
అడవికి రాజైన మృగరాజు భయంతో చెట్టెక్కి వేలాడాల్సి వచ్చింది. సమయం మనది కానప్పుడూ సింహమైన తలవంచాల్సిందే.
Lion Hangs From A Tree: జంతువులకు సంబంధించిన రకరకాల వీడియోలను చూశాం. క్రూరమృగాలైన సైలెంట్‌గా ఉన్నాయని వేలాకోళం చేసి ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు కోకొల్లలు. అయితే ఒక్కోసారి ఆ క్రూరమృగాలు కూడా టైం బాగోకపోతే చిన్న జంతువులకు భయపడాల్సిందే. చలి చీమల చేత చచ్చిన పాము మాదిరిగా ఉంటుంది. అచ్చం అలాంటి ఘటనే ఒక అడవిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకెళ్తే...సింహాలను అడవికి రాజు అంటారు . అలాంటి సింహాన్ని చూసి ఏ జంతువైన భయంతో పరిగెడుతుంది. కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా సింహమే భయంతో చెట్టెక్కింది. అసలేం జరిగిందంటే.. అడవి గేదేల మందను చూసి సంహం ఒక్కసారిగి బిత్తరపోయి భయంతో పారిపోయేందుకు ప్రయత్నించింది. పైగా అక్కడకు దగ్గరలో ఉన్న చెట్టెక్కి బిక్కుబిక్కు మంటూ వేలాడుతూ ఉంది. కానీ అక్కడ ఉన్న గేదెల మంద ఆ సింహ ఎప్పుడూ కిందకు దిగుతుందా అన్నట్లుగా ఆ చెట్టు చుట్టూ చేరి చూస్తున్నాయి. ఈ ఘటకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి.
(చదవండి: ఉక్రెయిన్ ఉక్కు వీరులు!.. ఒట్టి చేతులు.. వాటర్ బాటిల్‌తో బాంబులు నిర్వీర్యం)