Asia Cup 2022
-
ఆసియా కప్‌లో భారత్-పాక్ మ్యాచ్.. కోహ్లిని గుర్తు చేసుకున్న యువ క్రికెటర్లు
భారత్-పాకిస్తాన్ల మధ్య ఏ క్రీడలో అయినా, ఏ స్థాయి మ్యాచ్ అయినా భారీ అంచనాలు కలిగి ఉంటుందన్న విషయం తెలిసిందే. దాయాదుల మధ్య క్రికెట్ మ్యాచ్ అయితే, దాని గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. క్రికెటర్లతో పాటు అభిమానులు తీవ్ర భావోద్వేగాలకు లోనవుతారు. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2023 ద్వారా ఇరు దేశాల క్రికెటర్లు, అభిమానులకు మరోసారి ఆ భావోద్వేగానుభూతికి లోనయ్యే అవకాశం దొరికింది. టోర్నీలో భాగంగా రేపు (జులై 19) భారత్-ఏ, పాకిస్తాన్-ఏ జట్లు తలపడనున్నాయి. కొలొంబో వేదికగా జరిగే ఈ మ్యాచ్ రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. వన్డే ఫార్మాట్లో జరిగే ఈ మ్యాచ్ కోసం యువ భారత క్రికెటర్లు, పాకిస్తాన్ ఆటగాళ్లు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా రాణించి, అభిమానుల మనసుల్లో చిరకాలం కొలువుండిపోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. భారత-ఏ క్రికెటర్లయితే తమ ఆరాధ్య క్రికెటర్ విరాట్ కోహ్లి చివరిసారి పాకిస్తాన్‌పై ఆడిన ఇన్నింగ్స్‌ను గుర్తుచేసుకుంటూ తాము కూడా అదే స్థాయి ఇన్నింగ్స్ ఆడాలని కలలు కంటున్నారు. నేపాల్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో సెన్సేషనల్ ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్ శర్మ (87) స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. తన దృష్టిలో ఆసియా కప్-2022లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి ఆడిన ఇన్నింగ్స్ అత్యుత్తమ టీ20 ఇన్నింగ్స్ అని అన్నాడు. మరో భారత-ఏ జట్టు సభ్యుడు రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. ఆసియా కప్‌లో పాక్‌తో మ్యాచ్ సందర్భంగా కోహ్లి ముఖంలో, కళ్లలో కనిపించిన కసి అత్యద్భుతమని కొనియాడాడు. నేపాల్‌తో మ్యాచ్‌లో రాణించిన సాయి సుదర్శన్ మాట్లాడుతూ.. ఆసియా కప్‌లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో హరీస్ రౌఫ్ బౌలింగ్ కోహ్లి కొట్టిన ఓ షాట్ సూపర్ హ్యూమన్ షాట్ అని అభిప్రాయపడ్డాడు. ఈ ముగ్గురు యువ క్రికెటర్లు రేపు పాక్‌తో జరిగే మ్యాచ్‌లో కోహ్లిలా చెలరేగాలని అనుకుంటున్నట్లు తెలిపారు. -
ఇంగ్లీష్ పరీక్షలో విరాట్ కోహ్లిపై ప్రశ్న.. క్వశ్చన్ పేపర్ వైరల్
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి.. గతేడాది జరిగిన ఆసియా కప్ నుంచి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఫామ్ కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కోహ్లి, ఆసియాకప్-2022లో ఆఫ్గానిస్తాన్‌పై అద్భుతమైన సెంచరీతో తన పూర్వ వైభవాన్ని పొందాడు. తన రిథమ్‌ను పొందడమే కాకుండా సెంచరీ కోసం తన మూడేళ్ల నిరీక్షణకు విరాట్ తెరదించాడు. అది విరాట్ కోహ్లికి తన అంతర్జాతీయ కెరీర్లో 71వ సెంచరీ. ఇక ఒకనొక దశలో కోహ్లిని జట్టు నుంచి తప్పించాలని పెద్దు ఎత్తున డిమాండ్లు వినిపించాయి. పాక్ మాజీ క్రికెటర్లు అయితే ఒక అడుగు ముందుకు వేసి కోహ్లి అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవాలని హేళన చేశారు. ఇలా ఎన్నో అవమానాలు ఎదుర్కొని అద్భుతమైన పునరాగమనం చేసిన కోహ్లి.. ఎంతో మంది యువ ఆటగాళ్లకు స్పూర్తిదాయకంగా నిలిచాడు. ఇక తాజాగా ఒక స్కూల్ కూడా విరాట్ కోహ్లి పట్టుదల, అలుపెరగని పోరాటానికి సలాం కొట్టింది. తమ స్కూల్లో 9వ తరగతి చదివే విద్యార్థులకు కోహ్లి పునరాగమనం గురించి వివరించాలని ప్రశ్న వేసింది. ఇందుకు సంబంధించిన ప్రశ్నపత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో విరాట్ కోహ్లి తన 71వ అంతర్జాతీయ సెంచరీ సెలబ్రేషన్ జరుపుకుంటున్న ఫోటో ఉంది. ఈ ఫోటో గురించి 100 లేదా 120 పదాల్లో వివరించాలని ప్రశ్నలో ఉంది. ఇక ఇది చూసిన కింగ్ కోహ్లి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లి గురించి 100 పదాలు ఏంటి, పది పేజీలు అయినా రాయవచ్చు అంటూ అభిమానులు పోస్ట్‌లు చేస్తున్నారు. చదవండి: క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైన క్యాచ్.. ఇప్పటి వరకు చూసి ఉండరు! వీడియో వైరల్ -
Ind Vs SL: స్లెడ్జింగ్‌తో పనిలేదు.. వాళ్లకు మా బాడీ లాంగ్వేజ్ చాలు!
India vs Sri Lanka, 1st T20I- Hardik Pandya: ‘‘మేము గతం గురించి ఆలోచించడం లేదు. అయితే, ఒక్కటి మాత్రం నిజం. వాళ్లు ఇండియాలో ఉన్నారన్న భావన కలిగేలా చేస్తాం. కావాల్సినంత మజా అందిస్తాం’’ అని టీమిండియా తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. కాగా శ్రీలంకతో టీ20 సిరీస్ మంగళవారం నుంచి మొదలు కానున్న విషయం తెలిసిందే. ఇక ఈ సిరీస్‌కు రోహిత్ శర్మ గైర్హాజరీ నేపథ్యంలో స్టార్ ఆల్‌రౌండర్ సారథిగా వ్యవహరించనున్నాడు. ఈ క్రమంలో తొలి టీ20 ఆరంభానికి ముందు మీడియాతో మాట్లాడిన పాండ్యా ప్రత్యర్థి జట్టును ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్-2022 టోర్నీలో శ్రీలంక చేతిలో ఓటమి గురించి ఆలోచించడం లేదన్న హార్దిక్ పాండ్యా.. ‘‘వాళ్లు (శ్రీలంక) మేటి అంతర్జాతీయ జట్టు ఇండియాతో.. అది కూడా ఇండియాలో ఆడుతున్నారన్న భావన కచ్చితంగా కలిగిస్తాం. మా కుర్రాళ్ల తరఫున నేను మీకు మాట ఇస్తున్నా. మేము వాళ్లను స్లెడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. మా బాడీ లాంగ్వేజ్ చాలు వాళ్లను భయపెట్టడానికి మా బాడీ లాంగ్వేజ్ చాలు. మీరు మంచి గేమ్ చూడబోతున్నారని మాట ఇస్తున్నా’’ అని పేర్కొన్నాడు. కాగా ఆసియా కప్ టోర్నీ సూపర్-4లో లంక చేతిలో రోహిత్ సేన 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు సీనియర్ల గైర్హాజరీలో యువ ఆటగాళ్లతో కూడిన జట్టుతో పాండ్యా.. ఆసియా చాంపియన్ దసున్ షనక బృందాన్ని ఢీకొట్టనున్నాడు. చదవండి: BCCI: బిగ్ ట్విస్ట్.. రేసు నుంచి వెంకటేశ్ ప్రసాద్ అవుట్!? చీఫ్ సెలక్టర్‌గా మళ్లీ అతడే! Ind Vs SL: ఆసియా చాంప్‌తో ఆషామాషీ కాదు! అర్ష్‌దీప్‌పైనే భారం! ఇషాన్, రుతు.. ఇంకా -
సూర్యకుమార్ యాదవ్.. ఈ ఏడాది టీ20ల్లో ప్రకంపనలు సృష్టించిన డైనమైట్
Year Ender 2022: పొట్టి క్రికెట్లో మునుపెన్నడూ లభించని మజా 2022లో దొరికిందనడం అతిశయోక్తి కాదు. టీ20 ఫార్మాట్లో ఈ ఏడాది జరిగిన అన్ని మ్యాచ్‌లు క్రికెట్ ప్రేమికుల ఊహలకు మించిన కనువిందు కలిగించాయని అనడం కాదనలేని సత్యం. ముఖ్యంగా ఈ ఏడాది చివర్లో జరిగిన ఆసియా కప్, టీ20 వరల్డ్‌కప్ టోర్నీలు ప్రేక్షకులను తారా స్థాయిలో రంజింపజేశాయి. నరాలు తెగే ఉత్కంఠ నడుమ హోరాహోరీగా సాగిన ఈ సమరాల్లో సహజంగానే బ్యాటర్ల ఆధిపత్యం కొనసాగింది. పొట్టి ఫార్మాట్లో బౌలర్లపై ఆనవాయితీగా కొనసాగుతున్న బ్యాటర్ల ఆధిపత్యం ఈ ఏడాది మరింత పెరిగిందనే చెప్పాలి. దాదాపు అన్ని దేశాలకు చెందిన కీలక ఆటగాళ్లు.. తమ విధ్వంసకర బ్యాటింగ్ విన్యాసాలతో పూనకాలు వచ్చినట్లు ఊగిపోయారు. వీరి ధాటికి బౌలర్లు బెంబేలెత్తిపోయారు. ఈ ఏడాది బౌలర్ల పాలిట సింహస్వప్నంలా నిలిచిన బ్యాటర్ల జాబితాలో టీమిండియా విధ్వంసకర ఆటగాడు, మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ముందువరుసలో ఉన్నాడు. స్కై.. ఈ ఏడాది టీ20ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఆడిన ప్రతి మ్యాచ్‌లో పూనకం వచ్చిన వాడిలా ఊగిపోయి ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మైదానం నలుమూలలా షాట్లు ఆడి మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ బిరుదుకు న్యాయం చేశాడు. ఈ ఏడాది టీ20ల్లో స్కై ఆడిన కొన్ని షాట్లు చూసి విశ్లేషకులు నివ్వెరపోయారు. స్కై.. తొలి 360 డిగ్రీస్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్‌కు ఏమాత్రం తీసిపోడని ప్రశంసలతో ముంచెత్తారు. ఈ ఏడాది మొత్తం 31 టీ20 మ్యాచ్‌లు ఆడిన సూర్యకుమార్.. 46.56 సగటున, 187.43 స్ట్రయిక్ రేట్‌తో 1164 పరుగులు సాధించాడు. ఇందులో 2 శతకాలు, 9 అర్ధశతకాలు ఉన్నాయి. 32 ఏళ్ల సూర్యకుమార్ ఈ ఏడాది టీ20ల్లో అత్యధిక పరుగుల (1164) వీరుడిగా, అత్యధిక సిక్సర్లు (98) బాదిన ధీరుడిగా కొనసాగుతున్నాడు. ఓవరాల్‌గా 42 టీ20లు ఆడిన స్కై.. 44 సగటున, 181 స్ట్రయిక్ రేట్‌తో 1408 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా సూర్య టీ20 కెరీర్లో 2 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ గణాంకాలే కాకుండా సూర్య ఈ ఏడాది టీ20ల్లో ఎన్నో రికార్డులు, మరెన్నో రివార్డులు, అంతకుమించిన అవార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. జట్టులోకి వచ్చిన అనతికాలంలోనే (2021లో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ) ఆకాశమంత ఎత్తు ఎదిగిన సూర్యకుమార్.. ఈ ఏడాది టీమిండియాకు లభించిన ఆణిముత్యమని యావత్ క్రీడాప్రపంచం వేనోళ్లతో కొనియాడుతుంది. ఈ ఏడాది టీ20ల్లో సూర్యకుమార్ గణాంకాలు.. - వెస్టిండీస్‌తో 7 టీ20లు ఆడిన స్కై.. 179.25 స్ట్రయిక్ రేట్‌తో 242 పరుగులు చేశాడు. ఇందులో 2 అర్ధసెంచరీలు ఉన్నాయి. - శ్రీలంకతో ఒక టీ20 ఆడిన స్కై.. 117.24 స్ట్రయిక్ రేట్‌తో 34 పరుగులు చేశాడు. - సౌతాఫ్రికాతో 4 టీ20లు ఆడిన స్కై.. 185.14 స్ట్రయిక్ రేట్‌తో 187 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్ధసెంచరీలు ఉన్నాయి. - ఐర్లాండ్‌తో 2 టీ20లు ఆడిన స్కై.. 250 స్ట్రయిక్ రేట్‌తో 15 పరుగులు చేశాడు. - ఇంగ్లండ్‌తో 4 టీ20లు ఆడిన స్కై.. 180.14 స్ట్రయిక్ రేట్‌తో 185 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ ఉంది. - ఆస్ట్రేలియాతో 3 టీ20లు ఆడిన స్కై.. 185.48 స్ట్రయిక్ రేట్‌తో 115 పరుగులు చేశాడు. ఇందులో ఒక అర్ధసెంచరీ ఉంది. - న్యూజిలాండ్‌తో 2 టీ20లు ఆడిన స్కై.. 124 పరుగులు చేశాడు. ఇందులో ఓ విధ్వంసకర సెంచరీ ఉంది. - బంగ్లాదేశ్‌తో ఒక టీ20 ఆడిన స్కై.. 185.50 స్ట్రయిక్ రేట్‌తో 30 పరుగులు చేశాడు. - ఆఫ్ఘనిస్తాన్‌తో ఒక టీ20 ఆడిన స్కై.. 300 స్ట్రయిక్ రేట్‌తో 6 పరుగులు చేశాడు. - హాంగ్‌కాంగ్‌తో ఒక టీ20 ఆడిన స్కై.. 261.53 స్ట్రయిక్ రేట్‌తో 63 పరుగులు చేశాడు. ఇందులో ఒక అర్ధసెంచరీ ఉంది. - నెదర్లాండ్స్‌తో ఒక టీ20 ఆడిన స్కై.. 204 స్ట్రయిక్ రేట్‌తో 51 పరుగులు చేశాడు. ఇందులో ఓ అర్ధసెంచరీ ఉంది. - పాకిస్తాన్‌తో 3 టీ20లు ఆడిన స్కై.. 123.91 స్ట్రయిక్ రేట్‌తో 46 పరుగులు చేశాడు. - జింబాబ్వేతో ఓ టీ20 ఆడిన స్కై.. 244 స్ట్రయిక్ రేట్‌తో 61 పరుగులు చేశాడు. ఇందులో ఓ అర్ధసెంచరీ ఉంది. టీ20 వరల్డ్‌కప్-2022లో సూర్యకుమార్.. - 6 మ్యాచ్‌లు ఆడిన స్కై.. 189.68 స్ట్రయిక్ రేట్‌తో 239 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్ధసెంచరీలు ఉన్నాయి. సూర్య.. ఈ మెగా టోర్నీలో మూడో అత్యధిక రన్ స్కోరర్‌గా నిలిచాడు. ఆసియా కప్-2022లో సూర్యకుమార్.. - 5 మ్యాచ్‌లు ఆడిన స్కై.. 163.52 స్ట్రయిక్ రేట్‌తో 139 పరుగులు చేశాడు. ఇందులో ఓ హాఫ్ సెంచరీ ఉంది. ఈ గణాంకాలతో పాటు సూర్యకుమార్ టీ20 ర్యాంకింగ్స్‌లోనూ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అనతి కాలంతో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా సూర్యకుమార్ రికార్డుల్లోకెక్కాడు. -
Team India: ద్వైపాక్షిక సిరీస్‌ల్లో జోరు.. మెగా టోర్నీల్లో బేజారు
రోహిత్ శర్మ పూర్తి స్థాయి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాక పొట్టి ఫార్మాట్ ద్వైపాక్షిక సిరీస్‌ల్లో టీమిండియా అదరగొడుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆరంభం నుంచి భారత జట్టు.. ఆడిన ప్రతి సిరీస్‌లోనూ జయకేతనం ఎగురవేసి సత్తా చాటింది. అయితే, మెగా టోర్నీల విషయానికి వస్తే మాత్రం టీమిండియా తేలిపోతుంది. ఒత్తిడి వల్లనో లేక కీలక ఆటగాళ్లు సమయానికి (కీలక టోర్నీలకు) అందుబాటులో లేకపోవడం వల్లనో.. కారణం ఏదైనా పెద్ద టోర్నీల్లో మాత్రం టీమిండియా దారుణంగా విఫలమవుతుంది. ఇటీవలి కాలంలో టీమిండియా ఆడిన టీ20 సిరీస్‌లపై లుక్కేస్తే.. స్వదేశంలో వెస్టిండీస్ (3-0), శ్రీలంక (3-0)లను క్లీన్ స్వీప్ చేసింది. ఆతర్వాత ఐర్లాండ్ పర్యటనలో 2-0 తేడాతో సిరీస్ గెలిచింది. ఆ వెంటనే ఇంగ్లండ్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఆతర్వాత కరీబియన్ గడ్డపై 5 మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1 తేడాతో, ఆ వెంటనే స్వదేశంలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలపై 2-1 తేడాతో వరుస సిరీస్ విజయాలు సాధించింది. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది. ఇలా.. ఈ ఏడాది టీమిండియా ఆడిన 8 సిరీస్‌ల్లో వరుస విజయాలు సాధించి, ద్వైపాక్షిక సిరీస్‌ల్లో తిరుగులేని జట్టుగా నిలిచింది. అయితే, టీమిండియా ఈ జోరును మెగా ఈవెంట్లలో మాత్రం చూపలేకపోతుంది. ఆగస్ట్, సెప్టెంబర్లలో జరిగిన ఆసియా కప్‌లో సూపర్-4లోనే నిష్క్రమణ, తాజాగా ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌లో సెమీస్‌లో ఓటమి.. ఇలా ఈ ఏడాది ఆడిన రెండు మేజర్ టోర్నీల్లో రిక్త హస్తాలతో వెనుదిరిగింది. ఆసియా కప్‌లో అయితే పాకిస్తాన్, శ్రీలంక చేతుల్లో దారుణ పరాభావాలు (సూపర్-4) ఎదుర్కొని ముప్పేట దాడిని ఎదుర్కొంది. 2021 టీ20 వరల్డ్‌కప్‌లోనూ ఇదే పరిస్థితి ఏదురైంది. ఆ టోర్నీలో తొలి మ్యాచ్‌లోనే పాక్ చేతుల్లో ఓడి సూపర్-4కు కూడా అర్హత సాధించలేక పోయింది. ఇక తాజాగా ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌లో గ్రూప్ దశ సాఫీగా సాగిన టీమిండియా ప్రయాణం, సెమీస్‌కు వచ్చే సరికి ఆగిపోయింది. సెమీస్‌లో ఇంగ్లండ్ చేతుల్లో 10 వికెట్ల తేడాతో దారుణంగా ఓటమిపాలైంది. -
Ind Vs Pak: ‘అక్టోబరు 23న ఇండియాతో పాక్ మ్యాచ్ ఆడదు’
T20 World Cup 2022- India Vs Pakistan- October 23: ఆసియా కప్-2023 నేపథ్యంలో భారత్- పాకిస్తాన్ మ్యాచ్ గురించి బీసీసీఐ కార్యదర్శి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా చేసిన వ్యాఖ్యలపై క్రీడా వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీని పాక్ వేదికగా నిర్వహించేందుకు నిర్ణయం జరిగినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే, జై షా మాత్రం ఈ ఈవెంట్ కోసం టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్లదని స్పష్టం చేశాడు. తటస్థ వేదికపైనే నిర్వహిస్తామని పేర్కొన్నాడు. జై షా వ్యాఖ్యలపై స్పందించిన పీసీబీ.. ఏసీసీ అధ్యక్షుడి తీరు తమను నిరాశకు గురిచేసిందంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక ఈ విషయంపై పాక్ మాజీ క్రికెటర్లు కమ్రాన్ అక్మల్, యూనిస్ ఖాన్ తాజాగా స్పందించారు. ఏ ఐసీసీ ఈవెంట్లోనూ ఆడదు.. అక్టోబరు 23న కూడా ఏఆర్వై న్యూస్‌తో కమ్రాన్ మాట్లాడుతూ.. ‘‘జై షా నుంచి ఈ ప్రకటన ఊహించలేదు. ఇటీవల ముగిసిన ఆసియా కప్ టోర్నీలో భాగంగా ఆయన మ్యాచ్ వీక్షించేందుకు వచ్చారు. అయితే, కేవలం రాజకీయాలకే ఆయన పరిమితం అయినట్లు అనిపిస్తోంది. క్రీడల్లోకి రాజకీయాలను లాగాల్సిన పనిలేదు. ఒకవేళ ఆసియా కప్-2023 గనుక పాకిస్తాన్లో జరుగకపోతే.. ఇండియాతో ఇకపై పాక్ ఆడబోదు. ఐసీసీ ఈవెంట్లు అయినా సరే ఇండియాతో మ్యాచ్ ఆడదు. ఆసియా కప్ వరకు ఆగాల్సిన పనిలేదు.. అక్టోబరు 23 నాటి మ్యాచ్‌లో పాక్ ఇండియాతో ఆడదు’’ అంటూ వ్యాఖ్యానించాడు. ఒప్పుకొనే ప్రసక్తే లేదు ఇక యూనిస్ ఖాన్ స్పందిస్తూ.. ‘‘పాకిస్తాన్‌కు రావొద్దన్న నిర్ణయానికే బీసీసీఐ గనుక కట్టుబడి ఉంటే.. పాకిస్తాన్ కూడా వచ్చే ఏడాది వన్డే వరల్డ్‌కప్ కోసం ఇండియాకు ఎళ్లదు. అంతేకాదు తటస్థ వేదికపై ఆసియా కప్ నిర్వహణకు కూడా అంగీకరించదు’’ అని చెప్పుకొచ్చాడు. కాగా టీ20 వరల్డ్‌కప్-2022లో భాగంగా ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ వేదికగా అక్టోబరు 23న భారత్- పాక్ మధ్య మ్యాచ్‌కు షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే. ఇక పీసీబీ, పాక్ మాజీ ప్లేయర్ల వ్యాఖ్యలపై స్పందించిన టీమిండియా ఫ్యాన్స్.. ‘‘తాటాకు చప్పుళ్లకు బెదిరే ప్రసక్తే లేదు. ఇండియాతో ఆడకపోతే నష్టపోయేది పాక్ జట్టే!’’ అంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. చదవండి: Rishabh Pant: అలీ బౌలింగ్‌లో ఒంటిచేత్తో వరుసగా రెండు సిక్స్‌లు.. పాక్‌తో మ్యాచ్ అంటేనే.. Predicted Playing XI: పాక్‌తో తొలి మ్యాచ్.. తుది జట్టు ఇదే! పంత్, అశ్విన్, హుడాకు నో ఛాన్స్! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
టీ20 ప్రపంచకప్‌లో ఆ జట్టుతో జాగ్రత్త! లేదంటే అంతే!
T20 World Cup 2022- Gautam Gambhir Comments: టీ20 ప్రపంచకప్-2022కు మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. ఆక్టోబర్ 16న జిలాంగ్ వేదికగా జరగనున్న శ్రీలంక-నమీబియా మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్ షురూ కానుంది. తొలుత రౌండ్ 1 మ్యాచ్‌లు జరగనుండగా.. ఆక్టోబర్ 22 నుంచి సూపర్-12 మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి. ఇది ఉండగా.. ఈ పొట్టి ప్రపంచకప్ ప్రారంభానికి ముందు టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక నుంచి ఇతర జట్లకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది అని గంభీర్ సూచించాడు. కాగా గత నెలలో జరిగిన ఆసియాకప్-2022లో అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగిన శీలంక ఏకంగా టైటిల్‌నే ఎగరేసుకుపోయిన సంగతి తెలిసిందే. ఆసియాకప్-2022 సూపర్ 4లో భాగంగా కీలక మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో భారత్ ఓటమిపాలైంది. ఇక ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక తొలుత క్వాలిఫియర్ మ్యాచ్‌ల్లో ఆడనుంది. ఆక్టోబర్ 16న నమీబియాతో జరగనున్న మ్యాచ్‌తో శ్రీలంక తమ వరల్డ్‌కప్ ప్రయాణాన్ని ఆరంభించనుంది. ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ 'గేమ్ ప్లాన్'లో గంభీర్ మాట్లాడుతూ.." శ్రీలంక జట్టు ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉంది. ముఖ్యంగా ఆసియాకప్‌లో వారు ఆడిన విధానం అద్భుతమైనది. టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక రెట్టింపు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. అదే విధంగా వారి స్టార్ బౌలర్లు దుష్మంత చమీర, లహిరు కుమార తిరిగి రావడంతో జట్టుకు మరింత బలం చేకూరుతుంది. ఈ మెగా ఈవెంట్లో శ్రీలంక నుంచి ఇతర జట్లకు గట్టి పోటీ ఖచ్చితంగా ఎదురు కానుంది. అదే విధంగా ఈ పొట్టి ప్రపంచకప్‌లో ఏ జట్టును కూడా తేలికగా తీసుకోకూడదు" అని పేర్కొన్నాడు. చదవండి: Women Asia Cup Final: ఫైనల్లో శ్రీలంక చిత్తు.. ఆసియాకప్ విజేతగా భారత్ -
ఏడో టైటిల్ వేటలో భారత్
సిల్హెట్: ఆసియా కప్ మహిళల టి20 టోర్నీ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత జట్టు ఆ హోదాను నిలబెట్టుకుంటూ ఫైనల్ చేరింది. ఇప్పటికే ఆరు సార్లు టైటిల్ గెలుచుకున్న భారత్ మరోసారి ట్రోఫీని అందుకోవడంపై దృష్టి పెట్టింది. జట్టు తాజా ఫామ్, ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనను బట్టి చూస్తే అది అసాధ్యమేమీ కాదు. ఈ క్రమంలో నేడు జరిగే ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక మహిళల జట్టుతో హర్మన్ సేన తలపడనుంది. తొలి లీగ్ మ్యాచ్‌లో లంకను సునాయాసంగానే భారత్ ఓడించినా... ఆ జట్టు సెమీస్ తరహాలో సంచలనం సృష్టించే అవకాశాలను తక్కువ చేయలేం. ఇలాంటి నేపథ్యంలో నేడు తుది పోరు ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. సమష్టి ప్రదర్శనతో... లీగ్ దశలో పాకిస్తాన్ చేతిలో అనూహ్యంగా ఓడిపోవడం మినహా ఓవరాల్‌గా టోర్నీలో భారత్ మెరుగైన ప్రదర్శన కనబర్చింది. అన్ని మ్యాచ్‌లు (7) ఆడిన ముగ్గురు ప్లేయర్లలో జెమీమా రోడ్రిగ్స్ అత్యధిక పరుగులు (215) సాధించగా, దీప్తి శర్మ అత్యధిక వికెట్లు (13) తీసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. షఫాలీ వర్మ కూడా ఫామ్‌లోకి రావడం భారత జట్టుకు సానుకూలాంశం. స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన (4 ఇన్నింగ్స్‌లలో కలిపి 83 పరుగులు) మాత్రం ఆశించిన రీతిలో ఆడలేకపోయినా, ఫైనల్లోనైనా చెలరేగాలని జట్టు కోరుకుంటోంది. దీప్తి శర్మతో పాటు స్నేహ్ రాణా, రాజేశ్వరి గైక్వాడ్, రాధా యాదవ్‌ల స్పిన్ ఎలాంటి బ్యాటర్లనైనా ఇబ్బంది పెట్టగలదు. దీప్తి సూపర్ ఫామ్‌లో ఉండటంతో ప్రత్యర్థికి ఇబ్బందులు తప్పవు. భారత్‌తో పోలిస్తే చమరి అటపట్టు కెప్టెన్సీలోని శ్రీలంక జట్టు బలహీనమనేది వాస్తవం. అయితే పాక్‌తో సెమీఫైనల్లో ఆ జట్టు చివరి బంతి వరకు కనబర్చిన స్ఫూర్తిదాయక ప్రదర్శన చూస్తే తేలిగ్గా ఓటమిని అంగీకరించే తరహా టీమ్ మాత్రం కాదని తెలుస్తోంది. తుది పోరులో ఆ జట్టు పోరాటం ఎంత వరకు సఫలం అవుతుందనేది చెప్పలేం. -
Womens Asia Cup T20: భారత మహిళలకు షాక్
సిల్హెట్ (బంగ్లాదేశ్): ఆసియా కప్ మహిళల టి20 టోర్నీలో జోరుగా దూసుకుపోతున్న భారత బృందానికి బ్రేక్ పడింది. ఫేవరెట్‌గా ఉన్న హర్మన్‌ప్రీత్ సేన పాకిస్తాన్ చేతిలో అనూహ్యంగా పరాజయంపాలై ఆశ్చర్యపర్చింది. శుక్రవారం మ్యాచ్‌కు ముందు టి20ల్లో పాక్‌తో 12 సార్లు తలపడి 10 సార్లు గెలిచిన భారత్... చివరిసారిగా 2016లో ఆ జట్టు చేతిలో ఓడింది. ఇప్పుడు ఆరేళ్ల తర్వాత పాకిస్తాన్ మన జట్టుపై విజయం సాధించింది. చివరి వరకు ఆసక్తికరంగా సాగిన పోరులో పాక్ 13 పరుగుల తేడాతో భారత్‌పై గెలుపొందింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేయగా, భారత్ 19.4 ఓవర్లలో 124 పరుగులకే ఆలౌటైంది. గురువారం అనూహ్యంగా థాయ్‌లాండ్ చేతిలో ఓడిన పాక్ కోలుకొని ఆసియాకప్ టోర్నీలో తొలి సారి భారత్‌పై విజయాన్ని అందుకోవడం విశేషం. ఓపెనర్లు మునీబా (17; 1 ఫోర్), సిద్రా (11; 1 ఫోర్)తో పాటు ఒమైమా (0) కూడా విఫలం కావడంతో ఆరు ఓవర్ల లోపే 33 పరుగుల వద్ద పాక్ 3 వికెట్లు కోల్పోయింది. అయితే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నిదా దార్ (37 బంతుల్లో 56 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ బిస్మా మారూఫ్ (35 బంతుల్లో 32; 2 ఫోర్లు) కలిసి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 58 బంతుల్లో 76 పరుగులు జోడించారు. దీప్తి శర్మ 27 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా, పూజ వస్త్రకర్ 2 వికెట్లు తీసింది. ఛేదనలో ఓపెనర్లు సబ్బినేని మేఘన (15; 1 ఫోర్, 1 సిక్స్), స్మృతి మంధాన (17; 2 ఫోర్లు), హేమలత (20; 3 ఫోర్లు ) కొన్ని చక్కటి షాట్లు ఆడినా ఎక్కువ సేపు నిలవలేకపోయారు. ఫామ్‌లో ఉన్న జెమీమా (2) విఫలం కాగా, చెప్పుకోదగ్గ భాగస్వామ్యం ఒక్కటీ లేకపోయింది. బ్యాటింగ్ ఆర్డర్‌ను మారుస్తూ ఏడో స్థానంలో వచ్చిన హర్మన్ ప్రీత్ (12) ప్రయోగం విఫలమైంది. తీవ్ర ఎండ కారణంగా కీపింగ్ వదిలి మధ్యలోనే మైదానం వీడిన రిచా ఘోష్ (13 బంతుల్లో 26; 1 ఫోర్, 3 సిక్స్‌లు) ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు రావాల్సి వచ్చింది. చివరి 3 ఓవర్లలో 43 పరుగులు చేయాల్సి ఉండగా నష్రా బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లతో పాటు సాదియా ఓవర్లోనూ వరుసగా 6, 4 కొట్టి రిచా గెలుపుపై ఆశలు రేపింది. అయితే అదే ఓవర్లో ఆమెను సాదియా అవుట్ చేయగా... చివరి ఓవర్లో 18 పరుగులు కావాల్సి ఉండగా, భారత్ 4 పరుగులకే పరిమితమైంది. నష్రా 3 వికెట్లు తీయగా... నిదా, సాదియా చెరో 2 వికెట్లు పడగొట్టారు. నేడు జరిగే ఐదో లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో భారత్ తలపడుతుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు మొదలయ్యే ఈ మ్యాచ్ ను స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
Womens Asia Cup 2022: మేఘన మెరిసె...
సిల్హెట్ (బంగ్లాదేశ్): మహిళల ఆసియా కప్ టి20 టోర్నమెంట్లో సబ్బినేని మేఘన (53 బంతుల్లో 69; 11 ఫోర్లు, 1 సిక్స్) వీరవిహారం చేసింది. దీంతో భారత జట్టు డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 30 పరుగుల తేడాతో మలేసియాపై నెగ్గింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగుల భారీస్కోరు చేసింది. ఓపెనర్లు మేఘన, షఫాలీ వర్మ (39 బంతుల్లో 46; 1 ఫోర్, 3 సిక్సర్లు) ధాటిగా ఆడారు. ఆంధ్రప్రదేశ్ క్రికెటర్ మేఘన 38 బంతుల్లోనే (8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీని అధిగమించడంతో భారత్ కేవలం 12 ఓవర్లలోనే 100 స్కోరు చేసింది. ఓపెనర్లిద్దరు 13.5 ఓవర్లలో 116 పరుగులు జోడించాక మలేసియా బౌలర్ వినిఫ్రెడ్ దురైసింగం బౌలింగ్‌లో మేఘన నిష్క్రమించింది. తర్వాత రిచా ఘోష్ (19 బంతుల్లో 33 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) కూడా చెలరేగడంతో భారత పరుగుల జోరు కొనసాగింది. నూర్ దానియా వేసిన 19వ ఓవర్లో వరుస బంతుల్లో షఫాలీ వర్మ, కిరణ్ నావ్‌గిరె (0) అవుటయ్యారు. తర్వాత భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మలేసియా వర్షంతో ఆట నిలిచే సమయానికి 5.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 16 పరుగులు చేసింది. ఆ తర్వాత మళ్లీ ఆట సాధ్యపడలేదు. తొలి ఓవర్లోనే వినిఫ్రెడ్ (0)ను దీప్తి శర్మ డకౌట్ చేసింది. నాలుగో ఓవర్లో వాన్ జులియా (1)ను రాజేశ్వరి బౌల్డ్ చేసింది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 5.2 ఓవర్లలో 47 పరుగులు చేయాల్సి ఉండగా... 16 పరు గులే చేయడం వల్ల మలేసియా అమ్మాయిలు 30 పరుగుల తేడాతో ఓడారు. మరో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై పాకిస్తాన్ తొమ్మిది వికెట్లతో గెలిచింది. ఈ టోర్నీలో వరుసగా రెండో విజయం సాధించిన భారత జట్టు నేడు జరిగే మ్యాచ్‌లో యూఏఈతో ఆడుతుంది. -
Asia Cup 2022: తల్లి అంపైర్.. కూతురు ఆల్‌రౌండర్.. ఇద్దరూ ఒకేసారి!
అర్థం చేసుకునే జీవిత భాగస్వామి దొరికితే అంతకంటే అదృష్టం మరొకటి ఉండదని అంటుంటారు. నలుగురికీ భిన్నంగా ఎంచుకున్న రంగంలో అనుకున్న లక్ష్యాలు చేరాలంటే కచ్చితంగా కుటుంబం.. ముఖ్యంగా లైఫ్ పార్ట్నర్ ప్రోత్సాహం ఉంటేనే సాధ్యమవుతుంది. భార్యైనా.. భర్తైనా పరస్పరం సహకరించుకుంటేనే ఇటు వ్యక్తిగత.. అటు వృత్తిగత జీవితం బాగుంటుంది. పాకిస్తాన్‌కు చెందిన తల్లీకూతుళ్లు సలీమా ఇంతియాజ్, కైనత్ ఇంతియాజ్‌కు ఇలాంటి భాగస్వాములే దొరికారు. భర్త ఖవాజా ఇంతియాజ్ ప్రోత్సాహంతో సలీమా అంపైర్‌గా ఎదగగా.. క్రికెటర్ కావాలన్న తమ కూతురు కైనత్ తన కలను నిజం చేసుకోవడంతో సహాయపడ్డారు ఈ దంపతులు. ఇక తండ్రిలాగే భర్త వకార్ సైతం తనకు అండగా నిలుస్తూ ఉండటంతో కైనత్ పాకిస్తాన్ ఆల్‌రౌండర్‌గా ఎదిగింది. విశేషమేమిటంటే.. ఈ తల్లీకూతుళ్లు ఇద్దరూ ఇప్పుడు ఆసియా కప్-2022 వంటి మెగా టోర్నీలో తమ వంతు బాధ్యతలు నిర్వర్తించేందుకు సిద్ధమయ్యారు. 41 ఏళ్ల వయసులో కల సాకారం బంగ్లాదేశ్‌లో జరుగుతున్న మహిళల ఆసియా కప్ టీ20 టోర్నీలో భాగంగా భారత్- శ్రీలంక మ్యాచ్‌తో అంతర్జాతీయ మ్యాచ్‌లో అంపైర్‌గా అరంగేట్రం చేసింది సలీమా. మరోవైపు సలీమా కూతురు కైనత్ పాకిస్తాన్ మహిళా జట్టులో సభ్యురాలిగా ఉంది. ఇలా ఇద్దరూ ఒకేసారి ప్రతిష్టాత్మక ఈవెంట్లో భాగం కావడంతో ఇంతియాజ్ కుటుంబంలో సంతోషాలు వెల్లివిరిశాయి. భర్తతో కైనత్(PC: Kainat Imtiaz Instagram) నాకు గర్వకారణం.. కైనత్ భావోద్వేగం ముఖ్యంగా 41 ఏళ్ల వయసులో తన తల్లి అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎదుర్కొన్న అనుభవాలు గుర్తుచేసుకుంటూ కైనత్ ఉద్వేగానికి లోనైంది.ఈ మేరకు ఇన్‌స్టా వేదికగా భావోద్వేగపూరిత నోట్ షేర్ చేసింది. ‘‘ఏసీసీ ఆసియా కప్ -2022లో అంపైర్‌గా మా మామ్! మా అమ్మ సాధించిన విజయం పట్ల నాకెంతో గర్వంగా ఉంది. పాకిస్తాన్‌కు ప్రాతినిథ్యం వహించాలన్న ఆమె కల, ఆమెతో పాటు నా కల కూడా నేడు నెరవేరింది. మేమిద్దరం మా దేశానికి ప్రాతినిథ్యం వహించడం ఆ భగవంతుడి దయ. మా అమ్మ ఈ స్థాయికి చేరుకోవడంలో అడుగడుగునా అండగా నిలబడ్డ మా నాన్నకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు. మమ్మల్ని ఆయన ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. నిరాశతో మేము వెనుదిరగకుండా నిరంతరం స్ఫూర్తి నింపుతూనే ఉంటారు. మా లోపాలు సరిదిద్దే క్రమంలో తనే మొదటి క్రిటిక్. వీళ్లందరూ మా జీవితాల్లో ఉండటం వల్లే ఆయన నా తండ్రి కావడం నిజంగా నా అదృష్టం. ఈ ప్రపంచంలో అందరికంటే నేనే అదృష్టవంతురాలిని అనిపిస్తోంది. అలాగే నా సోదరుడు.. మా నాన్నలానే నన్ను ప్రోత్సహించే భర్త.. వీళ్లందరూ నా జీవితంలో ఉండటం.. నా అదృష్టం’’ అంటూ కైనత్ ఉద్వేగానికి లోనైంది. ఆమె పోస్టుకు స్పందించిన నెటిజన్లు.. సలీమా, కైనత్‌లకు కంగ్రాట్స్ చెబుతున్నారు. అదే విధంగా పాకిస్తాన్ వంటి దేశంలో కట్టుబాట్లను దాటుకుని వారు ఎదిగేలా ప్రోత్సహించిన కైనత్ తండ్రిని ప్రశంసిస్తున్నారు. కాగా కైనత్ తండ్రి ఖవాజా స్పో టీచర్‌గా పనిచేశాడు. ఇక పాక్ ఆల్‌రౌండర్‌గా ఎదిగిన కైనత్.. భారత మహిళా పేసర్ ఝులన్ గోస్వామి తనకు స్ఫూర్తి అంటూ 2017 వరల్డ్‌కప్ సందర్భంగా తన మనసులోని మాట వెల్లడించింది. ఇటీవల కామన్వెల్త్ గేమ్స్-2022లో ఆడిన పాకిస్తాన్ జట్టులో చోటుదక్కించుకున్న కైనత్.. ఆసియా కప్-2022 టీ20 టోర్నీకి ఎంపికైన జట్టులో స్థానం సంపాదించుకుంది. చదవండి: RSWS 2022 Final: శ్రీలంకను చిత్తు చేసి ట్రోఫీని ముద్దాడిన ఇండియా లెజెండ్స్.. వరుసగా రెండోసారి National Games 2022: ఇద్దరూ ఒకప్పుడు టీమిండియా కెప్టెన్లే! ప్రేమా..పెళ్లి.. కవలలు.. మూడేళ్ల తర్వాత.. View this post on Instagram A post shared by Kainat Waqar (@kainatimtiaz23) -
Womens Asia Cup T20: చెలరేగిన జెమీమా
సిల్హెట్: ఈ సీజన్లో నిలకడగా రాణిస్తున్న జెమీమా రోడ్రిగ్స్ (53 బంతుల్లో 76; 11 ఫోర్లు, 1 సిక్స్) మరోసారి చెలరేగడంతో ఆసియా కప్ మహిళల టి20 టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. శనివారం జరిగిన తమ తొలి లీగ్ పోరులో భారత్ 41 పరుగులతో శ్రీలంకపై జయభేరి మోగించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన (6), షఫాలీ వర్మ (10) జట్టు స్కోరు 23 పరుగులకే పెవిలియన్ చేరారు. ఈ దశలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (30 బంతుల్లో 33; 2 ఫోర్లు, 1 సిక్స్)తో జతకట్టిన జెమీమా భారత్ స్కోరును మెరుపు వేగంతో నడిపించింది. ఇద్దరు కలిసి దాదాపు 13 ఓవర్లపాటు క్రీజులో నిలవడంతో లంక బౌలర్లకు కష్టాలు తప్పలేదు. మూడో వికెట్‌కు 92 పరుగులు జోడించారు. ఈ క్రమంలో జెమీమా 38 బంతుల్లోనే (7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది. నిజానికి భారత్ స్కోరు మరింత పెరగాలి. అయితే డెత్ ఓవర్లలో జెమీమాతో పాటు రిచా ఘోష్ (9), పూజ (1) విఫలమవడంతో ఆశించినన్ని పరుగులు రాలే దు. అనంతరం శ్రీలంక జట్టు 18.2 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లు హేమలత (3/15), పూజ (2/12), దీప్తి శర్మ (2/15) లంకను దెబ్బ తీశారు. హర్షిత (26; 5 ఫోర్లు), హాసిని పెరీరా (30; 3 ఫోర్లు) మినహా ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లే చేయలేకపోయారు. మరో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 9 వికెట్లతో థాయ్‌లాండ్‌పై గెలిచింది. -
Womens Asia Cup 2022: ఫేవరెట్‌గా భారత్
సిల్హెట్ (బంగ్లాదేశ్): మహిళల ఆసియా కప్ టోర్నీని 2004 నుంచి 2018 వరకు ఏడు సార్లు నిర్వహించారు. ఇందులో ఆరు సార్లు భారతే విజేత. ఈ టోర్నీలో మన ఆధిక్యం ఎలా సాగిందో చెప్పేందుకు ఇది చాలు. వన్డే ఫార్మాట్లో నాలుగు సార్లు చాంపియన్‌గా నిలిచిన మన అమ్మాయిలు టి20 ఫార్మాట్లో రెండు సార్లు టైటిల్ నెగ్గారు. గత టోర్నీలో మాత్రం అనూహ్యంగా ఫైనల్లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయి మన జట్టు రన్నరప్‌తో సంతృప్తి చెందింది. ఇప్పుడు మరోసారి తమ సత్తా చాటి ట్రోఫీ గెలుచుకునేందుకు హర్మన్‌ప్రీత్ కౌర్ సేన సిద్ధమైంది. జట్టు తాజా ఫామ్, ఇటీవలి కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకం, ఇంగ్లండ్‌పై వన్డేల్లో సాధించిన విజయాలు సహజంగానే భారత్‌ను ఫేవరెట్‌గా చూపిస్తున్నాయి. నేడు జరిగే తొలి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంకతో భారత్ ఆడుతుంది. ఆ తర్వాత టీమిండియా తమ తదుపరి మ్యాచ్‌ల్లో వరుసగా మలేసియా (3న), యూఏఈ (4న), పాకిస్తాన్ (7న), బంగ్లాదేశ్ (8న), థాయ్‌లాండ్ (10న) జట్లతో తలపడుతుంది. మొత్తం 7 జట్లు బరిలోకి దిగుతుండగా, భారత్‌తో పాటు బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, యూఏఈ, మలేసియా, థాయ్‌లాండ్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. యూఏఈ తొలిసారి ఆసియా కప్‌లో ఆడనుండగా, పురుషుల ఆసియా కప్‌లో రాణించిన అఫ్గానిస్తాన్‌కు మహిళల టీమ్ లేదు. రౌండ్ రాబిన్ ఫార్మాట్లో ప్రతీ జట్టు ఆరుగురు ప్రత్యర్థులతో ఒక్కో మ్యాచ్‌లో తలపడుతుంది. టాప్–4 టీమ్‌లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. అక్టోబర్ 15న ఫైనల్ నిర్వహిస్తారు. జోరు మీదున్న టీమ్... ఆసియా కప్ చరిత్రలో వన్డేలు, టి20లు కలిపి భారత్ 32 మ్యాచ్‌లు ఆడగా 30 మ్యాచ్‌లు గెలిచింది. ప్రస్తుత టీమ్ అదే తరహాలో పూర్తి స్థాయిలో పటిష్టంగా ఉంది. హర్మన్‌ప్రీత్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన అద్భుత ఫామ్‌లో ఉండగా ఇప్పుడు జెమీమా రోడ్రిగ్స్ చేరికతో బ్యాటింగ్ మరింత పటిష్టంగా మారింది. హేమలత, కీపర్ రిచా ఘోష్, దీప్తి శర్మ కూడా ధాటిగా ఆడగలరు. అయితే కొన్నాళ్ల క్రితం వరకు మెరుపు ఆరంభాలతో ఆకట్టుకున్న షఫాలీ వర్మ ఇటీవలి పేలవ ప్రదర్శనే జట్టును కాస్త ఆందోళనపరుస్తోంది. అయితే ఆమెలో సామర్థ్యానికి కొదవ లేదని, ఒక్క ఇన్నింగ్స్ తో పరిస్థితి మారుతుందని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ అండగా నిలిచింది. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో ఒకే ఒక మ్యాచ్ ఆడిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి సబ్బినేని మేఘనకు ఎన్ని అవకాశాలు లభిస్తాయో చూడాలి. బౌలింగ్‌లో కూడా భారత్ చక్కటి ఫామ్‌లో ఉంది. పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్ నిలకడగా రాణించడం జట్టుకు ప్రధాన బలంగా మారింది. మరో పేసర్ పూజ వస్త్రకర్ ఆమెకు అండగా నిలుస్తోంది. బంగ్లా గడ్డపై ప్రభావం చూపించగల స్పిన్ విభాగంలో మన బృందం మరింత పటిష్టంగా కనిపిస్తోంది. దీప్తి శర్మ, రాధా యాదవ్, ఆల్‌రౌండర్ స్నేహ్ రాణా సమష్టిగా జట్టును గెలిపించగలరు. గత ఆసియా కప్ ఫైనల్ ప్రదర్శనను పక్కన పెడితే మరోసారి భారత్‌కే టైటిల్ దక్కే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. -
'మిమ్మల్ని ఎవరూ పట్టించుకోరు.. మీ జీవితం బాగు చేసుకోండి'
టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ డెత్ ఓవరల్లో దారుణంగా విఫలమవుతున్నాడు. ఆసియాకప్-2022లోనూ డెత్ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించకున్న భువీ.. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లోనూ పూర్తిగా తేలిపోయాడు. ఆసీస్ ఇన్నింగ్స్ 19 ఓవర్ వేసిన భువీ.. ఏకంగా 16 పరుగులు ఇచ్చాడు. దీంతో మ్యాచ్ ఆసీస్ సొంతమైంది. ఈ క్రమంలో తన చెత్త బౌలింగ్ కారణంగానే భారత్ డెత్ ఓవర్లలో విఫలమైంది అని భువనేశ్వర్ నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ఈ క్రమంలో భువనేశ్వర్‌ను ట్రోల్‌చేస్తున్న ట్రోలర్స్‌కు అతడి భార్య నుపుర్ నగర్ గట్టి కౌంటర్ ఇచ్చింది. ట్రోల్స్ చేసేవాళ్ల గురించి పట్టించుకునేవారెవరూ లేరని, తమను విమర్శించే సమయాన్ని మీ జీవితం బాగు కోసం పెట్టండని సోషల్ మీడియా వేదికగా నగర్ ఫైర్ అయింది. "ఈ రోజుల్లో చాలా మంది ఏ పనికి రానివారు. వాళ్లు ఏమి చేయరు. ఖాళీగా సమయం గడుపుతూ ఉంటారు. కానీ ఒకరిపై విమర్శలు, ద్వేషం వ్యాప్తి చేయడానికి మాత్రం వాళ్లకు చాలా సమయం ఉంది. వారందరికీ నేను ఇచ్చే సలహా ఏమిటంటే.. మీ మాటల వల్ల ఎవరూ ప్రభావితం కారు. అంతేకాకుండా మీ ట్రోల్స్‌ను కూడా ఎవరూ పట్టించుకోరు. కాబట్టి ఇతరలను విమర్శించే సమయాన్ని మీ జీవితాలను బాగు చేసుకోవడం కోసం మీ జీవితాలను బాగు చేసుకోవడం. అది మీకు చాలా కష్టమే అని నాకు తెలుసు" అని నగర్ ఇన్స్టాగ్రామ్ రాసుకొచ్చింది. చదవండి: Ind vs Aus 2nd T20: టీమిండియాకు గుడ్ న్యూస్.. అతడు వచ్చేస్తున్నాడు! -
ఆసియా కప్‌కు టీమిండియా మహిళల జట్టు.. పాక్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
అక్టోబర్ ఒకటి నుంచి జరగనున్న మహిళల ఆసియా కప్ టి20 టోర్నీకి బీసీసీఐ టీమిండియా జట్టును బుధవారం ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టుకు హర్మన్‌ప్రీత్ నాయకత్వం వహించనుండగా.. స్మృతి మందాన వైస్ కెప్టెన్‌గా నియమితురాలైంది. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో భారత మహిళల జట్టులో ఉన్న ఆటగాళ్లలో దాదాపు అందరూ ఆసియా కప్ టోర్నీకి ఎంపికయ్యారు. గాయంతో ఇంగ్లండ్ టూర్‌కు దూరమైన జెమిమా రోడ్రిగ్స్ తిరిగి జట్టులోకి వచ్చింది. రేణుకా సింగ్, మేఘనా సింగ్, పూజా వస్రాకర్లు పేస్ బాధ్యతలు మోయనుండగా.. రాజేశ్వరి గైక్వాడ్, రాదా యాదవ్, స్నేహ్ రాణాలు స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారు. ఇక ఆల్‌రౌండర్ల విభాగంలో దీప్తి శర్మ సేవలందించనుంది. బ్యాటింగ్‌లో స్మృతి మందాన, షెఫాలీ వర్మ, సబ్బినేని మేఘన, దయాలన్ హేమలత, కేపీ నేవిగర్లు బ్యాటర్లుగా ఎంపిక చేసింది. ఇక తాంతియా బాటియా, సిమ్రన్ దిల్ బహుదూర్లను స్టాండ్ బై ప్లేయర్లుగా ఎంపిక చేసింది. మహిళల ఆసియా కప్ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను ఆసియా క్రికెట్ సంఘం అధ్యక్షుడు జై షా మంగళవారం విడుదల చేశారు. ఇక అక్టోబర్ 1న బంగ్లాదేశ్ వేదికగా ఆసియా కప్ టోర్నీ ప్రారంభం కానుంది. 15 రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో ఏడు జట్లు పోటీపడుతున్నాయి. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, యూఏఈ, థాయ్‌లాండ్, మలేషియాలు మొదట రౌండ్ రాబిన్ లీగ్‌లో తలపడుతాయి. వీటిలో టాప్-4లో నిలిచిన జట్లు సెమీస్‌కు చేరుతాయి. టీమిండియా మహిళలు టోర్నీలో తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 1న శ్రీలంకతో ఆడనుంది. ఆపై చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో అక్టోబర్ 7న తలపడనుంది. ఆ తర్వాత అక్టోబర్ 8న బంగ్లాదేశ్‌తో, 10న థాయ్‌లాండ్‌తో ఆడనుంది. ఆసియాకప్‌కు టీమిండియా మహిళల జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), దీప్తి శర్మ, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, సబ్బినేని మేఘన, రిచా ఘోష్ (వికెట్ కీపర్), స్నేహ రాణా, దయాళన్ హేమలత, మేఘనా సింగ్, రేణుకా ఠాకూర్, రాజేశ్వరి వస్త్రాకర్, పూజా వస్త్రాకర్ గయాక్వాడ్, రాధా యాదవ్, కె.పి. నవగిరే స్టాండ్‌బై ప్లేయర్లు: తానియా సప్నా భాటియా, సిమ్రాన్ దిల్ బహదూర్ 🚨 NEWS 🚨: Team India (Senior Women) squad for ACC Women’s T20 Championship announced. #TeamIndia | #WomensAsiaCup | #AsiaCup2022 More Details 🔽 https://t.co/iQBZGVo5SK pic.twitter.com/k6VJyRlRar — BCCI Women (@BCCIWomen) September 21, 2022 చదవండి: ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి..? పిల్లలు జడుసుకుంటారు! భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్.. హెచ్‌సీఏలో టికెట్ల రగడ -
యూకేలో ఆలయాలపై దాడులు... కేంద్రం ఖండన
లండన్: యూకేలోని లీసెస్టర్ నగరంలోని భారతీయులపై దాడులు, అక్కడి ఆలయం ఆవరణలో విధ్వంసం ఘటనలను భారత దౌత్య కార్యాలయం తీవ్రంగా ఖండించింది. దాడులకు కారకులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని యూకే యంత్రాంగాన్ని డిమాండ్ చేసింది. బాధితులకు రక్షణ కల్పించాలని కోరింది. గత నెలలో దుబాయ్‌లో జరిగిన ఆసియా కప్ ఇండియా–పాకిస్తాన్ మ్యాచ్ అనంతరం నగరంలోని హిందూ ముస్లిం గ్రూపుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. లీసెస్టర్‌లోని ఆలయం వద్ద ఎగురవేసిన కాషాయ జెండాను కొందరు చించి వేస్తున్నట్లున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. 15 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. -
T20 WC: యువ పేసర్‌పై రోహిత్ ప్రశంసలు.. అందుకే వాళ్లంతా ఇంట్లో కూర్చుని ఉన్నా!
T20 World Cup 2022- Rohit Sharma- Arshdeep Singh: టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌పై కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు. ఆసియా కప్-2022 టీ20 టోర్నీలో ఈ యువ బౌలర్ బౌలింగ్ చేసిన విధానం అమోఘమని కొనియాడాడు. తీవ్రమైన ఒత్తిడిలోనూ యార్కర్లు సంధించి ప్రత్యర్థికి చెమటలు పట్టించగల ప్రతిభ అర్ష్‌దీప్ సొంతమని ప్రశంసించాడు. టీ20 ప్రపంచకప్-2022 సన్నాహకాల్లో భాగంగా టీమిండియా స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మొహాలీ వేదికగా మంగళవారం ఆరంభం కానున్న తొలి టీ20కి ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా.. ఓపెనింగ్ జోడీపై కీలక వ్యాఖ్యలు చేశాడు. అంత తేలికేం కాదు! ప్రపంచకప్ టోర్నీలో కేఎల్ రాహుల్ ఓపెనర్‌గానే బరిలోకి దిగుతాడని.. విరాట్ కోహ్లి ప్రత్యామ్నాయ ఓపెనర్ మాత్రమేనని స్పష్టం చేశాడు. ఇక అర్ష్‌దీప్ గురించి మాట్లాడుతూ.. ‘‘అర్ష్‌దీప్ బౌలింగ్ చేస్తున్న విధానం బాగుంది. అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన మొదటి ఏడాదిలోనే.. ఒత్తిడిని అధిగమిస్తూ ముందుకు సాగడం మామూలు విషయం కాదు. అర్ష్‌దీప్ సింగ్ తను చాలా తెలివైన వాడు. జట్టులో ఎప్పుడైతే లెఫ్టార్మ్ సీమర్ అవసరం ఎక్కువగా ఉందో అప్పుడే.. ఐపీఎల్లో తన ప్రదర్శనతో ప్రతిభను నిరూపించుకుని టీమిండియాలో అరంగేట్రం చేశాడు. అంచనాలకు తగ్గట్లు రాణిస్తున్నాడు. అతడి రాకతో మా బౌలింగ్ విభాగం పటిష్టమైంది’’ అని రోహిత్ పేర్కొన్నాడు. ఇక ఆసియా కప్-2022 సూపర్- దశలో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో అసిఫ్ అలీ క్యాచ్ నేలపాలు చేసిన కారణంగా అర్ష్‌దీప్ విమర్శల పాలైన సంగతి తెలిసిందే. అదే విధంగా శ్రీలంకతో మ్యాచ్‌లోనూ 3.5 ఓవర్లు బౌలింగ్ చేసి ఏకంగా 40 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో.. అతడి ఆట తీరుపై విమర్శలు మరింత పెరిగాయి. అందుకే వాళ్లంతా ఇంట్లో కూర్చుని ఉన్నా.. ఈ పరిణామాల నేపథ్యంలో రోహిత్ మాట్లాడుతూ.. ‘‘తనకు ఆత్మవిశ్వాస మెండు. చాలా మంది ఆటగాళ్లు ఇంట్లో కూర్చుని ఉన్నా జట్టులో అతడికి చోటు దక్కడానికి కారణం అదే. కెరీర్ తొలినాళ్లలోనే అతడు పరిణతితో వ్యవహరిస్తున్నాడు. కెప్టెన్‌గా నేను.. కోచ్ ద్రవిడ్ భాయ్ అర్ష్‌దీప్ బౌలింగ్‌తో చాలా సంతృప్తిగా ఉన్నాము’’ అని చెప్పుకొచ్చాడు. ఇక టీ20 ప్రపంచకప్ జట్టులో 23 ఏళ్ల ఫాస్ట్‌బౌలర్ అర్ష్‌దీప్‌నకు చోటు దక్కిన విషయం తెలిసిందే. అయితే, ఆసీస్‌తో సిరీస్‌లో మాత్రం అతడికి విశ్రాంతి దొరికింది. చదవండి: Ind Vs Aus: యువీ, భజ్జీకి సముచిత గౌరవం.. ఆసీస్‌తో తొలి టీ20కి ముందు.. -
‘కోహ్లి ప్రత్యామ్నాయ ఓపెనర్’
మొహాలి: ఆసియా కప్‌లో అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చి విరాట్ కోహ్లి సెంచరీ సాధించాడు. దాంతో టి20ల్లో రోహిత్‌తో కలిసి కోహ్లి ఓపెనింగ్ చేయాలనే సూచనలు అన్ని వైపుల నుంచి వస్తున్నాయిు. కేఎల్ రాహుల్ వేగంగా ఆడలేడనే కారణం కూడా దానికి జోడించారు. అయితే దీనిపై కెప్టెన్ రోహిత్ శర్మ పూర్తి స్పష్టతనిచ్చాడు. రాహుల్‌కు మద్దతుగా నిలుస్తూ అతనే ప్రధాన ఓపెనర్ అని, కోహ్లిని తాము మూడో ఓపెనర్‌గానే చూస్తున్నామని వెల్లడించాడు. అవసరమైతే కొన్ని మ్యాచ్‌లలో కోహ్లికి ఓపెనింగ్ అవకాశం ఇస్తామని, అయితే రాహుల్ విలువేంటో తమకు బాగా తెలుసని చెప్పాడు. ‘ప్రపంచకప్‌లాంటి టోర్నీకి ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉండటం మంచిదే. ఏ స్థానంలోనైనా ఆడేందుకు ఎవరైనా సిద్ధంగా ఉండాలి. అయితే ఒకసారి ఏదైనా ప్రయోగం చేశామంటే అదే శాశ్వతమని కాదు. మెగా టోర్నీకి ముందు ఆరు మ్యాచ్‌లు ఆడతాం కాబట్టి కోహ్లి ఓపెనింగ్ చేయవచ్చు కూడా. కానీ అతడిని మేం మూడో ఓపెనర్‌గానే చూస్తున్నాం. నాకు తెలిసి ప్రపంచకప్‌లో రాహుల్ ఓపెనర్‌గానే ఆడతాడు. అతనో మ్యాచ్ విన్నర్. గత రెండేళ్లుగా అతని రికార్డు చూస్తే రాహుల్ ఎంత కీలక ఆటగాడో తెలుస్తుంది. ఒక మ్యాచ్‌లో ఒకరు బాగా ఆడారని మరో బ్యాటర్‌ను తక్కువ చేస్తే ఎలా. బయట ఏం మాట్లాడుకుంటున్నారో మాకు బాగా తెలుసు. ఓపెనింగ్ గురించి మేం చాలా స్పష్టంగా ఉన్నాం. ఎలాంటి గందరగోళం లేదు’ అని రోహిత్ వ్యాఖ్యానించాడు. ఆసియాకప్‌లో కొన్ని వ్యతిరేక ఫలితాలు ఎదురైనా...కొత్త తరహాలో దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించామని, ఇకపై కూడా అదే శైలిని కొనసాగిస్తామని కూడా రోహిత్ అన్నాడు. మరోవైపు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్‌లతోపాటు టి20 ప్రపంచకప్‌లో భారత ఆటగాళ్లు ధరించే కొత్త జెర్సీని ఆదివారం బీసీసీఐ ఆవిష్కరించింది. -
T20 World Cup 2022: జట్టును ప్రకటించిన శ్రీలంక.. స్టార్ పేసర్ ఎంట్రీ
ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్-2022కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. కాగా గాయం కారణంగా ఆసియాకప్‌కు దూరమైన పేసర్లు దుష్మంత చమీరా, లహురు కుమార తిరిగి జట్టులోకి వచ్చారు. అయితే వారిద్దరూ తమ ఫిట్నెస్ నిరూపించుకుంటేనే తుది జట్టులోకి చోటు దక్కే అవకాశం ఉంది. అదే విధంగా ఆసియాకప్‌లో అదరగొట్టిన పేసర్లు మధుశంక, ప్రమోద్ మధుషాన్ కూడా ఈ మెగా ఈవెంట్‌కు ఎంపికయ్యారు. ఇక ఆసియాకప్-2022లో అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగిన శ్రీలంక ఏకంగా టైటిల్‌ను ఎగరేసుకుపోయిన సంగతి తెలిసిందే. కాగా షనక సారథ్యంలోని శ్రీలంక జట్టు టీ20 ప్రపంచకప్-2022లో తొలుత క్వాలిఫియింగ్ రౌండ్లో తలపడనుంది. టీ20 ప్రపంచకప్‌కు శ్రీలంక జట్టు: దసున్ షనక (కెప్టెన్), దనుష్క గుణతిలక, పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్, చరిత్ అసలంక, భానుక రాజపక్స, ధనంజయ డి సిల్వా, వనిందు హసరంగా, మహేశ్ తీక్షణ, జెఫ్రీ వాండర్సే, చమిక కరుణరత్నే, దుష్మంత చమీర (ఫిట్‌నెస్‌కు లోబడి), లహిరు కుమార(ఫిట్‌నెస్‌కు లోబడి) దిల్షన్ మధుశంక, ప్రమోద్ మదుషన్ స్టాండ్‌బై ఆటగాళ్లు: అషెన్ బండార, ప్రవీణ్ జయవిక్రమ, దినేష్ చండిమాల్, బినురా ఫెర్నాండో, నువానీడు ఫెర్నాండో Here's your 🇱🇰 squad for the ICC Men's T20 World Cup! ⬇️#RoaringForGlory #T20WorldCup pic.twitter.com/GU7EIl6zOw — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) September 16, 2022 చదవండి: 'అతడిని టీ20 ప్రపంచకప్‌కు ఎంపికచేయాల్సింది.. బాబర్‌కు సపోర్ట్‌గా ఉండేవాడు' -
కోహ్లి, రోహిత్‌లను అవుట్ చేస్తే.. సగం జట్టు పెవిలియన్ చేరినట్లే! అలా అనుకుని..
Legends League Cricket 2022- Asghar Afghan- Team India- T20 World Cup 2022: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ సారథి, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి గురించి అఫ్గనిస్తాన్ మాజీ కెప్టెన్ అస్గర్ అఫ్గన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్‌తో మ్యాచ్‌లో ఈ ఇద్దరిని అవుట్ చేస్తే సగం జట్టును పెవిలియన్‌కు పంపినట్లే భావించేవాళ్లమని పేర్కొన్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల సత్తా వీరి సొంతమంటూ హిట్‌మ్యాన్ రోహిత్, రన్‌మెషీన్ కోహ్లిలను కొనియాడాడు. గంభీర్ సారథ్యంలో.. లెజెండ్స్ లీగ్ క్రికెట్-2022లో అస్గర్ అఫ్గన్ ఇండియా క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ సారథ్యంలో అతడు ఆడనున్నాడు. ఈ నేపథ్యంలో ఇండియాకు వచ్చిన అస్గర్ హిందుస్థాన్ టైమ్స్‌తో ప్రత్యేకంగా ముచ్చటించాడు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఆసియా కప్-2022లో టీమిండియా ప్రదర్శన, టీ20 ప్రపంచకప్-2022లో రోహిత్ సేన విజయావకాశాలపై తన అభిప్రాయాలు తెలిపాడు. టీమిండియాతో మ్యాచ్ సందర్భంగా.. టీ20లలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలను ఎదుర్కొనేందుకు ఎలాంటి వ్యూహాలు రచించేవాళ్లు అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ఇండియాతో మ్యాచ్ అంటేనే.. మా మొదటి ప్రాధాన్యం.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వికెట్లే! కోహ్లిని ఆపడం కష్టం! వాళ్లిద్దరినీ అవుట్ చేస్తే సగం జట్టును అవుట్ చేసినట్లే అని అనుకునేవాళ్లం. ప్రపంచంలోని మేటి బ్యాటర్లు అయిన వీళ్లిద్దరి గురించే మా చర్చంతా! ఎందుకంటే ఒంటిచేత్తో వాళ్లు మ్యాచ్‌ను మలుపు తిప్పగలరు! అందుకే... ముందు రోహిత్, కోహ్లిలను అవుట్ చేస్తే చాలు అనుకునేవాళ్లం. లేదంటే.. టీమిండియాను ఎదుర్కోవడం మరింత కష్టతరంగా మారుతుందని మాకు తెలుసు. ముఖ్యంగా విరాట్ కోహ్లి.. ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే తనని ఆపడం కష్టం. రోహిత్, కోహ్లిలను పెవిలియన్‌కు పంపితే వన్డేల్లో టీమిండియా స్కోరులో 100- 120... టీ20లలో 60- 70 పరుగులు తగ్గించవచ్చని భావించేవాళ్లం’’ అని అస్గర్ అఫ్గన్ చెప్పుకొచ్చాడు. ఆసియాకప్‌లో ఓటములకు అదే కారణం! అయితే.. ఇక ఆసియా కప్-2022లో రోహిత్ సేన సూపర్-4లో వరుస మ్యాచ్‌లు ఓడటానికి రవీంద్ర జడేజా లేకపోవడం కూడా ఒక కారణమని అస్గర్ అభిప్రాయపడ్డాడు. అయితే, ఈ టోర్నీలో ఓడినంత మాత్రాన టీమిండియాను తక్కువగా అంచనా వేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న వరల్డ్‌కప్ రూపంలో వారికి మంచి అవకాశం వచ్చిందని.. కచ్చితంగా టీమిండియా ఈ ఛాన్స్‌ను ఉపయోగించుకుంటుందని చెప్పుకొచ్చాడు. ఇక గత కొంతకాలంగా నిలకడలేమి ఫామ్‌తో ఇబ్బంది పడిన విరాట్ కోహ్లి.. ఆసియాకప్‌లో అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో అజేయ శతకంతో రాణించి విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. గతేడాది మేలో కెప్టెన్సీ కోల్పోయిన అస్గర్ అఫ్గన్.. టీ20 ప్రపంచకప్ టోర్నీ-2021లో నమీబియాతో మ్యాచ్‌కు ముందు అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. చదవండి: T20 WC: ఇదే లాస్ట్ ఛాన్స్! అదే జరిగితే బాబర్ ఆజం కెప్టెన్సీ కోల్పోవడం ఖాయం! Ind Vs Aus: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా.. పూర్తి షెడ్యూల్, జట్లు.. ఇతర వివరాలు! -
T20 WC: ఇదే లాస్ట్ ఛాన్స్! అదే జరిగితే బాబర్ ఆజం కెప్టెన్సీ కోల్పోవడం ఖాయం!
T20 World Cup 2022- Babar Azam: పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఆసియా కప్-2022 టీ20 టోర్నీలో స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్-3లో ఉన్న ఈ స్టార్ ఓపెనర్ ఈ మెగా ఈవెంట్లో చేసిన మొత్తం పరుగులు 68 మాత్రమే! ఆరు ఇన్నింగ్స్‌లో కలిపి ఇలా నామమాత్రపు స్కోరుకే పరిమితమైన బాబర్ ఆజం.. కెప్టెన్‌గానూ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. విమర్శల జల్లు! ముఖ్యంగా.. ఫైనల్లో శ్రీలంక చేతిలో పాక్ ఓటమి కారణంగా తీవ్ర విమర్శల పాలయ్యాడు ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్. గెలుస్తామనుకున్న మ్యాచ్ ఓడిపోవడంతో అభిమానులు సహా ఆ జట్టు మాజీ క్రికెటర్లు తమ సారథి తీరుపై మండిపడ్డారు. ఇక ఆసియాకప్- 2022లో రన్నరప్‌తో సరిపెట్టుకున్న పాకిస్తాన్ ప్రస్తుతం.. అక్టోబరు 16 నుంచి ఆరంభం కానున్న టీ20 ప్రపంచకప్-2022కు సిద్ధమవుతోంది. ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న ఈ ఐసీసీ ఈవెంట్‌కు ఇప్పటికే 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. బాబర్‌కు ఇదే లాస్ట్ ఛాన్స్! ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా.. బాబర్ ఆజం భవితవ్యంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ ఈ మెగా టోర్నీలో గనుక పాక్ జట్టు రాణించకపోతే బాబర్ ఆజం కెప్టెన్సీ కోల్పోయే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఈ మాజీ లెగ్ స్పిన్నర్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘బాబర్ ఆజం ప్రస్తుతం ఫామ్‌లో లేడు. అతడి కెప్టెన్సీపై కూడా విమర్శలు వస్తున్నాయి. అలా అయితే కెప్టెన్సీ కోల్పోతాడు! నాకు తెలిసి కెప్టెన్‌గా బాబర్‌కు ఇదే ఆఖరి అవకాశం. ఒకవేళ ప్రపంచకప్‌లో పాక్ మెరుగైన ప్రదర్శన కనబరచకపోతే.. అతడిని సారథ్య బాధ్యతల నుంచి తప్పించే అవకాశం ఉంటుంది. దీంతో సహజంగానే అతడు తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయి ఉంటాడు. బాబర్ గొప్ప క్రికెటర్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే, ప్రస్తుత పరిస్థితులు మాత్రం అతడికి అనుకూలంగా లేవు’’ అని చెప్పుకొచ్చాడు. జట్టు ఎంపికలో కెప్టెన్‌గా తన పాత్ర కూడా ఉంటుందని.. కాబట్టి ఎక్కడ ఏ పొరపాటు జరిగినా బాబర్ జవాబుదారీగా ఉండక తప్పదని పేర్కొన్నాడు. ఓపెనర్‌గా వద్దు! అదే విధంగా.. ఓపెనర్‌గా విఫలమవుతున్న కారణంగా బాబర్ ఆజం.. బ్యాటింగ్ ఆర్డర్లో తన స్థానాన్ని మార్చుకుంటే బాగుంటుందని డానిష్ కనేరియా సూచించాడు. ‘‘మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజం స్ట్రైక్ రేటు ఆందోళన కలిగించే అంశం. పవర్‌ప్లేలో ఉండే సౌలభ్యాన్ని కూడా వారు వినియోగించుకోలేకపోతున్నారు. ఓపెనర్‌గా పరుగులు సాధించలేకపోతున్న బాబర్ ఆజం.. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయేమో! ఇంగ్లండ్‌తో సిరీస్‌లో వారు ఈ ప్రయోగాలు చేయవచ్చు. రిజ్వాన్‌కు విశ్రాంతినిచ్చారు కాబట్టి కొత్త కాంబినేషన్లు ట్రై చేస్తే బాగుంటుంది’’ అని కనేరియా అభిప్రాయపడ్డాడు. కాగా ప్రపంచకప్ కంటే ముందు పాకిస్తాన్ స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఏడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఇదిలా ఉంటే.. గతేడాది ప్రపంచకప్ టోర్నీలో లీగ్ దశలో రాణించిన బాబర్ ఆజం బృందం సెమీస్‌లో ఓడి ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. చదవండి: Ind Vs Aus: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా.. పూర్తి షెడ్యూల్, జట్లు.. ఇతర వివరాలు! ఇంగ్లండ్ క్రికెటర్ల పెద్ద మనసు.. -
T20 WC 2022: ‘బాబర్ ఆజం, రిజ్వాన్‌ను నమ్ముకుంటే పాక్ ఏ టోర్నీ గెలవదు’
Asia Cup 2022- Pakistan- T20 World Cup 2022: బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్‌ను నమ్ముకుంటే పాకిస్తాన్ ఏ టోర్నీ కూడా గెలవలేదంటూ ఆ జట్టు మాజీ పేసర్ అకిబ్ జావేద్ అన్నాడు. టీ20 ఫార్మాట్లో ప్రపంచంలోని టాప్ బ్యాటర్లుగా పేరొందినా జట్టుకు మాత్రం ఉపయోగపడే ఇన్నింగ్స్ ఆడటం లేదంటూ విమర్శించాడు. ఈ ఓపెనర్లతో పాకిస్తాన్ ఐసీసీ టోర్నీలు గెలిచే అవకాశం లేదంటూ వ్యాఖ్యానించాడు. విఫలమైన బాబర్ ఆజం! ఆసియా కప్-2022 టోర్నీలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. ఆడిన ఆరు ఇన్నింగ్స్‌లో ఈ ‘స్టార్ ఓపెనర్’ చేసిన మొత్తం పరుగులు 68. ఈ నేపథ్యంలో ఐసీసీ తాజా టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి దిగజారాడు. అదరగొట్టిన రిజ్వాన్.. అయినా! ఇదిలా ఉంటే.. మరో ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ మాత్రం 281 పరుగులతో రాణించాడు. ఆసియా కప్-2022 టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. కీలక మ్యాచ్‌లలో జట్టు కష్టాల్లో కూరుకుపోయిన వేళ తన ఇన్నింగ్స్‌తో విజయాలు అందించాడు. అయితే, ఫైనల్లో శ్రీలంకతో మ్యాచ్‌లో మాత్రం మ్యాజిక్ రిపీట్ చేయలేకపోయాడు. 49 బంతుల్లో 55 పరుగులు చేశాడు. ఎప్పుడు ఎలా ఆడాలో తెలియదు! దూకుడేది? ఈ నేపథ్యంలో పాక్ మాజీ పేసర్ అకిబ్ జావేద్.. బాబర్ ఆజం, రిజ్వాన్ స్ట్రైక్‌రేటును ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈ ఇద్దరు ఓపెనర్లు మేజర్ టోర్నీల్లో గెలిపించలేరు. బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ ప్రపంచంలో నంబర్ 1,2 ఆటగాళ్లుగా పేరొందారు. అలాంటి బ్యాటర్లకు ఎప్పుడు ఎలా ఆడాలో తెలియాలి కదా! వైస్ కెప్టెన్ రిజ్వాన్ విషయానికొస్తే.. ఆసియా కప్‌లో శ్రీలంకతో ఫైనల్ మ్యాచ్‌లో.. 15 ఓవర్ల పాటు ఆడాడు. అవసరమైన రన్‌రేటు 8 ఉన్నప్పటి నుంచి అది 17కు పెరిగేంత వరకు ఉన్నాడు. ఇలాంటి ఆట తీరుతో వీళ్లేం గెలుస్తారు’’ అని జావేద్ పెదవి విరిచాడు. అతడి కెరీర్‌ను నాశనం చేస్తున్నారు! అదే విధంగా ఫఖర్ జమాన్‌ను మూడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడంపై స్పందిస్తూ.. ‘‘మూడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపి అతడి కెరీర్‌ను నాశనం చేస్తున్నారు. నిజానికి బాబర్ లేదంటే రిజ్వాన్‌తో కలిసి ఓపెనర్‌గా వస్తేనే జట్టుకు ఉపయోగం ఉంటుంది. ఓపెనర్‌గా తను రాణించగలడు’’ అని అకిబ్ జావేద్ అభిప్రాయపడ్డాడు. కాగా ఆసియాకప్-2022 రన్నరప్‌గా నిలిచిన పాకిస్తాన్.. ఆస్ట్రేలియా వేదికగా ఆరంభం కానున్న టీ20 ప్రపంచకప్-2022 టోర్నీకి సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అకిబ్ జావేద్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. చదవండి: T20 WC 2022: ‘ప్రపంచకప్ తర్వాత కోహ్లి రిటైర్మెంట్ ప్రకటిస్తాడు’! ఎందుకంటే! 'కర్మ ఫలితం అనుభవించాల్సిందే'.. ఎంతైనా పాక్ క్రికెటర్! -
దూసుకొస్తున్న రన్ మెషీన్.. ఆఫ్ఘన్‌పై సెంచరీతో భారీ జంప్
Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తాజా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారీ జంప్ చేశాడు. ఆసియా కప్-2022లో ఆఫ్ఘనిస్తాన్పై సూపర్ శతకం (61 బంతుల్లో 122 నాటౌట్) సాధించి మళ్లీ టాప్-10 దిశగా దూసుకొస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 1020 రోజుల తర్వాత సెంచరీ సాధించిన విరాట్.. గత వారం ర్యాంకింగ్స్‌తో పోలిస్తే 14 స్థానాలు మెరుగుపర్చుకుని 15వ స్పాట్‌కు చేరుకున్నాడు. ఆఫ్ఘన్‌పై సెంచరీ సాధించడంతో కెరీర్లో 71వ శతకాన్ని, అంతర్జాతీయ టీ20ల్లో తొలి శతకాన్ని నమోదు చేసిన విరాట్.. ఇదే జోరును త్వరలో జరుగనున్న టీ20 సిరీస్‌ల్లోనూ (ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా) కొనసాగిస్తే తిరిగి అగ్రపీఠాన్ని చేరుకోవడం ఖాయం. Big rewards for star performers from the #AsiaCup2022 in the latest update of the @MRFWorldwide ICC Men's T20I Player Rankings 📈 Details ⬇️ https://t.co/B8UAn4Otze — ICC (@ICC) September 14, 2022 తాజా ర్యాంకింగ్స్‌లో ఇవాళ (సెప్టెంబర్ 14) పుట్టిన రోజు జరుపుకుంటున్న టీమిండియా విధ్వంసకర బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ 4వ స్థానంలో కొనసాగుతుండగా.. ఆసియా కప్‌లో దారుణంగా విఫలమైన పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఓ స్థానాన్ని కోల్పోయి మూడో ప్లేస్‌కు దిగజారాడు. పాక్ వికెట్‌కీపర్ మహ్మద్ రిజ్వాన్ తన అగ్రస్థానాన్ని కాపాడుకోగా.. సఫారీ బ్యాటర్ ఎయిడెన్ మార్క్రమ్ రెండో స్థానానికి ఎగబాకాడు. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ హీరో, శ్రీలంక బ్యాటర్ భానుక రాజపక్ష.. 34 స్థానాలు మెరుగుపర్చుకుని 34వ స్పాట్‌కు చేరుకోగా.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 14వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఆసియా కప్‌లో ఆఫ్ఘన్‌పై సంచలన ప్రదర్శన (5/4) చేసిన టీమిండియా స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్ టాప్-10లోకి దూసుకొచ్చాడు. భువీ.. 11వ స్థానం నుంచి సెవెన్త్ ప్లేస్‌కు చేరుకున్నాడు. టీమిండియా నుంచి టాప్-10లో నిలిచిన ఏకైక బౌలర్ భువీ ఒక్కడే కావడం విశేషం. ఈ జాబితాలో ఆసీస్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. సఫారీ స్పిన్నర్ తబ్రేజ్ షంషి రెండులో, ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ మూడో ప్లేస్‌లో కొనసాగుతున్నారు. ఆసియా కప్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ విన్నర్ వనిందు హసరంగ (శ్రీలంక) తొమ్మిదో స్థానం నుంచి ఆరో ప్లేస్‌కు ఎగబాకాడు. -
T20 WC 2022: ప్రపంచకప్‌నకు బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. మాజీ కెప్టెన్‌పై వేటు
ICC Men's T20 World Cup 2022- Bangladesh Squad: టీ20 ప్రపంచకప్-2022 టోర్నీకి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. ఈ ఐసీసీ మెగా ఈవెంట్లో పాల్గొనేందుకు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసినట్లు తెలిపింది. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేసింది. కాగా గత కొన్నాళ్లుగా ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న మాజీ కెప్టెన్ మహ్మదుల్లా రియాద్‌కు సెలక్టర్లు మొండిచేయి చూపారు. ఇక మూడేళ్ల తర్వాత.. ఆసియా కప్-2022 టోర్నీలో భాగంగా జట్టులోకి వచ్చిన సబీర్ రెహమాన్ మాత్రం తన స్థానాన్ని కాపాడుకున్నాడు. ఈ ఈవెంట్లో ఒకే ఒక మ్యాచ్ ఆడిన అతడికి ప్రపంచకప్ జట్టులో చోటు దక్కడం విశేషం. మహ్మదుల్లా అదే విధంగా గాయాల నుంచి కోలుకున్న నూరుల్ హసన్ సోహన్, లిటన్ దాస్, యాసిర్ అలీ చౌదరి, హసన్ మహ్మూద్ తిరిగి జట్టులోకి వచ్చారు. ఇక ఆసియా కప్‌లో ఆడిన ఆల్‌రౌండర్ మెహెదీ హసన్‌కు మాత్రం ప్రధాన జట్టులో చోటుదక్కకపోవడం గమనార్హం. అతడిని స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపిక చేశారు సెలక్టర్లు. ఇక ఆసియా కప్-2022లో బంగ్లాదేశ్ కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. దారుణమైన ప్రదర్శనతో తీవ్ర విమర్శలు మూటగట్టుకుంది. టీ20 వరల్డ్‌కప్-2022కు బంగ్లాదేశ్ జట్టు: షకీబ్ అల్ హసన్(కెప్టెన్), సబీర్ రెహమాన్, మెహెదీ హసన్ మిరాజ్, అఫిఫ్ హొసేన్ ధ్రూబో, మొసద్దెక్ హొసేన్ సైకత్, లిటన్ దాస్, యాసిర్ అలీ చౌదరి, నూరుల్ హసన్ సోహన్, ముస్తాఫిజుర్ రెహమాన్, మహ్మద్ సైఫుద్దీన్, నసూమ్ అహ్మద్, హసన్ మహ్మూద్, నజ్మల్ హొసేన్ షాంటో, ఇబాదత్ హొసేన్, టస్కిన్ అహ్మద్. స్టాండ్ బై ప్లేయర్లు: షోరిఫుల్ ఇస్లాం, రిషద్ హొసేన్, మెహెదీ హసన్, సౌమ్య సర్కార్. చదవండి: Ind Vs Aus: భారత్‌తో సిరీస్.. ఆసీస్‌కు భారీ షాక్! ముగ్గురు స్టార్ ప్లేయర్లు అవుట్! Ind Vs Pak: సరిగ్గా నిద్రపోలేదు.. ట్రోల్స్ గురించి కాదు! తను ఎక్కువగా బాధపడ్డది అందుకే! -
Ind Vs Pak: సరిగ్గా నిద్రపోలేదు.. ట్రోల్స్ గురించి కాదు! తను ఎక్కువగా బాధపడ్డది అందుకే!
Asia Cup 2022- India vs Pakistan, Super Four Match: ‘‘ఆరోజు పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో క్యాచ్ నేలపాలు చేసిన కారణంగా తాను ఆ రాత్రి సరిగా నిద్ర కూడా పోలేదని అర్ష్‌దీప్ నాతో చెప్పాడు. అందరిలాగే తను కూడా కాస్త టెన్షన్ పడ్డాడు. కానీ మేము అతడికి నచ్చజెప్పాం. నిజానికి తను హార్డ్‌వర్కర్. ఇలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోవద్దని తనతో అన్నాము’’ అని టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ చిన్ననాటి కోచ్ జశ్వంత్ రాయ్ అన్నాడు. పాక్‌తో మ్యాచ్‌లో ఓటమిపాలైనందుకు అర్ష్‌దీప్ ఎంతగానో బాధపడ్డాడని చెప్పుకొచ్చాడు. ఆ ఒక్క క్యాచ్ మిస్ కావడంతో.. ఆసియా కప్-2022 సూపర్-4లో భాగంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో పరాజయం పాలైన విషయం తెలిసిందే. బ్యాటర్లు రాణించినా.. బౌలర్లు విఫలం కావడంతో దాయాది చేతిలో రోహిత్ సేనకు ఓటమి తప్పలేదు. ముఖ్యంగా 18వ ఓవర్లో రవి బిష్ణోయి బౌలింగ్‌లో అర్ష్‌దీప్.. పాక్ ఆటగాడు అసిఫ్ అలీ ఇచ్చిన క్యాచ్‌ను నేలపాలు చేయడంతో టీమిండియా భారీ మూల్యమే చెల్లించింది. ఈ క్యాచ్ మిస్ కావడంతో లైఫ్ పొందిన అలీ.. ఆ తర్వాతి ఓవర్లో భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో సిక్సర్, ఫోర్ బాది పాక్ విజయానికి బాటలు వేశాడు. ఇక ఆఖరి ఓవర్ వేసిన అర్ష్‌దీప్.. నాలుగో బంతికి అసిఫ్ అలీని ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌కు పంపినా.. ఆ తర్వాతి బంతికి ఇఫ్తికర్ అహ్మద్ రెండు పరుగులు తీసి పాక్‌ను గెలిపించాడు. ఈ నేపథ్యంలో అర్ష్‌దీప్ సింగ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. భారీ స్థాయిలో ట్రోలింగ్ ఈ ఫాస్ట్‌బౌలర్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. విపరీతపు కామెంట్లతో అతడిని అవమానించారు. అంతేకాకుండా అతడి వికీపీడియా పేజీని ఎడిట్ చేసి ఓ నిషేధిత సంస్థతో సంబంధం ఉందంటూ అనుచితంగా ప్రవర్తించారు కొందరు ఆకతాయిలు. దీంతో ఏకంగా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఈ విషయాల గురించి అర్ష్‌దీప్ సింగ్ కోచ్ జశ్వంత్ రాయ్ తాజాగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ నాడు(సెప్టెంబరు 4) ఈ యువ పేసర్ మానసిక పరిస్థితి ఎలా ఉందన్న అంశం గురించి చెప్పుకొచ్చాడు. ‘‘క్యాచ్ జారవిడిచిన తర్వాత తను చివరి ఓవర్లో కేవలం ఏడు పరుగులు మాత్రమే ఇచ్చాడు. బాగానే బౌలింగ్ చేశాడు. కానీ అప్పటికే నష్టం జరిగింది. క్యాచ్ జారవిడిచిన దానికంటే అదే ఎక్కువ బాధించింది! ఆ మ్యాచ్ తర్వాత నేను తనతో మాట్లాడాను. ఆ రాత్రి తను సరిగా నిద్రపోలేకపోయానని అర్ష్‌దీప్ నాతో అన్నాడు. తాను ట్రోల్స్ గురించి పెద్దగా పట్టించుకోనని చెప్పాడు. కేవలం ఆరోజు ఫుల్‌టాస్‌ను యార్కర్(19వ ఓవర్ ఐదో బంతి)గా ఎందుకు మలచలేకపోయానా అని తను తీవ్రంగా బాధపడినట్లు చెప్పాడు. తన ప్రణాళిక అమలు అయి ఉంటే బాగుండేది. ఏదేమైనా టీ20 ప్రపంచకప్ ఈవెంట్ అనేది ఏ క్రికెటర్‌కైనా తనను తాను నిరూపించుకునే అవకాశం ఇచ్చే గొప్ప వేదిక. తప్పులు సరిదిద్దుకునే తత్వమే అర్ష్‌దీప్‌ను ఈ టోర్నీలో నిలబెడుతుంది.. టీమిండియాకు ప్రయోజనకరంగా మారుతుంది’’ అని పేర్కొన్నాడు. కాగా ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16 నుంచి ఆరంభం కానున్న టీ20 వరల్డ్‌కప్ టోర్నీ ఆడే భారత జట్టులో అర్ష్‌దీప్‌నకు చోటు దక్కిన విషయం తెలిసిందే. చదవండి: శ్రీలంక కష్టమే! ఆసీస్ ముందంజలో! అదే జరిగితే ఫైనల్లో భారత్- పాకిస్తాన్! సూర్యకుమార్లో మనకు తెలియని రొమాంటిక్ యాంగిల్..