వాటే రొమాంటిక్‌ ప్రపోజల్‌.. సినిమాల్లో కూడా సాధ్యం కాదు! | Elephant Proposing To Lover With Flowers Netizens Call It Romantic Viral Video | Sakshi
Sakshi News home page

True Love: వాటే రొమాంటిక్‌ ప్రపోజల్‌.. సినిమాల్లో కూడా సాధ్యం కాదు!

Published Sat, Nov 27 2021 3:24 PM | Last Updated on Sat, Nov 27 2021 3:51 PM

Elephant Proposing To Lover With Flowers Netizens Call It Romantic Viral Video - Sakshi

ఏనుగులు చిలిపిగా స్నానం చేసిన వీడియోలు, తమ పిల్ల ఏనుగులపై ప్రేమ కురిపించిన వార్తలు చూశాం. అయితే తాజాగా వాటికి భిన్నంగా ఓ మగ ఏనుగు తాను ప్రేమించిన ఆడ ఏనుగుకు చాలా వైవిధ్యంగా లవ్‌ను ప్రపోజ్‌ చేసిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. లవ్‌ ప్రపోజ్‌ను మనుషులైతే ప్రేమలేఖ, పువ్వులు, చాక్లెట్లను అందించి వ్యక్తంచేస్తారు. అయితే ఈ ఏనుగు కూడా మనుషులకు తానేం తక్కువ కాదన్నట్టు.. తన ప్రేయసి ఏనుగుకు ఫ్లవర్స్‌ అందించి ప్రేమను వ్యక్తం చేసింది. ఆ ఏనుగు తన తొండంతో పూలను పట్టుకొచ్చి.. ఆడ ఏనుగుకు  ఇచ్చి స్వచ్ఛమైన ప్రేమను బయటపెడుతుంది. అంతే ప్రేమతో ఆడ ఏనుగు.. మగ ఏనుగు ఇచ్చిన పూలను తొండంతో పట్టుకొని నేను నీదాన్నే అన్నట్టుగా ప్రవర్తిస్తూ ప్రపోజల్‌ యాక్సెప్టె చేస్తుంది.

ఈ ఏనుగు లవ్‌ ప్రపోజల్‌ వీడియోను ఎలిఫెంట్స్‌ వరల్డ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌చేశారు. ‘ప్రపోజల్‌ యాక్సెప్టెడ్‌!’ అనే కామెంట్‌ కూడా జతచేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోను చూసిన నెటిజన్లు ఏనుగు ప్రేమ ప్రపోజల్‌.. చాలా రోమాంటిక్‌గా ఉందని ఫిదా అవుతున్నారు. ‘మనుషుల కంటే అద్భుతంగా ఈ ఏనుగు లవ్‌ ప్రపోజ్‌ చేసింది!’.. ‘ఏనుగు ప్రేమ ఎంత స్వచ్ఛమైందో? ఈ ‘లవ్‌ ప్రపోజల్‌’లో స్పష్టంగా కనిపిస్తోంది’.. వాటే రోమాంటిక్‌ ప్రపోజల్‌.. సినిమాల్లో కూడా సాధ్యం కాదు!’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement