
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో దుమ్ములేపుతున్న భారత జట్టు మరో కీలక సమరానికి సిద్దమైంది. ఈ మెగా టోర్నీ తొలి సెమీఫైనల్లో దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాతో టీమిండియా తాడోపేడో తెల్చుకోనుంది. ఐసీసీ టోర్నీల్లో తమకు కొరకరాని కొయ్యగా మారిన ఆస్ట్రేలియాను ఈసారి ఎలాగైనా ఓడించి ముందుకు వెళ్లాలని రోహిత్ సేన పట్టుదలతో ఉంది.
డబ్ల్యూటీసీ ఫైనల్-2023 ఫైనల్‌తో పాటు అదే ఏడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లోనూ భారత్‌ను ఆసీస్ ఓడించింది. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌లో ఆసీస్‌ను ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని భారత అభిమానులు ఆశిస్తున్నారు. టీమిండియా ప్రస్తుతం అన్ని విభాగాల్లో పటిష్టం కన్పిస్తోంది. లీగ్ స్టేజిలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ భారత్ అద్భుత ప్రదర్శనతో విజయ భేరి మోగించింది.
అదే జోరును సెమీస్‌లోనూ కొనసాగించాలని టీమిండియా భావిస్తోంది. ఈ క్రమంలో ఆసీస్‌తో మ్యాచ్‌కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు భారత మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. అదేవిధంగా గతేడాదిగా తాను ఎదుర్కొన్న గడ్డు పరిస్థితుల గురుంచి కూడా అయ్యర్ మా
"కష్టం కాలం ఎప్పుడూ శాశ్వతంగా ఉండదు. నాలాంటి వాడికి ఇటువంటి కఠిన దశలను ఎలా ఎదుర్కోవాలో బాగా తెలుసు. కష్ట కాలంలో మనల్ని ఎవరూ ఆదుకోరు. అటువంటి సమయాల్లో మనల్ని మనం నమ్ముకుంటే ఫలితం ఉంటుంది. ఎవరిపైనా ఆధారపడకుండా ఎలా నడుచుకోవాలో గతేడాది కాలం నాకు నేర్పించింది.
ఇక సెమీస్ ఫైనల్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాను. మాపై ఎటువంటి ఒత్తడి లేదు. ఇది ఒక సాధరణ మ్యాచ్ మాత్రమే. ఈ మ్యాచ్‌లో గెలవాలనే కోరిక మరింత రెట్టింపు అయింది" అంటూ బీసీసీఐ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అయ్యర్ పేర్కొన్నాడు. కాగా దేశీవాళీ క్రికెట్‌లో ఆడాలన్న బీసీసీఐ ఆదేశాలను ధిక్కరించడంతో అయ్యర్ తన సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయాడు.
అయితే ఆ తర్వాత తన మనసు మార్చకుని రంజీల్లో ఆడడంతో అయ్యర్ తిరిగి జాతీయ జట్టులోకి వచ్చాడు. తన పునరాగమనంలో అయ్యర్ దుమ్ములేపుతున్నాడు. ఈ మెగా టోర్నీలో మూడు మ్యాచ్‌ల్లో రెండు హాఫ్ సెంచరీలు శ్రేయస్ సాధించాడు.
చదవండి: అతడితో మనకు తల నొప్పి.. తొందరగా ఔట్ చేయండి: భారత మాజీ క్రికెటర్
Comments
Please login to add a commentAdd a comment