Shahnawaz Dahani
-
Asia Cup 2024: పాక్ భారీ విజయం.. భారత్‌తో పాటు సెమీస్‌లో!
ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా టీ20 కప్-2024లో పాకిస్తాన్-‘ఎ’ జట్టుకు వరుసగా రెండో విజయం లభించింది. అల్ అమెరత్ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో పాక్ యూఏఈ టీమ్‌ను ఏకంగా 114 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ గెలుపుతో సెమీ ఫైనల్ బెర్తును కూడా ఖరారు చేసుకుంది.పాక్, యూఏఈలపై గెలిచిన భారత్‌కాగా ఒమన్ వేదికగా వర్ధమాన టీ20 జట్ల మధ్య ఆసియా కప్ ఈవెంట్ జరుగుతోంది. ఇందులో తిలక్ వర్మ సారథ్యంలోని భారత జట్టు సహా పాకిస్తాన్, యూఏఈ, ఒమన్ గ్రూప్-బిలో ఉండగా.. హాంగ్‌కాంగ్, బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గనిస్తాన్ గ్రూప్-ఎలో ఉన్నాయి.ఈ క్రమంలో ఇప్పటికే పాకిస్తాన్, యూఏఈలపై గెలుపొంది భారత్ గ్రూప్-బి నుంచి సెమీస్‌లో అడుగుపెట్టింది. తాజాగా పాక్ సైతం టాప్-4కు అర్హత సాధించింది. యూఏఈతో మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది.కెప్టెన్ ధనాధన్ ఇన్నింగ్స్‌ఓపెనర్లు ఒమైర్ యూసఫ్(11 బంతుల్లో 21), యాసిర్ ఖాన్(13 బంతుల్లో25) శుభారంభం అందించగా.. వన్‌డౌన్ బ్యాటర్ మహ్మద్ హ్యారిస్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. మొత్తంగా 49 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 71 పరుగులు సాధించాడు.మిగతా వాళ్లలో కాసిం అక్రం 23 పరుగులు చేయగా.. హైదర్ అలీ మెరుపు ఇన్నింగ్స్(17 బంతుల్లో 32*) ఆడాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్ కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి 179 పరుగులు చేసింది.65 పరుగులకే కుప్పకూలిన యూఏఈలక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే యూఏఈ తడబడింది. ఓపెనర్లు ఆయాన్ష్ శర్మ(8), మయాంక్ రాజేశ్ కుమార్(0) విఫలం కాగా.. వన్‌డౌన్ బ్యాటర్ తానిశ్ సూరి 15 రన్స్ చేశాడు. మిగిలిన ఆటగాళ్లలో వికెట్ కీపర్ సయీద్ హైదర్ షా(12), ధ్రువ్ పరాషర్(1), బాసిల్ హమీద్(4), సంచిత్ శర్మ(0), ముహ్మద్ ఫారూక్(3), అకీఫ్ రాజా(0), ఒమిద్ రెహ్మాన్(0 నాటౌట్) దారుణ ప్రదర్శన కనబరిచారు.ఇక కెప్టెన్ రాహుల్ చోప్రా చేసిన ఇరవై పరుగులే యూఏఈ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు. ఈ క్రమంలో 16.3 ఓవర్లలో కేవలం 65 పరుగులకే యూఏఈ జట్టు కుప్పకూలింది. పాక్ బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ షానవాజ్దహాని అత్యధికంగా ఐదు వికెట్లు పడగొట్టగా.. సూఫియాన్ ముఖీమ్ రెండు, అహ్మద్ దనియాల్, అబ్బాస్ ఆఫ్రిది, అరాఫత్ మిన్హాస్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. కాగా పాక్ అంతకుముందు ఒమన్‌పై విజయం సాధించింది.చదవండి: Ind vs NZ: అతడి ఆట తీరు బాగుంది.. అయినా..: గంభీర్ నువ్వేమైనా ‘హ్యాట్రిక్’ హీరోవా? బుద్ధిలేదా?: పాక్ మాజీ క్రికెటర్ ఫైర్ -
టీమిండియాతో మ్యాచ్‌కు ముందు పాక్‌కు ఎదురుదెబ్బ
ఆసియాకప్‌లో టీమిండియా, పాకిస్తాన్‌లు ఈ ఆదివారం(సెప్టెంబర్ 4న) మరోసారి తలపడనున్నాయి. సూపర్-4లో భాగంగా ఈ మ్యాచ్ జరగనుంది. అయితే టీమిండియాతో మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు పేసర్ షాహనవాజ్ దహనీ పక్కటెముకల గాయంతో టీమిండియా మ్యాచ్‌కు దూరమయ్యాడు. నిజానికి హాంగ్ కాంగ్‌తో మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తూనే దహనీ గాయపడ్డాడు. అయితే మ్యాచ్‌లో దహనీ తన కోటా ఓవర్లను పూర్తి చేశాడు. కాగా టీమిండియాతో మ్యాచ్‌కు దహనీ స్థానంలో ముహ్మద్ హస్నైన్, హసన్ అలీలలో ఎవరు ఒకరు తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని పీసీబీ ట్విటర్ వేదికగా ప్రకటించింది. '' సూపర్-4లో భాగంగా ఆదివారం టీమిండియాతో జరగనున్న మ్యాచ్‌లో దహనీ అందుబాటులో ఉండడం లేదు. పక్కటెముకల గాయంతో మ్యాచ్‌కు దూరమయ్యాడు. హాంకాంగ్‌తో మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తున్నప్పుడే దహనీ గాయపడ్డాడు. మరో 48 గంటలు గడిస్తే దహనీ గాయంపై మరింత స్పష్టత వస్తుంది. కాగా దహని స్థానంలో హసన్ అలీ లేదా ముహ్మద్ హస్నైన్‌లలో ఎవరో ఒకరు ఆడుతారు.'' అంటూ తెలిపింది. ఇక దహనీ గాయపడినా.. నసీమ్ షా, హారిస్ రౌఫ్, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్ల రూపంలో పాకిస్తాన్‌కు నాణ్యమైన బౌలర్లు ఉన్నారు. చదవండి: Mohammad Hafeez: టీమిండియాపై పొగడ్తలు.. పాక్ క్రికెటర్‌పై భారత్ ఫ్యాన్స్ తిట్ల దండకం పాక్‌తో బిగ్ ఫైట్‌కు ముందు కోహ్లి కఠోర సాధన.. స్పెషల్ మాస్క్ పెట్టుకుని..! -
'ధోనిను కలవడంతో నా కల నిజమైంది.. అది ఎప్పటికీ మర్చిపోలేను'
ఎంతో మంది యువ క్రికెటర్లకు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆదర్శ ప్రాయంగా నిలిచిన సంగతి తెలిసిందే. ధోని యువ ఆటగాళ్లకి జట్టుతో సంబంధం లేకుండా విలువైన సూచనలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కాగా ధోనిను కలవడంతో తన కల సాకరమైంది అని పాకిస్తాన్ యువ సంచలనం షానవాజ్ దహానీ తెలిపాడు. ధోని తనకు విలువైన సూచనలు చేశాడాని అతడు చెప్పాడు. టీ20 ప్రపంచకప్-2021లో పాకిస్తాన్- భారత్ మ్యాచ్ సందర్భంగా టీమిండియా మెంటార్‌గా వ్యవహరిస్తున్న ధోనిను దహానీ కలిశాడు. ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌ను కలవాలనే కోరికను కూడా అతడు వెల్లడించాడు. తంలో న్యూజిలాండ్ మాజీ స్పీడ్‌స్టర్ షేన్ బాండ్‌ని ఫాలో అయ్యేవాడిని అని, ప్రస్తుతం ఇంగ్లండ్ స్టార్ పేసర్ ఆర్చర్‌ను అనుసరిస్తున్నాని దహానీ పేర్కొన్నాడు. దహానీ ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ముల్తాన్ సూల్తాన్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. లాహోర్ ఖలందర్స్‌తో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్‌లో దహానీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 19 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ముల్తాన్ సుల్తాన్ ఫైనల్‌కు చేరడంలో దహానీ కీలక పాత్ర పోషించాడు. "నేను న్యూజిలాండ్ స్టార్ బౌలర్ షేన్ బాండ్‌ను ఫాలో అయ్యే వాడిని. అతడు లాగే ఫాస్ట్ బౌలర్ కావాలి అని అనుకున్నాను. కానీ అతడు రిటైర్మెంట్ తర్వాత, నేను ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌ని అనుసరించడం ప్రారంభించాను. త్వరలో ఆర్చర్‌ను కలవాలనేది నా కోరిక. ఇక మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ గరించి చెప్పాలంటే నాకు చాలా సమయం పడుతుంది. అతడిని కలవడం నా కల నెరవెరింది. ఇప్పటికి అతడిని కలిసిన ఆ క్షణం మర్చిపోలేను. ఎందుకంటే జీవితం గురించి, పెద్దలను గౌరవించడం గురించి ఆయన చెప్పిన మాటలు నాకు ఎంతో ఊపయోగపడ్డాయి. క్రికెట్లో మంచి, చెడు రోజులు వస్తాయని, వాటిని స్వీకరించాలని ధోని చెప్పాడు. అటువంటి సమయంలో కేవలం ఆటపై దృష్టి సారించాలి అని అతడు చెప్పాడు" అని దహానీ క్రికెట్ పాకిస్తాన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. చదవండి: Emma Raducanu: వెంబడించి, వేధించాడు.. చాలా భయపడ్డా..! నిషేదాజ్ఞ జారీ! -
యార్కర్‌తో వికెట్ పడగొట్టాడు.. అభిమానులకు దండం పెట్టాడు!
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో భాగంగా ముల్తాన్ సుల్తాన్, లాహోర్ ఖలందర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. లాహోర్ ఖలందర్స్ బ్యాటర్ బెన్ డంక్‌ను అద్భుతమైన యార్కర్‌తో ముల్తాన్ సుల్తాన్ బౌలర్ షానవాజ్ దహానీ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇన్నింగ్స్ 20 వేసిన దహానీ బౌలింగ్‌లో స్కూప్ షాట్‌కు ప్రయత్నించిన బెన్ డంక్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ క్రమంలో వికెట్ తీసిన ఆనందంలో దహానీ వెరైటీ సెలబ్రేషన్ జరపుకున్నాడు. స్టాండ్స్‌లో ఉన్న ప్రేక్షకులు వైపు చూస్తూ దహానీ దండం పెడతూ సెలబ్రేషన్ జరపుకున్నాడు. ఈ మ్యాచ్‌లో దహానీ తన నాలుగు ఓవర్ల కోటాలో 44 పరుగులు ఇచ్చి కేవలం ఒకే ఒక వికెట్ పడగొట్టాడు. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ముల్తాన్ సుల్తాన్ ట్విటర్లో షేర్ చేసింది. దీంతో దహానీ సెలబ్రేషన్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లాహోర్ నిర్ణీత 20 ఓవర్లలో 206 పరుగల భారీ స్కోరు సాధించింది. లాహోర్ బ్యాటర్లలో ఫఖర్ జమాన్ (76), కమ్రాన్ గులాం(43) పరుగులతో రాణించారు. ఇక 207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముల్తాన్ సుల్తాన్ కేవలం 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ముల్తాన్ సుల్తాన్ విజయంలో షాన్ మసూద్(83), మహ్మద్ రిజ్వాన్(69) కీలక పాత్ర పోషించారు. Not much to cheer about for Multan Sultans, but this was special from Dahani 🙏🏼🌟#PakistansFirstHDsportsChannel#ASportsHD #HBLPSL7 #LevelHai #PSL7 #PSL2022 #MSvLQpic.twitter.com/16tyBPdAKa — ASports (@asportstvpk) January 29, 2022