T20 World Cup 2024: ఉత్కంఠ పోరులో పాక్‌ను చిత్తు చేసిన భారత్‌ | T20 World Cup 2024: Team India Defeated Pakistan By 6 Runs | Sakshi
Sakshi News home page

T20 World Cup 2024: ఉత్కంఠ పోరులో పాక్‌ను చిత్తు చేసిన భారత్‌

Published Mon, Jun 10 2024 1:21 AM | Last Updated on Mon, Jun 10 2024 9:24 AM

T20 World Cup 2024: Team India Defeated Pakistan By 6 Runs

టీ20 వరల్డ్‌కప్‌ 2024లో భాగంగా న్యూయార్క్‌ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన ఉత్కంఠ సమరంలో టీమిండియా 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. వరుణుడు ఆటంకాల నడుమ ఆలస్యంగా మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. పాక్‌ పేసర్ల ధాటికి 19 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది.

పాక్‌ బౌలర్లలో నసీం షా, హరీస్‌ రౌఫ్‌ తలో 3 వికెట్లు, మొహమ్మద్‌ ఆమిర్‌ 2, షాహిన్‌ అఫ్రిది ఓ వికెట్‌ పడగొట్టి టీమిండియా పతనాన్ని శాశించారు. భారత ఇన్నింగ్స్‌లో రిషబ్‌ పంత్‌ (31 బంతుల్లో 42; 6 ఫోర్లు) మినహా అందరూ దారుణంగా విఫలమయ్యారు.  

రోహిత్‌ శర్మ (12 బంతుల్లో 12; ఫోర్‌, సిక్స్‌), అక్షర్‌ పటేల్‌ (18 బంతుల్లో 20; 2 ఫోర్లు, సిక్స్‌) రెండంకెల స్కోర్‌ చేయగా.. విరాట్‌ కోహ్లి (3 బంతుల్లో 4; ఫోర్‌),  సూర్యకుమార్‌ యాదవ్‌ (8 బంతుల్లో 7; ఫోర్‌), శివమ్‌ దూబే (9 బంతుల్లో 3), హార్దిక్‌ పాండ్యా (12 బంతుల్లో 12; ఫోర్‌), రవీంద్ర జడేజా (0), అర్ష్‌దీప్‌ సింగ్‌ (13 బంతుల్లో 9; ఫోర్‌), బుమ్రా (0) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకు పరిమితమయ్యారు.

120 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్‌.. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 113 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. బుమ్రా (4-0-14-3), హార్దిక్‌ (4-0-24-2), సిరాజ్‌ (4-0-19-0), అర్ష్‌దీప్‌ సింగ్‌ (4-0-31-1), అక్షర్‌ పటేల్‌ (2-0-11-1) అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. 

పాక్‌ గెలవాలంటే ఆఖరి ఓవర్‌లో 18 పరుగులు చేయాల్సి ఉండగా.. అర్ష్‌దీప్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి 11 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంతకుముందు ఓవర్‌లో బుమ్రా మ్యాజిక్‌ చేసి కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్‌ పడగొట్టాడు. ఈ గెలుపుతో భారత్‌ ప్రపంచకప్‌ టోర్నీల్లో పాక్‌పై తమ రికార్డును 7-1కి మరింత మెరుగుపర్చుకుంది. పాక్‌ ఇన్నింగ్స్‌లో మొహ​మ్మద్‌ రిజ్వాన్‌ (31) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్‌ చేశాడు. ఈ ఓటమితో పాక్‌ సూపర్‌ 8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement