పశువాంఛతో...రెండేళ్ల జైలు | Man gets two years for raping buffalo | Sakshi
Sakshi News home page

పశువాంఛతో...రెండేళ్ల జైలు

Published Sat, Jul 19 2014 10:24 AM | Last Updated on Sat, Jul 28 2018 8:35 PM

Man gets two years for raping buffalo

కరీంనగర్ : కామవాంఛ తీర్చుకోవడానికి పశువుపై సంభోగ ప్రయత్నం చేసిన ఓ వ్యక్తికి న్యాయస్థానం రెండేళ్ల జైలుశిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే  తిమ్మాపూర్ మండలం పోరండ్లకు చెందిన బొజ్జ బాలయ్యకు పాలిచ్చే గేదె ఉంది. దానిని రోజులాగే ఇంటిముందు చెట్టుకు కట్టివేశాడు. ఉదయం మేత వేసేందుకు వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన  నీలం లచ్చయ్య (48) ఒంటిపై బట్టలు లేకుండా గేదెతో సంభోగం చేస్తుండగా చూసి అరవటంతో అతడు పరారయ్యాడు. గేదె యజమాని బాలయ్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

గేదె నుంచి శాంపిల్స్ సేకరించి హైదరాబాద్లోని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. పోలీసులు లచ్చయ్యను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. అప్పటినుంచి అతగాడు జిల్లా జైల్లో ఉంటే కేసు విచారణకు హాజరు అవుతున్నాడు. ఈ సంఘటన 2013 జూలై 12న జరిగింది. సాక్ష్యాధారాలు పరిశీలించిన కరీంనగర్ అదనపు జుడీషియల్ మెజిస్ట్రేట్ అజహర్ హుస్సేన్ ...లచ్చయ్యకు రెండేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. దాంతో పాటు రూ.100 జరిమానా విధించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement