heavy traffic
-
పల్లెకు చలో.. రద్దీగా రహదారులు..
-
Sankranthi Effect : సొంతూళ్లకు క్యూ కట్టిన హైదరాబాదీలు.. హైదరాబాద్-విజయవాడ హైవేపై ఫుల్ రష్ (ఫొటోలు)
-
సంక్రాంతి ఎఫెక్ట్: విజయవాడ హైవేపై కదలని వాహనాలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి సంక్రాంతి కోసం సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. హయత్ నగర్ నుంచి కొత్తగూడెం వరకు భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. టోల్గేట్ల దగ్గర వాహనాలు బారులు తీరాయి. శుక్రవారం నుంచి పండగ సెలవులు కావడంతో ప్రజలు నగరం నుంచి పల్లెబాట పట్టారు. నగరవాసులంతా సొంత ప్రాంతాలకు క్యూ కట్టడంతో హైదరాబాద్ నగరం అంతా ఖాళీ అవుతుంది. లక్షలాది కుటుంబాలు సంక్రాంతి పండుగకు తమ స్వంత ఊర్లకు పయనమయ్యారు. ముఖ్యంగా ఏపీ వైపు వెళ్లే వాహనాలతో హైవేపై రద్దీ కనిపిస్తోంది. రద్దీ నియంత్రణకు పోలీసులు చర్యలు చేపట్టారు. టోల్ ప్లాజాలు దాటేందుకు సుమారు 15 నిమిషాలకుపైనే టైం పడుతోంది. హైదరాబాద్‌కు సమీపంలోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా నిలిచిపోయాయి. రద్దీ దృష్ట్యా అధికారులు అదనంగా 10 గేట్లను తెరిచారు. రానున్న రెండు రోజుల్లో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. రద్దీని తగ్గించేందుకు హైదరాబాద్ నుంచి రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు, బస్సులు నడుపుతున్నారు. ఇదీ చదవండి: ధాన్యం రైతులకు సీఎం జగన్ సంక్రాంతి కానుక -
గుర్గావ్ : ఇంత ట్రాఫిక్‌లో ఇరుక్కుంటే ఇంటికెప్పుడు వెళ్తారు?
-
Hyderabad Rains Traffic Photos: విశ్వ నగరంలో ట్రాఫిక్‌లో పడిగాపులు (ఫొటోలు)
-
హైదరాబాద్‌లో ఏకధాటిగా కురుస్తున్న వర్షం.. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జాం
-
వానొస్తే జనం గుండెల్లో గుబుల్.. హైదరాబాద్‌లో క్యాబ్ ధరలు డబుల్!
ఇన్నాళ్లకు గుర్తొచ్చాన వాన! ఎన్నాళ్లని దాక్కుంటావే పైనా! వర్షం సినిమాలో పాట మాదిరి వానపడినపుడు హాయిగా అనిపిస్తుంది. ఇది చాలా ప్రాంతాల్లోని జనం మనసుల్లో గిలిగింతలుగొలిపే సన్నివేశం. కానీ, హైదరాబాదీలకు మాత్రం బాధలు పంచే సందర్భం. ఎలాగంటే, జీహెచ్ఎంసీ అధికారులు ఓవైపు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం, వరద నియంత్రణకు చర్యలు చేపట్టాం అని చెప్తుంటారు. అయితే, క్షేత్ర స్థాయిలో మాత్రం అవేవీ పెద్దగా కనిపించవు. చిన్నపాటి వర్షానికే భాగ్యనగరంలో రోడ్లు చెరువుల్ని తలపిస్తాయి. ఇక వాహనదారుల కష్టాలు మామూలే. మామూలుగానే మన నగరంలో ట్రాఫిక్ ఎక్కువ. వాన పడిందా రచ్చ రచ్చే! ఎడతెరిపి లేకుండా వాన పడిందా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్‌లు తప్పవు. భారీ ట్రాఫిక్ జామ్‌తో ప్రయాణికుల అవస్థలు చెప్పనలవి కాదు. (చదవండి: వాన అప్పుడే అయిపోలేదు.. మరో ఐదు రోజులు దంచికొట్టుడే!) అటు ఆకాశానికి, ఇటు జేబుకు చిల్లు! నగరంలో జోరు వాన. అరే! వానలో తడుస్తూ బైక్‌పై ఎలా? క్యాబ్‌లో వెళ్దామనే ఆలోచనే చేసే పరిస్థితిలో సామాన్య జనం లేరు. ఎందుకంటే ఇదే అవకాశంగా క్యాబ్ యజమానులు అమాంతం చార్జీలు పెంచేశారు. సాధారణ రోజుల కంటే వర్షాల కారణంగా క్యాబ్ డ్రైవర్లు రెండింతలు, మూడింతల సొమ్ము వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంజాగుట్ట, అమీర్‌పేట, ఖైరతాబాద్, బేగంపేట ప్రాంతాల నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లాలంటే మామూలు రోజుల్లో రూ.700 నుంచి రూ.800 చార్జీ ఉంటుంది. ఈ వర్షాల కారణంగా ధరలు డబుల్ అయ్యాయి. పోనీ ధర తగ్గించమని బేరాలు ఆడితే క్యాబ్ డ్రైవర్లు వెంటనే రైడ్‌ను క్యాన్సిల్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో క్యాబ్ సర్వీసుల పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో చెప్తూ అనుజ్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో చేసిన పోస్టు వైరల్‌గా మారింది. @AnujGurwara అనే ట్విటర్ యూజర్ వర్షం పడటంతో చార్జీలను ఎలా పెంచేశారో తన స్వీయ అనుభవాన్ని షేర్ చేశాడు. ఈక్రమంలోనే పలువురు నెటిజన్లు కూడా అధిక చార్జీల బాధలు చెప్పుకున్నారు. ఇదిలాఉండగా.. భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ విభాగం హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. (చదవండి: హైదరాబాద్ ప్రజలకు అలర్ట్: ఏకధాటిగా వర్షం.. జీహెచ్ఎంసీ హెచ్చరికలు ఇవే..) This is the @Olacabs fare from Begumpet to the airport at 7.30pm today. Normal fare 700-800rs. Two @Uber_India drivers cancelled on me after asking for the fare being displayed on the app. The #Hyderabad cab situation continues to be terrible. pic.twitter.com/tFaB6ln96e — Anuj Gurwara (@AnujGurwara) July 19, 2023 #Hyderabad #City #Traffic #RealEstate #KishanReddy @kishanreddybjp pic.twitter.com/6c54vSdXOa — Guru Kotha (@Newguru_Kotha) July 20, 2023 Heavy rains in Hyderabad. #HyderabadRains pic.twitter.com/t4wYsc2VS8 — Kiran Kumar (@chkirankumar) July 20, 2023 Funds have been allocated by GHMC to construct a Dam near secretariat.. 🤣🤣#HyderabadRains https://t.co/bYzwhur0cd — Chinnu Rao.. #ProudHindu 🇮🇳 (@bubblebuster26) July 20, 2023 -
E-Car Racing: ఓరి నాయనో ఇదేంటి! వాహనాలు రేసింగ్ ట్రాక్‌పైకి ఎలా వచ్చాయ్?
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా ఈ- రేసింగ్ వద్ద గందరగోళం నెలకొంది. రేసింగ్ ట్రాక్‌పైకి ఒక్కసారిగా ప్రైవేట్ వాహనాలు దూసుకురావడంతో ప్రాక్టీస్ రేస్ అరగంట ఆలస్యంగా ప్రారంభమైంది. ఫార్ములా-ఈరేస్ కారణంగా తెలుగుతల్లి ఫైఓవర్ చుట్టుపక్కల భారీగా ట్రాఫిక్ స్తంభించింది. గంగలు గంటలు ట్రాఫిక్ ఆగిపోవడంతో వాహనదారులు అసహనంతో ట్రాక్‌పైకి వచ్చారు. దీంతో ట్రాక్‌పైకి వాహనాలు ఎలా వచ్చాయని నిర్వాహకులు షాక్‌కు గురయ్యారు. ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు.. మరోవైపు ఈ-ఫార్ములా రేసుతో హైదరాబాద్ వాహనదారులకు ట్రాఫిక్ ఇక్కట్లు ఎదురవుతున్నాయి. రేస్ కారణంగా తెలుగుతల్లి ఫ్లైఓవర్, లక్డీకాపూల్, అసెంబ్లీ, ఖైరతాబాద్‌లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. రేసింగ్ ఆంక్షలు, ట్రాఫిక్ మళ్లింపుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రేసులు ముఖ్యమా? తాము ముఖ్యమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం మరోవైపు ఫార్ములా ఈ రేసింగ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. మలుపు వద్ద కారు గోడను ఢీకొట్టింది. క్రేన్ సాయంతో ట్రాక్‌పై నుంచి కారును తొలగించారు. -
హైదరాబాద్ ప్రజలకు ముఖ్యగమనిక
సాక్షి, హైదరాబాద్: నగర ప్రజలకు కీలక సూచన చేశారు ట్రాఫిక్ పోలీసులు. నగరంతో పాటు రాష్ట్రంలో పలు చోట్ల ఇవాళ ఉదయం నుంచి వాన దంచికొడుతోంది. ఆగి ఆగి కొడుతున్న వానతో జనం ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఇయ్యాల(శుక్రవారం), రేపు(శనివారం) భారీ వర్షాలు ఉంటాయని చెప్పింది వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరుతోంది జీహెచ్ఎంసీ. అలాగే వర్షం తెరిపి ఇవ్వగానే ఆగమాగం బయటకు రావొద్దని ప్రజలకు సూచించారు ట్రాఫిక్ పోలీస్ విభాగం. కొద్ది సమయం తర్వాతే బయటకు రావాలని.. అప్పుడే ట్రాఫిక్ సమస్యల నుంచి బయటపడొచ్చని తెలిపారు. భారీ వర్షాలతో నగరం రోడ్లపైకి నీరు చేరే అవకాశం ఉంది. ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవచ్చు కూడా. అందుకే నిమ్మలంగా బయటకు రావాలని ప్రజలకు సూచిస్తున్నారు అధికారులు. అలాగే.. విద్యార్థులు, వ్యాపారాలు చేసుకునేవాళ్లు, ఉద్యోగస్తులు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మరోవైపు రాష్ట్రంలో పలు జిల్లాలోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. Today #HyderabadRains In #Charminar 🌧️🌊 #TelanganaRains #TelanganaRain #HyderabadRain #CharminarRain #TelanganaFloods #HyderabadFloods pic.twitter.com/rPvUvoJTZl — SYED SARWAR (@sab_kee_jaan) July 22, 2022 #Telangana Rainfall Forecast:22JULY 👉 Due to U.A.C over Odisha, Entire Telangana will See Widespread Rains.(Some Heavy/Very Heavy Over East & South Telangana Districts)#HyderabadRains:100% 👉Heavy Rains expected During Afternoon -Early Morning. pic.twitter.com/2C2tjrvgyq — Hyderabad Rains (@Hyderabadrains) July 22, 2022 -
హైదరాబాద్: అక్కడ ట్రాఫిక్ జామ్.. ఇలా వెళ్లండి
బంజారాహిల్స్‌కు చెందిన ఓ వాహనదారు అబిడ్స్ వెళ్లడానికి బయలుదేరారు. లక్డీకాపూల్‌లోని రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద హఠాత్తుగా నిరసనకారులు రోడ్డు దిగ్బధించడంతో ట్రాఫిక్ జామ్ అయింది. ఈ విషయం ఆయనకు నిరంకారి దాటే వరకు తెలియలేదు. దీంతో ప్రత్యామ్నాయం ఎంచుకోలేక ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు సాక్షి, హైదరాబాద్: నగరంలో అనేక మంది వాహనచోదకుల పరిస్థితి ఇలాగే ఉంటోంది. ప్రధానంగా పీక్ అవర్స్‌లో కార్యాలయాలకు వెళ్లడానికి, అత్యవసరమైన పనులపై బయటకు వస్తున్న వాళ్లు హఠాత్తుగా తలెత్తే అవాంతరాలతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న నగర ట్రాఫిక్ విభాగం అధికారులు ఇలాంటి హఠాత్పరిణామాలపై వాహన చోదకులను అప్రమత్తం చేయాలని నిర్ణయించారు. ఆ మళ్లింపులపై భారీ కసరత్తు... నగరంలో రహదారి, డ్రైనేజీ, ఫ్లైఓవర్.. ఇలా ఏదో ఒక నిర్మాణం, మరమ్మతులు జరుగుతూనే ఉంటాయి. ఆయా సందర్భాల్లో ఆ దారిలో వెళ్లాల్సిన వాహనాలను నిర్ణీత కాలం వరకు మళ్లిస్తుంటారు. దీనికోసం ట్రాఫిక్ పోలీసులు పెద్ద ఎత్తున కసరత్తు చేసి ప్రత్యామ్నాయ మార్గాలు గుర్తించడంతో పాటు అవసరమైతే మరమ్మతులు చేయిస్తారు. ఈ మళ్లింపులపై మీడియా, సోషల్ మీడియాలో ప్రకటనలు ఇవ్వడంతో పాటు ఆయా మార్గాల్లో ఫెక్సీలు సైతం ఏర్పాటు చేస్తారు. వాహనచోదకులు అడ్డంకులు ఉన్న మార్గంలో వెళ్లి ఇబ్బందులు ఎదుర్కోకూడదన్నదే వీటి వెనుక ఉన్న ఉద్దేశం. హఠాత్తుగా వస్తే ఆగిపోవాల్సిందే... నగరం రాష్ట్ర రాజధాని కూడా కావడంతో అనేక శాఖలు, సంస్థల ప్రధాన కార్యాలయాలు ఇక్కడే ఉంటాయి. ఎక్కడి వాళ్లు నిరసనలు తెలపాలన్నా తమ ‘గొంతు అందరికీ వినిపించాలనే’ ఉద్దేశంతో దానికి ఇక్కడి కార్యాలయాలు, ప్రాంతాలనే ఎంచుకుంటారు. నిరసనల్లో కొన్ని అనుమతులు తీసుకుని జరిగితే, మరికొన్ని హఠాత్తుగా తెరపైకి వస్తాయి. మొదటి కేటగిరీకి చెందిన వాటితో ఇబ్బంది లేకున్నా రెండో రకమైన వాటి వల్ల తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు వస్తుంటాయి. భారీ ప్రమాదం లాంటివి జరిగినా పరిస్థితి ఇలానే ఉంటుంది. చదవండి: కలెక్టర్ అవుదామని కలలు కని.. రియల్ ఎస్టేట్‌ను నమ్ముకుని.. సర్వీస్ ప్రొవైడర్ల సహకారంతో.. ఈ తరహా ట్రాఫిక్ జామ్స్‌పై ఆయా మార్గాల్లో వచ్చే వాహనచోదకులను నిర్ణీత ప్రాంతాలకు చేరుకోవడానికి ముందే అప్రమత్తం చేయాలని ట్రాఫిక్ విభాగం అధికారులు నిర్ణయించారు. దీనికోసం సెల్‌ఫోన్ సేవలు అందిస్తున్న సర్వీస్ ప్రొవైడర్ల సహాయం తీసుకోవాలని యోచిస్తున్నారు. నగరంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న, ఆయా మార్గాల్లో ప్రయాణిస్తున్న వాహనచోదకుల ఫోన్ నెంబర్ల డేటా సర్వీస్ ప్రొవైడర్ల వద్ద ఉంటుంది. ఈ సర్వీస్ ప్రొవైడర్లు ఓ ప్రాంతం పిన్‌కోడ్ నెంబర్ ఆధారంగా అక్కడ రిజిస్టర్ అయి ఉన్న, యాక్టివేషన్లో ఉన్న ఫోన్ నంబర్లను గుర్తించగలుగుతారు. దీని ఆధారంగా ఆ ప్రాంతంలో సెల్ఫోన్లను గుర్తిచడం ద్వారా వారికి ట్రాఫిక్ జామ్‌పై సమాచారం ఇప్పించడానికి ట్రాఫిక్ విభాగం అధికారులు కసరత్తు చేస్తోంది. ఏ రూపంలో అనే అంశంపై సమాలోచన... ట్రాఫిక్ జామ్‌లకు సంబంధించిన సమాచారాన్ని ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఉండే సిబ్బంది ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు. వీరి ద్వారా ఈ వివరాలు ఆయా సర్వీస్ ప్రొవైడర్లకు చేరతాయి. ఈ సమాచారాన్ని వాహన చోదకుడి ఏ రూపంలో పంపాలనే దానిపై అధికారులు సమాలోచన చేస్తున్నారు. సంక్షిప్త సందేశం, ఆడియో క్లిప్, ఐవీఆర్ఎస్ తరహా కాల్... తదితర మార్గాలను పరిశీలిస్తున్నారు. నగరంలోని అనేక కూడళ్లల్లో ఉన్న సైనేజ్ బోర్డుల ద్వారానూ ఈ అడ్డంకుల సమాచారాన్ని వాహనచోదకులకు తెలియజేయనున్నారు. ట్రాఫిక్ జామ్ ఉన్న ప్రాంతానికి దారి తీసే మార్గాల్లోనే ఈ సందేశం కనిపించేలా ఏర్పాటు చేయనున్నారు. బంజారాహిల్స్‌లో స్తంభించిన ట్రాఫిక్ బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని అగ్రసేన్ చౌరస్తాలో నీటి పైప్‌లైన్‌కు లీకేజీలు రావడంతో గత నాలుగు రోజుల నుంచి తవ్వకాలు చేపట్టి కొత్త పైపులు ఏర్పాటు చేస్తున్నారు. ఇరుకైన చౌరస్తాలో తవ్వకాలతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బంజారాహిల్స్ రోడ్ నెం.12 వైపు, తెలంగాణ భవన్ రోడ్డులో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. స్కూల్ బస్సులన్నీ ట్రాఫిక్‌లో గంటల తరబడిగా చిక్కుకుపోయాయి. -
ఉరుబాట పట్టిన సీటీ జనం
-
రోడ్లపై వాహన వరద!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రహదారులపై వాహన వరద పారుతోంది.. రోడ్లపై హారన్ సౌండ్ చేయనిదే బండ్లు ముందుకు నడిచే పరిస్థితి కనిపించటం లేదు.. 7 నెలల్లో కొత్తగా 4.39 లక్షల ద్విచక్ర వాహనాలు, 89 వేల కార్లు.. ఇటు సెకండ్ హ్యాండ్‌వి 2.52 లక్షల వాహనాలు.. వీటికి తోడు అప్పటికే ఇళ్లలో ఉన్న సొంత వాహనాలు.. మొత్తం అన్నీ రోడ్లపైకి పోటెత్తాయి.. దీంతో ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్‌లు, కి.మీ.ల కొద్దీ వాహనాల బారులే దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా జంట నగరాలు లాక్‌డౌన్‌కు ముందుకంటే ఎక్కువ ట్రాఫిక్ సమస్యతో ఇప్పుడు సతమతమవుతున్నాయి. 10 కి.మీ. ప్రయాణానికే పీక్ అవర్స్‌లో గంటన్నర సమయం పడుతోంది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ తెచ్చిన మార్పులెన్నో.. ఈ వాహన వరద కూడా దాని ప్రభావమే..! వ్యక్తిగత వాహనాలు సురక్షితమని.. కోవిడ్ అనగానే భౌతిక దూరం ముందుగా గుర్తుకొస్తుంది. బహిరంగ ప్రదేశాల్లో మనిషికి మనిషికి మధ్య దూరం లాక్డౌన్ సమయంలో మరింత ఎక్కువగా ఉండేది. అప్పట్లో కోవిడ్ అంటే కనిపించిన భయం అంతా ఇంతా కాదు. దీంతో భౌతిక దూరం పాటించే ఉద్దేశంతో ప్రయాణాల్లో వ్యక్తిగత వాహనాల వినియోగంపై జనం దృష్టి సారించారు. అలా వాటి వరద మొదలైంది. ఆ తర్వాత క్రమంగా కోవిడ్ భయం మటుమాయమైంది. ప్రస్తుతం మాస్క్ వాడేవాళ్ల సంఖ్య కూడా తక్కువైపోతోంది. ఇక వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రావటంతో జనంలో ఆ మహమ్మారి భయం దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. బజార్లలో భౌతిక దూరం ఊసే లేదు. పెళ్లిళ్లు, పేరంటాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. మరి భయం పూర్తిగా మటుమాయమైనా.. భౌతికదూరం కోసం వ్యక్తిగత వాహనాల వినియోగానికి అలవాటు పడ్డ జనం మాత్రం వెనక్కు రావటం లేదు. లాక్డౌన్లో మొదలైన వ్యక్తిగత వాహన వినియోగం ఇంకా కొనసాగటమే కాదు, మరింతగా పెరుగుతోంది. బస్సెక్కేందుకు ససేమిరా.. లాక్డౌన్ సమయంలో 2 నెలల పాటు బస్సులు తిరగలేదు. ఆ తర్వాత అవి క్రమంగా రోడ్డెక్కాయి. కానీ జనం మాత్రం బస్కెక్కేందుకు ససేమిరా అంటున్నారు. 2 నెలల క్రితం వరకు కూడా 50 శాతం లోపే ఉన్న ఆక్యుపెన్సీ రేషియో అతికష్టమ్మీద 65కు చేరుకుంది. ఎప్పుడూ ఫుట్‌బోర్డుపై జనం వేళ్లాడుతుండటంతో ఓ పక్కకు ఒరిగినట్టుగా పరుగుపెట్టే సిటీ బస్సులు.. ఇప్పుడు సగం సీట్లు ఖాళీగానే ఉండి నీరసంగా నడుస్తున్నాయి. ఇటు జనం దెబ్బకు ఏసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దూరపట్టణాలకు తిరిగే ఏసీ బస్సుల్లో కూడా ఆక్యుపెన్సీ రేషియో 50 శాతానికి కూడా చేరుకోలేదు. ఇందులో కొంత కోవిడ్ భయమున్నా.. సొంత వాహనాలకు అలవాటు పడటమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఆ రెండు నెలలే డల్.. లాక్డౌన్ వల్ల ఉపాధికి ఇబ్బందైందని, ఆదాయం బాగా తగ్గిందని చెప్పేవాళ్లే ఎక్కువ.. అలాంటప్పుడు వాహనాల విక్రయాలు బాగా పడిపోవాలి. కానీ అలా జరగలేదు. లాక్డౌన్లో 2 నెలలు మినహా మిగతా నెలల్లో వాహనాలు మామూలుగానే అమ్ముడయ్యాయి. గత రెండు నెలల గణాంకాలు పరిశీలిస్తే.. గతేడాది అదే నెలల కంటే ఎక్కువగా అమ్ముడవటం విశేషం. గత 7 నెలల్లో రాష్ట్రంలో 4.40 ద్విచక్రవాహనాలు అమ్ముడయ్యాయి. ఏడాది ముందు ఇదే సమయంలో 4.68 లక్షలు విక్రయమయ్యాయి. తేడా స్వల్పమే. ఇక.. 2019 నవంబర్‌లో రాష్ట్రంలో 72 వేల ద్విచక్రవాహనాలు అమ్ముడైతే గత నవంబర్‌లో అది 75 వేలుగా ఉంది. 2019 డిసెంబర్లో 52 వేలు అమ్ముడైతే గతేడాది డిసెంబర్లో 53 వేలు అమ్ముడయ్యాయి. ఇక గత 7 నెలల్లో రాష్ట్రంలో 89,345 కార్లు అమ్ముడయ్యాయి. 2019లో ఈ సంఖ్య 89,837గా ఉంది. 2019 నవంబర్‌లో 12,045 కార్లు అమ్మితే గత నవంబర్‌లో 13,852 అమ్ముడయ్యాయి. 2019 డిసెంబర్లో 17,135 అమ్మితే, గత డిసెంబర్లో 17,506 విక్రయమయ్యాయి. లాక్డౌన్ ప్రభావం తగ్గి ఆర్థికంగా పుంజుకుంటుండటంతో సొంత వాహనాలు కొనుగోలు గతం కంటే పెరుగుతోందని అర్థమవుతోంది. పెరిగిన సెకండ్ హ్యాండ్ వాహనాల విక్రయం.. కొత్త వాహనాలు అంతకుముందు సంవత్సరంలాగే అమ్ముడవుతుండగా, సెకండ్‌హ్యాండ్ వాహనాలు మాత్రం గతంతో పోలిస్తే బాగా పెరిగాయి. 2019లో జూలై నుంచి డిసెంబర్ వరకు 1.10 లక్షల ద్విచక్రవాహనాలు చేతులు మారగా, 2020లో అదే సమయంలో ఏకంగా 1,51,877 అమ్ముడయ్యాయి. అదే కార్ల విషయంలో ఆ సంఖ్య 77 వేలు కాగా, గతేడాది 99,807గా ఉండటం విశేషం. లాక్డౌన్ వల్ల ఏర్పడ్డ ఆర్థిక ఇబ్బందులతో కొత్త వాహనాలు కొనలేని వారు ఎక్కువగా సెకండ్ హ్యాండ్ వాహనాలను కొనేందుకు మొగ్గుచూపారు. అయితే వర్క్ ఫ్రం హోమ్ అమలులో ఉండటం, విద్యాసంస్థలు ఇంకా ప్రారంభం కాకపోవటం వల్ల వాహనాల రద్దీ తక్కువగా ఉండాలి. కానీ అంతకుముందు కంటే పెరగటం గమనార్హం.. ఆర్టీసీ అధ్యయనంలో ఇలా.. నగరంలో సిటీ బస్సులు తిరిగే మార్గాల్లో కొన్నింటిలో బస్సులు నిరంతరం రద్దీగా ఉంటాయి. జియాగూడ, ఎల్బీనగర్, రామంతాపూర్, పటాన్చెరు.. తదితర రూట్లు బాగా బిజీగా ఉంటాయి. నగర రోడ్లపై రద్దీ విపరీతంగా ఉన్న ప్రస్తుత తరుణంలో ఈ రూట్లలో తిరిగే సిటీ బస్సులు పూర్తిగా వెలవెలబోతున్నాయి. దీనిపై తాజాగా ఆర్టీసీ అధికారులు ఓ పరిశీలన జరిపారు. గతంతో పోలిస్తే ఈ మార్గాల్లో బస్సులకు ద్విచక్ర వాహనాలు, కార్లు ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాయని డ్రైవర్లు గుర్తించారు. అంటే వాటి సంఖ్య బాగా పెరిగిందన్నది వారి మాట. అదే సమయంలో ఆక్యుపెన్సీ రేషియో సగానికి తక్కువగా ఉంది. రోడ్లపై వాహనాలు పెరిగాయి, బస్సుల్లో జనం తగ్గారు. వెరసి నగర రోడ్లపై వ్యక్తిగత వాహనాలు బాగా పెరిగాయని ఆర్టీసీ గుర్తించింది. సిటీ బస్సులు మొదలై ఇన్ని నెలలైనా ఆక్యుపెన్సీ రేషియో పెరగకపోవటానికి ఇదే కారణమని వారు ఉన్నతాధికారులకు ఓ రిపోర్టు సమర్పించారు. ఢిల్లీ తరహా ముప్పు వాటిల్లుతుంది.. ‘కొన్ని రోజులుగా రోడ్లపై వాహనాల సంఖ్య బాగా పెరిగింది. కోవిడ్ భయంతో ఇలా జనం తాత్కాలికంగా సొంత వాహనాలు వాడుతున్నారని సరిపెట్టుకుంటే మాత్రం ఇది పెద్ద ప్రమాదంగా మారుతుంది. ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టాలి. లేకుంటే ఢిల్లీ తరహా సమస్య మనల్ని చుట్టుముడుతుంది. ఒకసారి జనం సొంత వాహనమే మేలన్న అభిప్రాయంలోకి వస్తే ప్రజారవాణావైపు మళ్లటం కష్టమవుతుంది. కోవిడ్ భయం పోగానే ప్రజా రవాణా కిక్కిరిసిపోయేలా చేయాలి. లేకుంటే భూమి నుంచి ఎత్తుకుపోయే కొద్ది చల్లబడాల్సిన వాతావరణం వేడిగా మారుతుంది. పదో అంతస్తువారు కూడా నేలపై ఉన్న వేడినే అనుభూతి పొందుతారు. అది కాలుష్యం వాతావరణంలో పొరలా మారటంతో ఏర్పడే సమస్య. అది ఏర్పడిందంటే జనం ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితి వచ్చిందని అర్థం చేసుకోవాలి. అక్కడి దాకా సమస్యను రానీయకూడదు’ – జీవానందరెడ్డి, పర్యావరణ వేత్త రోజుకు 200 కి.మీ. బండిపైనే.. మా గ్రామం నుంచి హైదరాబాద్ 90 కి.మీ. దూరంలో ఉంటుంది. నేను ఆర్గానిక్ ఫుడ్‌కు సంబంధించి ఓ సంస్థ మార్కెటింగ్ విభాగంలో పనిచేస్తున్నాను. రోజూ బైక్‌పై వచ్చి వెళ్తున్నాను. అంతకుముందు బస్సుల్లో వచ్చే వాడిని లాక్‌డౌన్‌నుంచి బైక్‌పైనే వస్తున్నా.. – ఐలి గణేశ్‌కుమార్, రసూలాబాద్, సిద్దిపేట జిల్లా నెల ద్విచక్ర వాహనాలు కార్లు 2019 2020 2019 2020 జూన్ 67,869 67,562 11,652 8,364 జూలై 64,338 55,783 9,772 9,326 ఆగస్టు 60,557 56,290 11,104 10,575 సెప్టెంబర్ 47,042 53,303 9,314 11,322 అక్టోబర్ 1,03,430 77,273 18,815 18,400 నవంబర్ 72,464 75,673 12,045 13,852 డిసెంబర్ 52,385 53,304 17,135 17,506 మొత్తం 4,68,085 4,39,188 89,837 89,345 -
సికింద్రాబాద్ టు పంజాగుట్ట భారీ ట్రాఫిక్ జామ్!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వడంతో నగరవాసులు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివస్తుండటంతో వారిని కట్టడి చేసేందుకు పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. దీంతో ప్రగతి భవన్‌కు దారితీసే ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. ముఖ్యంగా సికింద్రాబాద్ నుంచి పంజాగుట్ట వెళ్లే దారిలో ప్యారడైజ్‌నుంచి బేగంపేట వరకు ప్రస్తుతం వాహనాలు కదల్లేని పరిస్థితి నెలకొంది. సికింద్రాబాద్ నుంచి పంజాగుట్ట వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో వాహనదారులకు అవస్థలు తప్పడం లేదు. ఈ మార్గం మీదుగా ప్రగతి భవన్‌కు రాకుండా కాంగ్రెస్ శ్రేణులను నిలువరించేందుకు పోలీసులు బేగంపేటలో మోహరించారు. ఇక్కడ ఆందోళనకారులు కనిపించిన వెంటనే అదుపులోకి తీసుకొని వివిధ పోలీసు స్టేషన్లకు తరలిస్తున్నారు. దీంతో సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి ప్రగతి భవన్ వరకు ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది. వాహనదారులకు రోడ్డుమీద తీవ్ర పడిగాపులు తప్పడం లేదు. మరోవైపు ఈ మార్గంలోని మెట్రరైల్ స్టేషన్లలోనూ పోలీసులు ఆంక్షలు విధించారు. నిరసనకారులు మెట్ర రైళ్లలో ప్రగతి భవన్‌కు చేరుకోకుండా ఎక్కడికక్కడ బలగాలను మోహరించారు. ఇక, సోమవారం నుంచి స్కూళ్లు పునఃప్రారంభం కావడంతో నగరంలో రద్దీ భారీగా పెరిగింది. నగరంలోని పలుచోట్ల ట్రాఫిక్ నిదానంగా కదులుతోంది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం ప్రయాణికులు, స్కూలు విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా పలు ప్రత్యామ్యాయ చర్యలు తీసుకుంది. నగరంలో చెప్పుకోదగిన స్థాయిలోని ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. అయితే, ఇవి ఏమాత్రం సరిపోని పరిస్థితి కనిపిస్తోంది. ఆర్టీసీ బస్సులు తగినంత అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు పెద్దసంఖ్యలో సెట్విన్ బస్సులపై ఆధారపడుతున్నారు. దీంతో సెట్విన్లు చోటులేనంతగా. కిక్కిరిసిపోతున్నాయి. పలుచోట్ల సెట్విన్‌బస్సుల్లో మహిళలు సైతం ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. -
ఉత్తరాఖాండ్‌లో ట్రాఫిక్ ఇక్కట్లు
డెహ్రాడూన్: దేశంలో అధికంగా హిల్ స్టేషన్లు ఉండి వేసవి కాలంలో నిత్యం సందర్శకులతో కళకళలాడే సందర్శన ప్రాంతాలను కలిగి ఉన్న రాష్ట్రం ఉత్తరఖండ్. భారీ సంఖ్యలో వస్తున్న సందర్శకులతో రోడ్లు కిక్కిరిసిపోతూ గంటల తరబడి ట్రాఫిక్ స్తంభిస్తోంది. దీంతో హరిద్వార్ నుంచి చార్ధామ్ వెళ్లాలంటే సమయం రెండితలు అవుతోంది. బద్రీనాథ్ నుంచి హరిద్వార్ చేరుకోవాలంటే సుమారు 18 గంటల సమయం పడుతోందని ట్రాఫిక్ నియంత్రణ అధికారి తెలిపారు. 80 వేల పైగా మంది తమ వాహనాలలో ఈ రోడ్ల మీద ప్రయాణిస్తున్నారని హరిద్వార్ ఎస్ఎస్పీ జన్మేజయ్ కందూరి తెలిపారు. అదనపు అధికార బలగాలు ట్రాఫిక్ని తగ్గించే చర్యలు తీసుకున్నా భారీ సంఖ్యలో సందర్శకుల ప్రయాణించడం వల్ల నాలుగైదు గంటల పాటు ట్రాఫిక్ జామ్ అవుతోంది. రిషికేశ్, ముస్సోరి, డెహ్రాడూన్, రుద్రప్రయాగ్, గంగోత్రి, యమునోత్రి, నైనిటాల్ ప్రాంతాల్లో కూడా యాత్రికులు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రిషీకేశ్ రోడ్లను విస్తరించే క్రమంలో వెలువడ్డ శిథిలాలు వల్ల అధికంగా ట్రాఫిక్ జామ్ అవుతోందని జస్మిత్ బ్లాక్ ప్రముఖ్ ప్రకాశ్ రావత్ తెలిపారు. ఈ పరిస్థితి నుంచి బయపడాలంటే వెంటనే రోడ్ల మీద పేరుకుపోయిన శిథిలాలను తోలగించాలన్నారు. వాహనాల పార్కింగ్ స్థలం లేకపోవడం, చిన్న వాహనాలు ఎక్కువగా రోడ్ల మీదకు రావడం ట్రాఫిక్ స్తంభనకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. -
రోడ్డుపై నోట్ల వరద : జనం పరుగులు
అమెరికాలో అనూహ్యంగా చేతికి చిక్కిన క్యాష్తో కొంతమంది క్రిస్మస్కు ముందే సంబరాలు చేసుకున్నారు. అవును, ఒకపక్క మంచు వర్షం..మరోపక్క నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల వరద కురుస్తోంటే.. ఆహా ఏమి నా భాగ్యమూ అంటూ జనం ఎగబడ్డారు. చేతికి దొరికినంతా దక్కించుకుని చెక్కేసారు. అమెరికాలోని న్యూజెర్సీ హైవేపై ఈ ఘటన జరిగింది. అటు ఈ ఘటనపై ట్విట్టర్లో వీడియోల వర్షం కురిసింది. దీంతో అయ్యో, సమయానికి తాము అక్కడ లేకపోయామే అంటూ మరికొంతమంది నెటిజన్లు వాపోయారు. సాయుధ పహరాతో వెళుతున్న ఏటీఎంలకు నగదు సరఫరా చేసే బ్రింక్స్ వ్యాను తలుపులు ఆకస్మాత్తుగా తెరుచుకోవడంతో ఒక్కసారిగా రోడ్డు మీద కరెన్సీ వరద పారింది. దీంతో జనం ఉరుకులు పరుగులు తీశారు. విపరీతమైన రద్దీలో కూడా కార్లు ఎక్కడపడితే అక్కడ ఆపి మరీ నోట్లవేటలో పడ్డారు. దీంతో భారీ ట్రాఫిక్ జాం ..అంతేకాదు కొన్నివాహనాలు అదుపు తప్పి ఒకదానికి మరొకటి ఢీకొన్నాయి. బ్రింక్స్ వ్యానులో నుంచి రెండు బ్యాగులు కిందపడిపోయి నోట్లు బయటకు వచ్చాయి. ఒక దాంట్లో 3.7 లక్షలు, మరోదాంట్లో 1.4 లక్షలు.. మొత్తం 5.1 లక్షల డాలర్లు ఉన్నట్టు బ్యాంకు అధికారులు చెప్పారు. బ్రింక్స్ సిబ్బంది, దారినపోయేవారు కలిసి ఎట్టకేలకు సుమారు 2 లక్షల డాలర్లు అక్కడికక్కడే సేకరించారు. అలాగే కొంతమంది నిజాయితీపరులు తమకు దొరికిన నగదును పోలీసు స్టేషన్లో అప్పగించారు. అయితే ఇలా అందిన డబ్బు కేవలం 11 వేల డాలర్లేనట. దీంతో మిగిలిన సొమ్ము ఎలా తేవాలిరా బాబూ అని తలలు పట్టుకోవడం అధికారులు వంతు అయిందిట. -
గజిబిజి
- పురంలో భారీగా ట్రాఫిక్ బెడద - బారులు తీరుతున్న వాహనాలు హిందూపురం అర్బన్: పెరుగుతున్న జనాభా.. వెడల్పు లేని రహదారులు.. కిక్కిరిసిన వాహనాల మధ్యనే ప్రజల రాకపోకలు.. రోడ్లపైనే వ్యాపారాలు.. ఇరువైపులా తోపుడుబండ్లు.. ఇలా తరచూ హిందూపురంలో ట్రాఫిక్ బెడద ప్రజలను వేధిస్తోంది. వాహనాల రద్దీతో ప్రజలు అడుగడుగునా ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలో 1.60 లక్షల జనాభా ఉండగా సుమారు 40 లక్షల పైగా ప్రైవేట్ వాహనాలు ఉన్నాయి. దీనికి తోడు ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు, ఇతర భారీ వాహనాల రాకపోకల కారణంగా రహదారులన్నీ గంగరగోళంగా మారుతున్నాయి. ఉదయం కార్యాలయాలు, స్కూల్ వేళల్లో, మ«ధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ప్రధాన రహదారులన్నీ వాహనాలతో నిండిపోతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు ప్రణాళికబద్ధంగా వ్యవహరించినా సమస్య తీరడం లేదు. ఈ ప్రదేశాల్లోనే ట్రాఫిక్ అంబేడ్కర్సర్కిల్, మూడురోడ్ల కూడలి, పరిగి రోడ్డు, సద్భావన సర్కిల్, ఆర్పీజీటీ రోడ్డు, ఆర్టీసీ బస్టాండు, చర్చి రోడ్డు, పాతమార్కెట్ రోడ్డు, ఎన్టీఆర్ సర్కిల్, గాంధీసర్కిల్, ఎంఎఫ్ రోడ్డు, బెంగళూరు రోడ్డు, గురునాథ్ సర్కిల్, ఎస్బీఐ సర్కిల్, డీఎల్ రోడ్డు, మెయిన్‌బజారు, రహమత్‌పురం సర్కిల్ ఏరియాల్లో తరచూ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయి. కారణాలు ఇవే.. - వెడల్పు లేని రహదారులు. పెరిగిన జనాభా. వాహనాల రాకపోకలకు అనుగుణంగా మున్సిపల్ అధికారులు, పాలకులు రోడ్ల విస్తరణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. - రోడ్ల విస్తరణ పేరిట మెయిన్‌బజారు, ఎంఎఫ్ రోడ్డు, సద్భావన సర్కిల్ వద్ద ఇరువైపులా కొంత సిమెంట్ ప్లాట్‌ఫారాలు నిర్మించారు. అయితే వ్యాపారులు, బండ్ల వ్యాపారులకు సౌకర్యంగా మారింది. - రైల్వే రోడ్డు విస్తరణ ప్రతిపాదనలు దశాబ్దాల కాలం నుంచి ప్రణాళికలు వేస్తున్నారు తప్ప ఎలాంటి కార్యచరణకు నోచుకోలేదు. ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం రహదారులకు మహర్దశ పడుతుందని ప్రజలు భావించినా నిరాశే మిగిలింది. సిగ్నల్స్ ఏర్పాటు చేయాలి : శ్రీరాములు, న్యాయవాది పట్టణంలో జనాభాతో పాటు ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. తరచూ ట్రాïఫిక్‌తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్‌తో పాటు ట్రాఫిక్ పోలీసు సిబ్బందిని కూడా పెంచాలి. అదేవిధంగా రహదారులు వెడల్పు చేయాలి. ప్రతిపాదనలు పంపించాం : ఈదూర్‌బాషా, సీఐ, హిందూపురం ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌కు అవసరమైన సిబ్బంది పెంచాలని, సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం. ఉన్న సిబ్బందితో ప్రతిరోజు రహదారుల్లో ట్రాఫిక్ నియంత్రణ చేస్తున్నాం. -
వాహనాలతో నిండిపోయిన రహదారులు
-
ఫ్రాన్స్ ప్రతీకారం!
డోవర్: ఒకదాని వెంటే మరో వాహనం.. 20 కిలోమీటర్లకుపైగా స్తంభించిన ట్రాఫిక్. వేలాది వాహనాల్లో లెక్కకు మించిన జనం.. పైన ఎండ వాత.. లోన ఉక్కపోత.. గంటా రెండు గంటలూ కాదు గడిచిన రెండు రోజులుగా అక్కడ ఇదే పరిస్థితి. ఇప్పుడు స్తంభించిన ట్రాఫిక్ క్లియర్ చేయాలంటేనే ఇంకో రెండు రోజులు పడుతుంది. వాహనాల్లో చిక్కకుపోయిన పిల్లలు, వృద్ధులు, మహిళలదైతే అరిగోస! ప్రభుత్వం తన వంతుగా ప్రయాణికులకు 11వేల నీళ్ల బాటిళ్లను సరఫరా చేస్తోంది. ట్రాఫిక్ క్లియరెన్స్ పై మాత్రం చేతులెత్తేసింది. ఎందుకంటే ఆ పని చేయాల్సింది పొరుగుదేశం కాబట్టి! బ్రిటన్- ఫ్రాన్స్ సరిహద్దులోని డోవర్ పట్టణంలో గడిచిన 50 గంటలుగా ట్రాఫిక్ భారీగా స్తంభించింది. నీస్ ట్రక్కు దాడి తర్వాత అంతర్గత భద్రతను కట్టుదిట్టం చేసిన ఫ్రాన్స్.. అన్ని వైపుల నుంచి వచ్చే వాహనాల తనిఖీలు నిర్వహిస్తోంది. దీంతో బ్రిటన్ నుంచి చానెల్ టన్నెల్ మీదుగా ఫ్రాన్స్ వెళ్లాల్సిన వాహనాలన్నీ ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ఒక్కో వాహనం తనిఖీకి 40 నిమిషాలు పడుతుండటంతో ఇప్పుడున్న ట్రాఫిక్ క్లియరెన్స్ కే రెండు లేదా అంతకు మించి రోజుల సమయం పడుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఫ్రాన్స్ బ్రిటన్ సరిహద్దును దాదాపు మూసేసినంత పని చేయడంతో బ్రిటిషర్లు భగ్గుమంటున్నారు. ఫ్రాన్స్ బ్రెగ్జిట్ కు ప్రతీకారం తీర్చుకుంటోందని నెటిజన్లు భావిస్తున్నారు. -
నగరానికి భారీ అతిథి
సాక్షి,సిటీ బ్యూరో: విశాఖపట్నం పోర్ట్ నుంచి భారీ విద్యుత్ యంత్రాలతో నాగపూర్ బయలుదేరిన 268 టైర్ల అతిపెద్ద వాహనం మంగళవారం నగర శివారులో ఆగిపోయింది. అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తుండగా ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో రోడ్డు మధ్యలోనే వాహనం ఆగిపోయింది. నిత్యం రద్దీగా ఉండే జాతీయ రహదారి కావడంతో వెనుక వచ్చిన వాహనాలు ఎటూ పోయే మార్గం లేక భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. 30 మంది పర్యవేక్షకులు వెంటనే రంగంలోకి దిగి మరమ్మతు పనులు చేపట్టారు. ఈ భారీ వాహనం మరో 30 రోజుల్లో నాగ్‌పూర్‌కు చేరుకుంటుందని జేఎం బాక్సి గ్రూప్ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. – ఫొటోలు: సోమ సుభాష్ వాహనం నిలిచిపోవడంతో స్థంబించిన ట్రాఫిక్ -
20 వేల వివాహాలు.. 35 లక్షల మంది అతిథులు
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ ప్యాకైపోయింది. ఎక్కడ చూసినా జనమేజనం. అన్ని రోడ్లూ కార్లతో నిండిపోయాయి. తెల్లవారు జామునుంచీ ఇదే పరిస్థితి. సూర్యుడు పడమరకు వాలుతున్నకొద్దీ ఇంకా కిక్కిరిసిపోనుంది. ఇలా ఎందుకు జరిగిందంటే.. ఢిల్లీ మహానగరంలో శుక్రవారం 20 వేల వివాహాలు జరగనుండటం సాధారణ కారణమైతే, ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ నిర్వహిస్తోన్న మెగా ఈవెంట్ కు 35 లక్షల మంది అతిథులు హాజరుకానుండటం ప్రధాన కారణం. ట్రాఫిక్ నియంత్రణ దుస్సాధ్యంగా మారుతున్న తరుణాన పోలీసులు కూడా చేసేదేమీలేక 'అయ్యలారా, అమ్మలారా.. దయచేసి ఈ ఒక్కరోజు రోడ్లపైకి రాకండి' అని జనాన్ని వేడుకుంటున్నారు. అక్కడి పరిస్థితికి సంబంధించిన మరికొన్ని ముఖ్యాంశాలు యమునా తీరంలోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఉత్సవ వేదికకు వెళ్లే వారంతా ఢిల్లీ- నోయిడా రహదారిపై నుంచే వెళుతుండటంతో ఉదయం నుంచే ఆ రోడ్డుపై ట్రాఫిక్ జామ్స్ కొనసాగుతున్నాయి. సాంస్కృతిక ఉత్సవం దృష్ట్యా పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేసినప్పటికీ నేటి వివాహాలతో రోడ్లు రద్దీగా మారాయి. కేవలం 1000 ఎకరాల్లోనే పార్కింగ్ స్థలాన్ని కేటాయించడంతో ముందు వచ్చిన వాహనాలను మాత్రమే పోలీసులు లోనికి అనుమతిస్తున్నారు. దీంతో సాయంత్రానికి యమునా తీరమంతా కార్లమయం అయ్యే అవకాశం ఉంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 11 వరకు వాహనాలు తీసుకొని బయటికి రావద్దంటూ సౌత్ ఢిల్లీలోని రింగ్ రోడ్డు, హైవే, నోయిడా లింక్ రోడ్లు, తూర్పు ఢిల్లీ లోని అక్షరధామ్ ఆలయం, మయూర్ విహార్ తదితర ప్రాంతాల ప్రజలకు పోలీసులు విజ్ఙప్తి చేస్తున్నారు. రవిశంకర్ వేడుక వద్ద 1700 మంది ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇవేకాక యమునా నదీతీరంలో వేడుక నిర్వహించినందుకుగానూ రూ.5 కోట్ల జరిమాన కట్టాలన్న గ్రీన్ ట్రిబ్యూనల్ ఆదేశాలను బేఖాతరు చేసిన నేపథ్యంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్ వ్యవహారం పార్లమెంట్ లోనూ హాట్ టాపిక్ గా మారింది. రవిశంకర్ చట్టానికి అతీతంగా ప్రవర్తిస్తున్నారంటూ విపక్షపార్టీలు ఫైర్ అయ్యాయి. వరల్డ్ కల్చరల్ ఫెస్ట్ కు ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్న సంగతి తెలిసిందే. కాగా గ్రీన్ ట్రిబ్యునల్ విధించిన రూ. 5 కోట్ల జరిమానా చెల్లించేందుకు 4 వారాల గడువు కావాలని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ కోరినట్టు తెలిసింది. -
కార్లకు ముకుతాడు!
- ట్రాఫిక్ నియంత్రణకు ఢిల్లీ బాటలో హైదరాబాద్ - కార్లపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి - ప్రణాళిక తయారీ బాధ్యత నిపుణులకు - మరికొద్దిరోజుల్లో స్పష్టత సాక్షి, హైదరాబాద్: మీకు కారుందా? ఆ కారులో నగరంలో రోజూ తిరుగుతున్నారా? మా కారు మా ఇష్టం అంటారా? అయితే ఇకపై రోజూ నగర రోడ్లపై మీ కారు పరుగులు తీసేందుకు కుదరకపోవచ్చు! వాటిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కాలుష్య భూతాన్ని నియంత్రించడానికి ఢిల్లీ ప్రభుత్వం వాహన రిజిస్ట్రేషన్ నంబర్ల సరి, బేసి సంఖ్య ఆధారంగా రోజువిడిచి రోజు మాత్రమే రోడ్లపైకి వచ్చేలా తీసుకున్న నిర్ణయం తెలంగాణ ప్రభుత్వాన్ని కదిలించింది. అసలే హైదరాబాద్‌లో ఇరుకురోడ్లు.. ఆపై లక్షల్లో వాహనాలు. నెల తిరిగేసరికి వేలసంఖ్యలో కొత్త కార్లు చేరుతున్నాయి. కాలుష్యాన్ని ఎగజిమ్ముతూ నగర జీవితాన్ని నరకప్రాయం చేస్తున్నాయి. దేశంలో అత్యధికంగా కార్లు తిరుగుతున్న నగరాల్లో హైదరాబాద్ కూడా ముందు వరసలో ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం వాటి నియంత్రణపై ఇప్పుడు దృష్టి సారించింది. కార్లకు ముకుతాడు వేయాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచనలు ఇచ్చే బాధ్యతను నిపుణులకు అప్పగించాలని నిర్ణయించింది. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది. ఢిల్లీ తరహా సరి, బేసి సంఖ్యల ఆధారంగా నియంత్రణ కంటే... వారంలో నిర్ధారిత రోజుల్లో కార్ల వాడకాన్ని నియంత్రించే విధానం మెరుగ్గా ఉంటుందని ఇప్పటికే అధికారులు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఐదేళ్ల క్రితమే చొరవ ప్రస్తుతం హైదరాబాద్ రోడ్లపై దాదాపు 8.5 లక్షల కార్లు పరిగెడుతున్నాయి. నిత్యం 200 వరకు కార్లు కొత్తగా రోడ్లపైకి చేరుతున్నాయి. దీంతో తీవ్ర ట్రాఫిక్ చిక్కులు అంతకంత అవుతున్నాయి. గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోతోంది. కార్యాలయాల వేళల్లో చాలా కార్లలో ఒక్క వ్యక్తి మాత్రమే ఉంటున్నాడు. కనీసం క్రమశిక్షణ కూడా లేకపోవటంతో కార్ల వాడకం విచ్చలవిడిగా మారింది. దీన్ని అరికట్టేందుకు వాస్తవానికి 2010లోనే ప్రయత్నాలు జరిగాయి. కానీ నాటి ప్రభుత్వం స్పందించకపోవటంతో అవి విఫలమయ్యాయి. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ విభాగాల ప్రాతినిధ్యంతో ఏర్పడ్డ యునిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు అథారిటీ (ఉమ్టా) దీనిపై ప్రభుత్వానికి ఓ నివేదిక ఇచ్చింది. నగరంలో ట్రాఫిక్ చిక్కులు, తద్వారా కాలుష్య సమస్య శ్రుతిమించకుండా ఉండాలంటే కార్లపై నియంత్రణ అవసరమని పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా కార్లపై నియంత్రణ ఎలా ఉందో కూడా సూచించింది. అంతకుముందు నగరంలోని హైటెక్స్‌లో ‘పసిఫిక్ ఏషియా ట్రావెల్ అసోసియేషన్ (పాటా) సదస్సు జరిగిన సమయంలో వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు నగరంలో కార్ల వాడకంపై విస్మయం వ్యక్తం చేశారు. తదుపరి పాటా సదస్సు జరగాల్సిన విదేశీ నగరాల ప్రతినిధులు ఈ విషయంలో చురకలు కూడా అంటించారు. ‘మా నగరంలో పాటా సదస్సుకు వచ్చేవారికి ఇలా విచ్చలవిడిగా కార్లు అందుబాటులో ఉండవు. కావాలంటే సైకిళ్లు ఎక్కి తిరగొచ్చు’ అని చెప్పడం ద్వారా హైదరాబాద్‌లో పర్యావరణ స్పృహ అంతగా లేదని పరోక్షంగా పేర్కొన్నారు. ఇలాంటి అంశాలను కూడా ‘ఉమ్టా’ పరిగణనలోకి తీసుకుంది. కానీ ఆ నివేదికను నాటి ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. ‘కార్ ఫ్రీ థర్స్డే’లా కావద్దు నగరంలో సాఫ్ట్వేర్ పరిశ్రమలో కార్ల వినియోగం అత్యధికంగా ఉంది. మాదాపూర్ ప్రాంతంలో రోడ్లపై కార్లబార్లు ఆశ్చర్యపరుస్తుంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని గతంలో ‘కార్ ఫ్రీ థర్స్డే’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గురువారం కారు బదులు బస్సుల్లో, ఇతర వాహనాల్లో ప్రయాణించాలనేది దీని ఉద్దేశం. రెండు మూడు నెలలు బాగానే అమలైనా ఆ తర్వాత అది నీరుగారింది. ఇప్పుడు గురువారాల్లోనూ యథాప్రకారం ఆ రోడ్లపై కార్లు పరుగుపెడుతున్నాయి. -
జమ్మల మడుగు, కోవెలకుంట్ల మధ్య భారీగా ట్రాఫిక్ జాం
వైఎస్ఆర్ జిల్లా: కడప జిల్లా జమ్మల మడుగు, కోవెలకుంట్ల రహదారిలో మాయలూరు గ్రామం వద్ద శనివారం ఉదయం భారీగా ట్రాఫీక్ జాం అయింది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా రోడ్లపై నీరు ప్రవహిస్తుండటంతో రెండు గంటలనుంచి ఎక్కడ నిలిచిన వాహనాలు అక్కడే ఉన్నాయి. కిలో మీటర్ మేర వాహనాలు నిలిచిపోవడంతో రాక పోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ ప్రాంతంలో గత పదేళ్లనుంచి ఇంతగా వర్షం పడలేదని...ఇలా ట్రాఫిక్ జాం అవ్వడం ఇంతకు ముందెప్పుడూ చూడలేదని స్థానికులు చెబుతున్నారు. రెండు గంటల నుంచి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నా ఇంకా అధికారులెవరు అక్కడికి రాలేదని ప్రయాణికులు మండిపడుతున్నారు. -
పాలకొల్లు వద్ద భారీగా ట్రాఫిక్ జాం
పాలకొల్లు (పశ్చిమగోదావరి) : పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు- నరసాపురం మధ్య హైవేపై పెద్ద ఎత్తున వాహనాలు స్తంభించిపోయాయి. ఉదయం కొన్ని గంటలపాటు వాహనదారులు ఇదే రహదారిలో ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్నం 1.30గంటల నుంచి మళ్లీ అదే పరిస్థితి తలెత్తింది. నరసాపురం, అంతర్వేది, అప్పనపల్లి వైపు పుష్కరస్నానాలకు వెళ్లే భక్తులు పెద్ద ఎత్తున ఒకేసారి తరలిరావటంతో ఈ పరిస్థితి తలెత్తింది. పోలీసులు రంగప్రవేశం చేసినా పెద్దగా ప్రభావం కనిపించటంలేదు. దాదాపు పదికిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. -
టోల్గేట్ల వద్ద నిలిచిపోయిన వాహనాలు
-
ట్రాలీ లారీ బోల్తా - భారీగా ఆగిన ట్రాఫిక్
గొల్లప్రోలు (తూర్పుగోదావరి జిల్లా) : తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం పెందుర్తి జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున పెద్ద ట్రాలీ లారీ బోల్తాపడింది. ట్రాలీ రహదారికి అడ్డంగా పడడంతో కిలోమేటర్లమేర వాహనాలు ఆగిపోయాయి. పోలీసులకు సమాచారం అందించినా ఉదయం ఏడుగంటల వరకూ వారు రాకపోవడంతో వాహనాలు ముందుకు కదలలేకపోయాయి. క్రేన్ తెప్పిస్తే తప్ప ట్రాలీని రోడ్డుపై నుంచి తొలగించడం సాధ్యం కాదు. ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. -
త్వరలో ఆకాశ మార్గాలు
-
రగులుతున్న పోరు
సాక్షి, విజయవాడ : సమైక్య ఆందోళనలు రోజురోజుకీ ఉధృత రూపం దాలుస్తున్నాయి. ఈ నెల ఏడున హైదరాబాద్‌లో జరిగే సమైక్య గర్జనను విజయవంతం చేసేందుకు ఏపీ ఎన్జీవోలు నడుం కట్టారు. దీనిలో భాగంగా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఏపీ ఎన్జీవోలు రామవరప్పాడు రింగ్‌లో మానవహారం నిర్వహించారు. జగ్జీవన్‌రామ్ విగ్రహం వద్ద తమ నిరసన వ్యక్తంచేశారు. సుమారు 45 నిమిషాల పాటు సాగిన ఈ నిరసన కార్యక్రమంతో భారీగా ట్రాఫిక్ నిలిపోయింది. పాలిటెక్నిక్ లెక్చరర్ల జేఏసీ ఆధ్వర్యంలో ఐదు నుంచి పూర్తి స్థాయిలో సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, సహకార శాఖ ఆధ్వర్యంలో మచిలీపట్నంలో వేలాది మంది ర్యాలీ నిర్వహించారు. లక్ష్మీటాకీసు సెంటరు నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ కోనేరుసెంటరుకు చేరుకుంది. ఈ ర్యాలీని కేడీసీసీ బ్యాంకు చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు ప్రారంభించారు. జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు మండలాలలో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. జేఏసీ ఆధ్వర్యంలో భిక్షాటన కార్యక్రమం నిర్వహించి దున్నపోతుకు వినతిపత్రం సమర్పించారు. వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను టీ అమ్ముతూ నిరసన వ్యక్తం చేశారు. మైలవరంలోని విజయవాడ బస్టాప్ వద్ద ఎన్జీఓ, ఆర్టీసీ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్షలు నాలుగో రోజుకు చేరాయి. జి.కొండూరులో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్షలో వికలాంగులు కూర్చుని సంఘీభావం తెలిపారు. ఉపాధ్యాయులు నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని నిరసన ప్రదర్శన నిర్వహించారు. వీటీపీఎస్ సిబ్బంది పెన్‌డౌన్.. వీటీపీఎస్ వద్ద కార్మికులు, సిబ్బంది పెన్‌డౌన్ కార్యక్రమం నిర్వహించి నిరసన తెలియజేశారు. తిరువూరులో ఆర్టీసీ కార్మికులు, పశుసంవర్థకశాఖ ఉద్యోగులు, కోర్టు ఉద్యోగులు, ఎన్జీవో జేఏసీల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ మొండివైఖరిని నిరసిస్తూ కార్యక్రమాలు చేపట్టారు. రోడ్డుపై అల్పాహారం వండి పంపిణీ చేశారు. కైకలూరు వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సాగుతున్న రిలే దీక్షలు 27వ రోజుకు చేరాయి. తాలూకా సెంటర్ వద్ద ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు రిలే దీక్షలు చేపట్టారు. వీరి ఆధ్వర్యంలో వంటావార్పు జరిగింది. ఉపాధ్యాయులు రోడ్డు మీద పాఠాలు చెప్పారు. ముదినేపల్లిలో జేఏసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు 36 గంటలు రిలే దీక్షలు చేపట్టారు. వీరికి 1500 మంది విద్యార్థులు మద్దతు తెలుపుతూ సహస్ర గళ ఘోష చేపట్టారు. చిగురుకోటలో దళితపేట గ్రామస్తులు సమైక్యాంధ్రకు మద్దతుగా రోడ్డుపై ధర్నా చేపట్టారు. కైకలూరు వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సాగుతున్న రిలే దీక్షలు 27వ రోజుకు చేరాయి. గుడివాడలో 72 గంటల బంద్ ప్రారంభం.. గుడివాడలో జేఏసీ 72 గంటల బంద్‌కు పిలుపునివ్వటంతో వ్యాపార సంస్థలు, కార్యాలయాలను మూసివేశారు. స్థానిక నెహ్రూ చౌక్ సెంటర్లో జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగుతున్నాయి. స్థానిక బస్టాండ్ వద్ద ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో నాయకుడు దారం ఏడుకొండలు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఆయనకు మద్దతుగా ఆర్టీసీ కార్మికులు సుమారు 50 మంది రిలే దీక్షలో పాల్గొన్నారు. ఐఎంఏ ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసన తెలుపుతూ దీక్షాధారులకు బీ-కాంప్లెక్సు టాబ్లెట్లు పంపిణీ చేశారు. గుడ్లవల్లేరులో జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు రిలేదీక్షలు చేశారు. పాలిటెక్నిక్ కాలేజీ సిబ్బంది పంచాయతీ మంచినీటి చెరువు వద్ద ఉన్న బాపూజీ మందిరంలో రిలేదీక్షలకు కూర్చున్నారు. పామర్రులో జరుగుతున్న రిలేదీక్షలలో వృద్ధులు పాల్గొన్నారు. పామర్రు హైస్కూల్ విద్యార్థులు, గవర్నమెంట్ కాలేజీ విద్యార్థులు నాలుగురోడ్ల కూడలిలో మానవహారం ఏర్పాటుచేసి ట్రాఫిక్ స్తంభింపచేశారు. విజయవాడలో నేడు వైద్యగర్జన.. మరోవైపు వైద్యులు విజయవాడలో వైద్య గర్జన నిర్వహించనున్నారు. మంగళవారం వైద్యసేవలు నిలిపివేయాలని నిర్ణయించారు. మున్సిపల్, దుర్గగుడి ఉద్యోగుల దీక్షలు కొనసాగాయి. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో దున్నపోతు మీద వాన పడుతున్నట్లుగా నిరసన చేపట్టారు.