
జోరుగా కురుస్తున్న వర్షాలు, ఉప్పొంగి పారుతున్న నదులు ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇటీవల జలపాతం అందాలను చూసేందుకు వెళ్లిన కుటుంబంలో ప్రమాదంలో చిక్కుకుంది. పుణేలోని లోనావాలా ప్రాంతంలో అందరూ చూస్తుండగానే నీటి ప్రవాహంలో కొట్టుకు పోయిన దృశ్యం విషాదాన్ని నింపింది. తాజాగా ఒక వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిలో తన బిడ్డలను అత్యంత సాహసోపేతంతో తండ్రి కాపాడుకున్న వైనం విశేషంగా నిలిచింది. ఇది ఎక్కడ, ఎలా జరిగింది అనే వివరాలు అందుబాటులో లేనప్పటికీ, ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. నాన్న పక్కనుంటే అలలైనా తలవొంచాల్సిందే అనే క్యాప్షన్‌తో లక్నోకు చెందిన శ్యామ్ యాదవ్ షేర్ చేశారు.
దీంతో నెటిజన్లు కూడ తండ్రి గొప్పతనాన్ని ప్రశంసిస్తూ కమెంట్స్ చేశారు. తండ్రి అన్న పదం వినగానే శక్తి వస్తుంది. ప్రపంచంలో తల్లిదండ్రులను మించిన గొప్ప శక్తి లేదు అని ఒకరు వ్యాఖ్యానించారు. శక్తివంతమైన అలలు వచ్చినపుడు నాన్న అయినా ఏమీ చేయలేడు. అత్యుత్సాహ ప్రదర్శించకుండా అప్రమత్తంగా ఉండాలని మరొకరు కమెంట్ చేశారు.
पिता साथ है, तो लहरों की क्या औकात pic.twitter.com/fqTjEXUZtr
— Shyam Yadav (@shyamyadav2408) July 5, 2024
Comments
Please login to add a commentAdd a comment