ముంబై: ఇరవై ఏళ్ల మహిళపై అత్యంత దారుణంగా అత్యాచారానికి పాల్పడిన ఆటో డ్రైవర్‌ును ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా నలసోపరా నివాసి అయిన మహిళ మంగళవారం అర్థరాత్రి గోరేగావ్‌లోని రైల్వే స్టేషన్ సమీపంలో కనిపించింది. అయితే ఒక ఆటోను బుక్ చేసుకున్న ఆ మహిళకి ఆటో డ్రైవర్ మాయ మాటలు చెప్పి అర్నాలా బీచ్‌కు తీసుకెళ్లాడు.
తొలుత ఒక హోటల్‌కు తీసుకెళ్లదామని ప్లాన్ చేసిన ఆటో ్డ్రైవర్.. ఆ మహిళ వద్ద సరైన గుర్తింపు ాకార్డులు లేకపోవడంతో హోటల్ రూమ్ ఇవ్వలేదు. ాదాంతో అక్కడ్నుంచి ఆ మహిళని నేరుగా బీచ్‌కు తీసుకెళ్లాడు. ఆ మహిళ ఇంటికి సరిగ్గా 12 కి.ీమీ ఉంటుందని పోలీసులు తమ ివిచారణలో వెల్లడైనట్లు పేర్కొన్నారు.
ప్రైవేట్ పార్ట్స్ లో సర్జికల్ బ్లేడ్, రాళ్లు
ఆ ుమహిళపై అత్యాచారానికి పాల్పడిన అనంతరం నిందితుడిగా భావిస్తున్న ఆటో డ్రైవర్.. ఆమె ప్రైవేట్ పార్ట్స్‌లో సర్జికల్ బ్లేడ్ తో పాటు రాళ్లను చొప్పించినట్లు గుర్తించారు. ఈ ఘటన తర్వాత తనకు విపరీతమైన నొప్పి రావడంతో ఆమె స్థానిక పోలీసుల్ని సంప్రదించింది. దాంతో సదరు మహిళని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లగా, సర్జికల్ బ్లేడ్, రాళ్లతో సహా ఇతర వస్తువులను ఆమె ప్రైవేట్ భాగాలలో బలవంతంగా చొప్పించినట్లు వెల్లడైంది. వైద్యులు విజయవంతంగా వస్తువులను తొలగించినట్లు పోలీసులు తెలిపారు. ఆ ఆటో డ్రైవర్ ను శుక్రవారం అదుపులోకి తీసుకుని అత్యాచారం కేసు నమోదు చేశారు.
ఆ మహిళపై గతంలో రెండుసార్లు అత్యాచారం
అయితే ఆ మహిళపై గతంలో కూడా అత్యాచారం జరిగిన విషయాన్ని ఆమె తండ్రి తమకు చెప్పినట్లు ోపోలీసులు పేర్కొన్నారు. 2023లో ముంబై నిర్మలా నగర్ శివాజీ నగర్‌లో ఆమె అత్యాచారానికి గురైన విషయాన్ని పోలీసులు తెలిపారు.
ఆమె మానసిక పరిస్థితి బాగాలేకనే..!
ఆ మహిళ మానసిక పరిస్థితిపై కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమె మానసిక పరిస్థితి బాగా లేకనే ఆమె పలుమార్లు అత్యాచారానికి ుగురై ఉండవచ్చినదే పోలీసుల అనుమానం.
Comments
Please login to add a commentAdd a comment