సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి సంక్రాంతి కోసం సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. హయత్ నగర్ నుంచి కొత్తగూడెం వరకు భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. టోల్‌గేట్ల దగ్గర వాహనాలు బారులు తీరాయి. శుక్రవారం నుంచి పండగ సెలవులు కావడంతో ప్రజలు నగరం నుంచి పల్లెబాట పట్టారు.
నగరవాసులంతా సొంత ప్రాంతాలకు క్యూ కట్టడంతో హైదరాబాద్ నగరం అంతా ఖాళీ అవుతుంది. లక్షలాది కుటుంబాలు సంక్రాంతి పండుగకు తమ స్వంత ఊర్లకు పయనమయ్యారు. ముఖ్యంగా ఏపీ వైపు వెళ్లే వాహనాలతో హైవేపై రద్దీ కనిపిస్తోంది. రద్దీ నియంత్రణకు పోలీసులు చర్యలు చేపట్టారు.
టోల్ ప్లాజాలు దాటేందుకు సుమారు 15 నిమిషాలకుపైనే టైం పడుతోంది. హైదరాబాద్‌కు సమీపంలోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా నిలిచిపోయాయి. రద్దీ దృష్ట్యా అధికారులు అదనంగా 10 గేట్లను తెరిచారు. రానున్న రెండు రోజుల్లో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. రద్దీని తగ్గించేందుకు హైదరాబాద్ నుంచి రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు, బస్సులు నడుపుతున్నారు.
ఇదీ చదవండి: ధాన్యం రైతులకు సీఎం జగన్ సంక్రాంతి కానుక
Comments
Please login to add a commentAdd a comment