ముంబై: ఓ వైపు ప్రాణాలు పోగుట్టుకుంటున్నా యువతకు సెల్ఫీ పిచ్చి మాత్రం వదలట్లేదు. ప్రమాదకర పరిస్థితుల్లో సెల్ఫీలు దిగుతూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. తాజాగా మహారాష్ట్రలో మరో సెల్ఫీ మరం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి అడవి ఏనుగుతోనే సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయాడు.
శ్రీకాంత్ రామచంత్ర సాత్రే అనే 23 ఏళ్ల యువకుడు తన ఇద్దరు స్నేహితులలతో కలిసి గడ్చిరోలి జిల్లాలో కేబుల్ లేయింప్ పనికోసం వచ్చాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం అబాపూర్ అడవుల్లో అడవి ఏనుగును చేసేందుకు వెళ్లారు. అక్కడ రోడ్డు మీద వెళ్తుండగా అడవి ఏనుగు కనిపించింది. ఇంకేముంది దానితో సెల్ఫీ దిగేందుకు ముగ్గురు ప్రయత్నించారు. ఇది గమనించిన ఏనుగు ఒక్కసారిగా ముగ్గురిని తరుముకుంటూ వచ్చింది. ఏనుగు దాడి నుంచి ఇద్దరు తృటిలో తప్పించుకోగా.. శ్రీకాంత్‌ను అడవి ఏనుగు దాడి చేసి చంపింది.
అయితే రెండు రోజుల క్రితం చిట్టగాంగ్, గడ్చిరోలి అటవీ ప్రాంతం నుంచి అడవి ఏనుగు బయటకు వస్తున్నట్లు అధికారులకు సమాచారం అందించింది. ముట్నూర్ అటవీ ప్రాంతంలోని అబాపూర్ అడవుల్లో ఏనుగు సంచరిస్తోందని గుర్తించారు.
అదే సమయంలో శ్రీకాంత్అ తని ఇద్దరు స్నేహితులు పని నిమిత్తం ఆ ప్రాంతంలో ఉండటంతో. ఏనుగులను చూసేందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దూరం నుంచి ఏనుగుతో సెల్ఫీ దిగాలని ప్రయత్నించగా..వెంటనే ఏనుగు అతనిపై దాడి చేసి ప్రాణాలు తీసింది. తీవ్ర గాయాలపాలైన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
Comments
Please login to add a commentAdd a comment