‘ఇక్కడ జంతువు ఎవరు? వారిని జంతు హంతుకులంటాం’ | Men Try To Scare Elephant With Slippers Viral Video Sparks Anger | Sakshi
Sakshi News home page

‘ఇక్కడ జంతువు ఎవరు? వారిని జంతు హంతుకులంటాం’

Published Sun, Dec 10 2023 9:28 AM | Last Updated on Sun, Dec 10 2023 9:59 AM

Men Try To Scare Elephant With Slippers Viral Video Sparks Anger - Sakshi

భారీ ఏనుగులను దగ్గర నుంచి చేస్తేనే.. సాధారణంగా భయమేస్తుంది! అయితే కొందరు ఓ భారీ ఏనుగును ఆటపట్టించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట  వైరల్‌గా మారింది. ఇక వీడియో వివరాల్లోకి వెళ్లితే.. ఓ భారీ గుంత పైభాగంలో ఉన్న ఏనుగును,  కొందరు వ్యక్తులు గుంత పైకి ఎక్కి ఆటపట్టిస్తూ రెచ్చగొట్టారు. అందులో ఓ వ్యక్తి కాలి చెప్పుతో దాన్ని బెదింరించడానికి ప్రయత్నం చేశాడు. ఈ చర్యతో ఏనుగు కూడా అతనిపై దాడి చేయాడానికి ప్రయత్నించింది. అక్కడితో ఆగకుండా ఆ వ్యక్తి.. మరిసారి దానికి దగ్గర పోయి బెదిరించాడు. అయితే అతని చర్యలకు బెదిరిపోయిన ఏనుగు అక్కడి నుంచి వెళ్లిపోయింది.

ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కస్వాన్ ఈ వీడయోను ఎక్స్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ‘ఇక్కడ నిజమైన జంతువు ఎవరో గుర్తించండి. ఇటువంటి వారిని మేము జంతుహంతకులు అని పిలుస్తాం. జంతువులను ఎప్పుడు ఆటపట్టించకూడదు. ఇటువంటి చర్యలకు పాల్పడటం ప్రాణాంతకం కూడా’ అని ఆయన కాప్షన్‌ జత చేశారు. ఈ ఏనుగు వీడియో అస్సాంకు చెందినట్లు పర్వీన్‌ పేర్కొన్నారు.

ఆ వ్యక్తి చేసిన పనికి నెటినట్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.  ‘అసలు వారు ఏనుగును ఎందుకు ఆటపట్టిస్తున్నారు’, ‘ అతను చేసిన పని సరైంది కాదు’, ‘వారి జీవితాలను తీవ్ర ప్రమాదంలో పడవేసుకుంటున్నారు’, ‘వాడేమైనా బాహుబలినా చెప్పు చూపితే ఏనుగు భయపడటానికి.. దాడి చేస్తే తెలుస్తుంది ఎంటో?​’ అని నెటిజనట్లు కామెంట్లు చేస్తున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement