రైల్వే పట్టాలపై పడి ఉన్న బాలిక...వేగంగా వస్తున్న గూడ్స్‌ రైలుకు ఎదురెళ్లిన వ్యక్తి....ఐతే | Bhopal Man Under Moving Train To Save Girl Fallen On Track | Sakshi
Sakshi News home page

Viral Video: రైల్వే పట్టాలపై పడి ఉన్న బాలిక... వేగంగా వస్తున్న గూడ్స్‌ రైలుకు ఎదురెళ్లిన వ్యక్తి....ఐతే..

Published Sat, Feb 12 2022 12:21 PM | Last Updated on Sat, Feb 12 2022 1:24 PM

Bhopal Man Under Moving Train To Save Girl Fallen On Track - Sakshi

Bhopal man jumps under moving train to rescue girl: ఇంతవరకు మనం తమ ప్రాణాలకు తెగించి కాపాడిన ధైర్యవంతులు గురించి విని ఉన్నాం. నిజానికి ఎవరైన తమకు వీలైనంత పరిధిలో లేదా సాథ్యమైనంత మేర వరకు సాయం చేయగలరు. కానీ మృత్యువుకి ఎదురెళ్లి మరీ అవతల వ్యక్తికి సాయం చేయడం అంటే నిజంగా మాములు విషయం కాదు. పైగా ఆ వ్యక్తిని ప్రశంసించేందుకు మాటలు కూడా సరిపోవు. అచ్చం అలాంటి సంఘటన భోపాల్‌లో చోటుచేసుకుంది.

అసలు విషయంలోకెళ్తే...మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోని బర్ఖేడి ప్రాంతంలో మహ్మద్ మెహబూబ్ వృత్తిరీత్యా వడ్రంగి. అయితే  మెహబూబ్ ఒక రోజు తన విధులు ముగించుకుని ఫ్యాక్టరీ నుంచి తన స్నేహితులతో కలిసి వస్తున్నాడు. ఇంతలో వెనుక వైపు నుంచి గూడ్స్‌ రైలు రావడంతో కాసేపు ఆగిపోయారు. అనుకోకుండా అదే సమయంలో తల్లిదండ్రులతో వస్తున్న ఒక బాలిక రైల్వే ట్రాక్‌పై పడిపోయింది.

అయితే ఆమె రక్షించే వ్యవధి లేదు పైగా రైలు వేగంగా వచ్చేస్తుంది. దీంతో అందరూ ఆందోళనగా చూస్తుండిపోవడమే ఏంచేయలేని సంకట పరిస్థితి. అక్కడే ఉన్న మెహబూబ్‌ తన ప్రాణాలను లక్ష్య పెట్టక మెరుపువేగంతో రైలుకి ఎదురెళ్లాడు. ఆ రైల్వే పట్టాలపై పడి ఉన్న బాలిక చేతిని పట్టుకుని ట్రాక్‌ మధ్యలో కదలకుండా ఇద్దరూ పడుకుని ఉండిపోయారు. అంతేకాదు ఆమె భద్రత నిమిత్తం తల పైకెత్తనీయకుండా కిందకి ఉంచేలా పట్టుకున్నాడు. ఇంతలో గూడ్స్‌రైలు వేగంగా వారి మీద నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత వారిద్దరూ ఎలాంటి గాయాలు లేకుండా సురక్షింతంగా బయటపడ్డారు. ఈ మేరకు ఈ ఘటనకు సబంధించిన వీడియో​ నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement