ముంబై: పుణె పోర్షే కారు రోడ్డు ప్రమాదం కేసులో పోలీసులు కీలక విషయాలు బయటపెట్టారు. మైనర్ బాలుడు తాను మద్యం తాగి కారు నడిపినట్లు అంగీకరించాడని తెలిపారు. మద్యం తాగటం వల్ల తనకు ఏం గుర్తులేదని చెప్పినట్లు క్రైం బ్రాంచ్ పోలీసులు పేర్కొన్నారు.
‘మైనర్ బాలుడిని దర్యాప్తులో భాగంగా ప్రమాదానికి ముందు అతను ఉన్న లోకేషన్?, బ్లాక్ అండ్ కోసీ పబ్సుల్లో ఉన్నారా?, కారు డ్రైవింగ్ చేశారా? ప్రమాదానికి సంబంధించి వివరాలు, సాక్ష్యాలు, బ్లడ్ శాంపిళ్లు తారుమారు చేయటం.. ఇలా పలు ప్రశ్నలు అడిగాం. అయితే ఏది అడిగినా ఒకే సమాధానం చెప్పాడు. నాకు ఏం గుర్తు లేదు. నేను అప్పడు తాగి ఉన్నా అని చెప్పాడు’ అని క్రైం బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు.
ప్రాథమిక దర్యాప్తులోనే మైనర్ బాలుడు, అతని స్నేహితులు రెండ్లు పబ్బుల్లో రూ. 48 వేలు ఖర్చుపెట్టి మరీ మద్యం తాగినట్లు పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. ఇక.. శనివారం మైనర్ తల్లిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు పుణె సీపీ అమితేష్ కుమార్ తెలిపారు. తన కుమారుడి బ్లడ్ శాంపిళ్లకు బదులు ఆమె బ్లడ్ శాంపిళ్లు ఇచ్చినందుకు ఆమెను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. సాసూన్ హాస్పిటల్ డాక్టర్లే ఆమెచేత ఈ పని చేయించారని అన్నారు.
ఈ కేసులో అరెస్టైన మైనర్ బాలుడి తల్లిదండ్రులను జూన్ 5 వరకు పుణె కోర్టు ఆదివారం పోలీసు కస్టడీకి ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment