
‘స్వార్‌గేట్’ నిందితుడి పోలీసు కస్టడీ పొడిగింపు
12 రోజుల కస్టడీ అనంతరం కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
మరికొన్ని రోజులు అవసరమన్న విజ్ఞప్తి మేరకు మార్చి 26 వరకూ పొడిగిస్తూ కోర్టు ఆదేశం
‘స్వార్‌గేట్’అత్యాచారం కేసు నిందితుడికి కోర్టు మార్చి 26 వరకు పోలీసు కస్టడీ విధించింది. 12 రోజుల పోలీసు కస్టడీ అనంతరం గడేను బుధవారం కోర్టులో హాజరు పరిచాం. కస్టడీని పొడిగించాలని కోర్టుకు విన్నవించాం. ఈమేరకు మార్చి 26 వరకూ నిందితుడికి జ్యుడిషియల్ కస్టడీ విధిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. ’అని క్రైంబ్రాంచ్ అధికారి ఒకరు పేర్కొన్నారు.
ముందే క్రిమినల్ నేపథ్యం
ఫిబ్రవరి 25 తెల్లవారుజామున స్వార్‌గేట్ టెర్మినస్ వద్ద ఎమ్మెస్సార్టీసీ బస్సులో 26 ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ దత్తాత్రాయ్ గడే అనే వ్యక్తిని పోలీసులు అరెస్టుచేశారు. బాధితురాలు ఫిబ్రవరి 25 తెల్లవారుజామున సతారా జిల్లాలోని తన స్వస్థలానికి వెళ్లేందుకు స్వార్‌గేట్ బస్టాండ్‌లో వేచి ఉండగా బస్‌కండక్టర్‌నని చెప్పి గాడే ఆమెను అప్పటికే అక్కడ ఉన్న బస్సులో ఎక్కాల్సిందిగా కోరాడు. ఈమేరకు బాధితురాలు బస్సులోపలికి వెళ్లగా గాడే రెండు తలుపులూ మూసివేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటన అనంతరం డ్రోన్లు స్నిఫర్ డాగ్‌ల సహాయంతో శిరూర్ తహసీల్ పరిధిలో తన స్వస్థలం గుణత్ గ్రామానికి సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో గడేను పట్టుకున్నారు. అతడిపై ఇప్పటికే అరడజను క్రిమినల్ కేసులున్నాయని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment