ladders
-
ఎఫ్డీ విషయంలో ఈ పొరబాటు చేయకండి, ఇలా చేస్తే లాభాలు!
డిపాజిట్లపై వడ్డీ రేటు 8 శాతానికి చేరుకోవడంతో ఈ సమయంలో ఎఫ్డీలలో ఇన్వెస్ట్ చేయాలా..? లేక మరికొన్ని రోజులు వేచి చూడాలా? అన్నది ఎంతో మంది ఎదుర్కొంటున్న సందేహం. నిజానికి ఇక్కడి నుంచి వడ్డీ రేట్లు ఇంకా పెరగొచ్చు. లేదంటే కొంత విరామం తర్వాత రేట్లు తగ్గొచ్చు. మరి ఈ సమయంలో ఇన్వెస్ట్ చేసిన తర్వాత.. ఒకవేళ వడ్డీ రేట్లు పెరిగితే అదనపు రాబడి అవకాశాన్ని కోల్పోతామేమో..? అనుకునే వారు ఒక రకం అయితే.. ఈ రేట్లపై ఇన్వెస్ట్ చేయకపోతే, రానున్న రోజుల్లో ఆర్బీఐ రేట్లను తగ్గిస్తే అప్పుడు మెరుగైన రాబడి చాన్స్ మిస్ అవుతామేమో అనుకునే వారు ఇంకో రకం. ఇలాంటి అయోమయ వాతావరణాన్ని చూసి పెట్టుబడుల అవకాశాలను కోల్పోకూడదు. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, వాటికి తగినట్టు పెట్టుబడుల వ్యూహాలను అనుసరించడమే ఇన్వెస్టర్ల ముందున్న మెరుగైన మార్గం. ఇలాంటి తరుణంలో ఇన్వెస్టర్లు ‘ఎఫ్డీ లాడరింగ్’ (అంచెలంచెలుగా) విధానాన్ని అనుసరించొచ్చు. అంటే డిపాజిట్ మొత్తాన్ని ఒకేసారి గడువు తీరే విధంగా ఇన్వెస్ట్ చేసుకోకుండా ఉండడం. మున్ముందు ఏం జరుగుతుందోనన్నది అన్ని సందర్భాల్లోనూ అంచనా వేయలేం. అటువంటప్పుడు వడ్డీ రేట్ల అస్థిరతలను అధిగమించేందుకు ఎఫ్డీ లాడార్ ఉపయోగపడుతుంది. మెరుగైన రాబడులకు మార్గం చూపుతుంది. ఆర్బీఐ గడిచిన రెండు ద్రవ్య విధాన సమీక్షల్లో కీలకమైన రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. ద్రవ్యోల్బణం ఇప్పటికీ ఆర్బీఐ నియంత్రిత లక్ష్యానికి ఎగువనే చలిస్తోంది. దీంతో వడ్డీ రేట్ల పెంపునకు ముగింపు పడిందా? అంటే అవునని చెప్పలేని పరిస్థితి. త్వరలో వెలువడనున్న ఆగస్టు ద్రవ్యోల్బణం తదుపరి ఆర్బీఐ ఎంపీసీ నిర్ణయాలను ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదు. ద్రవ్యోల్బణం ఎగసి పడుతుండడంతో అదనపు సీఆర్ఆర్ రూపంలో బ్యాంకుల నుంచి ఆర్బీఐ మరింత లిక్విడిటీని తీసుకునే నిర్ణయాన్ని గత సమీక్షలో ప్రకటించింది. మరోవైపు యూఎస్ ఫెడ్ రానున్న సమీల్లో రేట్లను పెంచే అవకాశాలే ఉన్నట్టు సంకేతాలు తెలియజేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడులు పెట్టాలా? వేచి చూడాలా? అన్న సందిగ్ధత ఎదుర్కొనే వారు ఎఫ్డీ లాడార్ను అనుసరించొచ్చు. (వర్క్ ఫ్రం హోం: అటు ఎక్కువ పని, ఇటు హ్యాపీలైఫ్ అంటున్న ఐటీ దిగ్గజం) వడ్డీ రేట్ల అస్థిరతలకు చెక్ కాలానుగుణంగా వడ్డీ రేట్ల మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు ఎఫ్డీ లాడార్ సాయపడుతుంది. ఈ విధానంలో పెట్టుబడి మొత్తాన్ని ఒకే కాల వ్యవధికి ఇన్వెస్ట్ చేయకుండా.. వివిధ కాల వ్యవధుల మధ్య భాగాలుగా చేసుకోవాలి. సాధారణంగా వడ్డీ రేట్లు పడిపోతున్న తరుణంలో ఇన్వెస్టర్లు దీర్ఘకాలానికి కాకుండా స్వల్ప కాలానికి ఎఫ్డీలు చేస్తుంటారు. ఒకవేళ వడ్డీ రేట్లు మళ్లీ పెరగడం మొదలు పెడితే.. స్వల్పకాలానికి చేసిన ఎఫ్డీ గడువు తీరి చేతికి వస్తుందని, ఆ మొత్తాన్ని మెరుగైన రేటుపై మళ్లీ ఎఫ్డీ చేసుకోవచ్చని అనుకుంటారు. అదే మాదిరిగా, వడ్డీ రేట్లు పెరుగుతూ వెళుతుంటే అప్పుడు దీర్ఘకాలానికి ఎఫ్డీలు చేస్తుంటారు. ఒకవేళ అక్కడి నుంచి వడ్డీ రేట్లు పడిపోవడం మొదలు పెడితే.. అధిక రేటుపై ఎఫ్డీ చేసుకున్నట్టు అవుతుందని భావిస్తుంటారు. కానీ, ఇది సరైన విధానం కాబోదు. వడ్డీ రేట్లు అస్థిరంగా ఉన్న సమయంలో పెట్టుబడినంతా ఒకే ఎఫ్డీగా మార్చుకోవడం సరైన నిర్ణయం అనిపించుకోదు. ‘‘ఇన్వెస్టర్లు సాధారణంగా గరిష్ట రేటుపై ఎఫ్డీ చేసుకోవాలని చూస్తుంటారు. కానీ, ఆచరణలో ఇది చాలా కష్టం. భవిష్యత్ వడ్డీ రేట్ల గమనాన్ని అంచనా వేయడం రిస్‌్కతో కూడుకున్నదే అవుతుంది. దీనికి బదులు వడ్డీ రేట్ల చలనంతో వచ్చే రిస్‌్కను తగ్గించుకునేందుకు ఎఫ్డీ లాడరింగ్ ఒక టెక్నిక్’’అని ముంబైకి చెందిన సెబీ నమోదిత ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అభిజిత్ తాలూక్దార్ సూచించారు. ‘‘లాడరింగ్ను క్రమం తప్పకుండా అనుసరించినట్టయితే వడ్డీ రేట్ల మారి్పడికి భిన్నంగా లేకుండా ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో వడ్డీ రేట్లు కనిష్ట స్థాయిలో, కొన్ని సందర్భాల్లో వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిలో ఉండొచ్చు. ఎఫ్డీలను తిరిగి రెన్యువల్ చేసుకునే సమయంలో అప్పటి వరకు ఉన్న రేటు కంటే మెరుగైన రేటు రావొచ్చు. లేదంటే తక్కువ రేటు ఉండొచ్చు. కాకపోతే మొత్తం మీద నా పెట్టుబడులపై రేటు సగటుగా ఉంటుంది. ఎఫ్డీ లాడరింగ్తో మెరుగైన రేటుపైనే ఇన్వెస్ట్ చేయాలన్న సందిగ్ధత, అయోమయం తొలగిపోతుంది’’అని ‘ఇంటర్నేషనల్ మనీ మ్యాటర్స్’ సంస్థ ఎండీ, సీఈవో లోవై నవలకి వివరించారు. రాబడి సగటుగా మారి.. ఉదాహరణకు మీ వద్ద రూ.9 లక్షలు ఉన్నాయని అనుకుందాం. ఈ మొత్తాన్ని ఒకే ఎఫ్డీగా కాకుండా.. రూ.3 లక్షల చొప్పున మూడు భాగాలు చేసుకోవాలి. ఒక్కో భాగాన్ని వేర్వేరు కాల వ్యవధికి ఎఫ్డీగా మార్చుకోవాలి. ఏడాది, రెండేళ్లు, మూడేళ్లకు ఒకటి చొప్పున ఎఫ్డీగా మార్చుకోవాలి. మొదటి రూ.3 లక్షలు ఏడాదికి మెచ్యూరిటీ తీరి చేతికి వస్తుంది. ఈ మొత్తాన్ని తిరిగి మళ్లీ ఎఫ్డీ చేసుకోవాలి. వడ్డీ రేట్లు పెరుగుతూ వెళ్లే తరుణంలో అధిక రేటుపై ఎఫ్డీ చేసుకున్నట్టు అవుతుంది. అదే వడ్డీ రేట్లు క్షీణించే క్రమంలో అప్పటి వరకు చేసిన రేటు కంటే కొంచెం తక్కువకు ఎఫ్డీ చేసుకోవాల్సి వస్తుంది. కాకపోతే మిగిలి ఉన్న రెండు, మూడేళ్ల ఎఫ్డీలపై అధిక రేటు పొందినట్టు అవుతుంది. ఎఫ్డీ లాడార్ విధానం వల్ల ఇన్వెస్టర్ తన పెట్టుబడిపై పొందే రేటు సగటుగా మారుతుందని, మెరుగైన రాబడికి వీలు కలుగుతుందని అభిజిత్ తాలూక్దార్ వివరించారు. ∙ ఉదాహరణకు రూ.9 లక్షలను రూ.3 లక్షల చొప్పున ఏడాది, రెండేళ్లు, మూడేళ్ల కాలానికి ఎఫ్డీ చేశారని అనుకుందాం. 2018 జనవరి నుంచి 2020 డిసెంబర్ మధ్య ఈ ఎఫ్డీలు మెచ్యూరిటీ తీరేట్టుగా డిపాజిట్ చేశారు. అప్పుడు వడ్డీ రేట్లు క్షీణ బాటలో ఉన్నాయి. కనుక 6.5 శాతం, 6 శాతం, 4.7 శాతంపై ఎఫ్డీ చేసినట్టు అయింది. 2020 డిసెంబర్ చివరికి మూడు ఎఫ్డీలపై కలిపి రూ.1,63,500 రాబడిగా వచ్చి ఉండేది. అలా కాకుండా మొత్తం రూ.9 లక్షలను 2018 జనవరిలో మూడేళ్ల కాలానికి (2020 డిసెంబర్లో గడువు తీరే విధంగా) ఎఫ్డీ చేసి ఉంటే, అప్పుడు రూ.1,75,500 రాబడిగా వచ్చి ఉండేది. మూడు భాగాలుగా చేయడం వల్ల (ఎఫ్డీ లాడరింగ్) ఈ ఉదాహరణలో (వడ్డీ రేట్లు పడిపోయే క్రమంలో) రూ.12,000 తక్కువ రాబడి పొందినట్టు తెలుస్తోంది. ఇప్పుడు మరో ఉదాహరణలో.. 2021 జనవరి నుంచి 2023 జూలై వరకు ఇంతే మొత్తాన్ని మూడు భాగాలుగా ఎఫ్డీ చేసుకుని ఉంటే (4.25 శాతం, 5.50 శాతం, 6.75 శాతం) మొత్తం మీద వడ్డీ రాబడి రెండున్నరేళ్లలో రూ.1,35,000 వచ్చి ఉండేది. అలా కాకుండా రూ.9 లక్షలను 2021 జనవరిలో ఒకే ఎఫ్డీగా చేసి ఉంటే, దీనిపై రాబడి రూ.1,14,750గా ఉండేది. ఎఫ్డీ లాడర్ కారణంగా రూ.20,300 అధిక రాబడి వచ్చినట్టు తెలుస్తోంది. ‘‘క్షీణించే, పెరుగుతూ పోయే వడ్డీ రేట్ల సైకిల్‌ను పరిగణనలోకి తీసుకుని 2018–2023 కాలంలో ఎఫ్డీ లాడరింగ్ చేసి ఉంటే, ఈ మొత్తంపై రూ.8,250 అధిక రాబడికి అవకాశం లభించేది’’అని ముంబైకి చెందిన ఫిన్‌టెక్ సంస్థ ‘స్ట్రాటజీ’ ఇన్వెస్ట్మెంట్స్ హెడ్ ప్రశాంత బర్వాలియా వెల్లడించారు. ఏమిటి మార్గం..? నిజానికి వడ్డీ రేట్లు క్షీణించే క్రమంలో కంటే.. పెరుగుతున్న తరుణంలో, మిశ్రమంగా చలించే తరుణంలో ఎఫ్డీ లాడర్ ప్రయోజకరంగా ఉంటుంది. ఒక్క వడ్డీ రేట్లు క్షీణించే క్రమంలోనే ఎఫ్డీ లాడర్ వల్ల కొంత నష్టపోవాల్సి వస్తుంది. కానీ, ఇక్కడి నుంచి వడ్డీ రేట్లు పెరుగుతాయా? లేదంటే తగ్గుతాయా? వడ్డీ రేటు గరిష్ట స్థాయికి చేరినట్టు ధ్రువీకరించుకోగలరా..? సాధారణ ఇన్వెస్టర్లకు ఇది క్లిష్టమైన టాస్క్ అవుతుంది. వడ్డీ రేట్లు ఇక్కడి నుంచి కచి్చతంగా పెరుగుతాయని అనిపించినప్పుడే ఎఫ్డీ లాడర్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఊహలు, అంచనాలపై ఆధారపడకుండా అన్ని కాలాల్లోనూ ఎఫ్డీ లాడార్ చేసుకోవడం అనుకూలమైన విధానం. ఎఫ్డీ లాడర్‌తో వడ్డీరేట్ల అస్థిరతలను అధిగమించడంతోపాటు, మరో ప్రయోజనం కూడా ఉంది. లిక్విడిటీ సమస్య ఉండబోదు. ఏడాదికోసారి లిక్విడిటీ చేతికి అందుతుంది. రిటైర్మెంట్ తీసుకున్న వారికి క్రమం తప్పకుండా ఆదాయం అవసరం పడుతుంది. అటువంటి వారు మూడు నెలలు, ఆరు నెలలు, తొమ్మిది నెలలు, పన్నెండు నెలల కాలానికి ఒక్కో భాగం చొప్పున ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ‘‘ఎఫ్డీ లాడరింగ్ అనేది వడ్డీ రేటు, పెట్టుబడుల రిస్‌్కను తగ్గిస్తుంది. దీనికితోడు వివిధ కాలాల్లో స్థిరమైన నగదు ప్రవాహాలకు అవకాశం కలి్పస్తుంది. కాకపోతే ఏడాదిలోపు కాల వ్యవధులకు చేసే మినీ లాడర్‌పై తక్కువ రాబడి వస్తుంది’’అని రాకెట్ఫోర్ట్ ఫిన్‌క్యాప్ వ్యవస్థాపకుడు వెంకట కృష్ణన్ శ్రీనివాసన్ సూచించారు. ఇక డిపాజిట్ చేసే ముందు అందుబాటులోని వివిధ బ్యాంకులు ఆఫర్ చేస్తున్న వడ్డీ రేట్లను పరిశీలించాలి. మెరుగైన రేటును ఆఫర్ చేసే బ్యాంక్‌లో ఎఫ్డీ చేసుకోవడం ద్వారా రాబడిని పెంచుకోవచ్చు. సాధారణంగా బ్యాంకుల్లో ఎఫ్‌డీల కాలవ్యవధి ఏడు రోజుల నుంచి పదేళ్ల వరకు ఉంటుంది. ప్రస్తుతం అయితే 7.5 శాతం వరకు వడ్డీ రేటు ఎఫ్డీలపై లభిస్తోంది. 60 ఏళ్లు నిండిన వారికి అర శాతం అదనపు రేటు లభిస్తుంది. ఎఫ్డీ లాడార్లో వడ్డీ రేట్లు క్షీణించే క్రమంలో రాబడి తగ్గుతుంది. అయినా కానీ, ఈ విధానంపై నమ్మకం ఉన్న వారే దీన్ని ఎంపిక చేసుకోవాలి. ముఖ్య విషయం ఏమిటంటే.. ఏదైనా ఒక బ్యాంకులో అన్ని డిపాజిట్లు కలిపి రూ.5 లక్షలు మించకుండా, వేర్వేరు బ్యాంకుల్లో డిపాజిట్లు చేసుకోవాలి. దురదృష్టవశాత్తూ ఏదైనా బ్యాంకు సంక్షోభంలో పడినా, రూ.5 లక్షల వరకు బీమా రూపంలో వెనక్కి వస్తుంది. -
అమ్మకోసం...భళా బుడ్డోడా! వైరల్ వీడియో
కన్నతల్లితో పిల్లలకుండే ప్రేమ,ఆప్యాయతలు, సాన్నిహిత్యంగురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒకరికోసం ఒకరు ప్రాణాలిచ్చుకునేంత గొప్పది వీరి అనుబంధం. అయితే సాధారణంగా అపాయంలో ఉన్న బిడ్డల్ని కాపాడుకునేందుకు ప్రాణాల్ని సైతం లెక్కచేయని వీరమాతల్ని గాథల్ని చూశాం. పెను ప్రమాదమైనా, కౄరమృగాలైనా, బిడ్డలకోసం మాతృమూర్తులు చేసే త్యాగాలకు వెలకట్టలేం. ఇలాంటి అనుభవాలు, కథనాలు చాలా విన్నాం. చూశాం. తాజాగా కష్టంలో ఉన్న అమ్మను ఆదుకునేందుకు ఒక క్యూట్ బోయ్ చేసిన పని సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్‌గా మారింది. యాప్ సర్కిల్ కోఫౌండర్ ఈ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. ఇప్పటికే ఇది వ్యూస్‌లో 1.6 మిలియన్లు దాటేసింది. విషయం ఏమిటంటే.. నిచ్చెన సాయంతో పనిచేసుకుంటున్న మహిళ ఉన్నట్టు ఉండి ఆ నిచ్చెనపై పట్టు కోల్పోతుంది. దీంతో నిచ్చెన కాస్త కిందపడిపోతుంది. ఫలితంగా ఆ మహిళ పైనున్న ఒక దూలం లాంటిదాన్నిపట్టుకుని వేలాడుతూ ఉంటుంది. ఇది చూసిన బుడ్డోడు.. అదే మన లిటిల్ హీరో..వెంటనే రంగంలోకి దిగిపోయాడు. నిచ్చెన మెల్లిగా లేపి తల్లికి అందుబాటులోకి తీసుకొచ్చాడు. అంతేకాదు ఆమె దిగేదాకా ఆ ల్యాడర్‌ను జాగ్రత్తగా పట్టుకోవడం ముచ్చటగా నిలిచింది దీనిపై నెటిజన్లు లిటిల్ హీరో అంటూ అభినందిస్తున్నారు. (స్మార్ట్ఫోనే కొంపముంచిందా? పాపులర్ పబ్లిషింగ్ హౌస్ సీఈవో దుర్మరణం) తన హైట్‌తో పోలిస్తే అంత పెద్ద నిచ్చెన లేపడమేకాదు..చివరి వరకు ఎంత చక్కగా పట్టుకున్నాడు అంటూ ప్రశంసిస్తున్నారు. శారీరక బలం కంటే భావోద్వేగ బలం చాలా శక్తివంతమైంది అంటూ కమెంట్ చేశారు. మరికొందరు ఏమంత ఎత్తు ఉందని, ఆ పిల్లవాడిని అలా కష్టపెట్టకపోతే..దూకేయవచ్చు కదా అని కూడా కొంతమంది ట్వీట్ చేయడం గమనార్హం. (ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్: మహీంద్ర థార్‌పై బంపర్ ఆఫర్) 👦🦸♂️ The little boy rescued his stuck mother, lifting the big ladder all by himself! 👏👏👏 pic.twitter.com/h9Hw2ScZ67 — Tansu YEĞEN (@TansuYegen) August 7, 2023 -
ఆ చిన్నారి వెంటనే స్పందించకపోయి ఉంటే.. పాపం ఆ తల్లి...
అనుకోని ప్రమాదంలో పడితే పిల్లలను తల్లిదండ్రులు కాపాడుకోవడం అనేది సర్వసాధారణం. కానీ పెద్దలే అనుకోని ప్రమాదం భారిన పడి..నిస్సహాయ స్థితిలో ఉంటే ఆ సమయంలో పిల్లలు తమకు తోచిన విధంగా చేసి తల్లిదండ్రులను కాపాడటం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అబ్బా మనల్ని రక్షించేంత పెద్దవాళ్ల అయిపోయారంటూ తెగ మురిసిపోతాం. అచ్చం అలాంటి ఘటనే ఇక్కడ చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...ఇక్కడొక తల్లి ఒక నిచ్చెనపై నుంచుని గ్యారేజీ తలుపును రిపైర్ చేస్తోంది. ఐతే అనుకోకుండా నిచ్చెన అకస్మాత్తుగా కింద పడిపోతుంది. దీంతో తల్లి ఆ గ్యారెజ్ తలుపుకు వేలాడుతూ ఉంటుంది. పాపాం హెల్ప్ ..హెల్ప్ అంటూ అరుస్తుంది. పక్కనే ఉన్న చిన్నారి వెంటనే అక్కడ ఉన్న నిచ్చెనను ఏదో రకంగా తన చిట్టి చేతులతో లేపేందుకు ప్రయత్నించి తన తల్లి వేలాడుతున్న దగ్గర పెడతాదు. దీంతో ఆ తల్లి నిచ్చెన సాయంతో నెమ్మదిగా దిగిపోతుంది. అందుకు సంబంధించిన ఘటనను ఐపీఎస్ ఆఫీసర్ దీపాంషు కబ్రా ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి. (చదవండి: బ్రహ్మపుత్ర నదిలో ఈత కొడుతూ వస్తున్న పులి..షాక్‌లో ప్రజలు) माँ गैराज का दरवाज़ा रिपेयर कर रहीं थी कि तभी उनकी सीढ़ी गिर गयी. माँ ऊपर लटके देख नन्हे जांबाज़ ने पूरी जान लगाकर सीढ़ी को वापस लगाकर उनक़ी मदद क़ी... इस छोटे बच्चे क़ी सूझ-बूझ और हिम्मत क़ी जितनी प्रशांसा क़ी जाए कम है. pic.twitter.com/GjX6Ol3pid — Dipanshu Kabra (@ipskabra) December 23, 2022 -
వైరల్ వీడియో : బైక్‌ను నెత్తిన పెట్టుకొని మరీ బస్సెక్కించాడు
-
బైక్‌ను నెత్తిన పెట్టుకొని.. బస్సెక్కించాడు.. వైరలవుతున్న వీడియో
కుటుంబాన్ని పోషించేందుకు ప్రతి ఒక్కరూ రకరకాల పనులు చేస్తుంటారు. పొట్ట కూటి కోసం కొందరు ఎంత కష్టమైనా భరిస్తుంటారు. తమ శక్తికి మించి చెమట చిందిస్తారు. తాజాగా అలాంటి వ్యక్తికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాధారణంగా బైక్‌ను పైకి లేపేందుకు కూడా మనకు శక్తి సరిపోదు.. అలాంటిది ఓ వ్యక్తి బైక్‌ను తలపై పెట్టుకొని ఏకంగా బస్సు మీదకు ఎక్కించాడు. ముందుగా బైక్‌ను తన నెత్తిన పెట్టుకుని బస్సు దగ్గరకు నడుస్తూ వచ్చాడు. బస్సుకు ఎడమ పక్కగా ఉన్న ఇనుప గ్రిల్స్‌కు ఏర్పాటు చేసిన నిచ్చెన సాయంతో పైకి వచ్చాడు. తన మెడను బ్యాలెన్స్ చేసుకుంటూ బస్సు టాప్‌పైన ఉన్న క్యారియర్‌పై బైక్‌ను దించేశాడు. బైక్‌ను నెత్తిన పెట్టుకుని కొద్ది దూరం నడిచి బస్సు టాప్‌పైకి ఎక్కించారు. అయితే అది ఎక్కడ జరిగిందో, అతనెవరనేదానిపై స్పష్టత లేదు. గుల్జార్ సాహెబ్ అనే వ్యక్తి.. ఈ వీడియోను శుక్రవారం తన ట్విట్టర్లో షేర్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవ్వడంతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకు దీనిని 76 వేలకుపైగా మంది చూడగా, 5 వేలకుపైగా లైకులు వచ్చాయి. ఎలాంటి సాయం లేకుండా బైక్‌ను నెత్తిన పెట్టుకొని మోసిన వ్యక్తిని సూపర్ హీరో అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి: సత్యేందర్ జైన్ మరో వీడియో రిలీజ్ చేసిన బీజేపీ -
లంబాడాలను ఎస్టీల్లో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంలో పిటిషన్
-
చెరకు చెట్లకు నిచ్చెనలు!
అవును..!మట్టిని పూర్తిగా నమ్మిన రైతు ఎన్నడూ నష్టపోడు..!!ఈ నమ్మకాన్ని సజీవంగా నిలబెడుతున్నాడు ఓ యువ రైతు.మట్టిలోని సూక్ష్మజీవరాశి పంటలకు సంజీవనిలా పనిచేస్తూ రైతులకు సిరులు కురిపిస్తోంది. మట్టి ద్రావణాన్ని పంటలపై పిచికారీ చేస్తే అద్భుత దిగుబడులు సాధించవచ్చని ఆవిష్కరించిన ప్రముఖ రైతు శాస్త్రవేత్త చింతల వెంకటరెడ్డి విశేష కృషి క్రమక్రమంగా రైతు లోకానికి చేరువ అవుతోంది. రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపు మందులు వాడకుండా.. కేవలం మట్టి ద్రావణం, నూనెలతోనే.. చెరకు, పత్తి, కంది+మొక్కజొన్న తదితర పంటలను విజయవంతంగా సాగు చేస్తున్న యువ రైతు జగదీశ్ యాదవ్ విజయగాథ ఇది. మట్టిలో పెరిగే పంటలకు ఎటువంటి రసాయనిక ఎరువులు, పురుగుమందులూ అక్కరలేదని.. కేవలం మట్టి ద్రావణం చాలని యువ రైతు జగదీశ్ యాదవ్ స్వానుభవంతో చాటిచెబుతున్నారు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం పట్లూర్ గ్రామానికి చెందిన రైతు తుమ్మల మల్లయ్య, బుచ్చమ్మ దంపతుల మూడో కుమారుడు జగదీశ్ యాదవ్ డిగ్రీ వరకు చదువుకొని తండ్రి బాటలోనే వ్యవసాయం చేస్తున్నారు. 30 ఎకరాల పొలం ఉంది. గత ఏడాది వరకు రసాయనిక వ్యవసాయం చేస్తూ వచ్చిన జగదీశ్ ఈ ఏడాది సేంద్రియ పద్ధతుల్లో సాగుకు శ్రీకారం చుట్టారు. 12 ఎకరాల్లో చెరకు, మిగతా 18 ఎకరాల్లో బీటీ–2 పత్తి, కంది అంతరపంటగా మొక్కజొన్న, ఆలుగడ్డ తదితర పంటలను సాగు చేస్తున్నారు. ఈ పంటల్లో రసాయనిక ఎరువులు, పురుగుమందులు అసలు వాడటం లేదని జగదీశ్ చెప్పారు. పంటల ఎదుగుదల దశలో నూనెలను డ్రిప్‌తో పంటలకు అందిస్తున్నారు. దీంతోపాటు ప్రముఖ రైతు శాస్త్రవేత్త చింతల వెంకటరెడ్డి (సీవీఆర్) పద్ధతిలో మట్టి ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. అతి తక్కువ ఖర్చుతోనే మంచి దిగుబడులు సాధిస్తున్నారు. గత ఏడాది శనగ పంటలను రసాయనిక పద్ధతిలోనే సాగు చేశారు. శనగపచ్చ పురుగు ఆశించగా సీవీఆర్ పద్ధతి గురించి తెలుసుకొని ఎకరానికి 30 కిలోల లోపలి మట్టిని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేస్తే 5–7 రోజుల్లో పురుగు బెడద పోయిందన్నారు. ఆ స్ఫూర్తితో ఈ ఏడాది పంటలన్నిటినీ సీవీఆర్ పద్ధతిలోనే సాగు చేస్తున్నారు. 15 అడుగుల ఎత్తు పెరిగిన చెరకు 12 ఎకరాల్లో సాగు చేస్తున్న చెరకు తోట అసాధారణంగా 14–15 అడుగుల ఎత్తు పెరగటం విశేషం. గడ ఒకటి 3 కిలోల బరువు ఉండటంతో.. ఎకరానికి 70–80 టన్నుల దిగుబడి వస్తుందని జగదీశ్ ఆశిస్తున్నారు. ఈ నెల 20 నుంచి చెరకు నరికి ఫ్యాక్టరీకి తోలనున్నారు. తమ ప్రాంతంలో రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడిన వారి చెరకు తోటలు తమ తోట కన్నా సగం ఎత్తు మాత్రమే ఎదిగాయని, ఎకరానికి 40 టన్నులకు మించి దిగుబడి వచ్చే అవకాశం లేదన్నారు. వీరు ఎరువులకే ఎకరానికి రూ. 20 వేల వరకు ఖర్చు చేశారని, తాము 12 ఎకరాలకు 4 దఫాలలో మొత్తం కలిపి కేవలం 60 లీటర్ల నూనెలను వాడామని(ఖర్చు రూ. 5 వేలు) తెలిపారు. 80632 రకం 13 టన్నుల చెరకు విత్తనాన్ని వరుసల మధ్య 5 అడుగులు.. మొక్కల మధ్య అరడుగు దూరంలో మూడు కన్నుల ముచ్చెలను గత మార్చి 20న నాటారు. చెరకు సాగుకు ముందు 12 ఎకరాల్లో 15 రోజుల పాటు రూ. 25 వేల ఖర్చుతో గొర్రెలను మందగట్టారు. ఏప్రిల్ నుంచి జూలై వరకు 7 సార్లు సీవీఆర్ చెప్పిన విధంగా మట్టి ద్రావణాన్ని పిచికారీ చేశారు. పైమట్టి(భూమిపైన 6 అంగుళాల లోతు వరకు ఉన్న మట్టి) 15 కిలోలు, లోపలి మట్టి(భూమిలో 6 అంగుళాల లోతు నుంచి 4 అడుగుల లోతు వరకు ఉన్న మట్టి) 15 కిలోలను కలిపి 200 లీటర్ల డ్రమ్ముల్లో కలిపి ఎకరానికి పిచికారీ చేశామన్నారు. జేసీబీతో తన పొలంలో ఒక మూల నుంచి రెండు ట్రాక్టర్ల మట్టిని తీసి దాచిపెట్టుకొని ఉపయోగించామన్నారు. స్ప్రేయర్లకు అందనంత ఎత్తుకు పెరగటంతో జూలై నాటి నుంచి మట్టి ద్రావణం పిచికారీని కూడా నిలిపివేశానని జగదీశ్ యాదవ్ అన్నారు. ప్రస్తుతం 15 అడుగుల ఎత్తుకు పెరగటంతో జడలు వేయడానికి కూడా నిచ్చెనలు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడటం విశేషం. కలుపు, జడలు వేయటం, ఫ్యాక్టరీకి తోలకం తదితర ఖర్చులన్నీ పోను 12 ఎకరాలకు రూ. 22 లక్షల వరకు నికరాదాయం వస్తుందని భావిస్తున్నానని తెలిపారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకపోవటం వల్ల ఖర్చు తగ్గించుకోవటం సాధ్యమైంది. ఆ మేరకు పర్యావరణానికి జరిగే కీడును కూడా నివారించినట్టయింది. పత్తికి గులాబీ పురుగు సోకలేదు! కొన్ని ఎకరాల్లో బీటీ–2 రకం పత్తి, కంది+మొక్కజొన్న తదితర పంటలను కూడా ఈ ఏడాది రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా జగదీశ్ యాదవ్ సాగు చేయటం విశేషం. గులాబీ రంగు పురుగు తమ పొలంలో కనిపించలేదన్నారు. తెల్లదోమ, పచ్చదోమల నివారణకు ప్రతి 15 రోజులకోసారి మట్టి ద్రావణాన్ని(15 కిలోల పైమట్టి + 15 కిలోల లోపలి మట్టిని 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి) పిచికారీ చేశామన్నారు. దోమ ఉధృతంగా ఉందనిపిస్తే 10 రోజులకోసారి పిచికారీ చేశామన్నారు. పైమట్టి ద్రావణం వల్ల పంట ఏపుగా పెరుగుతుందని, లోపలి మట్టి ద్రావణం వల్ల చీడపీడలు దరిచేరకుండా ఉంటాయన్నారు. నూనెలను ఎకరానికి 4 లీటర్ల చొప్పున రెండు సార్లు డ్రిప్ ద్వారా అందించామన్నారు. సాధారణంగా పత్తి రైతులు రసాయనిక ఎరువులు, పురుగుమందులకు మాత్రమే ఎకరానికి రూ. 20 వేలకు పైగా ఖర్చు చేశారని, తాము ఎకరానికి మహా అయితే రూ. వెయ్యి మాత్రమే ఖర్చు చేశామన్నారు. మట్టి ద్రావణాన్ని తామే పిచికారీ చేసుకుంటామన్నారు. భారీ వర్షాల దెబ్బకు దిగుబడి తగ్గిందని అంటూ.. ఎకరానికి సగటున 9–10 క్వింటాళ్ల దిగుబడి వస్తుందన్నారు. ఎన్ని రసాయనిక ఎరువులు వేసినా ఇంత దిగుబడి రాదు! చింతల వెంకటరెడ్డి చెప్పినట్లు మట్టి ద్రావణంతోపాటు.. నూనెలను వాడటం వల్లనే ఆశ్చర్యకరమైన దిగుబడులు సాధించగలిగాను. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండానే చెరకు తోట అద్భుతమైన దిగుబడి ఇచ్చింది. పత్తిలో ఎకరానికి రూ. 20 వేల వరకు రసాయనిక ఎరువులు, పురుగుమందుల ఖర్చు తగ్గింది. రసాయనిక వ్యవసాయం చేసే ఇతర రైతులతో సమానంగా 8–11 టన్నుల దిగుబడి వస్తుంది. ఏ రకంగా చూసినా మట్టి ద్రావణం చక్కని ఫలితాలనిస్తున్నదని రెండేళ్లుగా వివిధ పంటలు సాగు చేసిన అనుభవంతో గ్రహించాను. ఇతర రైతులకూ ఇదే చెబుతున్నాను. – తుమ్మల జగదీశ్ యాదవ్ (80088 61961), పట్లూర్, మర్పల్లి మండలం, వికారాబాద్ జిల్లా (సీవీఆర్ మట్టి ద్రావణం గురించి పూర్తి వివరాలకు‘సాక్షి సాగుబడి’ ఫేస్బుక్ గ్రూప్ చూడండి.) – కె.సుధాకర్ రెడ్డి, సాక్షి, మర్పల్లి, వికారాబాద్ జిల్లా మట్టి ద్రావణం తయారీ -
ఆరని ఎన్నికల చిచ్చు!
గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసినా వాటి కారణంగా పల్లెసీమల్లో ఎర్పడిన వివాదాలు మాత్రం సమసిపోలేదు. ఓట్ల కోసం వర్గాలుగా ఏర్పడిన ప్రజలు చిన్నచిన్న కారణాలకే వాగ్వాదం, ఘర్షణకు దిగుతుండడంతో శాంతిభద్రతలకు భంగం వాటిల్లుతోంది. గోనెగండ్ల మండలం హెచ్. కైరవాడి గ్రామంలో ఇరువర్గాల మధ్య తలెత్తిన వివాదం చివరకు ఎస్సీలు కులవృత్తిని మానుకునే వరకు వచ్చింది. వివరాలు.. గ్రామంలో ఇటీవలే జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల మద్దతుతో బరిలో నిలిచిన అభ్యర్థి(ఎస్సీ) ఓడిపోగా ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన అభ్యర్థి(మాల) గెలిచారు. ఈ ఫలితాలతో ఇరువర్గాల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి. దీంతో గ్రామంలోని ఓ వర్గానికి చెందిన రైతులు పండించిన కూరగాయలు, ఇతర ఉత్పత్తులను లోడింగ్ చేయడంపై ఎస్సీ హమాలీల్లో విభేదాలొచ్చాయి. ఇదే క్రమంలో ఆదివారం ఒక వర్గానికి చెందిన చిన్నారి మరణించడంతో ఖననం చేసే నిమిత్తం గోతి తవ్వేందుకు పిలవగా మరో వర్గం ఎస్సీలు నిరాకరించారు. ఇందుకు ప్రతిగా ఆ వర్గం వారు తాము కూడా ఎస్సీలను ఏ పనులకు పిలిచేది లేదని ప్రకటించారు. గ్రామస్తుల సమాచారం మేరకు ఎస్ఐ వెంకట్రామిరెడ్డి సోమవారం గ్రామానికి వచ్చి ఇరువర్గాలవారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. కొందరు ఆయన అభిప్రాయంతో ఏకీభవించగా మరికొందరు ఒప్పుకోలేదు. దీంతో గ్రామానికి చెందిన చాకలి కులస్తులే శ్మశానంలో గోతి తవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇందుకు సంబంధించి ఎస్ఐ మాట్లాడుతూ ఇది సున్నితమైన సమస్య అని, ఇరువర్గాలవారు సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే మాత్రం చర్యలు తప్పవని ఇరువర్గాల వారిని హెచ్చరించారు. మరోమారు కౌన్సెలింగ్ ఇచ్చి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ఎస్ఐ విలేకరులతో తెలిపారు.