ముంబై: మహారాష్ట్రలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. పోలీసుల ఇన్‌ఫార్మర్ నెపంతో పౌరుడు సుఖ్‌రామ్ మాడవిని దారుణంగా హత్య చేశారు. అనంతరం, ఆయన మృతదేహం వద్ద మావోయిస్టులు లేఖను విడిచిపెట్టి వెళ్లారు. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
వివరాల ప్రకారం.. గడ్చిరోలిలో మావోయిస్టులు ఘాతుకానికి ఒడిగట్టారు. భమ్రాగడ్ తహసీల్‌లో ఉన్న కియర్ గ్రామంలో సామన్య పౌరుడు సుఖ్‌రామ్ మాడవిని హత్య చేశారు. అనంతరం, అతడి మృతదేహం వద్ద లేఖను విడిచిపెట్టి వెళ్లారు. ఈ లేఖలో మాడవిని పోలీసుల ఇన్‌ఫార్మర్‌ని అని తెలిపారు. పెంగుండ ప్రాంతంలో పోలీసు క్యాంప్ ఏర్పాటుకు అతడు సహకరించాడని పేర్కొన్నారు. మావోయిస్టుల కదలికలపై పోలీసులకు సమాచారం అందించినట్టు తెలిపారు.
ఇదిలా ఉండగా.. మావోయిస్టుల చర్యపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణ పౌరుడైన సుఖ్‌రామ్ మాడవిని ఇన్‌ఫార్మర్ నెపంతో హత్య చేయడం దారుణమన్నారు. కాగా, ఈ ఏడాదిలో మావోయిస్టులు ఓ వ్యక్తిని హత్య చేయడం ఇదే మొదటిసారని అన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్త చేపట్టినట్టు చెప్పుకొచ్చారు. మరోవైపు.. ఇటీవలి కాలంలో ఎన్‌కౌంటర్ల కారణంగా భారీ సంఖ్యలో మావోయిస్టులు చనిపోయిన విషయం తెలిసిందే. దాదాపు 40 మందికి పైగా మావోయిస్టులు మృత్యువాతపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment