ఇంగ్లిష్‌ సరిగ్గా మాట్లాడలేనందుకు సిగ్గుపడను.: పాక్‌ కెప్టెన్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ | Mohammad Rizwan Addresses Poor Command Over English Speaking | Sakshi

ఇంగ్లిష్‌ సరిగ్గా మాట్లాడలేనందుకు సిగ్గుపడను.. అలా అయితే ప్రొఫెసర్‌ అవుతా: పాక్‌ కెప్టెన్‌ మహ్మద్‌ రిజ్వాన్‌

Published Sat, Apr 12 2025 3:44 PM | Last Updated on Sat, Apr 12 2025 4:17 PM

Mohammad Rizwan Addresses Poor Command Over English Speaking

పాకిస్తాన్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ తాను మాట్లాడే ఇంగ్లిష్‌పై గత కొంతకాలంగా విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. రిజ్వాన్‌ అర్దం పర్దం లేకుండా ఇంగ్లిష్‌ మాట్లాడతాడని సోషల్‌మీడియా అతన్ని టార్గెట్‌ చేస్తూ వస్తుంది. రిజ్వాన్‌ ఏం మాట్లాడతాడో అర్దం కాక సొంత అభిమానులే జట్టు పీక్కుంటుంటారు. 

రిజ్వాన్‌ ఇంగ్లిష్‌ విషయంలో ఫారిన్‌ మీడియా బాధలు వర్ణణాతీతం. వారు ఓ ప్రశ్న అడిగితే అతను ఇంకేదో సమాధానం చెబుతాడు. ఇంగ్లిష్‌ సరిగ్గా మాట్లాడలేకపోవడం రిజ్వాన్‌ తప్పు కానప్పటికీ నిందులు ఎదుర్కొంటున్నాడు.

తాజాగా ఈ విషయంపై రిజ్వాన్‌ స్పందించాడు. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ 2025 (PSL) ప్రారంభానికి ముందు మాట్లాడుతూ.. తాను చదువు కొనసాగించలేనందు వల్ల ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడలేకపోతున్నాను. చదువుకునే రోజుల్లో క్రికెట్‌పై మాత్రమే దృష్టి పెట్టాను. చదువు పూర్తి చేయనందుకు చింతిస్తున్నాను. కానీ క్రికెటర్‌గా దాని గురించి సిగ్గుపడను. భాష సరిగ్గా లేకపోయినా నిజం మాట్లాడుతున్నందుకు గర్విస్తున్నాను.

చదువు పూర్తి చేయలేనందుకు బాధగా ఉంటుంది కానీ, ఇంగ్లిష్‌ సరిగ్గా మాట్లాడలేనందుకు ఎప్పుడూ బాధ పడను. నా దేశంలో అభిమానులు నా నుండి మంచి క్రికెట్‌ మాత్రమే ఆశిస్తారు. వారు నా నుండి ఇంగ్లిష్ డిమాండ్ చేయరు. ఏదిఏమైనప్పటికీ అభిమానులు నన్ను క్షమించాలి. చదువు పూర్తి చేయనందుకే ఈ కష్టాలు.

అందుకే యువ క్రికెటర్లు ప్రతిభను మెరుగుపరుచుకుంటూనే భాషపై దృష్టి పెట్టాలని చెబుతూ ఉంటాను. పాక్‌ జట్టు కూడా నా నుంచి మంచి క్రికెట్‌ మాత్రమే ఆశిస్తుంది. ఇంగ్లిష్ మాట్లాడే సామర్థ్యం కాదు. నాకు క్రికెట్‌ను వదిలి ఇంగ్లిష్‌ నేర్చుకునేంత సమయం కూడా లేదు. ఒకవేళ అభిమానులు నన్ను ఇంగ్లిష్‌ నేర్చుకోమని​ అడిగితే క్రికెట్‌ను వదిలేసి ప్రొఫెసర్‌ని అవుతానని అన్నాడు.

కాగా, పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ 2025లో మహ్మద్‌ రిజ్వాన్‌ ముల్తాన్‌ సుల్తాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తాడు. అతను ఆ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. సుల్తాన్స్‌ ఇవాళ (ఏప్రిల్‌ 12) రాత్రి కరాచీ కింగ్స్‌తో తలపడుతుంది. పీఎస్‌ఎల్‌ గత సీజన్‌లో సుల్తాన్స్‌ ఫైనల్లో ఇస్లామాబాద్ యునైటెడ్ చేతిలో ఓడిపోయింది. 

పీఎస్‌ఎల్‌ 2025 ఎడిషన్‌ నిన్ననే ప్రారంభమైంది. ఈసారి పాక్‌ క్రికెట్‌ లీగ్‌ ఐపీఎల్‌తో పోటీపడుతుంది. రెండు లీగ్‌లు ఒకే సమయంలో జరుగుతున్నాయి. గతంలో ఇలా ఎప్పుడూ జరగలేదు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement