love Proposal
-
లవ్ ఈజ్ ఇన్‌ద ఎయర్ : లవ్ ప్రపోజల్ వీడియో వైరల్
తాజ్‌మహల్ ముందే లవ్ ప్రపోజ్ చేయాలా ఏంటి? ఈఫిల్ టవర్ముందు నిలబడే ఐ లవ్ యూ చెప్పాలా? మంచి ఘడియ ముంచుకు రావాలే గానీ ఎక్కడైనా మనసులోని ప్రేమను వ్యక్తం చేయొచ్చు. అందుకే ఇండిగో విమానంలో తన ప్రియుడికి ప్రపోజ్ చేసిందో ప్రేయసి. లవ్ ఈజ్ ఇన్ ది ఎయిర్ అన్నట్టున్న ఈ వీడియో నెట్టింట సందడి చేస్తోంది. "నేను గాలిలో ప్రపోజ్ చేశాను" అంటూ ప్రియురాలు ఐశ్వర్య బన్సల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ అందమైన ఈ వీడియో ప్రేమికుల మనసు దోచుకుంటోంది.బన్సల్, ప్రియుడు అమూల్య గోయల్ ఫ్లైట్ ఎక్కడంతో వీడియో ప్రారంభమవుతుంది. కొన్ని సెకన్ల తర్వాత, బన్సల్ తన బాయ్‌ఫ్రెండ్ వైపు నడుచుకుంటూ వెళ్లి మోకాళ్లపై నిలబడి తన ప్రియుడికి ప్రపోజ్ చేసింది. దీంతో ప్రియుడు ఫుల్ ఖుష్ ఆగి ఆ క్షణంలోనే ఓకే చెప్పేసాడు. అంతే క్షణం ఆలస్యంగా తన బెటర్ హాఫ్ వేలికి ఉంగరాన్ని తొడిగింది. అంతేకాదు దీన్ని ఇండిగో కూడా సెలబ్రేట్ చేసింది. ఫ్లైట్ అటెండెంట్ మైక్రోఫోన్ తీసుకుని, ఇతర ప్రయాణీకుల దృష్టిని ఆకర్షిస్తూ ఈ పెళ్లి ప్రపోజ్ ప్రకటన చేయడం విశేషం. తన జీవితంలో ఎంతో అందమైన ఈ క్షణాలు చాలా ప్రత్యేకంగా ఉండాలని భావించాను. కానీ ఊహించిన దాని కంటే మించి ఇంత అందంగా ఉంటుందని అనుకోలేదు. సిబ్బంది ఒప్పుకుంటారో లేదో అని భయపడ్డా.. అన్నీ అనుకున్నట్టుగాజరిగాయంటూ అంతులేని సంతోషాన్ని వ్యక్తం చేసింది బన్సల్. ఈ ప్రణయ పక్షుల వీడియోను మీరు కూడా చూసేయండి మరి! View this post on Instagram A post shared by Aishwarya Bansal (@aishwaryabansal_) -
ఒలింపిక్స్‌లో మరో ప్రేమ జంట.. లవ్ ప్రపోజల్ వీడియో వైరల్
ప్యారిస్ ఒలింపిక్స్‌లో క్రీడాకారుల ప్రదర్శనతో పాటు లవ్ ప్రపోజల్స్ కూడా అందరని ఆకట్టుకుంటున్నాయి. ఈ విశ్వ క్రీడల వేదికగా మరో ప్రేమ జంట ప్రపంచానికి పరిచయమైంది. 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో నాలుగో స్థానంలో నిలిచిన ఫ్రెంచ్ అథ్లెట్ అలిస్ ఫినోట్ తన ప్రియుడికి లవ్ ప్రపోజ్ చేసింది. కాగా ఆలిస్ ఫినోట్ రేసు ప్రారంభానికి ముందు ఓ ఛాలెంజ్ చేసింది. ఈ రేసును తొమ్మిది నిమిషాలలోపు పూర్తి చేస్తే తన ప్రియుడికి అందరి ముందు తన ప్రేమను తెలియజేస్తానని స్నేహితులతో కండీషన్ పెట్టుకుంది. అయితే అనుకున్న విధంగానే 9 నిమిషాల్లో పరుగు పూర్తి చేసిన ఈ ఫ్రెంచ్ క్రీడాకారణి.. బహిరంగంగా తన బాయ్‌ఫ్రెండ్‌కు తన ప్రేమను తెలియజేసింది.రేసును ముగించిన వెంటనే తన ప్రియుడు వద్దకు వెళ్లిన ఫినోట్.. ఉంగరాన్ని తీసి మోకాళ్లపై కూర్చోని లవ్ ప్రపోజ్ చేసింది. తన ప్రేయసి తనకోసం వేసిన ప్రపోజల్ ప్లాన్‌తో ఒక్కసారిగా సదరు బాయ్‌ఫ్రెండ్ ఆశ్చర్యపోయాడు.ఇందుకు సబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా 3000 మీటర్ల రేసును అలిస్ ఫినోట్ ఎనిమిది నిమిషాల 58.67 సెకన్లలో పూర్తి చేసింది. తద్వారా ఈ రేసును అత్యంత వేగంగా పూర్తి చేసిన తొలి యూరోపియన్‌గా ఆమె రికార్డులకెక్కింది. కాగాఇంతకుముందు అర్జెంటీనా అథ్లెట్స్ సిమొనెట్, పిలర్ కంపోయ్.. చైనా బ్యాడ్మింటన్ జోడీ హువాంగ్ యా కియోంగ్ ,లీ యుచెన్ జోడీ ఈ ప్యారిస్ ఒలింపిక్స్ వేదికగానే ఒక్కటయ్యారు. French athlete came in fourth in the 3000m steeplechase, a European record, and asked for her boyfriend's hand ...pic.twitter.com/ofs9DocirE— Figen (@TheFigen_) August 7, 2024 -
ప్రాణం తీసిన ‘లవ్ ప్రపోజల్’
సదరాగా చేసిన తప్పు.. ఓ యువకుడి ప్రాణాన్ని బలితీసుకుంది. ఎంతో కష్టపడి ఆర్మీలో ఉద్యోగం సాధించి, దేశ రక్షణలో భాగస్వామి అవుతాడనుకున్న కొడుకు శవంగా మారి.. పాడె ఎక్కడాన్ని తల్లిదండ్రులు భరించలేక పోతున్నారు. దోమ: పరువు పోతుందనే మనస్తాపంతో ఓ ఆర్మీ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన దోమ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల వివరాల ప్రకారం.. కొత్తపల్లి గ్రామానికి చెందిన కుంట రాములు, మంగమ్మకు ఇద్దరు కొడుకులు, ఓ కూతురు సంతానం. వీరిలో చింటు (21) పెద్దవాడు. డిగ్రీ పూర్తి చేసిన ఇతను అగి్నపథ్లో భాగంగా ఇండియన్ ఆరీ్మకి ఎంపికయ్యాడు. ఇటీవలే బెంగళూర్‌లో శిక్షణ పూర్తి చేసుకోగా.. గుజరాత్లో పోస్టింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కొద్ది రోజులు సెలవులు ఇవ్వడంతో ఈనెల 22న ఇంటికి వచ్చాడు. గత సోమవారం తన ఇద్దరు స్నేహితులతో కలిసి చింటు సరదాగా బయటకు వెళ్లాడు. ఇదిలా ఉండగా సాయంత్రం వేళ దాదాపూర్‌లో స్కూల్ ముగించుకుని కాలి నడకన గుండాలకు వెళ్తున్న ఓ బాలికను గమనించిన చింటు.. ఆమెకు లవ్ ప్రపోజ్ చేస్తానని స్నేహితులతో చెప్పాడు. ఆ వెంటనే వెళ్లి నేను నిన్ను ప్రేమిస్తున్నా.. ఇందుకు అంగీకరించమని కోరాడు. దీంతో భయాందోళనకు గురైన బాలిక ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో బాలిక తండ్రి కొత్తపల్లికి చేరుకుని చింటు తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగాడు. అతను వెళ్లిపోయిన తర్వాత ఇంటికి చేరుకున్న చింటు జరిగిన విషయం గ్రామంలో తెలిస్తే తనతో పాటు తల్లిదండ్రుల పరువు పోతుందని మనస్తాపానికి గురయ్యాడు. అనంతరం బైక్ తీసుకుని పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరేసుకున్నాడు. బయటకు వెళ్లిన కొడుకు అర్ధరాత్రి దాటినా తిరిగి రాకపోవడంతో అనుమానం వచి్చన కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. వెంటనే పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించాడు. ఈ మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
'నువ్వు ప్రపోజ్ చేసిన క్షణం.. కళ్లార్పకుండానే': సీనియర్ హీరోయిన్
సీనియర్ నటి ఖుష్బు దక్షిణాదిలో పరిచయం అక్కర్లేని పేరు. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ చిత్రాలతో మెప్పించింది. 1990లో సౌత్‌లోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. తెలుగులోనూ స్టార్ హీరోల సినిమాల్లో మెప్పించింది. కాగా.. 1995లో మురై మామన్ చిత్రంలో నటిస్తుండగానే డైరెక్టర్‌తో ప్రేమలో పడింది. ఆ తర్వాద ఐదేళ్లకు మార్చి 9న 2000 ఏడాదిలో దర్శకుడు సుందర్‌ను పెళ్లాడింది. ప్రస్తుతం ఈ జంటకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే తాజాగా తన మధురమైన జ్ఞాపకాలను పంచుకుంది. తన భర్త ప్రపోజ్ చేసిన తేదీని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఆయన ప్రపోజ్ చేసిన రోజు నుంచి ఇప్పటివరకు నా జీవితంలో ఎలాంటి మార్పు రాలేదని పోస్ట్ చేశారు. సోషల్ మీడియా లేని రోజుల్లో మీరు ప్రపోజ్ చేయగానే ఎలాంటి ఆలోచన లేకుండా అంగీకరించానని రాసుకొచ్చింది. 29 ఏళ్ల క్రిత నేను తీసుకున్న ఆ నిర్ణయం అత్యుత్తమమని ఖుష్బు ఎమోషనలయ్యారు. ఖుష్బు తన ట్వీట్లో రాస్తూ..'22 ఫిబ్రవరి 1995 నుంచి.. 22 ఫిబ్రవరి 2024 వరకు ఏమీ మారలేదు. కేవలం నా వయసు మాత్రమే పెరిగింది అంతే. మీలో ఉప్పు, మిరియాల సువాసన అలానే ఉంది. ఒకరిపై ఒకరికి ప్రేమ, గౌరవం.. మన తప్పులను అంగీకరించడం.. ఒకరినొకరు ప్రోత్సహించడం. ఆపద సమయంలో అండగా నిలవడం. ఒకరి చేయి ఒకరం పట్టుకుని.. మన అందమైన కుటుంబాన్ని నిర్మించే మార్గంలో నడుస్తున్నాం. మీరు నాకు ప్రపోజ్ చేసి ఈ రోజుకు 29 సంవత్సరాలైంది. ఎలాంటి కెమెరాలు, ఫోటోలు, సోషల్ మీడియా లేని రోజుల్లో నీ ప్రేమను అంగీకరించా. ఒక్కసారి ఆలోచించకుండా.. కను రెప్పవేయకుండానే ఓకే చెప్పా. కొన్నిసార్లు ఉత్తమ నిర్ణయాలు గట్స్ ఫీలింగ్‌తో తీసుకోబడతాయి. ఈ రోజు మీరు అది నిరూపించారు. నేను నిన్ను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నా. మీ ప్రపోజల్‌ను అంగీకరించడం నా జీవితంలోనే అత్యుత్తమ నిర్ణయం. నీపై 29 ఏళ్ల క్రితం మొదలైన ప్రేమ ఇప్పటికీ అలాగే ఉంది.' అంటూ పోస్ట్ చేసింది. కాగా.. ఖుష్బు గతేడాది తెలుగులో గోపించంద్ చిత్రం రామబాణంలో కనిపించింది. ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నారు. అందువల్లే సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో అగ్ర దర్శకుల్లో ఒకరైన దర్శకుడు సుందర్ తమిళంలో 32 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించారు. అంతే కాదు 20కి పైగా సినిమాల్లో నటించారు. ఉల్లతై అల్లిత, అరుణాచలం, అన్బే శివం, విన్నర్, గిరి, కలకలప్పు, తీయ వేళై సెయ్యనుం కుమారు, అరణ్మనై, అంబాల, వంత రాజావతాన్ వరువేన్ సినిమాలు చేశారు. From then on, 22nd Feb 1995, to now, 22 Feb 2024, nothing has changed. Except that I have grown older and you have salt n pepper sauciness now. The love, respect for each other, accepting each other with our minuses, encouraging each other to give and do our best. Standing by… pic.twitter.com/j0H5DNzuXP — KhushbuSundar (@khushsundar) February 21, 2024 -
‘నన్ను పెళ్లి చేసుకుంటావా’? అంటే.. ఓటేస్తావా అని అడిగింది. ఆ తరువాత...?
నిక్కీ హేలీ.. ఈ పేరు అందరికీ సుపరిచితమే.. రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష పోరులో బరిలో నిలిచింది. ఆఖరు వరకు పోరాడిన ఆమె చివరికి న్యూ హాంప్‌షైర్ రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఓటమిని చవిచూసింది. అయితే తాజాగా నిక్కీకి ఓ వింత అనుభవం ఎదురైంది. సోమవారం న్యూ హాంప్‌షైర్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. సాలేంలోని ఆర్టిసాన్ హోటల్లో ఆమె తన మద్దతుదారులనుద్దేశించి ప్రసంగిస్తుండగా ట్రంప్ మద్దతుదారు ఆమెకు ప్రపోజ్ చేశాడు.. వారి మధ్య సాగిన సంభాషణ ఈ విధంగా ఉంది. ట్రంప్ మద్దతుదారు: నన్ను పెళ్లి చేసుకుంటారా?( గుంపులోంచి గట్టిగా అరవడంతో అందరూ ఒక్కసారిగా ఘోల్లుమన్నారు). నిక్కీ హేలీ: నాకు మద్దతుగా ఓటు వేస్తావా? (నవ్వుతూ) ట్రంప్ మద్దతుదారు: నేను ట్రంప్‌నకు ఓటు వేయబోతున్నాను. ( హేళనగా సమాధానమిచ్చాడు) నిక్కీ హేలీ:. అయితే వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపో. ఊహించని ఘటనతో హాల్లో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవహించింది. ఈ సంఘటన అనంతరం నిక్కీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఇక భారతీయ సంతతికి చెందిన దంపతులకు 1972లో జన్మించిన నిక్కీ ..1996లో మైఖేల్ హేలీని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు రెనా, నలిన్. గతంలో ఆమె సౌత్ కరోలినా రాష్ట్ర గవర్నర్‌గా పనిచేశారు. ట్రంప్ అధ్యక్షడిగా ఉన్న సమయంలో ఐరాసలో అమెరికా రాయబారిగానూ వ్యవహరించారు. అమెరికా అధ్యక్ష పోరు నుంచి భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ తప్పుకున్నారు. రిపబ్లికన్ పార్టీ తరపున ప్రెసెడెంట్ ఎన్నికల్లో అభ్యర్ధిగా నిలబడిన నిక్కీ...న్యూ హాంప్‌షైర్ రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు ట్రంప్ చేతిలో ఓటమిని చవిచూశారు. ట్రంప్‌నకు మద్దతుగా 52 శాతం ఓట్లు రాగా, నిక్కీ హేలీకి 34శాతం ఓట్లు లభించాయి. దీంతో రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష రేసులో నిలిచే వ్యక్తిగా ట్రంప్ పేరు దాదాపు ఖరారైపోయింది. కాగా ఈ ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్షుడి ఎన్నికలు జరగనున్నాయి. చదవండి: USA: అధ్యక్ష రేసులో ట్రంప్ లైన్ క్లియర్! -
అమలాపాల్ బర్త్‌డే.. ముద్దు పెట్టి ప్రపోజ్ చేసిన ప్రియుడు
-
యూట్యూబర్ ఎఫెక్ట్.. కేదార్నాథ్ ఆలయంలో మొబైల్ ఫోన్లు నిషేదం..
డెహ్రాడూన్: సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించుకోవడం కోసం ఇటీవల ఒక యూట్యూబర్ పవిత్ర పుణ్యక్షేత్రమైన కేదార్నాథ్ ఆలయ ప్రాంగణంలో తన ప్రేమను ప్రపోజ్ చేసిన సంఘటన ఆలయ వర్గాలను విస్మయానికి గురి చేసింది. దీంతో ఆలయంలో ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా కఠిన చర్యలకు ఉపక్రమించింది శ్రీ కేదార్నాథ్ బద్రీనాథ్ ఆలయ కమిటీ. కొద్దిరోజుల క్రితం విశాఖ ఫల్స్ నుంగే అనే ఒక యూట్యూబర్ తన ఫాలోవర్ల మెప్పు కోసం ఉత్రాఖండ్ లోని కేదార్ నాథ్ ఆలయంలో మోకరించి తనకు బాయ్ ఫ్రెండుకు తన ప్రేమను తెలియజేసి ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మెప్పు పొందడం సంగతి అటుంచితే దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఆలయంలో పిచ్చి పనులేంటని కామెంట్లు కూడా పోటెత్తాయి. ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నామని నెటిజన్లు అత్యధిక సంఖ్యలో ఆమెను ఏకిపారేశారు. ఈ సంఘటన జరిగిన కొద్ది వారాలకు శ్రీ కేదార్నాథ్ బద్రీనాథ్ ఆలయ కమిటీ సమావేశమై పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుడదని ఆలయ ప్రాంగణంలో మొబైల్ ఫోన్లను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్బంగా శ్రీ కేదార్నాథ్ బద్రీనాథ్ ఆలయ కమిటీ అధ్యక్షుడు అజయ్ అజేంద్ర మాట్లాడుతూ.. కేదార్నాథ్ ఆలయానికి వచ్చే యాత్రికులు నిండైన దుసులు ధరించాలని, గతంలో కొంతమంది ఇష్టానుసారంగా దుస్తులు ధరించి ఫోటోలు, వీడియోలు తీసుకున్నారని చెబుతూ.. అది సరైన పద్దతి కాదన్నారు. మళ్ళీ ఇటువంటి సంఘటనలు పునరావృతమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బద్రీనాథ్ లో కూడా మొబైల్ ఫోన్లను నిషేధించే విషయమై ఆలోచిస్తున్నామని న్నారు. ఇది కూడా చదవండి: టూరిస్టులతో గుంజీలు తీయించిన రైల్వే పోలీసులు -
Love Proposal: ఇలాంటి ఐడియాలు ఎక్కడ్నుంచి వస్తాయో.. ప్రేయసికి వెరైటీగా ప్రపోజల్
ప్రేమ అనేది మధురానుభూతి. ప్రేమించడం సులువే కానీ ఆ ప్రేమను వ్యక్తపరచడం అంత ఈజీ కాదు. నచ్చిన అమ్మాయి లేదా అబ్బాయికి ప్రపోజ్ చేయడానికి నానా తిప్పలు పడుతుంటారు. గ్రీటింగ్ కార్డ్స్ ద్వారానో, బహుమతుల ద్వారానో, సర్‌ప్రైజ్‌లతోనే వెరైటీగా లవ్ ఎక్ప్రెస్ చేస్తుంటారు. ఇంకొందరు అబ్బాయిలైతే సినిమా హీరోల్లా తమ ప్రేయసికి ప్రపోజ్ చేస్తుంటారు. అయితే రీసెంట్గా ఓ యువకుడు తన గర్ల్‌ఫ్రెండ్ కోసం డిఫరెంట్‌గా ప్రపోజ్ చేశాడు. ఈ వెరైటీ ప్రపోజల్‌కి నెటిజన్లు కూడా ఫిదా అయ్యారు. దీంతో వీరి ప్రేమకథ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఇప్పటివరకు బోలెడన్ని లవ్ ప్రపోజల్స్ గురించి విన్నాం,చూశాం. కానీ ఓ యువకుడు ఇంకాస్త వెరైటీగా తన ప్రేమను వ్యక్తపరిచాడు. ప్రేయసి కోసం ప్రత్యేకంగా ఓ కీబోర్బ్నే డిజైన్ చేసి ఆమెకు ప్రపోజ్ చేశాడు. ‘బీ మై గర్ల్ ఫ్రెండ్ సెయాంగ్?’ ( Be my girlfriend Seyang ) అనే వాక్యం వచ్చేలా ఇంగ్లీష్ అక్షరాలతో కొన్ని బటన్స్‌ను అమర్చి ఆమెకు ప్రజెంట్ చేశాడు.ఈ వినూత్న ప్రపోజల్‌కి ఆ యువతి ఫిదా అవ్వడమే కాక, ఆనందంతో ఎగిరి గంతేసింది. 'నా బాయ్ ఫ్రెండ్ చాలా అద్భుతమైన రీతిలో ప్రపోజ్ చేశాడు. ఈ ఆనందాన్ని అందరితో పంచుకోకుండా ఉండలేకపోతున్నాను' అంటూ బాయ్‌ఫ్రెండ్‌తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీరి ప్రేమ కహానీ ఇప్పుడు వైరల్‌గా మారింది. దీంతో పలువురు నెటిజన్లు ఈ కపుల్‌కి కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. i’ll never shut up about this, he proposed me to be his girlfriend with a keyboard. https://t.co/G8GDpsD62z pic.twitter.com/iPbCZ1zEdA — 에이미 (@amymaymacc) April 29, 2023 -
#ShubmanGill: లవ్ ప్రపోజ్‌కు పడిపోయాడు.. రనౌట్ మిస్ చేశాడు!
ఇటీవలే ముగిసిన ఐపీఎల్లో బ్యాటింగ్‌లో వీరవిహారం చేసి 890 పరుగులతో ఆరెంజ్ క్యాప్ అందుకున్న శుబ్‌మన్ గిల్ డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో నిరాశపరిచాడు. 13 పరుగులు మాత్రమే చేసి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అయితే తాజాగా ఫీల్డింగ్‌లోనూ గిల్ విఫలమయ్యాడు. ఈజీ రనౌట్ చేసే చాన్స్‌ను చేజేతులా జారవిడిచాడు. ఆసీస్ రెండో ఇన్నింగ్స్ సమయంలో ఇది జరిగింది. ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో సిరాజ్ బౌలింగ్‌లో మార్నస్ లబుషేన్ ఆడిన షాట్ నేరుగా శుబ్‌మన్ గిల్ చేతుల్లోకి వెళ్లింది. సమన్వయ లోపంతో మార్నస్ లబుషేన్, ఉస్మాన్ ఖవాజా ఇద్దరూ కూడా ఒకే వైపు పరుగెత్తారు. మూడో స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న శుబ్‌మన్ గిల్, మెల్లిగా లేచి బంతి అందుకుని వికెట్ కీపర్ వైపు బంతి వేసేందుకు కావాల్సినంత సమయం ఉంది. అయితే బంతిని ఆపగానే కంగారుపడిన శుబ్‌మన్ గిల్ బ్యాటర్లు ఎటువైపు ఉన్నారనే విషయాన్ని కూడా గమనించకుండా బౌలింగ్ ఎండ్‌వైపు బంతి త్రో చేశాడు. అటు వైపు బంతిని ఆపేందుకు కూడా ఎవ్వరూ లేకపోవడంతో రనౌట్ ఛాన్స్ మిస్ అయింది. అయితే ఈ సంఘటనకి ముందు గ్రౌండ్లో ఉన్న ఓ యువతి, శుబ్‌మన్ గిల్‌కి మ్యారేజ్ ప్రపోజ్ చేసింది. ''శుబ్‌మన్ గిల్ మ్యారీ మీ'' అని రాసి ఉన్న ఫ్లకార్డును కెమెరావైపు ప్రదర్శించింది. వాస్తవానికి గిల్ దీనిని పట్టించుకోలేదు. కానీ అభిమానులు ఊరికే ఉండరుగా. గిల్ ఆ పిల్ల ప్రపోజల్ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని రనౌట్ చాన్స్ మిస్ చేశాడంటూ ట్రోల్ చేశారు. ఇక టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకు ఆలౌట్ అయింది. ఒక దశలో ఫాలోఆన్ గండం దాటుతుందా అన్న అనుమానం కలిగింది. అయితే అజింకా రహానే, శార్దూల్ ఠాకూర్ హాఫ్ సెంచరీలతో రాణించి ఏడో వికెట్‌కు 109 పరుగులు జోడించి టీమిండియాను ఫాలోఆన్ ముప్పు నుంచి తప్పించారు. ఆసీస్‌కు 173 పరుగుల తొలి ఇన్నింగ్స్ భారీ ఆధిక్యం లభించింది. అయితే తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన గిల్ రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే తరహా ఆటతీరు నమోదు చేస్తే అభిమానుల ఆగ్రహానికి గురవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు మ్యాచ్‌లో విజయావకాశాలు ఆసీస్‌కే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 80 పరుగులతో ఆడుతున్న ఆసీస్ మొత్తంగా 253 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆటకు ఇంకా రెండురోజులు సమయం ఉండడంతో టీమిండియా ఏ మేరకు పోరాడుతుందనేది ఆసక్తిగా మారింది. Proposal for Shubman Gill at the Oval. pic.twitter.com/76hpNoPlbi — Mufaddal Vohra (@mufaddal_vohra) June 9, 2023 చదవండి: 'సామాన్యుడు కాడు వీడు'.. టెన్నిస్ చరిత్రలో అత్యుత్తమ షాట్ -
బిడ్డ ముందే బట్లర్ కు లవ్ ప్రపోజల్ చేసిన చాహల్..
-
శ్రీసత్యకు ప్రపోజ్ చేసిన మెహబూబ్, చేయి కోసుకుంటానంటూ బ్లాక్మెయిల్!
బిగ్‌బాస్ ఫేం శ్రీసత్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బిగ్‌బాస్ 6 సీజనల్లో హౌజ్‌లో అడుగుపెట్టి తనదైన ఆట తీరుతో బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె స్టార్ మా ప్రసారం అవుతున్న బిబి జోడి డాన్స్‌లో షోలో అలరిస్తోంది. ఇందులో శ్రీసత్య మరో బిగ్‌బాస్ కంటెస్టెంట్ మెహబూబ్ దిల్ సేతో జోడికట్టింది. వీరిద్దరి జోడికి మంచి రెస్పాన్స్ వస్తోంది. స్టేజ్‌పై డాన్స్ చేస్తుండగా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందంటూ షో జడ్జస్ కూడా వారి పర్ఫామెన్స్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి: వాగ్వాదంగా మారిన అనసూయ వాలంటైన్స్ డే పోస్ట్, చెప్పుతో కొడతానంటూ..! ఇదిలా ఉంటే మంగళవారం వాలంటైన్స్ డే సందర్భంగా మెహబూబ్ దిల్ సే శ్రీసత్యకి ఎర్ర గులాబిల బోకెతో ప్రపోజ్ చేసి షాకిచ్చాడు. దీంతో శ్రీసత్య అతడిపై సీరియస్ అయిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. కొరియోగ్రఫర్స్ ప్రియాంక, సంకేత్ల సాయంతో మహబూబ్ దిల్ సే శ్రీసత్యకు తన ప్రేమను వ్యక్తం చేశాడు. శ్రీసత్య దగ్గరికి వెళ్లి మొదట పరోక్షంగా ఓ అమ్మాయిని ప్రమించానని, తను రిజెక్ట్ చేస్తే తట్టుకోలేనంటూ వాపోయాడు. ఎవరిని అంటూ ఆరా తీయగా.. నిన్నేనని ఆమెను సర్ప్రైజ్ చేశాడు. దీంతో శ్రీసత్య షాకైన శ్రీసత్య బిగ్‌బాస్ హౌజ్‌లో పెంట అయ్యింది.. ఇప్పుడు కూడా పెంట అయ్యిద్ది? అంటూ మహబూబ్‌పై గట్టిగా అరిచింది. చదవండి: అనుష్క శెట్టికి అరుదైన వ్యాధి, స్వయంగా వెల్లడించిన స్వీటీ దీనికి అతడు ‘నువ్వు, నీ క్యారెక్టర్ నాకు బాగా నచ్చాయ్. నీలాంటి మంచి అమ్మాయిని వదుకోవాలనుకోవడం ఇష్టం లేదు’ అంటూ తన మనసులో మాట చెప్పాడు. ఇక శ్రీసత్య తన ప్రపోజల్‌ను ఒప్పుకోకపోవడంతో చేయి కోసుకుంటానంటూ మహబూబ్ బ్లాక్మెయిల్ చేయడంతో.. ‘ఇప్పటికే నేను ఆత్మహత్యయత్నం కూడా చేశా తెలుసా? నా ఎంగేజ్మెంట్ బ్రేకప్ తర్వాత నా లైఫ్‌లో ఎవరికి మరో చాన్స్ ఇవ్వాలనుకోవడం లేదు. నాకు మనుషుల మీదే నమ్మకం పోయింది’ అంటుంది శ్రీసత్య. అలా కాసేపు ఇద్దరు అర్గ్యూ చేసుకున్న అనంతరం ఇది ప్రాంక్ అంటూ అందరికి షాకిచ్చాడు మహబూబ్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. -
హీరోయిన్ ఆషికకు ప్రపోజ్ చేసిన కల్యాణ్ రామ్!
బింబిసార బ్లాక్ బస్టర్ తర్వాత కల్యాణ్ రామ్ నటిస్తోన్న తాజా చిత్రం అమిగోస్. ఆషిక రంగనాథ్ ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. రాజేంద్ర రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఫిబ్రవరి 10న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేస్తుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ జోరు పెంచారు మేకర్స్. ఈ క్రమంలో బుల్లితెరపై ఓ షోకు గెస్టుగా విచ్చేసిన కల్యాణ్ రామ్ ఓ ఫన్నీ టాస్క్‌లో భాగంగా హీరోయిన్ ఆషికకు లవ్ ప్రపోజ్ చేశారు.‘మీకోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను’ అంటూ రెడ్ రోజ్ ఇచ్చి క్యూట్‌గా ప్రపోజ్ చేశారు. ఆ తర్వాత సుమ అప్పుడే రావడంతో.. మీరు ఇంకా బాగున్నారు అంటూ ఆమె చేతికి అందమైన రోజా పువ్వును ఇచ్చారు కల్యాణ్ రామ్. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. -
దారుణం.. ప్రేమకు నిరాకరించిందని తుపాకీతో కిరాతకంగా..
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ భదోహిలో దారుణం జరిగింది. ప్రేమిస్తున్నాని ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసిందని 15 ఏళ్ల బాలికను తుపాకీతో కాల్చిచంపాడు ఓ కిరతాకుడు. నుదుటిపై షూట్ చేయడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నిందుతుడ్ని 22 ఏళ్ల అరవింద్ విశ్వకర్మగా గుర్తించారు పోలీసులు. బాధితురాలి పేరు అనురాధ. ఈమె నిందితుడి సోదరితో పాటు కోచింగ్ సెంటర్‌కు వెళ్తోంది. ఓ రోజు తిరిగివస్తుండగా.. అనురాధ దగ్గరకు వెళ్లి అరవింద్ ప్రపోజ్ చేశాడు. కానీ ఆమె అందుకు ఒప్పుకోలేదు. దీంతో కోపోద్రిక్తుడైన అరవింద్ గన్ తీసి ఆమెను షూట్ చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. చదవండి: ఈ పెళ్లికూతురు చాలా స్మార్ట్.. కారు వదిలి మెట్రోలో పెళ్లి మండపానికి.. -
విమానంలో అందరిముందే ప్రియురాలికి లవ్ ప్రపోజ్
-
Viral Video: విమానంలో గర్ల్‌ఫ్రెండ్‌కు సర్ప్రైజ్ లవ్ ప్రపోజ్
ప్రేమ అనేది ఒక మధురానుభూతి. రెండు జీవితాలను ఒక్కటి చేస్తుంది. ప్రేమలో పడిన వారు ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. ఏదో ఒక సమయంలో అయినా ఎవరో ఒకరి మనసును దోచుకునే ఉంటారు. లవ్‌లో పడటం సహజమే. కానీ, ఆ ప్రేమను వ్యక్తపరచడం మాత్రం అంత తేలికైన వ్యవహారం కాదు. మన ప్రేమను అంగీకరిస్తారా.ఛీ కొడతారా అనే టెన్షన్ మనుసును మెలిపెడుతుంటుంది. అందుకే ప్రపోజ్ చేయడానికి రకరకాల పద్ధతులను అనుసరిస్తుంటారు. ఈ మధ్య కాలంలో చాలా మంది ఢిఫరెంట్ పద్దతుల్లో తమ చెలికి మనసులో మాటను చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి కూడా ఇలాంటి ఆలోచనే చేశాడు. ఏకంగా విమానంలో ప్రియురాలికి లవ్ ప్రపోజ్ చేశాడు. వివరాలు.. జనవరి రెండో తేదిన ఓ యువతి ముంబైకు విమానంలో ప్రయాణించింది. ఆమె ఎయిర్ ఇండియాలో ప్రయాణిస్తున్నట్లు తెలుసుకున్న ప్రియుడు కూడా అదే విమానంలో టికెట్ బుక్ చేసుకున్నాడు. తన ప్రేయసికి వినూత్నంగా ప్రపోజ్ చేయాలని భావించి ఇందుకు విమాన సిబ్బంది సాయం కోరాడు. విమానం టేకాఫ్ అయ్యాక ఓ చార్ట్ పట్టుకొని మెల్లగా ప్రియురాలు కూర్చున్న సీట్ వద్దకు వచ్చాడు. చదవండి: ప్రేమలో పడ్డారు సరే, ‘831 224’ అని ఎప్పుడైనా ప్రపోజ్ చేశారా? ఆమె దగ్గరకు చేరుకున్న తర్వాత ఫేస్ మాస్క్ తీసి నవ్వాడు. ఊహించని సర్ప్రైజ్తో షాక్ అయిన యువతి అసలు ఏం జరుగుతుందో నమ్మలేకపోతుంది. అతడు కొన్ని ఫోటోలతోపాటు ‘నేను ఎప్పటికీ నీతో జీవించాలనుకుంటున్నాను.. నువ్వు కూడా నాతో కలిసి జీవిస్తావా’ అని రాసి ఉన్న చార్ట్‌ను ఆమెకు చూపించాడు. అది చూసిన యువతి ఆశ్చర్యపోతుంది. వెంటనే తన సీట్ నుంచి లేచి యువతి ముందుకు రావడంతో ఆ వ్యక్తి తన మొకాలిపై కూర్చొని వెంట తెచ్చిన బాక్స్ నుంచి రింగ్ తీసి ప్రపోజ్ చేశాడు. ఆమె కూడా ఆనందంతో ఆ వ్యక్తిని కౌగిలించుకొని అతని చెంపై ముద్దు పెట్టింది. విమానంలోని మిగతా ప్రయాణికులు చప్పట్లతో ఈ జంటను అభినందించారు. ఇక దీన్నంతటిని తోటి ప్రయాణికుడు వీడియో తీశాడు. ఈ వీడియోను రమేష్ కొట్నానా అనే వ్యక్తి లింక్డ్ఇన్లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. ఇది నెటిజన్ల హృదయాలను హత్తుకుంటుంది. ‘చూడచక్కని జంట.. ఎంతో అద్భుతంగా ప్రపోజ్ చేశాడు.. నిజమైన ప్రేమ’ అంటూ కామెంట్ చేస్తున్నారు. కాగా గత కొన్ని రోజులుగా ఎయిర్ ఇండియా తరుచూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. అయితే విమానాల్లో మూత్ర విసర్జన సంఘటనలు చోటుచేసుకున్న తరుణంలో ఈ వీడియో క్లిప్ వెలుగు చూడటం విశేషం. -
ప్రేమలో పడ్డారు సరే, ‘831 224’ అని ఎప్పుడైనా ప్రపోజ్ చేశారా?
ప్రేమను ఎన్ని పదాల్లోనూ, ఎన్ని విధాల్లోనూ వర్ణించినా తీరనిది. ప్రేమకు భాషతో పని లేదు భావం చాలు.. ఎంతటి వారినైనా ఆకర్షించే గుణం దీనికి ఉంటుంది. ప్రేమ మాయలో పడితే ప్రపంచాన్నే మరచిపోతారంటారు. అలాంటి ప్రేమను గెలవాలంటే మన మనుసులోని మాటను ముందుగా ఎదుటి వారికి తెలియజేయాలి. ప్రేమను తెలిపేందుకు ఎన్ని మార్గాలున్నా.. సూటిగా చెప్పే పదం ఐ లవ్ యూ. దీనినే షార్ట్‌కట్‌లో 143 అంటారు. చంటి పిల్లాడి నుంచి పండు ముసలి వాళ్ల వరకు కూడా ఈ పదం సుపరిచితమే.. మరి 831 224 అంటే అర్థం ఏంటో తెలుసా? ఎప్పుడైనా దీని గురించి విన్నారా..? ప్రస్తుతం ఈ నెంబర్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. మరి ఇది ఏంటో తెలుసుకుందాం. 831 224 అనే సంఖ్య కూడా ప్రేమకు సంబంధించినదే. ‘ఐ లవ్ యు టుడే, టుమారో, ఫర్ ఎవర్’ (I love you today, tomorrow, forever) అనే అర్థంలో దీనిని వాడతారు. అయితే ఈ నెంబర్ ఎలా వచ్చిందంటే.. సాధారణంగా స్నాప్‌చాట్, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ టిక్‌టాక్ వంటి వాటిల్లో 831ను తరుచూ వాడుతుంటారు. 831 అనేది "ఐ లవ్ యు" అని అర్ధం చేసుకోవడానికి ఉపయోగించే సంక్షిప్త పదం. ఇందులోని ప్రతి సంఖ్యకు నిర్దిష్ట నిర్వచనం ఉంటుంది. 8 = "ఐ లవ్ యు" అనే పదసమూహంలోని మొత్తం అక్షరాల సంఖ్య. 3 = "ఐ లవ్ యు" అనే పద సమూహంలోని మొత్తం పదాల సంఖ్య. 1 = ఈ ఎనిమిది అక్షరాలు, మూడు పదాల అర్థం ఒక్కటే. అయితే 224 సంఖ్యను కూడా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వాడుతుంటారు. నేడు, రేపు, ఎప్పటికీ అని చెప్పే సందర్భంలో ఉపయోగించే పదం 2 = ‘టు’డే (ఈరోజు) 2 = ‘టు’మారో(రేపు) 4 = ‘ఫర్’ ఎవర్ (ఎప్పటికీ) ఇప్పుడు తెలిసిందిగా 831 224 నెంబర్‌ను ఎప్పుడు, ఎందుకు ఉపయోగిస్తారో.. ప్రస్తుతం ఈ సంఖ్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇలాగే ఇటీవల మరో నెంబర్ 5201314 కూడా వైరల్ అయ్యింది. దాని అర్థం "నేను నిన్ను జీవితకాలం ప్రేమిస్తున్నాను అని. ఇంకెందుకు ఆలస్యం మరి మీ ప్రియురాలు/ ప్రియుడిని ఇలా కొత్తగా, ఢిఫరెంట్‌గా ప్రపోజ్ చేసి చూడండి. చదవండి: Viral Video: వధువుని ఎత్తుకొని కిందపడ్డ వరుడు.. ఏమాత్రం సిగ్గు పడకుండా ఆమెకు ముద్దు పెడుతూ.. -
ప్రేమోన్మాది ఘాతుకం.. ఇంజనీరింగ్ విద్యార్థినిని దారుణంగా కత్తితో..
తరచూ ఎక్కడో ఒక చోట ప్రేమోన్మాదుల దాష్టీకానికి అమ్మాయిలు బలవుతున్నారు. చదువుకుని ఉన్నతస్థాయికి ఎదగాల్సినవారు ప్రేమపాశానికి బలవుతూ కన్నవారికి శోకాన్ని మిగులుస్తున్నారు. మరోవైపు దాడులకు పాల్పడినవారు కటకటాల పాలై బతుకును బుగ్గి చేసుకుంటున్నారు. యశవంతపుర: ప్రేమించలేదనే కోపంతో విద్యారి్థనిని మరో విద్యార్థి చాకుతో పొడిచి హత్య చేసిన ఘటన బెంగళూరులో జరిగింది. యలహంక రాజనకుంట పోలీసుస్టేషన్ పరిధిలో దిబ్బూరులోని ప్రెసిడెన్సీ ఇంజనీరింగ్ కాలేజీ ఈ దారుణానికి వేదికైంది. కోలారుకు చెందిన లయస్మిత (19) హతురాలు. వివరాలు.. లయస్మిత ఈ కాలేజీలో ఇంజనీరింగ్ రెండో ఏడాది విద్యారి్థని కాగా, ఆమె స్నేహితుడు పవన్ నృపతుంగ రోడ్డులో విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. లయస్మితను ప్రేమిస్తున్నానని వెంటపడేవాడు. ఆమె ఇష్టం లేదని చెప్పినా పవన్ తీరు మారలేదు. 10 సార్లు కత్తితో పొడిచి హత్య కాలేజీకీ వచ్చి ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పి లయస్మితను క్లాసు నుంచి పిలిపించాడు. నన్ను ప్రేమిస్తావా, లేదా అని పవన్ డిమాండ్ చేయగా లయస్మిత నిరాకరించింది. దీంతో ఉన్మాదిగా మారిన పవన్ కత్తి తీసుకుని 10 సార్లు ఆమెను పొడిచాడు. లయస్మిత రక్తపు మడుగులో కుప్పకూలి ప్రాణాలు వదిలింది. ఈ ఘోరాన్ని చూసిన విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. తరువాత ప్రేమోన్మాది చాకుతో పొడుచుకొని ఆత్మహత్యకు యత్నించాడు. గాయపడిన పవన్‌ను విద్యార్థులు ఆస్పత్రికి తరలించారు. పవన్ తరచూ కాలేజీకి వచ్చి ప్రేమ పేరుతో లయస్మితను వేధించినట్లు తెలిసింది. రాజనుకుంట పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. ప్రేమోన్మాది మారణకాండ తీవ్ర సంచలనం సృష్టించింది. చదవండి: బెంగళూరులో వ్యాపారి ఆత్మహత్య.. సుసైడ్ నోట్లో బీజేపీ ఎమ్మెల్యే పేరు -
మోకాళ్లపై కూర్చొని సోహైల్‌కు ప్రపోజ్ చేసిన ఇనయా
బిగ్‌బాస్ షోలో లేడీ టైగర్‌గా పాపులర్ అయిన కంటెస్టెంట్ ఇనాయా సుల్తానా. ఆర్జీవీ బ్యూటీ అనే ట్యాగ్ లైన్‌తో హౌస్‌లోకి ఎంటర్ అయిన ఇనయా సివంగిలా బయటకు వచ్చింది. బిగ్‌బాస్‌తో బోలెడం పాపులారిటీని దక్కించుకుంది. ఇక తాజాగా మరోసారి ఇనాయా పేరు నెట్టింట చక్కర్లు కొడుతుంది. బిగ్‌బాస్ కంటెస్టెంట్ సోహైల్ తన క్రష్ అని ఎన్నోసార్లు చెప్పిన ఇనాయా ఇప్పుడు ఏకంగా అతడికి ప్రపోజ్ చేసేసింది. రెడ్ డ్రెస్‌లో గులాబీ చేతిలో పట్టుకొని మోకాళ్లపై కూర్చొని మరీ సోహైల్‌కు తన ప్రేమను వ్యక్తపరిచింది. ప్రేమ ఉన్నంత వరకు కాదు.. ప్రాణం ఉన్నంత వరకు ప్రేమిస్తా అంటూ రొమాంటిక్‌గా ప్రపోజ్ చేసింది. బిగ్‌బాస్ హౌస్‌లోనే చెబుదాం అనుకున్నా నువ్వు అంటే నాకు పిచ్చి. ఇప్పుడు చెబుతున్నా ఐ లవ్యూ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇది చూసిన నెటిజన్లు మరి హౌస్‌లో ఆర్జే సూర్య అంటే ఇష్టమన్నావ్ కదా మరి ఇప్పుడేంటి? అని కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Inaya Sultan (@inayasulthanaofficial) -
Viral Video: టైటానిక్ రేంజ్లో లవ్ ప్రపోజ్ చేద్దామనుకున్నాడు.. ఇంతలోనే ట్విస్ట్..
-
టైటానిక్ రేంజ్లో లవ్ ప్రపోజ్ చేద్దామనుకున్నాడు.. ఇంతలోనే ట్విస్ట్..
Viral Video.. ప్రస్తుత జనరేషన్లో లవ్ ప్రపోజల్ చేయడంలో వినూత్నంగా థింక్ చేస్తున్నారు. కొందరు లవర్స్ క్రీడలు జరగుతున్న సమయాల్లో మరికొందరు రోడ్లపై తమ లవ్‌ను ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి తన స్నేహితురాలికి లవ్ ప్రపోజ్ చేసే క్రమంలో విధి అతడితో ఆటాడుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన స్కాట్ క్లైన్, తన ఫ్రెండ్ సుజీ టక్కర్‌తో కలిసి సముద్రంలో పడవ ప్రయాణం చేస్తున్నాడు. సాయంత్రం వేళ నడి సముద్రంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్న సమయంలో తన ప్రేమను ఆమెను తెలపాలనుకున్నాడు. అదే సమయంలో టైటానిక్ సినిమాలో ఫేమస్ ఫోజులో నిలుచున్న తర్వాత ఓ రింగ్‌లో ఆమెకు ప్రపోజ్ చేయాలని భావించాడు. అనుకున్నదే తడవు.. తన జేబులోని నుండి రింగ్ ఉన్న ఓ బాక్స్‌ను తెరచి మెకాళ్లపై నిలుచుని ప్రపోజ్ చేయబోయాడు. అదే సమయంలో విధి తనతో ఆటాడుకుంది. పడవపై వారు అటు ఇటు కదలడంతో రింగ్ ఉన్న బాక్స్ కాస్తా సముద్రంలో పడిపోయింది. దీంతో, వెంటనే ఆ బాక్స్‌ను పట్టుకునేందుకు స్కాట్ సముద్రంలో దూకాడు. అదృష్టం కొద్దీ అతడు ఉంగారాన్ని పట్టుకోగలిగాడు. అనంతరం, ఆ రింగ్‌ను ఆమెకు ఇచ్చి ప్రపోజ్ చేయడంతో ఆమె గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ ఘటన అనంతరం స్కాట్ మాట్లాడుతూ.. రింగ్ ప్రపోజ్ చేసే ముందు నా వెనుక జేబులో నుండి బాక్స్ సముద్రంలో పడిపోయింది. వెంటనే దాని కోసం సముద్రంలో దూకాను. ఈ క్రమంలో నేను భయాందోళనకు గురయ్యాను. రింగ్ బాక్స్ దొరకడంతో ఊపిరి పీల్చుకున్నాను. అదృష్టం కొద్ది నేను ఉంగరాన్ని తిరిగి పొందగలిగాను అని తెలిపాడు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. -
ప్రేమిస్తున్నానంటూ యువతికి పెళ్లైన వ్యక్తి ప్రపోజ్
సాక్షి, హైదరాబాద్ (జీడిమెట్ల): పెళ్లయిన వ్యక్తి వేరే యువతిని ప్రేమించగా ఆమె అతడి ప్రేమను తిరస్కరించడంతో ఎలుకల మందు సేవించి చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మృతిచెందిన ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై సతీష్‌రెడ్డి వివరాల ప్రకారం.. చింతల్ చంద్రానగర్‌కు చెందిన మలిన్(28), మమత భార్యాభర్తలు. వీరికి తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. మలిన్ బాలానగర్‌లోని ఓ రబ్బర్ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. అదే పరిశ్రమలో పనిచేసే ఓ యువతిని మలిన్ ప్రేమిస్తున్నాడు. ఈ విషయాన్ని సదరు యువతి ముందు వ్యక్తపరచగా ఆమె తిరస్కరించింది. దీంతో మలిన్ ఈ నెల 13వ తేదీన ఇంట్లో ఎలుకల మందు సేవించి అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. దీంతో మలిన్ భార్య మమత చికిత్స నిమిత్తం అతడిని 108లో గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స అనంతరం మలిన్‌ను గురువారం వైద్యులు డిశ్చార్జి చేశారు. అదేరోజు మలిన్‌కు చాతిలో నొప్పి రావడంతో మమత అతడిని మళ్లీ గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమించడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తుండగానే మలిన్ మృతిచెందాడు. మలిన్ భార్య మమత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చదవండి: (నన్ను వాడుకొని వదిలేశాడు.. అన్యాయం జరిగిందంటూ సినీనటి నిరసన) -
లైవ్ మ్యాచ్‌లో లవ్ ప్రపోజ్.. మరో దీపక్ చహర్ మాత్రం కాదు
ప్రేమకు సరిహద్దు లేదు అని మరోసారి నిరూపితమైంది. క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా లైవ్‌లో లవ్‌ప్రపోజ్ చేసిన సందర్భాలు కోకొల్లలు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగానే పాపులర్ అయ్యాయి. 2021 ఐపీఎల్ సీజన్లో సీఎస్కే ఆటగాడు దీపక్ చహర్ తన లవర్ జయా భరద్వాజ్‌కు లైవ్‌లోనే లవ్ ప్రపోజ్ చేయడం అప్పట్లో అందరిని ఆకట్టుకుంది. ఆ తర్వాత వారిద్దరు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. తాజాగా టి20 ప్రపంచకప్‌లో భాగంగా గురువారం టీమిండియా, నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్‌లో ఒక అద్భుత దృశ్యం చోటుచేసుకుంది. లైవ్ మ్యాచ్ జరుగుతుండగానే ఒక వ్యక్తి తాను ప్రేమించిన యువతి వద్దకు వచ్చి అచ్చం దీపక్ చహర్‌లా మోకాళ్లపై నిలబడి ఆమె చేతి వేలికి రింగ్ తొడిగాడు. ఆ తర్వాత ఐ లవ్ యూ.. విల్ యూ మ్యారీ మీ అని అడిగాడు. అందరిముందు అలా అడిగేసరికి మొదట సిగ్గుపడినప్పటికి యువతి అతని చెప్పిన విధానానికి ముగ్దురాలై ఓకే చెప్పేసింది. ఇదంతా పక్కనే ఉండి గమనించిన తోటి మిత్రులు సంతోషంతో మునిగిపోయారు. దీనికి సంబంధించిన వీడియోనూ ఐసీసీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంది. ఆమె అతని లవ్‌ను ఒప్పుకుంది అంటూ క్యాప్షన్ జత చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే టీమిండియా నెదర్లాండ్స్‌పై 56 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. టీమిండియా నిర్ధేశించిన 180 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నెదర్లాండ్స్.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 123 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా టీమిండియా 56 పరుగుల భారీ మార్జిన్‌తో విజయం సాధించింది. భారత బౌలర్లందరూ మూకుమ్మడిగా రాణించడంతో నెదర్లాండ్స్ భారీ తేడాతో ఓడింది. భువీ 3 ఓవర్లలో 2 మెయిడిన్లు వేసి 2 వికెట్లు పడగొట్టగా.. అర్షదీప్, అక్షర్ పటేల్, అశ్విన్‌లు కూడా తలో 2 వికెట్లు తీశారు. షమీకి ఓ వికెట్ దక్కింది. అంతకుముందు రోహిత్ (53), కోహ్లి (62 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్ (51 నాటౌట్) అర్ధశతకాలతో రాణించడంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: నన్ను GOAT అని పిలవకండి.. ఆ ఇద్దరే అందుకు అర్హులు: విరాట్ కోహ్లి టీమిండియా అరుదైన ఘనత.. 2007 తర్వాత మళ్లీ ఇప్పుడే -
గ్రౌండ్‌లోనే గర్ల్ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేసిన హాంకాంగ్ క్రికెటర్.. వీడియో వైరల్!
ఆసియా కప్-2022లో భాగంగా బుధవారం జరిగిన భారత్- హాంకాంగ్ మ్యాచ్ అనంతరం ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. హాంకాంగ్ బ్యాటర్ కించిత్ షా.. స్టేడియంలోనే తన గర్ల్‌ఫ్రెండ్‌కి ప్రపోజ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. భారత్‌తో మ్యాచ్ ముగిసిన వెంటనే స్టాండ్స్‌లోకి వెళ్లిన కించిత్.. అక్కడ కూర్చుని మ్యాచ్‌ని వీక్షిస్తున్న తన ప్రేయసికి సర్ప్రైజ్ ఇచ్చాడు. ఆమె ముంగిట మోకాళ్ల మీద కూర్చొని తన ప్రేమను వ్యక్తపరిచాడు. స్టేడియంలో అందరూ చూస్తుండగా.. ఆమె చేతికి రింగ్ తొడిగాడు. కించిత్ క్యూట్ ప్రపోజ్‌కు ఆమె ఫిదా అయిపోయింది. అనంతరం ఒకరినొకరు కౌగిలించుకుని ఆనందంలో మునిగితేలారు. దీంతో స్టేడియం ఒక్కసారిగా హోరెత్తిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో టీమిండియా క్రికెటర్ దీపక్ చహర్ సైతం ఇలాగే స్టేడియంలో గర్ల్‌ఫ్రెండ్‌కు ప్రపోజ్ చేసిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది జూన్‌లో వారి వివాహం జరిగింది. ఇదిలా ఉంటే... మ్యాచ్ విషయానికి వస్తే.. హాంకాంగ్‌పై భారత్ 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా సూపర్-4కు టీమిండియా ఆర్హత సాధించింది. భారత విజయంలో సూర్యకుమార్ యాదవ్(68 నాటౌట్), విరాట్ కోహ్లి(59 నాటౌట్) హాఫ్ సెంచరీలతో చేలరేగి కీలక పాత్ర పోషించాడు. She said YES! 😍💍 A heartwarming moment where Hong Kong's @shah_kinchit95 proposed to his SO after playing a big match against India 🥰 A huge congratulations to the happy couple. We wish you all the joy and happiness in your new life together ❤️#AsiaCup2022 #GetReadyForEpic pic.twitter.com/CFypYMaPxj — AsianCricketCouncil (@ACCMedia1) August 31, 2022 చదవండి: IND VS HK: అక్కడ ఉన్నది జడేజా.. కొంచెం చూసి వెళ్లాలి కదా! వీడియో వైరల్ -
యుద్ధ సైరన్ల మధ్య ప్రియురాలికి ప్రపోజ్: వీడియో వైరల్
Heartbreaking visuals from war-battered Ukraine: ఉక్రెయిన్ రష్యా యుద్ధంతో అట్టుడికి పోతుంది. ఈ యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో వేలాది మంది సైనికులు నెలకొరిగారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ భయానక యుద్ధం ఉక్రెయిన్‌ని శిథిలా నగరంగా మార్చింది. ఎటూ చూసిన శవాల దిబ్బ మరోవైపు సైన్యం కొరత ఏర్పడిన ఏ మాత్రం వెరకవక రష్యాతో పోరాడుతోంది. ఈ తరుణంలో ఒక వ్యక్తి యుద్ధానికి సిద్ధమవుతూ ప్రియురాలికి ప్రపోజ్ చేశాడు. ఈ మేరకు సదరు వ్యక్తి మోకాళ్లపై నిలబడి తన ప్రియురాలికి ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేశాడు. ఆ వ్యక్తి యుద్ధా సైరన్లు నడుమ ప్రియురాలికి ప్రపోజ్ చేశాడు. యుద్ధం కారణంగా ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని తరుణంలో ఇలా ప్రపోజ్ చేశాడు ఉక్రెయిన్ ఎమర్జెన్సీ సంరక్షకుడు. గెరాష్చెంకో అనే వ్యక్తి ఈ ఘటనకు సంబంధించిన వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ...అతను ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రి సలహాదారుడని చెబుతాడు. అంతేకాదు ఈ వీడియోకి ఇప్పుడూ "మా జీవితం యుద్ధ జీవిత సమతుల్యత" అని ఒక క్యాప్షన్‌ని జోడించి మరీ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. హృదయ విదారకరమైన విషయం ఏమిటంటే ఒక పక్కా ఆనందకరమైన క్షణం మరోవైపు సైరన్ల మోత ఏడుపు తెప్పించేలా ఆవేదనగా ఉంటుంది. అయినప్పటికీ మిగతా సంరక్షక్షులు ఆ జంటను సంతోషంగా ఉండండి అంటూ.. ఉత్సహపరుస్తారు. This is our life now - we joke about "war-life balance". This rescuer was saving people, now he is proposing. The siren wails for danger, now it sounds in joy. It is all intertwined, and no one's life is untouched by war in Ukraine. pic.twitter.com/Bzh2nG7VjQ — Anton Gerashchenko (@Gerashchenko_en) July 29, 2022 (చదవండి: పనసకాయ కోసం ఎన్ని తిప్పలు పడిందో ఈ ఏనుగు) -
'ఇలాంటి లవ్ ప్రపోజల్' నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్
ఐపీఎల్ 2022లో భాగంగా ఆర్సీబీ, సీఎస్కే మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. లైవ్ మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఒక యువతి అందరూ తన బాయ్‌ఫ్రెండ్‌కు లవ్ ప్రపోజ్ చేసింది. అందుకు సదరు యువకుడు అంగీకారం తెలపడంతో వెంటనే అతని చేతికి రింగ్‌ను తొడిగి తన సంతోషాన్ని పంచుకుంది. ఆ తర్వాత వారిద్దరు ఒకరినొకరు హగ్ చేసుకొని సంతోషంలో మునిగిపోయారు. ఈ ఇద్దరు ప్రేమికులను చూస్తుంటే ఆర్సీబీకి పెద్ద ఫ్యాన్స్‌లా కనిపించారు. మ్యాచ్ మధ్యలోనే ఈ తతంగమంతా జరగడంతో కెమెరాను అటువైపు తిప్పగా.. మైదానంలో ఉన్న ఆటగాళ్లు కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా లవ్ ప్రపోజల్ ఐపీఎల్లో కొత్తేం కాదు. ఇలాంటి ఘటనలు గతంలోనూ చాలానే చోటుచేసుకున్నాయి. ఒక ఐపీఎల్ సీజన్లో లైవ్ మ్యాచ్ జరుగుతుండగానే ఒక జంట ముద్దుల్లో మునిగిపోయింది. ఇక ఐపీఎల్ 2021 సీజన్లో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత సీఎస్కే బౌలర్ దీపక్ చహర్ స్టేడియంలో ఉన్న తన ప్రేయసి వద్దకు లవ్ ప్రపోజల్ చేయడం అప్పట్లో తెగ వైరల్ అయింది. Santhosham ga undandi🙌🏻 pic.twitter.com/houNPcolYW — Varma (@Varma____) May 4, 2022 -
'లవ్ ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసింది.. కోహినూర్ డైమండ్‌ను మిస్సయ్యావు!'
టీమిండియా సీనియర్ ఆటగాడు శిఖర్ ధావన్ అభిమానులను సంతోషపరచడంలో ముందుంటాడు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా కనిపించే ధావన్ సినిమా డైలాగ్స్, డ్యాన్స్‌లతో ఎన్నోసార్లు అలరించాడు. ధావన్‌కు టీమిండియా గబ్బర్ అని ముద్దుపేరు ఉంది. టీమిండియా ఓపెనర్‌గా మంచి పేరు సంపాదించిన శిఖర్ ధావన్ 149 వన్డేల్లో 6284 పరుగులు, 34 టెస్టుల్లో 2315 పరుగులు, 68 టి20ల్లో 1759 పరుగులు సాధించి కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. Courtesy: IPL TWitter తాజాగా జరుగుతున్న ఐపీఎల్ 2022లో పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న గబ్బర్ రెండు మ్యాచ్‌ల్లో 92 పరుగులు చేశాడు. ఏప్రిల్ 8న బ్రబౌర్న్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ ఆడేందుకు పంజాబ్ సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ క్యాండిడ్ కాన్వర్జేషన్ పేరిట శశి దిమన్కు ఇచ్చిన ఫన్నీ ఇంటర్య్వూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఇంటర్య్వూలో ధావన్ తన వ్యక్తిగత విషయాలను చాలానే పంచుకున్నాడు. అయితే అందులో ఒకటి మాత్రం బాగా పేలింది. క్రికెట్ ఆడుతున్న కొత్తలో ఒక అమ్మాయి ధావన్ లవ్ ప్రపోజల్‌ను రిజెక్ట్ చేసిన విషయాన్ని పేర్కొన్నాడు. Courtesy: IPL TWitter ''అవి నేను క్రికెట్లో అప్పుడప్పుడే ఎదుగుతున్న రోజులు. ఆ సమయంలో ఒక అమ్మాయి(పేరు చెప్పలేను) బాగా నచ్చి ప్రపోజ్ చేశాను. ఆమె నన్ను రిజెక్ట్ చేసింది. కారణం.. నేను అప్పట్లో కాస్త నల్లగా ఉండేవాడిని(ఇప్పుడు కూడా పెద్ద కలర్ కాదనుకోండి).. అంతే కాదు నా ముఖంపై మచ్చలు ఉండడంతో నా లవ్‌ను రిజెక్ట్ చేసింది. ఆ తర్వాత ఆమెకు నేను ఇచ్చిన కౌంటర్ సమాధానం ఎప్పటికి గుర్తుండిపోతుంది. నువ్వు కోహినూర్ డైమండ్‌ను రిజెక్ట్ చేశావు.. ఇలాంటివాడు నీకు మళ్లీ దొరక్కపోవచ్చు..'' అంటూ ముసిముసిగా నవ్వాడు. ఈ వీడియోనూ పంజాబ్ కింగ్స్ తన ట్విటర్లో షేర్ చేసింది. మీరు ఒక లుక్కేయండి. చదవండి: Kohli-Maxwell: మ్యాక్స్‌వెల్ టెన్షన్ పోగొట్టేందుకు కోహ్లి ఏం చేశాడంటే! IPL 2022 RR Vs RCB: కోహ్లి ఎందుకంత బద్దకం.. వీడియో వైరల్ Fun is bound when Shikhar is around! 😉 📹 | 𝗣𝘂𝗻𝗷𝗮𝗯𝗶 𝗽𝘂𝘁𝘁𝗮𝗿 𝗦𝗵𝗶𝗸𝗵𝗮𝗿 getting candid with Shashi is nothing but a laugh riot 🤩#PunjabKings #SaddaPunjab #IPL2022 #ਸਾਡਾਪੰਜਾਬ @SDhawan25 pic.twitter.com/xdH3TZJXAD — Punjab Kings (@PunjabKingsIPL) April 6, 2022 -
ఓ వైపు యుద్దం.. ఇటు లవ్ ప్రపోజ్ చేసిన ఉక్రెయిన్ సైనికుడు.. వీడియో వైరల్
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా ఆ దేశ ప్రజలు జీవన విధానం అస్తవ్యస్తమైపోయింది. బాంబు దాడులకు నివాస సముదాయాలు కూలిపోయాయి. చాలా మంది ఉక్రేనియన్లు వీధిన పడ్డారు. ఉక్రెయిన్‌లో హృదయ విదారక ఘటనలు పలువురికి కంట తడి పెట్టిస్తున్నాయి. రష్యా దాడుల నేపథ్యంలో పలువురు ఉక్రెయిన్ ప్రజలు ఆ దేశం నుండి ఇతర దేశాలకు తరలిపోతున్నారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. యుద్దం కారణంగా ఉక్రెయిన్‌కు వీడిపోతున్న తన ప్రేయసికి లవ్ ప్రపోజ్ చేశాడు ఉక్రెయిన్ సైనికుడు. ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. లవ్ ప్రపోజ్ చేసిన తీరు చూసి నెటిజన్లు ఫన్నీగా, ఎమోషనల్‌గా కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఎలా జరిగిందంటే.. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సమీపంలోని ఫాస్టివ్ చెక్‌పోస్ట్ నగరాన్ని వీడుతున్న ప్రజలను ఆ దేశ సైనికులు తనిఖీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక కారులో ప్రయాణిస్తున్న కొందరు వ్యక్తులను సైనికులు ఆపి.. వారి కారును, పత్రాలను పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆ కారులో ప్రయాణిస్తున్న వారిలో తన ప్రియురాలు ఉన్నట్లు ఒక సైనికుడు గమనించాడు. తనిఖీ చేస్తుండగా వెనక్కి నిలుచుని ఉన్న ఆమె వద్దకు వెళ్లి మోకాలిపై కూర్చొని ఒక చేతిలో ఉంగరం, మరో చేతిలో పుష్ఫగుచ్చంతో పెళ్లి ప్రపోజల్‌ను ఆమె ముందుంచాడు. సడెన్‌గా ఇలా ప్రియుడిని చూసిన ఆనందంలో ఆమె ఒక్కసారిగా సర్ప్రైజ్ అయ్యింది. క్షణాల వ్యవధిలో ఆమె.. అతడిని హగ్ చేసుకొని తాను పెళ్లి రెడీ అన్న సంకేతంతో ముద్దుపెట్టింది. అనంతరం అతడు ఉంగరాన్ని ఆమె వేలికి తొడిగాడు. ఆ సమయంలో అక్కడున్న మిగతా సైనికులు, ఇతరులు ఆ జంటకు అభినందనలు తెలిపారు. కాగా, 14 రోజులుగా బాంబు దాడులతో దద్దరిల్లుతున్న ఉక్రెయిన్‌లో ఇలాంటి ఓ ఘటన చోటుచేసుకోవడం అందరినీ ఆనందపరిచింది. ఈ సందర్బంగా ఈ జంటకు అంతా మంచే జరగాలంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కోరుకుంటున్నారు. #Watch#Ukraine️ pic.twitter.com/4DeRtEgivM — Geeta Mohan گیتا موہن गीता मोहन (@Geeta_Mohan) March 7, 2022 -
అమీషా.. నన్ను పెళ్లి చేసుకుంటావా?
Late Congress Leader Ahmed Patel Son Proposes To Heroine Ameesha Patel: బద్రి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన హీరోయిన్ అమీషా పటేల్. నాని, నరసింహుడు చిత్రాలతో తెలుగులో పాపులర్ అయిన ఈమె గత కొంతకాలంగా ఈమె దివంగత కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ తనయుడు ఫైజల్ పటేల్‌తో ప్రేమలో మునిగితేలుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ తమ ప్రేమ బంధంపై వీరిద్దరు ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే తాజాగా ఫైజల్ 41వ బర్త్‌డే సందర్భంగా గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. 'హ్యాపీ బర్త్ డే మై డార్లింగ్.. ఐ లవ్ యు..అంటూ అమీషా సైతం ట్విట్టర్లో ప్రియుడికి బర్త్‌డే విషెస్ తెలిపింది. దీనికి ఫైజల్ మాత్రం ఆసక్తికరంగా స్పందించాడు. థ్యాంక్యూ అమీషా పటేల్. ఈ సందర్భంగా పబ్లిక్‌గా నీకు ప్రపోజ్ చేస్తున్నా. నన్ను పెళ్లి చేసుకుంటావా? అంటూ సోషల్ మీడియాలో పెళ్లి ప్రపోజల్ పెట్టాడు. అయితే కాసేపటికే ఫైజల్ ఆ ట్వీట్‌ను డిలీట్ చేశాడు. కానీ అప్పటికే నెటిజన్లు ఈ చాట్‌కి సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ను తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసేశారు. కాగా గతంలో ఫైజల్ జైనాబ్ అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. కానీ గుండెపోటుతో ఈమె 2016లో చనిపోయింది. అనంతరం ఫైజల్ అమీషా ప్రేమలో పడ్డాడు. ఫైజల్ కంటే అమీషా పటేల్ నాలుగేళ్లు పెద్దది. -
వాటే రొమాంటిక్ ప్రపోజల్.. సినిమాల్లో కూడా సాధ్యం కాదు!
ఏనుగులు చిలిపిగా స్నానం చేసిన వీడియోలు, తమ పిల్ల ఏనుగులపై ప్రేమ కురిపించిన వార్తలు చూశాం. అయితే తాజాగా వాటికి భిన్నంగా ఓ మగ ఏనుగు తాను ప్రేమించిన ఆడ ఏనుగుకు చాలా వైవిధ్యంగా లవ్‌ను ప్రపోజ్ చేసిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. లవ్ ప్రపోజ్‌ను మనుషులైతే ప్రేమలేఖ, పువ్వులు, చాక్లెట్లను అందించి వ్యక్తంచేస్తారు. అయితే ఈ ఏనుగు కూడా మనుషులకు తానేం తక్కువ కాదన్నట్టు.. తన ప్రేయసి ఏనుగుకు ఫ్లవర్స్ అందించి ప్రేమను వ్యక్తం చేసింది. ఆ ఏనుగు తన తొండంతో పూలను పట్టుకొచ్చి.. ఆడ ఏనుగుకు ఇచ్చి స్వచ్ఛమైన ప్రేమను బయటపెడుతుంది. అంతే ప్రేమతో ఆడ ఏనుగు.. మగ ఏనుగు ఇచ్చిన పూలను తొండంతో పట్టుకొని నేను నీదాన్నే అన్నట్టుగా ప్రవర్తిస్తూ ప్రపోజల్ యాక్సెప్టె చేస్తుంది. ఈ ఏనుగు లవ్ ప్రపోజల్ వీడియోను ఎలిఫెంట్స్ వరల్డ్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్‌చేశారు. ‘ప్రపోజల్ యాక్సెప్టెడ్!’ అనే కామెంట్ కూడా జతచేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోను చూసిన నెటిజన్లు ఏనుగు ప్రేమ ప్రపోజల్.. చాలా రోమాంటిక్‌గా ఉందని ఫిదా అవుతున్నారు. ‘మనుషుల కంటే అద్భుతంగా ఈ ఏనుగు లవ్ ప్రపోజ్ చేసింది!’.. ‘ఏనుగు ప్రేమ ఎంత స్వచ్ఛమైందో? ఈ ‘లవ్ ప్రపోజల్’లో స్పష్టంగా కనిపిస్తోంది’.. వాటే రోమాంటిక్ ప్రపోజల్.. సినిమాల్లో కూడా సాధ్యం కాదు!’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by 𝙀𝙡𝙚𝙥𝙝𝙖𝙣𝙩𝙨 𝙇𝙤𝙫𝙚𝙧𝙨 🐘 (@elephantsofworld) -
బిగ్‌బాస్: మానస్‌కి ప్రపోజ్ చేసిన పింకీ.. నెట్టింట వైరల్
Pinky Proposes To Maanas Unseen Video Goes Viral: బుల్లితెరపై బిగ్‌బాస్ షోకు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక కొందరు కంటెస్టెంట్లకు సైతం అప్పటివరకు రాని గుర్తింపు బిగ్‌బాస్ ద్వారా వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే వంద రోజులకు పైగా సాగే బిగ్‌బాస్ హౌస్‌లో లవ్‌ట్రాక్‌లు కూడా సహాజమే. అప్పటివరకు ఎలాంటి కనెక్టివిటి లేని వాళ్లు సైతం బెస్ట్‌ఫ్రెండ్స్‌గా మారిపోతారు. మరికొందరేమో ఆ రిలేషన్‌ను మరింత ముందుకు తీసుకెళ్తారు. తాజాగా ప్రియాంక సింగ్(పింకీ) అలాంటి ప్రయత్నమే చేసింది. రోజురోజుకి మానస్‌పై పెంచుకుంటున్న ప్రేమను బయటపెట్టేసింది. సోమవారం(నవంబర్22)న జరిగిన ఎపిసోడ్లో పింకీ మానస్‌కి ప్రపోజ్ చేసింది. 'నేను నిన్ను ఇష్టపడుతున్నానేమో అనిపిస్తుంది. మొదటి రోజు నుంచి నిన్ను చేస్తుంటే ఏదో తెలియని పాజిటివ్ ఎనర్జీ అనిపిస్తుంది. ఇది కరెక్ట్ కాదన్న సంగతి నాకు తెలుసు కానీ నీ విషయంలో నాకు బాగా అనిపిస్తుంది' అంటూ తన మనసులో మాటను బయటపెట్టేసింది. ఇది బిగ్‌బాస్ అన్‌సీన్‌లో ప్లే అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
కాబోయే భార్యకు స్టేజ్‌పై ప్రపోజ్ చేసిన హీరో కార్తికేయ
Hero Karthikeya Proposed to His Fiance Lohitha Reddy: ‘ఆర్ఎక్స్ 100’ హీరో కార్తికేయ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. తాజాగా రాజా విక్రమార్క చిత్రంలో నటించాడు. శనివారం(నవంబర్7)న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో కార్తికేయ తన కాబోయే భార్యను అందరికి పరిచయం చేశాడు. ఈవెంట్లోనే భార్యకు లవ్‌ప్రపోజ్ చేశాడు. 'నేనే ముందు ప్రపోజ్ చేశా. నా లైఫ్‌లో హీరో అవ్వడానికి పెట్టినంత స్ట్రగుల్ తన ప్రేమ కోసం పెట్టాను. అప్పుడే చెప్పా..హీరో అయ్యాక వచ్చి మీ ఇంట్లో అడుగుతానని. అదృష్టం. ఆ అమ్మాయినే నేను ఈనెల21న పెళ్లి చేసుకోబోతున్నాను. తను నా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, గాళ్ ఫ్రెండ్. ఎక్స్ గాళ్ ఫ్రెండ్. ఇక నుంచి ఒక్కటే రోల్.. వైఫ్' అంటూ కాబోయే భార్యను పరిచయం చేశాడు. కాగా కొన్ని నెలల క్రితం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్లో అతికొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. కాగా లోహిత కార్తికేయ కుటుంబానికి దగ్గరి బంధువు అని సమాచారం. -
దీపక్ చాహర్ లవ్ ప్రపోజల్ సెలబ్రేషన్స్.. ధోని హంగామా చూడాల్సిందే..!
Deepak Chahar Love Proposal Celebrations: చెన్నై సూపర్‌కింగ్స్ ఆటగాడు దీపక్ చాహర్.. గురువారం పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ అనంతరం తన నెచ్చెలి జయా భరద్వాజ్‌కు లైవ్‌లో ప్రేమను వ్యక్తపరిచిన విషయం తెలిసిందే. అనంతరం సీఎస్కే యాజమాన్యం ఈ లవ్ జంట కోసం అదిరిపోయే పార్టీని అరేంజ్ చేసింది. తొలుత వీరిరువురు కేక్‌ను కట్ చేసి ఒకరికొకరు తినిపించుకోగా.. ఆ తర్వాత అసలు సిసలైన సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ధోని నేతృత్వంలో రైనా, జడేజా, శార్ధూల్ ఠాకూర్, రాబిన్ ఊతప్పలు చాహర్‌ను కేక్, డ్రింక్స్‌తో ముంచెత్తారు. ఈ వేడుకల్లో ధోని, రైనాల కూతుళ్లు తెగ సందడి చేయగా, ధోని భార్య సాక్షి.. జయా భరద్వాజ్‌ను హత్తుకుని విష్ చేసింది. View this post on Instagram A post shared by Chennai Super Kings (@chennaiipl) ఈ వేడుకకు సంబంధించిన వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం తమ అధికారిక ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా వైరలవుతోంది. జోడి బాగుంది అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే, సీఎస్కే జట్టు నిన్నటి మ్యాచ్‌లో పంజాబ్ చేతిలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ విధ్వంసం ధాటికి సీఎస్కే 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. అయితే, చెన్నైకు ఇదివరకే ఫ్లే ఆఫ్స్ బెర్తు ఖరారు కావడంతో మ్యాచ్ నామమాత్రంగా సాగింది. 13 మ్యాచ్‌ల్లో 13 వికెట్లతో దీపక్ చాహర్ సీఎస్కే విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు. చదవండి: Deepak Chahar: మరదలు దొరికేసింది.. ఇంతకీ ఎవరీ అమ్మాయి?! -
CSK Vs PBKS: లైవ్‌లో లవ్ ప్రపోజ్ చేసిన దీపక్ చాహర్..
Deepak Chahar Proposes To His Girl Friend During Match: ఐపీఎల్-2021 రెండో దశలో భాగంగా ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మ్యాచ్ అనంతరం సీఎస్కే ఆల్‌రౌండర్ దీపక్ చాహర్ అందరూ చూస్తుండగా లైవ్‌లో తన గర్ల్‌ఫ్రెండ్‌కు రింగ్ తొడిగి లవ్ ప్రపోజ్ చేశాడు. ఇందుకు ఆమ్మాయి తరపు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో స్టేడియం మొత్తం ఒక్కసారిగా హోరెత్తింది. చాహర్, అతని ప్రేయసి ఉంగరాలు మార్చుకున్న తర్వాత ఒకరినొకరు కౌగిలించుకుని ఆనందంలో మునిగితేలారు. View this post on Instagram A post shared by Deepak Chahar (@deepak_chahar9) స్టాండ్స్‌లో ఇరువురి సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ తంతుని మొత్తం క్రీడా జగత్తు వీక్షించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియా తెగ వైరలవుతోంది. టీమిండియా ఆటగాళ్లు సహా మొత్తం క్రికెట్ ప్రపంచం ఈ ప్రేమ పావురాలకు విషెస్ తెలిపింది. అయితే కొందరు మాత్రం చాహర్ చేసిన పనిని తప్పుబడుతున్నారు. మ్యాచ్‌పై కాన్సంట్రేట్ చేయకుండా లైవ్‌లో ఇలాంటి పని ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఏదిఏమైనప్పటికీ చాహర్, అతని ప్రేయసికి ఈ రోజు జీవితకాలం గుర్తుండిపోతుంది. కాగా, చాహర్ ప్రపోజ్ చేసిన అమ్మాయి విదేశీయురాలిగా తెలుస్తోంది. చదవండి: ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్.. చారిత్రక సిరీస్‌కు స్టార్ ఆల్‌రౌండర్ దూరం -
MS Dhoni: సాక్షి సింగ్ సమక్షంలోనే ధోనికి లవ్ ప్రపోజ్
Love Proposal To MS Dhoni 2018 IPL.. టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోనికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్లో ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆట నుంచి దూరమైన తర్వాత కూడా అతని క్రేజ్ ఇసుమంతైన తగ్గలేదనడానికి తాజా ఐపీఎల్ సీజనే ఉదాహరణ. ధోని ఆడకపోయినా పర్లేదు.. జట్టును విజేతగా నిలిపితే చూడాలని చాలామంది అనుకుంటారు. అలాంటి ధోనికి అమ్మాయిల్లోనూ యమ క్రేజ్ ఉంటుంది. ధోని అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన సమయంలో తన జులపాల జట్టును ఇష్టపడని అమ్మాయిలు ఉండరు. ధోని హెయిర్‌స్టైల్ చూసే చాలామంది అమ్మాయిలు బహిరంగంగానే లవ్‌ప్రపొజల్ చేసిన ఘటనలు కోకొల్లలు. అయితే అవి అభిమానం వరకు మాత్రమే పరిమితమయ్యేవి. ఇక ధోనికి 2010లో తన చిన్ననాటి స్నేహితురాలు సాక్షి సింగ్‌ను వివాహమాడాడు. చదవండి: Viral Video: భార్యను భయపెట్టిన రోహిత్ శర్మ.. ఈ సంగతి అలా ఉంచితే.. ఐసీసీ తన ట్విటర్లో 2018 ఐపీఎల్ సీజన్లో ధోనికి లవ్ ప్రపోజ్ చేసిన ఒక అమ్మాయి త్రోబ్యాక్ ఫోటోను షేర్ చేసింది. కాగా సాక్షి సమక్షంలోనే ఆ అమ్మాయి ధోనికి లవ్ ప్రపోజ్ చేయడం అప్పట్లో ఆసక్తికరంగా మారింది. '' ధోని నీకు పెళ్లి అయి ఉండొచ్చు.. కానీ నా ఫస్ట్ లవ్ ఎప్పటికీ నువ్వే.. ఐ లవ్ యూ మహీ'' అంటూ ఆ యువతి ఫ్లకార్డు చేతపట్టుకొని తన లవ్‌ను ప్రపోజ్ చేసింది. ఇక 2018 సీజన్లో సీఎస్కే చాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. వాంఖడే వేదికగా ఎస్ఆర్హెచ్తో జరిగిన ఫైనల్లో 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించి మూడోసారి ఐపీఎల్ టైటిల్‌ను కొల్లగొట్టింది. ఇక తాజాగా ఐపీఎల్ 2021 సీజన్లోనూ సీఎస్కే దుమ్మురేపుతుంది. గతేడాది దారుణ ప్రదర్శనను మైమరిపిస్తూ దూకుడైన ఆటతీరు కనబరిచిన సీఎస్కే ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు చేరింది. ఇక తన చివరి లీగ్ మ్యాచ్‌ను సీఎస్కే పంజాబ్ కింగ్స్‌తో ఆడనుంది. చదవండి: Ishan Kishan: రికార్డుతో పాటు ఫామ్‌లోకి వచ్చాడు.. సంతోషం 💕 @msdhoni 😍#CSKvRR #IPL2018 pic.twitter.com/j2t5Scuwzs — ICC (@ICC) April 20, 2018 -
ఇన్‌స్టాలో పరిచయం: బాలిక ‘ప్రేమ చదివింపులు’.. చివరకు..
సాక్షి, తిరువళ్లూరు(తమిళనాడు): సోషల్ మీడియాలో పరిచయాలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో తెలిపే ఉదంతం ఇది. ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయమైన యువకుడి ప్రేమ మాటలు నమ్మిన బాలిక విడతల వారిగా 36 సవర్ల నగలు, రూ.లక్ష నగదు చెల్లించుకుంది. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. తిరువళ్లూరు జిల్లా విష్ణువాక్కం గ్రామానికి చెందిన బాలిక(16) తిరువళ్లూరులోని ఓ ప్రైవేటు పాఠశాలలో ప్లస్‌టూ చదువుతోంది. కరోనా నేపథ్యంలో ఆన్లైన్ తరగతుల కోసం తండ్రి స్మార్ట్ ఫొన్ కొనిచ్చారు. క్లాసులు ముగిసిన తర్వాత సోషల్ మీడియాకు అలవాటు పడింది. ఈ క్రమంలో ఇన్‌స్ట్రాగామ్ ద్వారా మనవాలనగర్‌కు చెందిన రేవంత్ పరిచయమయ్యాడు. మాయ మాటలు చెబుతూ ప్రేమపేరుతో బాలికను బుట్టలో వేసుకున్నాడు. అమ్మకు ఆరోగ్యం సరిగ్గా లేదని, చదువు కోసమని వివిధ సందర్భాల్లో బాలిక నుంచి 32 సవర్ల నగలు, రూ. లక్ష నగదు వసూలు చేసి చివరికి ఫోన్ స్విచ్ఆఫ్ చేశాడు. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన బాలిక తండ్రి వెంగల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు రేవంత్ కోసం గాలిస్తున్నారు. ఆన్లైన్ తరగతులు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను ఓ కంట కనిపెట్టి ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. చదవండి: ఆర్ఎంపీ క్లినిక్‌లో దారుణం.. తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం -
వారెవ్వా క్యా సీన్ హై.. ట్రాక్‌పైనే అంధ అథ్లెట్‌కు లవ్ ప్రపోజల్
టోక్యో: పారాలింపిక్స్‌లో భాగంగా శుక్రవారం జరిగిన 200 మీటర్ల పరుగు పందెంలో రన్నింగ్ ట్రాక్‌పై ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఓ అంధ అథ్లెట్‌కు ఆమె గైడ్ రన్నింగ్ ట్రాక్‌పైనే ప్రమోజ్ చేసి ఆమెతో సహా అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. వివరాల్లోకి వెళితే.. కేప్ వర్డే దేశానికి చెందిన స్ప్రింటర్ క్యూలా నిద్రేయి పెరీరా సెమెడో.. సెమీ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. అయితే ఆమె ఏమాత్రం నిరాశపడలేదు. ఎందుకంటే.. ఆమెకు మెడల్ కంటే గొప్ప బహుమతి లభించింది. దీంతో ఆమె స్వర్ణం గెలిచినంతగా ఉబ్బితబ్బిబిపోయింది. Keula Nidreia Pereira Semedo from Cape Verde got a surprise marriage proposal from guide after her Tokyo Paralympics 2020 Women's 200m T11 Heat 4 event.#YouDeserveIt #Paralympics pic.twitter.com/ZR6Lq7EwOb — SABC Sport (@SPORTATSABC) September 2, 2021 పరుగు పందాన్ని నాలుగో స్థానంతో ముగించిన అనంతరం ఆమె గైడ్ మాన్యువల్ ఆంటోనియో వాజ్ డా వేగా ట్రాక్‌పైనే పెరీరాకు లవ్ ప్రపోజ్ చేశాడు. మోకాళ్ల మీద కూర్చుని.. 'నన్ను పెళ్లి చేసుకుంటావా' అని అడిగాడు. అందుకు ఒక్కసారిగా అవాక్కయిన పెరీరా.. అనంతరం ఓకే చెప్పడంతో సహచర అథ్లెట్లతో సహా మైదానంలో ఉన్న ప్రతి ఒక్కరూ చప్పట్లతో లవ్ బర్డ్స్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ట్రాక్‌పై లవ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ సర్ప్రైజ్ లవ్ ట్రాక్‌ను పారాలింపిక్స్ నిర్వాహకులు అధికారిక ట్విటర్లో షేర్ చేశారు. 'జీవితంలో ఇద్దరూ కలిసి పరుగులు ప్రారంభించండి' అంటూ ట్వీటారు. కాగా, టోక్యో ఒలింపిక్స్‌లో కూడా ఇలాంటి లవ్ ప్రపోజల్ సీన్ ఒకటి నెట్టింట హల్చల్ చేసింది. అర్జెంటీనా ఫెన్సర్ మరియా బెలెన్ పెరెజ్ మారిస్కు ఆమె కోచ్ లూకాస్ సౌసెడో లవ్ ప్రపోజ్ చేశాడు. 2010 పారిస్ ప్రపంచ ఛాంపియన్షిప్ సందర్భంగా కూడా సౌసెడో ఇలానే ప్రేమను వ్యక్తపరచడం విశేషం. చదవండి: కేబీసీలో.. కేటీఆర్? విషయం ఏమిటంటే? -
లైవ్‌లోనే లవ్ ప్రపోజల్: ఓడిన ప్లేయర్‌కు షాకిచ్చిన కోచ్!
టోక్యో (జపాన్): విశ్వ క్రీడా సంబరం జపాన్ రాజధాని టోక్యో నగరంలో జరుగుతోంది. ప్రపంచ దేశాల క్రీడాకారులు తమ ప్రతిభ నిరూపించుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. అందరూ గెలుపు కోసం ప్రయత్నిస్తారు. కానీ అందులో కొందరికీ మాత్రమే విజయం వరిస్తుంది. ఇక మిగిలిన వారు ఓటమి చెందుతారు. గెలుపోటములనేవి సమానంగా తీసుకోవాలి. ఈ విషయాన్ని గుర్తిస్తే ఆటలోనైనా.. జీవితంలోనైనా మానసికంగా సిద్ధమైతే ఏ పరిస్థితిని అయినా ఎదుర్కొనవచ్చు. అలా బాధలో ఉన్న ఓ ప్లేయర్‌కు ఆమె కోచ్ ఊహించని షాక్ ఇచ్చాడు. ఇన్నాళ్లు నీ వెంట నేనున్నా.. ఇకపై నా వెంట నువ్వుంటావా? అని మీడియా వేదికగా లవ్ ప్రపొజల్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అర్జెంటీనా ఫెన్సర్ మారియా బెలెన్ పెరెజ్ మారిస్ టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొని తొలి రౌండ్లోనే పరాజయం పొంది నిరాశకు గురయ్యింది. తన ప్రదర్శనపై మీడియాతో మాట్లాడుతోంది. ఈ సమయంలో ఆమె కోచ్ లుకాస్ ససిడో వెంట నిలబడి ‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని వారి మాతృ భాషలో రాసిన ఒక పేపర్ పట్టుకుని నిలబడ్డారు. వీటిని చూసిన మీడియా ప్రతినిధులు గట్టిగా నవ్వారు. ఎందుకు నవ్వుతున్నారో తెలియక ఆమె వెనకకు తిరిగి చూసింది. కోచ్ చేసిన ప్రేమ అభ్యర్థనను చూసి ఒక్కసారిగా నోరెళ్లబెట్టింది. వెంటనే అతడి ప్రేమ అభ్యర్థనను అంగీకరించింది. బెలెన్ మూడుసార్లు ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొంది. బెలెన్కు లుకాస్ కొన్నేళ్లుగా కోచ్‌గా ఉన్నారు. 2010లో పారిస్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్ షిప్ పోటీల్లోనూ కోచ్ లుకాస్ ఇదే విధంగా ప్రపోజ్ చేశాడు. అయితే అప్పుడు ‘నువ్వు జోక్ చేస్తున్నావా?’ అని చెప్పి లైట్‌గా తీసుకుంది. ఇప్పుడు 2021లో అదే విధంగా ప్రపోజ్ చేయడంతో ఆమె చివరకు లుకాస్‌ను అంగీకరించింది. తాము పెళ్లి చేసుకుంటామని మీడియా ముఖంగానే ప్రకటించారు. ఈ లైవ్ లవ్ ప్రపోజల్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
వైరల్: 22 వేల మంది ముందు.. ‘యెస్’ చెప్పేసింది!
మాంచెస్టర్: ఇంగ్లండ్- పాకిస్తాన్ మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే ఓ వ్యక్తి తన ప్రేయసికి ప్రపోజ్ చేశాడు. అనూహ్య పరిణామానికి అవాక్కైన ఆమె.. ఆశ్చర్యం నుంచి తేరుకుని అతడి ప్రతిపాదనకు అంగీకారం తెలిపింది. ప్రియుడు ఇచ్చిన ఉంగరం స్వీకరించి కన్నీటి పర్యంతమైంది. చుట్టూ ఉన్న ప్రేక్షకులంతా చప్పట్లతో వీరి ప్రేమను హర్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఈ ఘటన గురించి కామెంటేటర్ డేవిడ్ లాయిడ్ మాట్లాడుతూ.. ‘‘హేయ్... ఇక్కడ ఏం జరుగుతోంది? జిల్, ఫిల్.. అంతేకదా జిల్.. ఫిల్. 22 వేల మంది ముందు ప్రపోజ్ చేశాడు. డెసిషన్ పెండింగ్‌లో ఉంది.. ఓహో.. ఆమె యెస్ చెప్పేసింది’’ అంటూ ప్రేమజంట పేర్లను వెల్లడించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇంగ్లండ్ క్రికెట్ తమ అధికారికి ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. కాగా మ్యాచ్ 9వ ఓవర్ చివర్లో పాకిస్తాన్ ఆటగాళ్లు మహ్మద్ రిజ్వాన్, ఫఖార్ జమాన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక చివరిదైన మూడో టీ20లో విజయం సాధించడం ద్వారా ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు... 2-1 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. జాసన్ రాయ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. స్కోర్లు: పాకిస్తాన్- 154/6 (20) ఇంగ్లండ్- 155/7 (19.4) Decision Pending... ⏳ She said YES! 💍 Congrats Phil and Jill! ❤️ pic.twitter.com/SHj0iy45Pw — England Cricket (@englandcricket) July 21, 2021 -
వైరల్ : అషూ పేరు పచ్చబొట్టు.. చెంప చెళ్లుమనిపించిన బ్యూటి
జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అషూరెడ్డికి సోషల్ మీడియాలో ఫాలోవర్లు ఎక్కువే. ఇక డబ్ స్మాష్‌తో ఫేమస్ అయిన ఆమె బిగ్‌బాస్ రియాలిటీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది. నిత్యం ఫొటోషూట్లతో, ఫన్నీ వీడియోలతో ఎప్పటికప్పుడు సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే అషూ ఇటీవలి కాలంలో నిత్యం వార్తల్లో నిలుస్తుంది. బిగ్‌బాస్ సీజన్-3లో తనతో పాటు పాల్గొన్న రాహుల్ సిప్లిగంజ్‌తో అషూ లవ్ ట్రాక్ నడిపింస్తుందంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు ఈ మధ్యే రాహుల్.. సర్ప్రైజ్ అనౌన్స్మెంట్ అంటూ అషూను హత్తుకున్న ఫొటోను షేర్ చేసి దానికి లవ్ సింబల్ యాడ్ చేసి రూమర్స్‌కి మరింత బలం చేకూర్చాడు. అయితే తాజాగా కమెడియన్ ఎక్స్‌ప్రెస్ హరి-అషూ మధ్య ఏదో ఉందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అషూ కోసం హరి కూడా బోలెడు ప్రయత్నాలు చేస్తున్నట్లు వరుస స్కిట్లతో అలరిస్తున్నారు. ఇప్పుడు మరోసారి అషూపై తన ప్రేమను వ్యక్తం చేశాడు. తన గుండెలపై అషూ పేరును పచ్చబొట్టు వేసుకున్నానని, ఇది శాశ్వతంగా ఉంటుందని చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు. 'నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నానంటే..ఎప్పటికీ నువ్వు నా గుండెలపై నిలిచిపోయేంత' అంటూ హరి తన ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేశాడు. దీంతో ఇది నిజమైన పచ్చబొట్టా? లేదా స్కిట్ కోసం చేశావా అని అడగ్గా..నిజంగానే పచ్చబొట్టు వేయించుకున్నానని హరి చెప్పాడు. దీంతో ఎందుకిలా చేశావ్ అంటూ అషూ..హరి చెంప పగలకొట్టింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. రాహుల్-అషూ మధ్యలోకి హరి ఎంటర్ అయ్యాడు అని కొందరు కామెంట్లు చేస్తుంటే.. టీఆర్పీ రేటింగుల కోసమే ఈ డ్రామాలంటూ మరొకొందరు కామెంట్ చేస్తున్నారు. -
యాంకర్ ప్రదీప్‌కు ప్రపోజ్ చేసిన శ్రీముఖి.. వీడియో వైరల్
Sreemukhi Anchor Pradeep: బుల్లితెరపై స్టార్ యాంకర్లుగా దూసుకుపోతున్నారు యాంకర్ ప్రదీప్ అండ్ శ్రీముఖి. తెరపై వీళ్లిద్దరు చేసే హంగామా మాములుగా ఉండదు. అందుకే వీరు జంటగా హోస్ట్ చేసిన షోలు టీఆర్పీ రేటింగ్‌లోనూ టాప్ రేంజ్లో ఉంటాయి. ఇక ఓ వైపు రియాలిటీ షోలు చేస్తూనే మరోవైపు సినిమాలతో అలరిస్తున్న ప్రదీప్-శ్రీముఖి మధ్య ఏదో ఉందని కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు శ్రీముఖి యాంకర్‌గా ప్రస్థానం మొదలుపెట్టింది కూడా ప్రదీప్‌తోనని, దీంతో అప్పటినుంచి వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉందని టాక్. ఇద్దరి మధ్యా ఉన్నది ఫ్రెండిష్ మాత్రమే కాదని, ఇంకా ఏదో ఉందనే పలు ఊహాగానాలు తెరపైకి వచ్చినా అలాంటిదేమీ లేదని ఇద్దరూ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. అయితే తాజాగా శ్రీముఖి..ప్రదీప్‌పై తనకున్న ఇష్టాన్ని బయటపెట్టేసింది. లేటెస్ట్గా ఓ షోలో పాల్గొన్న శ్రీముఖి..అందరూ చూస్తుండగానే యాంకర్ ప్రదీప్‌కు ఐ లవ్ యూ అంటూ ప్రపోజ్ చేసింది. 'అందాలలో అహో మహోదయం' అనే పాటతో ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి సిగ్గుపడుతూ వచ్చి తన మనసులో మాటను బయటపెట్టింది. దీనికి ప్రదీప్ కూడా సరే అన్నట్లుగా ముసిముసి నవ్వులు నవ్వుతూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. దీంతో సోషల్ మీడియాలో ఈ జోడీ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. త్వరలోనే వీరిద్దరు పెళ్లిపీటలు ఎక్కబోతున్నారంటూ కొందరు కామెంట్ చేస్తుంటే, కేవలం షో కోసం ఇలా చేస్తున్నారేమో అంటూ మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
మైదానంలోనే ప్రేయసికి ప్రపోజ్ చేసిన ఫుట్‌బాల్ ఆటగాడు
న్యూయార్క్: అమెరికన్ ఫుట్‌బాల్ ఆటగాడు హసాని డాట్సన్ స్టిఫెన్‌సన్ తన ప్రేయసికి గ్రౌండ్‌లోనే లవ్ ప్రపోజ్ చేశాడు. మేజర్ లీగ్ సాకర్ టోర్నీలో భాగంగా ఆదివారం మిన్నెసోటా ఎఫ్‌సీ, సాన్ జోస్ ఎర్త్‌క్వేక్స్ మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. మ్యాచ్ డ్రాగా ముగియగానే స్టీఫెన్సన్ తన గర్ల్‌ఫ్రెండ్ పెట్రా వుకోవిక్ దగ్గరికి వెళ్లి మొకాలిపై కూర్చొని ‘విల్ యు మ్యారీ మీ’ అంటూ ఉంగరంతో ప్రపోజ్ చేశారు. బాయ్‌ఫ్రెండ్ ఇచ్చిన సర్ప్రైజ్తో షాక్‌కు గురైన అతని లవర్ వెంటనే అతని ప్రపోజల్‌కు ఓకే చెప్పేసింది. అనంతరం ఉంగరాన్ని ప్రేయసి చేతికి తొడగి, ఈ మధుర క్షణాలను జీవితాంతం గుర్తుండిపోయేలా కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నారు. ఇదంతా జరుగుతున్న సమయంలో మైదానంలోని ప్రేక్షకులు గట్టిగా కేకలు వేయడంతో స్టేడియం హోరెత్తింది. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. కాగా స్టీఫెన్సన్ ప్రపోజ్ చేసిన ఫోటోలను తన ప్రేయసి పెట్రా వుకోవిక్ సైతం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. నా ఆనందాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవడం లేదు. నీలాంటి వ్యక్తి ప్రేమ దొరినందుకు నేనెంతో అదృష్టవంతురాలిని. నా జీవితంలో ఈ అందమైన క్షణాలను మధుర జ్ఙాపకంగా ఉంచడంలో సహయపడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అంటూ పేర్కొంది. View this post on Instagram A post shared by Petra Vučković (@croatianchick31) View this post on Instagram A post shared by Hassani Dotson Stephenson (@hassanidotson) -
పానీపూరీలో ఉంగరం పెట్టి.. యువతికి వెరైటీ పెళ్లి ప్రపోజల్..
పానీ పూరీ.. తలుచుకోగానే నోట్లో నీరు ఊరని వారుండరు. పెద్దవారి నుంచి చిన్న పిల్లల వరకు ప్రతి ఒక్కరు పానీపూరీని ఎంతో ఇష్టంగా తింటారు. అయితే, ఇక్కడొక యువకుడు తాను ప్రేమించిన అమ్మాయికి చేయబోయే లవ్ ప్రపోజ్ కూడా పానీపూరీతోనే చెప్పాడు. ‘ఆ యువతికి గప్‌చుప్‌లంటే ప్రాణం.. ఆ గప్‌చుప్‌లో ఏదైన పెట్టి ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించాడు...’ ఆలోచన వచ్చిందో లేదో.. వెంటనే అమలులో పెట్టేయాలనుకున్నాడు. ఒకరోజు సాయంత్రం ఆ యువతి దగ్గరకు వెళ్లి సరదాగా గప్‌చుప్ తినడానికి వెళదామని కోరాడు. ఈ క్రమంలో వారిద్దరు కలిసి గప్‌చుప్ షాపు దగ్గరకు చేరుకున్నారు. అక్కడ, కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. అయితే, అప్పటికే సదరు యువకుడు తన ప్లాన్‌తో సిద్ధంగా ఉన్నాడు. ఆ గప్‌చుప్ షాపువారు.. ఒక ప్లేట్లో కొన్ని గప్‌చుప్‌లు, మసాలా, బటానీ పెట్టిచ్చారు. ఇతను మాత్రం ఒక గప్‌చుప్‌లో బంగారు ఉంగరాన్ని ఉంచాడు. ఆ ప్లేటును ఆ యువతికి ఇచ్చాడు. అయితే, ఆ యువతి ఆ గప్‌చుప్ ప్లేటును తీసుకుంది. దానిలో మధ్యలో ఉన్న పానీపూరీ ఏదో మెరుస్తూ కనిపించింది. కాసేపు.. సరిగ్గా చూసేసరికి అది ఒక ఉంగరం అని గుర్తుపట్టింది. వెంటనే ఆ యువకుడిని చూసింది. అతగాడి ముఖం అప్పటికే ఏదో వెలిగి పోతుంది. ఆ యువకుడు, నవ్వుతూ.. తన మనసులో మాటను ఆ యువతికి తెలియజేశాడు. ఈ వెరైటీ సర్‌ప్రైజ్‌కి ఆ యువతి ఎంతో సంతోషించింది. ఆమె ఆనందంగా ఉండటం చూసిన యువకుడు.. ఇక క్షణం ఆలస్యం చేయకూడదని ‘ ఆ ఉంగరాన్ని చూపిస్తూ.. నన్ను పెళ్లి చేసుకుంటావా..’ అంటూ ఆమెను ప్రపోజ్ చేశాడు. మొదట ఆశ్చర్యపోయినప్పటికి ఆ యువకుడి నిజాయితీకి ఆమె ఫిదా అయ్యింది. ఆ యువతి కూడా సరిగ్గా పానీపూరీ బండి దగ్గరే తన ప్రియుడి ప్రపోజల్‌కి ఒకే చెప్పేసింది. అయితే, ఇది ఎక్కడ జరిగిందో తెలియలేదు. ఈ క్లిప్పింగ్‌లను ట్విట్టర్‌లోని ‘మంత్లీ అందాజ్ ఇ జాన్’ అనే పేజీలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్నిచూసిన నెటిజన్లు ‘మీ.. ఐడియా సూపర్..’, ‘ పానీపూరీకి ఏ అమ్మాయి ‘నో’ చెప్పలేదు. మరి అలాంటి పానీపూరిలో రింగ్ పెట్టి ప్రపోజ్ చేస్తే.. ఆమె ‘నో’ అనగలదా? ’, ‘ ఆమె పానీపూరి చూడ కుండా తింటే ఏమై ఉండేదో..’, ‘ కొంత యువతులకు పానీపూరీని అమాంతం మింగేస్తారు.. ’ అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. చదవండి: మెట్రోలో సీటు కోసం.. ఎంత పని చేశాడు! వైరల్ వీడియో -
ఐదెకరాల పొలంతో పాటు ఓ స్కూటర్ ఉంది..నన్ను పెళ్లిచేసుకుంటావా?
నాచురల్ స్టార్ నాని సరసన మజ్ను మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది అను ఇమాన్యుయేల్ ఆ తర్వాత అల్లు అర్జున్, పవన్‌కల్యాణ్ వంటి స్టార్ హీరోలతో జతకట్టినా ఈ అమ్మడికి పెద్దగా కలిసిరాలేదు. కెరీర్‌తో ఇంతరకు ఆశించిన స్థాయిలో హిట్ పడలేదు. అయితే ఈ మధ్య కుర్రహీరో అల్లు శిరీష్‌తో లవ్ ట్రాక్ కొనసాగిస్తుందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. దీనికి తోడు ఇప్పటివరకు ఏ హీరోయిన్‌తోనూ రూమర్స్ రాని శిరీష్ ఈ మధ్యకాలంలో అను ఇమాన్యుయేల్‌తో క్లోజ్ అయినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ రూమర్స్‌పై ఇప్పటివరకు ఇద్దరూ స్పందించకపోవడంతో ఆ వార్తలకు ఫుల్స్టాప్ పడటం లేదు. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఫోటో షూట్లతో ఎప్పటికప్పుడు అప్డేట్స్ షేర్ చేస్తుంటుంది. తాజాగా లాంగ్ వైట్ కలర్ షర్ట్ వేసుకొని ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ బ్యూటీ. ఈ ఫోటోలను షేర్ చేయగా ఓ నెటిజన్ నుంచి ఊహించని విధంగా రియక్షన్ వచ్చింది. మీరు నన్ను పెళ్లిచేసుకుంటారా? నాకు ఐదు ఎకరాల పొలం ఉంది. గార్డెన్తో కూడిన ఓ అందమైన ఇళ్లు ఉంది. అలాగే ఓ స్కూటర్ కూడా ఉంది. వీటన్నింటికి మించి మీపై బోలెడంత ప్రేమ ఉంది అంటూ లవ్ ప్రపోజ్ చేశాడు. దీంతో ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. చదవండి : కొన్నాళ్లుగా హీరోయిన్‌తో రిలేషన్షిప్లో ఉన్న అల్లు శిరీష్! అను ఇమాన్యుయేల్‌తో అల్లు శిరీష్ చాట్ వైరల్ -
లాహోర్ యూనివర్సిటీలో లవ్ ప్రపోజ్
-
ప్రేమ చరిత్ర
-
ఐ లవ్యూ చెప్పకపోతే ఏం పోయింది!
‘ప్రేమిస్తున్నాను..’ అంటాం. ఇవ్వడమే ప్రేమ అయినప్పుడు.. ప్రేమను ఇమ్మని ఏడ్వడం దేనికి?! అసలు.. ‘ప్రేమిస్తున్నాను’ అని ఎందుకు చెప్పాలి? లోపల ఉంచుకుంటే ప్రేమ కాదా! సో.. ‘ఐ లవ్యూ’ అంటే అర్థం.. ‘నేన్నిన్ను ప్రేమిస్తున్నాను’ అని కాదు.. ‘నన్ను ప్రేమించవా ప్లీజ్’ అనేనా! నువ్వు ప్రేమిస్తే నిన్ను ప్రేమించాలా? ఈ ఇచ్చిపుచ్చుకోవడం ఏంటి? నిజంగా ప్రేమంటే.. వన్ సైడెడ్ లవ్. ‘అన్రిక్వయిటెడ్’ లవ్. ఇవ్వడం మాత్రమే ఉన్నప్పుడు.. తీసుకునే థాట్ లేనప్పుడు.. బాధ ఉండదు. ఆశ ఉండదు. ఆవేదన ఉండదు. హర్ట్ అవడం ఉండదు.. హార్ట్ బ్రేక్ అవడం ఉండదు. అవునా! పూర్తిగా ‘అవును’ కాదు. కొంచెమైనా పెయిన్‌గా ఉంటుంది. ఆ పెయిన్ ఎలాంటిదో కవి డాంటే కి తెలుసు. ఆల్ఫ్రెడ్ నోబెల్‌కి తెలుసు. ఇంకా కొంతమందికి తెలిసుండొచ్చు. వాళ్లందరి పెయిన్లతో అల్లిన ఈ ‘ప్రేమ హారం’.. వాలెంటైన్స్ డే స్పెషల్. బీట్రిస్ పుట్టినరోజు ఎప్పుడో ఎవరికీ తెలీదు. ప్రేమ ఎప్పుడు పుట్టిందో లోకానికి తెలుసా! బీట్రిస్ పారినరీ.. ఇటాలియన్ అమ్మాయి. నెలల నిండగానే తల్లి కడుపులోంచి ఎకాఎకి 25 ఏళ్ల వయసుతోనే పుట్టిన ‘పసికందు యువతి’లా ఉంటుంది బీట్రిస్. ఆ రూపాన్ని మాత్రమే మిగిల్చి వెళ్లింది లోకానికి. లోకం అంటే లోకం అంతా కాదు. ఆమే లోకంగా జీవించిన ఒక వ్యక్తికి తన జ్ఞాపకాలు మిగిల్చి వెళ్లిపోయింది! అతడు డాంటే. డాంటే అలిఘిరి. ఇటాలియన్ కవి. అతడు ప్రేమిస్తున్నట్లు ఆమెకు తెలియదు. ఆమెను ప్రేమిస్తున్నట్లు అతడూ చెప్పే వీలు లేదు. చెబితే భార్యకు చెప్పి ఏడవాలి. ‘నేను ఆ పిల్లను ప్రేమిస్తున్నా.. ఏం చెయ్యను?’ అని భోరుమనాలి. ఆర్నో నదీతీరంలో స్నేహితులతో కలిసి వెళుతున్న బిట్రీస్ను దూరం నుండి ఆరాధనగా చూస్తూ గుండె చేత్తో పట్టుకున్న డాంటే. మధ్యలో ఉన్న యువతే ట్రిస్. (ప్రసిద్ధ హెన్రీ హాలిడే తైలవర్ణ చిత్రం) మరకతాల్లా మెరిసే బీట్రిస్ కళ్లు డాంటే నిద్రను మింగేశాయి. అటూ ఇటుగా ఒక ఈడు వాళ్లు. ఆమె ఇరవై ఐదేళ్ల వయసప్పుడు చనిపోయింది. తర్వాత ముప్పై ఏళ్లకు డాంటే. వాళ్ల ప్రేమ చరిత్రలో ఇప్పటికీ నిలిచి ఉంది. ఆమేమీ అతడిని ప్రేమించలేదు. ఆరాధించలేదు. ఆమెకు తెలియకుండా తన గుండెలో ఆమెకొక ఆలయం కట్టుకున్నాడు. ఆ సంగతీ ఆమెకు చెప్పలేదు. ఆరాధ్య ప్రేయసికి మనసులోని మాట చెప్పలేక, పెళ్లికి తలవాల్చిన నిర్భాగ్యుడతడు! ‘‘నా జననం, నా మరణం, నా స్వర్గం, నా నరకం... అన్నీ బీట్రిస్సే’’అని భార్య ఎమ్మా డొనాటీ ఒడిలో బేలగా, దీనంగా వాలిపోయాడు. పిచ్చి ప్రేమ అతడిది. బీట్రిస్పై కవిత్వం రాశాడు. ‘బీట్రిస్‌ను కనడం కోసం ఫ్లారెన్స్ పుట్టిందా! పుట్టి, బీట్రిస్ కంటే ఒక ఏడాది ముందు అకారణంగా నన్ను కన్నదా?!’ అని ఫ్లారెన్స్ వీధుల్లో ఆమె నడిచి వెళ్లిన దారి వెంబడి పరిమళాలను వెతుక్కున్నాడు. ‘బీట్రిస్‌ను చూడకుండా నా తొమ్మిదవ యేటను దాటుకుని వెళ్లి ఉంటే జీవితంలో నాకింత హింస, ఇంత సంతోషం అవసరమై ఉండేవా?’ అని విలపించాడు. ఆమె ఎనిమిదేళ్ల వయసులో తనని చూశాడు. ఎనిమిదేళ్ల పిల్ల ఎలా ఉంటుందో అలా లేదు బీట్రిస్. స్త్రీలా ఉంది. అయితే.. మానవ స్త్రీలా కాదు. వన్‌సైడెడ్ లవ్ : స్వేచ్ఛనిస్తుంది! ఆ తర్వాత ఆర్నో నదీ తీరంలో... ఏడేళ్ల తర్వాత.. కన్యగా కళ్లు తెరుస్తున్న బీట్రిస్‌ను చూశాడు. మళ్లీ ఒకసారి ‘ఇరవై ఏళ్ల వయసు’ ఆమెలో ఒళ్లు విరుచుకుంటున్నప్పుడు! తిరిగి ఇంకోసారి రెప్పలు దించిన వధువుగా ఆమె పెళ్లప్పుడు. చివరిసారిగా ఆమె చనిపోయినప్పుడు. తను మాత్రమేనా బీట్రిస్లో ప్రేమను వెదుక్కుంది. దైవం కూడా. కానీ దైవం ఆమె ప్రేమను కోరుకున్నాడు. అందుకేనా ఆమె తీసుకెళ్లాడు.. మొగ్గ పూర్తిగా విడవకుండానే. బీట్రిస్పై డాంటేకు ఉన్నది అన్రిక్వైటెడ్ లవ్. మనసు లోపల దాచుకున్న ప్రేమ. ‘వెళ్లెళ్లు చెప్పేసెయ్ ఏమవ్వదు. లోలోన దాగుంటే ప్రేమవ్వదు’.. అని డార్లింగ్ సినిమాలో ప్రభాస్ మనసులో పాడిస్తాడు అనంత్ శ్రీరామ్. చెప్పే వీల్లేకపోతే ఏం చేయను అంటాడు డాంటే. పైకి చెబితేనే ప్రేమ అయ్యేపనైతే ఆల్ఫ్రెడ్ నోబెల్ దీ ప్రేమ కాదు. చెప్పిన ప్రేమా ప్రేమవ్వలేదు! అతడి ఫస్ట్ లవ్ అలెగ్జాండ్రా. ‘ఐ లవ్యూ’ అనగానే ‘ఐ యామ్ సారీ’ అనేసింది. రష్యన్ అమ్మాయి. అందంగా ఉంటుంది. అతడితో ఉండలేనంది. ప్రేమంటే ఉండటమేనా అని వగచాడు. అతడిది స్వీడన్. యవ్వనంలో దేశాలు పట్టుకుని తిరిగాడు. అప్పుడు చూశాడు అలెగ్జాండ్రాని. రెండో అమ్మాయి బెర్తా కిన్స్కీ. అతడితో ఉంది కాని ‘నిన్ను చేసుకోలేను’ అంది. ఉన్నన్నాళ్లూ టచ్‌లో ఉండటమే ఆమె అతడిపై చూపిన కనికరం. ఎప్పుడైనా భర్తతో కలిసి ఆల్ఫ్రెడ్‌ను చూడ్డానికి వచ్చిపోతుండేది. భర్తతో కలిసి అతడికి ఉత్తరాలు రాస్తుండేది! శాంతి ఉద్యమంలో ఉన్నారు ఆ భార్యాభర్తలు. ఒకరోజు ఆ అమ్మాయే ఆల్ఫ్రెడ్తో అంది – శాంతి కోసం ఏదైనా చేయమని. ‘‘డైనమైట్‌ని యుద్ధాలకు, విధ్వంసాలకు వాడుకుంటున్నారు. వాటిపై శాంతిని ప్రయోగించండి’ అని అడిగింది బెర్తా. నోబెల్ పీస్ ప్రైజ్ ఐడియా బెర్తాదే. ఇంకో అమ్మాయి సోఫీ హెస్. చిన్నపిల్ల. వియన్నాలో పూలు అమ్ముతుంటుంది. ఆమె అంటే తనకు ఎంత ఇష్టమో ఒకసారి బెర్తాకు చెప్పాడు. ఆ పిల్లను ‘మేడమ్ సోఫీ నోబెల్’ అని పిలుచుకోవడంలో జీవన సాఫల్యం లాంటి భావనేదో పొందేవాడు. అతడు పెళ్లి చేసుకోలేదు. ప్రేమను చేసుకున్నాడు అనాలి. ఆల్ఫ్రెడ్ ప్రకటించిన ప్రేమల కన్నా, అతడి అన్రిక్వైటెడ్ ప్రేమలే ఎక్కువ. లవ్ నుంచి బ్రేక్ అప్ అయినప్పుడు ఒంటరివాళ్లం అయిపోయామన్న నిస్పృహ ఆవరిస్తుంది. గుండెలోపల ఆ మనిషిపై ప్రేమ తోడుగా ఉన్నప్పుడు.. మనిషి దూరం అయితే మాత్రం ఒంటరివారు అవుతారా? వన్‌సైడెడ్ లవ్ హ్యాపీగా ఉంచుతుంది. ఏం కోరుకోం కనుక దేనికోసం వెతుక్కోం. ప్రేమంటే ఇదే కదా! సంతోషాన్ని పంచడం. -
ప్రేమించాలంటూ వేధింపులు..13ఏళ్ల బాలిక ఆత్మహత్య
కదిరి టౌన్ : ప్రేమించాలంటూ యువకుడి నుంచి వేధింపులు పెరగడంతో మనస్తాపం చెందిన ఓ బాలిక బలవన్మరణానికి పాల్పడింది. కదిరి పట్టణ ఎస్ఐ మగ్బుల్‌బాషా తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నారాయణమ్మ కాలనీకి చెందిన శ్రీనివాసులు, గోరంట్ల ఆశావర్కర్ శ్రీవాణి దంపతులు. వీరికి నిరతిశ్రీ (13) అనే కుమార్తె ఉంది. కదిరిలోని ప్రైవేట్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. ఇదే కాలనీకి చెందిన బేల్దారి పని చేసుకునే హరి ప్రేమిస్తున్నానంటూ ఏడాది కాలంగా నిరతిశ్రీ వెంట పడుతున్నాడు. ఆ అమ్మాయి తిరస్కరించినా ప్రేమించాలంటూ ఒత్తిడి చేసేవాడు. ఈ విషయం అమ్మాయి తల్లిదండ్రులకు తెలియడంతో హరిని మందలించారు. తప్పయిపోయిందని, ఇక వెంటపడనని నమ్మబలికాడు. కొన్ని రోజులు స్తబ్దుగా ఉండి తర్వాత తిరిగి వేధించడం మొదలుపెట్టాడు. తన ప్రేమను ఆమోదించాలని, పెళ్లి చేసుకుని హాయిగా బతుకుదామని ఒత్తిడి పెంచాడు. ఇదే క్రమంలో శనివారం రాత్రి ఫోన్ చేసి తనను పెళ్లి చేసుకోకుంటే రచ్చ చేస్తానని బెదిరించాడు. తమ పరువు పోతుందని భావించిన నిరతిశ్రీ అర్ధరాత్రి సమయంలో తండ్రి నిద్రపోతుండగా.. గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లి విధి నిర్వహణలో భాగంగా ఆ రోజు గోరంట్లలో ఉంది. విషయం తెలియగానే ఆదివారం ఇంటికి చేరుకుని బోరున విలపించింది. ఒక్కగానొక్క కుమార్తెను ప్రేమ పేరుతో పొట్టన పెట్టుకున్నాడంటూ రోదించింది. అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం తెలియగానే బేల్దారి హరి పరారయ్యాడు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మగ్బుల్‌బాషా తెలిపారు. -
లవ్ ప్రపోజ్.. ప్రేమ జంటకు చేదు అనుభవం
కాన్బెర్రా: సాధారణం ప్రేమించిన వ్యక్తికి తమ ప్రేమను తెలుపడానికి ప్రేమికులంతా భిన్నంగా ఆలోచిస్తూ సాహసాలు చేస్తుంటారు. ఎందుకంటే తన ప్రేమ ప్రపోజల్ ఎదుటి వ్యక్తికి సర్ప్రైజింగ్తో పాటు, ఎప్పటికి గుర్తుండిపోయే మధుర జ్ఞాపకం ఉంచాలనుకుంటారు. అలా భిన్నంగా ప్రయత్నించిన ఓ ప్రేమ జంటకు చేదు అనుభవం ఎదురైంది. అస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి 650 ఎత్తైన కొండపై తన ప్రియురాలికి ప్రపోజ్ చేశాడు. ఆమె ఓకే చెప్పిన అనంతరం కొద్ది క్షణాలకు ఆ మహిళ కొండపై నుంచి జారి కింద పడింది. అంత ఎత్తైన కొండపై నుంచి పడినప్పటికి ఆమె ప్రాణాలతో బయటపడిన సంఘటన ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వివరాలు.. ఆస్ట్రేలియాకు చెందిన 27 ఏళ్ల వ్యక్తి తను ప్రేమిస్తున్న 32 ఏళ్ల మహిళకు ప్రపోజ్ చేయడానికి కారింథియా కొండపైకి ట్రెక్కింగ్‌కు తీసుకేళ్లాడు. వారు ట్రెక్కింగ్ చేస్తూ కొండపైకి ఎక్కిన అనంతరం అతడు తన ప్రేమను వ్యక్తం చేశాడు. అతడి ప్రేమను అంగీకరించిన ఆ మహిళ ఆకస్మాత్తుగా కొండపై నుంచి కాలు జారి కింద పడిపోయింది. కాగా అక్కడ అంతా మంచు ఉండటంతో సదరు మహిళ ఈ ఘోర ప్రమాదం నుంచి బతికి బట్టకట్టింది. అయితే ఆమె పడిపోతున్న సమయంలో ఆ యువకుడు ఆమె చేయి పట్టుకుని పైగి లాగే ప్రయత్నం చేస్తూ అతడు కూడా కింద పడిపోయాడు. ఈ క్రమంలో 50 అడుగుల వద్ద అతుడు ఓ కొండ అంచును సపోర్టు చేసుకుని కింద పడిపోకుండా గాల్లో వ్రేలాడాడు. ప్రమాదంలో ఉన్న ఈ జంటను గమనించిన బాటసారులు వెంటనే అత్యవసర సేవల విభాగానికి సమచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీం వారిని రక్షించింది. అయితే ఆ వ్యక్తిని మాత్రం హెలికాప్టర్ సహాయంతో రక్షించినట్లు అక్కడి పోలీసు అధికారి తెలిపారు. సదరు పోలీసుల అధికారి స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ ఇద్దరు చాలా అదృష్టవంతులు. ఒకవేళ మంచు లేకపోయింటే పరిస్థితి మరోలా ఉండేది. అదృష్టవశాత్తు వారు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం వారిద్దరిని వైద్య చికిత్స నిమిత్తం ఆస్పత్రి తరలిచించాం. ఈ ప్రమాదంలో అమ్మాయికి ఎలాంటి గాయాలు కాలేదు. కానీ అతడి కాలు ఫ్యాక్చర్ అవ్వడంతో వైద్యులు చికిత్స చేసి కట్టుకట్టారు’ అని ఆయన పేర్కొన్నారు. -
ఇలా ప్రపోజ్ చేస్తే ఎవరైనా పడిపోవాల్సిందే
డబ్లిన్ : నచ్చిన అమ్మాయికి ప్రేమను వ్యక్తం చేయడంలో కొందరు వినూత్నంగా ఆలోచిస్తారు. ఆ కోవకు చెందినవాడే ఐర్లాండ్‌కు చెందిన కొనోర్ ఓసులివన్.. డబ్లిన్ ప్రాంతానికి చెందిన కొనోర్ ట్రైన్ డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. తాను ప్రేమిస్తున్న అమ్మాయి పౌలా కార్బోజియా కూడా ట్రైన్ డ్రైవర్‌గానే పనిచేస్తుంది. కొనోర్ పౌలాకు ఎలాగైనా తన ప్రేమను వ్యక్తం చేయాలని.. అందుకు తాను పనిచేస్తున్న రైల్వే స్టేషనైతేనే బాగుంటుదనుకున్నాడు. రాత్రి 9 గంటల సమయంలో స్టేషన్‌కు వెళ్లిన కొనోర్.. ఫ్లాట్‌ఫామ్‌పై విల్ యూ మ్యారీ మీ అనే అక్షరాలను ఒక్కో బోర్డుపై ఏర్పాటు చేశాడు. ఇక కొనోర్ చేతిలో బొకే, షాంపైన్ బాటిల్ పట్టుకొని.. 'మీ' అనే అక్షరం ఉన్న చివరి బోర్డు వద్ద తన ప్రేయసి కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలోనే పౌలా నడుపుతున్న ట్రైన్ ఫ్లాట్‌ఫామ్ మీదకు ఎంటరైంది. ట్రైన్ నడుపుతున్న పౌలా.. ఫ్లాట్‌ఫామ్‌పై ఉన్న బోర్డులను ఒక్కోటి చదువుకుంటూ చివరి బోర్డు వచ్చేసరికి అక్కడ ఉన్న కొనోర్‌ను చూసి ఆశ్చర్యానికి లోనైంది. వెంటనే ట్రైన్ ఆపి అతని దగ్గరకి వెళ్లింది. (చదవండి : టర్కీ వీధుల్లో అనుకోని అతిథుల హల్చల్) అప్పటికే ఎదురుచూస్తున్న కొనోర్ పౌలా రాగానే మొకాళ్లపై నిల్చుని .. విల్ యూ మ్యారీ మీ.. అని ఆమెకు ప్రపోజ్ చేశాడు. తన కోసం ఇంతచేసిన కొనోర్‌ను ప్రేమను ఒప్పుకున్నట్లుగా పైకి లేపి గట్టిగా హత్తుకుంది. దీంతో అక్కడున్నవారు కేరింతలు కొడుతూ వారి ఆనందాన్ని మరింత రెట్టింపు చేశారు. ఈ అరుదైన సందర్భాన్ని క్లోడా మహెర్ అనే వ్యక్తి తన కెమెరాలో బంధించాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ... ' పీల్సే స్టేషన్లో జరిగిన అద్భుతమైన ప్రపోజల్' అని రాసుకొచ్చాడు. చూడగానే ఆకట్టుకుంటున్న ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ వీడియోపై నెజిటన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. -
ప్రియుడిని తన్నిన యువతి
-
ప్రపోజల్ మిస్‌ఫైర్.. తంతే నీళ్లలో పడ్డాడు
ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకోవాలని భావించాడు. ప్రపోజ్ చేయడానికి ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు. ప్రియురాలికి చేతికి ఉంగరం తొడిగాడు.. ఆమె కూడా సంతోషంగా ఒప్పకుంది. కానీ వెంటనే అతడిని కాలితో తన్నింది. యాక్సెప్ట్ చేసింది కదా.. మరి ఇదేంటి అంటే పాపం ఆ యువతి కావాలని అలా చేయలేదు. అనుకోకుండా జరిగిన ఓ సంఘటన వల్ల జీవితాంతం గుర్తుండిపోవాల్సిన సందర్భం కాస్త ఇలా నాశనం అయ్యింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. వివరాలు.. ఓ జంట డేట్‌కి వెళ్లింది. దానిలో భాగంగా యువతి బోటులో షికారుకు బయలు దేరింది. కొద్దిసేపటికి వ్యక్తి చేతిలో ఉంగరం తీసుకుని మరో బోటులో యువతి దగ్గరకి వెళ్లాడు. రెండింటిని దగ్గరకు కలిపాడు. తన బోటు అంచు మీద నిలబడి ప్రియురాలికి ప్రపోజ్ చేసి.. ఆమె చేతికి ఉంగరం తొడిగాడు. యువతికి కూడా ఈ సర్ప్రైజ్ తెగ నచ్చింది. పెళ్లికి అంగీకరించింది. (చదవండి: వైరల్: గున్న ఏనుగు చిలిపి స్నానం) అంతా బాగానే ఉంది అనుకుంటుండగా.. అలల తాకిడికి యువతి కూర్చున్న బోటు ముందుకు కదిలింది. దాంతో ఆమె కిందపడటం.. గాల్లోకి లేచిన ఆమె కాలు ప్రియుడి ముఖానికి తాకడం క్షణాల్లో జరిగిపోయాయి. దాంతో అతడు నీళ్లలో పడ్డాడు. అదృష్టం ఇద్దరికి పెద్దగా గాయాలేం కాలేదు. పాపం జీవితాంతం మధుర జ్ఞాపకంగా గుర్తుంచుకోవాల్సిన ప్రపొజల్ డే కాస్త ఇలా పాడవ్వడంతో ఇద్దరూ నిరాశ చెందారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోది. ఇప్పటికే దీన్ని 1.4లక్షల మంది చూశారు. రకరకాల కామెంట్లు చేస్తున్నారు. -
‘ప్రేమ ఎంత ప్రమాదమో మరోసారి రుజువైంది’
ప్రేమించడం ఎంత సులువో ఆ ప్రేమను దక్కించుకోవడం అంత కష్టం. ఇష్టపడిన ప్రేయసికి లవ్ ప్రపోజ్ చేయడం దగ్గర నుంచి తనను ఒప్పించేలా ప్రేమను వ్యక్త పరచాలంటే ఎన్నో పాట్లు పడాలి. ఈ ప్రక్రియలో ఎంతో మంది తమకు నచ్చిన విధంగా ప్రపోజ్ చేస్తుంటారు. పువ్వు ఇచ్చి, లెటర్ రాసి, మెసెజ్‌ల రూపంలో ఇలా రకరకాలుగా తమ ప్రేమను వ్యక్త పరుస్తుంటారు. ప్రతి అబ్బాయి ఎవరైనా తన లవర్‌కు ప్రత్యేకంగా ప్రపోజ్ చేయాలి అనుకుంటాడు. అయితే ఇందుకు ప్లానింగ్ కూడా ఎంతో ముఖ్యం. ప్లానింగ్ మిస్సయితే.. సిక్సర్ కాస్తా.. ఔట్‌గా మారే ప్రమాదం ఉంది. (పార్లమెంట్‌లోనే ప్రేయసికి ప్రపోజ్ చేశాడు) అచ్చం ఇలాంటి ఓ సంఘటనే లండన్‌లో చోటుచేసుకుంది. షెఫీల్డ్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు కొంత కాలంగా తన స్నేహితురాలిని ప్రేమిస్తున్నాడు. ఓ మంచి రోజు చూసుకొని తన గర్ల్‌ఫ్రెండ్‌కు లవ్ ప్రపోజ్ చేయాలనుకున్నాడు. ఈ నేపథ్యంలో తన నివసిస్తున్న అపార్ట్మెంట్లో వందలాది క్యాండిల్స్‌ను వెలిగించాడు. బెలూన్స్ డెకరేట్ చేసి, గ్లాస్‌లలో వైన్ పోసి ఉంచాడు. ఇక తన స్నేహితురాలిని ఇంటికి తీసుకొచ్చేందుకు వెళ్లి తిరిగి అపార్ట్‌మెంట్‌కు చేరుకునే సరికి ప్రమాదవశాత్తు ఇల్లంతా మంటలు అలుముకున్నాయి. మూడు ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తీసుకు వస్తున్నాయి. వెంటనే షాక్ నుంచి తేరుకున్న యువకుడు కొవ్వొత్తుల కారణంగా ఇంట్లో మంటలు వ్యాపించాయని ఊహించాడు. (నాకో ప్రేయసి కావాలి...జపాన్ కుబేరుడు) అయినప్పటికీ మంటలు అదుపులోకి వచ్చాక మంటల్లో కాలిపోయిన ఇంట్లోనే తన గర్ల్‌ఫ్రెండ్‌కు ప్రపోజ్ చేశాడు. ఇంత జరిగాక యువతి నో చెప్పే అవకాశమే లేదు. యువకుడి ప్రేమను అంగీకరించింది. కాగా అగ్నిమాపక సిబ్బంది విభాగం ఈ దృశ్యాలను ఫేస్బుక్లో పోస్టు చేసింది. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ ‘ప్రేమ ఎంత ప్రమాదకరమైనదో మరోసారి రుజువైంది. తక్కువ బడ్జెట్లో ప్రపోజ్ చేద్దామనుకున్నాడు. కానీ ఇప్పుడు ఇంటిని పునర్నిర్మించేందుకు భారీ బడ్జెట్ కావాలి’. అంటూ సరదా కామెంట్లు చేస్తున్నారు. -
‘ప్రపోజ్ చేయడం అంత ఈజీ కాదు బ్రదర్’
మనం ప్రేమించిన వాళ్ళకి మన ప్రేమను ఎలా వ్యక్త పరచాలి? ఇలా ఆలోచిస్తూ, భయపడుతూ, తటపటాయిస్తూ తన ప్రేయసి/ప్రేమికుడిపై ఉన్న ప్రేమను తమ మనసులోనే దాచిపెట్టుకుంటారు కొందరు. ప్రపోజ్ చేస్తే ఉన్న ఈ ఫ్రెండ్ షిప్ కూడా పోతుందని కొందరు భయపడితే.. ఒకవేళ నో చెబితే ఏమాత్రం తట్టుకోలేనని మరికొంతమంది వెనకడుగు వేస్తుంటారు. అయితే ఇలాంటి పరిస్థితి తనకు కూడా ఎదురైందని ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ తాజాగా పేర్కొన్నాడు. గతనెలలో భారత సంతతికి చెందిన వినీ రామన్‌తో మ్యాక్స్‌వెల్ నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. అయితే స్నేహితురాలైన వినీకి తన ప్రేమను ఎలా వ్యక్త పరచాలని ఆలోచిస్తూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని తెలిపాడు. ‘మనం ప్రేమించిన అమ్మాయికి ప్రపోజ్ చేయడం అంత సులభం కాదు. ప్రపంచకప్ ఫైనల్ ఆడుతున్నప్పుడు ఎలాంటి టెన్షన్‌కు గురయ్యానో అంతకంటే ఎక్కువ టెన్షన్ వినీకి ప్రపోజ్ చేసేటప్పుడు గురయ్యాను. ఓ సమయంలో ప్రేమించిన అమ్మాయికి ప్రపోజ్ చేయడం కంటే ప్రపంచకప్ ఫైనల్ ఆడటమే సులభం అనిపించింది. మా ఇద్దరి మధ్య ఎంతో మంచి స్నేహం ఉంది. నేను గతంలో మానసికి ఒత్తిడిలో ఉన్నప్పుడు అండగా నిలిచింది. నేనేంటో నాకంటే తనకే తెలుసు. దీంతో వినీనే నా జీవిత భాగస్వామిగా చేసుకోవాలి నిశ్చయించుకున్నాను. అయితే నా ప్రేమను వ్యక్త పరిచే సమయంలో మూడు సార్లు విఫలమయ్యాను. నా ప్రేమను వినీకి చెప్పడానికి నాలుగు ప్రణాళికలు రచించాను. ప్లాన్-ఏలో భాగంగా తనను ఓ పార్క్‌కు తీసుకెళ్లి ప్రపోజ్ చేయాలనుకున్నాను. కానీ అక్కడ చిన్న పిల్లలు ఆడుకోవడం, పెద్ద వాళ్లు వాకింగ్ చేయడం, కుక్కలు అరవడం వంటివి నన్ను ఇబ్బందికి గురి చేసింది. దీంతో ప్లాన్ బిలో భాగంగా తనను లంచ్‌కు తీసుకెళ్లి అప్పటికే నా వెంట తెచ్చుకున్న రింగ్‌ను తన చేతికి తొడిగి ప్రపోజ్ చేద్దామనుకున్నా? కానీ అక్కడ నా టీమ్‌మేట్స్‌ను చూసి ప్లాన్ బి అమలు చేయలేకపోయా. దీంతో ప్లాన్ సిలో భాగంగా ఎర్రటి గులాబి పూల మధ్య నా ప్రేమను ఆమెకు చెబుదామని రోజ్ పార్క్‌కు తీసుకెళ్లాను. అక్కడా కుదరలేదు. దీంతో ప్లాన్ డి తప్పక అమలు చేయాల్సిందేనని భావించాను. పార్క్‌కు వినీని రమ్మని చెప్పాను. ఆమె వచ్చిన వెంటనే ఆమె ముందు మోకాళ్లపై కూర్చొని రింగ్ ఆమెకు తొడిగి నా లవ్ ప్రపోజ్ చేశాను. ఆ సమయంలో నా గుండె వందరెట్లు వేగంగా కొట్టుకుంది.. నా చేతులు వణికాయి. అయితే ఊపిరి తిరిగొచ్చిన అంశం ఏంటంటే నా ప్రేమను వినీ ఒప్పుకోవడం. ఆ మధుర క్షణాలు నా జీవితాంతం గుర్తుంటాయి’అంటూ మ్యాక్స్‌వెల్ తన ప్రపోజ్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. View this post on Instagram Last week my favourite person asked me to marry him 😍💍 #YES A post shared by VINI (@vini.raman) on Feb 26, 2020 at 2:51am PST View this post on Instagram Last night we celebrated our Indian engagement and I gave @gmaxi_32 a little teaser of what the wedding will be like 🥰 Shout out to both of our incredible families & all our friends who came to celebrate with us on such short notice - we are so grateful to be surrounded by some pretty amazing people ❤️ Can’t wait to get our hands on more photos from @shevan_j_photography 📸 H&M - who else but ... @lajeenartistry Venue - @lincoln_of_toorak Catering - @tandooriflames Mandap - @rupalis_mandaps_melbourne Henna - @fadziiesmehndiandbeauty Lehgna - @gbcreations_ Arm candy - @gmaxi_32 💕 A post shared by VINI (@vini.raman) on Mar 14, 2020 at 2:47am PDT చదవండి: మ్యాక్స్ అన్ వెల్ మ్యాక్స్‌వెల్ ‘భారతీయ నిశ్చితార్థం’ -
‘లవ్ ప్రపోజ్ బాగానే చేశాననుకున్నా.. కానీ’
న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మహింద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహింద్రా మరోసారి ఓ వైరల్ న్యూస్‌ని పరిచయం చేశారు. బోస్టన్‌కు చెందిన సినీ దర్శకుడొకరు లవ్ ప్రపోజ్ ఎలా చేశాడో పేర్కొంటూ ఓ చక్కని వీడియోను ట్విటర్లో పోస్టు చేశారు. ‘ఈ వీడియో క్లిప్ ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయింది. తన చిన్ననాటి స్నేహితురాలికి ప్రేమ విషయం చెప్పేందుకు ఓ వ్యక్తి ఏకంగా డిస్నీ సినిమానే ఎంచుకున్నాడు. దానిని చక్కగా ఎడిట్ చేసి.. తన ప్రేమను ఘనంగా.. అత్యద్భుతంగా తెలియజేశాడు. 40 ఏళ్ల క్రితం నా ప్రేమను కూడా చాలా గొప్పగా ప్రపోజ్ చేశాను అనుకున్నాను. కానీ, ఈ వీడియో చూశాక.. మరీ ఘనంగా నా ప్రేమను వ్యక్త పరచలేదనిపిస్తోంది’అని ఆనంద్ మహింద్రా పేర్కొన్నారు. వీడియో క్లిప్‌లో ఏముంది..! బోస్టన్‌కు చెందిన సినీ దర్శకుడు లీ లోచ్లర్ తన చిన్ననాటి స్నేహితురాలికి వినూత్నంగా లవ్ ప్రజోజ్ చేద్దామనుకున్నాడు. దానికోసం ప్రసిద్ధ డిస్నీ యానిమేషన్ మూవీ ‘స్లీపింగ్ బ్యూటీ’ని ఎంచుకున్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన ఓ చిత్రకారుడి సాయంతో.. స్లీపింగ్ బ్యూటీలోని ఓ సన్నివేశాన్ని ఎడిట్ చేశాడు. ప్రత్యేకంగా ఓ థియేటర్‌ను అద్దెకు తీసుకుని ఆ సినిమా కొనసాగుతుండగా.. అనూహ్యంగా హీరో హీరోయిన్లకు బదులు లీ లోచ్లర్, అతని స్నేహితురాలు డాక్టర్ స్తుతి చిత్రాలు దర్శనమిస్తాయి. సినిమాలో మాదిరిగా థియోటర్లో జరుతున్న సన్నివేశాలతో స్తుతి సంభ్రమాశ్చర్యంలో మునుగుతుంది. ఇక లీ లోచ్లర్ ఓ డైమండ్ రింగ్‌తో తన బ్యూటీకి లవ్ ప్రపోజ్ చేస్తాడు. ఆమె అతని ప్రేమకు ఫిదా అవుతుంది. ఈ అద్భుత ప్రేమ వ్యక్తీకరణ గత డిసెంబర్ 30న అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో జరిగింది. -
ఇలా ప్రపోజ్ చేస్తే.. ఎవరైనా ప్లాటే
ప్రేమ అనేది ఓ గొప్ప అనుభూతి. మనలో చాలా మంది ప్రేమలో పడుతారు. కానీ ప్రేమను వ్యక్త పర్చడంలో వెనకడుగువేస్తారు. తమ ప్రేమ గురించి తెలియజేసేందుకు ధైర్యం చాలక వాటిని మనసులోనే దాచుకుని సతమతమవుతారు. ప్రియురాలికి ప్రియుడు ప్రపోజ్ చేయాలని, ప్రియురాలు ప్రియుడికి ప్రప్రోజ్ చేయాలని తెగ ఊగిసలాడుతుంటారు. అందుకే ప్రపోజ్ చేయడానికి ఏ ప్రదేశాలకు తీసుకెళ్లాలి. ప్రేమను ఎక్కడ, ఎలా వ్యక్తపరిస్తే బాగుంటుందా అని ఆలోచిస్తుంటారు. అలా ఆలోచించిన ఓ ప్రేమికుడు.. అందరిలా కాకుండా కొంచెం వెరైటీగా.. జీవితాంతం గుర్తుండిపోయేలా ప్రపోజ్ చేసి ప్రేయసి మనసు గెలుచుకున్నాడు. ఇక వివరాల్లోకి వెళితే..అమెరికాలోని లాస్ ఎంజెల్స్‌కు చెందిన ఫిల్మ్ మేకర్, ఎడిటర్ అయిన లీలోచ్లర్.. స్తుతి అనే యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే అందరిలా కాకుండా కొంచెం వెరైటీగా స్తుతికి ప్రపోజ్ చేయాలనుకున్నాడు. డిస్నీ నిర్మాణంలో తెరకెక్కిన స్లీపింగ్ బ్యూటీ సినిమా అంటే స్తుతికి చాలా ఇష్టమని తెలుసుకున్నాడు. ఆరు నెలల పాటు కష్టపడి.. స్లీపింగ్ బ్యూటీ యానిమేషన్ మూవీని తిరిగి స్వయంగా సృష్టించాడు. డిజైన్ చేసిన వీడియోను ఓ థియేటర్ లో ప్లే అయ్యేలా ప్లాన్ చేసుకున్నాడు. ఓ రోజు స్లీపింగ్ బ్యూటీ సినిమా మళ్లీ థియేటర్లో ఆడుతోందని వెళ్దామా అంటూ స్తుతిని ముందుగా ప్లాన్ చేసుకున్న థియేటర్‌కు తీసుకెళ్లాడు. యానిమేషన్ సినిమా ప్లే అవ్వసాగింది. అది చూసిన ఆమె... ఇదేంటి... స్లీపింగ్ బ్యూటీ సినిమా ఇలా ఉండదే... అనుకుంటూనే పరిశీలించి చూడసాగింది. స్తుతికి థియేటర్ స్క్రీన్ పై ఏం జరుగుతుందో అర్ధం కావడంలేదు. అయితే చంద్రుడిపై నిద్రపోతుంది.. తన ఆకారంతో ఉన్న క్యారక్టర్ అని గుర్తించింది. లవ్ ప్రపోజ్ చేసేందుకు వచ్చింది లీలోచ్లర్ అని గుర్తించి షాక్‌కు గురైంది. ఆ షాక్ నుంచి తేరుకోకముందే లీలోచ్లర్ స్తుతి ఎదురుగా వచ్చి ఓ ఉంగరాన్ని తీసి మోకాళ్లపై నిల్చొని తన ప్రేమను వ్యక్తం చేశాడు. లిలోచ్లర్ అలాచేయగానే థియేటర్లో ఉన్న వారంతా కేకలు, విజిల్స్ వేశారు. ఏంటా అని వెనక్కి చూసిన స్తుతికి మరో షాక్ తగిలింది. థియేటర్‌కు వచ్చిన వారంతా అభిమానులు కాదు.. లీలోచ్లర్ కుటుంబ సభ్యులు, స్నేహితులు. ఇలా థియేటర్లో జరిగిన సర్ప్రైజ్కు స్తుతి ఫిదా అయింది. వెంటనే లీలోచ్లర్ ప్రేమను ఒప్పకుంది. ఇలా థియేటర్లో జరిగిన మొత్తం ఇన్సిడెంట్ను ప్రియుడు లీలోచ్లర్ సీక్రెట్‌గా వీడియో తీశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. -
ఇలా ప్రపోజ్ చేస్తే.. ఎవరైనా ప్లాటే
-
యువతి పై కత్తితో దాడి..
-
‘అతని తలరాతని విధి మలుపు తిప్పింది’
వాషింగ్టన్: మది దోచిన నెచ్చలికి తన మనసులో మాట చెప్పి.. ఆమె వెచ్చని కౌగిలిలో సేద దీరాలని భావించిన అతడిని మృత్యువు తన బిగి కౌగిలిలో శాశ్వతంగా బంధించింది. ప్రియుడి నోటి నుంచి ప్రేమిస్తున్నాను అనే మాట విని సంతోషంలో మునిగిపోయిన ఆ యువతి.. మరు నిమిషంలో చోటు చేసుకున్న ఈ అనూహ్య పరిణామానికి గుండె పగిలేలా రోదిస్తుంది. వివరాలు.. అమెరికా లూసియానాకు చెందిన స్టీవ్ వెబర్, కెనేషా అనే యువతిని గత కొద్ది కాలం నుంచి ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం విహారయాత్ర నిమిత్తం వీరిద్దరు టాంజేనియా వెళ్లారు. అక్కడే స్టీవ్, కెనేషాకు ప్రపోజ్ చేయాలని భావించాడు. సాధారణంగా మోకాళ్ల మీద కూర్చుని.. ఉంగరం పట్టుకుని.. ‘విల్ యూ మ్యారీ’ అని అడగడం స్టీవ్‌కు ఇష్టం లేదు. దాంతో కాస్తా వెరైటీగా ప్రయత్నిద్దామని చెప్పి ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. నీటి లోపల ప్రపోజ్ చేద్దామని అనుకుని.. సముద్రంలోకి దూకాడు స్టీవ్. ఆ తర్వాత బోటులో తాము ఉంటున్న క్యాబిన్ దగ్గరకు వెళ్లి ఉంగరాన్ని బయటకు తీసి, ఐ లవ్ యూ, విల్ యూ మ్యారీ మీ అని ఉన్న లెటర్ని చూపిస్తూ కెనేషాకు ప్రపోజ్ చేశాడు. అటు కెనేషా కూడా సంతోషంతో స్టీవ్ ప్రతిపాదనకు అంగీకరించింది. ఇంకేముంది కథ సుఖాంతం అయ్యింది అనుకుంటుండగా.. అనుకోకుండా స్టీవ్ జీవితం తలకిందులయ్యింది. ప్రపోజ్ చేయడం కోసం నీటిలో మునిగిన స్టీవ్ మరిక బయటకు రాలేదు. అతడు నీటిలో మునిగి చనిపోయాడు. ఓ నిమిషం క్రితం వరకు సంతోషంగా సాగిన స్టీవ్ జీవితం.. అలా అనూహ్యంగా ముగిసి పోయింది. జీవితంలో అత్యంత మధురమైన జ్ఞాపకంగా మిగలాల్సిన రోజు కాస్త పీడకలగా మారిపోయింది. కెనేషా బాధ అయితే వర్ణనాతీతం. ‘విధి స్టీవ్ జీవితంతో ఆడుకుంది. సంతోషంగా సాగుతున్న తరుణంలో స్టీవ్ జీవితం కృరమైన మలుపు తిరిగింది. మా జీవితంలో ఉత్తమంగా నిలవాల్సిన రోజు.. చెత్తగా మిగిలిపోయింది. స్టీవ్ నీవు ఆ లోతుల నుంచి ఎన్నటికి బయటకు రాలేవు. కాబట్టి నా సమాధానాన్ని కూడా వినలేవు. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను.. కొన్ని లక్షల సార్లు నీ ప్రతిపాదనకు అంగీకారం తెలుపుతున్నాను. ప్లీజ్ స్టీవ్ నా కోసం వచ్చేయ్’ అంటూ కెనేషా హృదయవిదారకంగా రోదిస్తుంది. తన ఫేస్బుక్లో పోస్ట్ చేసిన ఈ విషాదంత కథనం ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది. -
అలా నెల రోజుల తర్వాత..
లండన్: ప్రేమను వ్యక్తం చేయడానికి ధైర్యంతో పాటు అనువైన సమయం, సందర్భం కలిసి రావాలి. నచ్చిన వారికి మనసులో మాట చెప్పడానికి ప్రేమికులు పడే తిప్పలు మాములుగా ఉండవు. ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది ఎడి ఒకోరో అనే వ్యక్తికి. దాదాపు నెల రోజుల పాటు ప్రయత్నించి ఎట్టకేలకు తన మనసు దోచిన నెచ్చెలికి మనసులో మాట చెప్పాడు. అయితే ఈ నెల రోజుల్లో తన ప్రేమ విషయం చెప్పడానికి ఎక్కడ ఎలా ప్రయత్నించింది అనే వివరాలను ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు ఎడి. ప్రస్తుతం ఈ లవ్ ప్రపోజల్ స్టోరి తెగ వైరలవుతోంది. వివరాలు.. యూకే హెర్టిఫోర్డ్కు చెందిన ఎడి ఒకోరో అనే వ్యక్తి కాలీ అనే యువతిని ప్రేమించాడు. ఉంగరం తొడిగి తన మసులో మాట చెప్పాలని భావించాడు. ఈ క్రమంలో ఉంగరం తీసుకున్నాడు. ఇక తన మనసులో మాట చెప్పడానికి రకరకాల ప్రయత్నాలు చేశాడు. రెస్టారెంట్, మాల్, బీచ్ ఒకటేమిటి.. ఇలా కాలీతో వెళ్లిన ప్రతి చోట తన ప్రేమ విషయం చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ ధైర్యం సరిపోలేదు. అయితే తాను ఎక్కడెక్కడ కాలీకి ప్రపోజ్ చేయాలని భావించాడో ఆ ప్రదేశాల ఫోటోలతో పాటు వీడియోలు కూడా తీశాడు ఎడి. ప్రతి ఫోటోలో ముందు కాలీ.. ఆమె వెనకే చేతిలో ఎంగేజ్మెంట్ రింగ్‌తో ఉన్న ఎడి. కానీ ఈ ప్రయత్నాల గురించి కాలీకి ఏ మాత్రం తెలియదు. ఇలా ఓ నెల రోజుల పాటు ఎంగేజ్మెంట్ రింగ్ చేతిలో పట్టుకుని.. కాలీ వెనకే తిరిగాడు ఎడి. కానీ ప్రపోజ్ చేయలేదు. చివరకు ఓ రోజు ఇంట్లో కూర్చుని ఎంగేజ్మెంట్ రింగ్ చేతిలో పట్టుకుని దాన్నలా చూస్తుండగా.. అనుకోకుండా కాలీ గమనించడం.. ఇంట్లోనో ప్రపోజ్ చేయడం.. ఆమె ఒప్పుకోవడం వెంటవెంటనే జరిగిపోయాయి. కాలీ తన ప్రేమను అంగీకరించిన తర్వాత ఎడి తన ప్రపోజల్ ప్రయత్నానికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఫేస్బుక్లో అప్లోడ్ చేశాడు. దాంతో అతడి లవ్ ప్రపోజల్ స్టోరి ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ‘నీ ఐడియా సూపర్బ్’ అంటూ నెటిజనులు ఎడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. -
అమ్మాయిలు.. ఒక్క సారి ధైర్యం చేయ్యండి
ఇష్టపడుతున్న వ్యక్తి దగ్గరకు వెళ్లి.. వారిని ప్రేమిస్తున్నట్లు చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. కానీ ఒక్క సారి అలా ధైర్యం తెచ్చుకుని ప్రయత్నిస్తే.. ప్రేమ, ఆనందం మీ సొంతం అవుతాయంటున్నారు ట్విటర్ యూజర్ రిలే. అందుకు తనే మంచి ఉదాహరణ అంటూ తన స్టోరిని ట్విటర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ స్టోరి విపరీతంగా వైరలవడమే కాక ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. రిలే తన స్టోరి చెప్తూ.. ‘‘పబ్లిక్ స్పీకింగ్’ క్లాస్‌లో తొలిసారి ఆ అబ్బాయిని చూశాను. మొదటి చూపులోనే అతని మీద ఇష్టం కలిగింది. నెలలు గడుస్తున్న కొద్ది.. ఆ ఇష్టం ఇంకా పెరిగిపోయింది. ఓ రోజు ధైర్యం చేసి ఫేస్బుక్లో నా ప్రేమ గురించి తెలుపుతూ.. తనకు మెసేజ్ చేశాను. ఇది జరిగి ఓ సంవత్సరం గడిచింది. ప్రస్తుతం మేమిద్దరం చాలా సంతోషంగా కలిసి ఉన్నాం. అమ్మాయిలు ధైర్యం చేయ్యండి’ అంటూ రిలే చేసిన ట్వీట్ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. After crushing on “the cute guy from public speaking” for months, I made the most impulsive decision I have ever made & messaged him on Facebook 😂 1 year later, we are happily dating & have been talking every day since. Moral is: don’t be afraid to shoot your shot, ladies (; pic.twitter.com/5vxD49XtZE — Riłëy (@rileyy__daviss) May 3, 2019 ఈ స్టోరి చూశాక చాలా మంది తాము కూడా ఇలానే ధైర్యం చేసి ప్రపోజ్ చేశామని.. ప్రస్తుతం ఎంతో సంతోషంగా ఉన్నామంటూ తమ కథలను కూడా షేర్ చేయడం ప్రారంభించారు. ఇప్పటికే రిలే ట్వీట్‌ను దాదాపు 9 వేల మంది రీట్వీట్ చేయగా.. 97 వేల మంది లైక్ చేశారు. -
ప్రపోజ్ చేశాడు.. వెంటనే వద్దన్నాడు
-
ప్రపోజ్ చేశాడు.. వెంటనే వద్దన్నాడు
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి ఈసీ మొదలు సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరు ఓటు ఆవశ్యకత గురించి చెప్పడమే కాక ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటు వేయాలంటూ తెగ ప్రచారం చేశారు. అయితే వీరి ప్రచారం ఏ మేరకు ప్రభావం చూపిందో తెలీదు కానీ ఓ ఢిల్లీ యువకుడు చేసిన ప్రయత్నం మాత్రం నెటిజన్లను ఆలోచనలో పడేయడమే కాక ప్రస్తుతం ఇంటర్నెట్లో తెగ వైరలవుతోంది. డాక్టర్ అంగద్ సింగ్ చౌదరీ అనే వ్యక్తి తన ట్విటర్లో పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రతి ఒక్కరిని ఆలోచింపచేసేవిధంగా ఉంది. వీడియోలో ఓ యువకుడు.. తాను ఇష్టపడిన అమ్మాయికి.. తన ప్రేమ గురించి చెప్పాలనుకుంటాడు. కానీ ఆమె తిరస్కరిస్తుందేమో అనే ఆలోచనతో వెనకడుగు వేస్తుంటాడు. ఇదే విషయాన్ని తన స్నేహితులకు చెప్తాడు. అందుకు వారు ‘ఎక్కువగా ఆలోచించకు. వెళ్లి నీ ప్రేమ విషయాన్ని ఆ అమ్మాయికి చెప్పమ’ని సలహా ఇస్తారు. ధైర్యం కూడగట్టుకున్న ఆ యువకుడు.. యువతి దగ్గరకు వెళ్లి.. మోకాళ్ల మీద కూర్చుని.. తన ప్రేమను తెలియజేస్తాడు. అందుకు ఆమె కూడా అంగీకరిస్తుంది. దాంతో ప్రేమించిన యువతి చేతికి ఉంగరం తొడగడానికి ఆమె చేతిని అందుకుంటాడు. కానీ వెంటనే ఆ ఆలోచనని విరమించుకుంటాడు. తాను ఆమెకి సరి జోడు కాదు.. మన్నించమని కోరతాడు. రెండు సెకన్ల ముందే తనను పెళ్లి చేసుకోమని కోరిన వ్యక్తి ఇంత సడెన్‌గా ఇలా మాట్లాడటంతో సదరు యువతి ఆశ్చర్యపోతుంది. కారణం అడుగుతుంది. అందుకు ఆ యువకుడు ఆమె చూపుడు వేలును చూపించి.. ఓటు వేయలేదని చెప్తాడు. అంతేకాక ‘దేశాన్ని ప్రేమించలేని వ్యక్తి.. తనను ఎలా ప్రేమిస్తుంద’ని చెప్పి అక్కడి నుంచి వెళ్లి పోతాడు. సింపుల్‌గా చాలా మంచి సందేశం ఇచ్చిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. Che Guevara: “At the risk of seeming ridiculous, let me say that the true revolutionary is guided by a great feeling of love. It is impossible to think of a genuine revolutionary lacking this quality.” Indian Tik Tok: pic.twitter.com/dlF5MWzIbd — Dr. Angad Singh Chowdhry (@angadc) May 5, 2019 -
శ్రేయస్ అయ్యర్‌కు లవ్ ప్రపొజల్!
చెన్నై: చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో తమ జట్టు భారీ తేడాతో ఓడిపోయినప్పటికీ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాత్రం హాస్యచతురతను కోల్పోలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో సరదాగా ముచ్చటించాడు. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు కూల్‌గా జవాబులు ఇచ్చాడు. చెన్నై సూపర్‌కింగ్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 80 పరుగుల భారీ తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఓటమి బాధ కలిగించినా తన స్థైర్యాన్ని దెబ్బతీయలేదని అయ్యర్ పేర్కొన్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో అయ్యర్ సంభాషణ ఇలా.. అభిమాని: ఎందుకు చాలా హాట్‌గా ఉన్నారు? అయ్యర్: ఇది వేసవి కాలం కదా అందుకే.. అభిమాని: మ్యాచ్‌లు ఆడేటప్పుడు మీరు ఏ క్రీమ్ వాడతారు? అయ్యర్: ఐస్‌క్రీమ్! అభిమాని: మీ అభిమాన కెప్టెన్ ఎవరు? అయ్యర్: కెప్టెన్ అమెరికా! అభిమాని: ఆటోగ్రాఫ్‌తో మీ బ్యాట్ నాకు ఇవ్వగలరా? అయ్యర్: నా బ్యాట్ నీకు ఇచ్చేస్తే నేనేలా ఆడాలి? అభిమాని: మీరు మెచ్చిన ఐడల్? అయ్యర్: ఇండియన్ ఐడల్! మీకు ఇష్టమైన కలర్, ఫుడ్ ఏంటని అయ్యర్‌ను కొంతమంది అడిగారు. మీ కూల్‌నెస్ నచ్చిందని, మిమ్మల్ని ప్రేమిస్తున్నామని కొంత అమ్మాయిలు ప్రపోజ్ చేశారు. ఢిల్లీ క్యాపిటల్ ఐపీఎల్ విజేతగా నిలుస్తుందా అని అడిగారు. వన్డే ప్రపంచకప్ జట్టు ఎంపికపై ఏమంటారని ఒకరు ప్రశ్నించారు. విరాట్ కోహ్లి షాట్లలో మీకు నచ్చిన షాట్ ఏది, ఎంఎస్ ధోని మీ అభిప్రాయం ఏంటని మరికొందరు అడిగారు. అయ్యర్ అభిమాన ఆటగాడు ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేశారు. -
వినూత్నంగా ట్రై చేసి అమ్మాయిని పడేశాడు
చికాగో: ఈరోజుల్లో అమ్మాయిలను పడేయాలంటే చాలా కష్టం. అస్సలు వాళ్లను ఎలా పడేయాలో తెలియక కొందరు కుర్రాళ్లు పిచ్చోళ్లవుతున్నారు. ఏళ్ల తరబడి వారి ప్రేమ కోసం నిరీక్షణ చేస్తారు. అందుకే కొందరు యువకులు తమ బుర్రకు తట్టిన కొత్త ఆలోచనలు వినూత్నంగా ట్రై చేసి అమ్మాయిలను పడేస్తున్నారు. చికాగోకు చెందిన బాబ్ లెంపా వ్యక్తి ఇలా తన గర్ల్‌ఫ్రెండ్‌ను ప్రపోజ్ చేయడానికి చికాగోలోని మ్యాగీ డాలే పార్క్‌ను ఎంచుకున్నాడు. తన గర్ల్‌ఫ్రెండ్ పెగ్గీ బేకర్ డాలే పార్క్‌కు సమీపంలోని అపార్ట్మెంట్లో 37వ ఫ్లోర్లో ఉంటుంది. తనకు 37వ ఫ్లోర్ నుంచి చూసినా తన ప్రపోజల్ మెసేజ్ కనిపించాలని.. 45 అడుగుల పొడవు, 31 అడుగుల వెడల్పుతో 'మ్యారీ మీ' అనే మెసేజ్‌ను మంచులో తయారు చేశాడు. దాన్ని గీయడానికి అతనికి 6 గంటల సమయం పట్టింది. చాలామంది దాన్ని గమనించినా అంతగా పట్టించుకోలేదు. తొలుత ఆమె చూసి వామ్మో ఇంత పెద్దగా ఎవరు గీశారని అనుకుది. చివరికి ఆ ప్రపోజల్ తనకోసమే అని తెలిసి భావోద్వేగానికి గురైంది పెగ్గీ. అనంతరం తన బోయ్‌ఫ్రెండ్‌కు ఎస్ చెప్పేసింది. దీంతో వాళ్లిద్దరూ ఒక్కటయిపోయారు. ఇక.. ఈ ప్రపోజల్ మెసేజ్‌ను పార్క్ సిబ్బంది ఫోటో తీసి తమ సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసి అతడి ప్రపోజల్, దానికి ఆ యువతి ఒప్పుకోవడం.. మీరెప్పుడైనా చికాగో పార్క్‌లో ప్రపోజ్ చేశారా? అంటూ వాళ్లు క్యాప్షన్ పెట్టడంతో.. ఆ ఫోటోతో పాటు... వాళ్ల స్టోరీ కూడా వైరల్‌గా మారింది. -
శ్లోకాకు ఆకాశ్ ఎలా ప్రపోజ్ చేశాడంటే...
దేశీయ కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. తమ పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీకి, రస్సెల్ మెహతా కూతురు శ్లోకా మెహతాకు త్వరలోనే వివాహం జరిపించబోతున్నారు. జూన్ 30న ఆకాశ్ అంబానీ, శ్లోకాకు అధికారికంగా నిశ్చితార్థపు వేడుకను నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. అయితే వీరి ప్రేమ ప్రయాణం మొదలైన రోజు నుంచి ఆకాశ్ - శ్లోకా ఫోటోలు ఇంటర్నెట్లో తెగ హల్చల్ చేస్తోన్నాయి. అయితే ఇంతకూ ఆకాశ్ శ్లోకాకు ఎలా ప్రపోజ్ చేసాడో తెలుసా...? ఆకాశ్ - శ్లోకా ఇద్దరూ చిన్ననాటి స్నేహితులనే సంగతి తెలిసిందే. అయితే గత మార్చి 24న ఆ స్నేహబంధం కాస్తా ప్రేమ బంధంగా మారింది. మార్చి 24న గోవాలో నిర్వహించిన ఒక ప్రైవేట్ పార్టీకి ముఖేశ్ అంబాని, నీతా అంబానీ, ముఖేష్ అంబానీ తల్లి కోకిలా బెన్‌తో పాటు మరికొందరు దగ్గరి స్నేహితులు హాజరయ్యారు. వీరందరి సమక్షంలో...సూర్యుడు అస్తమిస్తుండగా...తన మనసులో ఉదయించిన ప్రేమను ఆకాశ్ తన చిన్న నాటి నేస్తం శ్లోకాకు తెలియజేసాడు. ఆ తర్వాత ఇంకేముంది...శ్లోకాతోపాటు కుటుంబసభ్యులు కూడా ఒప్పుకోవడం...పార్టీ చేసుకోవడం అంతా మాయాలా జరిగిపోయాయంటున్నాడు ఆకాశ్. అన్నట్లు ఆ సమయంలో శ్లోకా కుంటుంబం కూడా అక్కడే ఉంది. ఈ నెల 30న ఆకాశ్ - శ్లోకాల నిశ్చితార్థపు వేడుక అంబానీల నివాసం అంటిల్లాలో ఘనంగా నిర్వహించనున్న సంగతి తెలిసిందే. -
ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు
గుంటూరు: ప్రేమ పేరుతో నిత్యం వేధిస్తున్నాడు. తల్లిదండ్రులకు చెప్పుకునేందుకు కూడా మొదట్లో భయపడ్డాను. అతని ఆగడాలు పెరగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తల్లిదండ్రులకు చెప్పాను. ఈవిషయం తెలిసి పెళ్లికి అంగీకరించకపోతే నన్ను హతమారుస్తానని బెదిరించడంతో పోలీసులను ఆశ్రయించాను. అయినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని ఓ విద్యార్థిని రూరల్ అదనపు ఎస్పీ వరదరాజు వద్ద సోమవారం కన్నీటి పర్యంతమైంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం. తుళ్లూరు మండలం నెక్కల్లు గ్రామానికి చెందిన చదలవాడ శ్రీకాంత్ గుంటూరు రూరల్ మండలం గ్రామంలోని ఓప్రైవేటు కళాశాలలో ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అదే కళాశాలలో బీఫార్మాసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని ప్రేమిస్తున్నానంటూ గతేడాది సెప్టెంబరు నుంచి వెంటపడుతున్నాడు. ఫోన్ తీసుకొచ్చి ఆమెకు బలవంతంగా ఇచ్చి ఫోన్ నీ దగ్గర లేకుంటే అంతు చూస్తానని బెదిరించడంతో గత్యంతరం లేని స్థితిలో ఆమె ఫోన్ ఇంటికి తీసుకువెళ్లింది. తల్లిదండ్రులకు విషయం చెబితే చులకనగా చూడడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అనంతరం విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్‌కు తెలుపగా, శ్రీకాంత్ తల్లిదండ్రులను పిలిపించి మందలించారు. అయినా శ్రీకాంత్ వేధింపులు ఆపలేదు. దీంతో ఆమె తల్లిదండ్రుల సాయంతో గతనెల 10న తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నిందితుడిపై ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో భయంగా కళాశాలకు వెళ్లాల్సి వస్తుందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. -
చేతికి బేడీలతో లవ్ ప్రపోజల్.. వీడియో వైరల్
వాషింగ్టన్: ప్రేమను వ్యక్తం చేయడంలో ఒక్కో వ్యక్తికి ఒక్కో స్టైల్ ఉంటుంది. లవర్ పుట్టినరోజు కొందరు, వారికి ఇష్టమైన ప్రదేశంలో మరికొందరు ఇలా రకరకాలుగా ప్రేమను వ్యక్తం చేస్తుంటారు. కానీ అమెరికాలో మాత్రం ఓ ప్రేమికుడు పోలీసులు అరెస్ట్ చేసిన సందర్భంలో వారిని కాస్త సమయం అడిగి మరీ ప్రియురాలికి తాపీగా ప్రపోజ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అమెరికాలోని ఓక్లహామాకు చెందిన బ్రెండన్ థాంప్సన్ ఈ జూలై 4న అరెస్టయ్యాడు. ఓ కేసులో నిందితుడిగా అనుమానిస్తూ థాంప్సన్ బర్త్‌డే రోజే పోలీసులు అతడిని అరెస్ట్ చేసేందుకు ఇంటికి వచ్చారు. పోలీసులు ఆ ప్రియుడి చేతికి బేడీలు కూడా వేశారు. పోలీసు వాహనం ఎక్కేముందు అధికారులకు ఓ విజ్ఞప్తి చేశాడు. తనకు ఓ 5 నిమిషాల సమయం కావాలని ఇది తన జీవితంలో ముఖ్యమైన క్షణాలన్నాడు. వెంటనే గాళ్‌ఫ్రెండ్ లియాండ్రా కీత్ వద్దకు వెళ్లి తన ప్రేమ విషయాన్ని చెప్పాడు. 'నేను నిన్ను పెళ్లి సుకోవాలి అనుకుంటున్నాను. ఇక జీవితాంతం నీకు తోడుగా ఉంటానని' థాంప్సన్ చేసిన ప్రపోజల్‌కు ప్రేయసి లియాండ్రా ఓకే చెప్పేసింది. ఓ వైపు చేతులకు బేడీలతో ఉన్నా.. మోకాళ్లపై నిల్చుని ప్రియురాలు లియాండ్రాకు థాంప్సన్ చేసిన లవ్ ప్రపోజల్ ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ప్రేయసి వేలికి ఉంగరం తొడిగిన థాంప్సన్.. అక్కడి నుంచి కదిలేలోపు లియాండ్రా సాయంతో తాపీగా సిగరెట్ కూడా కాల్చాడు. ఇంట్లోవాళ్లకు ఏదో చెబుతూ.. సంతోషంగా జైలు బాట పట్టాడు ఆ ప్రేమికుడు. బాబ్ లించ్ అనే పోలీసు అధికారి ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అనూహ్యమైన స్పందన వస్తోంది. -
క్యూట్ లవ్ ప్రపోజల్.. వైరల్ వీడియో
ప్రేమను వ్యక్తం చేయడానికి ఒక్కొక్కరూ ఓ మార్గాన్ని ఎంచుకుంటారు. కొందరు పుట్టినరోజున, కొందరైతే తాము ఏదైనా సాధించిన రోజు ఇలా చెప్పుకుంటూ పొతే ఏన్నో ఉంటాయి. అయితే ప్రస్తుతం ఓ లవ్ ప్రపోజల్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. విమానంలో ప్రయాణిస్తుండగా పైలట్ చేసిన లవ్ ప్రపోజల్ వైరల్ గా మారింది. ఇది ఎక్కడ జరిగిందో స్పష్టతలేదు కానీ స్వచ్ఛమైన ప్రేమకు ఓటమి ఉండదంటూ కామెంట్లు చేస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే.. ఎయిర్ హోస్టెస్ తమ పనుల్లో మునిగిఉండగా ఇంతలో పైలట్ అక్కడకు వచ్చాడు. విమానంలో ఉండే ఫోన్ లో ఏదో విషయం చెప్పగానే ఓ ఎయిర్ హోస్టెస్ అతడివైపు కదిలింది. ఇంతలో అతడు మోకాళ్లపై కూర్చుని నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. ఆమె చేతిని పట్టుకుని ప్రేమిస్తున్నట్లు చెప్పి.. జీవితాంతం ఈ చేతిని వదలను అంటూ ఆమె కళ్లలోకి చూసి చెప్పాడు. మొదట ఆమె షాక్ తిన్నా.. వెంటనే పైలట్ ప్రపొజల్ కు ఒకే చెప్పింది. సినిమా సీన్ లా ప్రయాణికులు చూస్తుండగానే పైలట్, తన ప్రియురాలికి రింగ్ తొడిగి తన ప్రేమను గెలిపించుకున్నాడు. అందరూ చప్పట్లుకొడుతుండగా ఈ ప్రేమికులు ముద్దుల్లో మునిగితేలారు. ఆ వెంటనే విమానంలోని ఫోన్ తీసుకుని తన వేలికి ఉంగరాన్ని చూపిస్తూ ఎయిర్ హోస్టెస్ తన సంతోషాన్ని షేర్ చేసుకుంది. -
ప్రేమకు నో చెప్పిందని... అత్యాచారయత్నం
కోల్ కతా: పరీక్ష రాసేందుకు వెళ్తోన్న ఓ టీనేజీ విద్యార్థినిపై ఓ అల్లరి మూక దాడిచేయడంతో పాటు అత్యాచారానికి పాల్పడింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లోని జల్పాయ్ గురి ఏరియాలో మంగళవారం చోటుచేసుకుంది. దాడి చేసిన వారి గ్రూపులో మహిళలు ఉండటం గమనార్హం. పోలీసుల కథనం ప్రకారం... ఓ విద్యార్థిని బోర్డ్ ఎగ్జామ్ రాసేందుకని దూప్ గురి ఏరియాకి వెళ్తోంది. దారిలో ఓ గ్యాంగ్ ఆ బాలికను అడ్డుకుంది. అందులోని ఓ యువకుడు తనను ప్రేమించాలంటూ అమ్మాయికి ప్రపోజ్ చేశాడు. ఆ విద్యార్థిని అతడి ప్రేమకు నో చెప్పింది. ఆవేశానికి లోనైన ఆ గ్యాంగ్ సభ్యులు ఆ విద్యార్థినిపై దాడికి పాల్పడ్డారు. అందులోని ఓ మహిళ బాధిత విద్యార్థినిపై తిట్ల పురాణం మొదలెట్టగా, యువకులు అమెను కొట్టడం ప్రారంభించారు. ఆ తర్వాత విద్యార్థినిపై అత్యాచారయత్నం చేశారు. చివరికి ఆ విద్యార్థిని వారి నుంచి తప్పించుకోగా.. పంచాయతీరాజ్ అధికారి ఆ విద్యార్థినిని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాడు. బాధితురాలు ఆస్పత్రి బెడ్ మీద నుంచే బోర్డ్ ఎగ్జామ్ రాయాల్సి వచ్చింది. మంగళవారం సాయంత్రం ఈ దాడికి పాల్పడ్డ అసలు నిందితుడిని అరెస్ట్ చేసినట్లు జల్పాయ్ గురి ఎస్పీ ఆకాశ్ మేఘారియా తెలిపారు. బాధితురాలిపై దాడి చేసి అత్యాచారానికి యత్నించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, కేసు విచారణ త్వరగా పూర్తిచేస్తామని వివరించారు. -
వెరైటీగా లవ్ ప్రపోజ్ చేశాడు
-
వారం తరువాత ఓకే అన్నాడు
నా లవ్ ప్రపోజల్‌కు వారం తరువాత ఓకే చెప్పాడు అన్నారు నటి ప్రియమణి. పరుత్తివీరన్ చిత్రంతో కోలీవుడ్‌లో పేరు తెచ్చుకున్న నటి ప్రియమణి. అంతకు ముందు మాతృభాష మలయాళంలోనూ, ఆ తరువాత తెలుగులోనూ కథానాయికగా ఒక రౌండ్ కొట్టిన ఈ బ్యూటీకి ప్రస్తుతం అవకాశాలు అంతగా లేవు. తమిళంలో బొత్తిగా లేవు. దీంతో అమ్మడు పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. అందుకు సిగ్నల్‌గా తన ప్రేమ వ్యవహారాన్ని లీక్ చేసినట్లు సినీ వర్గాల సమాచారం.ఆ మధ్య హిందీ చిత్రం చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్రంలో సింగిల్‌కు ఆడి పాడేశారు. దాంతో అక్కడ అవకాశాలు వస్తాయని ఆశించారు. అప్పుడే కాదు అంతకు ముందు మణిరత్నం రావణ్ చిత్రంలో నటించినప్పుడూ ప్రియమణి ఆశలు నెరవేరలేదు. ఇక లాభంలేదని ప్రియుడి విషయాన్ని బయటపెట్టారు.ఆ విధంగా మరోసారి వార్తల్లోకెక్కారు. ఇంతకూ ప్రియమణి ప్రియుడెవరన్న విషయాన్ని చెప్పలేదు కదూ అదేదో ఆమె మాటల్లోనే విందాం. నిజమే నేను పేమలో పడ్డాను. నా ప్రియుడి పేరు ముస్తఫారాజ్. ముంబైకి చెందిన తను ఒక టీవీ రియాలిటీ షో కార్యక్రమంలో పరిచయం అయ్యారు. ఆ పరిచయం స్నేహంగా మారింది. అయితే మొదట తనకు పేమ ప్రపోజల్ నేనే చేశాను. ఐ లైక్ యూ అంటూ మెసేజ్ పెట్టాను. ఆయన నుంచి వెంటనే సమాధానం రాలేదు. నాది నిజమైన ప్రేమేనని అర్థం చేసుకొని సరిగ్గా వారం తరువాత ఓకే అన్నారు. అలా నాలుగు సంవత్సరాల మా ప్రేమకు ఇరు కుటుంబాల సభ్యులు అంగీకరించారు. ప్రస్తుతం నేను చిత్రాలతో బిజీగా ఉన్నాను.త్వరలోనే మా పెళ్లి ఎప్పుడన్నది వెల్లడిస్తాను. -
శృతీ.. నిన్ను ప్రేమించాలనుంది!!