వైరల్: కొన్ని వీడియోలు గమ్మత్తుగా అనిపిస్తాయ్. ప్రమాదకరమే అయినా.. పెదాలపై నవ్వులు పూయిస్తాయి. అలాంటి వీడియోనే ఇది. ఓ వ్యక్తి దగ్గరికి సైలెంట్‌గా దూసుకొచ్చిన అడవి ఏనుగు.. అతని పైకి మట్టిని దంచి కొట్టి పక్కకు తప్పుకోమని ఎలా సైగ చేసిందో ఓ లుక్కేయండి.
వీడియోపై స్పష్టత లేకున్నా.. శ్రీలంకలోని యాలా నేషనల్ పార్క్‌లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. సాధారణంగా అడవి ఏనుగులు చాలా వైల్డ్‌గా ప్రవర్తిస్తుంటాయి. కానీ, ఈ గజరాజు మాత్రం అలా కాదు. దానికి వయొలెన్స్ ఏ మాత్రం ఇష్టం లేదట!. ఆ ఏనుగుకి షార్ట్ టెయిల్ అనే ముద్దు పేరు కూడా ఉంది. పార్క్‌ను ఆనుకుని ఉన్న హోటల్స్ వెంట తరచూ కనిపిస్తుందని, అలాగని మనుషులపై దాడులు చేసిన దాఖలాలు మాత్రం ఇప్పటిదాకా లేవని స్థానికులు చెప్తున్నారు.
Out of the way! 😂
— Buitengebieden (@buitengebieden) June 30, 2022
A gentle wild elephant in Sri Lanka calmly walks up to a man and kicks some dirt at him to get him to move aside.. pic.twitter.com/DnrJZX7VLI
Comments
Please login to add a commentAdd a comment