The Little Boy Rescued His Stuck Mother Lifting the Big Ladder Viral Video - Sakshi
Sakshi News home page

అమ్మకోసం...భళా బుడ్డోడా! వైరల్‌ వీడియో

Published Tue, Aug 8 2023 5:16 PM | Last Updated on Tue, Aug 8 2023 6:26 PM

The little boy rescued his stuck mother lifting the big ladder viral video - Sakshi

కన్నతల్లితో పిల్లలకుండే ప్రేమ,ఆప్యాయతలు, సాన్నిహిత్యంగురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒకరికోసం ఒకరు ప్రాణాలిచ్చుకునేంత గొప్పది వీరి అనుబంధం. అయితే సాధారణంగా అపాయంలో ఉన్న బిడ్డల్ని కాపాడుకునేందుకు ప్రాణాల్ని సైతం లెక్కచేయని వీరమాతల్ని గాథల్ని చూశాం. పెను ప్రమాదమైనా, కౄరమృగాలైనా, బిడ్డలకోసం మాతృమూర్తులు చేసే త్యాగాలకు వెలకట్టలేం. ఇలాంటి అనుభవాలు, కథనాలు చాలా  విన్నాం. చూశాం.  తాజాగా కష్టంలో ఉన్న అమ్మను ఆదుకునేందుకు ఒక  క్యూట్‌ బోయ్‌ చేసిన పని సోషల్‌ మీడియాలో ఒక  వీడియో వైరల్‌గా మారింది.  యాప్‌ సర్కిల్‌ కోఫౌండర్‌ ఈ వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఇప్పటికే ఇది వ్యూస్‌లో 1.6 మిలియన్లు దాటేసింది. 

విషయం ఏమిటంటే.. నిచ్చెన సాయంతో పనిచేసుకుంటున్న మహిళ ఉన్నట్టు  ఉండి ఆ నిచ్చెనపై పట్టు కోల్పోతుంది.  దీంతో నిచ్చెన కాస్త కిందపడిపోతుంది.  ఫలితంగా ఆ మహిళ పైనున్న ఒక దూలం లాంటిదాన్నిపట్టుకుని వేలాడుతూ ఉంటుంది. ఇది చూసిన బుడ్డోడు.. అదే మన లిటిల్‌ హీరో..వెంటనే రంగంలోకి దిగిపోయాడు. నిచ్చెన మెల్లిగా లేపి తల్లికి అందుబాటులోకి తీసుకొచ్చాడు. అంతేకాదు ఆమె దిగేదాకా ఆ ల్యాడర్‌ను జాగ్రత్తగా పట్టుకోవడం  ముచ్చటగా నిలిచింది దీనిపై నెటిజన్లు లిటిల్‌ హీరో అంటూ అభినందిస్తున్నారు.  (స్మార్ట్‌ఫోనే కొంపముంచిందా? పాపులర్‌ పబ్లిషింగ్‌ హౌస్‌ సీఈవో దుర్మరణం)

తన  హైట్‌తో పోలిస్తే అంత పెద్ద నిచ్చెన లేపడమేకాదు..చివరి వరకు ఎంత చక్కగా పట్టుకున్నాడు అంటూ ప్రశంసిస్తున్నారు. శారీరక బలం కంటే భావోద్వేగ బలం చాలా శక్తివంతమైంది అంటూ కమెంట్‌ చేశారు. మరికొందరు ఏమంత ఎత్తు ఉందని, ఆ పిల్లవాడిని అలా కష్టపెట్టకపోతే..దూకేయవచ్చు కదా అని కూడా కొంతమంది ట్వీట్‌ చేయడం గమనార్హం. (ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌: మహీంద్ర థార్‌పై బంపర్‌ ఆఫర్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement