
ముంబై: మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. పుణెలో జరిగిన పోలీసు రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో కుప్పకూలి ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. మృతుడిని 27 ఏళ్ల తుషార్ బాబన్‌గా గుర్తించారు.
శివాజీనగర్ ఏరియాలోని పోలీస్ గ్రౌండ్‌లో శనివారం పోలీస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ జరిగింది. ఫిజికల్ టెస్ట్‌లలో భాగమైన పరుగు పందెంలో పరుగెత్తుతూ అహ్మద్ నగర్‌లోని సంగమ్‌నేర్‌కు చెందిన తుషార్ ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు
వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. ప్రాథమిక విచారణలో యువకుడికి గుండెపోటు వచ్చినట్లు తేలిందని, దీనిపై తదుపరి విచారణ జరుగుతోందని పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment