ఆసియాకప్‌లో టీమిండియా, పాకిస్తాన్‌లు ఈ ఆదివారం(సెప్టెంబర్ 4న) మరోసారి తలపడనున్నాయి. సూపర్-4లో భాగంగా ఈ మ్యాచ్ జరగనుంది. అయితే టీమిండియాతో మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు పేసర్ షాహనవాజ్ దహనీ పక్కటెముకల గాయంతో టీమిండియా మ్యాచ్‌కు దూరమయ్యాడు. నిజానికి హాంగ్ కాంగ్‌తో మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తూనే దహనీ గాయపడ్డాడు. అయితే మ్యాచ్‌లో దహనీ తన కోటా ఓవర్లను పూర్తి చేశాడు.
కాగా టీమిండియాతో మ్యాచ్‌కు దహనీ స్థానంలో ముహ్మద్ హస్నైన్, హసన్ అలీలలో ఎవరు ఒకరు తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని పీసీబీ ట్విటర్ వేదికగా ప్రకటించింది. '' సూపర్-4లో భాగంగా ఆదివారం టీమిండియాతో జరగనున్న మ్యాచ్‌లో దహనీ అందుబాటులో ఉండడం లేదు. పక్కటెముకల గాయంతో మ్యాచ్‌కు దూరమయ్యాడు. హాంకాంగ్‌తో మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తున్నప్పుడే దహనీ గాయపడ్డాడు. మరో 48 గంటలు గడిస్తే దహనీ గాయంపై మరింత స్పష్టత వస్తుంది. కాగా దహని స్థానంలో హసన్ అలీ లేదా ముహ్మద్ హస్నైన్‌లలో ఎవరో ఒకరు ఆడుతారు.'' అంటూ తెలిపింది. ఇక దహనీ గాయపడినా.. నసీమ్ షా, హారిస్ రౌఫ్, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్‌ల రూపంలో పాకిస్తాన్‌కు నాణ్యమైన బౌలర్లు ఉన్నారు.
చదవండి: Mohammad Hafeez: టీమిండియాపై పొగడ్తలు.. పాక్ క్రికెటర్‌పై భారత్ ఫ్యాన్స్ తిట్ల దండకం
పాక్‌తో బిగ్ ఫైట్‌కు ముందు కోహ్లి కఠోర సాధన.. స్పెషల్ మాస్క్ పెట్టుకుని..!
Comments
Please login to add a commentAdd a comment