ocean water
-
Viral Video: టైటానిక్ రేంజ్లో లవ్ ప్రపోజ్ చేద్దామనుకున్నాడు.. ఇంతలోనే ట్విస్ట్..
-
టైటానిక్ రేంజ్లో లవ్ ప్రపోజ్ చేద్దామనుకున్నాడు.. ఇంతలోనే ట్విస్ట్..
Viral Video.. ప్రస్తుత జనరేషన్లో లవ్ ప్రపోజల్ చేయడంలో వినూత్నంగా థింక్ చేస్తున్నారు. కొందరు లవర్స్ క్రీడలు జరగుతున్న సమయాల్లో మరికొందరు రోడ్లపై తమ లవ్‌ను ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి తన స్నేహితురాలికి లవ్ ప్రపోజ్ చేసే క్రమంలో విధి అతడితో ఆటాడుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన స్కాట్ క్లైన్, తన ఫ్రెండ్ సుజీ టక్కర్‌తో కలిసి సముద్రంలో పడవ ప్రయాణం చేస్తున్నాడు. సాయంత్రం వేళ నడి సముద్రంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్న సమయంలో తన ప్రేమను ఆమెను తెలపాలనుకున్నాడు. అదే సమయంలో టైటానిక్ సినిమాలో ఫేమస్ ఫోజులో నిలుచున్న తర్వాత ఓ రింగ్‌లో ఆమెకు ప్రపోజ్ చేయాలని భావించాడు. అనుకున్నదే తడవు.. తన జేబులోని నుండి రింగ్ ఉన్న ఓ బాక్స్‌ను తెరచి మెకాళ్లపై నిలుచుని ప్రపోజ్ చేయబోయాడు. అదే సమయంలో విధి తనతో ఆటాడుకుంది. పడవపై వారు అటు ఇటు కదలడంతో రింగ్ ఉన్న బాక్స్ కాస్తా సముద్రంలో పడిపోయింది. దీంతో, వెంటనే ఆ బాక్స్‌ను పట్టుకునేందుకు స్కాట్ సముద్రంలో దూకాడు. అదృష్టం కొద్దీ అతడు ఉంగారాన్ని పట్టుకోగలిగాడు. అనంతరం, ఆ రింగ్‌ను ఆమెకు ఇచ్చి ప్రపోజ్ చేయడంతో ఆమె గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ ఘటన అనంతరం స్కాట్ మాట్లాడుతూ.. రింగ్ ప్రపోజ్ చేసే ముందు నా వెనుక జేబులో నుండి బాక్స్ సముద్రంలో పడిపోయింది. వెంటనే దాని కోసం సముద్రంలో దూకాను. ఈ క్రమంలో నేను భయాందోళనకు గురయ్యాను. రింగ్ బాక్స్ దొరకడంతో ఊపిరి పీల్చుకున్నాను. అదృష్టం కొద్ది నేను ఉంగరాన్ని తిరిగి పొందగలిగాను అని తెలిపాడు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. -
నీటిలోని చేపను నీరే కబళిస్తే?.. దీని వెనకున్న మిస్టరీ ఏంటి!
చిన్న చేపను పెద్ద చేప.. పెద్ద చేపను సొర చేప మింగడం కామనే.. కానీ నీటిలోని చేపను నీరే కబళిస్తే? చేపలు సహా అక్కడి జలచరాలనే ‘మింగేస్తే’? విచిత్రంగా అనిపిస్తున్నా ఇది నిజమేనని శాస్త్రవేత్తలు తాజాగా నిర్ధారించారు. దీని వెనకున్న మిస్టరీని బయటపెట్టారు. అదేమిటంటే... ఈజిప్ట్, సౌదీ అరేబియా మధ్యన ఉన్న ఎర్ర సముద్రానికి ఉత్తరాన ఉన్న గల్ఫ్ ఆఫ్ అకాబాలో శాస్త్రవేత్తలు అరుదైన ‘డెత్ పూల్’ను గుర్తించారు. యూనివర్సిటీ ఆఫ్ మయామీకి చెందిన పలువురు శాస్త్రవేత్తలు రిమోట్ ద్వారా నడిచే అండర్‌వాటర్ వెహికల్ ద్వారా సముద్ర గర్భాన్ని పరిశీలించే క్రమంలో 1,770 మీటర్ల లోతున దీన్ని కనుగొన్నారు. సుమారు 100 అడుగుల పొడవున ఈ మడుగు ఉంది. సాంకేతికంగా బ్రైన్పూల్స్ అని పిలిచే ఈ నీటిలో లవణత అత్యంత ఎక్కువగా ఉంటుందని, ఫలితంగా అందులో ఆక్సిజన్ శాతం ఏమాత్రం ఉండదని పేర్కొన్నారు. చదవండి: ఆ చేప చిక్కడమే విషాదం ... హఠాత్తుగా మీదకు దూకి... అందువల్ల చేపలు సహా మరే జలచరాలైనా ఈ మడుగులోకి ప్రవేశించగానే మరణిస్తాయని శాస్త్రవేత్తల బృందానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ శామ్ పుర్కిస్ తెలిపారు. కానీ విచిత్రంగా ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ సూక్ష్మజీవులు ఈ మడుగులో జీవిస్తున్నాయని... ఈ నీటిలోకి వచ్చి మరణించే జలచరాలను ఆహారంగా తీసుకుంటున్నాయని వివరించారు. భూమిపై లక్షల ఏళ్ల కిందట సముద్రాలు ఎలా ఏర్పడ్డాయనే విషయంలో చేపట్టబోయే భావి పరిశోధనలకు తాజా పరిణామం దోహదపడుతుందని చెప్పారు. భూమిపై జీవం మనుగడకు ఉన్న పరిమితులు ఏమిటో అర్థం చేసుకోనిదే ఇతర గ్రహాలపై జీవం ఉనికిని అంచనా వేయడం కష్టమని అభిప్రాయపడ్డారు. ఈ పరిశోధన వివరాలను ప్రముఖ జర్నల్ ‘నేచర్’ ప్రచురించింది. -
ఉప్పు తియ్యనౌతుంది.. నిప్పు నిల్వ ఉంటుంది!
సముద్రపు నీళ్లను తాగునీరుగా మార్చేందుకు, విద్యుత్తును భారీ స్ధాయిలో నిల్వ చేసేందుకు శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగం ఫలించింది! గ్రాఫీన్ పేరెప్పుడైనా విన్నారా? విని ఉండరుగానీ... ఇంట్లో పిల్లలు వాడే పెన్సిల్ మాత్రం మీకు తెలిసే ఉంటుంది. దాంట్లో ఉండే గ్రాఫైట్‌ను ఒక పలుచటి పొరగా పరిస్తే దాన్ని గ్రాఫీన్ అంటారు. శాస్త్ర ప్రపంచంలో చాలాకాలంగా సూపర్ మెటీరియల్‌గా పేరు పొందింది ఈ మూలకం. పేరుకు తగ్గట్టుగానే ఇటీవలి కాలంలో ఈ అద్భుత మూలకం తాలూకూ ఉపయోగాలు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. వాతావరణ మార్పులు కానివ్వండి, ఇంకో కారణం కానివ్వండి.. ప్రపంచవ్యాప్తంగా తాగునీటికి కొరత ఏర్పడుతోందన్నది మాత్రం వాస్తవం. సముద్రంలోని నీటిని మంచినీటిగా మార్చుకుంటే ఈ కొరతను అధిగమించవచ్చుగానీ.. ఇది ఇప్పటికీ చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్నది. ఇక్కడే గ్రాఫీన్ గురించి చెప్పుకోవాలి. మామూలుగానైతే గ్రాఫీన్ ద్వారా లవణాలను వేరు చేయడం, చౌక, సులువు కూడా. అయితే గ్రాఫీన్‌ను పెద్ద ఎత్తున తయారు చేయడం కష్టమవుతుంది. ఈ నేపథ్యంలో మాంచెస్టర్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త రాహుల్ నాయర్ గ్రాఫీన్ స్థానంలో గ్రాఫీన్ ఆక్సైడ్‌ను పెద్ద ఎత్తున తయారు చేయడంలో విజయం సాధించారు. దీన్ని ఒక పూతగా వాడితే చాలు.. సముద్రపు ఉప్పునీటిలోని లవణాలు చాలా తేలికగా వేరుపడతాయి. ఈ పదార్థాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిర్లవణీకరణ యంత్రాల్లో ఉపయోగించి చూస్తామని, వచ్చే ఫలితాలను బట్టి మరింత అభివృద్ధి చేస్తామని రాహుల్ నాయర్ తెలిపారు. ఇక రెండో విషయానికి వద్దాం. తాగునీరు.. జీవితానికి ఎంత అవసరమో, కావాల్సినంత విద్యుత్తు మన జీవనశైలికి అంతే అవసరం. అయితే సూర్యుడి శక్తిని నిల్వ చేసుకోవడంలో కొన్ని ఇబ్బందులున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ఆస్ట్రేలియాలోని ఆర్ఎంఐటీ విశ్వవిద్యాలయం ఓ వినూత్న ఆవిష్కరణ చేసింది. గ్రాఫీన్‌తో తయారు చేసిన ఎలక్ట్రోడ్‌ను అభివృద్ధి చేయడం ద్వారా విద్యుత్తును బ్యాటరీల్లో నిల్వ చేసుకోగల సామర్థ్యం కొన్ని వందల రెట్లు ఎక్కువ కానుంది. అంతేకాదు, ఓ చెట్టు ఆకుల ఆకారాన్ని స్ఫూర్తిగా తీసుకుని అభివృద్ధి చేసిన ఈ ఎలక్ట్రోడ్ ద్వారా శక్తిమంతమైన సూపర్ కెపాసిటర్లను తయారు చేయవచ్చునని ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలు అంటున్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్