
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి సెమీఫైనల్‌కు రంగం సిద్దమైంది. మంగళవారం(మార్చి 4) దుబాయ్ వేదికగా ఈ హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి గత వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలతో ఉంది. మరోవైపు ఆస్ట్రేలియా సైతం ఈ మ్యాచ్‌లో గెలిచి తమ ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకోవాలని వ్యూహాలు రచిస్తోంది.
ఈ నేపథ్యంలో ఆసీస్ స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్‌ను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సెమీస్ పోరులో హెడ్ నుంచి భారత్‌కు భారీ ముప్పు పొంచి ఉందని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. కాగా ప్రత్యర్ధి భారత్ అంటేనే చాలు ట్రావెస్ హెడ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతాడు. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్-2023 నుంచి హెడ్ ఐసీసీ ఈవెంట్లలో భారత్‌కు కొరకరాని కోయ్యగా మారాడు.
ఆస్ట్రేలియాతో సెమీస్‌లో ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేసేందుకు భారత్ ప్రత్యేక వ్యూహాలను రచించాలి. అతడిని వీలైనంత త్వరగా ఔట్ చేసి డ్రెస్సింగ్ రూమ్‌కి పంపించాలి. అప్పుడే నాతో పాటు భారత అభిమానులంతా ఊపిరిపీల్చుకుంటారు. అతడు ఎక్కువ సమయం క్రీజులో ఉంటే ఏమి చేయగలడో మనందరికి తెలుసు అని ESPNCricinfoకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంజ్రేకర్ పేర్కొన్నాడు.
వన్డే ప్రపంచకప్-2023లో భారత్‌పై హెడ్(137 నాటౌట్) మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. అంతకుముందు వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లోనూ భారత్‌పై సెంచరీతో మెరిశాడు. గతేడాది జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ ఆస్ట్రేలియా ఓటమి పాలైనప్పటికి.. హెడ్ మాత్రం(76 పరుగులు) విధ్వంసం సృష్టించాడు. ఇటీవల జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో హెడ్ పరుగుల వరద పారించాడు.
టీమిండియాపై వన్డేల్లో ట్రావిస్ హెడ్‌కు ఘనమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు భారత్‌పై 9 వన్డేలు ఆడిన హెడ్.. 43.12 సగటుతో 345 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీతో పాటు హాఫ్ సెంచరీ కూడా ఉన్నాయి. హైయెస్ట్ స్కోర్ 137 పరుగులుగా ఉంది. టెస్టుల్లో భారత్‌పై 27 మ్యాచ్‌లు ఆడి 46.52 సగటుతో 1163 పరుగులు సాధించాడు.
చదవండి: Champions Trophy: సెమీస్‌లో విజయం టీమిండియాదే.. ఐరెన్ లెగ్ అంపైర్ లేడు!?
Comments
Please login to add a commentAdd a comment