Bihar Girl Shares Video of Father Molested Her on Social Media to Seek Justice - Sakshi
Sakshi News home page

కూతురుపై తండ్రి అత్యాచారం.. వీడియో తీసి సోషల్‌ మీడియాలో!

Published Sat, May 7 2022 5:28 PM | Last Updated on Sat, May 7 2022 7:51 PM

Bihar Girl Shares Video Of Father Molested Her On Social Media To Seek Justice - Sakshi

పాట్నా: కూతురిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్న తండ్రే ఆమెపై కాటు వేశాడు. కామంతో కళ్లు మూసుకపోయి బాలికపై అత్యాచారానికి తెగబడ్డాడు. తండ్రి ప్రవర్తనతో విసుగు చెందిన యువతి ఆ వ్యవహరాన్ని వీడియో తీసింది. దానిని సోషల్‌ మీడియాలో పోస్టు చేసి తనకు న్యాయం జరగాలని పోలీసులను వేడుకుంది. ఈ వీడియో వైరల్‌ అవ్వడంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది.

వివరాలు.. నిందితుడు(50) సమస్తిపూర్‌లోని రోసెరా ప్రాంతంలో నివసిస్తున్నాడు. వృత్తి రీత్యా టీచర్‌. తన 18 ఏళ్ల కూతురిని కొన్ని రోజులుగా లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. ఒకటి కాదు, రెండు కాదు పలుమార్లు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఆమె తల్లికి కూడా తెలుసు. అయితే విషయం ఎవరికీ చెప్పొద్దని మామ ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. దీంతో తండ్రి బండరాన్ని ఎలాగైనా బయటపెట్టాలని భావించిన ఆ యువతి సీక్రెట్‌ కెమెరా ద్వారా వీడియో తీసింది. దానిని సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. తన తండ్రి నుంచి ప్రాణ భయం ఉందని, రక్షణ కావాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించింది. 

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పోలీసులు స్పందించారు. ఈ ఘటనపై రోసారా డీఎస్పీ సహియార్‌ అక్తర్‌ మాట్లాడుతూ.. కూతురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకన్నట్లు తెలిపారు. నిందితుడైన తండ్రిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. కేసుపై దర్యాప్తు చేస్తున్నామని, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 
చదవండి: మ్యాట్రిమోనితో వల.. మూడు పెళ్లిళ్లు చేసుకుని.. మరో పెళ్లికి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement