హీరోగా బొమ్మాళీ... | Director Santhu says his film 'College Kumar' has four strong pillars | Sakshi
Sakshi News home page

హీరోగా బొమ్మాళీ...

Published Mon, Nov 6 2017 12:35 AM | Last Updated on Mon, Nov 6 2017 12:35 AM

Director Santhu says his film 'College Kumar' has four strong pillars - Sakshi

‘వదల బొమ్మాళీ... నిన్నొదల’– వాయిస్‌తోనే ప్రేక్షకుల వెన్నులో వణుకు పుట్టించారు రవిశంకర్‌. ఇంతకీ, ఎవరీయన? ‘అరుంధతి’లో విలన్‌గా చేశారే... సోనూ సూద్‌. ఆయనకు డబ్బింగ్‌ చెప్పిందీయనే! జస్ట్‌... డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ మాత్రమే కాదు, ఈయన నటుడు కూడా! పలు తెలుగు, తమిళ, కన్నడ సినిమాలు చేశారు. తెలుగులో ఎన్టీఆర్‌ హీరోగా నటించిన ‘రామయ్యా వస్తావయ్యా’లో రవిశంకర్‌ విలన్‌గా చేశారు. ఇప్పుడీ రవిశంకర్‌ కన్నడలో ‘కాలేజ్‌ కుమార్‌’ అనే సినిమా చేశారు. అందులో ఈయన పాత్ర ఆల్మోస్ట్‌ హీరోలా ఉంటుందట! ‘‘మా సినిమాలో రవిశంకర్‌ హీరో అంటే తప్పేం కాదు.

కానీ, పంచ్‌ డైలాగులతో లార్జర్‌ దేన్‌ లైఫ్‌ క్యారెక్టర్‌లా కాకుండా... ఓ డిఫరెంట్‌ రవిశంకర్‌ను చూస్తారు’’ అన్నారు ‘కాలేజ్‌ కుమార్‌’ దర్శకుడు శంతు. ఇక, రవిశంకర్‌ అయితే... ‘‘కొన్ని సిన్మాల్లో ఆఫ్‌బీట్‌ రోల్స్‌ తప్పిస్తే, నేనెక్కువగా విలన్‌ క్యారెక్టర్స్‌ చేశా. ఇందులో మిడిల్‌ క్లాస్‌ ఫాదర్‌గా డిఫరెంట్‌ రోల్‌ చేశా. నా అభిమానులకు ఈ సినిమా, అందులోని నా పాత్రలో ఓ సర్‌ప్రైజ్‌ కూడా ఉంది’’ అన్నారు. ఏంటో? ఆ సర్‌ప్రైజ్‌! అన్నట్టు... తెలుగులో మహేశ్‌బాబు ‘భరత్‌ అనే నేను’లోనూ రవిశంకర్‌ ఓ ఇంపార్టెంట్‌ క్యారెక్టర్‌ చేస్తున్నారట!!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement