
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్, పాకిస్తాన్ జట్లు ఇవాళ (ఫిబ్రవరి 23) తలపడుతున్నాయి. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. మధ్యాహ్నం 2:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. రోహిత్ శర్మ వరుసగా తొమ్మిదో మ్యాచ్‌లో టాస్ ఓడాడు.
ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఎలాంటి ప్రయోగాలు చేయలేదు. గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. పాక్ మాత్రం ఓ మార్పుతో బరిలోకి దిగింది. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో గాయపడిన ఫకర్ జమాన్ స్థానంలో ఇమామ్ ఉల్ హక్ తుది జట్టులోకి వచ్చాడు.
తుది జట్లు..
పాకిస్తాన్: సౌద్ షకీల్, బాబర్ ఆజమ్, ఇమామ్ ఉల్ హక్, రిజ్వాన్ (కెప్టెన్, సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీం షా, హరీస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, షమీ, కుల్దీప్ యాదవ్
Comments
Please login to add a commentAdd a comment