ఐపీఎల్‌తో పోటీకి దిగిన పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌.. షెడ్యూల్‌ ప్రకటన | Pakistan 10th Edition Schedule Announced | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌తో పోటీకి దిగిన పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌.. షెడ్యూల్‌ ప్రకటన

Published Fri, Feb 28 2025 3:41 PM | Last Updated on Fri, Feb 28 2025 3:53 PM

Pakistan 10th Edition Schedule Announced

పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (PSL) ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌తో (IPL) నేరుగా పోటీకి దిగింది. పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (PCB) పీఎస్‌ఎల్‌ 10వ ఎడిషన్‌ షెడ్యూల్‌ను ఇవాళ (ఫిబ్రవరి 28) ప్రకటించింది. ఈ షెడ్యూల్‌ ఐపీఎల్‌-2025 షెడ్యూల్‌తో క్లాష్‌ అవుతుంది. పీఎస్‌ఎల్‌ 10వ ఎడిషన్‌ ఏ‍ప్రిల్‌ 11 నుంచి ప్రారంభమవుతుంది. మే 18న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ఐపీఎల్‌ 17వ ఎడిషన్‌ మార్చి 22న ప్రారంభమై, మే 25న ముగుస్తుంది. ఐపీఎల్‌లో పాల్గొనే విదేశీ ప్లేయర్లను ఇరకాటంలో పెట్టేందుకే పీసీబీ పీఎస్‌ఎల్‌ను ఐపీఎల్‌ డేట్స్‌లో ఫిక్స్‌ చేసింది.

పీఎస్‌ఎల్‌-2025 విషయానికొస్తే.. ఈ సీజన్‌లో మొత్తం 34 మ్యాచ్‌లు (6 జట్లు) జరుగనున్నాయి. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో రెండు ఎలిమినేటర్‌ మ్యాచ్‌లు, ఫైనల్‌ సహా 13 మ్యాచ్‌లు జరుగనున్నాయి. రావల్పిండి స్టేడియం క్వాలిఫయర్‌-1 సహా 11 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. కరాచీ మరియు ముల్తాన్‌ స్టేడియాల్లో తలో ఐదు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ సీజన్‌లో మూడు డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇందులో రెండు వీకెండ్‌లో (శనివారం​) జరుగనుండగా.. ఓ డబుల్‌ హెడర్‌ పాక్‌ నేషనల్‌ హాలిడే లేబర్‌ డే రోజున జరుగనుంది.

లీగ్‌ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ఇస్లామాబాద్‌ యునైటెడ్‌ టూ టైమ్‌ ఛాంపియన్స్‌ లాహోర్‌ ఖలందర్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌ రావల్పిండి క్రికెట్‌ స్టేడియంలో జరుగనుంది.

ఈ సీజన్‌లో ఓ ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ కూడా జరుగనుంది. ఏప్రిల్‌ 8న పెషావర్‌లో ఈ మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో పాల్గొనే జట్లపై త్వరలో ప్రకటన వెలువడనుంది.

పీఎస్‌ఎల్‌-2025 పూర్తి షెడ్యూల్‌..

11 ఏప్రిల్ - ఇస్లామాబాద్ యునైటెడ్ v లాహోర్ ఖలందర్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం

12 ఏప్రిల్ - పెషావర్ జల్మీ v క్వెట్టా గ్లాడియేటర్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం

12 ఏప్రిల్‌ - కరాచీ కింగ్స్ v ముల్తాన్ సుల్తాన్స్, నేషనల్ బ్యాంక్ స్టేడియం, కరాచీ

13 ఏప్రిల్ - క్వెట్టా గ్లాడియేటర్స్ v లాహోర్ క్వాలండర్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం

14 ఏప్రిల్ - ఇస్లామాబాద్ యునైటెడ్ v పెషావర్ జల్మీ, రావల్పిండి క్రికెట్ స్టేడియం

15 ఏప్రిల్ - కరాచీ కింగ్స్ v లాహోర్ క్వాలండర్స్, నేషనల్ బ్యాంక్ స్టేడియం, కరాచీ

16 ఏప్రిల్ - ఇస్లామాబాద్ యునైటెడ్ v ముల్తాన్ సుల్తాన్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం

18 ఏప్రిల్ - కరాచీ కింగ్స్ v క్వెట్టా గ్లాడియేటర్స్, నేషనల్ బ్యాంక్ స్టేడియం, కరాచీ

19 ఏప్రిల్ - పెషావర్ జల్మీ v ముల్తాన్ సుల్తాన్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం

20 ఏప్రిల్ - కరాచీ కింగ్స్ v ఇస్లామాబాద్ యునైటెడ్, నేషనల్ బ్యాంక్ స్టేడియం, కరాచీ

21 ఏప్రిల్ - కరాచీ కింగ్స్ v పెషావర్ జల్మీ, నేషనల్ బ్యాంక్ స్టేడియం, కరాచీ

22 ఏప్రిల్ - ముల్తాన్ సుల్తాన్స్ v లాహోర్ క్వాలండర్స్, ముల్తాన్ క్రికెట్ స్టేడియం

23 ఏప్రిల్ - ముల్తాన్ సుల్తాన్స్ v ఇస్లామాబాద్ యునైటెడ్, ముల్తాన్ క్రికెట్ స్టేడియం

24 ఏప్రిల్ - లాహోర్ ఖలందర్స్ v పెషావర్ జల్మీ, గడ్డాఫీ స్టేడియం, లాహోర్

ఏప్రిల్ 25 - క్వెట్టా గ్లాడియేటర్స్ vs కరాచీ కింగ్స్, గడ్డాఫీ స్టేడియం, లాహోర్

ఏప్రిల్ 26 - లాహోర్ క్వలండర్స్ vs ముల్తాన్ సుల్తాన్స్, గడ్డాఫీ స్టేడియం, లాహోర్

ఏప్రిల్ 27 - క్వెట్టా గ్లాడియేటర్స్ vs పెషావర్ జల్మి, గడ్డాఫీ స్టేడియం, లాహోర్

ఏప్రిల్ 29 - క్వెట్టా గ్లాడియేటర్స్ vs ముల్తాన్ సుల్తాన్స్, గడ్డాఫీ స్టేడియం, లాహోర్

ఏప్రిల్ 30 - లాహోర్ క్వలండర్స్ vs ఇస్లామాబాద్ యునైటెడ్, గడ్డాఫీ స్టేడియం, లాహోర్

మే 1 - ముల్తాన్ సుల్తాన్స్ vs కరాచీ కింగ్స్, ముల్తాన్ క్రికెట్ స్టేడియం

మే 1 - లాహోర్ క్వాలండర్స్ v క్వెట్టా గ్లాడియేటర్స్, గడాఫీ స్టేడియం, లాహోర్

మే 2 - పెషావర్ జల్మీ v ఇస్లామాబాద్ యునైటెడ్, గడ్డాఫీ స్టేడియం, లాహోర్

మే 3 - క్వెట్టా గ్లాడియేటర్స్ v ఇస్లామాబాద్ యునైటెడ్, గడ్డాఫీ స్టేడియం, లాహోర్

మే 4 - లాహోర్ ఖలందర్స్ v కరాచీ కింగ్స్, గడాఫీ స్టేడియం, లాహోర్

మే 5 - ముల్తాన్ సుల్తాన్స్ v పెషావర్ జల్మీ, ముల్తాన్ క్రికెట్ స్టేడియం

మే 7 - ఇస్లామాబాద్ యునైటెడ్ v క్వెట్టా గ్లాడియేటర్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం

మే 8 - పెషావర్ జల్మీ v కరాచీ కింగ్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం

మే 9 - పెషావర్ జల్మీ v లాహోర్ ఖలందర్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం

మే 10 - ముల్తాన్ సుల్తాన్స్ v క్వెట్టా గ్లాడియేటర్స్, ముల్తాన్ క్రికెట్ స్టేడియం

మే 10 - ఇస్లామాబాద్ యునైటెడ్ vs కరాచీ కింగ్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం

13 మే – క్వాలిఫైయర్ 1, రావల్పిండి క్రికెట్ స్టేడియం

14 మే – ఎలిమినేటర్ 1, గడాఫీ స్టేడియం, లాహోర్

16 మే – ఎలిమినేటర్ 2, గడాఫీ స్టేడియం, లాహోర్

18 మే – ఫైనల్, గడాఫీ స్టేడియం, లాహోర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement