చక ఆ అమ్మాయి దూరం అయిందని అంతా చెప్తున్నారు. మా అబ్బాయి నవీన్ ఆ అమ్మాయితో ప్రేమలో లేడు. వాళ్లిద్దరూ కేవలం స్నేహితులే. నవీన్‌కు ఆ అమ్మాయి దగ్గర అవుతుందేమో అనే అనుమానంతోనే హత్య చేశాడు. ఈ హత్యలో ఆ అమ్మాయి ప్రేమేయం ఉందో, లేదో కూడా మాకు తెలియదు అని చెప్పారాయన. ఏది ఏమైనా తమ బిడ్డను పొట్టనబెట్టుకున్న వాడిని కఠినంగా శిక్షించాలి అని కోరుతోంది బాధిత కుటుంబం. ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ కాపీలో పూర్తి సమాచారం పొందుపరిచారు. నిందితుడు పేరాల హరిహర కృష్ణ, మలక్‌పేట పరిధిలోని మూసారాంబాగ్‌కు చెందినవాడు. నిందితుడు తనంతట తానే పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. నేరాన్ని అంగీకరించే సమయంలో అతనిచ్చిన స్టేట్మెంట్ ఇలా ఉంది. నవీన్ , నేను దిల్షుక్ నగర్లో ఇంటర్మీడియట్ కలిసి చదువుకున్నాం. ఆ సమయంలో నేను ఒక స్నేహితురాలిని ప్రేమించా. కొన్ని కారణాల వల్ల ఆమె నాకు దూరం అయ్యింది. కానీ, నవీన్ దానిని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. ఆమెను ప్రేమించాడు!. ఆ అమ్మాయి కూడా నవీన్‌తో సన్నిహితంగా మెలిగింది. వాళ్లిద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని తట్టుకోలేక.. మూడు నెలల కిందట నవీన్‌ను చంపాలని నిర్ణయించుకున్నా. కొద్దీ రోజుల్లోనే బీటెక్ పూర్తి చేసుకొని హైదరాబాద్ కి నవీన్ కోచింగ్ రాబోతున్నట్లు తెలుసుకున్నా. హైదరాబాద్ వస్తే నా లవర్‌కు మరింత దగ్గర అవుతాడేమో అనిపించింది. అందుకే టైం కోసం ఎదురు చూశా. ఫిబ్రవరి 17వ తేదీన.. నేనూ, నవీన్ ఎల్బీ నగర్లో కలుసుకున్నాం. కాసేపు అలా తిరిగాం. ఆ తర్వాత మూసారాంబాగ్‌లోని మా ఇంటికి వెళ్లాం. రాత్రి కాగానే.. తాను హాస్టల్ వెళ్తానని చెప్పాడు. దీంతో బైక్‌పై ఇద్దరం బయల్దేరాం. పెద్ద అంబర్‌పేటకు చేరుకోగానే మా ఇద్దరి మధ్య ఆ యువతి విషయమై గొడవ మొదలైంది. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి.. కత్తితో దాడి చేశా. నవీన్‌ను చంపేసి ప్రైవేట్ భాగం, గుండె, తన, చేతి వేళ్లు, చేతులు.. అన్నింటిని కత్తితో వేరు చేసి.. అక్కడి నుంచి పరారయ్యాను. విజయవాడ హైవే పక్కన పడేశాను.. ఇది ఈ కేసులో నిందితుడు హరిహర కృష్ణ పోలీసుల ముందు ఒప్పుకున్న విషయాలు. ఈ మేరకు విషయాలన్ని ఎఫ్ఐఆర్లో పొందుపరిచారు స్నేహితులు. నిందితుడు హరిహర కృష్ణ పై సెక్షన్ 302, 201 ఐపీసీ , 5(2) (V) , SC ,St, POA act 2015 సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు. ఇక.. తన మీదకు అనుమానం రాకూడదనే ఉద్దేశంతో ఘటన తర్వాత నవీన్ స్నేహితులకు కాల్ చేశాడు హరి. నవీన్ మొబైల్ స్విచ్ఛాఫ్ వస్తోందని డ్రామాలాడాడు. అమ్మాయి పాత్రపై విచారణ చేపట్టాం అబ్దుల్లాపూర్ మెట్ లో జరిగిన నవీన్ హత్య కేసుపై సాక్షీ టీవీ తో ఎల్బీనగర్ డీసీపి సాయి శ్రీ మాట్లాడారు. నల్గొండ ఎంజీ యూనివర్సిటీ కి చెందిన నవీన్ హత్య కేసులో దర్యాప్తు జరుగుతుంది. ఇప్పటికే నిందితుడు హరిహరకృష్ణ ను అరెస్ట్ చేశాము. సాంకేతిక ఆధారాలతో కేసును విచారణ చేస్తున్నాము . హత్యలో ఎవరెవరు పాల్గొన్నారనేది తేలాల్సి ఉంది. ఇది ఒక పథకం ప్రకారం చేసిన హత్య గా స్పష్టమైంది. నవీన్ ను అతి కిరాతకంగా పొడిచి చంపిన నిందితుడు హరిహరకృష్ణ. ఇందులో అమ్మాయి పాత్ర ఎంత వరకు ఉందో తేల్చాల్సి ఉంది. నవీన్ , హరిహరకృష్ణ ఇద్దరూ మంచి స్నేహితులు అని తెలిపారాయన. ఒత్తిడి తట్టుకోలేకే.. నేనావత్ నవీన్‌ది నాగర్‌కర్నూల్ జిల్లా చారుకొండ మండలం సిరిసనగండ్ల గ్రామం. నల్గొండలోని ఎంజీ యూనివర్సిటీ పరిధిలోని ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ (ఈఈఈ) నాలుగో ఏడాది చదువుతున్నాడు. నాలుగు రోజులైనా కళాశాలకు, ఇంటికి నవీన్ రాకపోవడంతో ఈ నెల 22న తండ్రి శంకర్ నాయక్ నార్కట్‌పల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నార్కట్‌పల్లి ఎస్సై రామకృష్ణ ఎంజీయూలో విద్యార్థులను, హరి స్నేహితులను విచారించారు. అయితే.. అదేరోజు సాయంత్రం నుంచి హరి ఫోన్ స్విఛ్చాఫ్ రావడంతో వారి తల్లిదండ్రులను పోలీసులు పిలిపించి అతని గురించి వాకబు చేశారు. కుటుంబ సభ్యులు, పోలీసులు, స్నేహితుల నుంచి ఒత్తిడి పెరగడంతో హరి శుక్రవారం రాత్రి అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు హరిహర కృష్ణ. -
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఢీ.. విజయవాడ హైవేపై ప్రమాదం
సాక్షి, యాదాద్రి భువనగిరి: జిల్లాలో జాతీయ రహదారిపై అర్ధరాత్రి దాటాక రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన రెండు బస్సులు ఒకదానిని మరొకటి ఢీ కొట్టాయి. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడగా, పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. చౌటుప్పల్ మండలం గుండ్లబావి వద్ద హైదరాబాద్-విజయవాడ ఎన్‌హెచ్-65 పై ఈ ఘటన జరిగింది. రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన బస్సులు మైత్రి ట్రావెల్స్, ఆరంజ్ ట్రావెల్స్ బస్సులుగా నిర్ధారణ అయ్యింది. ఓవర్ టేక్ చేసే క్రమంలోనే ఈ ప్రమాదం జరిగిందని, ఆ సమయంలో ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నారని ప్రాథమిక విచారణ ద్వారా పోలీసులు వెల్లడించారు. పదహారు మందికి స్వల్ప గాయాలు కాగా, మరో నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలై విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లను చికిత్స కోసం వివిధ ఆస్పత్రులకు తరలించారు. -
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
సాక్షి, కృష్ణా జిల్లా: మచిలీపట్నం, విజయవాడ జాతీయ రహదారిపై గూడూరు మండలం పర్ణశాల గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వ్యవసాయ కూలీలతో వెళుతున్న ఆటోను వెనుక నుండి వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న 14 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని హుటాహుటిన మచిలీపట్నంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషమంగా ఆరుగురిని ఉన్న వారిని మెరుగైన చికిత్స కోసం విజయవాడలోని ఆంధ్రా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులంతా మచిలీపట్నం గిలకలదిండి ప్రాంతానికి చెందిన మహిళలుగా గుర్తించారు. ప్రమాద విషయం తెలుసుకున్న వైసీపీ యువ నాయకుడు, మంత్రి పేర్ని నాని తనయుడు పేర్ని కిట్టు ఆస్పత్రికి వచ్చి క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవలపై వాకబు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న గూడూరు ఎస్సై మదినా బాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. -
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ కొరడా
కృష్ణాజిల్లా : పండగ వేళ తీవ్ర రద్దీగా ఉన్న సమయంలో.. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝుళిపించారు. మంగళవారం రాత్రి ఆర్టీఏ అధికారి ఎంవీఐ ప్రవీణ్ అధ్వర్యంలో ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్ ప్లాజా వద్ద విజయవాడ జాతీయ రహదారిపై స్పెషల్‌డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 36 బస్సులను గుర్తించి.. కేసులు నమోదు చేశారు. మార్నింగ్ స్టార్, ఎస్వీఆర్, ఆరెంజ్, కావేరి ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్, విజయవాడ వైపు వెళ్తున్న 80కి పైగా బస్సులును తనిఖీ చేసిన అధికారులు ప్రయాణికుల వద్ద అధిక డబ్బులు వసూలు చేస్తూ, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బస్సులపై కేసులు నమోదు చేశారు. -
భారీగా నిలిచిపోయిన వాహనాలు.. ఓటర్లకు తిప్పలు
-
భారీగా నిలిచిపోయిన వాహనాలు.. ఓటర్లకు తిప్పలు
యాదాద్రి: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటు వేసేందుకు సొంతూళ్లకు బయలుదేరిన ఓటర్లకు తిప్పలు తప్పడం లేదు. హైదరాబాద్ -విజయవాడ జాతీయ రహదారిపై పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు భారీగా నిలిచిపోయాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రేపు ఎన్నికలు జరుగుతున్నందున ఓటు హక్కును వినియోగించుకునేందుకు హైదరాబాద్ నగరం నుంచి ఓటర్లు మంగళవారం రాత్రి నుంచి సొంతూళ్లకు బయల్దేరారు. దీంతో అర్ధరాత్రి నుంచి ఈ రహదారిపై వాహనాలు భారీగా బారులు తీరాయి. బుధవారం తెల్లవారుజాము నుంచి చౌటుప్పల్ మండలం పంతంగి టోల్గేట్ వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. విజయవాడ వైపుకు వెళ్లే వాహనాలు పోటేత్తడంతో.. ట్రాఫిక్ జామ్ భారీగా అయ్యింది. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. టోల్ ఫీజులేకుండా వాహనాలను వదిలిపెట్టాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. గంటలకొద్ది వేచిఉండడంతో టోల్గేట్ సిబ్బందిపై వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తంచేస్తున్నారు. దీంతో గేట్ వద్ద కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎన్నికల నేపథ్యంలో రైల్వే స్టేషన్లో కూడా పరిస్థితి ఇదే విధంగా ఉంది. ఏపీకి వెళ్లే ఓటర్లు పెద్దఎత్తున రావడంతో రైళ్లన్ని కిక్కిరిసిపోతున్నాయి. (చదవండి: ఓటేయడానికి పోటెత్తారు!) -
నేటి నుంచే పచ్చని పండుగ
- నల్లగొండ జిల్లా గుండ్రాంపల్లిలో రెండో విడత హరితహారాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ - రెండు వారాల పాటు కార్యక్రమం.. 46 కోట్ల మొక్కలు నాటే లక్ష్యం - విజయవాడ హైవేపై 2 గంటల్లో లక్ష మందితో 163 కిలోమీటర్ల పొడవునా మొక్కలు నాటే కార్యక్రమం - గ్రేటర్లో ఈనెల 11న ఒకేరోజు 25 లక్షల మొక్కలు నాటే లక్ష్యం సాక్షి, హైదరాబాద్: తెలంగాణను ఆకుపచ్చని రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టిన ‘హరితహారం’ కార్యక్రమం రెండో విడతకు సర్వం సిద్ధమైంది. రెండు వారాల పాటు కొనసాగనున్న ఈ కార్యక్రమాన్ని శుక్రవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద ప్రారంభిస్తారు. మొత్తంగా ఈ వర్షాకాలంలో రాష్ట్రవ్యాప్తంగా 46 కోట్ల మొక్కలను నాటేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం 4,213 నర్సరీల్లో సుమారు 200 రకాల మొక్కలను సిద్ధం చేశారు. అయితే గతేడాది చేపట్టిన హరితహారం తొలివిడత వర్షాభావం కారణంగా నత్తనడకన సాగింది. ఈసారి వాతావరణం ఆశాజనకంగా ఉండడంతో 46 కోట్ల మొక్కలు నాటి రికార్డు సాధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి సీఎం కేసీఆర్ ఇటీవల సమీక్షించి, అధికార యంత్రాంగానికి కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. ఇందులో అటవీ, పంచాయతీరాజ్, వ్యవసాయం, విద్య, నీటిపారుదల, ఎక్సైజ్, రోడ్లు భవనాల శాఖ తదితర 25 కీలక విభాగాలు పాలుపంచుకోనున్నాయి. గ్రామ పంచాయతీలు, నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రంలోని అన్ని శాఖల మంత్రులు, పార్లమెంటు సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. 33 శాతం పచ్చదనం లక్ష్యంగా.. పర్యావరణ సమతౌల్యం కోసం భూభాగంలో 33 శాతం అడవులు, పచ్చదనం ఉండాలి. కానీ ప్రస్తుతం ఇది దేశవ్యాప్తంగా చూస్తే 22 శాతం, తెలంగాణలో 24 శాతమే ఉంది. ఈ నేపథ్యంలో పచ్చదనాన్ని 33 శాతానికి పెంచాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ గతేడాది రంగారెడ్డి జిల్లా చిలుకూరులో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. మూడేళ్లలో 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో తొలి ఏడాది 40 కోట్ల మొక్కలు నాటాలన్న లక్ష్యం పెట్టుకున్నా... వర్షాభావ పరిస్థితుల కారణంగా 15 కోట్లకు మించలేదు. దీంతో ఈసారి రికార్డు స్థాయిలో 46 కోట్ల మొక్కలను నాటి వచ్చే యేటికి లక్ష్యాన్ని పెంచాలని నిర్ణయించారు. ఈసారి నాటే 46 కోట్ల మొక్కల్లో 36.81 కోట్ల మొక్కలు నీడనిచ్చే మర్రి, రావి, వేప వంటివి కాగా... టేకు, మద్ది వంటి లాభదాయకమైన చెట్లు 8.5 కోట్లు సిద్ధం చేశారు. మరో కోటి వరకు పండ్ల మొక్కలను, చెరువు కట్టలపై పెంచేందుకు కోటి ఈత మొక్కలు, పూల మొక్కలను సిద్ధం చేశారు. రెండుగంటల్లో లక్షన్నర మొక్కలు సీఎం కేసీఆర్ నల్లగొండ జిల్లాలో హరితహారాన్ని ప్రారంభించే సమయంలోనే.. హైదరాబాద్-విజయవాడ హైవేపై 163 కిలోమీటర్ల మేర 2 గంటల్లో లక్షన్నర మొక్కలు నాటేందుకు ప్రభుత్వ శాఖలు ప్రణాళిక తయా రు చేసుకున్నాయి. రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్ నుంచి సరిహద్దు అయిన నల్లగొండ జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం వరకు రోడ్డుకు ఇరువైపులా లక్షన్నరకు పైగా మొక్కలు నాటనున్నారు. ఈ మొత్తం దూరాన్ని 14 సెగ్మెంట్లుగా విభజించి ప్రతి సెగ్మెంటుకు ఒక అధికారిని ఇన్చార్జిగా నియమించారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర సరిహద్దు వరకు ఈ రహదారిపై 6 అసెంబ్లీ నియోజకవర్గాలు, 10మండలాలు, 50 గ్రామా ల పరిధి ఉంది. ఒకేసారి లక్ష మంది 163 కిలోమీటర్ల మేర మొక్కలు నాటడం రికార్డుగా నిలుస్తుందని సీఎం కార్యాలయం పేర్కొంది. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ పరిధిలో.. కాంక్రీట్ అడవిగా మారిన హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఐదేళ్లలో హెచ్ఎండీఏ పరిధిలో 7 కోట్ల చెట్లు, జీహెచ్ఎంసీ పరిధిలో 3 కోట్ల చెట్లు పెంచే లక్ష్యంలో భాగంగా ఈనెల 11న ఒక్కరోజే 25 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. -
కాలువలోకి దూసుకెళ్లిన కారు
దుగ్గిరాల(గుంటూరు): నిద్రమత్తులో కారు నడపటంతో అదుపుతప్పి ప్రమాదవశాత్తు కాలువలోకి దూసుకొని పోయింది. ఈ సంఘటన గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలో తెనాలి-విజయవాడ రహదారిపై గురువారం తెల్లవారుజామున జరిగింది. ఆ కారులో డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు ప్రయాణికులున్నారు. అయితే ఎవరికి ఎలాంటి గాయలు కాలేదు.