Buffalo
-
ఆ దున్నపోతు మాదే!
అనంతపురం: దేవర దున్నపోతు కోసం రెండు గ్రామాల మధ్య వివాదం రాజుకుంది. కూడేరు మండలం ముద్దలాపురంలో ముత్యాలమ్మ, కదరగుంటలో బొడ్రాయి ప్రతిష్ట సందర్భంగా దేవర నిర్వహణకు గ్రామస్తులు పూనుకున్నారు. ఇందు కోసం దేవరలో బలి ఇచ్చేందుకు గ్రామానికి ఒక దున్నపోతును వదిలారు. ఈ రెండు దున్నపోతులు నాలుగేళ్లుగా సమీప గ్రామాల్లో సంచరిస్తున్నాయి. ఈ నెల 22న దేవర ఉండడంతో ఇటీవల గ్రామంలోకి వచ్చిన దున్నపోతును కదరకుంట గ్రామస్తులు కట్టేశారు. 21వ తేదీన ముద్దలాపురంలో దేవర ఉంది. దీంతో పక్క గ్రామంలో కట్టేసిన దున్నపోతు తమ గ్రామానికి చెందినదేనని ముద్దలాపురం గ్రామస్తులు నిర్ధారణకు వచ్చారు. తమ దున్నపోతును వదిలేస్తు దేవర చేసుకుంటామని కోరగా కడదరకుంట గ్రామస్తులు ఇందుకు ససేమిరా అన్నారు. అది తమదేనని ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. దీంతో గొడవలు జరిగే అవకాశం కనిపిస్తుండడంతో ముద్దలాపురం గ్రామస్తులు శుక్రవారం ఎస్పీని కలిసేందుకు కార్యాలయానికి వెళ్లారు. ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహించే సోమవారం రోజున రావాలంటూ సిబ్బంది సూచించడంతో గ్రామస్తులు అక్కడి నుంచి వెనుదిరిగారు. -
రూ. 23 కోట్ల దున్న.. నెలకు రూ. 5 లక్షల ఆదాయం
కొందరు ఎవరినైనా తిట్టేటప్పుడు దున్నపోతులా ఉన్నావ్ అంటూ ఎగతాళి చేస్తుంటారు. అయితే మనం ఇప్పుడు చెప్పుకోబోయే దున్నపోతు గురించి తెలిస్తే ఇకపై అలాంటి మాట అనరు. ఎందుకంటే ఈ దున్నపోతు ధర, అది తినే తిండి, అంతకు మించి దీని ద్వారా వచ్చే ఆదాయం గురించి తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే.ఆ దున్నపోతు ఖరీదు రూ.23 కోట్లు అని చెబితే ఎవరైనా నమ్ముతారా? అవును.. ఇది అక్షరాలా నిజం. అయితే దాని వలన వచ్చే ఆదాయం గురించి తెలిస్తే అంత ధర ఉండటంతో తప్పులేదంటాం. ఇప్పుడు ఆ దున్నపోతు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆ దున్నపోతు వీర్యాన్ని అమ్మడంతో పాటు ఇతర మార్గాల ద్వారా దాని యజమాని నెలకు రూ.4 నుంచి రూ.5 లక్షల వరకూ సంపాదిస్తుండటం విశేషం. హర్యానాకు చెందిన ఆ దున్నపోతు పేరు అన్మోల్.హర్యానాలోని సిర్సాలో ఉంటున్న పల్వీందర్ సింగ్ అనే రైతు ఈ అన్మోల్ను పెంచుతున్నాడు. దాని వయసు ఎనిమిదేళ్లు. బరువు 1500 కిలోలు. ఈ దున్నపోతును రూ.23 కోట్లు ఇస్తానన్నా పల్వీందర్ సింగ్ ఎవరికీ అమ్మబోనని తెగేసి చెబుతున్నాడు. ఉత్తరాదిన జరిగే పుష్కర్ మేళా, ఆల్ ఇండియా ఫార్మర్స్ ఫెయిర్ వంటి ప్రదర్శనల్లో ఈ అన్మోల్ ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంటుంది. దీని భారీ ఆకారం ఎవరినైనా ఇట్టే కంగుతినేలా చేస్తుంది.ఇక ఈ అన్మోల్ ఎంత తిండి తింటుందో తెలిస్తే ఎవరైనా ఆశ్యర్యపోకమానరు. ఇది అధిక కేలరీలు కలిగిన ఆహార పదార్థాలు, డ్రైఫ్రూట్స్‌ను తింటుంది. దాని తిండి కోసం యజమాని రోజూ రూ.1,500 ఖర్చు చేస్తుంటాడు. అంటే నెలకు దానిని మేపడానికి రూ.45 వేల వరకు ఖర్చవుతుందన్నమాట. అది ప్రతి రోజూ 250 గ్రాముల బాదాం, నాలుగు కిలోల దానిమ్మలు, 30 అరటిపండ్లు, ఐదు లీటర్ల పాలు, 20 గుడ్లను తింటుంది. వీటితోపాటు అది ఆయిల్ కేక్, పచ్చి గడ్డి, దేశీ నెయ్యి, సోయాబీన్, మొక్కజొన్నలను కూడా తింటుంది. అన్మోల్ దున్నపోతుకు దాని యజమాని పల్వీందర్ సింగ్ రోజూ స్నానం చేయిస్తుంటాడు. ఇందుకోసం బాదాం నూనె, ఆవ నూనెలను కూడా వినియోగించడం విశేషం.ఇది కూడా చదవండి: Pakistan: ఊపిరాడక వేల మంది ఆస్పత్రులకు పరుగులు -
గేదెకు పోస్టుమార్టం.. కారణమిదే?
పట్నా: బీహార్‌లోని పట్నాలో ఓ విచిత్ర ఉదంతం వెలుగు చూసింది. నిందితుడు జరిపిన కాల్పుల్లో ఒక గేదె మృతి చెందగా, దానికి పోలీసులు పోస్టుమార్టం నిర్వహింపజేస్తున్నారు. గేదెకు పోస్టుమార్టం నిర్వహించడం ఇదే తొలిసారని సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం రాత్రి పట్నాకు 40 కిలోమీటర్ల దూరంలోని ధన్రువాలోని నద్వాన్ సోన్‌మై గ్రామంలో గేదెలను మేపిన అనంతరం మున్నా కుమార్, నావల్ కుమార్ అనే అన్నదమ్ములు ఇంటికి తిరిగి వస్తున్నారు.ఇంతలో నలుగురు వ్యక్తులు మోటార్‌సైకిల్‌పై వచ్చారు. వారు ముందుగా నావల్ ప్రసాద్‌ను కత్తితో పొడిచారు. ఆ తర్వాత అతనిపై కాల్పులు జరిపారు. అయితే మున్నా ప్రసాద్ తృటిలో తప్పించుకోగా, నిందితులు అక్కడున్న గేదెపై కాల్పులు జరిపారు.ఈ ఘటనలో గేదె అక్కడికక్కడే మృతి చెందింది. కాల్పుల శబ్ధం విన్న సమీప గ్రామస్తులు అక్కడికి వచ్చి నిందితులను తరిమికొట్టారు. వారు మోటార్‌సైకిల్‌పై పరారయ్యేందుకు ప్రయత్నించారు. ఇంతలోనే వారు కిందపడిపోయారు. దీంతో వారు మోటార్‌సైకిల్‌ను అక్కడే వదిలేసి పారిపోయారు.సమాచారం అందుకున్న వెంటనే ధన్రువా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బైక్, పిస్టల్, బుల్లెట్, కత్తి, బుల్లెట్ కేసింగ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్నాలోని మసౌరీ సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ కన్హయ్య సింగ్ మాట్లాడుతూ, నిందితులు రైతుతోపాటు ఒక గేదెపై కాల్పులు జరిపారన్నారు. ప్రస్తుతం రైతు నావల్ ప్రసాద్ మృతదేహానికి పోస్ట్‌మార్టం జరుగుతుండగా, గేదెకు కూడా పశువైద్యశాలలో పోస్ట్‌మార్టం చేస్తున్నారు. ఆ గేదె ఎలా మృతిచెందిందనే విషయాన్ని తెలుకునేందుకే దానికి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. పరారైన నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన తెలిపారు. -
బర్రె కోసం 10 కిలోల బంగారు చైన్
-
మాయమయింది మళ్లీ వచ్చింది
అనుకోని అతిథి నల్లమలకు చేరింది. జీవ వైవిధ్యంతో అలరారుతున్న ఆత్మకూరు అటవీ డివిజన్లో అడవి దున్న ప్రత్యక్షమైంది. ఇక్కడి అడవుల్లో 150 ఏళ్ల క్రితం అదృశ్యమైన మహిషం తిరిగి కనిపించడం అటవీ అధికారులను ఆశ్చర్య చకితుల్ని చేస్తోంది. తలచిందే తడవుగా.. అడవి దున్న వలచి రావడంతో వన్యప్రాణి ప్రేమికులు ఉప్పొంగిపోతున్నారు.ఆత్మకూరు రూరల్: నల్లమల అడవుల్లో 1870 కాలంలో అదృశ్యమైన అడవి దున్న నల్లమలలో తిరిగి కనిపించడం అటవీ అధికారులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. భారత అడవి దున్న (ఇండియన్ బైసన్)గా ప్రసిద్ధి చెందిన ఈ దున్నలు నల్లమల అడవుల్లో ఒకప్పుడు విస్తారంగా సంచరించేవి. అనూహ్యంగా 1870 ప్రాంతంలో అదృశ్యమైపోయిన అడవి దున్న వన్యప్రాణి ప్రేమికులను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతూ నాగార్జున సాగర్–శ్రీశైలం పులుల అభయారణ్యంలోని ఆత్మకూరు డివిజన్లో బైర్లూటి, వెలుగోడు నార్త్ బీట్లలో కనిపించింది. ప్రస్తుతం నల్లమలకు తూర్పున ఉండే పాపికొండలు (పోలవరం అటవీ ప్రాంతం).. çకర్ణాటకలోని పశి్చమ కనుమలలో మాత్రమే ఉండే అడవి దున్న వందల కిలోమీటర్ల దూరాన్ని దాటుకుని నల్లమల చేరడం అద్భుతమైన విషయమే. నెల క్రితమే కనిపించినా.. నెల రోజుల కిందట సాధారణ విధుల్లో భాగంగా ఆత్మకూరు అటవీ డివిజన్లోని బైర్లూటి రేంజ్ తలమడుగు అటవీ ప్రాంతంలో ఫుట్ పెట్రోలింగ్ చేస్తున్న సిబ్బందికి అడవి దున్న కనిపించింది. ఆ వెంటనే వీడియో, ఫొటోలు తీసిన సిబ్బంది ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. అయితే.. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు రహస్యంగా ఉంచారు. ఆ తరువాత ఇదే అటవీ డివిజన్లోని వెలుగోడు రేంజ్లో గల నార్త్ బీట్ జీరో పాయింట్ వద్ద సిబ్బందికి మరోమారు అడవి దున్న కనిపించి నల్లమలలో తన ఉనికిని చాటింది.అప్రయత్నంగానే సాకారం ఒకప్పుడు నల్లమలలో విస్తారంగా సంచరించి అదృశ్యమైన అడవి దున్నలను తిరిగి నల్లమలలోకి తీసుకొచ్చేందుకు అటవీ శాఖ ఇటీవల ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందుకోసం వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్(డబ్లూడబ్ల్యూఎఫ్) సంస్థ సహకారం అందించేందుకు ముందుకొచ్చింది. ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ రెడ్డీస్ ల్యాబ్ ఈ మహత్తర కార్యక్రమం కోసం రూ.కోటి విరాళం ఇచ్చేందుకు అంగీకరించింది. అటవీ అధికారులు అడవి దున్నల తరలింపు ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే ఈ మహిషం తనంతట తానే పూర్వ ఆవాసానికి చేరుకోవడంతో వన్యప్రాణి ప్రేముకులలో పండుగ వాతావరణం కనిపిస్తోంది. నల్లమలలో అడవి దున్న ప్రత్యక్షమవడం శుభసూచకంగా భావిస్తున్నారు. ఆశ్చర్యమే కానీ.. అసాధ్యం కాదు ఆత్మకూరు అటవీ డివిజన్లో అడవి దున్నను మా సిబ్బంది రెండు ప్రాంతాల్లో గుర్తించారు. ఇది కొంత ఆశ్చ్యర్యం కలిగించే విషయమే. కానీ.. అసాధ్యమైనదేమీ కాదు. పెద్ద పులులు, ఏనుగులు వంటి భారీ జంతువులు సుదూర ప్రాంతాలకు తరలివెళ్లడం సాధారణమే. ఈ అడవి దున్న కూడా అలా మైదాన ప్రాంతాలను దాటుకుని నల్లమల చేరి ఉంటుంది. ఇది పాపికొండలు అటవీ ప్రాంతం నుంచి వచ్చి ఉంటుందని భావిస్తున్నాం. – సాయిబాబా, డిప్యూటీ డైరెక్టర్, ఆత్మకూరు, నాగార్జునసాగర్–శ్రీశైలం పులుల అభయారణ్యం -
ప్రతీ కుక్కకీ ఒక రోజుంటది.. లక్ అంటే నీదేరా!
-
కోకాపేట్‌లోని బఫెలో వైల్డ్ వింగ్స్.. ఆటిజంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం..(ఫొటోలు)
-
మంగళసూత్రం మింగిన గేదె.. ఐదోతనం కాపాడిన వైద్యుడు!
మహారాష్ట్రలోని వాశిం జిల్లాలో ఒక వింత ఉదంతం చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన ఒక గేదె రూ. 15 లక్షల విలువైన మంగళసూత్రం మింగేసింది. పశువైద్యులు ఆ గేదె కడుపులోని మంగళ సూత్రం తీసేందుకు దాని కడుపును కోశారు. మంగళసూత్రం బయటకు తీశాక ఆ గేదెకు 65 కుట్లు వేశారు. జిల్లాలోని సార్సీ గ్రామంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. రామ్‌హరీ అనే రైతు భార్య స్నానం చేసే ముందు తన మంగళ సూత్రాన్ని తీసి, సోయాబీన్ తొక్కలు ఉన్న ఒక పాత్రలో పెట్టింది. స్నానం పూర్తయ్యాక, ఆ ప్లేట్‌ను తమ పశువులశాల లోని గేదె ముందు ఉంచి, ఇంటిపనులలో మునిగిపోయింది. రెండు గంటల తరువాత తన మెడలో మంగళ సూత్రం లేని విషయాన్ని ఆమె గమనించింది. కొద్దిసేపు ఇటునటు వెదికాక తాను ఆ మంగళ సూత్రాన్ని సోయా తొక్కలున్న ప్లేట్లో పెట్టినట్లు గుర్తుకు తెచ్చుకుంది. వెంటనే ఆమె పరిగెత్తుకుంటూ పశువులశాలలోకి వెళ్లి చూసింది. గేదె తన మంగళసూత్రం మింగేసిందని గ్రహించింది. వెంటనే ఈ విషయాన్ని ఆమె భర్తకు తెలియజేసింది. రైతు రామ్‌హరీ ఈ విషయాన్ని ఫోనులో పశువైద్యాధికారి బాలాసాహెబ్‌కు తెలియజేశాడు. అతని సూచన మేరకు ఆ రైతు తన గేదెను వాశింలోని పశువైద్యశాలకు తీసుకు వెళ్లాడు. అక్కడ పశువైద్యాధికారి మెటల్ డిటెక్టర్‌తో ఆ గెదె కడుపులో మంగళసూత్రం ఉన్నదని నిర్ధారించారు. తరువాత దానికి ఆపరేషన్ చేసి, మంగళ సూత్రాన్ని బయటకు తీశారు. ఈ ఆపరేషన్ 2 గంటలపాటు సాగింది. తరువాత వైద్యుదు ఆ గేదెకు 65 కుట్లు వేశారు. కాగా తన మంగళసూత్రాన్ని గేదె కడుపు నుంచి వెలికి తీసి, తన ఐదోతనం కాపాడారంటూ ఆ రైతు భార్య వైద్యునికి కృతజ్ఞతలు తెలియజేసింది. ఇది కూడా చూడండి: పాక్ ప్రధాని జీతం ఎంత? అదనపు సౌకర్యాలు ఏముంటాయి? -
గేదెను గుద్దిచంపిన కేసు.. 28 ఏళ్ల తర్వాత సమన్లు
లక్నో: మన దేశంలో న్యాయవ్యవస్థ మీద గౌరవం ఉన్నప్పటికీ.. ఆ నత్తనడక విధానాల మాత్రం ఎందుకనో విమర్శలు చేయకుండా ఉండలేం. తాజాగా అలాంటి ఘటన ఒకటి యూపీలో జరిగింది. దాదాపు 28 ఏళ్ల కిందటి నాటి కేసులో.. ఓ పెద్దాయనకు తాజాగా నోటీసులు అందాయి. ఆ సమన్లను ఇంటికి వెళ్లి మరీ అందించిన పోలీసులు.. కోర్టు విచారణకు హాజరు కాకపోతే అరెస్ట్ చేస్తామంటూ హెచ్చరించి వెళ్లారు. అసలే పక్షవాతంతో మంచానికే పరిమితమైన ఆ పెద్దాయన ఆ నోటీసులు చూసి ఇంకా వణికిపోతున్నాడట. ఇంతకీ ఆ పెద్దాయన చేసిన నేరం.. రవాణా శాఖలో డ్రైవర్‌గా పని చేస్తూ ఆ టైంలో ఓ బర్రెను ఢీ కొట్టి అతను చంపాడట. ఆ కేసుకు సంబంధించి నోటీసులు ఇప్పుడు బరేలీ పోలీసులు బరాబాన్కీలో ఉన్న ఇంటికి వెళ్లి మరీ అందజేశారు. ఆ సమన్లను చూసి పాపం 83 ఏళ్ల అచ్చన్ షాక్ తిన్నాడట. 1994 ప్రాంతంలో ఘటన జరిగితే.. పోలీసులు ఇప్పుడు రావడంతో అచ్చన్ పాపం భయంతో వణికిపోతున్నాడు. ఆ టైంలో రెండు సార్లు సమన్లు వస్తే.. బెయిల్ తెచ్చుకున్నాడట. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత కేసు వెలుగులోకి రావడంతో పాపం ఆ పెద్దాయన వణికిపోతున్నాడు. ఇదీ చదవండి: అమ్మను కాపాడుకునేందుకు సాహసం -
ఇన్స్టాంట్ ఖర్మ అంటే ఇదే.. గేదెను తన్ని బైక్‌పై నుంచి జారి..
జంతువుల పట్ల కొందరు అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. అవి ఎలాంటి హానీ చేయకపోయినా సరే శిక్షిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా మనసును కలచివేసేలా ఉంటున్నాయి. అయితే ఇలాగే ఓ మూగజీవాన్ని శిక్షించబోయిన ఆకతాయికి ఊహించని షాక్ తలిగింది. స్నేహితుడితో కలిసి బైక్‌పై వెళ్తున్న అతడు.. రోడ్డుపై ఉన్న ఓ గేదెను తన్నాడు. ఆ వెంటనే బైక్‌పై నుంచి జారి కిందపడ్డాడు. బైక్‌ను రైడ్ చేస్తున్న అతని స్నేహితుడు కూడా అదుపుతప్పి పోల్‌ను ఢీకొట్టాడు. దీంతో ఇద్దరు గాయాలపాలయ్యారు. Instant karma 😂 pic.twitter.com/jNFMfEf9Fm — CCTV IDIOTS (@cctvidiots) April 30, 2023 అయితే గతంలో ఎప్పుడో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆకతాయిపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. గేదె ఏం చేసిందని తన్నావు.. చూడు ఇప్పుడు నీకు ఏం జరిగిందో.. అందుకే మూగజీవాలకు హాని చేయెద్దు అని హితవు పలికారు. మరో నెటిజన్ ఈ వీడియోపై స్పందిస్తూ.. ఇన్స్టాంట్ ఖర్మ అంటే భయ్యా.. తప్పు చేసిన వెంటనే శిక్ష పడుతుంది. క్షణం కూడా ఆలస్యం కాదు.. అంటూ యువకుడ్ని చీవాట్లు పెట్టాడు. చదవండి: బ్యానెట్‌పై మనిషిని ఈడ్చుకెళ్లి..ఎంపీ డ్రైవర్ దారుణం! -
68 ప్రమాదాలు.. వందే భారత్ రైలు వైపు వెళ్లొద్దు! గేదెలకు విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనతో పాటు వందే భారత్ రైలు ప్రారంభోత్సవంపై టీఎస్ రెడ్కో చైర్మన్ వై. సతీష్ రెడ్డి వినూత్నంగా నిరసన తెలిపారు. వందే భారత్ రైలు ప్రారంభమయ్యాక ఇప్పటివరకు దాదాపు 68 ప్రమాదాలు జరిగాయని, గేదెలు, ఆవులను ఢీకొని వందే భారత్ రైళ్లు దెబ్బతిన్నాయని సతీష్‌రెడ్డి అన్నారు. నాగోలులో ఆయన మాట్లాడుతూ, మోదీ సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ రైలును ప్రారంభిస్తున్నారని, దయచేసి అటువైపు వెళ్లొద్దు.. మీరు పొరపాటున తాకినా రైలు దెబ్బతినే ప్రమాదం ఉంది. అసలే ఆ రైళ్లు చాలా వీక్‌గా ఉంటాయి’’ అని గేదెలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఒకే వందే భారత్ స్కీంను ప్రధానమంత్రి మోదీ ఎన్నిసార్లు ప్రారంభిస్తారని ప్రశ్నించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జగన్మోహన్రెడ్డి, సతీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: పట్టెడన్నం కోసం..ప్రాణాలే పణంగా!.. గత ఏడాదిలోనే 17 మంది మృతి -
కోట్లు పలుకుతోంది.. ఈ దున్నపోతుతో సెల్ఫీ తీసుకునేందుకు ఎగబడుతున్న జనం!
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఇటీవల పశువుల ప్రదర్శన (సంత) నిర్వహించారు. ఇందులో పాల్గొనేందుకు యూపీతో పాటు నాలుగు రాష్ట్రాల నుంచి పశువులు ముజఫర్ నగర్‌లోని సంతకు చేరుకున్నాయి. అయితే ఈ సంతలో అందరి చూపు ఓ దున్నపోతుపై పడింది. అక్కడ జరగుతున్న సంతలో ప్రధాన ఆకర్షణగా అదే నిలిచింది. సంతకు హాజరైన ప్రతీ ఒక్కరూ దానితో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. ఇంతకీ ఆ దున్నపోతు ఎందుకంత ప్రత్యేకమంటే? దీని ధర రూ.10 కోట్లు సంతలో అందరి చూపును ఆకట్టుకున్న ఈ దున్నపోతు పేరు ఘోలు. బాహుబలి సినిమాలో ఉండే ఎద్దుకి ఏ మాత్రం తీసిపోన్నట్లు కనిపిస్తుంది. గురువారం జరిగిన జంతు సంతలో పానిపట్ నుంచి తీసుకొచ్చిన ఈ దున్నపోతు ముర్రా జాతికి చెందినది. ఈ ప్రత్యేక జాతి దున్నపోతు ధర రూ.10 కోట్లు పలుకుతోందట. 16 క్వింటాళ్ల బరువున్న దీన్ని హర్యానాలోని పానిపట్ నుంచి ముజఫర్‌నగర్‌లోని పశువుల సంతకు తీసుకొచ్చారు. ఇది పద్మశ్రీ అవార్డు పొందిన పానిపట్‌లోని దిద్వాడి గ్రామ నివాసి నరేంద్ర సింగ్‌కు చెందినది. ఘోలుకు రోజుకు 10 కిలోల వరకు మేత తింటుందట. ముజఫర్ నగర్ పశువుల ప్రదర్శనకు చేరిన ఈ దున్నపోతు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఈ దున్నపోతు యజమాని దీని ఆహారంతో పాటు, దాని ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. -
మండపేట గేదా.. మజాకా! నాలుగేళ్ల వయసు, రోజుకు 26.59 లీటర్ల పాలు
మండపేట (డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ): ఆ గేదె వయసు నాలుగేళ్లు. పాలదిగుబడిలో తన తల్లిని మించిపోయింది. రోజుకు 26.59 లీటర్లు పాలు ఇస్తూ రికార్డు సృష్టించింది. ఆ గేదె తల్లి రోజుకు 26.58 లీటర్లు పాలు ఇస్తూ రాష్ట్రస్థాయి పాల దిగుబడి పోటీల్లో రెండుసార్లు మొదటి స్థానంలో నిలిచింది. తల్లి గేదె ఆరో ఈతలో అత్యధిక దిగుబడి ఇస్తే... నాలుగేళ్ల వయసు కలిగిన పిల్ల గేదె రెండో ఈతలోనే తల్లిని మించి రికార్డు స్థాయిలో రోజుకు 26.59 లీటర్ల పాల దిగుబడిని నమోదు చేసింది. ఈ విషయాన్ని కేంద్రీయ పశు నమోదు పథకం ప్రతినిధి డి.రాజేశ్వరరావు ఆదివారం నిర్ధారించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట పట్టణానికి చెందిన పాడి రైతు ముత్యాల సత్యనారాయణ (అబ్బు) మేలుజాతి పశు పోషణ చేస్తున్నారు. ఎనిమిదేళ్ల కిందట ఆయన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ముర్రా జాతి పాడి గేదెను కొనుగోలు చేశారు. ఆ గేదె గతంలో విజయవాడ, మండపేటల్లో జరిగిన రాష్ట్రస్థాయి పాల దిగుబడి పోటీల్లో రెండుసార్లు మొదటి స్థానంలో నిలిచింది. ఈ గేదె సాధించిన అత్యధిక దిగుబడి 26.58 లీటర్లు. ఇప్పటివరకూ ఆ గేదె తమ వద్ద ఆరు ఈతలు ఈనగా, నాలుగు దున్నపోతులు, రెండు పెయ్యదూడలు పుట్టాయని అబ్బు చెప్పారు. దున్నపోతుల్లో రెండింటిని సెమన్ సేకరణ కేంద్రాల వారు తీసుకువెళ్లగా, మరో రెండు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం రికార్డు స్థాయిలో పాలదిగుబడిని ఇస్తున్న పెయ్య ఆరో ఈతలో పుట్టిందని వివరించారు. వీటికి దాణాగా రోజుకు రూ.500 ఖర్చుతో పశుగ్రాసాలు, మొక్కజొన్న, ఉలవలు, తవుడు అందిస్తున్నామని ఆయన చెప్పారు. అధికారికంగా పాలదిగుబడి లెక్కింపు ప్రస్తుతం కేంద్రీయ పశు నమోదు పథకం కింద మండపేట, పరిసర ప్రాంతాల్లో అత్యధిక పాల దిగుబడి ఇచ్చే పాడి పశువుల గుర్తింపు ప్రక్రియ జరుగుతోంది. కేంద్రీయ పశు నమోదు పథకం ప్రతినిధి డి.రాజేశ్వరరావు పశువుల వద్దకు వెళ్లి మేలుజాతి పాడి గేదెల పాల దిగుబడిని లెక్కిస్తున్నారు. ఇందులో భాగంగా అబ్బుకు చెందిన గేదె ఒక రోజు 26.59 లీటర్ల పాల దిగుబడిని ఇచ్చిందని రాజేశ్వరరావు తెలిపారు. రెండో ఈతలోనే ఈస్థాయిలో దిగుబడి వస్తే మున్ముందు మరింత పెరుగుతుందని ఆయన చెప్పారు. అత్యధిక దిగుబడినిచ్చే పాడి పశువుల వివరాలను సెమన్ సేకరణ కేంద్రాలకు పంపుతామని, వీటి ద్వారా మేలుజాతి పాడి పశువుల పునరుత్పత్తికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాజేశ్వరరావు తెలిపారు. -
Viral Video: బర్రెను తన్నాడు.. బోర్లా పడ్డాడు
-
Bomb Cyclone: శతాబ్దంలోనే అత్యంత తీవ్రమైన మంచు తుపాన్.. కోలుకోని అమెరికా (ఫొటోలు)
-
‘బాంబ్’ కోరల నుంచి బయటపడని అమెరికా.. కనీవినీ ఎరగని విధ్వంసం
బఫెలో: ఈ శతాబ్దంలోకెల్లా అత్యంత తీవ్రమైన మంచు తుపాన్ (Bomb Cyclone) కోరల నుంచి అమెరికా ఇంకా బయట పడలేదు. గత వారం రోజులతో పోలిస్తే హిమపాతం కాస్త తగ్గినా దేశవ్యాప్తంగా అతి శీతల వాతావరణం కొనసాగుతోంది. రోడ్లపై దట్టంగా పేరుకున్న మంచును తొలగించడంతో పాటు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడం వంటి పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. దాంతో తుఫాన్ విధ్వంసం తాలూకు తీవ్రత క్రమంగా వెలుగులోకి వస్తోంది. మంచులో కూరుకుపోయిన కార్లలో నిస్సహాయంగా మరణించిన వారి శవాలు ఒక్కటొక్కటిగా బయట పడుతున్నాయి. మంచు తుఫాన్ ధాటికి కనీసం 100 మందికి పైగా మృత్యువాత పడ్డట్టు భావిస్తున్నారు. దీన్ని తరానికి ఒక్కసారి మాత్రమే సంభవించే మహోత్పాతంగా వాతావరణ శాఖ అభివర్ణిస్తోంది. మెరుగవని రవాణా వ్యవస్థ దేశవ్యాప్తంగా వారం రోజులుగా దాదాపుగా స్తంభించిపోయిన రవాణా వ్యవస్థ ఇంకా కుదురుకోలేదు. మంగళవారం కూడా 6,000కు పైగా విమానాలు రద్దయ్యాయి. బుధవారం బయల్దేరాల్సిన 3,500 పై చిలుకు విమానాలను ముందస్తుగానే రద్దు చేశారు. దాంతో విమానాశ్రయాల్లో గందరగోళ వాతావరణం నెలకొంది. చిక్కుబడిపోయిన ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. బయటికెళ్లే పరిస్థితి లేక ప్రయాణికులంతా టెర్మినల్స్‌లోనే కాలం గడుపుతున్నారు. డిసెంబర్ 22 నుంచి రద్దయిన విమానాల సంఖ్య 25 వేలు దాటింది. సకాలంలో సేవలను పునరుద్ధరించడంలో సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ వైఫల్యం పరిస్థితిని మరింత జటిలంగా మార్చింది. సంస్థకు చెందిన వేలాది విమాన సర్వీసులు వరుసగా ఆరో రోజూ రద్దవడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఆగ్రహించారు. ఎయిర్‌లైన్స్ నుంచి భారీగా నష్టపరిహారం వసూలు చేయాలని ప్రయాణికులకు సూచించారు! కానీ పరిస్థితి చక్కబడేందుకు కనీసం ఇంకో వారం పట్టొచ్చని సౌత్‌వెస్ట్ ప్రకటించింది. యథేచ్ఛగా లూటీలు రవాణా వ్యవస్థ స్తంభించడంతో అమెరికాలో చాలా ప్రాంతాల్లో నిత్యావసరాలు తదితరాల సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. దాంతో చాలా రాష్ట్రాల్లో ఆకలి కేకలు విన్పిస్తున్నాయి. బయటికెళ్లే పరిస్థితి లేక జనం రోజుల తరబడి ఇళ్లకే పరిమితం కావడంతో ఆహార పదార్థాలు నిండుకున్నాయి. నాలుగైదు రోజులుగా దుకాణాలూ తెరిచుకోక సమస్య మరింతగా విషమించింది. ఫలితంగా మొన్నటిదాకా బఫెలో నగరంలోనే వెలుగు చూసిన లూటీ ఉదంతాలు ఇప్పుడు పలు రాష్ట్రాల్లోనూ నమోదవుతున్నాయి. ముఖ్యంగా నిత్యావసరాల కోసం దుకాణాల్లోకి చొరబడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. అమెరికాలోని పలు ప్రాంతాల్లో ఉంటున్న లక్షలాది మంది తెలుగువాళ్లు కూడా నానా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. కెనడాలోనూ పరిస్థితి దారుణంగా ఉంది. ఉష్ణోగ్రతలు మైనస్ 50 డిగ్రీల కంటే తక్కువ నమోదవున్నాయి! వరద ముప్పు క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అమెరికా ఇప్పుడు వరద ముప్పును ఎదుర్కొంటోంది. మంచు శరవేగంగా కరగడం వల్ల ఊహాతీత వేగంతో ఆకస్మిక వరదలు ముంచెత్తవచ్చని పలు రాష్ట్రాలను వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. పూర్తిగా మంచులో కూరుకుపోయిన బఫెలో వంటి ప్రాంతాలకు ఈ ప్రమాదం ఎక్కువగా ఉందని పేర్కొంది. బఫెలో.. దయనీయం! పశ్చిమ న్యూయార్క్‌లోని బఫెలో నగరంలో ఇంకా పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. చాలాచోట్ల ఇంకా 8 అడుగుల ఎత్తున మంచు పేరుకుపోయింది. దాంతో అవసరాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు అత్యవసర సర్వీసులు కూడా సకాలంలో చేరుకోలేని పరిస్థితి! నగరంలోకి వెళ్తుంటే యుద్ధరంగంలోకి ప్రవేశిస్తున్నట్టుగా ఉందని న్యూయార్క్ గవర్నర్ కేథీ హోచల్ వాపోయారు. నగరం, పరిసరాల్లో రోడ్డు ప్రయాణాలపై నిషేధం ఇంకా అమల్లోనే ఉంది. దాని అమలుకు మిలిటరీ పోలీసులు రంగంలోకి దిగారు. పొరుగు రాష్ట్రం న్యూజెర్సీ నుంచి ఎమర్జెన్సీ సేవల సిబ్బంది న్యూయార్క్‌కు తరలుతున్నారు. చాలామంది కార్లలోనే చిక్కుకుపోయి ఉన్నారు. 30కి పైగా మృతదేహలను వెలికితీసినట్టు చెబుతున్నారు. ఇంతటి ప్రతికూల వాతావరణాన్ని తమ సర్వీసులోనే ఎన్నడూ చూడలేదని వాతావరణ విభాగం అధికారులు చెబుతున్నారు. సహాయక చర్యల్లో భాగంగా సిబ్బంది ఇంటింటికీ తిరుగుతున్నారు. చావు అంచుల దాకా వెళ్లాం మంచు తుఫాను బారిన పడి అదృష్టవశాత్తూ బతికి బయటపడ్డవాళ్లు తామెదుర్కొన్న కష్టాలను కథలుగా చెబుతున్నారు. మేరీలాండ్కు చెందిన డిట్జక్ ఇలుంగా అనే వ్యక్తి తన ఆరు, పదహారేళ్ల కూతుళ్లతో కలిసి కార్లో హామిల్టన్ వెళ్తూ బఫెలో వద్ద తుఫానులో చిక్కాడు. చూస్తుండగానే కారు చుట్టూ మంచు పేరుకుపోవడంతో గంటల తరబడి కారు ఇంజన్ ఆన్‌లో ఉంచి బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. ‘‘చివరికి ప్రాణాలకు తెగించాం. ధైర్యం చేసి కష్టమ్మీద కారు దిగాం. చిన్న కూతుర్ని వీపున వేసుకుని, పెద్దమ్మాయీ నేనూ భయానక వాతావరణంలో అతికష్టమ్మీద షెల్టర్ హోమ్ దాకా వెళ్లాం. లోపలికి అడుగు పెడుతూ నేనూ నా పిల్లలూ ఒక్కసారిగా ఏడ్చేశాం. ఇంతటి భయానక అనుభవం జీవితంలో ఎన్నడూ ఎదుర్కోలేదు. ఒక్క అడుగూ వేయడానికి ప్రాణాలన్నీ కూడదీసుకోవాల్సి వచ్చింది. కానీ సాహసం చేయకపోతే కార్లోనే నిస్సహాయంగా మరణించేవాళ్లం’’ అంటూ డిట్జక్ గుర్తు చేసుకున్నాడు. -
ఓట్ల పండ్గ ఎట్లైంది.. మునుగోడుల ధూమ్‌దామ్గ జేస్కుండ్రు
నారదుడు నెత్తి మీది కెల్లి తానం జేసిండు. కొప్పేసుకుండు. తంబూర తీస్కున్నడు. చిర్తలు గొట్టుకుంట, నారాయన నారాయన అన్కుంట గాయిన మొగులు మీదికెల్లి ఎల్లిండు. తెలంగాన దిక్కు రాబట్టిండు. నడ్మల నర్కం దిక్కు బోతున్న యముని దున్నపోతు గాయినకు ఎదురైంది. ‘‘యాడికెల్లి వొస్తున్నవు?’’ అని నారదుడు దున్నుపోతు నడిగిండు. ‘‘తెలంగానకెల్లి’’ అని దున్నపోతు జెప్పింది. ‘‘గాడికెందుకు బోయినవ్?’’ ‘‘సదర్ పండ్గకు మా దున్నపోతులు రమ్మంటె బోయొస్తున్న’’ ‘‘పండ్గ మంచిగైందా?’’ ‘‘మునుగోడు ఎలచ్చన్లట. టీఆర్ఎస్ దున్నపోతులనుకుంట మాదాంట్ల కొన్నిటిని మోటర్ మీద గూసుండ బెట్టిండ్రు. కొన్నిటి మెడల తామర పూల దండేసి బీజేపీ దున్నపోతులన్నరు. ఇగ కొన్ని టిని కాంగ్రెస్ దున్నపోతులనుకుంట గవ్విటితోని పాదయాత్ర జేపిచ్చిండ్రు.’’ ‘‘సదర్ పండ్గ అయినంక గుడ్క తెలంగాన లెందుకున్నవ్? ‘‘పండ్గలన్నిట్ల పెద్ద పండ్గ ఓట్ల పండ్గ. గా పండ్గను మునుగోడుల ధూమ్‌దామ్గ జేస్కుండ్రు. గా బై ఎలచ్చన్ల ఓట్ల పండ్గ అయ్యె దాంక తెలంగానల ఉంటె బాగుంటదనుకున్న. అనుకోని ఇయ్యాల్టిదాంక మునుగోడులనే ఉన్న’’ ‘‘ఓట్ల పండ్గ ఎట్లైంది’’ ‘‘శాన మంచిగైంది. శాన్దార్గ అయ్యింది. నెల న్నర గాకుంట యాడాదంత గీ ఓట్ల పండ్గ ఉంటె బాగుండుననిపిచ్చింది’’ ‘‘గంత గనం బాగుందా?’’ ‘‘అవ్. ఇదువరదాంక ఏ బై ఎలచ్చన్ల ముక్యమంత్రి ప్రచారం జెయ్యలేదు. గని మునుగోడు బై ఎలచ్చన్ల రొండు పార్లు ప్రచారం జేసిండు. చండూరుల మాట్లాడుకుంట వడ్ల కొనుడు శాతగానోల్లు వందు కోట్లు సంచులల్ల బెట్టుకోని మా ఎమ్మెల్యేలను కొనెతంద్కు వొచ్చిండ్రు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఇంతకుముందే మేము గొన్నం. మేము గొన్న ఎమ్మెల్యేలను బీజేపోల్లు కొనెతంద్కువొచ్చు డేమన్న బాగుందా? పడ్తల్ బడక మా ఎమ్మెల్యేలు గోడదుంకలేదు. జెనం కోసమే నేను గాలి మోటార్ గొన్న. జెనం కోసమే యాద్గిరి నర్సిమ్మ సామికి కిలన్నర బంగారమిచ్చిన. సలికాలం తడి బట్టల తోని ఒట్టు తినెతంద్కు బండి సంజయ్ లెక్క నేనేమన్న అవులగాన్నా? అని కేసీఆర్ అన్నడు’’ ‘‘ముక్యమంత్రి నర్సిమ్మ సామికి కిలన్నర బంగారమిచ్చిండు. గంతేగాకుంట బంగారి గడ్డ మీద్కెల్లి స్పీచ్ గొట్టిండు. తలా తులం బంగార మేమన్న ఇస్తడా?’’ ‘‘మాంసం దినెటోల్లు యాడనన్న బొక్కలు మెడలేసుకుంటరా?’’ ‘‘బై ఎలచ్చన్లు జెయ్య బట్కె మాయబజార్ లెక్క మునుగోడు బదల్ గయా! తొవ్వలు లేని ఊర్లకు తొవ్వలు ఏసిండ్రు. సర్కార్ జీతగాల్లకు పదో తారీకున గాకుంట పహిలీ తారీక్కే జీతాలు బడ్డయి. అంబటాల్ల బువ్వకు 40 లక్షల రూపాయలు మంజూరైనయి. షాదీ ముబారక్, కల్యాన లచ్మిలకు టోల్ రూపాయలు ఇచ్చిండ్రు. డిండి ఎత్తిపోతలు జెయ్య బట్కె ఎవుసం బూములు పోడగొట్టుకొన్న రైతులకు 116 కోట్లు మంజూరు జేసిండ్రు. ముక్యమంత్రి, మంత్రులు ఎమ్మెల్యేలందరు మునుగోడు జెనం సుట్టూత చక్కర్లు గొట్టిండ్రు. నేను రాజినామ జేసి బీజేపీల దుంకబట్కె గిదంత అయిందని రాజగోపాల్ రెడ్డి అన్నడు. బీజేపీ ఏ ఎమ్మెల్యేను కొనలేదనుకుంట యాద్గిరి గుట్టల దేవుని ముంగట తడి బట్టల్తోని బండి సంజయ్ ఒట్టు దిన్నడు. గడీల కాడ కావలి గాసేటి కూసు కుంట్ల గావాల్నా? కేసీఆర్ గల్ల బట్టె రాజగోపాల్ రెడ్డి గావాల్నా? అని గాయిన అడిగిండు.’’ ‘‘కాంగ్రెస్ సంగ తేంది?’’ ‘‘కాంగ్రెస్ దిక్కుకెల్లి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి బిడ్డ పాల్వాయి స్రవంతి నిలవడ్డది. ఆడోల్ల ఓట్లన్ని గామెకే బడ్తయని కాంగ్రెస్ లీడర్లు అనుకున్నరు. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కొంపెల్లిల మాట్లాడుకుంట అందర్కి దండం బెట్టి అడ్గుతున్న ఆడిబిడ్డకు ఒక్క మోక ఇయ్యుండ్రి. మీ చేతులల్ల బెడ్తున్న గీ బిడ్డను సంపుకుంటరో, సాదుకుంటరో మీ ఇస్టం. ఎన్కకెల్లి కాంగ్రెస్‌ను బొడ్సి రాజగోపాల్ రెడ్డి కోట్ల రూపాయల కాంట్రాక్ట్ కోసం బీజేపీల దుంకిండు అన్నాడు. మీరు టీడీపీని ఎన్కకెల్లి బొడ్సి కాంగ్రెస్‌లకు దుంకిన తీర్గనా?’’ అని ఎవడో లాసిగ అడిగిండు. ‘‘కేటీఆర్ ఎట్ల ప్రచారం జేసిండు?’’ ‘‘గా గట్టున మాయల మరాటి మోదీ. గీ గట్టున తెలంగాన. గీ గట్టున మోటర్ గుర్తు కూసు కుంట్ల. గా గట్టున బీజేపీ, కాంగ్రెస్ బేకార్ గాల్లు. గీ గట్టున దలిత బందు. గా గట్టున పీక్క తినేటి రాబందు. గీ గట్టున అంబేద్కరసువంటి కేసీఆర్. గా గట్టున మత పిచ్చి మోదీ. గా గట్టున ఉంటరా? గీ గట్టున పంటరా? అని సవాల్లు అడ్గుకుంట కేటీఆర్ ప్రచారం జేసిండు.’’ ‘‘గాయిన గా గట్టున ఉన్నా గీయిన గీ గట్టున ఉన్నా ఇద్దరు గల్సి జెనంను నీల్లల్ల నిండ ముంచుతరు’’ అని నారదుడన్నడు. ‘‘మల్ల గలుస్త’’ అనుకుంట యముని దున్నపోతు నర్కం దిక్కు బోయింది. నారదుడు పీచే ముడ్ అన్కుంట వైకుంటం బోయిండు. (క్లిక్ చేయండి: సిత్రాలు సూడరో శివుడో శివుడా!) - తెలిదేవర భానుమూర్తి సీనియర్ జర్నలిస్ట్ -
Viral Video: నోటికందిన ఆహారాన్ని వదిలేసి.. కొట్టుకున్న సింహాలు..
సింహాలు అడవికి రారాజు. సాధారణంగా సింహాలు వేటాడితే టార్గెట్ గురి తప్పదు. గంభీరత్వానికి నిదర్శనమైన ఇవి ఎప్పుడూ గుంపులుగా దర్శనమిస్తుంటాయి. ఒక్కసారి ఏదైనా జంతువును ఆహారంగా చేసుకోవాలని డిసైడ్ అయితే వార్ వన్‌సైడ్ అవ్వాల్సిందే. చిన్న చిన్న జంతువులనే కాదు పెద్ద పెద్ద దున్నపోతులు, అడవి దున్నలు, జిరాఫీలను సైతం తమ వశం చేసుకుంటాయి. సింహాలు ఎక్కువగా వేటాడే జంతువుల్లో గేదె ఒకటి. దీని సైజు పెద్దగా ఉండటం వల్ల దాదాపు అయిదు రోజుల వరకు మరే ఇతర జంతువును వేటాడాల్సిన పని ఉండదు. తాజాగా ఓ సింహాల గుంపు కష్టపడి పొలంలో ఒంటరిగా మేస్తున్న గేదెపై దాడి చేసి ఆహారంగా తెచ్చుకున్నాయి. మిగతా గేదెల నుంచి దానిని దూరంగా తీసుకొచ్చి తినడం ప్రారంభించాయి. అయితే ఇంతలో ఏమయ్యిందో తెలిదు కానీ ఆడ సింహాల(శివంగి) మధ్య గొడవ ప్రారంభమైంది. నోటికి వరకు వచ్చిన ఆహారాన్ని పక్కకు పెట్టి మరీ ఒక్కొక్కటిగా దాడి చేసుకున్నాయి. శివంగిలు కొట్టుకుంటుంటే.. ఒక్క సింహం మాత్రం గేదెను అలాగే అదిమి పట్టుకుంది. చివరికి అది కూడా గొడవలో జాయిన్ అయ్యింది. ఇంకేముంది ఇదే మంచి చాన్స్ అని భావించిన గేదె మెల్లగా అక్కడి నుంచి లేచి పరుగు అందుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘గేదె అదృష్టం బాగుంది. పాపం సింహాలకు ఈ రోజు ఉపవాసమే. ఉన్నది పాయే ఉంచుకున్నది పాయే’ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. చదవండి: రెచ్చిపోయిన మాజీ ఐఏఎస్ కూతురు.. రోడ్డుపై క్రికెట్ బ్యాట్‌తో రచ్చ.. Lions fight while eating a water buffalo, then it casually walks off pic.twitter.com/JGiKMVJaQQ — OddIy Terrifying (@OTerrifying) October 19, 2022 -
Viral Video: గేదె ముందు యువతి కుంగ్‌ఫూ స్టెప్పులు.. దెబ్బకు చిర్రెత్తడంతో..
సోషల్ మీడియా వినియోగం పెరిగినప్పటి నుంచి అందరికి ఫేమస్ అయిపోవాలన్న పిచ్చి బాగా పెరిగిపోతుంది. రీల్స్, షార్ట్స్ వంటి వీడియోలు రికార్డ్ చేసి నెట్టింట్లో అప్లోడ్ చేయడానికి తెగ ఆరాటపడుతున్నారు. నలుగురిలో పాపులారిటీ తెచ్చుకోవాలన్న భ్రమలో మితిమీరి ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలో తాము ఏం చేస్తున్నమన్నది తెలియకుండా లేకుండా రెచ్చిపోతున్నారు. అయితే కొందరు తమ పిచ్చి ప్రవర్తనకు తగిన మూల్యాన్ని చెల్లించుకుంటున్నారు. తాజాగా ఓ యువతి కూడా ఇలాగే చేసింది. జంతువు ముందు ఓవరాక్షన్ చేసి చివరికి ఫలితం అనుభవించింది. గులాబీ, నీలిరంగు డ్రెస్ ధరించిన ఓ యువతి తాడుతో కట్టేసిన గేదేకు దానా వేస్తూ చిందులు వేసింది. ఆకలితో ఉన్న గేదే ముందు చిత్ర విచిత్రంగా డాన్స్ చేసింది. కుంగ్ ఫూ స్టెప్పులు చేస్తూ దానికి చిరాకు తెప్పించింది.. ఇంకేముంది చిర్రెత్తిపోయిన గేదే ఒక్కసారిగా తన రెండు కొమ్ములతో యువతిని దూరంగా నెట్టిపడేసింది. దీంతో యువతి ఎగిరి పక్కన ఉన్న కంచె మీద పడింది. చదవండి: మెట్రో స్టేషన్‌పై వ్యక్తి హల్చల్.. పోయే కాలం అంటే ఇదేనేమో భయ్యా! ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియరాలేదు. కానీ రెండు నెలల క్రితమే ఈ వీడియోను సైకో బిహారీ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్‌లో షేర్ చేయడంతో.. తాజాగా నెట్టింట్లో వైరలవుతోంది. ఆకలితో ఉన్న జంతువులను ఇబ్బంది పెట్టవద్దు. గేదేకు పాపం యువతి డ్యాన్స్ నచ్చలేదు. ఇంకొంచెం ప్రాక్టిస్ చేసుంటే బాగుండు’ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. 5 లక్షలకు పైగా వ్యూస్, 25 వేల లైకులు వచ్చాయి. View this post on Instagram A post shared by Psycho Bihari (@psycho_biihari) -
గొర్ర గేదె మృతి
పోలవరం రూరల్: మండలంలోని ఎల్ఎన్డీపేట గ్రామ సమీపంలోని డేరా కొండ అటవీ ప్రాంతంలో గొర్రగేదె మృతిచెందింది. రెండు రోజుల క్రితం జీడిమామిడి పిక్కలు ఏరుకునేందుకు వెళ్లిన ముగ్గురు వ్యక్తుల పై దాడి చేసిన ఘటన విధితమే. ఈ దాడిలో కట్టవ రామాయమ్మ అక్కడికక్కడే మృతిచెందగా, పంది కొవ్వాడయ్య, పంది గంగాభవానీలకు గాయాలయ్యాయి. వీరు చికిత్స పొందుతున్నారు. అటవీప్రాంతంలో పొదల నుంచి దుర్వాసన రావడంతో పశువుల కాపరులు గుర్తించి గొర్ర గేదె చనిపోయినట్లు నిర్ధారించారు. ఈ సమాచారాన్ని అధికారులకు స్థానిక వీఆర్వో సమాచారం ఇచ్చారు. దాడి జరిగిన రోజునే గొర్ర గేదె మృతిచెంది ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు. ఐతే గొర్ర గేదె చనిపోవడానికి గల కారణాలు తెలియరాలేద. -
దున్నపోతుతో తొక్కించుకుంటే ఊరికి మేలు జరుగుతుందని..
కొత్తపల్లి: దున్నపోతుతో తొక్కించుకుంటే ఊరికి మేలు జరుగుతుందని అక్కడి ప్రజల విశ్వాసం. ప్రతి ఏడాది మాదిరిగానే కొత్తపల్లి మండలం అమీనాబాద్‌లో పోలేరమ్మ తీర్థంలో ఈ విచిత్రం చోటు చేసుకుంది. గురువారం ఉదయం దున్నపోతును తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దానిని గరగ నృత్యాల మధ్య గ్రామమంతా ఊరేగించి, ఆలయం వద్దకు తీసుకువచ్చారు. ఉపవాసం ఉన్న భక్తులందరూ పసుపు నీళ్లతో స్నానం చేసి, అమ్మవారి ఆలయం ఎదురుగా నేలపై వరుసగా పడుకున్నారు. వారి మీదుగా దున్నపోతును నడిపించారు. ఓ భక్తురాలు కూడా వీరిని తొక్కుకుంటూ ముందుకు సాగింది. అలా మూడుసార్లు భక్తులు దున్నపోతుతో తొక్కించుకున్నారు. ఇలా తొక్కించుకోవడం వలన వల్ల గ్రామానికి ఉన్న అరిష్టం పోవడంతో పాటు తమ కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. గతంలో ఈ దున్నపోతును బలి ఇచ్చేవారు. ఇప్పుడు అలా చేయకుండా పూజల అనంతరం విడిచి పెట్టేస్తున్నారు. -
Viral Video: దున్నపోతుతో యవ్వారం.. దెబ్బకు గాల్లో ఎగిరి పడ్డారు..
చాలా మంది కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతుంటారు. మనం ఏం చేసినా అది మనకు తప్పక తిరిగి వస్తుందని భావిస్తుంటారు. ఎవరికైనా మంచి చేసినా లేదా హాని తలపెట్టినా దాని ఫలితం తప్పక అనుభవిస్తామని గట్టిగా నమ్ముతారు. అచ్చం ఇలాగే కొంత మంది తాము చేసిన ఘనకార్యానికి తక్షణ కర్మను ఎదుర్కొన్న ఘటన తాజాగా చోటుచేసుకుంది. భారత అటవీశాఖ అధికారి పర్వీన్ కస్వాన్ ట్విటర్లో మార్చి 28న షేర్ చేసిన ఓ వీడియో తాజాగా నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇందులో అయిదుగురు వ్యక్తులు దున్నపోతు మీద కూర్చొని రోడ్డు మీద సవారీ చేస్తున్నారు. వీళ్లు రోడ్డుపై బైక్‌పై, గుర్రం మీద వెళుతున్న మరికొంతమందితో పోటీపడి రైడ్ చేస్తున్నారు. పక్కన వెళుతున్న వారు హారన్లు కొడుతూ ముందుకు దూసుకు వెళ్తుండటంతో.. దున్నపోతు కూడా వేగంగా వెళ్లాలని దాని మీద ఉన్న వ్యక్తులు దున్నపోతును రెండు దెబ్బలు వేశారు. అక్కడే కథ అడ్డం తిరిగింది. చదవండి: భయానక వీడియో.. మహిళ చెవిలోకి దూరిన పీత.. ఎలా బయటకు తీశారంటే.. దెబ్బలు తిన్న దున్నపోతు ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పి కుడివైపుకు తిరిగింది. బండి చక్రాలలో ఒకటి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో బండి మీదున్న అయిదుగురు వ్యక్తులు అమాంతం గాల్లో ఎగిరి రోడ్డుపై ఎగిరిపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జంతువులను చిత్ర హింసలు పెడితే తగిన శిక్ష అనుభవిస్తారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరికొంతమంది ‘ఈ వీడియో మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. నా జీవితంలో నేను చూసిన అత్యుత్తమ ముగింపు ఇది. కర్మ తిరిగి పొందారు’ అని కామెంట్లు చేశారు. Karma 🙏 (Watch till the end) pic.twitter.com/4ixpQ7Z5xO — Susanta Nanda IFS (@susantananda3) March 28, 2022 -
Viral Video: భయంతో చెట్టెక్కిన సింహం... ఏ మాత్రం పట్టు తప్పినా అంతే!
Lion Hangs From A Tree: జంతువులకు సంబంధించిన రకరకాల వీడియోలను చూశాం. క్రూరమృగాలైన సైలెంట్‌గా ఉన్నాయని వేలాకోళం చేసి ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు కోకొల్లలు. అయితే ఒక్కోసారి ఆ క్రూరమృగాలు కూడా టైం బాగోకపోతే చిన్న జంతువులకు భయపడాల్సిందే. చలి చీమల చేత చచ్చిన పాము మాదిరిగా ఉంటుంది. అచ్చం అలాంటి ఘటనే ఒక అడవిలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...సింహాలను అడవికి రాజు అంటారు . అలాంటి సింహాన్ని చూసి ఏ జంతువైన భయంతో పరిగెడుతుంది. కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా సింహమే భయంతో చెట్టెక్కింది. అసలేం జరిగిందంటే.. అడవి గేదేల మందను చూసి సంహం ఒక్కసారిగి బిత్తరపోయి భయంతో పారిపోయేందుకు ప్రయత్నించింది. పైగా అక్కడకు దగ్గరలో ఉన్న చెట్టెక్కి బిక్కుబిక్కు మంటూ వేలాడుతూ ఉంది. కానీ అక్కడ ఉన్న గేదెల మంద ఆ సింహ ఎప్పుడూ కిందకు దిగుతుందా అన్నట్లుగా ఆ చెట్టు చుట్టూ చేరి చూస్తున్నాయి. ఈ ఘటకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by wild animal shorts (@wild_animal_shorts_) (చదవండి: ఉక్రెయిన్ ఉక్కు వీరులు!.. ఒట్టి చేతులు.. వాటర్ బాటిల్‌తో బాంబులు నిర్వీర్యం) -
దున్నపోతు వీరంగం.. రైల్వేగేటునే లేపేసింది
సాక్షి, కరీంనగర్: పెద్దపల్లిలో కునారం రైల్వేగేటు వద్ద దున్నపోతు వీరంగాన్ని సృష్టించింది. దున్నపోతు రైల్వేగేటు సమీపంలో చేరుకొని గేటు దాటి అవతలివైపుకి వెళ్తుంది. ఈ క్రమంలో.. సిగ్నల్ పడటంతో రైల్వే కీపర్ గేటును కిందకుదించాడు. దీంతో ఆగ్రహించిన దున్నపోతు.. తన బలం మొత్తాన్ని రైల్వేగేటుపై చూపించింది. అంతటితో ఆగకుండా తన బలమైన కొమ్ములతో రైల్వేగేటును పైకి ఎత్తేసి, వంగిపోయేలా చేసింది. దీంతో కాల్ప శ్రీరాంపూర్, జమ్మికుంట వెళ్లే రహదారిని తాత్కాలికంగా నిలిపేశారు. దీంతో.. ఆమార్గం గుండా వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చదవండి: మాజీ సీఎం భార్య, కుమార్తెకు కరోనా -
దున్నపోతు చేసిన పనికి నెటిజన్లు ఫిదా.. వైరల్ వీడియో
సాధారణంగా కొన్ని సందర్భాల్లో సాటి మనుషులే.. తోటివారు ఆపదలో ఉన్నప్పుడు మనకేందుకులే అని వదిలేస్తారు. అయితే, ఒక మూగ జీవి మాత్రం ఆపదలో ఉన్న సాటి జీవికి సహయం చేసి మనుషులు తమ ప్రవర్తనను మార్చుకోవాలనే సందేశాన్ని ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కాగా, దున్నపోతులు కొన్ని సందర్భాల్లో కోపంగా ప్రవర్తిస్తుంటాయి. ఆ సమయంలో వాటికి ఎదురుగా ఎవరున్నా కోపంతో పైకి ఎత్తి కిందపడేస్తాయి. కొన్ని చోట్ల దున్నపోతుల పోటీలను నిర్వహిస్తుంటారు. వీటిలో వాటిని ఎరుపు వస్త్రం చూపించి, దాన్ని రెచ్చగొట్టేలా చేసి.. లొంగ తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ ఆటలో ఒక్కొసారి అనుకొని సంఘటనలు చోటు చేసుకున్నవిషయం మనకు తెలిసిందే. అయితే, ఇక్కడ మాత్రం.. ఒక దున్నపోతు తనకు ఎదురుగా ఉన్న ఒక జీవిని.. కోపంగా కుమ్మకుండా ప్రశాంతంగా దాని ప్రాణాలను కాపాడింది. వివరాలు.. ఈ వీడియోలో ఒక నలుపు రంగు దున్నపోతు, దాని ముందు ఒక తాబేలు ఉన్నాయి. పాపం.. తాబేలు ఇసుకలో నడుచుకుంటూ వెళ్లి బోర్లాపడింది. ఎంత ప్రయత్నించిన పైకి లేవలేకపోయింది. అప్పుడు ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. దీన్ని గమనించిన ఒక దున్నపోతు.. వెంటనే అక్కడికి వెళ్లి తన కొమ్ములతో తాబేలుకు ఆనించి.. పైకి లేచేలా చేసింది. దీంతో ఈ సంఘటనను చూస్తున్న అక్కడి వారంతా అభినందిస్తు కేకలు వేశారు. అయితే, దీన్ని గతంలో మనస్కామ్రాన్ అనే టిక్ టాక్ యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. ప్రస్తుతం ఈ వీడియో మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. కొందరు మనుషుల కంటే నోరులేని జీవాలే నయం అంటూ కామెంట్లు చేస్తున్నారు. Buffalo saved a tortoise by flipping him over.. 🎥 IG: sanamkamran pic.twitter.com/DpHAbsk2eA — Buitengebieden (@buitengebieden_) December 16, 2021