PSL 2022: Shahnawaz Dahani Brilliant Yorker to Dismiss Ben Dunk - Sakshi
Sakshi News home page

యార్క‌ర్‌తో వికెట్ ప‌డ‌గొట్టాడు.. అభిమానుల‌కు దండం పెట్టాడు!

Published Sun, Jan 30 2022 9:29 AM | Last Updated on Sun, Jan 30 2022 10:35 AM

Shahnawaz Dahanis yorker sends back Ben Dunk, Vedio viral - Sakshi

పాకిస్తాన్ సూప‌ర్ లీగ్‌లో భాగంగా ముల్తాన్ సుల్తాన్, లాహోర్ ఖలందర్స్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో ఓ ఆస‌క్తిక‌ర స‌న్నివేశం చోటు చేసుకుంది. లాహోర్ ఖలందర్స్ బ్యాట‌ర్ బెన్ డంక్‌ను అద్భుతమైన యార్క‌ర్‌తో ముల్తాన్ సుల్తాన్ బౌల‌ర్ షానవాజ్ దహానీ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇన్నింగ్స్ 20 వేసిన దహానీ బౌలింగ్‌లో స్కూప్ షాట్‌కు ప్ర‌య‌త్నించిన బెన్ డంక్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ క్ర‌మంలో వికెట్ తీసిన ఆనందంలో ద‌హానీ వెరైటీ సెల‌బ్రేష‌న్ జ‌ర‌పుకున్నాడు. స్టాండ్స్‌లో ఉన్న ప్రేక్ష‌కులు వైపు చూస్తూ దహానీ దండం పెడ‌తూ సెల‌బ్రేష‌న్ జ‌ర‌పుకున్నాడు. ఈ మ్యాచ్‌లో  దహానీ త‌న నాలుగు ఓవ‌ర్ల కోటాలో 44 ప‌రుగులు ఇచ్చి కేవ‌లం ఒకే ఒక వికెట్ ప‌డ‌గొట్టాడు.

కాగా ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోను ముల్తాన్ సుల్తాన్ ట్విట‌ర్‌లో షేర్ చేసింది. దీంతో ద‌హానీ సెల‌బ్రేష‌న్‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వ‌స్తే..  టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన  లాహోర్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 206 ప‌రుగ‌ల భారీ స్కోరు సాధించింది. లాహోర్ బ్యాట‌ర్లలో ఫఖర్ జమాన్ (76), కమ్రాన్ గులాం(43) ప‌రుగుల‌తో రాణించారు. ఇక 207 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ముల్తాన్ సుల్తాన్ కేవ‌లం 5 వికెట్లు కోల్పోయి ల‌క్ష్యాన్ని చేధించింది. ముల్తాన్ సుల్తాన్ విజ‌యంలో షాన్ మసూద్(83), మహ్మద్ రిజ్వాన్(69) కీల‌క పాత్ర పోషించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement