20 వేల వివాహాలు.. 35 లక్షల మంది అతిథులు | 20,000 Weddings And A mega Festival, Delhi Roads packed | Sakshi
Sakshi News home page

20 వేల వివాహాలు.. 35 లక్షల మంది అతిథులు

Published Fri, Mar 11 2016 12:30 PM | Last Updated on Sun, Sep 3 2017 7:30 PM

20 వేల వివాహాలు.. 35 లక్షల మంది అతిథులు

20 వేల వివాహాలు.. 35 లక్షల మంది అతిథులు

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ ప్యాకైపోయింది. ఎక్కడ చూసినా జనమేజనం. అన్ని రోడ్లూ కార్లతో నిండిపోయాయి. తెల్లవారు జామునుంచీ ఇదే పరిస్థితి. సూర్యుడు పడమరకు వాలుతున్నకొద్దీ ఇంకా కిక్కిరిసిపోనుంది. ఇలా ఎందుకు జరిగిందంటే..

ఢిల్లీ మహానగరంలో శుక్రవారం 20 వేల వివాహాలు జరగనుండటం సాధారణ కారణమైతే, ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ నిర్వహిస్తోన్న మెగా ఈవెంట్ కు 35 లక్షల మంది అతిథులు హాజరుకానుండటం ప్రధాన కారణం. ట్రాఫిక్ నియంత్రణ దుస్సాధ్యంగా మారుతున్న తరుణాన పోలీసులు కూడా చేసేదేమీలేక 'అయ్యలారా, అమ్మలారా.. దయచేసి ఈ ఒక్కరోజు రోడ్లపైకి రాకండి' అని జనాన్ని వేడుకుంటున్నారు. అక్కడి పరిస్థితికి సంబంధించిన మరికొన్ని ముఖ్యాంశాలు

  • యమునా తీరంలోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఉత్సవ వేదికకు వెళ్లే వారంతా ఢిల్లీ- నోయిడా రహదారిపై నుంచే వెళుతుండటంతో ఉదయం నుంచే ఆ రోడ్డుపై ట్రాఫిక్ జామ్స్ కొనసాగుతున్నాయి.
  • సాంస్కృతిక ఉత్సవం దృష్ట్యా పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేసినప్పటికీ నేటి వివాహాలతో రోడ్లు రద్దీగా మారాయి.
  • కేవలం 1000 ఎకరాల్లోనే పార్కింగ్ స్థలాన్ని కేటాయించడంతో ముందు వచ్చిన వాహనాలను మాత్రమే పోలీసులు లోనికి అనుమతిస్తున్నారు. దీంతో సాయంత్రానికి యమునా తీరమంతా కార్లమయం అయ్యే అవకాశం ఉంది.
  • మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 11 వరకు వాహనాలు తీసుకొని బయటికి రావద్దంటూ సౌత్ ఢిల్లీలోని రింగ్ రోడ్డు, హైవే, నోయిడా లింక్ రోడ్లు, తూర్పు ఢిల్లీ లోని అక్షరధామ్ ఆలయం, మయూర్ విహార్ తదితర ప్రాంతాల ప్రజలకు పోలీసులు విజ్ఙప్తి చేస్తున్నారు.
  • రవిశంకర్ వేడుక వద్ద 1700 మంది ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు.


ఇవేకాక యమునా నదీతీరంలో వేడుక నిర్వహించినందుకుగానూ రూ.5 కోట్ల జరిమాన కట్టాలన్న గ్రీన్ ట్రిబ్యూనల్ ఆదేశాలను బేఖాతరు చేసిన నేపథ్యంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్ వ్యవహారం పార్లమెంట్ లోనూ హాట్ టాపిక్ గా మారింది. రవిశంకర్ చట్టానికి అతీతంగా ప్రవర్తిస్తున్నారంటూ విపక్షపార్టీలు ఫైర్ అయ్యాయి. వరల్డ్ కల్చరల్ ఫెస్ట్ కు ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్న సంగతి తెలిసిందే. కాగా గ్రీన్ ట్రిబ్యునల్ విధించిన రూ. 5 కోట్ల జరిమానా చెల్లించేందుకు 4 వారాల గడువు కావాలని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ కోరినట్టు తెలిసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement