ravishankar
-
ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాల్లో ఉక్రెయిన్‌లో శాంతి కోసం ప్రార్ధనలు
ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాల రెండవ రోజున విశ్వమానవ హృదయ స్పందన గురుదేవ్ నేతృత్వంలో 180 దేశాల ప్రజలచే ఉక్రెయిన్‌లో శాంతిస్థాపన కోసం ప్రార్థన. బెంగుళూరు : వందలాది దేశాల పతాకాల రెపరెపల నేపథ్యంలో 180 దేశాల సంస్కృతులు, నృత్య-గాన రీతులు, ఆహార వ్యవహారాలకు సమైక్య వేదికగా ప్రపంచ సాంస్కృతిక మహోత్సవాలు అమెరికాలోని నేషనల్ మాల్ ప్రాంగణంలో కొనసాగాయి. ప్రపంచ ప్రజలను సమైక్యపరచటంలో భారతదేశానికి గల సామర్థ్యాన్ని ఈ ఉత్సవాలు ఘనంగా చాటిచెప్పాయి. మానవజాతి మైత్రి బంధం.. ఇక్కడి చారిత్రక లింకన్ మెమోరియల్ వద్ద హాజరైన 1000 మందికి పైగా ఆహుతుల యోగాభ్యాసంతో రెండవరోజు వేడుకలు కూడా ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలకోసం ప్రత్యేకించిన యోగ, ప్రాణాయామం జరిగిన అనంతరం గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ స్వయంగా ఆహుతులచే ధ్యానం చేయించారు. అనంతరం జరిగిన సాంస్కృతిక ప్రదర్శనలు, స్ఫూర్తిదాయక ప్రసంగాలు అక్కడ హజరైన జనహృదయాలను ఉర్రూతలూగించి మానవజాతి మైత్రీబంధానికి సాక్షిగా నిలిచాయి. విశ్వమానవ కుటుంబం.. భారత మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్ వ్యాఖ్యానించినట్లుగా, ‘పర్వతప్రాంతాల నుంచి మైదానాలదాకా, నదీతీరాల నుంచి ఇసుకతిన్నెలు, ఎడారులదాకా వ్యాపించిన ప్రజావాహిని అంతా నేడు ఇక్కడ సమావేశమైందని ఈ విధంగా విశ్వ మానవ కుటుంబపు సంక్షిప్తరూపం ఇక్కడ ఆవిష్కరింపబడిందని అన్నారు. సమైక్య ప్రార్ధనలు.. రెండవరోజు ప్రదర్శింపబడిన అనేక కళారూపాలలో ప్రఖ్యాత ఉక్రేనియన్ సంగీతకారురాలు ఒలెనా అస్తాషేవా నిర్వహించిన సాంప్రదాయ ఉక్రేనియన్ పాట కూడా ఉంది. యుద్ధం కారణంగా తన మాతృభూమిని విడిచిపెట్టాల్సి వచ్చిన ఆమె, తన బృందంతో ఇచ్చిన ప్రదర్శనతో మనసు చలించిన ప్రేక్షకులు గురుదేవ్ నేతృత్వంలో ఉక్రెయిన్ లో శాంతి నెలకొనాలని ప్రార్థించారు. ‘సమైక్యంగా చేసే మన ప్రార్థనలు ఫలిస్తాయి’ అని గురుదేవ్ పేర్కొన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రూఫ్? ప్రజలను ఉర్రూతలూగించే ప్రసంగాలకు పేరుగాంచిన రెవరెండ్ గెరాల్డ్ ఎల్ డర్లీ, మాట్లాడుతూ, 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' పేరును 'ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రూఫ్'గా మార్చాలని ఎందుకంటే మనం ప్రేమించగలమని, ప్రేమను పంచగలమని, దయతో ఉండగలమని గురుదేవ్ ఇక్కడ నిరూపిస్తున్నారని పేర్కొన్నారు. మీ నాయకుడు ఎవరని అడిగితే.. అమెరికన్ వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్టర్, వ్యాపారవేత్త టిమ్ డ్రేపర్ తన అభిప్రాయాలను పంచుకుంటూ, 'అమెరికన్లు ఇతర దేశాల ప్రజలను గ్రహాంతరవాసులని పిలిచేవారం. ఇది మంచి పదం కాదు. క్రమంగా మేము ఏదో ఒక విధంగా ఇతర దేశాల ప్రజలను అంగీకరించి, ఏకీకృతం చేయడం ప్రారంభించాము. గురుదేవ్ నాయకత్వంలో ఈనాడు ఇంతమంది ప్రజలను ఒకచోట చేర్చాము. ఇకపై భూమిపై ఎవరూ గ్రహాంతరవాసులు కాదు. ఇంకా ఈ భూమిపై ఎవరైనా గ్రహాంతర వాసులు.. నన్ను మీ నాయకుడి దగ్గరకు తీసుకెళ్లమని అడిగితే, నేను వారికి గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ ను చూపుతానని అన్నారు. ఇలాంటివి అవసరం.. యు.ఎస్. సర్జన్ జనరల్ డాక్టర్ వివేక్ మూర్తి మాట్లాడుతూ.. ఇటువంటి సాంస్కృతిక ఉత్సవాలు శక్తివంతమైనవి ఎందుకంటే, మనమందరమూ పరస్పర సంబంధాలను కలిగి ఉండాల్సిన ఆవశ్యకతను ఇవి గుర్తుచేస్తాయని అన్నారు. గతంలో కంటే ఈరోజుల్లో ఇవి మనకు అత్యవసరం. ఈనాటి జీవనంలో ఒంటరితనం, తోడు లేకపోవడం అనేవి అంటువ్యాధులుగా మారి, మతిభ్రమణం, గుండె జబ్బుల వంటి మానసిక, శారీరక అనారోగ్య సమస్యలకు దారితీస్తున్నాయని తద్వారా మన సమాజపు సంక్షేమానికే బెడదగా పరిణమిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. అతిరథమహారధులు.. రెండవ రోజు కార్యక్రమంలో ప్రసంగించిన ఇతర ప్రముఖులలో మారిషస్ అధ్యక్షుడు పృథ్వీరాజ్‌సింగ్ రూపన్, భారత మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్, జపాన్ దివంగత ప్రధాన మంత్రి షింజో అబే భార్య అకీ అబే, అమెరికాలోని సర్జన్ జనరల్ డాక్టర్ వివేక్ మూర్తి తదితరులు ఉన్నారు. వివిధ దేశాల సాంస్కృతిక కార్యక్రమాలు.. 2వ రోజు జరిగిన సాంస్కృతిక ముఖ్యాంశాలలో, ప్రముఖ భారతీయ అమెరికన్ గాయకుడు, గ్రామీ అవార్డు విజేత ఫాలు షా నేతృత్వంలో 10,000 మంది నాట్యబృందంచే గార్బా నృత్య ప్రదర్శన, 200 మంది కళాకారులతో ఉత్సాహభరితమైన భాంగ్రా ప్రదర్శన, ఐర్లాండు కళాకారుల బృందంచే ఐరిష్ స్టెప్ డ్యాన్స్, అప్ఘన్ కళాకారుల గీతాలాపన, 1,000 మంది చైనీస్-అమెరికన్ గాయకులు, కళాకారుల అద్భుతమైన నృత్యం, కుంగ్ ఫూ ప్రదర్శనతోపాటు వాటికి తోడుగా గంభీరమైన డ్రాగన్లు, సింహాలు ప్రాణంతో ఉన్నవా అనిపించేలా తీర్చిదిద్దిన కళాత్మక నాట్యం మొదలైనవి వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇంకా ఇండోనేషియా, బ్రెజిల్, బొలీవియా, లాటిన్ అమెరికా దేశాల కళాకారుల మరపురాని ప్రదర్శనలు, కుర్టిస్ బ్లో వంటి దిగ్గజాల నేతృత్వంలో హిప్ హాప్, బ్రేక్ డ్యాన్స్ ప్రదర్శనలు, 1200 మందిచే సువార్త గానం, పాకిస్తానీ కళాకారుల మంత్రముగ్ధమైన ప్రదర్శన ప్రేక్షకులను అలరించాయి. ఇది కూడా చదవండి: డల్లాస్‌లో నాట్స్ ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్! -
ఆర్ట్ ఆఫ్ లివింగ్ సిబ్బంది, గ్రామస్తుల మధ్య ఘర్షణ
దొడ్డబళ్లాపురం: భూవివాదం నేపథ్యంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సిబ్బంది, గ్రామస్తుల మధ్య ఘర్షణ చోటుచేసుకుని కార్లు, బైక్‌లకు నిప్పంటించిన సంఘటన బెంగళూరు దక్షిణ తాలూకా వడేరహళ్లి గ్రామం వద్ద చోటుచేసుకుంది. వడేరహళ్లి గ్రామం పరిధిలో 137వ సర్వే నంబర్లో 36 కుంటల భూమికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారు రాత్రికి రాత్రి ఫెన్సింగ్ వేసారు. అయితే ఇదే భూమిలో గ్రామస్తులు చాలా కాలంగా వ్యవసాయం చేస్తున్నారు. తమ భూమిలో ఎలా ఫెన్సింగ్ వేస్తారని గ్రామస్తులు మంగళవారం ఆర్ట్ ఆఫ్ లివింగ్ సిబ్బందితో ఘర్షణపడ్డారు. ఘర్షణ తారాస్థాయికి వెళ్లి ఆర్ట్ ఆఫ్ లివింగ్‌లోని మధువన ఫార్మ్‌హౌస్‌లో ఉన్న 8 బైక్‌లకు గ్రామస్తులు నిప్పంటించారు. సెక్యూరిటీ రూంను, మరో 5 బైక్‌లు, నాలుగు కార్లను కూడా ధ్వంసం చేసారు. ఘటనకు సంబంధించి గ్రామస్తులు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సిబ్బంది పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. కగ్గలీపుర పోలీసులు ఇరువైపుల ఫిర్యాదులు స్వీకరించి దర్యాప్తు ప్రారంభించారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడడంతో పోలీసులను మోహరింపచేసారు. జిల్లా ఎస్పీ కార్తీక్ రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
చట్ట ప్రకారమే జీవో నెంబర్ 1 : ఏపీ అడిషనల్ డీజీపీ రవిశంకర్
-
ముఖచిత్రం మూవీ టీం తో " స్పెషల్ చిట్ చాట్ "
-
గురుదేవ్ రవిశంకర్‌కు 'గాంధీ పీస్ పిల్గ్రిమ్' అవార్డు
అట్లాంటా: ప్రపంచవ్యాప్తంగా తన సందేశాల ద్వారా శాంతి స్థాపనకు కృషి చేస్తున్న భారతీయ ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీ గురుదేవ్ రవిశంకర్ నవంబరు 10న అట్లాంటాలో 'గాంధీ పీస్ పిల్గ్రిమ్' అవార్డును అందుకున్నారు. మానవాళికి విశిష్ట సేవ చేస్తున్నందుకుగానూ గాంధీ ఫౌండేషన్ ఆఫ్ యూఎస్ఏ ఆయనకు ఈ అవార్డును మార్టిన్ లూధర్ కింగ్ కేంద్రంలోని మహాత్మా గాంధి విగ్రహం ముందు ప్రధానం చేసింది. డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ మేనల్లుడు ఐసాక్ ఫెర్రిస్, భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ స్వాతి కులకర్ణి, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, కమ్యునిటి సమక్షంలో గాంధీ ఫౌండేషన్ అద్యక్షులు సుభాష్ రాజదాన్, కార్యవర్గ సభ్యులు ఆంటోనీ తలియాత్, రవి పోణంగిల నుంచి శ్రీశ్రీ రవిశంకర్ ఈ అవార్డును అందుకున్నారు. గతంలో దలైలామా, అమెరికా అద్యక్షులు జిమ్మికార్టరు, కరొట్టా స్కాట్ కింగ్, దాదా వాస్వాని గాంధీ పీస్ పిల్గ్రిమ్ అవార్డును అందుకున్నారు. అవార్డ్ ప్రధానంతరం, రవిశంకర్ మహాత్మ గాంధీ విగ్రహం నుంచి మార్టిన్ లూధర్ కింగ్, కొరట్ట స్కాట్ కింగ్ సమాధుల వరకు శాంతి యాత్రను సాగించటాన్ని విశేషంగా చెప్పవచ్చు. చదవండి: యూకే,యూరోప్‌లో అంగరంగ వైభవంగా తితిదే శ్రీనివాస కళ్యాణోత్సవాలు -
‘టీడీపీ ప్రచురించిన పుస్తకంలో అవాస్తవాలు’
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని, కావాలనే పనికట్టుకొని ఓ రాజకీయ పార్టీ పోలీసులపై దుష్ప్రచారం చేస్తోందని అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యనార్ వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రచురించిన పుస్తకంలోని పోలీసు కేసులకు సంబంధించిన విషయాలు సత్యదూరమని ఆయన కొట్టిపారేశారు. పల్నాడులో శాంతి భద్రతల పరిస్థితి దిగజారిందని ఆరోపణలు చేయడంతోపాటు పోలీసులపై కూడా ఆరోపణలు చేసిందని డీజీ అన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక అందించాలని డీజీపీ ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ఎనిమిది హత్యలు జరిగినట్లు ఆరోపణలు చేశారని, అవన్నీ రాజకీయ హత్యలు కావని అన్నారు. రౌడీ గ్రూపులు దాడులు చేసుకున్న ఘటనలో ఒకరు చనిపోయారని.. అది కూడా ఎన్నికల ముందు జరిగిందని అదనపు డీజీ స్పష్టం చేశారు. దీంతోపాటు 110 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని ఆరోపించిన దానిలో వాస్తవం లేదని పేర్కొన్నారు. అవి కూడా రాజకీయ కేసులు కావని అన్నారు. మరో ఆరోపణలో 38 ఫిర్యాదులు చేసినా కేసులు నమోదు కాలేదని అన్నారని, అవి కూడా అవాస్తవాలేనని తెలిపారు. అయితే ఎన్నికల ముందు నమోదైన 10 కేసుల్లో 70 మంది వైఎస్సార్సీపీ, 41 మంది టీడీపీకి చెందిన వారిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని పేర్కొన్నారు. ఇవి కూడా కొత్త ప్రభుత్వం రాకముందే జరిగాయని గుర్తు చేశారు. అదే విధంగా ఆత్మకూరు మండలం నుంచి 545 మంది గ్రామ విడిచి వెళ్లిపోయారని ఆరోపించారని.. కానీ పనులు కోసం కేవలం 345 మంది మాత్రమే బయటకు వెళ్లారని.. అందులో 312 మంది కూడా వెనక్కి తిరిగి వచ్చారని వివరించారు. ఎవరూ భయబ్రాంతులకు గురై గ్రామం విడిచి వెళ్ళలేదని, ఎవరైనా ఆ ఊరు వెళ్లి పరిశీలన చేసుకోవచ్చని స్పష్టం చేశారు. అంతేగాక రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలపై దాడులు జరిగాయంటూ 297 ఫిర్యాదులు వచ్చాయని, అందులో 161 అవాస్తవమని తమ విచారణలో తేలిందన్నారు. 126 కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశామని చెప్పారు. గుంటూర్ రేంజ్ ఐజీ వినిత్ బ్రిజలాల్ మాట్లాడుతూ.. ‘పోలీసులకు రాజకీయ రంగు వేయొద్దని అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. టీడీపీ నేతలు రెండు బ్రోచర్లు వేసి డీజీపీకి ఇచ్చారు. ఈ ఆరోపణలు వాస్తవం కాదు. పల్నాడులో పరిస్థితి చక్కదిద్దేదుకు పోలీసు విభాగం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. రాజకీయ నేతలు చేస్తున్న ఆరోపణలపై పోలీసు విభాగం స్పందించదు. సోషల్ మీడియాలో రెండు పార్టీల నుంచి ఫిర్యాదులు అందాయి. వాటిపై దర్యాప్తు చేస్తున్నాం. విధి నిర్వహణలో పోలీసు అధికారుల ను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే ఐపీసీ సెక్షన్ 353 కింద కేసులు నమోదు చేస్తాం. విధి నిర్వహణ లో పోలీసులు ఎలాంటి భావోద్వేగాలతో ఉండరని గుర్తించాలి’ అని పేర్కొన్నారు. -
ఆఫీసర్.. నేను ఎమ్మెల్యేనయ్యా
సాక్షి, కరీంనగర్ : ‘ఆఫీసర్ నేను ఎమ్మెల్యేను.. కార్యక్రమ ఆహ్వానితుడను..’ అంటూ తన ను అడ్డుకున్న పోలీస్ అధికారికి చొప్పదండి ఎమ్మెల్యే చెప్పుకోవాల్సి వచ్చింది. స్వాత్రంత్య దినోత్సవం సందర్భంగా కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన వేడుకలకు పోలీసులు భారీ బందోబస్తు కల్పించారు. జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులుకు ఆహ్వాన లేఖలు పంపిం చారు. గురువారం వేడుకలకు హాజరయ్యేం దుకు వచ్చిన చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను వారికి కేటాయించిన ప్రాంతంలోకి రాగా ఓ సీఐ అనుమతించలేదు. దీం తో ఆఫీసర్ నేను చొప్పదండి ఎమ్మెల్యేనంటూ తనను తాను చెప్పుకోవాల్సి వచ్చింది. తర్వాత సదరు అధికారి లోనికి అనుమతించారు. ప్రధాన గేట్ వద్ద ఏర్పాటు చేసిన డిస్ట్రిక్ గార్డ్ కార్యక్రమానికి వస్తున్న పలువురిపై దురుసుగా మాట్లాడుతూ నెట్టివేయడం కనిపించింది. ఈవిషయం అధికారుల దృష్టికి తీసుకపోయినా స్పందన కరువైంది. -
రవిశంకర్‌ను పట్టిస్తే రూ.లక్ష
కడప అర్బన్: నాలుగు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా ఉన్న ఐతం రవిశంకర్ అలియాస్ రవి ఆచూకీ కోసం తెలంగాణా రాష్ట్ర పోలీసులు వైఎస్సార్ జిల్లాలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. అతన్ని పోలీసులకు పట్టిస్తే రూ.లక్ష బహుమతి ఇస్తామని ప్రకటించారు. తెలంగాణ పోలీసుల బృందం ఆదివారం కడపలో విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా కంకిపాడు మండలం దావులూరు గ్రామానికి చెందిన ఐతం రవిశేఖర్ అలియాస్ రవి (45) ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, కర్ణాటక, తమిళనాడు పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. ఈ నాలుగు రాష్ట్రాల్లో అతనిపై 30 కేసులకు పైగా నమోదయ్యాయి. ఇతను వైజాగ్ కేంద్రకారాగారంలో శిక్షను అనుభవిస్తూ, ఈ ఏడాది మే 21న కోర్టుకు ఎస్కార్ట్‌తో వాయిదాకు వెళుతున్న సమయంలో కన్నుగప్పి పరారయ్యాడు. కర్ణాటకలో ఐ20 కారును దొంగిలించి, దానికి నకిలీ నంబర్ (ఏపీ 39 ఏక్యూ 1686) వేసుకుని ఫార్మసీ చదువుతున్న రంగారెడ్డి జిల్లా రంగన్నగూడకు చెందిన యువతి సోని(21)ని కిడ్నాప్ చేశాడు. అంతకు ముందు ఈనెల 23న ఉదయం సోని తల్లిదండ్రులు నడుపుతున్న హోటల్‌కు టీ తాగేందుకు వెళ్లి వారితో మాటలు కలిపాడు. సోనికి ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పాడు. ఆమె తండ్రితో కలిసి తన కారులో ఎక్కించుకుని మధ్యాహ్నం వరకు తిరిగారు. తరువాత ఆమె తండ్రిని కుమార్తెకు సంబంధించిన సర్టిఫికెట్లను జిరాక్స్ చేయించుకు రమ్మని పంపాడు. ఆయన తిరిగి వచ్చేసరికి కారు వెళ్లిపోయింది. అందులో తన కుమార్తెను తీసుకుని వెళ్లాడని, ఆమె కిడ్నాప్‌నకు గురైందని రాచకొండ కమిషనరేట్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే సీపీ మహేష్ భగవత్ నిందితుడిని పట్టుకునేందుకు 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఓ బృందం టాస్క్‌ఫోర్స్ సీఐ రాజు ఆధ్వర్యంలో అదే రోజున కారు ఆచూకీని వెతుక్కుంటూ వైఎస్సార్ జిల్లాలోకి వచ్చారు. 24వ తేదీన కడపలో ప్రవేశించిన కారు ఉదయం ఒంటిమిట్ట హరిత హోటల్ వరకు వెళ్లిన పుటేజీలు కనిపించాయి. కడపలో ఓ సీసీ కెమెరా ఫుటేజీలో కారులో వెనుకసీటులో సోని ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఆదివారం కడపలో విలేకరులతో మాట్లాడిన టాస్క్‌ఫోర్స్ సీఐ రాజు నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి రూ.లక్ష బహుమతిగా ప్రకటించామన్నారు. -
నా కొడుకును చంపేయండి: చిట్టెమ్మ
సాక్షి, విజయవాడ: హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో నాలుగు రోజుల క్రితం కిడ్నాప్‌నకు గురైన ఫార్మసీ విద్యార్థి సోనీ ఆచూకీ ఇంకా తెలియలేదు. మిస్టరీగా మారిన కిడ్నాప్ కేసులో తెలంగాణ పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టారు. మరోవైపు నిందితుడు రవిశంకర్‌పై అతడి కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన కొడుకును చంపేసినా బాధపడమని తల్లి చిట్టెమ్మ తెలిపింది. ‘ఓ అమ్మాయిని కిడ్నాప్ చేయడం తప్పు. తప్పు ఎవరు చేసినా అది తప్పే. నా కొడుకును కఠినంగా శిక్షించండి. అటువంటి నీచుడిని కన్నందుకు బాధగా ఉంది. అతడిని చంపేసినా బాధపడను. వాడెప్పుడో చనిపోయాడు. గతంలో నా కొడుకును మారమని చాలాసార్లు చెప్పాను. కాళ్లు పట్టుకుని బతిమిలాడాను. అయినా పద్ధతి మార్చుకోలేదు. నా కొడుకు తీరుతో మా కుటుంబం తీవ్ర అవమానాలు పడుతున్నాం. ఈ కేసులో అమాయకుడైన నా మనవడు రాజును (రవిశంకర్ కొడుకు) పోలీసులు తీసుకెళ్లారు. నా మనవడు నాకు కావాలి. వాడంటే నాకు ప్రాణం.’ అని ఆవేదన వ్యక్తం చేసింది. రవిశంకర్ సోదరుడు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ‘నా తమ్ముడు చాలా దుర్మార్గుడు. వాడిని చంపేసినా మేం బాధపడం. పోలీసులు ఏం చర్యలు తీసుకున్నా మేము పట్టించుకోం. ఒకవేళ అతడిని చంపేసినా శవాన్ని తీసుకు వెళ్లడానికి కూడా మేం రాము. అలాంటోడిని బతకనిస్తే సమాజానికే ప్రమాదం. ఏం పాపం తెలియని అతడిని కొడుకుని వేధింపులకు గురి చేయడం సరికాదు’ అని అన్నాడు. చదవండి: యువతి కిడ్నాప్; సీసీటీవీ ఫుటేజ్ లభ్యం..! ఏపీలోని కృష్ణా జిల్లా కంకిపాడు మండలం దావులూరుకు చెందిన రవిశంకర్ జల్సాలకు అలవాటుపడి దొంగతనాలను వృత్తిగా ఎంచుకున్నాడు. అటెన్షన్ డైవర్ట్ చేసి పనికాచ్చేయటంలో దిట్టగా పేరొందాడు. కంకిపాడు, పెనమలూరు, విజయవాడల్లో దొంగతనాలకు పాల్పడి చాలాసార్లు పట్టుబడి, జైలు జీవితం సైతం అనుభవించాడు. జైలు నుంచి బయటకు రాగానే మళ్లీ వృత్తిలోకి దిగేవాడు. ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలతో పాటు పలు చోట్ల చోరీలకు పాల్పడ్డాడు. ఒక్క ఏపీలోనే 25 నేరాలు చేసినట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. ఓ కేసులో అరెస్టయిన రవిశంకర్ ఎస్కార్ట్ కళ్లుగప్పి పారిపోయాడు. అప్పటి నుంచి ఏపీ పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. చదవండి: ఎవరు?..ఎందుకు? ఉన్నట్టుండి హైదరాబాద్ లో ప్రత్యక్షం కావటం స్టూడెంట్ సోనీని కిడ్నాప్ చేసి తీసుకెళ్లటంతో మరోసారి తెరపైకి వచ్చాడు. ఇక ఏపీ పోలీసుల సహకారం తీసుకుని రవిశంకర్ ఆచూకీ కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ పోలీసులు. అయితే ఇప్పటివరకు కేవలం దొంగతనాలు మాత్రమే చేసిన రవిశంకర్ ఇప్పుడు కిడ్నాపర్‌గా ఎందుకు మారాడు.?పోలీసుల నుంచి తప్పించుకున్న తర్వాత ఏదైనా గ్యాంగ్‌తో చేతులు కలిపాడా? కిడ్నీ రాకెట్‌తో ఏమైనా సంబంధాలున్నాయా? దుబాయికి అమ్మాయిలని అమ్మే ముఠాలో సభ్యుడయ్యాడా..? ఇందుకోసమే తండ్రిని ట్రాప్ చేసి కూతురు సోనిని కిడ్నాప్ చేశాడా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. -
బీజేపీలో చేరిన గౌతమ్ గంభీర్
న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ (37) రాజకీయాల్లోకి ప్రవేశించారు. శుక్రవారం కేంద్ర మంత్రులు జైట్లీ, రవిశంకర్ల సమక్షంలో బీజేపీలో చేరారు. ప్రధాని మోదీ నాయకత్వం నచ్చి బీజేపీలో చేరుతున్నానని, పార్టీ సభ్యుడిగా దేశ సంక్షేమం కోసం కృషి చేస్తానని గంభీర్ తెలిపారు. దేశానికి మంచి చేయడానికి, పార్టీని ముందుకు తీసుకుపోవడానికి ఇది మంచి వేదిక అని వెల్లడించారు. అనంతరం గంభీర్ బీజేపీ పార్టీ అధినేత అమిత్ షాను కలుసుకున్నారు. ఢిల్లీలో పుట్టి పెరిగిన గంభీర్ బీజేపీలో చేరడంతో పార్టీకి మరింత బలం చేకూరనుందని జైట్లీ ధీమా వ్యక్తం చేశారు. గత కొన్ని దశాబ్దాలుగా పార్టీ కేడర్ విస్తరించిందని, వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన వారిని పార్టీలో చేర్చుకున్నామని తెలిపారు. గంభీర్, 2011 ప్రపంచ కప్, 2007 టీ–20 ప్రపంచ కప్‌లను భారత్ గెలవడంలో కీలకపాత్ర పోషించారు. బిహార్‌లో మహాకూటమి సీట్ల ఖరారు పట్నా: వచ్చే లోక్‌సభ ఎన్నికలకుగాను బిహార్‌లో మహాకూటమి సీట్ల పంపిణీ ఖరారైంది. ఇందులోభాగంగా లోక్తాంత్రిక్ జనతాదళ్ (ఎల్జేడీ) అధ్యక్షుడు శరద్ యాదవ్ రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) గుర్తుపై పోటీ చేయనున్నారు. బిహార్‌లోని మొత్తం 40 లోక్‌సభ స్థానాలకు గాను 20 చోట్ల లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన ఆర్జేడీ, 9 స్థానాల్లో కాంగ్రెస్ తమ అభ్యర్థులను పోటీకి ఉంచనున్నాయి. మహా కూటమిలోకి కొత్తగా వచ్చి చేరిన ఉపేంద్ర కుష్వాహాకు చెందిన లోక్ సమతా పార్టీ(ఆర్ఎల్ఎస్పీ) 5, ముకేశ్ సాహ్నికి చెందిన వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ(వీఐపీ) 3 స్థానాల్లో పోటీ చేస్తాయి. మాజీ సీఎం జితేన్ రామ్ మాంఝికి చెందిన హిందుస్తా ఆవాల్ మోర్చా(హెచ్ఏఎం) మూడు చోట్ల నుంచి బరిలోకి దిగనుంది. ఆర్జేడీ తనకు దక్కిన 20 చోట్లలో ఒక సీటును సీపీఐ(ఎంఎల్)లిబరేషన్‌కు ఇచ్చేందుకు అంగీకరించింది. అదేవిధంగా, 11 సీట్లు ఇవ్వాలంటూ మొదట్నుంచీ పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ కూడా రాజ్యసభ సీటు ఇచ్చే ఒప్పందంపై 9 స్థానాలకు దిగివచ్చింది. ఆర్ఎల్ఎస్పీకి మహాకూటమిలో చేరడంతో 5 సీట్లు దక్కాయి. బీఎస్పీ తొలి జాబితా లక్నో: బీఎస్పీ 11 మందితో తొలి జాబితా విడుదల చేసింది. ఇందులో జేడీఎస్ మాజీ నేత డేనిష్ అలీ పేరు ఉంది. జేడీఎస్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అలీ గత వారమే బీఎస్పీలో చేరారు. రాష్ట్రంలోని మొత్తం 80 సీట్లకుగాను ఎస్పీ– బీఎస్పీ– ఆర్ఎల్డీ కూటమిలో బీఎస్పీ 38 చోట్ల, ఎస్పీ 37, ఆర్ఎల్డీ 3 చోట్ల తమ అభ్యర్థులను పోటీకి ఉంచనున్నాయి. శుక్రవారం బెంగళూరు సెంట్రల్ ఎంపీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా కుటుంబంతో వచ్చి నామినేషన్ వేస్తున్న నటుడు ప్రకాశ్ రాజ్ మధురై నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు వస్తున్న ట్రాన్‌జెండర్ భారతి కన్నమ్మ -
‘దేవ్’ మూవీ స్టిల్స్
-
ఫోర్త్ గ్యాంగ్‌తో సంబంధం లేదు!
భయానికి కేరాఫ్ అడ్రస్ అనేలా సిల్వర్‌స్క్రీన్‌పై నటించి ప్రేక్షకుల మెప్పుపొందారు దండుపాళ్యం గ్యాంగ్. శ్రీనివాస్ రాజు దర్శకత్వంలో దండుపాళ్యం గ్యాంగ్‌గా పూజా గాంధీ, మకరంద్ దేశ్‌పాండే, రవి కాలే, రవి శంకర్ ముఖ్య పాత్రలుగా రూపొందిన చిత్రం ‘దండుపాళ్యం’. ఈ సినిమా హిట్ కావడంతో దండుపాళ్యం 2, దండుపాళ్యం 3 చిత్రాలను తెరకెక్కించారు శ్రీనివాస్ రాజు. ‘దండుపాళ్యం 3’ రిలీజ్‌కు రెడీ అయింది. దండుపాళ్యం సిరీస్‌లో ఇదే చివరిదని ఆయన ఇటీవల తెలిపారు. కానీ సడన్‌గా వెంకట్ అనే నిర్మాత సారథ్యంలో ‘దండుపాళ్యం 4’ తెరపైకి వచ్చింది. ‘‘ఈ దండుపాళ్యం 4తో నాకు ఎలాంటి సంబంధం లేదు. పోస్టర్‌పై నా ఫొటో ఉంది. అయితే నేను ఇందులో నటించడంలేదు. నటించమని నన్నెవరూ సంప్రదించలేదు. ‘దండుపాళ్యం 4’ పోస్టర్స్‌పై నా అనుమతి లేకుండా నా ఫొటోలను ఎలా వాడతారు’’ అని పూజగాంధీ పేర్కొన్నారు. మకరంద్ దేశ్‌పాండే అండ్ రవికాలే కూడా ‘దండుపాళ్యం 4’లో నటించడం లేదని స్పష్టం చేశారు. -
వింత వివాహం : కదిలే రైలులోనే..
పెళ్లి గురించి అందరూ చాలా కలలు కంటుంటారు. పెళ్ళంటే ఇంటి ముందు తాటాకులతో పందిరి వేయాలి. మామిడి ఆకులతో తోరణాలు కట్టాలి. అరిటాకుల్లో భోజనాలు పెట్టాలి. పెళ్ళంటే జన్మకి ఒకే సారి జరిగే పండుగ. రెండు మనసులు జీవితకాలం కలిసుండటానికి వేసే తొలి అడుగు. ఇలాంటి వేడుకను ఎక్కడ.. ఎలా.. జరుపుకోవాలని అందరూ ఆలోచిస్తుంటారు. ప్రస్తుత కాలంలో చాలా మంది తయ పెళ్లిని వైవిధ్యంగా జరుపుకుంటున్నారు. కానీ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ జంట గోరఖ్‌పూర్ నుంచి లఖ్‌నవూ వెళ్తున్న రైలులో పెళ్లి చేసుకున్నారు. అదే రైలులో ప్రయాణిస్తున్న శ్రీశ్రీ రవిశంకర్ ఈ వేడుకను దగ్గరుండి జరిపించారు. అనంతరం వధూవరులను ఆశీర్వదించారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన సచిన్ కుమార్ బదోహీలో ఫార్మాసిస్ట్‌గా పనిచేస్తున్నాడు. అతనికి అదే ప్రాంతానికి చెందిన జ్యోత్స్న సింగ్ పటేల్‌తో వివాహం నిశ్చయమైంది. జ్యోత్స్న సెంట్రల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్నారు. వీరిద్దరూ తమ పెళ్లిని కదిలే రైలులో జరుపుకోవాలనుకున్నారు. ఇందుకోసం రైల్వే డిపార్ట్మెంట్ వారిని సంప్రదించారు. దీనికి వారు అనుమతించడంతో.. బుధవారం వారు రైలులో పెళ్లి చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
హీరోగా బొమ్మాళీ...
‘వదల బొమ్మాళీ... నిన్నొదల’– వాయిస్‌తోనే ప్రేక్షకుల వెన్నులో వణుకు పుట్టించారు రవిశంకర్. ఇంతకీ, ఎవరీయన? ‘అరుంధతి’లో విలన్‌గా చేశారే... సోనూ సూద్. ఆయనకు డబ్బింగ్ చెప్పిందీయనే! జస్ట్... డబ్బింగ్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు, ఈయన నటుడు కూడా! పలు తెలుగు, తమిళ, కన్నడ సినిమాలు చేశారు. తెలుగులో ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘రామయ్యా వస్తావయ్యా’లో రవిశంకర్ విలన్‌గా చేశారు. ఇప్పుడీ రవిశంకర్ కన్నడలో ‘కాలేజ్ కుమార్’ అనే సినిమా చేశారు. అందులో ఈయన పాత్ర ఆల్మోస్ట్ హీరోలా ఉంటుందట! ‘‘మా సినిమాలో రవిశంకర్ హీరో అంటే తప్పేం కాదు. కానీ, పంచ్ డైలాగులతో లార్జర్ దేన్ లైఫ్ క్యారెక్టర్లా కాకుండా... ఓ డిఫరెంట్ రవిశంకర్‌ను చూస్తారు’’ అన్నారు ‘కాలేజ్ కుమార్’ దర్శకుడు శంతు. ఇక, రవిశంకర్ అయితే... ‘‘కొన్ని సిన్మాల్లో ఆఫ్‌బీట్ రోల్స్ తప్పిస్తే, నేనెక్కువగా విలన్ క్యారెక్టర్స్ చేశా. ఇందులో మిడిల్ క్లాస్ ఫాదర్‌గా డిఫరెంట్ రోల్ చేశా. నా అభిమానులకు ఈ సినిమా, అందులోని నా పాత్రలో ఓ సర్ప్రైజ్ కూడా ఉంది’’ అన్నారు. ఏంటో? ఆ సర్ప్రైజ్! అన్నట్టు... తెలుగులో మహేశ్‌బాబు ‘భరత్ అనే నేను’లోనూ రవిశంకర్ ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నారట!! -
జీఎస్టీ అంటే గబ్బర్ సింగ్ టాక్స్
గాంధీనగర్/న్యూఢిల్లీ: ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందే గుజరాత్ రాజకీయం వేడెక్కింది. కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు అమల్లోకి తెచ్చి దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. జీఎస్టీని ‘గబ్బర్ సింగ్ టాక్స్’గా ఆయన అభివర్ణించగా.. కాంగ్రెస్ నాటకాల పార్టీగా మారిందని కేంద్ర మంత్రి రవిశంకర్ విమర్శించారు. వరుస ఓటముల పాలవుతున్న కాంగ్రెస్‌కు ఏం చేయాలో తోచక ఇష్టమొచ్చిన విమర్శ చేస్తోందన్నారు. కాగా, ఆదివారం బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించిన పటేల్ వర్గం నేత నరేంద్ర పటేల్ మాట మార్చారు. తనకు బీజేపీ డబ్బులు ఆశచూపించిందని విమర్శించారు. ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది. కాగా, పటేల్ ఆందోళనకు నేతృత్వం వహించిన హార్దిక్ పటేల్ గాంధీనగర్‌లోని ఒక హోటల్లో రాహుల్‌తో 20 నిమిషాలసేపు సమావేశమైనట్లు విడుదలైన సీసీటీవీ ఫుటేజీ ఆసక్తి రేపుతోంది. మరోవైపు, ఓబీసీ నేత అల్పేశ్ ఠాకూర్ రాహుల్ సమక్షంలో పార్టీలో చేరారు. ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారు గాంధీనగర్‌లో జరిగిన బహిరంగ సభలో రాహుల్ బీజేపీ, మోదీలపై నిప్పులు చెరిగారు. జీఎస్టీని గబ్బర్ సింగ్ టాక్స్‌గా మార్చి దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతం చేశారని ఘాటుగా విమర్శించారు. ‘నవంబర్ 8న ఏం జరిగింది? టీవీ ముందుకొచ్చిన మోదీ.. రూ.500, రూ.1,000 నోట్లు నాకు నచ్చవు. అందుకే ఈ అర్ధరాత్రి నుంచి ఈ నోట్లను రద్దుచేస్తున్నానన్నారు. ఈ దెబ్బతో దేశం మొత్తంపై దాడిచేశారు. మళ్లీ కొన్ని రోజులకు టీవీ ముందుకొచ్చి నల్లధనాన్ని అదుపులోకి తీసుకురాలేకపోతే నన్ను ఉరితీయండన్నారు’ అని పేర్కొన్నారు. నోట్లరద్దుతోనే ఆగకుండా.. జీఎస్టీని తీసుకొచ్చారని విమర్శించారు. ‘జీఎస్టీ మా ఆలోచన. దేశమంతా అన్ని వస్తువులకు 18 శాతం పన్నుండాలని మేం భావించాం. కానీ దీన్ని కాస్త మార్చి బీజేపీ అమల్లోకి తీసుకురావటంతోనే ఈ సమస్యలు ఎదురవుతున్నాయి’ అని విమర్శించారు. ఇప్పుడు జీఎస్టీ 28 శాతం చేశారని అరుణ్‌జైట్లీని విమర్శించారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. ‘మోదీజీ మేకిన్ ఇండియా అంటారు. గుజరాత్‌లోనే 30 లక్షలమంది నిరుద్యోగులున్నారు’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. ‘తినను, తిననివ్వను అనే మోదీజీ .. అమిత్ షా కుమారుడు భారీగా తింటుంటే నోరెందుకు మెదపటం లేద’ని ప్రశ్నించారు. వెలకట్టలేని గుజరాత్ ఓట్లను కొనేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందన్నారు. కాంగ్రెస్ నాటకాల పార్టీ: రవిశంకర్ గుజరాత్ ఓబీసీ నేత అల్పేశ్ ఠాకూర్ మొదట్నుంచీ కాంగ్రెస్‌తోనే ఉన్నారని.. అతన్ని పార్టీలోకి చేర్చుకుంటున్నట్లుగా సభ పెట్టి ఆర్భాటం చేయటం కాంగ్రెస్ ఆడుతున్న నాటకమని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు. వరుసగా 22 ఏళ్లు గుజరాత్లో అధికారం దక్కకపోవటంతో నాటకాలు ఆడటం ద్వారానైనా అధికారంలోకి రావాలని రాహుల్ ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. ‘కాంగ్రెస్ పార్టీ ‘నంబర్ 1 నాటకాల పార్టీ’. పెద్ద నాయకుడు పార్టీలో చేరినట్లు హంగామా చేస్తున్నారు. ఠాకూర్ ఎన్ఎస్యూఐ సభ్యుడు. ఆయన తండ్రి జిల్లా కాంగ్రెస్ నాయకుడుగా ఉన్నారు’ అని మంత్రి విమర్శించారు. భారీగా కార్పొరేషన్లలో నియామకాలు గుజరాత్‌లోని 17 ప్రభుత్వ ఆధ్వర్యంలోని బోర్డులు, కార్పొరేషన్ల చైర్మన్లను నియమిస్తూ ఆ రాష్ట్ర సీఎం విజయ్ రూపానీ ఉత్తర్వులు జారీ చేశారు. బీజేపీలో చేరిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే బల్వంత్ సింగ్ రాజ్‌పుత్‌ను గుజరాత్ పారిశ్రామిక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించారు. వీటితోపాటుగా పౌర సరఫరాల కార్పొరేషన్, పోలీస్ గృహనిర్మాణ కార్పొరేషన్ తదితర కార్పొరేషన్లకూ చైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు. -
శాండల్‌వుడ్‌లో కురుక్షేత్ర
మహాభారత యుద్ధంలో ముఖ్యఘట్టమైన కురుక్షేత్రం పేరుతో కన్నడ సిని మా రాబోతోంది. అది కూడా సాదాసీదా బడ్జెట్, మామూలు నటీనటులతో కాదు. కళ్లుచెదిరే వ్యయం, తారాగణంతో కురుక్షేత్రకు రంగం సిద్ధమైంది. ఆ సినిమా చూడాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే అంటున్నారు నిర్మాత మునిరత్న. తెలుగు సినిమా రంగంలో భారీ బడ్జెట్‌తో నిర్మించిన బాహుబలి, బాహుబలి–2 సినిమాలు సూపర్‌హిట్ కావడం తో.. ఇదే దారిలో కన్నడ సినిమా రంగంలో కూడా భారీ బడ్జెట్‌తో సినిమా నిర్మాణానికి పునాది పడింది. బెంగళూరుకు చెందిన సినీ నిర్మాత మునిరత్న కురుక్షేత్ర పేరుతో రూ.60 కోట్ల బడ్జెట్‌తో ఈ కన్నడ సినిమా నిర్మిస్తున్నారు. ఆదివారం రాత్రి బెంగళూరు యశ్వంతపురలో ఉన్న ప్రభాకర్ కొరే సమావేశం హాల్లో ముహూర్తం షాట్‌ను సీఎం సిద్ధరామయ్య క్లాప్‌కొట్టి షూటింగ్‌ను ప్రారంభించారు. ఎంపీ బీ.కే. హరిప్రసాద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ వేడుకల్లో హీరోలు రవిచంద్రన్, దర్శన్‌తో పాటు రెబల్ స్టార్ అంబరీష్, నటి హరిప్రియ, ప్రముఖ నటులు అర్జున్ సర్జా, శశికుమార్, రవిశంకర్ పాల్గొన్నారు. దుర్యోధనునిగా హీరో దర్శన్ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ దుర్యోధనునిగా నటిస్తున్న ఈ సినిమా నిర్మాణం ఈ నెల 9వ తేదీ నుంచి షూటింగ్ ఆరంభమవుతుంది. షూటింగ్ మొత్తం హైదరాబాద్‌లోని ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. దీనికోసం 16 సెట్లను ఏర్పాటు చేసినట్లు నిర్మాత తెలిపారు. విరామం లేకుండా షూటింగ్ పూర్తి చేసి వచ్చే సంక్రాంతికి ప్రజల ముందుకు తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నారు. సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్‌ను రెడీ చేసినట్లు చెప్పారు. చిత్రం వ్యయం రూ.60 కోట్లుగా చెబుతున్నారు. హీరో దర్శన్‌కు ఇది 50వ సినిమా కావడం విశేషం. బహుబాష నటి స్నేహ ద్రౌపది పాత్రలో కనిపిస్తారు. సినిమాలోని ముఖ్య పాత్రలను పోషిస్తున్న నటులు భీష్ముడు : అంబరీష్ కృష్ణుడు : రవిచంద్రన్ కర్ణుడు : అర్జున్ ద్రోణాచార్యుడు : శ్రీనివాసమూర్తి ధృతరాష్ట్రుడు : శ్రీనాథ్ కుంతీదేవి : లక్ష్మి ధర్మరాజు : శశికుమార్ దుశ్శాసనుడు : రవిశంకర్ అభిమన్యుడు : నిఖిల్‌కుమార్ భీముడు : డ్యానిష్ నటి హరిప్రియ ఒక ప్రత్యేక నృత్యగీతంలో అలరించనుంది. మరికొంతమంది ప్రముఖ నటులూ సినిమాలో నటించనున్నారు. -
ఏఆర్ రెహ్మాన్ నిరాహార దీక్ష!
-
ఏఆర్ రెహ్మాన్ నిరాహార దీక్ష!
జల్లికట్టుకు అనుమతి ఇవ్వాలంటూ తమిళనాడులో నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఇప్పటికి నాలుగో రోజు కూడా చెన్నై మెరీనాబీచ్‌లో నిరసనకారులు అలాగే ఉన్నారు. అర్ధరాత్రి సమయంలోనూ అక్కడినుంచి కదల్లేదు. మరోవైపు జల్లికట్టుకు మద్దతుగా ప్రముఖులు కూడా రంగంలోకి దిగుతున్నారు. ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహ్మాన్ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రకటించారు. విద్యార్థులు మొదలుపెట్టిన ఈ నిరసన కాస్తా ఉద్యమ రూపాన్ని సంతరించుకుంది. లాయర్లు, నటులు, కళాకారులు, ఐటీ ఉద్యోగులు.. ఇలా అన్ని వర్గాల వాళ్లు వీటిలో పాల్గొంటున్నారు. జల్లికట్టును నిషేధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను తాము ధిక్కరించలేమని, ఇప్పుడు ప్రత్యేకంగా ఆర్డినెన్సు ఇవ్వలేమని కేంద్రం స్పష్టం చేయడంతో నిరసనలు మరింత తీవ్రతరమయ్యాయి. రెహ్మాన్ ఇప్పటికే తన నిరాహార దీక్ష విషయాన్ని ప్రస్తావించగా.. సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా తన అభిమానులకు పిలుపునిస్తారని ఆశిస్తున్నారు. ఆయనతో పాటు కమల్‌హాసన్ కూడా వ్యక్తిగతంగా జల్లికట్టు ఉండాల్సిందేనని ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే. మరోవైపు ఆధ్యాత్మిక గురువులు ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్, జగ్గీ వాసుదేవ్ లాంటి వాళ్లు కూడా నిషేధాన్ని ఉపసంహరించాలని కోరారు. జల్లికట్టు అనేది తమిళ సంస్కృతిలో భాగమని, అది సంక్రాంతి పండుగ సంబరాల్లో అంతర్భాగమని అన్నారు. జల్లికట్టుకు తాను మద్దతిస్తున్నానని, నిరసనలు శాంతియుతంగా జరగాలని కోరుకుంటున్నానని రవిశంకర్ ట్వీట్ చేశారు. సుప్రీంకోర్టులో సరైన వాస్తవాలతో మరో తాజా అప్పీలు దాఖలు చేద్దామన్నారు. జంతువులకు పండుగను అంకితం చేసే ఉత్సవం లాంటిదే జల్లికట్టు అని, ప్రజల సాంస్కృతిక బలాన్ని తీసేసుకుంటామంటే కుదరదని, ముఖ్యంగా పల్లెల్లో ఇవి చాలా ముఖ్యమని జగ్గీ వాసుదేవ్ అన్నారు. దారిలోనే ఉంది.. రెడీగా ఉండండి అయితే, ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి వచ్చిన తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మాత్రం జల్లికట్టుకు అందరూ సిద్ధంగా ఉండాలని ట్వీట్ చేశారు. 'బిగ్ డే' దారిలోనే ఉందని అందులో చెప్పారు. మరి అది ఎలా సాధ్యం అవుతుందో మాత్రం తెలియట్లేదు. ఎందుకంటే, జల్లికట్టు మంచి సంప్రదాయమే అయినా అది సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నందున దాని గురించి ఏమీ మాట్లాడలేమని ప్రధానమంత్రి స్వయంగా చెప్పారు. మరి పన్నీర్‌కు ఏరకమైన సూచన వచ్చిందో, జల్లికట్టు గురించి ఎలాంటి ప్రకటనలు వస్తాయో చూడాల్సి ఉంది. I'm fasting tomorrow to support the spirit of Tamilnadu! — A.R.Rahman (@arrahman) 19 January 2017 The way the #jallikattu protests are being held in peace is a lesson for the whole world. May everyone continue to maintain peace. — Mohammad Kaif (@MohammadKaif) 20 January 2017 Get ready for #Jallikattu The big day is on the way. — O. Pannerselvam (@CMOTamilNadu) 19 January 2017 The Tamilnadu Govt can itself issue an Ordinance to legalise #Jallikattu. @CMOTamilNadu should not bother about the Central Govt. RT pic.twitter.com/Spfm6nARpH — Markandey Katju (@mkatju) 19 January 2017 -
నోబెల్ బహుమతి ఇస్తానంటే.. వద్దన్నాను!
ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్ ఓ చిత్రమైన విషయం చెప్పారు. తనకు గతంలో నోబెల్ శాంతి బహుమతి ఇస్తామంటే.. వద్దని తిరస్కరించానన్నారు. ఇటీవల పాకిస్థానీ అమ్మాయి మలాలా యూసుఫ్జాయ్కి ఈ అవార్డు ఇవ్వడం కూడా సరికాదని, ఆమెకు ఆ అర్హత లేదని చెప్పారు. నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాల్సినంతగా ఆమె ఏమీ చేయలేదని ఆయన విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. తాను కేవలం పని చేయడాన్నే నమ్ముతాను తప్ప.. తనకు అవార్డులతో పనిలేదని చెప్పారు. అవార్డులు ఇచ్చేటప్పుడు దానికి తగిన అర్హత ఉందో లేదో చూసుకోవాలని, మలాలాకు ఆ అవార్డు ఇవ్వడం శుద్ధ దండగని అన్నారు. మహారాష్ట్రలోని లాతూర్ ప్రాంతానికి వెళ్లినప్పుడు ఆయనీ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇటీవలే భారత ప్రభుత్వం ఆయనను పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఆయన ఆ అవార్డు స్వీకరించారు. -
20 వేల వివాహాలు.. 35 లక్షల మంది అతిథులు
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ ప్యాకైపోయింది. ఎక్కడ చూసినా జనమేజనం. అన్ని రోడ్లూ కార్లతో నిండిపోయాయి. తెల్లవారు జామునుంచీ ఇదే పరిస్థితి. సూర్యుడు పడమరకు వాలుతున్నకొద్దీ ఇంకా కిక్కిరిసిపోనుంది. ఇలా ఎందుకు జరిగిందంటే.. ఢిల్లీ మహానగరంలో శుక్రవారం 20 వేల వివాహాలు జరగనుండటం సాధారణ కారణమైతే, ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ నిర్వహిస్తోన్న మెగా ఈవెంట్ కు 35 లక్షల మంది అతిథులు హాజరుకానుండటం ప్రధాన కారణం. ట్రాఫిక్ నియంత్రణ దుస్సాధ్యంగా మారుతున్న తరుణాన పోలీసులు కూడా చేసేదేమీలేక 'అయ్యలారా, అమ్మలారా.. దయచేసి ఈ ఒక్కరోజు రోడ్లపైకి రాకండి' అని జనాన్ని వేడుకుంటున్నారు. అక్కడి పరిస్థితికి సంబంధించిన మరికొన్ని ముఖ్యాంశాలు యమునా తీరంలోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఉత్సవ వేదికకు వెళ్లే వారంతా ఢిల్లీ- నోయిడా రహదారిపై నుంచే వెళుతుండటంతో ఉదయం నుంచే ఆ రోడ్డుపై ట్రాఫిక్ జామ్స్ కొనసాగుతున్నాయి. సాంస్కృతిక ఉత్సవం దృష్ట్యా పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేసినప్పటికీ నేటి వివాహాలతో రోడ్లు రద్దీగా మారాయి. కేవలం 1000 ఎకరాల్లోనే పార్కింగ్ స్థలాన్ని కేటాయించడంతో ముందు వచ్చిన వాహనాలను మాత్రమే పోలీసులు లోనికి అనుమతిస్తున్నారు. దీంతో సాయంత్రానికి యమునా తీరమంతా కార్లమయం అయ్యే అవకాశం ఉంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 11 వరకు వాహనాలు తీసుకొని బయటికి రావద్దంటూ సౌత్ ఢిల్లీలోని రింగ్ రోడ్డు, హైవే, నోయిడా లింక్ రోడ్లు, తూర్పు ఢిల్లీ లోని అక్షరధామ్ ఆలయం, మయూర్ విహార్ తదితర ప్రాంతాల ప్రజలకు పోలీసులు విజ్ఙప్తి చేస్తున్నారు. రవిశంకర్ వేడుక వద్ద 1700 మంది ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇవేకాక యమునా నదీతీరంలో వేడుక నిర్వహించినందుకుగానూ రూ.5 కోట్ల జరిమాన కట్టాలన్న గ్రీన్ ట్రిబ్యూనల్ ఆదేశాలను బేఖాతరు చేసిన నేపథ్యంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్ వ్యవహారం పార్లమెంట్ లోనూ హాట్ టాపిక్ గా మారింది. రవిశంకర్ చట్టానికి అతీతంగా ప్రవర్తిస్తున్నారంటూ విపక్షపార్టీలు ఫైర్ అయ్యాయి. వరల్డ్ కల్చరల్ ఫెస్ట్ కు ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్న సంగతి తెలిసిందే. కాగా గ్రీన్ ట్రిబ్యునల్ విధించిన రూ. 5 కోట్ల జరిమానా చెల్లించేందుకు 4 వారాల గడువు కావాలని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ కోరినట్టు తెలిసింది. -
రవిశంకర్‌కు సీఎం వీడియోకాల్
-
రవిశంకర్‌కు సీఎం వీడియోకాల్
చండీయాగానికి రావాలంటూ ఆహ్వానం సాక్షి, హైదరాబాద్: ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌ను అయుత చండీ మహాయాగానికి హాజరు కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆహ్వానించారు. షిల్లాంగ్‌లో ఉన్న రవిశంకర్‌తో ముఖ్యమంత్రి వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. ఈనెల 23 నుంచి 27 వరకు జరిగే చండీ యాగానికి వచ్చి ఆశీర్వాదం ఇవ్వాలని కోరారు. దీనికి రవిశంకర్ సానుకూలంగా స్పందించారు. నేడు శృంగేరీ మఠానికి సీఎం: శృంగేరీ మఠాధిపతిని చండీయాగానికి ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు కర్ణాటకలోని శృంగేరికి వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో మంగళూరుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో శృంగేరీ మఠానికి చేరుకుంటారు. భారతీ తీర్థ స్వామి, విధుశేఖర భారతీస్వామిని కలసి చండీ యాగానికి ఆహ్వానిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు తిరుగుపయనమవుతారు. -
'ఆర్ట్ ఆఫ్ లివింగ్'కు ఐఎస్ బెదిరింపు
పైశాచిక చర్యలతో ప్రజల్ని భయకంపితుల్ని చేస్తోన్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ దృష్టి ఇప్పుడు ధ్యాన కేంద్రాలపై పడింది. ప్రముఖ గురువు పండిట్ రవిశంకర్ సారధ్యంలోని 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' సంస్థ మలేషియా చాప్టర్‌కు ఐఎస్ ఉగ్రవాదులు శనివారం బెదిరింపు లేఖఖలు రాశారు. కార్యకలాపాలు నిలిపివేయని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరింస్తూ మూడు లేఖలు రాశారు. దీంతో రవిశంకర్ శిశ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఉగ్రవాదులు బెదిరింపు లేఖలు పంపిన మలేషియా శాఖలో ప్రతిరోజు ఉదయం 10 వేల మందికి పైగా యోగా తరగతులకు హాజరవుతారు. త్వరలోనే సుమారు 70 వేల మంది ప్రజలు పాల్గొనే సభలో పండిట్ రవిశంకర్ ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ భద్రత తమకు ప్రధానాంశమని, లేఖలు ఎవరు పంపారు, ఎలా పంపారనే విషయాల్ని త్వరలోనే ఛేదిస్తామని పోలీసులు తెలిపారు. భారత్‌తోపాటు ప్రపంచంలోని చాలా దేశాల్లో వందలకొద్దీ శాఖలున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ.. శాంతియుత జీవన సాధనా ప్రక్రియతోపాటు యోగాలోనూ శిక్షణనిస్తోంది. సంస్థ వ్యవస్థాపకుడు పండిట్ రవిశంకర్.. రెండు రోజుల కిందటే కాంబోడియాలో మరో శాఖను ప్రారంభించారు.