moving train
-
జస్ట్ మిస్.. లేదంటే..!
-
ఆకతాయి పనితో కదులుతున్న ట్రైన్ నుంచి దూకిన ప్రయాణికులు
కదులుతున్న ట్రైన్లో మంటలు చెలరేగుతున్నాయనే అకతాయిలు చేసిన పుకార్లు ప్రయాణికులు ప్రాణాల మీదకు తెచ్చాయి. ఉత్తరప్రదేశ్ బిల్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ప్యాసింజర్లు ప్రయాణిస్తున్న ట్రైన్లో మంటలు చెలరేగుతున్నాయని పుకార్లు వ్యాపించాయి. దీంతో ఆందోళనకు గురైన ప్రయాణికులు కదులుతున్న ట్రైన్ నుంచి బయటకు దూకారు. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు రైల్వే పోలీస్ అధికారులు తెలిపారు.మొరాదాబాద్ డివిజన్ పరిధిలోకి వచ్చే బిల్పూర్ స్టేషన్ సమీపంలోని హౌరా-అమృత్సర్ మెయిల్ జనరల్ కోచ్‌లో ఈ సంఘటన జరిగింది . గాయపడిన వారిని అన్వారీ (26), అఖ్తరీ (45), కుల్దీప్ (26), రూబీ లాల్ (50), శివ శరణ్ (40), చంద్రపాల్ (35)లుగా గుర్తించారు. ఆరుగురు ప్రయాణికులను షాజహాన్‌పూర్ మెడికల్ కాలేజీలో చేర్చినట్లు జీఆర్పీ స్టేషన్ ఇన్ఛార్జ్ రెహాన్ ఖాన్ వెల్లడించారు. రైల్వే స్టేషన్లో గందరగోళంరైలు బరేలీలోని బిల్పూర్ స్టేషన్‌కు చేరుకోగానే గందరగోళం నెలకొంది. రైలులో మంటలు చెలరేగిపోయాయనే పుకారుతో ప్రయాణికులు ఆందోళనకు గురైరయ్యారు. భయాందోళనతో ట్రైన్ చైన్ లాగారు. చాలా మంది ప్రయాణికులు ఇంకా కదులుతున్న రైలు నుండి దూకడంతో తీవ్రంగా గాయపడ్డారు.రైల్లో చోటు చేసుకున్న ఘటనపై రెహాన్ ఖాన్ మాట్లాడుతూ.. కొంతమంది ఆకతాయిలు గాల్లో మంటలు వ్యాపించాయనే పుకార్లు పుట్టించినట్లు మా దృష్టికి వచ్చింది. పుకార్లు చేసిన అనంతరం ట్రైన్ చైన్ లాగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) దర్యాప్తు చేస్తుందని ఆయన తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు. -
నడుస్తున్న రైలులో భార్యకు ట్రిపుల్ తలాక్!
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహాద్లో ట్రిపుల్ తలాక్ కేసు వెలుగులోకి వచ్చింది. కదులుతున్న రైలులో ఒక యువకుడు తన భార్యకు ట్రిపుల్ తలాక్ ఇచ్చాడు. ఈ క్రమంలో భార్యపై దాడిచేసి, రైలు నుంచి దూకి పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను వేడుకున్నారు.బాధితురాలు పుఖ్రాయాన్ పోలీస్ స్టేషన్లో భర్తపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఆమె భర్తతో సహా నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అదనపు కట్నం డిమాండ్ చేస్తూ తన భర్త విడాకులు ఇచ్చాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.ఈ ఉదంతం గురించి భోగానిపూర్ పోలీసు అధికారి మాట్లాడుతూ బాధితురాలు రాజస్థాన్‌కు చెందిన మహిళ అని, నఫీజుల్ హసన్ కుమారుడు మహమ్మద్ అసద్ ఆమెను వివాహం చేసుకున్నాడని తెలిపారు. ఆ తరువాత నుంచి భర్త మహ్మద్ అసద్ అత్తామామలు తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. తాజాగా భర్త తనకు ట్రిపుల్ తలాక్ చెప్పాడని ఆమె తెలిపారు. -
శభాష్ సుమతి.. ప్రయాణికుడి ప్రాణం కాపాడిన పోలీస్
రైలు ఎక్కేటప్పుడు.. దిగెటప్పుడు ప్రమాదాలు జరుగుతుంటాయి. రైలు కదులుతుంటే పట్టాలు, ప్లాట్‌ఫామ్ మధ్య ఇరుక్కొని కొంత మంది ప్రాణాలు కోల్పోతే.. మరికొంత మంది అక్కడే విధుల్లో ఉన్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్( ఆర్పీఎఫ్) పోలీసుల సాహసంతో ప్రాణాలు దక్కించుకున్నవారు ఉన్నారు. అటువంటి ఘటనే ఒకటి హరిద్వార్‌లో చోటుచేసుకుంది. ఓ మహిళా ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ రైలు కింది పడిన వ్యక్తిని సాహసంతో చాకచక్యంగా వ్యవహరించి ప్రాణాలను కాపాడారు. వివరాల్లోకి వెళ్లితే... ఉత్తరాఖండ్ హరిద్వార్‌కు సమీపంలోని లక్సర్ రైల్వే స్టేషన్లో ఓ ప్రయాణికుడు ఆహారం కోసం రైలు దిగాడు. అతను దిగిన రైలు కదలటంతో పరుగుపెట్టి మరీ ఎక్కడానికి ప్రయిత్నించాడు. కానీ, రైలు వేగంగా ఉండటంతో ఒక్కసారిగా డోర్ వద్ద అదుపుతప్పి రైలు పట్టాలు, ప్లాట్ మధ్యలో పడిపోయాడు. అప్పటికే రైలు కదులుతోంది. ప్రయాణికుడు రైలు కింద పడినట్లు శబ్దంతో రావటంలో అక్కడే విధుల్లో ఉన్న ఓ మహిళా ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ వెంటనే వచ్చి.. ముందుగా ఆ ప్రయాణికుడి తలను ప్లాట్‌పైకి లాగింది. వెంటనే రైలును అత్యవసరంగా ఆపారు. తర్వాత ఆ ప్రయాణికుడిని ప్లాట్‌ఫామ్‌కి లాగారు. క్షణాలో సమయస్ఫూర్తితో స్పందించిన ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ ఆ ప్రయాణికుడి ప్రాణాలు కాపాడారు. ప్రయాణికుడిని రక్షించి కానిస్టేబుల్ కే. సుమతి రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికుడిని కాపాడిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాహసంతో చాకచక్యంగా వ్యవహరించి.. ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. #viralvideo At Haridwar's Laksar railway station a passenger carrying food items from the railway station boarded the Calcutta-Jammutvi Express During this, his foot slipped and he got stuck between the train and the platform Woman constable Uma pulled him out safely#Uttarakhand pic.twitter.com/BvfnMqlPtQ— Siraj Noorani (@sirajnoorani) April 28, 2024 -
Video: కదులుతున్న రైలు ఎక్కబోయి జారిపడిన ప్రయాణికుడు
సాక్షి, వికారాబాద్: కదులుతున్న రైలు ఎక్కబోయి ఓ ప్రయాణికుడు రైల్వే ట్రాక్ మధ్యలో ఇరుక్కుపోయాడు. వెంటనే అప్రమత్తమైన తోటి ప్రయాణికులు, రైల్వే సిబ్బంది.. ట్రాక్ మధ్యలో చిక్కుకున్న వ్యక్తిని సురక్షితంగా బయటకు లాగారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన వికారాబాద్ రైల్వే స్టేషన్లో వెలుగుచూసింది. బీదర్ నుంచి యశ్వంతపూర్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు వికారాబాద్ రైల్వేస్టేషన్ నుంచి బయలు దేరింది. స్టేషన్ నుంచి ఓ ప్రయాణికుడు హుటాహుటినా పరుగెత్తుకొచ్చి కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో కాలుజారి ప్రమాదవశాత్తు రైలుకు, ట్రాక్‌కు మధ్య ఇరుక్కుపోయాడు. విషయం గమనించిన ప్రయాణికులు వెంటనే చైన్ లాగి రైలును ఆపారు. రైల్వే సిబ్బంది, పోలీసులు రెండు గంటలు శ్రమించి రైల్వే ట్రాక్ మధ్యలో ఇరుక్కున్న వ్యక్తిని కాపాడారు. ప్లాట్‌ఫాం పగులగొట్టి ప్రయాణికుడిని అతడిని బయటకు తీశారు. అతడికి స్వల్ప గాయాలవ్వగా.. వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది. గాయపడిన వ్యక్తిని రాయచూర్‌కు చెందిన సతీష్‌గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఇవి వైరల్‌గా మారాయి. ప్రయాణికుడిని కాపాడిన రైల్వే సిబ్బందిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి: ఏబీవీపీ కార్యకర్తను జుట్టుపట్టి ఈడ్చుకెళ్లిన ఘటన.. కానిస్టేబుల్ సస్పెండ్ A man slipped and got stuck between the train and platform, while attempting to board a moving train at #Vikarabad Railway Station and was dragged along, recorded in #CCTV . The alert passengers, RPF, railway officials saved the life of the passenger. (1/2)#Telangana pic.twitter.com/2iQDtUHSWd— Surya Reddy (@jsuryareddy) January 30, 2024 -
రైలే కళ్యాణ వేదిక!
కళ్యాణం వచ్చినా, కక్కొచ్చినా ఆగదు...అంటారు. కళ్యాణ ఘడియ ముంచుకొచ్చింది...అనుకున్నారేమో ఒక ప్రేమ జంట బెంగాల్–జార్ఖండ్ మూవింగ్ ట్రైన్లోనే దండలు మార్చుకున్నారు. ఆ తరువాత వరుడు వధువు మెడలో తాళి కట్టాడు. వధువు భావోద్వేగానికి గురై ఏడ్చింది. ఈ ‘రైలు పెళ్లి’ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బోగీలో ఉన్న ప్రయాణికులు ఈ పెళ్లి తంతు చూసి మొదట షాక్ తిన్నా ఆ తరువాత మాత్రం ఆశీర్వదించారు. ‘మల్టీ పర్సస్ ఇండియన్ రైల్వేస్’ ‘విమానంలో జరిగే పెళ్లి కంటే ఇది నయం. తక్కువ ఖర్చు కదా’... ఇలాంటి కామెంట్స్ నెటిజనుల నుంచి వచ్చాయి. ఇక మరో పెళ్లి విషయానికి వస్తే... దిల్లీకి చెందిన 27 సంవత్సరాల అవినాష్ కుమార్ డెంగ్యూ బారిన పడ్డాడు. బెడ్ మీద నుంచి లేవలేని పరిస్థితి. ఈలోపు పెళ్లిరోజు రానే వచ్చింది. దీంతో హాస్పిటల్లోనే వధువు మెడలో తాళి కట్టించి పెళ్లి చేశారు. -
జైపూర్-ముంబై ఎక్స్‌ప్రెస్‌లో కాల్పుల కలకలం.. నలుగురు మృతి
ముంబై: మహారాష్ట్ర: జైపూర్-ముంబై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ రైలులో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. కదులుతున్న రైలులో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌కు(ఆర్పీఎఫ్) చెందిన పోలీసు తన వద్దనున్న తుపాకీతో ప్రయాణికులపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆర్పీఎఫ్ ఏఎస్సై సహా నలుగురు మృత్యువాతపడ్డారు. జైపూర్ నుంచి ముంబై వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలులో సోమవారం ఉదయం 5 గంటలకు పాల్ఘర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ కాల్పులు జరిగాయి. కాల్పులు తెగబడిన వ్యక్తిని ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ సింగ్‌గా గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు బోరివలి స్టేషన్‌కు తరలించారు. దీనిపై దర్యాప్తు జరుపుతున్నారు. చదవండి: చిన్నారుల అక్రమ రవాణాలో యూపీ టాప్ VIDEO | Railway Protection Force (RPF) jawan opens firing inside Jaipur-Mumbai train killing four people: Official. The jawan has been arrested and brought to Borivali Police Station. pic.twitter.com/86cFwbt3cq — Press Trust of India (@PTI_News) July 31, 2023 -
రైలుకు వేలాడుతూ బిత్తిరి చర్య.. పట్టుతప్పితే అంతే సంగతులు!
పాట్నా: బీహార్ ఛప్రా జిల్లాలో ఓ రైలులో ప్రయాణిస్తున్న యువకుడు బిత్తిరి చర్యకు పాల్పడ్డాడు. కదులుతున్న ట్రైన్లో ఒక చేత్తో వేలాడుతూ మరో చేతిలో బెల్టు తోక వైపున పట్టుకుని బకిల్ తగిలేలా పక్క రైల్లో ప్రయాణిస్తున్న వారిని కొడుతూ కనిపించాడు. కదులుతున్న ఒక రైలు కంపార్టుమెంట్ డోర్ దగ్గర నిలబడి మరో ట్రైన్ డోర్ వద్ద కూర్చున్న వారిని బెల్టుతో కొడుతూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడు ఓ పోకిరి. పక్కనున్నవారు వాడు చేస్తోన్న పాడు పనికి వత్తాసు పలుకుతున్నారు. ఈ ఆకృత్యాన్ని వీడియో తీసి రైల్వే అధికారుల దృష్టికి తీసుకొచ్చాడు మరో యువకుడు. ట్విట్టర్లో వీడియో తోపాటు.. పక్క రైలులో డోర్ వద్ద కూర్చున్న వారిని బెల్టుతో కొడుతున్నాడు. ఇది కరెక్టేనా..? దీని వలన ఈ యువకుడితో పాటు అటువైపున్న వ్యక్తికి కూడా ప్రమాదమే. ఒకవేళ ట్రైన్ నుండి పడిపోయినా దారుణం జరుగుతుంది. దయచేసి ఇలాంటి సంఘ వ్యతిరేక వ్యక్తులపై చర్యలు తీసుకోండి.. అంటూ విజ్ఞప్తి చేశాడు. దీని బదులిస్తూ తూర్పు మధ్య రైల్వే.. ఈ సంఘటనను మా దృష్టికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. ఆ వ్యక్తిపై తగిన చర్యలు తీసుకంటామని తెలిపింది. ఇది కూడా చదవండి: మోదీజీ.. ! ‘నా భార్యా, పిల్లల్ని వెనక్కి పంపించండి’ यह व्यक्ति दुसरे ट्रेन में दरवाजे के पास बैठे लोगों को बेल्ट से मार रहा है, क्या यह सही है 🤔 इस व्यक्ति के बेल्ट से मारने के कारण दरवाजे में बैठा व्यक्ति ट्रेन से गिर भी सकतें है,बड़ी दुर्घटना भी हो सकती है कृपया ऐसे आसामाजिक आतंकी लोगों पर कड़ी कार्यवाही करें 🙏@RailMinIndia… pic.twitter.com/BQEgHWe9rO — देव 🚩 (@I_DEV_1993) July 7, 2023 -
కదులుతోన్న రైలులో గర్భిణి ప్రసవం
విజయనగరం టౌన్: బిహార్ రాష్ట్రం ఆనందపూర్‌కి చెందిన బిందుకుమారి అనే గర్భిణి ‘అలెప్పీ–ధనబాద్ రైలు (13352)లో కేరళ నుంచి ధనబాద్‌కు పుట్టింటికి వెళ్తోంది. విశాఖ దాటిన తర్వాత ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. తోటి ప్రయాణికుల సాయంతో కదులుతోన్న రైలులోనే విజయనగరం సమీపంలో వాష్ రూంలో మగబిడ్డను ప్రసవించింది. విజయనగరం రైల్వే స్టేషన్లో మెడికల్, ఆర్పీఎఫ్, కమర్షియల్, ఆపరేటింగ్ ఉద్యోగులు, సిబ్బంది జనరల్ బోగీలో ప్రయాణిస్తున్న ఆమె వద్దకు చేరుకున్నారు. రైల్వే వైద్యురాలు జ్యోతిప్రియ ప్రాథమిక చికిత్స చేసి అనంతరం 108లో జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. ఆర్పీఎఫ్ ఏఎస్ఐ కేఎస్ రత్నం, హెచ్‌సీ వి.అరుణ, కానిస్టేబుల్ ఎ.నాయుడు, సీటీఐ రెడ్డి, అప్పలరాజు, టీపీ బి.శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
Viral Video: రైలులో గొడవ.. యువకుడ్ని కిందకు తోసేసిన తోటి ప్రయాణికుడు
-
రైలులో గొడవ.. యువకుడ్ని కిందకు తోసేసిన తోటి ప్రయాణికుడు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో షాకింగ్ ఘటన జరిగింది. ఓ యువకుడ్ని తోటి ప్యాసెంజర్ కదులుతున్న రైలులోనుంచి కిందకు తోసేశాడు. ఇద్దరు గొడవపడిన అనంతరం ఆగ్రహంతో ఈ పని చేశాడు. అయితే యువకుడు రైలు నుంచి కిందపడిపోయినా అతడ్ని తోసేసిన వ్యక్తి ఏమాత్రం పశ్చాతాపం, ఆందోళన లేకుండా యథావిధిగా వెళ్లి తన సీట్లో కూర్చున్నాడు. హౌరా-మాల్డా ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌లో శనివారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. బాధిత యువకుడ్ని సజల్ షేక్‌గా గుర్తించారు. ఘటన అనంతరం ట్రాక్ పక్కన గాయాలతో స్పృహ కోల్పోయి పడి ఉన్న సజల్ షేక్‌ను గవర్నమెంట్ రైల్వే పోలీసులు చూసి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఒక్కరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే యువకుడు తోటి ప్రయాణికులతో అమర్యాదగా ప్రవర్తించాడని, సీటుపై కాలు పెట్టినట్లు తెలుస్తోంది. మహిళలతో దురుసుగా మాట్లాడాడని ఆ కంపార్ట్మెంట్లోని తోటి ప్రయాణికులు కొందరు చెప్పారని పోలీసులు పేర్కొన్నారు. అంతేకాదు షేక్ తమను బెదిరించాడని కూడా వారు ఆరోపించారని చెప్పారు. బాధిత యువకుడి స్టేట్మెంట్ మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. కాంపార్ట్‌మెంట్‌లో ఓ గుంపు గట్టిగా మాట్లాడుతూ, అరుస్తూ ఇతరులను ఇబ్బంది పెట్టిందని, పక్కన ఫ్యామిలీలు ఉన్నా పట్టించుకోకుండా అలాగే ప్రవర్తించారని ఆరోపించాడు. ఈ నేపథ్యంలోనే వాళ్లతో తాను గొడవపడినట్లు చెప్పాడు. ఓ ప్రయాణికుడ్ని బెదిరించేందుకు తన వద్ద ఉన్న బ్లేడు తీసినట్లు ఒప్పుకున్నాడు. అయితే గొడవ జరిగినప్పుడు అవతలి వ్యక్తి తనను రైలు నుంచి కిందకు తోసేస్తాడని ఊహించలేదని, క్షణాల్లోనే అంతా జరిగిపోయిందని చెప్పాడు. కిందపడ్డాక షాక్‌లో తాను స్పృహ కోల్పోయానని పేర్కొన్నాడు. చదవండి: కేదార్‌నాథ్‌లో కూలిన హెలికాప్టర్.. ఏడుగురు దుర్మరణం -
రైల్వే పట్టాలపై పడి ఉన్న బాలిక...వేగంగా వస్తున్న గూడ్స్ రైలుకు ఎదురెళ్లిన వ్యక్తి....ఐతే
Bhopal man jumps under moving train to rescue girl: ఇంతవరకు మనం తమ ప్రాణాలకు తెగించి కాపాడిన ధైర్యవంతులు గురించి విని ఉన్నాం. నిజానికి ఎవరైన తమకు వీలైనంత పరిధిలో లేదా సాథ్యమైనంత మేర వరకు సాయం చేయగలరు. కానీ మృత్యువుకి ఎదురెళ్లి మరీ అవతల వ్యక్తికి సాయం చేయడం అంటే నిజంగా మాములు విషయం కాదు. పైగా ఆ వ్యక్తిని ప్రశంసించేందుకు మాటలు కూడా సరిపోవు. అచ్చం అలాంటి సంఘటన భోపాల్‌లో చోటుచేసుకుంది. అసలు విషయంలోకెళ్తే...మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోని బర్ఖేడి ప్రాంతంలో మహ్మద్ మెహబూబ్ వృత్తిరీత్యా వడ్రంగి. అయితే మెహబూబ్ ఒక రోజు తన విధులు ముగించుకుని ఫ్యాక్టరీ నుంచి తన స్నేహితులతో కలిసి వస్తున్నాడు. ఇంతలో వెనుక వైపు నుంచి గూడ్స్ రైలు రావడంతో కాసేపు ఆగిపోయారు. అనుకోకుండా అదే సమయంలో తల్లిదండ్రులతో వస్తున్న ఒక బాలిక రైల్వే ట్రాక్‌పై పడిపోయింది. అయితే ఆమె రక్షించే వ్యవధి లేదు పైగా రైలు వేగంగా వచ్చేస్తుంది. దీంతో అందరూ ఆందోళనగా చూస్తుండిపోవడమే ఏంచేయలేని సంకట పరిస్థితి. అక్కడే ఉన్న మెహబూబ్ తన ప్రాణాలను లక్ష్య పెట్టక మెరుపువేగంతో రైలుకి ఎదురెళ్లాడు. ఆ రైల్వే పట్టాలపై పడి ఉన్న బాలిక చేతిని పట్టుకుని ట్రాక్ మధ్యలో కదలకుండా ఇద్దరూ పడుకుని ఉండిపోయారు. అంతేకాదు ఆమె భద్రత నిమిత్తం తల పైకెత్తనీయకుండా కిందకి ఉంచేలా పట్టుకున్నాడు. ఇంతలో గూడ్స్‌రైలు వేగంగా వారి మీద నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత వారిద్దరూ ఎలాంటి గాయాలు లేకుండా సురక్షింతంగా బయటపడ్డారు. ఈ మేరకు ఈ ఘటనకు సబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. Incredible bravery! 37 year old Mehboob was returning to his factory when he and some other pedestrians saw a goods train they stopped to let it pass a girl standing with her parents in fell on the tracks Mehboob sprinted dragged kept her head down @manishndtv @GargiRawat pic.twitter.com/IDqQiBLAv7 — Anurag Dwary (@Anurag_Dwary) February 12, 2022 -
వైరల్: ఒక్క క్షణం ఆలస్యమైతే ఆ గర్భిణీ పరిస్థితి ఏమయ్యేదో !
కదులుతున్న రైలు ఎక్కడం, దిగడం చేయకూడదన్న విషయం తెలిసిందే. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న కింద పడిపోయే ప్రమాదం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇప్పటికే చాలా వరకు కదులుతున్న రైలు ఎక్కబోతూ లేదా దిగబోతూ కలిగిన ప్రమాదాలకు గురైన వీడియోలు చూశాం. తాజాగా అలాంటి ఘటనే మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ముంబై సమీపంలోని వందన అనే 21 ఏళ్ల గర్భిణీ తన భర్త, పాపతో కలిసి కల్యాణ్ రైల్వేస్టేషనుకు చేరుకుంది. వారు గోరఖ్ పూర్ వెళ్లే రైలు ఎక్కాల్సి ఉంది. అయితే అనుకోకుండా వేరే రైలు ఎక్కారు. వారు ఎక్కిన రైలు తప్పు అని తెలిసి దిగే సమయానికి రైలు కదలటం ప్రారంభించింది. చదవండి: ‘అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ!’ శరత్‌పై దాడి దీంతో అంతే ఏం చేయాలో తెలియక అయోమయంలో దిగడానికి ప్రయత్నించారు. కదులుతున్న రైలు నుంచి దిగే క్రమంలో ప్లాట్ ఫాం మీద పడబోయింది. సరిగ్గా అదే సమయంలో స్టేషన్లో విధుల్లో ఉన్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) కానిస్టేబుల్ ఎస్ఆర్ ఖండేకర్ మహిళను పట్టుకొని బయటకు లాగేసరికి ప్రాణాలతో బయట పడింది. ఈ ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. చదవండి: సైలెంట్ అయిపోయిన డుగ్గుడుగ్గు బండి సైలెన్సర్స్ ఈ వీడియోను ముంబైలోని సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ శివాజీ సుతార్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. మహిళను కాపాడిన ఎస్ఆర్ ఖండేకర్ రియల్ హీరో అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అలాగే ఒకవేళ పోలీస్ అధికారి లేకుంటే ఏమయ్యేది అని, రైలు ఎక్కే.. దిగే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. Railway Protection Force (RPF) staff Shri S R Khandekar saved the life of a pregnant woman who had slipped while attempting to de-board a moving train at Kalyan railway station today. Railway appeals to passengers not to board or de-board a running train.@RailMinIndia pic.twitter.com/68imlutPaY — Shivaji M Sutar (@ShivajiIRTS) October 18, 2021 -
కదులుతున్న ట్రైన్ నుంచి దూకేసిన విద్యార్థులు
సాక్షి, ఆదిలాబాద్: బాసర రైల్వేస్టేషన్లో ప్రమాదం జరిగింది. కదులుతున్న ట్రైన్ నుంచి ముగ్గురు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు దూకేశారు. ఈ ఘటనలో ఓ విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి. ఎన్పీటీఈఎల్ (NPTEL) పరీక్ష కోసం నిజామాబాద్ వెళ్లేందుకు బాసర ట్రిపుల్ ఐటీ నుంచి 106మంది విద్యార్థులు బయల్దేరారు. అయితే వీరిలో ముగ్గురు అజంతా ఎక్స్‌ప్రెస్ ఎక్కబోయి.. పొరపాటున పర్భని పాసింజర్ ఎక్కారు. ట్రైన్ రన్నింగ్‌లో ఉండగా... అది తాము ఎక్కాల్సిన రైలు కాదని తెలిసి దూకేశారు. దీంతో ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. వీరిలో ఓ విద్యార్థికి తలపై బలమైన గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన విద్యార్థి వరంగల్ జిల్లాకు చెందిన సాయికుమార్‌గా తెలుస్తోంది. -
ఒక్క నిమిషంలో చచ్చి బతికాడు..!
గాంధీనగర్: రైలు, బస్సు అనే కాదు ఏ వాహనం అయినా కదులుతుండగా ఎక్కడం ప్రమాదం. దీని గురించి ఎంత చెప్పినా.. జనాలు మాత్రం చెవికెక్కించుకోరు. సర్కస్ ఫీట్లు చేస్తూ.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి గుజరాత్ అహ్మదాబాద్ రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను రైల్వే శాఖ తన ట్విటర్లో షేర్ చేసింది. వివరాలు.. పేరు తెలియని ఓ ప్రయాణికుడు ఆశ్రం ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కడం కోసం ప్లాట్‌ఫాం మీదకు వస్తున్నాడు. ఇంతలో రైలు కదలడం ప్రారంభించింది. దాంతో సదరు వ్యక్తి గబగబా పరిగెత్తుకు వెళ్లి మూవింగ్ ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఆ వ్యక్తి బోగిలోకి కాలు పెట్టాడో లేదో వెంటనే తలుపులు మూసుకుపోయాయి. దాంతో పట్టు కోల్పోయి పట్టాల మీద పడబోతుండగా.. అక్కడే విధులు నిర్వహిస్తున్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది అతడిని పైకి లేపి.. బోగిలోకి నెట్టి ప్రమాదం నుంచి కాపాడారు. సెకన్ల వ్యవధిలో ఆ వ్యక్తి మరణం అంచుల దాకా వెళ్లి వచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. A passenger tried to board moving 12915 Ashram Exp. at Ahmedabad Station but he slipped and was about to fall in between platform & train. He was promptly pushed back into the coach by the RPF staff. HOWEVER FIT AND SMART YOU ARE, PL. DONT TRY TO ENTRAIN/DETRAIN A MOVING TRAIN pic.twitter.com/TwIgK95ZIs — Ministry of Railways (@RailMinIndia) September 24, 2019 ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘ఈ సంఘటనతో అతనికి బుద్ధి వచ్చి ఉంటుంది. మళ్లీ జన్మలో ఇలాంటి ప్రయోగాలు చేయవద్దని నిర్ణయించుకుని ఉంటాడు’.. ‘ఇది కాకపోతే మరో రైలు.. కానీ ఈ జీవితం ముగిస్తే.. మరోటి లేదు. అలాంటిది ప్రాణాలను పణంగా పెట్టి మరి ఇంత రిస్క్ చేయడం అవసరమా’ అంటూ విమర్శిస్తున్నారు నెటిజన్లు. -
నెల్లూరుకు చెందిన విప్రో టెకీ దుర్మరణం
బెంగళూరు: టెక్ సేవల సంస్థ విప్రోలో మరో ఉద్యోగి ఆకస్మిక మరణం విషాదాన్ని రేపింది. ఇటీవల తల్లిదండ్రులకు వీడ్కోలు పలికేందుకు వచ్చి, కదులుతున్న రైలు దిగబోయి విప్రో టెకీ ఒకరు మరణించిన విషాద ఘటన మరువక ముందే మరో దుర్ఘటన చేసుకుంది. చెన్నైనుంచి బెంగళూరుకు వస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ కిరణ్‌కుమార్ కదులుతున్న రైల్లోంచి దిగబోతూ ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయారు. కెఆర్ పురం రైల్వేస్టేషన్లో గురువారం తెల్లవారుఝామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు చెందిన కిరణ్‌కుమార్(38) ఈ మధ్యనే స్విట్జర్లాండ్ నుంచి ఇండియాకు తిరిగి వచ్చారు. ప్రస్తుతం ఆయన బెంగళూరులోని రామమూర్తి నగర్లో ఉంటున్నారు. అయితే తన మూడు నెలల కుమారుడిని చూసేందుకు నెల్లూరు వచ్చిన కిరణ్ అనంతరం చెన్నై మెయిల్ ఎక్స్‌ప్రెస్‌లో బెంగళూరుకు బయలుదేరారు. కెఆర్‌పురం స్టేషన్లో స్టాప్ లేక పోయినప్పటికీ, త్వరగా ఇంటికి చేరాలనే ఆతృతలో రైలు కొద్దిగా స్లో కావడంతో దిగేందుకు ప్రయత్నించారు. అయితే అదుపు తప్పి, ప్లాట్‌ఫాం, ట్రాక్‌నకు మధ్యలో ఇరుక్కుపోయి చనిపోయారు. తీవ్ర గాయాలతో కిరణ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడని పోలీసు అధికారి సత్యప్ప ధృవీకరించారు. కాగా గత నెల డిసెంబరులో విప్రో ఉద్యోగి, కేరళకు చెందిన విక్రం విజయన్ (28) కదులుతున్న రైలునుంచి దిగడానికి ప్రయత్నించి ప్రాణాలు కోల్పోగా, గత ఏడాది ఫిబ్రవరిలో ఇదే రైల్వే స్టేషన్లో కదులుతున్న రైలు నుంచి దిగబోతూ ఈశ్వరమ్మ(65) చనిపోయారు. -
భీమవరం యువతి.. 12 గంటల నరకం
సాక్షి, భీమవరం: కదులుతున్న రైలులో నుంచి ప్రమాదవశాత్తూ జారిపడి, 12 గంటలపాటు నరకయాతన అనుభవించిన యువతిని కాపాడిన రైల్వే సిబ్బందిపై ప్రశంసలు కురుస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన తాలూకు వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయింది. వివరాల్లోకి వెళితే.. భీమవరంలోని శ్రీరామపురానికి చెందిన రాజేశ్వరి(21) బీఈడీ చదువుతోంది. పని నిమిత్తం గురువారం విజయవాడకు వచ్చిన ఆమె సాయంత్రం పూరి-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లో భీమవరానికి తిరుగు ప్రయాణమైంది. రైలు ఆకివీడు గుమ్ములూరు స్టేషన్‌కు సమీపం ప్రయాణిస్తున్నప్పుడు.. ప్రమాదవశాత్తూ కిందపడిపోయింది. ట్రాక్ పక్కన బురదగుంటలో పడటంతో అదృష్టవశాత్తూ ప్రాణాలు దక్కినా.. షాక్‌కు గురై, గాయాలతో పైకి లేవలేకపోయింది. అలా సుమారు 12 గంటలు నరకయాతన అనుభవించింది. శుక్రవారం ఉదయం అటుగా వచ్చిన కీ మ్యాన్ ఒకరు ఆమెను గుర్తించారు. వెంటనే సమీపంలో పనిచేస్తోన్న ట్రాక్మన్లను పిలిపించాడు. అందరూ కలిసి యువతిని బయటికి తీసి, బురదను శుభ్రంచేసి, కాసిన్ని నీళ్లు తాగించిన అనంతరం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువతి భీమవరం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మానవత్వాన్ని చూపించిన సిబ్బంది.. యాక్టింగ్ కీ మ్యాన్ గోపాల కృష్ణ, ట్రాక్ మ్యాన్లు మహేశ్, మణికుమార్, కనకేశ్వర్‌రావు, ఎం.రాంబాబులను ఉన్నతాధికారులు, పౌరసమాజం, నెటిజన్లు అభినందిస్తున్నారు. -
వింత వివాహం : కదిలే రైలులోనే..
పెళ్లి గురించి అందరూ చాలా కలలు కంటుంటారు. పెళ్ళంటే ఇంటి ముందు తాటాకులతో పందిరి వేయాలి. మామిడి ఆకులతో తోరణాలు కట్టాలి. అరిటాకుల్లో భోజనాలు పెట్టాలి. పెళ్ళంటే జన్మకి ఒకే సారి జరిగే పండుగ. రెండు మనసులు జీవితకాలం కలిసుండటానికి వేసే తొలి అడుగు. ఇలాంటి వేడుకను ఎక్కడ.. ఎలా.. జరుపుకోవాలని అందరూ ఆలోచిస్తుంటారు. ప్రస్తుత కాలంలో చాలా మంది తయ పెళ్లిని వైవిధ్యంగా జరుపుకుంటున్నారు. కానీ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ జంట గోరఖ్‌పూర్ నుంచి లఖ్‌నవూ వెళ్తున్న రైలులో పెళ్లి చేసుకున్నారు. అదే రైలులో ప్రయాణిస్తున్న శ్రీశ్రీ రవిశంకర్ ఈ వేడుకను దగ్గరుండి జరిపించారు. అనంతరం వధూవరులను ఆశీర్వదించారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన సచిన్ కుమార్ బదోహీలో ఫార్మాసిస్ట్‌గా పనిచేస్తున్నాడు. అతనికి అదే ప్రాంతానికి చెందిన జ్యోత్స్న సింగ్ పటేల్‌తో వివాహం నిశ్చయమైంది. జ్యోత్స్న సెంట్రల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్నారు. వీరిద్దరూ తమ పెళ్లిని కదిలే రైలులో జరుపుకోవాలనుకున్నారు. ఇందుకోసం రైల్వే డిపార్ట్మెంట్ వారిని సంప్రదించారు. దీనికి వారు అనుమతించడంతో.. బుధవారం వారు రైలులో పెళ్లి చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
దేవుడు జన్మనిస్తే.. అతను పునర్జన్మనిచ్చాడు..!
సాక్షి, ముంబై: ప్రయాణ సమయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని పెద్దలు చెబుతుంటారు. ఒక్కోసారి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం లేకపోలేదు. మన నిత్య జీవితంలో కొంతమంది కదులుతున్న రైలు నుంచి దిగడం మనం చూస్తుంటాం. పట్టు తప్పితే అంతే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఓ ప్రయాణికుడు కదులుతున్న ట్రైన్ నుంచి దిగడానికి ప్రయత్నించి రైలు కిందకు పడబోయ్యాడు. అక్కడే ప్లాట్ ఫామ్‌పై ఉన్న టీటీఈ కింద పడుతున్న ఆ వ్యక్తిని గమనించి, అతడ్ని సేవ్ చేశాడు. అతనికి దేవుడు జన్మనిస్తే.. ఆ వ్యక్తి పునర్జన్మను ఇచ్చాడు. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తొటి ప్రయాణికులు ఆ టీటీఈని పొకడ్తలతో ముంచెత్తారు. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. -
యూపీలో ఘోరం
సితాపూర్(ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్‌లో ఘోరం జరిగింది. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి ఓ మహిళను, ఆమె నలుగురు కూతుళ్లను నడుస్తున్న ట్రెయిన్ నుంచి బయటకు తోసేశాడు. ఈ ఘటనలో తల్లి, ఇద్దరు చిన్నారులు చనిపోగా మిగతా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలివీ.. బిహార్‌లోని మోతిహరీకి చెందిన ఇద్దు, ఇక్బాల్ అనే ఇద్దరు సోదరులు పంజాబ్‌కు పనుల కోసం వలస వెళ్లారు. ఇద్దుకు భార్య అఫ్రీన్, నలుగురు కుమార్తెలు ఉన్నారు. వీరంతా కలిసి అమృత్సర్- సహర్సా జన్ సేవా ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్నారు. అయితే, ఇద్దు, ఇక్బాల్ ఇద్దరూ మద్యం మత్తులో ఉండి గొడవపడుతున్నారు. ఆ సమయంలో రైలు లఖింపూర్ జిల్లా మైగల్గంజ్ ప్రాంతంలో ఉంది. మాటామాటా పెరిగి కోపంతో ఉన్న ఇక్బాల్.. పక్కనే ఉన్న అఫ్రీన్‌ను ఎత్తి బయటపడేశాడు. అనంతరం 12 ఏళ్లలోపు నలుగురు ఆడ పిల్లలు రబియా, అల్‌బుల్, సలీమా, మున్నిలను బయటకు విసిరేశాడు. వీరిలో అఫ్రీన్, రబియా, మున్ని తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోగా అల్‌బుల్(12), సలీమా(4) పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే, ఈ దారుణానికి ఒడిగట్టిన ఇద్దు, ఇక్బాల్‌లను మాత్రం పోలీసులు అరెస్ట్ చేయలేదు. బాధిత కుటుంబం గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు, విచారణ వేగవంతం చేసేందుకు మోతిహరి పోలీసులను సంప్రదిస్తున్నట్లు జీఆర్పీ సర్కిల్ ఆఫీసర్ ఏకే సింగ్ తెలిపారు. తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక నుంచి సమాచారం సేకరిస్తున్న పోలీసులు -
రెండేళ్ల బాలుడిని కదిలే రైల్లో నుంచి విసిరేసి..
ముంబై: రెండేళ్ల బాలుడిని ఓ కసాయి తండ్రి కదిలే రైల్లో నుంచి కిందకు విసిరేసిన దారుణ సంఘటన ముంబైలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖదీర్ ఖాన్ (40), సమీనా ఖాన్ (32) దంపతులు రంజాన్ సందర్భంగా వారం క్రితం నగరంలోని చౌకీ మొహల్లా నివాసం ఉంటున్న బంధువుల ఇంటికి వచ్చారు. వీరికి ఐదుగురు కూతుళ్లతో పాటు రెండేళ్ల కొడుకు కైఫ్ ఉన్నాడు. మంగళవారం మధ్యాహ్నం సమీనా బంధువులతో మాట్లాడుతూ కైఫ్ పిల్లలతో ఆడుకుంటున్నాడనుకుని పట్టించుకోకుండా వదిలేసింది. కాసేపటి తర్వాత కైఫ్ కోసం ఇల్లంతా వెతికినా కనిపించకపోవడంతో భర్తకు ఫోన్ చేసింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఖదీర్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో జేజే మార్గ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత సమీనాకు ఫోన్ చేసిన ఖదీర్... తానే కైఫ్ ను బైకుల్లా దగ్గరలో కదిలే రైల్లో నుంచి కిందకు విసిరేసినట్లు చెప్పాడు. ఖదీర్ చెప్పిన సమాచారాన్ని సమీనా పోలీసులకు చేరవేసింది. రంగంలోకి దిగిన అధికారులు రైల్వే పోలీసుల సాయంతో రైల్వే ట్రాక్ వద్ద బిడ్డ శవాన్ని కనుగొన్నారు. నిందితుడి ఆచూకీ లేకుండా పోవడంతో అతని కోసం గాలింపు ప్రారంభించారు. -
టికెట్ కొనకుంటే రైలులో నుంచి తోసేస్తారా?
భువనేశ్వర్: విశాఖపట్నానికి చెందిన పి.కృష్ణ 15 ఏళ్ల బాలుడు. ఒడిశాలోని కటక్ లో ఉంటోన్న బంధువుల దగ్గరికి వెళ్లేందుకు శనివారం ఒంటరిగా విశాఖ రైల్వే స్టేషన్ కు వచ్చాడు. అప్పటికే కోరమండల్ ఎక్స్ ప్రెస్ (చెన్నై- హౌరా) రైలు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. దాంతో పరుగున వెళ్లి ఒక బోగీలో ఎక్కేశాడు. దురదృష్టవశాత్తూ అది రిజర్వ్డ్ (ఎస్10) బోగీ.. పైగా తాను టికెట్ కూడా కొనలేదు. కొద్ది దూరం వెళ్లాక టీటీఈ ప్రత్యక్షమయ్యాడు. టికెట్ చూపించమని గదమాయిచాడు. భయంతో వణికిపోయిన బాలుడు.. టికెట్ కొనలేదని చెప్పాడు. అంతే.. టీటీఈకి కోపం ముంచుకొచ్చింది. ఆ కోపంలో విచక్షణ కోల్పోయి.. వేగంగా కదులుతున్న రైలులో నుంచి కృష్ణను కిందికి తోసేశాడు. తీవ్రంగా గాయపడ్డ ఆ బాలుడు ప్రస్తుతం భువనేశ్వర్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ట్రాక్ పక్కన గాయాలతో పడిఉన్న కృష్ణను జీఆర్ పీ పోలీసులు గుర్తించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. విశాఖపట్నంలో ఉంటోన్న బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అందించామని, రైలులో నుంచి తోసేసిన టీటీఈపై శాఖా పరమైన విచారణ జరుపుతామని రైల్వే అధికారులు మీడియాకు తెలిపారు. టికెట్ లేని ప్రయాణం నేరమే. అందుకు చట్టప్రకారం జరిమానా విధించడమో లేదా రైల్వే పోలీసులకు అప్పగించడమో చేయాలి. కాని ఇలా కదులుతున్న రైలులో నుంచి తోసివేయడం ఘోరనేరం కాదంటారా! -
కదులుతున్న రైల్లో నుంచి యువతి తోసివేత!
భోపాల్: ఇద్దరు దుండగులు ఓ యువతి వద్ద పర్సు, నగలు, సెల్‌ఫోన్ దొంగిలించి కదులుతున్న రైలు నుంచి ఆమెను కిందకు తోసేశారు. తలకు, ముఖానికీ తీవ్ర గాయాలైన బాధితురాలు భోపాల్ ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. మధ్యప్రదేశ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలోని ఓ ప్రై వేటు కంపెనీలో పనిచేస్తున్న రతీ త్రిపాఠీ(29), తల్లి మిత్యా త్రిపాఠీ, సోదరుడు ఆధ్యాత్మిక్‌తో కలసి ఉజ్జయిని మహాకాలేశ్వర్ ఆలయాన్ని దర్శించుకోవాలనుకున్నారు. తల్లి, సోదరుడు కాన్పూర్ నుంచి నేరుగా ఉజ్జయినీ చేరుకున్నారు. రతీ మంగళవారం ఢిల్లీ నుంచి మాల్వా ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్-7 బోగీలో ఉజ్జయినీ బయలుదేరారు. అయితే బుధవారం రతీ కోసం రైల్వేస్టేషన్‌కు వచ్చిన తల్లి, సోదరునికి ఆమె కనిపించలేదు. తోటి ప్రయాణికులను విచారించగా, సీటు విషయంలో జరిగిన ఘర్షణలో ఇద్దరు వ్యక్తులు ఆమెను కదులుతున్న రైల్లోంచి తోసేసినట్లు చెప్పారు. బినా ప్రాంతంలోని లలిత్పూర్, కరౌడా స్టేషన్ల మధ్య బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. దీంతో వారు బినా రైల్వేస్టేషన్‌కు చేరుకుని పోలీసులను విచారించగా, తీవ్రంగా గాయపడిన యువతిని రైల్వే ట్రాక్‌పై గుర్తించినట్టు తెలిపారు. వైద్యుల సూచన మేరకు ఆమెను భోపాల్‌లోని హమీదియా ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. దీంతో భోపాల్ చేరుకున్న వారు ఆస్పత్రిలో అపస్మాతరక స్థితిలో ఉన్న రతీని చూసి చలించిపోయారు. తన కుమార్తె పర్సు, సెల్ ఫోన్, చెవి రింగులు, చైన్ దుండగులు దోచుకున్నారని రతీ తల్లి మిత్యా త్రిపాఠీ ఆరోపించారు. ఈ ఘటన గురించి తోటి ప్రయాణికులు చెప్పినా రైల్లో ఉన్న భద్రతా సిబ్బంది పట్టించుకోలేదని ఆరోపించారు. ఇదిలా ఉండగా, నిందితులకు సంబంధించిన సమాచారం అందించిన వారికి 10 వేల రూపాయల రివార్డును పోలీసులు ప్రకటించారు. ** -
టికెటడిగినందుకు.. రైలు నుంచి తోసేశారు!
-
బేగంపేట రైల్వేస్టేషన్ లో మహిళా టీసీపై దాడి
హైదరాబాద్ : టికెట్ కలెక్టర్ గీత ఘటన మరవక ముందే మరో మహిళా టీటీఈపై దుండగులు దాడి చేశారు. ఈ సంఘటన బుధవారం ఉదయం బేగంపేట రైల్వేస్టేషన్లో చోటు చేసుకుంది. ఎంఎంటీఎస్ రైల్లో విధులు నిర్వహిస్తున్న టీటీఈ కౌసల్య టికెట్ అడిగినందుకు... ఎనిమిది మంది దుండగులు ఆమెపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది. వెంటనే చికిత్స నిమిత్తం కౌసల్యను లాలాగూడ రైల్వే ఆస్పత్రికి తరలించారు. కాగా దాడికి పాల్పడినవారిలో నలుగురిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగిలినవారి కోసం గాలిస్తున్నారు. మహిళా టీసీలపై దాడి చేయటం వారం రోజుల్లో ఇది రెండో సంఘటన. దాంతో మహిళా రైల్వే టీసీలు తమ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంగ్లీష్ కథనం కోసం.... ఈ నెల 18న టీసీ గీతను హఫీజ్ పేట రైల్వే స్టేషన్ లో దుండగులు కదులుతున్న రైల్లో నుంచి తోసేశారు. టికెట్ లేకుండా ప్రయాణించినందున జరిమానా కట్టాలని గీత అడిగిన పాపానికి దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారు. గతంలోనూ కేరళ ఎక్స్‌ప్రెస్‌లో విజయ్ కుమార్ అనే టీసీని దుండగులు రైల్లో నుంచి తోసివేయటంతో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. -
మహిళా టీసీని రైల్లో నుంచి తోసేశారు
హైదరాబాద్ : హైదరాబాద్ హఫీజ్‌పేట్ రైల్వేస్టేషన్లో శుక్రవారం దారుణం జరిగింది. టికెట్ అడిగినందుకు ఓ మహిళా టీసీని ...దుండగులు కదులుతున్న రైల్లో నుంచి తోసేశారు. ఈ ఘటనలో గాయపడిన టీసీ గీతను చికిత్స నిమిత్తం మెట్టుగూడ రైల్వే ఆస్పత్రికి తరలించారు. టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తున్నవారిని జరిమానా కట్టమన్నందుకు దుండగులు ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. రైలు లింగంపల్లి నుంచి సికింద్రాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గత నెల్లో కేరళ ఎక్స్‌ప్రెస్ లో ఇటువంటి సంఘటనే జరిగింది. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నప్రయాణికుడికి జరిమానా రాసిన కాజీపేట రైల్వేస్క్వాడ్‌గా పనిచేస్తున్న టికెట్ కలెక్టర్ విజయ్‌కుమార్ ను నలుగురు దుండగులు కదులుతున్న రైల్లో నుంచి కిందకు తోసేశారు. తీవ్రంగా గాయపడిన అతడు హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నాడు.