Ind Vs HK: Hong Kong Batter Kinchit Shah Proposes To His Girlfriend In Stadium, Video Viral - Sakshi
Sakshi News home page

IND VS HK: గ్రౌండ్‌లోనే గర్ల్ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేసిన హాంకాంగ్‌ క్రికెటర్‌.. వీడియో వైరల్‌!

Published Thu, Sep 1 2022 8:25 AM | Last Updated on Thu, Sep 1 2022 10:14 AM

Hong Kong batter Kinchit Shah  Proposes to girlfriend after game - Sakshi

PC: Twitter

ఆసియా కప్‌-2022లో భాగంగా బుధవారం జరిగిన భారత్‌- హాంకాంగ్‌ మ్యాచ్‌ అనంతరం ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. హాంకాంగ్ బ్యాటర్ కించిత్ షా.. స్టేడియంలోనే తన గర్ల్‌ఫ్రెండ్‌కి ప్రపోజ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. భారత్‌తో మ్యాచ్‌ ముగిసిన వెంటనే స్టాండ్స్‌లోకి వెళ్లిన కించిత్.. అక్కడ కూర్చుని మ్యాచ్‌ని వీక్షిస్తున్న తన ప్రేయసికి సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు.

ఆమె ముంగిట మోకాళ్ల మీద కూర్చొని తన ప్రేమను  వ్యక్తపరిచాడు. స్టేడియంలో అందరూ చూస్తుండగా.. ఆమె చేతికి రింగ్ తొడిగాడు. కించిత్‌ క్యూట్‌ ప్రపోజ్‌కు ఆమె ఫిదా అయిపోయింది. అనంతరం ఒకరినొకరు కౌగిలించుకుని ఆనందంలో మునిగితేలారు.  దీంతో స్టేడియం ఒక్కసారిగా హోరెత్తిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో టీమిండియా క్రికెటర్‌ దీపక్‌ చహర్‌ సైతం ఇలాగే స్టేడియంలో గర్ల్‌ఫ్రెండ్‌కు ప్రపోజ్‌ చేసిన వీడియో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది జూన్‌లో వారి వివాహం జరిగింది.

ఇదిలా ఉంటే... మ్యాచ్‌ విషయానికి వస్తే.. హాంకాంగ్‌పై భారత్‌ 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా సూపర్‌-4కు టీమిండియా ఆర్హత సాధించింది. భారత విజయంలో సూర్యకుమార్‌ యాదవ్‌(68 నాటౌట్‌), విరాట్‌ కోహ్లి(59 నాటౌట్‌) హాఫ్‌ సెంచరీలతో చేలరేగి కీలక పాత్ర పోషించాడు.


చదవండి: IND VS HK: అక్కడ ఉన్నది జడేజా.. కొంచెం చూసి వెళ్లాలి కదా! వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement