రెచ్చిపోయిన రీజా హెండ్రిక్స్‌.. రాణించిన రిజ్వాన్‌ | Reeza Hendricks 72 Runs Knock Makes Multan Sultans To Win By 13 Runs Against Quetta Gladiators | Sakshi
Sakshi News home page

రెచ్చిపోయిన రీజా హెండ్రిక్స్‌.. రాణించిన రిజ్వాన్‌

Published Sun, Feb 25 2024 8:15 PM | Last Updated on Sun, Feb 25 2024 8:15 PM

Reeza Hendricks 72 Runs Knock Makes Multan Sultans To Win By 13 Runs Against Quetta Gladiators - Sakshi

పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ 2024 ఎడిషన్‌లో ముల్తాన్‌ సుల్తాన్స్‌ ఆటగాడు రీజా హెండ్రిక్స్‌ భీకర ఫామ్‌ కొనసాగుతుంది. ఈ సీజన్‌లో ఇప్పటికే రెండు హాఫ్‌ సెంచరీలు చేసిన హెండ్రిక్స్‌ తాజాగా మరో హాఫ్‌ సెంచరీ సాధించాడు. క్వెట్టా గ్లాడయేటర్స్‌తో ఇవాళ (ఫిబ్రవరి 25) జరిగిన మ్యాచ్‌లో హెండ్రిక్స్‌ మెరుపు అర్ధశతకంతో (47 బంతుల్లో 72; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. ఫలితంగా సుల్తాన్స్‌ 13 పరుగుల తేడాతో గ్లాడియేటర్స్‌పై విజయం సాధించింది. సుల్తాన్స్‌ విజయంలో ఆ జట్టు కెప్టెన్‌ మొహమ్మద్‌ రిజ్వాన్‌ (51) సైతం కీలకపాత్ర పోషించాడు. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సుల్తాన్స్‌.. నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. హెండ్రిక్స్‌, రిజ్వాన్‌తో పాటు తయ్యబ్‌ తాహిర్‌ (35 నాటౌట్‌) రాణించాడు. గ్లాడియేటర్స్‌ బౌలర్లలో మొహమ్మద్‌ ఆమిర్‌ 2, అకీల్‌ హొసేన్‌, అబ్రార్‌ అహ్మద్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గ్లాడియేటర్స్‌ నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 9 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసి లక్ష్యానికి 14 పరుగుల దూరంలో నిలిచిపోయింది. సుల్తాన్స్‌ బౌలర్లలో మొహమ్మద్‌ అలీ అద్భుత ప్రదర్శనతో (4-1-19-3) విజృంభించగా.. డేవిడ్‌ విల్లే 3, ఆఫ్తాబ్‌ ఇబ్రహీం 2, ఉసామా మిర్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. ​గ్లాడియేటర్స్‌ ఇన్నింగ్స్‌లో ఖ్వాజా నఫే (36), రిలీ రొస్సో (30) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement