wild elephant
-
ప్రాణం తీసిన సెల్ఫీ సరదా.. వ్యక్తిని తొక్కి చంపిన అడవి ఏనుగు
ముంబై: ఓ వైపు ప్రాణాలు పోగుట్టుకుంటున్నా యువతకు సెల్ఫీ పిచ్చి మాత్రం వదలట్లేదు. ప్రమాదకర పరిస్థితుల్లో సెల్ఫీలు దిగుతూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. తాజాగా మహారాష్ట్రలో మరో సెల్ఫీ మరం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి అడవి ఏనుగుతోనే సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయాడు.శ్రీకాంత్ రామచంత్ర సాత్రే అనే 23 ఏళ్ల యువకుడు తన ఇద్దరు స్నేహితులలతో కలిసి గడ్చిరోలి జిల్లాలో కేబుల్ లేయింప్ పనికోసం వచ్చాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం అబాపూర్ అడవుల్లో అడవి ఏనుగును చేసేందుకు వెళ్లారు. అక్కడ రోడ్డు మీద వెళ్తుండగా అడవి ఏనుగు కనిపించింది. ఇంకేముంది దానితో సెల్ఫీ దిగేందుకు ముగ్గురు ప్రయత్నించారు. ఇది గమనించిన ఏనుగు ఒక్కసారిగా ముగ్గురిని తరుముకుంటూ వచ్చింది. ఏనుగు దాడి నుంచి ఇద్దరు తృటిలో తప్పించుకోగా.. శ్రీకాంత్‌ను అడవి ఏనుగు దాడి చేసి చంపింది.అయితే రెండు రోజుల క్రితం చిట్టగాంగ్, గడ్చిరోలి అటవీ ప్రాంతం నుంచి అడవి ఏనుగు బయటకు వస్తున్నట్లు అధికారులకు సమాచారం అందించింది. ముట్నూర్ అటవీ ప్రాంతంలోని అబాపూర్ అడవుల్లో ఏనుగు సంచరిస్తోందని గుర్తించారు. అదే సమయంలో శ్రీకాంత్అ తని ఇద్దరు స్నేహితులు పని నిమిత్తం ఆ ప్రాంతంలో ఉండటంతో. ఏనుగులను చూసేందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దూరం నుంచి ఏనుగుతో సెల్ఫీ దిగాలని ప్రయత్నించగా..వెంటనే ఏనుగు అతనిపై దాడి చేసి ప్రాణాలు తీసింది. తీవ్ర గాయాలపాలైన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. -
గజరాజుకు కోపమొస్తే అట్లనే ఉంటది మరి!
-
వయొలెన్స్.. వయొలెన్స్.. ఐ డోంట్ లైక్ ఇట్
వైరల్: కొన్ని వీడియోలు గమ్మత్తుగా అనిపిస్తాయ్. ప్రమాదకరమే అయినా.. పెదాలపై నవ్వులు పూయిస్తాయి. అలాంటి వీడియోనే ఇది. ఓ వ్యక్తి దగ్గరికి సైలెంట్‌గా దూసుకొచ్చిన అడవి ఏనుగు.. అతని పైకి మట్టిని దంచి కొట్టి పక్కకు తప్పుకోమని ఎలా సైగ చేసిందో ఓ లుక్కేయండి. వీడియోపై స్పష్టత లేకున్నా.. శ్రీలంకలోని యాలా నేషనల్ పార్క్‌లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. సాధారణంగా అడవి ఏనుగులు చాలా వైల్డ్‌గా ప్రవర్తిస్తుంటాయి. కానీ, ఈ గజరాజు మాత్రం అలా కాదు. దానికి వయొలెన్స్ ఏ మాత్రం ఇష్టం లేదట!. ఆ ఏనుగుకి షార్ట్ టెయిల్ అనే ముద్దు పేరు కూడా ఉంది. పార్క్‌ను ఆనుకుని ఉన్న హోటల్స్ వెంట తరచూ కనిపిస్తుందని, అలాగని మనుషులపై దాడులు చేసిన దాఖలాలు మాత్రం ఇప్పటిదాకా లేవని స్థానికులు చెప్తున్నారు. Out of the way! 😂 A gentle wild elephant in Sri Lanka calmly walks up to a man and kicks some dirt at him to get him to move aside.. pic.twitter.com/DnrJZX7VLI — Buitengebieden (@buitengebieden) June 30, 2022 -
హెల్మెట్‌ను చాక్లెట్లా మింగేసిన ఏనుగు.. వీడియో వైరల్
దిస్పూర్: సాధారణంగా ఏనుగంటే అందరికి ఇష్టమైన జంతువే. మావటివారు దాన్ని తీసుకొని నగరాలలో, గ్రామాలలో తిప్పుతుంటారు. ఈ క్రమంలో, పిల్లలు దానిపై ఎక్కడానికి ఇష్టపడతారు. అదే విధంగా, దానికి అరటి పండో.. మరేదైన ఫలమో పెట్టి తెగ సంబర పడిపోతుంటారనే విషయం తెలిసిందే. అయితే, ఏనుగు కూడా, ఆఫలాన్నితిని తన తోండంతో వారిని ఆశీర్వదిస్తుందని తెలుసు. అయితే, అస్సాంలో ఒక ఏనుగు చేసిన వెరైటీ పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాలు.. ఈ సంఘటన గువహతిలోని సత్గావ్ ఆర్మీ క్యాంపులో చోటుచేసుకుంది. ఈ ఆర్మీ క్యాంపు అడవికి సమీపంలో ఉంది. అయితే, ఏలా వచ్చిందో.. కానీ, ఒక గజరాజు అడవి నుంచి ఆర్మీ క్యాంపు వైపు వచ్చింది. అది పార్కింగ్ చేసి ఉన్న బైక్ దగ్గరకు చేరుకుంది. అక్కడ, బైక్‌కు తగిలించి ఉన్న హెల్మేట్ను తోండంతో తీసుకుంది. దాన్ని పట్టుకుని వింతగా చూసింది. ఇదంతా గమనిస్తున్న కొంత మంది అధికారులు ఏనుగు దాన్ని కిందపడేసి తొక్కేస్తుందని భావించారు. కానీ ఆ ఏనుగు మాత్రం.. తోండంతో ఆ హెల్మేట్ ను అమాంతం నోట్లో వేసుకొని గుటుక్కున తినేసింది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే , దీన్ని చూసిన నెటిజన్లు.. ‘పాపం... గజరాజుకి ఏంత ఆకలేసిందో..’, ‘ బహుషా.. వెలగ పండు అనుకొని ఉంటుంది కాబోలు..’, ‘ హెల్మెట్ లేదు.. ఇక ఎలా బయటకు ఎలా వెళ్తావు’ అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. చదవండి: ఎంత పని చేశావమ్మా... ఏనుగు! -
అడవి ఏనుగుల బీభత్సం.. వైరల్ వీడియో
చెన్నై : అడవి ఏనుగులు రెండు నగరంలో ప్రవేశించాయి. తెల్లవారుజామును రోడ్ల మీద సంచరిస్తూ బీభత్సం సృష్టించాయి. వివరాలు.. కోయంబత్తూరు సమీపంలోని పూచ్చియూర్ హైటెక్ సిటీ ప్రాంతంలో జరిగింది ఈ సంఘటన. సోమవారం తెల్లవారుజామున రెండు అడవి ఏనుగులు జనావాసంలోకి ప్రవేశించాయి. రోడ్ల మీద తిరుగుతూ.. ప్రజలను ఇబ్బందులు గురిచేశాయి. అంతటితో ఆగక జనవాసాల మీద దాడి చేస్తూ బీభత్సం సృష్టించాయి. ఈ దాడిలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వీరిని సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. -
అడవి ఏనుగుల బీభత్సం..
-
నిద్రలో ఉండగా ఇంట్లో ఐదుగురిని తొక్కిచంపింది
తేజ్‌పూర్: అసోంలో ఓ ఏనుగు భీభత్సం సృష్టించింది. నిద్రలో ఉండగా ఒకే కుటుంబంలో ఐదుగురుని తొక్కి చంపింది. వీరిలో తొమ్మిది నెలల బాలుడు కూడా ఉన్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులోని విశ్వనాథ్ చారియలి జిల్లాలోగల బెమారీ అనే గ్రామంలో గత రాత్రి ఓ కుటుంబంలోని ఆరుగురు గాఢ నిద్రలో ఉన్నారు. అదే సమయంలో బిహాలీ రిజర్వ్ ఫారెస్ట్‌లో నుంచి ఓ ఏనుగు తప్పించుకొని వచ్చి ఆఇంటిపై దాడికి దిగింది. ఆ కుటుంబంలోని ఐదుగురిని తొక్కిపడేసింది. గ్రామస్తులంతా అక్కడికి రావడంతో ఆ ఇంట్లోని మూడేళ్ల పాప ఏనుగు బారిన పడకుండా సురక్షితంగా బయటపడింది. కాగా, అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యంగా కారణంగానే ఈ దుర్ఘటన జరిగందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ గ్రామస్తులంతా ఈ రోజు ఉదయం బెహాలీ జాతీయ రహదారిని దిగ్బంధించారు.