climbing
-
కిరాక్ క్లైంబింగ్.. గోడల నుంచీ కొండగుట్టల దాకా ఎక్కేసెయ్..!
సాక్షి, సిటీబ్యూరో: చెట్టులెక్కగలరా ఓ నరహరి పుట్టలెక్కగలరా.. చెట్టులెక్కి ఆ చిటారుకొమ్మన చిగురు కోయగలరా.. ఓ నరహరి చిగురు కోయగలరా.. చెట్టులెక్కగలమే ఓ చెంచిత పుట్టలెక్కగలమే.. చెట్టులెక్కి ఆ చిటారుకొమ్మన చిగురు కోయగలమే. ఓ చెంచిత బ్రమలు తీయగలమే.. అని అలనాటి చిత్ర కథానాయకుడు ఏఎన్ఆర్ పాడిన పాట ఎంతో పాపులర్.. ఆ మాదిరిగానే.. నేడు నగరంలో చెట్లు పుట్టలు ఎక్కడం సర్వసాధారణ ట్రెండ్‌గా మారుతోంది.. అయితే గుట్టలు, పుట్టలు, చెట్లు ఎక్కడం పల్లెల్లో సర్వసాధారణం..కానీ నగరంలో నాల్గు మెట్లు ఎక్కడానికి కూడా ఇబ్బంది పడడం ఇక్కడి ప్రజల నైజం. అయితే కొందరు నగరవాసులు మాత్రం గోడలు, గుట్టలు కూడా చకచకా ఎక్కేస్తున్నారు. ఆనందంతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇచ్చే సరదా క్రీడగా క్లైంబింగ్ హాబీ దినదిన ప్రవర్ధమానమవుతోంది.సూచనలు..– క్లైంబింగ్ చేయడానికి తగినంత శారీరక సామర్థ్యం ఉండాలి.– స్పోర్ట్స్ డ్రెస్సింగ్ కావాలి. అలాగే ప్రత్యేకమైన షూస్ తప్పనిసరి.– ఇందులో ఒకరికొకరు మంచి సపోరి్టంగ్గా ఉండాలి. ఎక్కే సమయంలో పడిపోవడం వంటివి ఉంటాయి.– అలాంటి సందర్భాల్లో ఒకరికొకరు సాయం చేసుకోవాలి.– అవుట్‌డోర్‌లో ప్రాథమిక దశలో చేసినప్పటికీ... రెగ్యులర్ క్లైంబర్‌గా మారాలంటే ఇన్డోర్ ట్రైనింగ్ తీసుకోవడం అవసరం.క్లైంబింగ్ అనేది ఇప్పటికే అంతర్జాతీయంగా ప్రాచుర్యంలో ఉన్న క్రీడ. అయితే ఇటీవలి కాలంలో నగరంలో దీన్ని ఒక మంచి ఎనర్జిటిక్ ఎంజాయ్‌మెంట్‌గా గుర్తిస్తున్నారు. ఇలా ఫన్గానూ ఫిట్నెస్ సాధనంగా క్లైంబింగ్‌ను అనుసరించేవారి కోసం పలు చోట్ల వాల్స్ అందుబాటులోకి వచ్చాయి. షాపింగ్ మాల్స్, అడ్వెంచర్ జోన్స్‌లో అన్నింటితో పాటు క్లైంబింగ్ ప్రదేశాలు కూడా ఉండగా, కేవలం క్లైంబింగ్ కోసమే కొన్ని ప్రత్యేకమైన సెంటర్లు, హాబీగా చేసే క్లబ్స్ కూడా వచ్చేశాయి. ఈ అభిరుచి వాల్స్ నుంచి రాక్స్ దాకా విస్తరించి సిటీయూత్‌కి చక్కని వ్యాపకంగా మారిపోయింది.క్లైంబింగ్ కథా కమామీషు ఇలా.. క్లైంబింగ్ వాల్ ఎత్తు 15 అడుగులు అంతకన్నా లోపుంటే బౌల్డరింగ్ సెగ్మెంట్ అంటారు. ఈ సెగ్మెంట్లో పాల్గొనేవాళ్ల కోసం కిందపడినా గాయాలు కాకుండా ఫ్లోర్ మీద పరుపులు వేసి ఉంచుతారు. ఇక లీడ్ క్లైంబింగ్లో గోడ 30–40 అడుగుల ఎత్తుపైన ఉంటుంది. సరిపడా ఆత్మవిశ్వాసం ఉండి, భయం లేకుండా ఉంటేనే లీడ్ క్లైంబింగ్ చేయగలరు. దీనిలో గోడకు హ్యాంగర్స్ ఉంటాయి. దీనికి తగినంత శారీరక సామర్థ్యం ఉండాలి. ఈ రెండూ కాకుండా వేగం ప్రధానంగా సాగే ఈ స్పీడ్ క్లైంబింగ్ చాలా వరకూ ప్రొఫెషనల్స్ మాత్రమే ఎంచుకుంటారు. దీనిలో క్రీడాకారుడు రోప్ కట్టుకుని వాల్ మీద ఎక్కుతాడు. ఎంత స్పీడ్ ఉంటుందంటే చూడడానికి నేల మీద పరుగులు తీసినట్టు ఉంటుంది.పర్సనల్‌గా.. ఇంట్లోనే..వీటిని ఇంట్లో కూడా వ్యక్తిగతంగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఆరి్టఫీషియల్ వాల్ని ఫైబర్‌తో చేసి సపోర్ట్ స్ట్రక్చర్ సాలిడ్ వుడ్, లేదా స్టీల్ ఉంటుంది. అయితే వుడ్ ఖరీదు ఎక్కువ కాబట్టి.. స్టీల్ బెటర్. క్లైంబింగ్ సర్ఫేస్‌గా ప్లైవుడ్ లేదా ఫైబర్ గ్లాస్ గాని వాడి చేసే 8 విడ్త్ 12 ఫీట్ హైట్ వాల్కి రూ.లక్ష ఖర్చులోనే అయిపోతుంది. అదే 24 ఫీట్ వాల్కి అయితే రూ.4 లక్షలు వరకూ అవుతుంది.ఎక్కేయాలంటే.. లుక్కేయాలి..నగరం ఒకప్పుడు రాక్స్‌కి నిలయం.. అద్భుతమైన రాళ్ల గుట్టలు, కొండ గుట్టలు మన ప్రాంతానికి ప్రత్యేకంగా ఉండేవి. అభివృద్ధి బారిన పడి చాలా వరకూ కనుమరుగయ్యాయి. నగరంతో పాటు చుట్టుపక్కల ఉన్న ఖాజాగూడ, మహేంద్రా హిల్స్, ఘర్ ఎ మొబారక్, అడ్డకల్, మర్రిగూడెం, పాండవుల గుట్ట, భువనగిరి లతో పాటు కర్నూలు దాకా వెళ్లి ఓర్వకల్ రాక్ గార్డెన్స్‌లో సైతం క్లైంబింగ్ చేస్తున్నారు. ఫన్ ప్లస్ ఫిట్నెస్..లీడ్, స్పీడ్ క్లైంబింగ్‌లు ఈ క్రీడను సీరియస్ హాబీగా తీసుకున్నవారికి మాత్రమే కావడంతో బౌల్డరింగ్ ఒక ఫన్ యాక్టివిటీగా, ఫిజికల్ ఫిట్‌నెస్‌కు ఉపకరించేదిగా ఇప్పుడు ఆకర్షిస్తోంది. దీంతో జిమ్స్‌లోనూ ఈ బౌల్డరింగ్ వాల్స్ కొలువుదీరుతున్నాయి. గంట పాటు బౌల్డరింగ్ చేస్తే 900 కేలరీలు బర్న్ అవుతాయని, ఒక గంటలో చేసే పరుగు అరగంట పాటు చేసే క్లైంబింగ్‌తో సమానమని నిపుణులు చెబుతున్నారు. అంతేకాక శరీరంలో టాప్ టూ బాటమ్ అన్ని అవయవాలనూ ఇది బలోపేతం చేస్తుందని అంటున్నారు. వయసుకు అతీతంగా దీన్ని సాధన చేయవచ్చు. హై ఎనర్జీ, హైపర్ యాక్టివిటీ ఉన్న చిన్నారులకు ఇప్పుడు వాల్ క్లైంబింగ్ బాగా నప్పే హాబీగా నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా నలుగురితో కలిసి చేసే గ్రూప్ యాక్టివిటీ కాబట్టి అలసట ఎక్కువగా రాదు. శరీరానికి బ్యాలెన్సింగ్ సామర్థ్యం పెరుగుతుంది. కోర్ మజిల్స్ శక్తివంతంగా మారతాయి. చేతులు, కాళ్ల మజిల్స్ టోనప్ అవుతాయి.కొండకు తాడేసి..వీకెండ్ క్లైంబింగ్ ఈవెంట్స్ జరగడం ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయింది. నగరంలో హైదరాబాద్ క్లైంబర్స్ పేరుతో ఒక క్లబ్ కూడా ఏర్పాటైంది. ఈ క్లబ్ సభ్యులు ప్రతి వారం ఒక రాక్ ఏరియాను ఎంచుకుని క్లైంబింగ్‌కి సై అంటున్నారు. అయితే ఇక్కడ కూడా నిపుణుల ఆధ్వర్యంలోనే రోప్‌ల బిగింపు తదితర ఏర్పాటు జరగాల్సి ఉంటుంది. చాలా మంది అవుట్డోర్ క్లైంబింగ్ తర్వాత అది సీరియస్ హాబీగా మారిన తర్వాత ఇన్డోర్ క్లైంబింగ్‌కు మళ్లుతున్నారు. అక్కడ శిక్షణ తీసుకుంటున్నారు. మంచి వ్యాయామంగా..25 నుంచి 40 మధ్య వయస్కులు వస్తున్నారు. ఫిట్‌నెస్‌లో వెరైటీని కోరుకునేవారూ దీన్ని ఎంచుకుంటున్నారు మా దగ్గర 40 వరకూ రూట్స్ ఉన్నాయి. వీటిలో తేలికగా చేసేవి కష్టంగా చేసేవి.. ఇలా ఉంటాయి. చాలా మంది హాబీగా చేస్తుంటే ప్రొఫెషన్‌గా ఎంచుకుంటున్నవారూ పెరుగుతున్నారు. వారానికో రోజు అవుట్‌డోర్‌లో న్యాచురల్ రాక్స్ దగ్గర చేయిస్తున్నాం. – రంగారావు, క్లైంబింగ్ శిక్షకులుఈవెంట్స్ నిర్వహిస్తున్నా..కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ హాబీగా క్లైంబింగ్ ప్రారంభించి ఇప్పుడు దీంతో కనెక్ట్ అయ్యాను. వారాంతాల్లో క్లైంబింగ్ ఈవెంట్స్ కూడా నిర్వహిస్తున్నా. సాహసక్రీడలపైన ఆసక్తి ఉంటేనే దీన్ని ఎంచుకోవాలి. – చాణక్య నాని, క్లైంబర్‘గ్రీస్’లో రాక్ క్లైంబింగ్‌కు వెళ్తున్నాం..గ్రేట్ హైదరాబాద్ అడ్వెంచర్ క్లబ్ ద్వారా 12 సంవత్సరాల క్రితం క్లైంబింగ్ పరిచయమైంది..ఆ తర్వాత రాక్ క్లైంబింగ్ ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా హైదరాబాద్ క్లైంబర్స్‌ను ఏర్పాటు చేసుకున్నాం. ప్రస్తుతం ఇన్‌స్టాలో మా గ్రూప్‌కి 2500 మంది సభ్యులున్నారు. వీరిలో కనీసం 200 మంది గ్రూప్ యాక్టివిటీలో పాల్గొంటుంటారు. వరంగల్‌లో ఉన్న పాండవుల గుట్ట నగరానికి 2 గంటల ప్రయాణ దూరంలోని అడక్కల్ వంటి ప్రదేశాల్లోనే కాక రాష్ట్రం దాటి మనాలి, కర్ణాటకలోని హంపి, బాదామి వంటి ప్రాంతాలతో పాటుగా ఇతర దేశాలైన వియత్నాం, ఇండోనేషియాలో కూడా క్లైంబింగ్ ఈవెంట్స్ చేశాం. త్వరలోనే మన దేశం నుంచి గతంలో ఎవరూ వెళ్లని స్థాయిలో అతిపెద్ద గ్రూప్‌గా గ్రీస్‌కి ఈ డిసెంబర్లో క్లైంబింగ్ యాక్టివిటీ చేపట్టనున్నాం. – రేణుక, హైదరాబాద్ క్లైంబర్స్ -
ఈఫిల్ టవర్‌పైకి ఆగంతకుడు
పారిస్: ఒలింపిక్ క్రీడల ముగింపు ముంగిట్లో ఆదివారం ఓ వ్యక్తి పారిస్‌లోని ప్రఖ్యాత ఈఫిల్ టవర్‌పైకి ఎక్కడం కలకలం రేపింది. 330 మీటర్ల ఎత్తున్న టవర్‌పై అతను రెండో సెక్షన్ వద్ద ఉండగా సిబ్బంది గమనించారు. దాంతో పర్యాటకులను ఖాళీ చేయించారు. అతన్ని కిందికి దించి అరెస్ట్ చేశారు. ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో ఈఫిల్ టవర్ ప్రధానాకర్షణగా నిలిచింది. ఆదివారం రాత్రి జరిగిన ముగింపు వేడుకలకు మరో వేదికను నిర్ణయించడం తెలిసిందే. వీటికోసం 30 వేల మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. -
22 ఏళ్ల క్రితం అదృశ్యం.. చెక్కుచెదరని స్థితిలో మృతదేహం!
22 ఏళ్ల క్రితం అదృశ్యమైన ఓ పర్వతారోహకుడి మృతదేహాం పెరూ దేశంలో తాజాగా బయటపడింది. మృతుడిని అమెరికాకు చెందిన విలియం స్టాంప్ఫ్ల్గా గుర్తించారు. జూన్ 2002లో ఆయన ఆదృశ్యమవ్వగా అప్పుడు అతని వయసు 59 ఏళ్లు. పెరూలోని హుస్కరన్ అనే పర్వతాన్ని అధిరోహిస్తూ మిస్ అయ్యారు. ఆ పర్వతం ఎత్తు 6,700 మీటర్లు(22,000 అడుగులు). ఆ సమయంలో విలియం కోసం రెస్క్యూ బృందాలు ఎంత గాలించిన ప్రయత్నం ఫలించలేదు. దీంతో పర్వతారోహకుడి కుటుంబం అతడిపై ఆశలు వదులుకుంది. వాతావరణ మార్పుల వల్ల ఆండీస్‌లోని కార్డిల్లెరా బ్లాంకా శ్రేణిలో మంచు కరిగిపోవడంతో 22ఏళ్ల క్రితం అదృశ్యమైన విలియం మృతదేహం బయటపడినట్లు పెరూవియన్ పోలీసులు పేర్కొన్నారు.అయితే ఇన్నేళ్ల అతని మృతదేహం దొరికినప్పటికీ.. అది చెక్కుచెదరని స్థితిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పర్వతారోహకుడి శరీరంపై మంచు దట్టంగా పేరుకుపోవడంతో అతడి శరీరం మునుపటిలానే ఉందని, ఒంటిపై ఉన్న బట్టలు, బూట్లు మంచులో అలాగే భద్రంగా ఉన్నట్లు పేర్కొన్నారు.అతని జేబులో లభించిన పాస్‌పోర్టు ఆధారంగా మృతుడిని గుర్తించామని, వారి కుటుంబసభ్యులను సంప్రదించి మృతదేహాన్ని వారికి అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. కాగా ఈశాన్య పెరూలోని హుస్కరన్, కాషాన్ వంటి పర్వతాలను దేశ, విదేశీ పర్వతారోహకులను ఆకర్షిస్తుంటాయి. కాగా గత మేలో ఇజ్రాయెల్, ఇటలీకి చెందిన ఇద్దరు పర్వతారోహకులు హుస్కరన్ పర్వతాన్ని అధిరోహిస్తూ మృతి చెందారు. -
ఫాన్స్ కి గుడ్ న్యూస్ ఎవరి సాయం లేకుండానే..!
-
ఆ చిన్నారి వెంటనే స్పందించకపోయి ఉంటే.. పాపం ఆ తల్లి...
అనుకోని ప్రమాదంలో పడితే పిల్లలను తల్లిదండ్రులు కాపాడుకోవడం అనేది సర్వసాధారణం. కానీ పెద్దలే అనుకోని ప్రమాదం భారిన పడి..నిస్సహాయ స్థితిలో ఉంటే ఆ సమయంలో పిల్లలు తమకు తోచిన విధంగా చేసి తల్లిదండ్రులను కాపాడటం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అబ్బా మనల్ని రక్షించేంత పెద్దవాళ్ల అయిపోయారంటూ తెగ మురిసిపోతాం. అచ్చం అలాంటి ఘటనే ఇక్కడ చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...ఇక్కడొక తల్లి ఒక నిచ్చెనపై నుంచుని గ్యారేజీ తలుపును రిపైర్ చేస్తోంది. ఐతే అనుకోకుండా నిచ్చెన అకస్మాత్తుగా కింద పడిపోతుంది. దీంతో తల్లి ఆ గ్యారెజ్ తలుపుకు వేలాడుతూ ఉంటుంది. పాపాం హెల్ప్ ..హెల్ప్ అంటూ అరుస్తుంది. పక్కనే ఉన్న చిన్నారి వెంటనే అక్కడ ఉన్న నిచ్చెనను ఏదో రకంగా తన చిట్టి చేతులతో లేపేందుకు ప్రయత్నించి తన తల్లి వేలాడుతున్న దగ్గర పెడతాదు. దీంతో ఆ తల్లి నిచ్చెన సాయంతో నెమ్మదిగా దిగిపోతుంది. అందుకు సంబంధించిన ఘటనను ఐపీఎస్ ఆఫీసర్ దీపాంషు కబ్రా ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి. (చదవండి: బ్రహ్మపుత్ర నదిలో ఈత కొడుతూ వస్తున్న పులి..షాక్‌లో ప్రజలు) माँ गैराज का दरवाज़ा रिपेयर कर रहीं थी कि तभी उनकी सीढ़ी गिर गयी. माँ ऊपर लटके देख नन्हे जांबाज़ ने पूरी जान लगाकर सीढ़ी को वापस लगाकर उनक़ी मदद क़ी... इस छोटे बच्चे क़ी सूझ-बूझ और हिम्मत क़ी जितनी प्रशांसा क़ी जाए कम है. pic.twitter.com/GjX6Ol3pid — Dipanshu Kabra (@ipskabra) December 23, 2022 -
వైరల్ వీడియో: తిరుమల కొండ ఎక్కుతున్న చిన్న కుక్క పిల్ల
-
బ్రితోర్న్ పర్వతాన్ని అధిరోహించిన మహిళలు.. ప్రపంచ రికార్డు..!
కనీవినీ ఎరగని అద్భుతమైన ప్రపంచ రికార్డ్‌కు సుందరదేశం స్విట్జర్లాండ్ వేదిక అయింది. 25 దేశాలకు చెందిన 82 మంది మహిళలు ఒకేసారి ఈ అసాధారణమైన రికార్డ్‌లో భాగం అయ్యారు. ఈ లాంగెస్ట్ ఉమెన్స్ రోప్ టీమ్ 4164 మీటర్ల ఎత్తయిన బ్రితోర్న్ పర్వతాన్ని అధిరోహించి కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ‘పురుషుల వల్ల మాత్రమే అవుతుంది’ అనే అపోహతో కూడిన అజ్ఞానాన్ని పటాపంచలు చేసింది. ఈ మెగా ఈవెంట్లో ప్రపంచం నలుమూలల నుంచి వివిధ రంగాలకు చెందిన మహిళలు పాల్గొన్నారు. వీరిలో పర్వతారోహణతో పరిచయం ఉన్నవారితో పాటు, ఇలాంటి కార్యక్రమంలో ఎప్పుడూ పాల్గొనని వారు కూడా ఉన్నారు. మన దేశం నుంచి ముంబైకి చెందిన ఆంచల్ ఠాకూర్, షిబానీ చారత్, చార్మీ దేడియాలు పాల్గొన్నారు. ‘ఇలాంటి గొప్ప కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు మొదట స్విట్జర్లాండ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. స్కైయర్గా స్విస్ ఆల్ఫ్స్ నాకు కొత్తకాకపోయినప్పటికీ, ప్రపంచం నలుమూలల నుంచి, వివిధ సంస్కృతుల నుంచి వచ్చిన మహిళలతో కలిసి ప్రయాణించడం అనేది జీవితం మొత్తం గుర్తుండి పోయే జ్ఞాపకం. చాలామంది భద్రజీవితంలో నుంచి బయటికిరారు. తమ చుట్టూ వలయాలు నిర్మించుకుంటారు. అలాంటి వారు ఆ వలయాల నుంచి బయటికి రావడానికి, ప్రపంచ అద్భుతాలలో భాగం కావడానికి ఇలాంటి సాహస కార్యక్రమాలు ఉపయోగపడతాయి’ అంటుంది ఆంచల్ ఠాకూర్. ‘ఇప్పటికీ ఆ ఆనందం నుంచి బయటపడలేకపోతున్నాను. శక్తిని ఇచ్చే ఆనందం అది. ఆల్ ఉమెన్ గ్రూప్‌తో కలిసి చరిత్ర సృష్టించడంలో భాగం అయినందుకు గర్వంగా ఉంది. ఈ విజయం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మహిళలకు స్ఫూర్తి ఇచ్చి కొత్త అడుగులు వేయిస్తుంది’ అంటుంది షిబానీ. ఈ సాహసయాత్ర అనుభవాలను పదేపదే గుర్తు తెచ్చుకుంటుంది ఛార్మీ దేడియా. ‘వివిధ దేశాలు, వివిధ రంగాలు, వివిధ వయసు వాళ్లతో కలిసి సాహసయాత్రలో భాగం కావడం మామూలు విషయం కాదు. సాహసానికి సరిహద్దులు, భాష ఉండవు అని మరోసారి తెలుసుకున్నాను. పర్వతాలు స్ఫూర్తి ఇస్తాయి. సాహసాన్ని రగిలిస్తాయి.. అంతేతప్ప ఎప్పుడూ చిన్నబుచ్చవు అని పెద్దలు చెప్పిన మాట మరోసారి అనుభవంలోకి వచ్చింది’ అంటుంది ఛార్మీ. టూరిజంను ప్రమోట్ చేయడానికి, సాహసిక పర్వతారోహణలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచడానికి స్విట్జర్లాండ్ ప్రభుత్వం ‘హండ్రెడ్ పర్సెంట్ ఉమెన్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో స్విస్ మౌంటెన్ గైడ్స్ అసోసియేషన్లాంటి సంస్థలు, పర్వతారోహణలో దిగ్గజాలలాంటి వ్యక్తులు పాలుపంచుకున్నారు. చదవండి: హోమ్ క్రియేషన్స్; చీరంచు టేబుల్.. లుక్ అదుర్స్ -
మేడలెక్కగలనే ఓ వనితా..
సాధారణంగా యూత్ ఏం చేస్తుంది? చదువు, కెరీర్ బిల్డింగ్, డేటింగ్స్తో తలమునకలై ఉంటుంది. ఖాళీ సమయాల్లో..? సోషల్ మీడియా.. పబ్‌లు.. క్లబ్‌లు.. సినిమాలు.. అవుటింగ్‌లు.. ఎట్సెట్రా! కదా.. కానీ ఈ అబ్బాయి.. మేసన్ డెస్చాంప్స్ మాత్రం చకచకా ఆకాశ హార్మ్యాలు ఎక్కేస్తాడు.. తాళ్లు, కొక్కాలు, జీనులు వంటివాటి ఆసరా ఏమీ లేకుండా. మేసన్ వయసు 22 ఏళ్లు. లాస్ వేగస్‌లోని యూనిర్శిటీ ఆఫ్ నెవాడలో ఫైనాన్స్ స్టూడెంట్. కాలేజీకి ఒక్క పూట సెలవు దొరికినా దగ్గరున్న బిల్డింగులను వెదుక్కుని మరీ చివరి అంతస్తుకి పాకేస్తాడు. అది అతని సరదా. అయితే దానికి ఓ లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. ఇన్ని రోజుల్లో ఇన్ని భవంతులకు ఎక్కాలని కాదు.. ఎన్ని అంతస్తుల మేడనైనా ఏ సహాయమూ లేకుండా ఇట్టే ఎక్కేసి చూపిస్తా .. ఫలానా అన్ని డాలర్లు ఇస్తారా అని సవాలు విసురుతాడు. దాని ద్వారా వచ్చిన డబ్బును యాంటీ అబార్షన్ ప్రాజెక్ట్‌కు ఖర్చు పెడ్తాడు. అవును.. ఆ మేసన్ అబార్షన్లకు వ్యతిరేకి. పెళ్లి కాకుండా, పెళ్లయినా ఇష్టం లేని లేదా మానసికంగా సిద్ధంగా లేని, లేదా ఆర్థికలేమిలో ఉన్న అమ్మాయిలు, మహిళలు అబార్షన్‌ను ఆశ్రయించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని.. అది నివారించడానికి మేసన్ యాంటీ అబార్షన్ యాక్టివిస్ట్ అయ్యాడు. తాను మేడలెక్కి సంపాదిస్తున్న డబ్బును వీళ్ల డెలివరీలకు ఖర్చు పెడ్తున్నాడు. అలా పుట్టిన పిల్లలను దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చే జంటలను ప్రోత్సహించే ప్రాజెక్ట్ కోసమూ వెచ్చిస్తున్నాడు. అయితే.. ఆ ఉద్దేశం మంచిదే అయినప్పటికీ ఇలా కనిపించిన మేడల్లా ఎక్కుతూ ఏ కాలో .. చెయ్యో.. నడుమో విరగ్గొట్టుకుంటే.. లేదా ప్రాణాల మీదకే తెచ్చుకుంటే ఎలా? ఎవరు దీనికి పూచీకత్తు? పైగా ముందస్తు అనుమతుల్లేకుండా బిల్డింగులు ఎక్కడమేంటి? తప్పు కదా? అంటూ స్థానిక ప్రభుత్వ సంస్థలు మేసన్ సాహసాన్ని తప్పుపట్టాయి. ఇటీవలే శాన్ఫ్రాన్సిస్కోలోని వెయ్యిడెబ్భై అడుగుల ఎత్తున్న 61 అంతస్తుల భవనాన్ని చకచకా ఎక్కేశాడు. అయితే స్థానిక సంస్థల ఆగ్రహం ఫలితంగా అతను ఆ భవంతిని దిగేలోపు పోలీసులు వచ్చి అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇప్పుడు కాలిఫోర్నియా, నెవాడ రాష్ట్రాల్లో టాక్ ఆఫ్ ది స్టేట్స్ ఈ మగానుభావుడే. ఇతనికి ‘ప్రో– లైఫ్ స్పైడర్‌మ్యాన్’ అని పేరు పెట్టుకుని మరీ ఆ అబ్బాయి గురించి చర్చించుకుంటున్నారు. ఇప్పుడు అతని కేస్ కోర్ట్‌లో ఉంది. ఎక్కితే ఎక్కావ్ కానీ పర్మిషన్ తీసుకో నాయనా అంటోంది కోర్ట్. ‘ఎహే.. నా కిష్టమైన.. పై నుంచి నాతోని ఎవరికీ ఇబ్బంది కలగని పనికి ఎవరినో పర్మిషన్ అడుగుడేంది? అట్లనే ఉంటది మనతోని’ అని వాదిస్తున్నాడు మేసన్. అడాప్షన్ ఓవర్ ది అబార్షన్ (అబార్షన్ బదులు అడాప్షన్) పేరిట ఈ అబ్బాయి సాగిస్తున్న ఉద్యమం అతని అరెస్ట్‌తో అమెరికా అంతటికీ తెలిసిపోయింది. -
‘ఎవరెస్టు’ను అధిరోహించిన 10 ఏళ్ల చిన్నారి
Youngest Mountaineer to Climb Mount Everest: ముంబైకి చెందిన రిథమ్ మమానియా అనే 10 ఏళ్ల బాలిక ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది. ఈ నెల ప్రారంభంలో ఉత్కంఠభరితమైన ఫీట్ సాధించిన భారతీయ పర్వతారోహకులలో ఒకరిగా ఆ బాలిక నిలిచింది. ఆమె సబర్బన్ బాంద్రాలోని ఎంఈటీ రిషికుల్ విద్యాలయంలో ఐదవ తరగతి చదువుతోంది. రిథమ్ మే 6న సముద్ర మట్టానికి 5,364 మీటర్ల ఎత్తులో ఉన్న నేపాల్‌లోని సౌత్ బేస్ క్యాంప్‌కు చేరుకుంది. 11 రోజుల పాటు సాగిన యాత్ర బేస్‌క్యాంప్‌కు చేరుకోవడంతో విజయవంతంగా పూర్తయింది. అత్యంత కష్టతరమైన దుర్భేద్యమైన పర్వతమే కాకుండా కఠినతరమైన వాతవరణ పరిస్థితులు తట్టుకుని అధిరోహించే సాహసయాత్ర అయినప్పటికీ ఇవేమి ఆమె లక్ష్యాన్ని నిలువరించలేకపోయాయి. ఐతే రిథమ్ బేస్క్యాంప్కి చేరుకున్న తర్వాత ఆమెతోపాటు పాల్గొన్న ఇతర సభ్యలు విమానంలో తిరిగి వెళ్లేలని నిర్ణయించుకుంటే ఆమె మాత్రం నడచే వెళ్తానని పట్టుబట్టడం విశేషం. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ... "తొలిసారిగా కాలినడకన దూద్ సాగర్ ట్రెక్కింగ్‌ని విజయవంతం పూర్తి చేశాను. తదనంతరం సహ్యాద్రి పర్వత శ్రేణులలో కర్నాలా, లోహగడ్, మహులి కోటలతో సహా కొన్ని శిఖరాలను అధిరోహించాను. అంతేకాదు ఈ ట్రెక్కింగ్ బాధ్యయుతమైన ట్రెక్కర్‌గా పర్వత వ్యర్థాల నిర్వహణ సమస్యను పరిష్కరించడం ఎంత ముఖ్యమో నేర్పింది" అంటూ చెప్పుకొచ్చింది. (చదవండి: మోదీని సర్ప్రైజ్ చేసిన బాలుడు.. ఆశ్యర్యపోయిన ప్రధాని) -
బాహుబలి 2: అచ్చం ప్రభాస్‌ను దించేశాడు.. వైరల్ వీడియో
టాలీవుడ్ స్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. రెండు పార్టులుగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టింది. ప్రభాస్ కెరీర్లోనే ది బెస్ట్ మూవీగా నిలిచిపోయింది. ప్రభాస్ నటన, పాటలు, యాక్షన్ సన్నివేశాలు ఒక్కటేంటి సినిమాలోని అన్నీ అంశాలు అభిమానులు విపరీతంగా ఆకట్టుకున్నాయి. అందుకే సినిమా వచ్చి ఆరేళ్లు పూర్తైనా ఇప్పటికీ బాహుబలికి ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. కాగా బాహుబాలి సెకండ్ పార్ట్‌లో ప్రభాస్ తొండం మీద కాలు పెట్టి ఏనుగు మీదకు ఎక్కి కూర్చూనే సీన్ ఒకటి ఉంటుంది. దాదాపు ఇది అందరికీ గుర్తుండే ఉంటుంది. సినిమాకు ఈ సన్నివేశం హైలెట్‌గా నిలిచింది. తాజాగా అచ్చం బాహుబలి స్టైల్లో ఓ వ్యక్తి ఏనుగు మీదకు ఎక్కాడు. ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా తన ట్విటర్లో పోస్టు చేశారు. 20 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో ఏనుగులపై స్వారీ చేసే వ్యక్తి దాని ముందు నిల్చొని ఉంటాడు. వెంటనే ఎలాంటి సాయం లేకుండా తొండంపై కాలు పెట్టి ఏనుగు ఎక్కి కూర్చుంటాడు. చదవండి: Viral Video: దున్నపోతుతో యవ్వారం.. దెబ్బకు గాల్లో ఎగిరి పడ్డారు.. He did it like @PrabhasRaju in #Baahubali2. @BaahubaliMovie @ssrajamouli pic.twitter.com/nCpTLYXp7g — Dipanshu Kabra (@ipskabra) March 30, 2022 ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్ చల్చేస్తోంది. ఈ దృశ్యం చూసిన నెటిజన్లు బాహుబలి సినిమాలోని సన్నివేశాన్ని గుర్తుకు తెచ్చిదంటూ కామెంట్ చేస్తున్నారు. బాహుబలి 2లో ప్రభాస్ ఇలాగే చేశాడని, ప్రభాస్ ఒకవేళ వృద్ధుడు అయిన తర్వాత ఇలాగే చేసేవాడని, బాహుబలి పార్ట్ 3లా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు. చదవండి: మిస్ యూనివర్స్‌కు బాడీ షేమింగ్.. అసలు విషయం చెప్పిన హర్నాజ్ -
Viral Video: భయంతో చెట్టెక్కిన సింహం... ఏ మాత్రం పట్టు తప్పినా అంతే!
Lion Hangs From A Tree: జంతువులకు సంబంధించిన రకరకాల వీడియోలను చూశాం. క్రూరమృగాలైన సైలెంట్‌గా ఉన్నాయని వేలాకోళం చేసి ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు కోకొల్లలు. అయితే ఒక్కోసారి ఆ క్రూరమృగాలు కూడా టైం బాగోకపోతే చిన్న జంతువులకు భయపడాల్సిందే. చలి చీమల చేత చచ్చిన పాము మాదిరిగా ఉంటుంది. అచ్చం అలాంటి ఘటనే ఒక అడవిలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...సింహాలను అడవికి రాజు అంటారు . అలాంటి సింహాన్ని చూసి ఏ జంతువైన భయంతో పరిగెడుతుంది. కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా సింహమే భయంతో చెట్టెక్కింది. అసలేం జరిగిందంటే.. అడవి గేదేల మందను చూసి సంహం ఒక్కసారిగి బిత్తరపోయి భయంతో పారిపోయేందుకు ప్రయత్నించింది. పైగా అక్కడకు దగ్గరలో ఉన్న చెట్టెక్కి బిక్కుబిక్కు మంటూ వేలాడుతూ ఉంది. కానీ అక్కడ ఉన్న గేదెల మంద ఆ సింహ ఎప్పుడూ కిందకు దిగుతుందా అన్నట్లుగా ఆ చెట్టు చుట్టూ చేరి చూస్తున్నాయి. ఈ ఘటకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by wild animal shorts (@wild_animal_shorts_) (చదవండి: ఉక్రెయిన్ ఉక్కు వీరులు!.. ఒట్టి చేతులు.. వాటర్ బాటిల్‌తో బాంబులు నిర్వీర్యం) -
మంచు పర్వత అధిరోహణ.. దూసుకొచ్చిన హిమపాతం!
ఇంతవరకు ఎముకలు కొరికే మంచు కొండల్లో విహరించడం, విచిత్రమైన స్టంట్లు చేయడం చూశాం. గడ్డకట్టే చలిని సైతం లెక్కచేయకుండా ట్రెక్కింగ్ వెళ్లిన వాళ్ల గురించి విన్నాం. అయితే ఇక్కడొక వ్యక్తి ఏకంగా మంచు పర్వతాన్ని అధిరోహించాలనుకున్నాడు. కానీ ఒక్కసారిగా హిమపాతం బారిన పడ్డాడు. ఆ తర్వాత ఏమైందో తెలుసా!. అసలు విషయంలోకెళ్తే... యూఎస్‌కి చెందిన లేలాండ్ నిస్కీ మంచుతో నిండిన కొలరాడో పర్వతాన్ని అధిరోహిస్తున్నాడు. అయితే ఒక్కసారిగా భారీ హిమ పాతం వచ్చింది. ఆ హిమపాతం తన ఉద్ధృతిని పెంచుతూనే ఉంది. ఏ మాత్రం అతను పట్టు వదిలిన అంతే సంగతులు. ఎందుకంటే అతను భూమి నుండి సుమారు 400 అడుగుల ఎత్తులో ఉండగా హిమపాతం బారిన పడ్డాడు. కానీ అతను తన ధైర్యాన్ని ఏ మాత్రం కోల్పోకుండా బలంగా తన పట్టును కోల్పోకుండా గట్టిగా తన సాధనాలతో తవ్వి పట్టుకున్నాడు. ఆ హిమపాతం తగ్గే వరకు అలాగే గట్టిగా పట్టుకుని ఉన్నాడు. అయితే అతను చివరికి సురక్షితంగా బయటపడ్డాడు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. వెన్నులో వణుకు పుట్టించే ఈ భయంకరమైన వీడియోని మీరు ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Leland Nisky (@nemonisky) (చదవండి: ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం.. అదే శాపమయింది..!) -
సాండ్స్టోన్ ఐస్ క్లైంబింగ్ ఫెస్టివల్..
-
20 మంది టీంలో ఐదుగురు చనిపోయారు.. అయినా..
సాక్షి, హైదరాబాద్: శీతాకాలంలో మైనస్ 40 డిగ్రీల చలిలో, గంటకు 64 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలిలో రష్యాలోని మౌంట్ ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించిన మొదటి మహిళగా భువనగిరికి చెందిన పడమటి అన్వితారెడ్డి నిలిచింది. పర్వతారోహణ పూర్తిచేసి నగరానికి చేరుకున్న ఆమెను గూడూరి నారాయణరెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకులు గూడూరు నారాయణరెడ్డి సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అన్వితారెడ్డి మాట్లాడుతూ... 5 సంవత్సరాలుగా పర్వతారోహణ చేస్తున్నానని, ఇప్పటివరకు కిలిమంజారోతో పాటు మరో నాలుగు పర్వతాలు అధిరోహించానని తెలిపింది. నవంబర్‌లో యూకే నుంచి వచ్చిన 20 మంది ఉన్న టీంలో ఐదుగురు చనిపోయారని అయినా పట్టుదల వీడక తాను, తన గైడ్ చతుర్ ముందుకు వెళ్లామన్నారు. తనతో పాటు వచ్చిన చాలామంది వాతావరణం చూసి వెనక్కి వెళ్లిపోయారని తెలిపారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరిన్ని అద్భుతాలు సృష్టిస్తానన్నారు. (చదవండి: జూబ్లీహిల్స్‌వాసులకు నిద్రలేని రాత్రులు.. స్థానికుల ఆందోళన) -
హమ్మయ్య దూకేశా!! ఏనుగునైతే మాత్రం దూకలేననుకున్నారా.. ఏం?
జంతువుల్లో ఏనుగును మేధావిగా భావిస్తారు. అవి చాలా వరకు సాధు జీవిలానే ఉంటాయి. కాకపోతే ఒక్కొసారి ఆ ఏనుగులు తమ జోలికి వస్తే మాత్రం అంత తేలికగా వదిలిపెట్టవు. పైగా అవి వాటికి ఏదైనా సమస్య వస్తే భలే చక్కగా ఒకదానికొకటి సహకరించుకుంటాయి. అంతేకాదు మనుషుల వలే కొన్ని పనులను భలే చాకచక్యంగా చేసేస్తాయి. అచ్చం అలానే ఇక్కడొక ఏనుగు నేను మీ లా దూకేయగలనంటూ అడ్డుగా ఉన్న ఇనుప కంచెను ఎలా దాటిందో ఈ వీడియోలో చూడండి. (చదవండి: అంతరాలు దాటిన కల్లాకపటంలేని ప్రేమ) పైగా ఆ ఏనుగు ఎంతో నైపుణ్యంగా ఆ ఇనుప కంచెను దాటడానికి ప్రయత్నించింది. అంతేకాదు ఆ ఏనుగు ఆ ప్రయత్నంలో విజయం కూడా సాధించింది. ఈ మేరకు ఈ వీడియోని తమిళనాడు ఎన్విరాన్మెంట్ క్లైమేట్ చేంజ్ అండ్ ఫారెస్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సుప్రియా సాహు ట్విట్టర్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. దీంతో కొంతమంది నెటిజన్లు ఈ ఏనుగు తెలివితేటలను మెచ్చుకుంటూ జౌరా! అంటే మరికొంత మంది అలాంటి కంచెలను దాటడానికి ప్రయత్నించి మధ్యలో ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కోకొల్లలు అందువల్ల దయచేసి వాటిని తొలగించండి అంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: కారులోనే ఆల్కహాల్ టెస్టింగ్ టెక్నాలజీ) -
ఎల్బ్రస్ శిఖరంపై సు'గంధం' పరిమళం
సాక్షి, అమరావతి: ఎనిమిదేళ్ల బాలుడు ఎత్తైన పర్వతాన్ని అధిరోహించాడు. యూరప్ ఖండంలోనే అత్యంత ఎత్తైన ప్రముఖ శిఖరం ఎల్బ్రస్ను అతి పిన్న వయసులోనే అధిరోహించిన తొలి భారతీయ బాలుడిగా రికార్డు సృష్టించాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి, మైనార్టీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడి కుమారుడైన గంధం భువన్ రష్యాలోని ఎల్బ్రస్ పర్వతం (5,642 మీటర్లు)ను ఈ నెల 18వ తేదీన అధిరోహించి చరిత్ర సృష్టించాడు. అనంతపురానికి చెందిన కోచ్ శంకరయ్య, విశాఖపట్నానికి చెందిన పర్వాతారోహకుడు, అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ చాంపియన్ భూపతిరాజు వర్మ, కర్ణాటక నుంచి నవీన్ మల్లేష్ బృందంతో కలిసి భువన్ సెప్టెంబర్ 11న రష్యాకు బయలుదేరాడు. ఈ నెల 12న టెర్స్‌కోల్‌లోని మౌంట్ ఎల్బ్రస్ బేస్‌కు వెళ్లిన ఆ బృందం 13 వ తేదీన 3,500 మీటర్లు అధిరోహించి తిరిగి బేస్ క్యాంప్‌కు చేరుకుంది. అక్కడ కొంత శిక్షణ అనంతరం 18వ తేదీన 5,642 మీటర్ల ఎత్తైన ఎల్బ్రస్ పర్వత శిఖరాన్ని చేరుకుని ఉదయం 8:00 గంటలకు (మాస్కో సమయం) మన జాతీయ పతాకాన్ని ఎగురవేసింది. ఈ బృందం ప్రస్తుతం పర్వతాన్ని దిగి బేస్ క్యాంప్‌నకు చేరుకుని ఈ నెల 23న భారత్‌కు తిరిగి రానుంది. తల్లిదండ్రుల ప్రోత్సాహం.. కోచ్ శిక్షణతోనే ప్రస్తుతం మూడో తరగతి చదువుతున్న భువన్ తల్లిదండ్రుల ప్రోత్సాహం, శిక్షకులు అందించిన మెళకువల వల్లే తాను ఈ ఘనతను సాధించినట్టు వీడియో సందేశంలో పేర్కొన్నాడు. దేశంలో చాలామంది ప్రతిభావంతులైన పిల్లలున్నారని, వారికి తగిన ప్రోత్సాహం, అవకాశం కల్పిస్తే అద్భుతమైన రికార్డులు సృష్టిస్తారని స్పష్టం చేశాడు. అతి శీతల వాతావరణం సవాల్‌గా మారినప్పటికీ, పలు ఇబ్బందులు చవిచూస్తూ తాను అనుకున్న విధంగా సాహసోపేతమైన యాత్రను ముగించినట్టు తెలిపాడు. -
భార్య కాపురానికి రావడం లేదని టవర్ ఎక్కిన భర్త
సాక్షి, కడెం(ఆదిలాబాద్): భార్య కాపురానికి రావడం లేదని సెల్‌టవర్ ఎక్కి హల్చల్ చేశాడు ఓ యువకుడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన సుతారి రవికి అదే గ్రామానికి చెందిన సౌజన్యతో సుమారు నాలుగేళ్ల క్రితం వివాహాం జరిగింది. వీరికి రెండు సంవత్సరాల వయస్సు గల బాబు ఉన్నాడు. కుటుంబ కలహాలతో భార్య పుట్టింటికి వెళ్లగా ఇటీవలే మామతో గొడవపడ్డాడు. ఈక్రమంలో మనస్తాపం చెందిన రవి శనివారం గ్రామ పంచాయతీ కార్యాలయం పక్కనే ఉన్న సెల్ టవర్ ఎక్కి గంటపాటు హల్చల్ చేశాడు. చివరికి పోలీసులు, అతని మామ వచ్చి నచ్చజెప్పడంతో కిందకు దిగాడు. చదవండి: విషాదం: గడ్డివాములో కుటుంబం అంతా ఆహుతి -
కరోనా వ్యాక్సిన్ భయంతో చెట్టెక్కిన గ్రామస్తులు
-
వైరల్ వీడియో: రియల్ హీరోస్.. అగ్నిప్రమాదం నుంచి ముగ్గురు చిన్న పిల్లలని..
-
ఇంట్లో ఒంటరిగా ముగ్గురు పిల్లలు; నిజమైన హీరోలు మీరే!
మాస్కో: సాధారణంగా మనం.. ఒక్కోసారి.. అనుకోని సంఘటనలు.. విపత్కర పరిస్థితులు చూస్తుంటాం. ఈ క్రమంలో, కొంత మంది స్పందిస్తే.. మరికొంత మంది మనకెందుకులే అనుకుని పట్టించుకోరు. ఇది మా పనికాదనో.. మాకేందుకు రిస్క్‌లే అనుకుని కనీసం ప్రయత్నం కూడా చేయరు. మరికొంత మంది మాత్రం.. తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టి సాటివారిని కాపాడుతుంటారు. రష్యాలో ఇటీవల జరిగిన సంఘటన కూడా ఈ కోవకు చెందినదే. ఒక అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. కొంత మంది పిల్లలు దాంట్లో చిక్కుకున్నారు. ప్రమాదం గురించి తెలిసిన కొంతమంది వెంటనే స్పందించి ఆ పిల్లలను కాపాడారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేవరకు వేచి చూడకుండా వారు తక్షణం స్పందించడంతో పిల్లలంతా ప్రాణాలతో బయటపడ్డారు. ఆ సాహసీకులు పిల్లలను కాపాడిన తీరు ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారింది. వివరాలు.. రష్యాలోని కోస్ట్రోమా నగరంలో ఉన్న మూడంతస్తుల అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో మంటలు అపార్ట్మెంట్ చుట్టు వ్యాపించాయి. ప్రమాదం జరిగినప్పుడు అపార్ట్మెంట్లోని ఒక ఇంట్లో ముగ్గురు చిన్న పిల్లలు మాత్రమే ఉన్నారని తెలిసింది. దీంతో, ఇంటి పక్కన ఉన్న కొంత మంది యువకులు, ఆ పిల్లలను ఎలాగైన కాపాడాలని ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో, ఆ ఇంటి ప్రవేశ ద్వారాన్ని పగుల గొట్టాలని ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నం సఫలం కాలేదు. మంటలు మాత్రం, వేగంగా వ్యాపిస్తున్నాయి. ఆ పిల్లలు ఇంట్లోని ఒక కిటికీ దగ్గరకు వచ్చి కాపాడాలని అరుస్తున్నారు. దీంతో వారికొక ఐడియా వచ్చింది. వెంటనే వారు అపార్ట్‌మెంట్‌కు ఆనుకొని ఉన్న ఒక పైపును పట్టుకొని, పిల్లలు చిక్కుకొని ఉన్న ఇంటి కిటికీ దగ్గరకు చేరుకున్నారు. వారంతా, ఒకరి తర్వాత మరోకరు చైన్ మాదిరిగా నిలబడ్డారు. ఈ క్రమంలో మొదటి వ్యక్తి, కిటికీ దగ్గర ఉన్న పిల్లలను చేరుకున్నారు. ఆ తర్వాత, వెంటనే కిటికీ నుంచి ఒకరి తర్వాత..మరొకరుగా.. ముగ్గురు పిల్లలను నెమ్మదిగా కిందకు దించారు. ఈ క్రమంలో, ముగ్గురు పిల్లలు క్షేమంగా కిందకు చేరడంతో అక్కడి వారంతా ఊపిరిపీల్చుకున్నారు. ఆ పిల్లలు తమ తల్లిదండ్రుల వద్దకు చేరుకున్నారు. ఆ తర్వాత అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే, ముగ్గురు పిల్లల ప్రాణాలను కాపాడిన వారిని అక్కడి అధికారులు సాహాస పురస్కారానికి నామినెట్ చేసినట్టుగా తెలిసింది. కాగా, ఆ ఇంట్లో ఉంటున్న సదరు, మహిళకు నలుగురు సంతానం. అగ్నిప్రమాదం జరగటానికి ముందు తన భర్తను ఇంట్లో ఉంచి, ఆమె ఏదో పనిమీద నాలుగో బిడ్డను తీసుకొని బయటకు వెళ్లింది. కాగా, ఆమె భర్త కూడా పిల్లలు పడుకున్నారని బయట తాళం వేసుకొని మరో పనిమీద బయటకు వెళ్లినట్టు తెలిసింది. అయితే, అగ్ని ప్రమాదానికి కారణాలు మాత్రం తెలియరాలేదు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘వావ్.. మీ ధైర్యానికి హ్యాట్సాఫ్..’, ‘ ముగ్గురి నిండు ప్రాణాలు కాపాడారు..’, ‘ ఇప్పటికీ మానవత్వం బతికే ఉందని ఇలాంటప్పుడే అనిపిస్తోంది..’, ‘ ఐకమత్యంగా ఉంటే గొప్ప పనులు సాధించొచ్చు.. అని మరోసారి రుజువైంది..’ ‘ నిజమైనా హీరోలు మీరే..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. చదవండి: అదేమో కింగ్ కోబ్రా.. ఆ యువతి ఎలా పట్టేసుకుందో! -
‘కిలిమంజారో’ చాన్స్.. సాయం చేయండి ప్లీజ్
మరిపెడ రూరల్: ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఆఫ్రికా ఖండంలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించడానికి మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం భూక్యాతండాకు చెందిన బాలుడు ఎంపికయ్యాడు. భూక్యా రాంమూర్తి, జ్యోతి దంపతుల కుమారుడు భూక్యా జశ్వంత్ హైదరాబాద్ ఇబ్రహీంపట్నంలోని గిరిజన సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో ఎంపీసీ ఫస్టియర్ చదువుతున్నాడు. జశ్వంత్‌కు చిన్నప్పటి నుంచి పర్వతారోహణ అంటే ఎంతో ఇష్టం. ఈ ఏడాది ఫిబ్రవరిలో యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన రాక్‌ౖక్లైంబింగ్ పోటీల్లో మొత్తం 40 మంది పాల్గొనగా జశ్వంత్ మొదటి స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలోనే రాష్ట్రం నుంచి కిలిమంజారో పర్వ తం అధిరోహణకు జశ్వంత్ ఎంపికయ్యాడు. జూలై 22న అతను బయలుదేరాల్సి ఉంది. ఇందుకు ప్రయాణ ఖర్చుల కింద రూ.3 లక్షలు అవసరం. దాతలు సహకారం అందిస్తే కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి వస్తానని, భవిష్యత్‌తో మరిన్ని విజయాలు సాధించి దేశానికి మంచి పేరు తెస్తానని జశ్వంత్ ఈ సందర్భంగా తెలిపాడు. సాయం చేయదలచిన వారు 70750 13778 నంబర్ ద్వారా గూగుల్, ఫోన్ పే చేయాలని కోరాడు. -
విద్యుత్ తీగలపై విన్యాసాలు
-
అరె.. స్పెడర్ మ్యాన్‌ను మించిపోయాడుగా!
-
అరె.. స్పెడర్ మ్యాన్‌ను మించిపోయాడుగా
బార్సీలోనా : బార్సీలోనా నగరంలో ఒక వ్యక్తి అచ్చం స్పైడర్ మ్యాన్‌ను తలపించేలా 145 మీటర్ల (475 అడుగులు) ఎత్తులో ఉన్న భవనాన్ని కేవలం 25 నిమిషాల్లోనే అవలీలగా ఎక్కేశాడు.చూసినవారంతా అతని సాహసానికి మెచ్చుకోవడం జరిగింది. అయితే ఇదంతా సినిమా షూటింగ్ అనుకుంటే మాత్రం మీరు పొరబడినట్లే. ప్రసుత్తం కరోనా వైరస్ ప్రపంచదేశాల్ని గడగడలాడిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ కంటే అది ఎక్కడ వస్తుందేమోనన్న భయమే జనాల్లో ఎక్కువయిపోయింది. జనాల్లో ఆ భయాన్ని వదిలించాలంటే ఏదైనా సాహసం చేయాలని బార్సిలోనాకు చెందిన 57 ఏళ్ల అలేన్ రాబర్ట్ అనుకున్నాడు. అందుకు స్పెడర్ మ్యాన్‌లాగా ఎత్తైన భవనాన్ని ఎక్కి ప్రజల్లో భయాన్ని వదిలించాలని భావించాడు. అందుకు బార్సీలోనాలో దాదాపు 475 అడుగుల ఎత్తులో ఉన్న టోర్ అగ్బర్ ఆఫీస్ భవనాన్ని ఎంచుకున్నాడు. అందరూ చూస్తుండగానే భవనం మొత్తం ఎక్కడానికి 25 నిమిషాలు, మళ్లీ కిందకు దిగడానికి 23 నిమిషాలు తీసుకున్నాడు. అతని సాహసాన్ని చూసిన ప్రతీ ఒక్కరూ.. భయం అనేది లేకుండా ఎలా ఎక్కుతున్నాడని తదేకంగా చూస్తు ఉండిపోయారు. రాబర్ట్ కిందకు వచ్చిన తర్వాత పోలీసులు అరెస్టు చేసినా అతని సాహసాన్ని మాత్రం అందరూ మెచ్చుకున్నారు.(ఆ ఇద్దరికి కరోనా లేదు : మంత్రి ఈటల) ఇదే విషయమై అలేన్ రాబర్ట్ మాట్లాడుతూ.. 'ప్రసుత్తం ప్రజలందరూ కరోనా వైరస్‌ను ఒక భూతంలా చూస్తున్నారు. దాదాపు 300 కోట్ల మంది కరోనా వైరస్‌కు భయపడుతున్నారు. నా దృష్టిలో కరోనా అనేది వారికి భయం రూపంలో కనిపిస్తుంది. వారి భయాన్ని కొంతైనా పోగొట్టాలనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నా. నిజానికి నాకు ఆ భవనాన్ని ఎక్కేటప్పుడు చాలా భయమనిపించింది. కానీ నేను ముందు భయాన్ని వదిలేసాను.. దాంతో నాకు భవనం ఎక్కడం పెద్ద కష్టమనిపించలేదు. ఇప్పుడు కరోనా పట్ల కూడా ప్రజలు అలానే ఉన్నారు. వారిలో భయాన్ని పోగొట్టాలనేది నా ద్యేయం.. ' అని చెప్పుకొచ్చాడు. (కరోనా దెబ్బకు కుప్పకూలిన ‘ఫ్లైబీ’) అలేన్ రాబర్ట్ అంత ఎత్తున్న భవనాలను ఎక్కేందుకు చేతిలో చాక్ పౌడర్, క్లైంబింగ్ షూస్ మాత్రమే వాడుతుంటాడు. ఇప్పటివరకు రాబర్ట్ అలేన్ 100 రకాల ఎత్తైన బిల్డింగ్‌లను అవలీలగా ఎక్కేశాడు. అందులో దుబాయ్‌లోని బూర్జు ఖలీఫా, మలేషియాలోని పెట్రోనాస్ ట్విన్ టవర్స్, సిడ్నీ ఒపెరా హౌస్ వంటివి ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 3200 మంది కరోనా బారీన పడి మృతి చెందగా, 90వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. -
11,240 అడుగుల ఎత్తు.. మంచులో పట్టుతప్పి
ఒట్టావా : కెనడాకు చెందిన భారతీయ సంతతికి 16 ఏళ్ల గుర్భాజ్ సింగ్ మౌంట్ హుడ్ పర్వాతిధిరోహణ చేస్తున్న క్రమంలో గాయపడ్డాడు. పర్వతాన్ని అధిరోహిస్తూ 500 అడుగుల లోతుకు జారిపడినట్లు స్దానిక మీడియా ఓ నివేదికలో తెలిపింది. ఆ నివేదిక ప్రకారం.. గుర్భాజ్ సింగ్ మంగళవారం తన మిత్రులతో కలిసి 11,240 అడుగుల ఎత్తైన మౌంట్ హుడ్ అధిరోహించాడు. ఈ క్రమంలో మంచులో పట్టుతప్పి 500 అడుగుల కిందకు జారిపడ్డాడు. దీంతో అతడి కాలుకు గాయమైంది. విషయం తెలుసుకున్న సెర్చ్ అండ్ రెస్క్యూ టీం 10,500 అడుగుల ఎత్తులో చిక్కుకున్న అతన్ని క్షేమంగా బయటకు తీసుకువచ్చింది. పటిష్టమైన శిక్షణ, ధృడమైన హెల్మెట్ ధరించడం వల్ల గుర్భాజ్ తక్కువ గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటనపై గుర్భాజ్ సింగ్ తండ్రి రిషమ్దీప్ సింగ్ స్పందిస్తూ.. ‘మంచు కారణంగా గుర్బాజ్ ఇబ్బంది పడతాడని భావించా. గుర్బాజ్ గాయం నుంచి కోలుకోగానే అతడితో కలిసి నేను కూడా పర్వతాన్ని అధిరోహిస్తా.’ అని అన్నారు. యూఎస్ ఫారెస్ట్ సర్వీస్ ప్రకారం, మౌంట్ హుడ్ ఒరెగాన్‌లో ఎత్తైన శిఖరమని, అమెరికాలోనే అత్యధికంగా సందర్శించే శిఖరమని.. ప్రతి సంవత్సరం 10,000 మందికి పైగా ప్రజలు పర్వతాన్ని సందర్శిస్తారని అధికారులు తెలిపారు.