పెళ్లి గురించి అందరూ చాలా కలలు కంటుంటారు. పెళ్ళంటే ఇంటి ముందు తాటాకులతో పందిరి వేయాలి. మామిడి ఆకులతో తోరణాలు కట్టాలి. అరిటాకుల్లో భోజనాలు పెట్టాలి. పెళ్ళంటే జన్మకి ఒకే సారి జరిగే పండుగ. రెండు మనసులు జీవితకాలం కలిసుండటానికి వేసే తొలి అడుగు. ఇలాంటి వేడుకను ఎక్కడ.. ఎలా.. జరుపుకోవాలని అందరూ ఆలోచిస్తుంటారు. ప్రస్తుత కాలంలో చాలా మంది తయ పెళ్లిని వైవిధ్యంగా జరుపుకుంటున్నారు.
కానీ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ జంట గోరఖ్‌పూర్ నుంచి లఖ్‌నవూ వెళ్తున్న రైలులో పెళ్లి చేసుకున్నారు. అదే రైలులో ప్రయాణిస్తున్న శ్రీశ్రీ రవిశంకర్ ఈ వేడుకను దగ్గరుండి జరిపించారు. అనంతరం వధూవరులను ఆశీర్వదించారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన సచిన్ కుమార్ బదోహీలో ఫార్మాసిస్ట్‌గా పనిచేస్తున్నాడు. అతనికి అదే ప్రాంతానికి చెందిన జ్యోత్స్న సింగ్ పటేల్‌తో వివాహం నిశ్చయమైంది. జ్యోత్స్న సెంట్రల్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేస్తున్నారు. వీరిద్దరూ తమ పెళ్లిని కదిలే రైలులో జరుపుకోవాలనుకున్నారు. ఇందుకోసం రైల్వే డిపార్ట్‌మెంట్ వారిని సంప్రదించారు. దీనికి వారు అనుమతించడంతో.. బుధవారం వారు రైలులో పెళ్లి చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment