
అనుకోని ప్రమాదంలో పడితే పిల్లలను తల్లిదండ్రులు కాపాడుకోవడం అనేది సర్వసాధారణం. కానీ పెద్దలే అనుకోని ప్రమాదం భారిన పడి..నిస్సహాయ స్థితిలో ఉంటే ఆ సమయంలో పిల్లలు తమకు తోచిన విధంగా చేసి తల్లిదండ్రులను కాపాడటం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అబ్బా మనల్ని రక్షించేంత పెద్దవాళ్ల అయిపోయారంటూ తెగ మురిసిపోతాం. అచ్చం అలాంటి ఘటనే ఇక్కడ చోటు చేసుకుంది.
వివరాల్లోకెళ్తే...ఇక్కడొక తల్లి ఒక నిచ్చెనపై నుంచుని గ్యారేజీ తలుపును రిపైర్ చేస్తోంది. ఐతే అనుకోకుండా నిచ్చెన అకస్మాత్తుగా కింద పడిపోతుంది. దీంతో తల్లి ఆ గ్యారెజ్ తలుపుకు వేలాడుతూ ఉంటుంది. పాపాం హెల్ప్ ..హెల్ప్ అంటూ అరుస్తుంది. పక్కనే ఉన్న చిన్నారి వెంటనే అక్కడ ఉన్న నిచ్చెనను ఏదో రకంగా తన చిట్టి చేతులతో లేపేందుకు ప్రయత్నించి తన తల్లి వేలాడుతున్న దగ్గర పెడతాదు. దీంతో ఆ తల్లి నిచ్చెన సాయంతో నెమ్మదిగా దిగిపోతుంది. అందుకు సంబంధించిన ఘటనను ఐపీఎస్ ఆఫీసర్ దీపాంషు కబ్రా ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి.
(చదవండి: బ్రహ్మపుత్ర నదిలో ఈత కొడుతూ వస్తున్న పులి..షాక్‌లో ప్రజలు)
माँ गैराज का दरवाज़ा रिपेयर कर रहीं थी कि तभी उनकी सीढ़ी गिर गयी. माँ ऊपर लटके देख नन्हे जांबाज़ ने पूरी जान लगाकर सीढ़ी को वापस लगाकर उनक़ी मदद क़ी...
— Dipanshu Kabra (@ipskabra) December 23, 2022
इस छोटे बच्चे क़ी सूझ-बूझ और हिम्मत क़ी जितनी प्रशांसा क़ी जाए कम है. pic.twitter.com/GjX6Ol3pid