Viral Video: Proposal on Boat Goes Wrong after Ring Falls into Ocean - Sakshi
Sakshi News home page

Viral Video: టైటానిక్‌ రేంజ్‌లో లవ్‌ ప్రపోజ్‌ చేద్దామనుకున్నాడు.. ఇంతలోనే ట్విస్ట్‌..

Published Mon, Nov 28 2022 3:34 PM | Last Updated on Mon, Nov 28 2022 4:27 PM

Proposal On Boat Goes Wrong After Ring Falls Into Ocean Video Viral - Sakshi

Viral Video.. ప్రస్తుత జనరేషన్‌లో లవ్‌ ప్రపోజల్‌ చేయడంలో వినూత్నంగా థింక్‌ చేస్తున్నారు. కొందరు లవర్స్‌ క్రీడలు జరగుతున్న సమయాల్లో మరికొందరు రోడ్లపై తమ లవ్‌ను ఎక్స్‌ప్రెస్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి తన స్నేహితురాలికి లవ్‌ ప్రపోజ్‌ చేసే క్రమంలో విధి అతడితో ఆటాడుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

వివరాల ప్రకారం.. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన స్కాట్‌ క్లైన్‌, తన ఫ్రెండ్‌ సుజీ టక్కర్‌తో కలిసి సముద్రంలో పడవ ప్రయాణం చేస్తున్నాడు. సాయంత్రం వేళ నడి సముద్రంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్న సమయంలో తన ప్రేమను ఆమెను తెలపాలనుకున్నాడు. అదే సమయంలో టైటానిక్‌ సిని​మాలో ఫేమస్‌ ఫోజులో నిలుచున్న తర్వాత ఓ రింగ్‌లో ఆమెకు ప్రపోజ్‌ చేయాలని భావించాడు. 

అనుకున్నదే తడవు.. తన జేబులోని నుండి రింగ్‌ ఉన్న ఓ బాక్స్‌ను తెరచి మెకాళ్లపై నిలుచుని ప్రపోజ్‌ చేయబోయాడు. అదే సమయంలో విధి తనతో ఆటాడుకుంది. పడవపై వారు అటు ఇటు కదలడంతో రింగ్‌ ఉన్న బాక్స్‌ కాస్తా సముద్రంలో పడిపోయింది. దీంతో​, వెంటనే ఆ బాక్స్‌ను పట్టుకునేందుకు స్కాట్‌ సముద్రంలో దూకాడు. అదృష్టం కొద్దీ అతడు ఉంగారాన్ని పట్టుకోగలిగాడు. అనంతరం, ఆ రింగ్‌ను ఆమెకు ఇచ్చి ప్రపోజ్‌ చేయడంతో ఆమె గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. 

ఈ ఘటన అనంతరం స్కాట్‌ మాట్లాడుతూ.. రింగ్‌ ప్రపోజ్‌ చేసే ముందు నా వెనుక జేబులో నుండి బాక్స్‌ సముద్రంలో పడిపోయింది. వెంటనే దాని కోసం సముద్రంలో దూకాను. ఈ క్రమంలో నేను భయాందోళనకు గురయ్యాను. రింగ్ బాక్స్ దొరకడంతో ఊపిరి పీల్చుకున్నాను. అదృష్టం కొద్ది నేను ఉంగరాన్ని తిరిగి పొందగలిగాను అని తెలిపాడు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement