School Girl Was Harassed On The Campus In Pune - Sakshi
Sakshi News home page

స్కూల్‌కి వెళ్తున్న మైనర్‌ను ఫాలో చేసి.. బలవంతంగా టాయిలెట్స్‌లోకి లాకెళ్లి.. 

Published Thu, Mar 24 2022 4:15 PM | Last Updated on Thu, Mar 24 2022 7:00 PM

School Girl Was Harassed On The Campus In Pune - Sakshi

సాక్షి, ముంబై: దేశంలో మైనర్లు, మహిళలపై లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. కొందరు మృగాలు వారిని వేధింపులకు గురి చేస్తూ రాక్షసానందం పొందుతున్నారు. లైంగిక దాడులు, వేధింపులను ఆపేందుకు ప‍్రభుత్వం ఎన్ని చట్టాలను తీసుకువచ్చినా కొందరి ప్రవర్తనలో మాత్రం మార్పు రావడంలేదు. తాజాగా మరో అమానవీయ ఘటన చోటుచేసుకుంది.

స్కూల్‌లోని టాయిలెట్స్‌లోకి లాక్కెళ్లి మైనర్‌(11)పై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని పూణేలో జరిగింది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని శివాజీనగర్‌ ప్రాంతంలోని ఓ ఉన్నత పాఠశాలలో మైనర్‌(11) చదువుకుంటోంది. ప్రతీ రోజు స్కూల్‌కు వెళ్లినట్టుగానే పాఠశాలకు వెళ్తుండగా.. గుర్తు తెలియని వ్యక్తి ఒకరు ఆమెను ఫాలో చేశాడు. 

స్కూల్‌ దగ్గరకి చేరుకోగానే ఆమెతో గొడవకు దిగి.. బలవంతంగా మైనర్‌ను టాయిలెట్స్‌లోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ఆమెను చంపేస్తానని వార్నింగ్‌ ఇచ్చి అక్కడి నుంచి పరారయ్యాడు. కాగా, స్కూల్‌ ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లిన బాధితురాలు జరిగిన విషయాన్ని తన తల్లికి చెప్పింది. ఈ క్రమంలో బాలిక తల్లి వెంటనే శివాజీనగర్‌ పోలీసులను ఆశ్రయించి జరిగిన ఘటనపై ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement