Indian Premier League
-
ఐపీఎల్లో ‘సలైవా’కు అనుమతి!
న్యూఢిల్లీ: బంతిపై నునుపుదనం పెంచడం కోసం సలైవా (ఉమ్మి)ని వాడేందుకు అనుమతించాలంటూ ఇటీవల భారత పేసర్ మొహమ్మద్ షమీ విజ్ఞప్తి చేశాడు. సాధారణంగా ఉమ్మిని రుద్దడం వల్ల బంతి తన మెరుపును కోల్పోకుండా ఉండి రివర్స్ స్వింగ్‌కు సహకరిస్తుంది. ఎన్నో ఏళ్లుగా ఇది ఆటలో భాగంగానే ఉన్నా... కోవిడ్ వచి్చనప్పుడు దీనిపై ఐసీసీ నిషేధం విధించింది. ఇప్పుడు ఆ ప్రమాదం లేదు కాబట్టి నిబంధన తొలగించాలంటూ బౌలర్లు కోరుతున్నారు. ఈ విషయంలో బీసీసీఐ తీవ్రంగా ఆలోచిస్తోంది. బ్యాటర్ల ఆధిపత్యం సాగే లీగ్‌లో కొంతైనా బౌలర్లకు ‘రివర్స్ స్వింగ్’ ప్రయోజనం కలగవచ్చు. కాబట్టి కెప్టెన్లందరూ అంగీకరిస్తే ఐపీఎల్లో ‘సలైవా’ వాడేందుకు బోర్డు అనుమతించే అవకాశం ఉంది. మరోవైపు గతంలోలాగే హైట్, ఆఫ్ సైడ్ వైడ్లను నిర్ణయించే విషయంలో డీఆర్ఎస్ కొనసాగనుంది. -
భారత పాస్‌పోర్టు అప్పగించేస్తా: ఐపీఎల్ మాజీ చైర్మన్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మాజీ చైర్మన్ లలిత్ మోదీ(Lalit Modi) తన భారత పాస్‌పోర్ట్‌ను అప్పగించేందుకు లండన్‌లోని భారత హైకమిషన్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం వివరాలు వెల్లడించింది. ఐపీఎల్ చైర్మన్‌గా ఉన్న సమయంలో భారీగా నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లలిత్ మోదీ... 2010లో భారత్‌ను వదిలి వెళ్లిపోయాడు.అప్పటి నుంచి లండన్‌లో నివాసముంటున్నాడు. ఈ క్రమంలో పసిఫిక్ దీవుల్లోని వనువాతు(Vanuatu) దేశం పౌరసత్వం కూడా పొందాడు. నిధుల దుర్వినియోగం అంశంలో భారత దర్యాప్తు సంస్థలు చాన్నాళ్లుగా లలిత్ మోదీ కోసం గాలిస్తున్నాయి. ‘లండన్‌లోని భారత హైకమిషన్‌లో లలిత్ మోదీ తన పాస్‌పోర్ట్ అప్పగించేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. నిబంధనల ప్రకారం లలిత్ దరఖాస్తును పరిశీలిస్తాం. వనువాతు పౌరసత్వం పొందాడనే విషయాన్ని కూడా అర్థం చేసుకున్నాం. చట్ట ప్రకారం అతడిపై కేసులు కొనసాగుతున్నాయి’ అని భారత విదేశంగా మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణదీర్ జైస్వాల్ వెల్లడించారు. టీ20 ఫార్మాట్, సినీ గ్లామర్‌తో 2008లో భారత్‌లో ఐపీఎల్ రూపుదిద్దుకుంది. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత సంపన్న లీగ్‌గా కొనసాగుతున్న ఈ మెగా టోర్నీ సృష్టికర్తగా లలిత్ మోదీకి పేరుంది. అయితే, ఎంత వేగంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడో అంతే వేగంగా పతనాన్ని చూశాడు లలిత్. 2010 ఫైనల్ తర్వాత భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అతడిని సస్పెండ్ చేసింది.పుణె, కొచ్చి ఫ్రాంఛైజీల బిడ్ల విషయంలో రిగ్గింగ్‌కు పాల్పడ్డాడని, క్రమశిక్షణారాహిత్యం, ఆర్థిక అవకతవల నేపథ్యంలో అతడిపై బోర్డు వేటు వేసి దర్యాప్తునకు ఆదేశించింది. ఈ క్రమంలో విచారణ కమిటి అతడిపై వచ్చిన అభియోగాలు నిజమేనని తేల్చడంతో 2013లో లలిత్ మోదీపై జీవితకాల నిషేధం విధించింది. అనంతరం అతడు లండన్‌కు పారిపోయి.. బీసీసీఐపై అనేక ఆరోపణలు చేశాడు. తాను అయాకుడినని చెప్పుకునే ప్రయత్నం చేశాడు. -
ఐపీఎల్‌తో పోటీకి దిగిన పాకిస్తాన్ సూపర్ లీగ్.. షెడ్యూల్ ప్రకటన
పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) ఇండియన్ ప్రీమియర్ లీగ్‌తో (IPL) నేరుగా పోటీకి దిగింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) పీఎస్ఎల్ 10వ ఎడిషన్ షెడ్యూల్‌ను ఇవాళ (ఫిబ్రవరి 28) ప్రకటించింది. ఈ షెడ్యూల్ ఐపీఎల్-2025 షెడ్యూల్‌తో క్లాష్ అవుతుంది. పీఎస్ఎల్ 10వ ఎడిషన్ ఏప్రిల్ 11 నుంచి ప్రారంభమవుతుంది. మే 18న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ఐపీఎల్ 17వ ఎడిషన్ మార్చి 22న ప్రారంభమై, మే 25న ముగుస్తుంది. ఐపీఎల్లో పాల్గొనే విదేశీ ప్లేయర్లను ఇరకాటంలో పెట్టేందుకే పీసీబీ పీఎస్ఎల్ను ఐపీఎల్ డేట్స్‌లో ఫిక్స్ చేసింది.పీఎస్ఎల్-2025 విషయానికొస్తే.. ఈ సీజన్లో మొత్తం 34 మ్యాచ్‌లు (6 జట్లు) జరుగనున్నాయి. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో రెండు ఎలిమినేటర్ మ్యాచ్‌లు, ఫైనల్ సహా 13 మ్యాచ్‌లు జరుగనున్నాయి. రావల్పిండి స్టేడియం క్వాలిఫయర్-1 సహా 11 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. కరాచీ మరియు ముల్తాన్ స్టేడియాల్లో తలో ఐదు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ సీజన్లో మూడు డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇందులో రెండు వీకెండ్లో (శనివారం) జరుగనుండగా.. ఓ డబుల్ హెడర్ పాక్ నేషనల్ హాలిడే లేబర్ డే రోజున జరుగనుంది.లీగ్ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇస్లామాబాద్ యునైటెడ్ టూ టైమ్ ఛాంపియన్స్ లాహోర్ ఖలందర్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ రావల్పిండి క్రికెట్ స్టేడియంలో జరుగనుంది.ఈ సీజన్లో ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్ కూడా జరుగనుంది. ఏప్రిల్ 8న పెషావర్‌లో ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో పాల్గొనే జట్లపై త్వరలో ప్రకటన వెలువడనుంది.పీఎస్ఎల్-2025 పూర్తి షెడ్యూల్..11 ఏప్రిల్ - ఇస్లామాబాద్ యునైటెడ్ v లాహోర్ ఖలందర్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం12 ఏప్రిల్ - పెషావర్ జల్మీ v క్వెట్టా గ్లాడియేటర్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం12 ఏప్రిల్ - కరాచీ కింగ్స్ v ముల్తాన్ సుల్తాన్స్, నేషనల్ బ్యాంక్ స్టేడియం, కరాచీ13 ఏప్రిల్ - క్వెట్టా గ్లాడియేటర్స్ v లాహోర్ క్వాలండర్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం14 ఏప్రిల్ - ఇస్లామాబాద్ యునైటెడ్ v పెషావర్ జల్మీ, రావల్పిండి క్రికెట్ స్టేడియం15 ఏప్రిల్ - కరాచీ కింగ్స్ v లాహోర్ క్వాలండర్స్, నేషనల్ బ్యాంక్ స్టేడియం, కరాచీ16 ఏప్రిల్ - ఇస్లామాబాద్ యునైటెడ్ v ముల్తాన్ సుల్తాన్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం18 ఏప్రిల్ - కరాచీ కింగ్స్ v క్వెట్టా గ్లాడియేటర్స్, నేషనల్ బ్యాంక్ స్టేడియం, కరాచీ19 ఏప్రిల్ - పెషావర్ జల్మీ v ముల్తాన్ సుల్తాన్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం20 ఏప్రిల్ - కరాచీ కింగ్స్ v ఇస్లామాబాద్ యునైటెడ్, నేషనల్ బ్యాంక్ స్టేడియం, కరాచీ21 ఏప్రిల్ - కరాచీ కింగ్స్ v పెషావర్ జల్మీ, నేషనల్ బ్యాంక్ స్టేడియం, కరాచీ22 ఏప్రిల్ - ముల్తాన్ సుల్తాన్స్ v లాహోర్ క్వాలండర్స్, ముల్తాన్ క్రికెట్ స్టేడియం23 ఏప్రిల్ - ముల్తాన్ సుల్తాన్స్ v ఇస్లామాబాద్ యునైటెడ్, ముల్తాన్ క్రికెట్ స్టేడియం24 ఏప్రిల్ - లాహోర్ ఖలందర్స్ v పెషావర్ జల్మీ, గడ్డాఫీ స్టేడియం, లాహోర్ఏప్రిల్ 25 - క్వెట్టా గ్లాడియేటర్స్ vs కరాచీ కింగ్స్, గడ్డాఫీ స్టేడియం, లాహోర్ఏప్రిల్ 26 - లాహోర్ క్వలండర్స్ vs ముల్తాన్ సుల్తాన్స్, గడ్డాఫీ స్టేడియం, లాహోర్ఏప్రిల్ 27 - క్వెట్టా గ్లాడియేటర్స్ vs పెషావర్ జల్మి, గడ్డాఫీ స్టేడియం, లాహోర్ఏప్రిల్ 29 - క్వెట్టా గ్లాడియేటర్స్ vs ముల్తాన్ సుల్తాన్స్, గడ్డాఫీ స్టేడియం, లాహోర్ఏప్రిల్ 30 - లాహోర్ క్వలండర్స్ vs ఇస్లామాబాద్ యునైటెడ్, గడ్డాఫీ స్టేడియం, లాహోర్మే 1 - ముల్తాన్ సుల్తాన్స్ vs కరాచీ కింగ్స్, ముల్తాన్ క్రికెట్ స్టేడియంమే 1 - లాహోర్ క్వాలండర్స్ v క్వెట్టా గ్లాడియేటర్స్, గడాఫీ స్టేడియం, లాహోర్మే 2 - పెషావర్ జల్మీ v ఇస్లామాబాద్ యునైటెడ్, గడ్డాఫీ స్టేడియం, లాహోర్మే 3 - క్వెట్టా గ్లాడియేటర్స్ v ఇస్లామాబాద్ యునైటెడ్, గడ్డాఫీ స్టేడియం, లాహోర్మే 4 - లాహోర్ ఖలందర్స్ v కరాచీ కింగ్స్, గడాఫీ స్టేడియం, లాహోర్మే 5 - ముల్తాన్ సుల్తాన్స్ v పెషావర్ జల్మీ, ముల్తాన్ క్రికెట్ స్టేడియంమే 7 - ఇస్లామాబాద్ యునైటెడ్ v క్వెట్టా గ్లాడియేటర్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియంమే 8 - పెషావర్ జల్మీ v కరాచీ కింగ్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియంమే 9 - పెషావర్ జల్మీ v లాహోర్ ఖలందర్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియంమే 10 - ముల్తాన్ సుల్తాన్స్ v క్వెట్టా గ్లాడియేటర్స్, ముల్తాన్ క్రికెట్ స్టేడియంమే 10 - ఇస్లామాబాద్ యునైటెడ్ vs కరాచీ కింగ్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం13 మే – క్వాలిఫైయర్ 1, రావల్పిండి క్రికెట్ స్టేడియం14 మే – ఎలిమినేటర్ 1, గడాఫీ స్టేడియం, లాహోర్16 మే – ఎలిమినేటర్ 2, గడాఫీ స్టేడియం, లాహోర్18 మే – ఫైనల్, గడాఫీ స్టేడియం, లాహోర్ -
IPL 2025: కోల్‌కతా X బెంగళూరు
న్యూఢిల్లీ: వేసవిలో క్రీడాభిమానులను అలరించేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సిద్ధమైంది. ఐపీఎల్ 18వ సీజన్‌కు సంబంధించి పూర్తి షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదివారం అధికారికంగా ప్రకటించింది. మార్చి 22న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్ల మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్ టోర్నీకి తెర లేవనుంది. మే 25వ తేదీన కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లోనే జరిగే ఫైనల్‌తో టోర్నీకి తెర పడుతుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో మొత్తం 9 మ్యాచ్‌లు (7 లీగ్ మ్యాచ్‌లు, రెండు ప్లే ఆఫ్ మ్యాచ్‌లు)... విశాఖపట్నంలో రెండు మ్యాచ్‌లు (ఢిల్లీ క్యాపిటల్స్) జరుగుతాయి. » 13 వేదికల్లో 10 జట్ల మధ్య 65 రోజులపాటు నిర్వహించే ఐపీఎల్ 18వ సీజన్లో మొత్తం 74 మ్యాచ్‌లు జరుగుతాయి. ఇందులో 70 లీగ్ మ్యాచ్‌లు... నాలుగు ప్లే ఆఫ్ (క్వాలిఫయర్–1, ఎలిమినేటర్, క్వాలిఫయర్–2, ఫైనల్) మ్యాచ్‌లు ఉన్నాయి. మొత్తం 10 జట్లు సొంత నగరాలతో పాటు... మూడు ఫ్రాంచైజీలు (ఢిల్లీ, రాజస్తాన్, పంజాబ్) తమ హోం మ్యాచ్‌లను రెండో వేదికపై కూడా ఆడాలని నిర్ణయించుకున్నాయి. » ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తమ సీజన్‌ను విశాఖపట్నంలో మొదలు పెడుతుంది. వైజాగ్‌లోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియం వేదికగా జరిగే రెండు మ్యాచ్‌ల్లో (మార్చి 24న లక్నో సూపర్ జెయింట్స్‌తో; మార్చి 30న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో) ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బరిలో దిగుతుంది. రాజస్తాన్ రాయల్స్ రెండు మ్యాచ్‌లను గువాహటిలో, పంజాబ్ కింగ్స్ జట్టు తమ మూడు మ్యాచ్‌లను ధర్మశాలలో ఆడనున్నాయి. ఈ ఐపీఎల్ సీజన్లో ఒకే రోజు రెండు మ్యాచ్‌ల చొప్పున 12 సార్లు జరగనున్నాయి. » సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 23న హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్ జట్టుతో ఆడనుంది. ఈ సీజన్లో మొత్తం హైదరాబాద్ వేదికగా 9 మ్యాచ్‌లు జరగనున్నాయి. మే 20న క్వాలిఫయర్–1, మే 21న ఎలిమినేటర్ మ్యాచ్‌లకు కూడా హైదరాబాద్ ఆతిథ్యమివ్వనుంది. క్వాలిఫయర్–2తో పాటు తుదిపోరు కోల్‌కతాలో జరగనున్నాయి. » లీగ్‌లో 10 జట్లు అయినప్పటి నుంచి జట్లను ఈసారి కూడా రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్–1లో కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్... గ్రూప్–2లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లున్నాయి. లీగ్ దశలో ప్రతి జట్టు మొత్తం 14 మ్యాచ్‌లు ఆడుతుంది. గ్రూప్‌లోని ఒక జట్టు తమ గ్రూప్‌లోని మిగతా నాలుగు జట్లతో రెండుసార్లు చొప్పున ఆడుతుంది. రెండో గ్రూప్‌లోని నాలుగు జట్లతో ఒక్కోసారి, మిగిలిన మరో జట్టుతో రెండుసార్లు తలపడుతుంది. » ‘డబుల్ హెడర్’ ఉన్న రోజు తొలి మ్యాచ్ మధ్యాహ్నం గం. 3:30 నుంచి... రెండో మ్యాచ్ యధావిధిగా రాత్రి గం. 7:30 నుంచి జరుగుతాయి. ఒకే మ్యాచ్ ఉన్న రోజు మ్యాచ్ రాత్రి గం. 7:30 నుంచి జరుగుతుంది. -
BCCI: బీసీసీఐకి కళ్లు చెదిరే ఆదాయం
ప్రపంచంలోని అత్యంత సంపన్న బోర్డుగా భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) పేరుగాంచింది. ఇతర క్రికెట్ బోర్డులకు అందనంత ఎత్తులో ఉన్న బీసీసీఐకి 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారీగానే ఆదాయం చేకూరింది. ఏడాది కాలంలో రెవెన్యూలో రూ. 4200 కోట్ల మేర పెరుగుదల కనిపించింది.వార్తా సంస్థ పీటీఐ అందించిన వివరాల ప్రకారం.. ‘‘2023 ఆర్థిక సంవత్సరంలో రూ. 16,493 కోట్లుగా ఉన్న బీసీసీఐ నగదు, బ్యాంక్ బ్యాలెన్స్.. 2024 ముగింపు నాటికి రూ. 20,686 కోట్లకు చేరింది. సుమారుగా రూ. 4200 వేల కోట్ల మేర ఆదాయం పెరిగింది’’ అని బీసీసీఐ తన డాక్యుమెంట్లో పేర్కొంది.ప్రధాన ఆదాయ వనరులివేకాగా క్రికెట్ ప్రపంచంలో అత్యంత ఖరీదైన లీగ్‌గా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) కొనసాగుతోంది. ఈ క్యాష్ రిచ్ లీగ్ ద్వారానే బీసీసీఐకి అధికమొత్తంలో ఆదాయం చేకూరుతోంది. ఐపీఎల్ మీడియా హక్కుల రూపంలో భారీ మొత్తం ఆర్జిస్తున్న బీసీసీఐ.. ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌ల ద్వారానూ దండిగానే సంపాదిస్తోంది.ఐసీసీ నుంచి సింహభాగంజూన్ 2022లో ఐదేళ్ల కాల వ్యవధికి గానూ ఐపీఎల్ మీడియా హక్కులను భారత బోర్డు రికార్డు స్థాయిలో రూ. 48,390 కోట్లకు అమ్ముకుంది. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మార్కెట్ కలిగి ఉన్న బీసీసీఐకి.. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ద్వారా వచ్చే ఆదాయం కూడా ఎక్కువే. మిగతా బోర్డులతో పోలిస్తే బీసీసీఐకే సింహభాగం లభిస్తుంది. ఈ నేపథ్యంలోనే రిచెస్ట్ బోర్డుగా బీసీసీఐ అవతరించింది.బీసీసీఐ దరిదాపుల్లో కూడా లేని బోర్డులునిజానికి 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా రూ. 7476 కోట్ల మేర ఆదాయం ఆర్జించాలని బీసీసీఐ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, అనూహ్య రీతిలో రూ. రూ. 8995 కోట్ల రెవెన్యూ వచ్చింది. ఇక 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ బీసీసీఐ రూ. 10,054 కోట్ల ఆదాయం ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాగా బీసీసీఐ పరిధిలో 38 స్టేట్ క్రికెట్ బోర్డు విభాగాలు ఉన్నాయి.ఇదిలా ఉంటే.. సెప్టెంబరు 2024 నాటికి ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ క్రికెట్ బోర్డుల విలువ కలిపి రూ. 1608 కోట్లు. బీసీసీఐ(రూ. 20,686 కోట్లు) తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా(రూ. 658 కోట్లు), ఇంగ్లండ్(రూ. 492 కోట్లు), పాకిస్తాన్(రూ. 458 కోట్లు), బంగ్లాదేశ్(రూ. 425 కోట్లు), సౌతాఫ్రికా(రూ. 392 కోట్లు) టాప్-5లో ఉన్నాయి. చదవండి: ‘త్వరలోనే భారత్‌కు కోహ్లి గుడ్‌బై... లండన్‌లో స్థిరనివాసం’ -
IPL 2025: మరో జెర్సీలో ఊహించుకోలేను..ఎప్పటికీ ఆర్సీబీతోనే!
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మరో జట్టు జెర్సీలో తనని తాను ఊహించుకోలేనని భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి వెల్లడించాడు. లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కే ప్రాతినిధ్యం వహిస్తున్న కోహ్లి... మరో మూడేళ్ల పాటు బెంగళూరుకు ఆడటం ఖాయమే అని సూచనప్రాయంగా చెప్పాడు. 2008లో ఐపీఎల్ ప్రారంభం కాగా... అప్పటి నుంచి కోహ్లి బెంగళూరు జట్టు తరఫునే బరిలోకి దిగుతూ వస్తున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకే జట్టుకు ఇన్ని సీజన్లు ఆడిన ఏకైక ప్లేయర్‌గా విరాట్ రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ మెగా వేలానికి ముందు తాజాగా జరిగిన రిటెన్షన్ విధానంలో ఆర్సీబీ యాజమాన్యం రూ. 21 కోట్లకు కోహ్లిని తిరిగి దక్కించుకుంది. 36 ఏళ్ల విరాట్ 2027 వరకు బెంగళూరు జట్టు తరఫున ఆడనున్నట్లు ఆర్సీబీ విడుదల చేసిన ప్రత్యేక వీడియోలో వెల్లడించాడు. ఐపీఎల్లో ఇప్పటి వరకు 252 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి... 131.97 స్ట్రయిక్ రేట్, 38.66 సగటుతో 8004 పరుగులు చేశాడు. అందులో 8 సెంచరీలు 55 అర్ధ శతకాలు ఉన్నాయి. తాజా రిటెన్షన్ విధానం మరో మూడేళ్లు కొనసాగనుండగా... అప్పటి వరకు ఆర్సీబీ జట్టులో విరాట్ కీలక పాత్ర పోషించనున్నాడు. ‘ఈ సర్కిల్ ముగిసేసరికి నాకు ఐపీఎల్లో 20 ఏళ్లు పూర్తవుతాయి. అప్పటి వరకు ఆర్సీబీతోనే కొనసాగడం చాలా గొప్ప విషయంగా అనిపిస్తోంది. కెరీర్ ఆరంభించిన తొలినాళ్లలో ఇన్నాళ్లు ఆడతానని అనుకోలేదు. కానీ ఫ్రాంచైజీ యాజమాన్యంతో ఉన్న అనుబంధం వల్ల ఈ ప్రయాణం సాగుతోంది. ఒకే జట్టుతో ఇన్నేళ్ల పాటు ఉండటం బాగుంది. ఆర్సీబీతో నా బంధం ఎంత బలమైందంటే... నన్ను నేను వేరే ఐపీఎల్ జెర్సీలో ఊహించుకోలేను. కొత్త సీజన్ కోసం ఆసక్తితో ఎదురుచూస్తున్నా. కొత్త జట్టును సిద్ధం చేసేందుకు నేను రెడీగా ఉన్నాను. జట్టును ముందుకు తీసుకెళ్లడంలో నా వంతు పాత్ర పోషిస్తా. ఐపీఎల్ టైటిల్ సాధించడం మా అందరి లక్ష్యం. వచ్చే మూడేళ్లలో అది సాధ్యమయ్యే దిశగా అడుగులువేస్తా’ అని కోహ్లి వెల్లడించాడు. ఆర్సీబీ అభిమానుల గురించి మాట్లాడుతూ కోహ్లి భావోద్వేగానికి గురయ్యాడు. ఒక్కసారి టైటిల్ గెలవకపోయినా...గెలుపోటముల్లో ఎల్లవేళలా మద్దతునిచ్చిన ఫ్యాన్స్‌కు అతను కృతజ్ఞతలు తెలిపాడు. ‘ప్రపంచంలో ఏ జట్టుకు లేనంత మంది అభిమానులు అర్సీబీకి ఉన్నారు. వారితో విడదీయలేని అనుబంధం ఉంది. ఆర్సీబీ అంటే నేను అనే విధంగా అభిమానులు చూపే ఆదరణకు ముగ్దుడిని అయ్యాను. ఇన్నేళ్లలోనే నేను సంపాదించుకున్న అతి విలువైనది అభిమానుల మనసు గెలవడమే. రోజు రోజుకు నాకు, అభిమానులకు మధ్య బంధం బలపడుతూ వస్తోంది. ఆర్సీబీ తరఫున బరిలోకి దిగిన ప్రతిసారి ప్రేక్షకుల అరుపులు నాకు మరింత ఉత్సాహాన్నిస్తాయి. అదే కొత్త జోష్లాగా ఉంటుంది. తదుపరి దశలో ఏం చేయగలననే దానిపైనే దృష్టి పెడుతున్నా.నా వరకు బరిలోకి దిగిన ప్రతిసారి వంద శాతం కష్ట పడేందుకు ప్రయత్నిస్తా. ఫలితం మన చేతిలో ఉండదు. అభిమానులు గర్వపడే ప్రదర్శన చేయడమే నా కర్తవ్యం. మైదానంలో అభిమానులు నా పేరు, ఫ్రాంచైజీ పేరుతో గోల చేయడాన్ని నాకు దక్కిన గౌరవంగా భావిస్తా’ అని విరాట్ వీడియోలో వివరించాడు. విరాట్ వెన్నెముక: ఆండీ ఫ్లవర్ ఇక బెంగళూరు హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ మాట్లాడుతూ... రిటెన్షన్ విధానంలో సరైన ఆటగాళ్లనే ఎంపిక చేసుకున్నట్లు వెల్లడించాడు. ఆర్సీబీకి విరాట్ వెన్నెముక లాంటి ఆటగాడని ఆండీ ఫ్లవర్ పేర్కొన్నాడు. ‘విరాట్ కోహ్లిని రీటైన్ చేసుకోవడం నన్నే కాదు... దేశంలో ఏ ఒక్కరినీ ఆశ్చర్య పరచలేదు. అతడు చాన్నాళ్లుగా జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. బెంగళూరు ఫ్రాంచైజీ విజయవంతం కావడానికి విరాట్ ప్రధాన కారణం. గత సీజన్లో అతడు అద్భుత ప్రదర్శన చేశాడు. లీగ్ తొలి అర్ధ భాగంలో జట్టు ప్రదర్శన చెప్పుకోదగ్గ స్థాయిలో లేకపోయినా... అతడి ఆటతీరుకు వంక పెట్టలేం. ఆ తర్వాత తిరిగి గాడిన పడిందంటే అది కూడా విరాట్ వల్లే’ అని ఆండీ ఫ్లవర్ అన్నాడు. ఐపీఎల్ రిటెన్షన్ గడువు ముగియగా... బెంగళూరు జట్టు ముగ్గురు ఆటగాళ్లను మాత్రమే అట్టి పెట్టుకుంది. రూ. 21 కోట్లు పెట్టి విరాట్‌ను తిరిగి తీసుకున్న ఆర్సీబీ దూకుడైన బ్యాటర్ రజత్ పటిదార్‌కు రూ. 11 కోట్లు, లెఫ్టార్మ్ పేస్ బౌలర్ యశ్ దయాళ్‌కు రూ. 5 కోట్లు కేటాయించింది. ఆటగాళ్లను కొనుగోలు చేసుకునేందుకు ఒక్కో జట్టుకు అత్యధికంగా రూ. 120 కోట్లు కేటాయించగా... అందులో బెంగళూరు ఫ్రాంచైజీ 37 కోట్లు ఖర్చు పెట్టింది. వేలం కోసం ఆర్సీబీ వద్ద రూ. 83 కోట్లు మిగిలాయి. ఈ నెలాఖరున జరిగే ఐపీఎల్ వేలంలో బెంగళూరు ఎలాంటి జట్టును ఎంపిక చేసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ముగ్గురు క్యాప్డ్ ప్లేయర్లను ఆర్టీఎమ్ ద్వారా తిరిగి దక్కించుకునే అవకాశం బెంగళూరుకు ఉండగా... ఇప్పటి వరకు జట్టును నడిపించిన ఫాఫ్ డుప్లెసిస్, ఆ్రస్టేలియా హార్డ్ హిట్టర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్, హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్‌ను అట్టి పెట్టుకోకుండా విడుదల చేసింది. -
BCCI: ఐపీఎల్ మాదిరే మరో టీ20 లీగ్? లెజెండ్స్ స్పెషల్?
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) మాదిరే మరో ఫ్రాంఛైజీ లీగ్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) శ్రీకారం చుట్టనుందా?.. వేలం ప్రాతిపదికన ఆటగాళ్లను కొనుగోలు చేసి.. జట్లను ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వనుందా?.. అంటే అవుననే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు. అయితే, ఈ టీ20 లీగ్ రిటైర్ అయిన క్రికెటర్ల కోసమే ప్రత్యేకంగా రూపుదిద్దుకోనుందని సమాచారం.బీసీసీఐ ఆధ్వర్యంలో 2008లో మొదలైన ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్‌గా పేరొందింది. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో ప్రతిభ నిరూపించుకున్న క్రికెటర్లు.. పేరుప్రఖ్యాతులతో పాటు కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారు. ఇక టీమిండియా వెటరన్లు సైతం ఈ లీగ్ ద్వారా ఇంకా యాక్టివ్ క్రికెటర్లుగా కొనసాగుతూ తమలో సత్తా తగ్గలేదని నిరూపించుకుంటున్నారు.లెజెండ్స్ స్పెషల్?అయితే, ఐపీఎల్‌కు కూడా రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాళ్లలో కొందరు లెజెండ్స్ లీగ్ క్రికెట్ వంటి పొట్టి ఫార్మాట్ టోర్నీల ద్వారా రీఎంట్రీ ఇస్తున్నారు. యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్ వంటి మాజీలు ఇందులో భాగమవుతున్నారు. అయితే, ఇలా ప్రైవేట్ లీగ్‌లలో కాకుండా బీసీసీఐ నేతృత్వంలోని లీగ్‌లో ఆడాలని భారత మాజీ క్రికెటర్లు భావిస్తున్నట్లు సమాచారం.ఈ క్రమంలో బీసీసీఐ కార్యదర్శి జై షాను కలిసి తమ మనసులో మాటను వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి బీసీసీఐ అధికారి ఒకరు దైనిక్ జాగరణ్తో మాట్లాడుతూ.. ‘‘టీ20 లీగ్ నిర్వహణకు సంబంధించి మాజీ క్రికెటర్ల నుంచి ప్రతిపాదన వచ్చింది. ఈ ప్రపోజల్‌ను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. మేము కూడా సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చుబీసీసీఐ ఇప్పటికే ఐపీఎల్‌తో పాటు మహిళా ప్రీమియర్ లీగ్(WPL) కూడా నిర్వహిస్తోంది. ఇక ఈసారి ఐపీఎల్ మెగా వేలం కూడా జరుగబోతోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు లీగ్‌ల నిర్వహణతో పాటు వేలానికి సంబంధించిన పనులతో బీసీసీఐ బిజీగా ఉంది. ఇలాంటి సమయంలో మాజీ క్రికెటర్లు ప్రతిపాదించినట్లుగా లెజెండ్స్ లీగ్ నిర్వహించడం సాధ్యం కాకపోవచ్చు. అయితే, భవిష్యత్తులో మాత్రం ఈ లీగ్ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా బీసీసీఐతో అన్ని సంబంధాలు తెంచుకున్న క్రికెటర్లు మాత్రమే విదేశీ లీగ్‌లలో ఆడేందుకు అనుమతి ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వదేశీ లీగ్‌తోనే మరోసారి సత్తా చాటాలని మాజీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.చదవండి: అతడే ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్: సౌరవ్ గంగూలీ -
ఐపీఎల్ సృష్టికర్త కుమార్తె.. వేల కోట్లకు వారసురాలు! ఆమె ప్రత్యేకత ఇదే!
ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన టీ20 లీగ్‌గా పేరొందింది ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఈ క్యాష్ రిచ్ లీగ్ సృష్టికర్త లలిత్ కుమార్ మోదీ. సినీ సెలబ్రిటీలు, కార్పొరేట్ దిగ్గజాల దృష్టిని ఆకర్షించి.. ప్రపంచ క్రికెటర్లందినీ ఒకే వేదిక మీదకు తీసుకొచ్చిన ఘనత సొంతం చేసుకున్నాడు ఈ బిజినెస్‌మేన్.అప్పటి వరకు ఎన్ని వ్యాపారాలు ఉన్నా ఐపీఎల్‌తోనే పాపులర్ అయిన లలిత్ మోదీ.. క్రికెట్ ప్రపంచంలో ఓ వెలుగు వెలిగాడు. అయితే, ఆర్థిక లావాదేవీల విషయంలో అవకతవలకు పాల్పడి అదే స్థాయిలో అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. దేశం నుంచి పారిపోయి ఆర్థిక నేరగాడిగా ముద్రవేసుకున్నాడు.ఆ మధ్య సుస్మితా సేన్‌తో ప్రేమాయణంతో మళ్లీ వార్తల్లోకి వచ్చిన లలిత్ మోదీ.. ఇటీవల టీ20 ప్రపంచకప్-2024లో ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ టికెట్ రేట్ల విషయమై ఐసీసీని విమర్శిస్తూ తెరమీదకు వచ్చాడు.ఈ నేపథ్యంలో లలిత్ మోదీ వ్యక్తిగత జీవితం, నెట్‌వర్త్, ఆయన వారసుల గురించి తాజాగా నెటిజన్లలో చర్చ మొదలైంది. తనకంటే వయసులో తొమ్మిదేళ్లు పెద్దదైన మినాల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న లలిత్ మోదీకి కుమార్తె అలియా, కుమారుడు రుచిర్ ఉన్నారు.DNA ఇండియా నివేదిక ప్రకారం.. జూలై 2022 నాటికి లలిత్ మోదీ నికర ఆస్తుల విలువ 4,555 కోట్ల రూపాయలు. ఇక ఆయనకు సంబంధించిన మోది ఎంటర్ప్రైజెస్ విలువ రూ. 23,450 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం.అలియా మోదీ.. ఆసక్తికర నేపథ్యంలలిత్ మోదీ ఆస్తులకు వారసురాలైన అలియాకు తన తమ్ముడు రుచిర్తో మంచి అనుబంధం ఉంది. తోబుట్టువులిద్దరు ఒకరికి ఒకరు అండగా ఉంటూ.. వ్యాపారంలో రాణిస్తున్నారు.అలియా మోదీ ఇంటీరియర్ డిజైనర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె సొంతంగా రూ. 41 కోట్ల మేర ఆస్తి కలిగి ఉన్నట్లు సమాచారం. ఇక అలియా వ్యక్తిగత జీవితానికొస్తే.. 2022 మేలో ఆమె బ్రెట్ కార్ల్‌సన్‌ను పెళ్లి చేసుకున్నారు.ఇటలీలోని వెనిస్ నగరంలో వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ నేపథ్యంలో కూతురు- అల్లుడి ఫొటోలను షేర్ చేస్తూ లలిత్ మోదీ మురిసిపోయాడు. ఇక సెలబ్రిటీల జీవితం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న నెటిజన్లు ఈ ఫొటోలను తవ్వితీసి.. అలియా మోదీని హైలైట్ చేస్తున్నారు. అదీ.. ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోదీ కుటుంబం సంగతి! -
పాకిస్తాన్ సూపర్ లీగ్ కంటే ఐపీఎల్ చాలా పెద్దది: వసీం అక్రమ్
ఐపీఎల్- ప్రపంచంలో ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్‌లకు రారాజు. ప్రపంచంలోని ప్రతీ ఒక్క క్రికెటర్ ఐపీఎల్లో భాగం కావాలని కలలు కంటుంటారు. పీఎల్‌కు పోటీగా ఎన్నో లీగ్‌లు పుట్టుకొచ్చినప్పటికీ.. ఈ క్యాచ్ రిచ్ లీగ్ క్రేజ్ ఏ మాత్రం తగ్గించలేకపోయాయి. అయితే మన చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్ సైతం ఐపీఎల్‌కు పోటీగా ఓ టీ20 లీగ్(పాకిస్తాన్ సూపర్ లీగ్)ను నిర్వహిస్తోంది. ఇప్పటికీ 8 సీజన్లు గడిచిపోయినప్పటికీ పీఎస్ఎల్ మాత్రం పెద్దగా ఆదరణ పొందలేకపోయింది. కానీ పాక్ క్రికెటర్లు, మాజీలు పాకిస్తాన్ సూపర్ లీగ్‌నే వరల్డ్‌లో నెం1 అని ప్రగల్బాలు పలుకుతూ వస్తూ ఉన్నారు. అయితే పాకిస్తాన్ లెజెండ్ వసీం అక్రమ్ మాత్రం వాస్తవాన్ని ఒప్పుకున్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ కంటే ఐపీఎల్ చాలా పెద్ద క్రికెట్ లీగ్ అని అక్రమ్ పేర్కొన్నాడు. అక్రమ్ తాజాగా ప్రముఖ క్రీడా వెబ్సైట్ స్పోర్ట్కీడాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా వరల్డ్ ప్రాంఛైజీ క్రికెట్ లీగ్‌లో ఐపీఎల్ లేదా పీఎస్ఎల్ పెద్దదా అన్న ప్రశ్న ఎదురైంది. అందుకు బదులుగా.. 'నేను పీఎస్ఎల్తో పాటు ఐపీఎల్‌లోనూ కోచ్‌గా పనిచేశాను. అన్నిటికంటే ఐపీఎల్ అతి పెద్ద ప్రాంఛైజీ క్రికెట్ లీగ్. అందులో ఎటువంటి సందేహం లేదు. పీఎస్ఎల్ను ఐపీఎల్‌తో పోల్చడం సరికాదు. పీఎస్ఎల్ పాకిస్తాన్‌కు మినీ ఐపీఎల్ వంటిది" అని అక్రమ్ పేర్కొన్నాడు. చదవండి: #Saumy Pandey: ఐపీఎల్ వేలంలో ఎవరూ కొనలేదు.. అక్కడ మాత్రం చెలరేగాడు! 6 వికెట్లతో -
అలా మొదలై.. కాసుల పంట పండిస్తోంది
ఇండియన్ ప్రీమియర్ లీగ్.. భారత క్రికెట్లో విప్లవాత్మకమైన మార్పు తీసుకువచ్చింది. అభిమానులకు టీ20 క్రికెట్ రుచిని చూపించేందుకు పుట్టుకువచ్చిన ఐపీఎల్.. ఇప్పుడు కాసుల వర్షం కురిపించే క్యాష్ రిచ్ లీగ్‌గా మారిపోయింది. ఈ క్యాష్‌రిచ్ లీగ్ ద్వారా ఎంతోమంది యువ ఆటగాళ్లు క్రికెట్ ప్రపంచానికి పరిచమయ్యారు. కోహ్లి నుంచి తిలక్ వర్మ వరకు ఈ మెగా ఈవెంట్లో సత్తా చాటి భారత జట్టులోకి వచ్చిన వారే. ఎంతో మంది మట్టిలో మాణిక్యాలను కోట్లకు అధిపతి చేసిన ఘనత కూడా ఈ ఐపీఎల్‌దే. ప్రపంచంలోని ప్రతీ ఒక్క ఆటగాడు కనీసం ఒక్కసారైనా ఐపీఎల్లో భాగం కావాలని భాగం కావాలని కలలు కంటాడు. ఈ ఏడాదితో మొత్తం 16 సీజన్లను ఐపీఎల్ దిగ్వజయంగా పూర్తిచేసుకుంది. ఐపీఎల్‌తో భారత క్రికెట్లో ఒక కొత్త శకం మొదలైందనే చెప్పాలి. ఎంతోమంది టాలెంటెడ్ క్రికెటర్లను ప్రపంచానికి పరిచయం చేసిన ఐపీఎల్.. అంతే స్థాయి లాభాలతో మురిసిపోయింది. ఒక సాధరణ ఫ్రాంఛైజీ క్రికెట్ లీగ్‌గా మొదలైన ఐపీఎల్.. ప్రపంచక్రికెట్‌ను శాసించే స్ధాయికి ఎలా చేరుకుందో ఓ లూక్కేద్దాం. అలా మొదలైంది.. 15 ఏళ్ల క్రితం వరకు భారత డొమాస్టిక్ క్రికెట్లో కనీస మౌళిక సదుపాయాలు ఉండేవి కావు. ఈ క్రమంలో జాతీయ జట్టు నుంచి ఆటగాళ్లు రిటైర్ అయ్యాక.. వారిని భర్తీ చేసేందుకు సరైన ఆటగాళ్లు అందుబాటులో లేకపోయేవారు. ఈ సమయంలో ఈస్సెల్ గ్రూపు సీఈవో సుభాష్ చంద్ర భారత క్రికెట్‌ను అభివృద్ది చేసేందుకు ముందుకు వచ్చాడు. భారత్‌లో జరిగే మ్యాచ్‌ల ప్రసారాల కోసం జీ స్పోర్ట్స్ ఛానల్‌ను ప్రారంభించాడు. అదే విధంగా టెన్‌స్పోర్ట్స్ ఛానల్లోని 50 శాతం వాటాను కూడా సుభాష్ చంద్ర కొనుగోలు చేశాడు. దీంతో పాకిస్తాన్, శ్రీలంక, వెస్టిండీస్‌లో జరిగే మ్యాచ్‌లను ప్రసారం చేసే కాంట్రాక్ట్ టెన్‌స్పోర్ట్స్ దక్కించుకుంది. అయితే భారత్‌లో జరిగే మ్యాచ్‌లు టెలికాస్టింగ్ రైట్స్ మాత్రం జీ స్పోర్ట్స్ దక్కలేదు. జీ ఛానల్‌కు స్పోర్ట్ మార్కటింగ్ అనుభవం లేదని అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా ప్రసార హక్కులను తిరష్కరించాడు. సుభాష్ చంద్ర తన రాజకీయ పలుకుబడి ఉపయోగించిన ఫలితం దక్కలేదు. ఇదే సమయంలో టీ20 క్రికెట్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రజాధారణ పెరుగుతోంది. దీంతో 2007లో దక్షిణాఫ్రికా వేదికగా తొలి టీ20 ప్రపంచకప్‌ను ఐసీసీ నిర్వహించింది. ఈ టోర్నీలో అండర్ డగ్స్గా బరిలోకి దిగిన భారత్.. ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి జగజ్జేతగా నిలిచింది. టీమిండియా తొలి టీ20 ప్రపంచకప్ సాధించినప్పటికీ.. భారత్‌లో మాత్రం టీ20 క్రికెట్‌కు అదరణ పెద్దగా లేదు. ఈ క్రమంలో బీసీసీఐకు రెబల్‌గా ఉన్న సుభాష్ చంద్ర దేశీవాళీ క్రికెట్లో ఓ టీ20 టోర్నీని నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో దేశవాళీ క్రికెట్లోని స్టార్ ఆటగాళ్లు, ప్రపంచంలోని కొంతమంది క్రికెటర్లతో సుభాష్ చంద్ర ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ లీగ్‌కు అతడు ఇండియన్ క్రికెట్ లీగ్ అని నామకారణం చేశాడు. ఇండియన్ క్రికెట్ లీగ్ మొదటి సీజన్ 2007లో ప్రారంభమైంది. అయితే ఈ లీగ్‌పై బీసీసీఐ మొదటి నుంచే అంసతృప్తిగా ఉంది. ఈ లీగ్‌ను అపేందుకు బీసీసీఐ చాలా ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలో ఒక్కసారిగా డొమాస్టిక్ క్రికెట్లో ఆటగాళ్ల జీతాలను భారీగా పేంచేసింది. ఆటగాళ్లు ఎవరూ ఈ లీగ్‌లో ఆడకూడదని బీసీసీఐ హెచ్చరికలు జారీ చేసింది. ఐసీఎల్‌కు ఎండ్‌కార్డ్ వేయాలని బీసీసీఐ వ్యూహాలు మొదలుపెట్టింది. క్రమంలో బీసీసీఐ వైస్‌ప్రెసిడెంట్‌గా ఉన్న లలిత్ మోడీకి ఆలోచన వచ్చింది. బీసీసీఐ అద్వర్యంలోనే ఓ క్రికెట్ లీగ్ మొదలుపెడితే బాగుటుందని మోడీ నిర్ణయించుకున్నాడు. లలిత్ మోడీ ఆలోచనల నుంచి పుట్టుకువచ్చిందే ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్. 13 సెప్టెంబర్ 2007న ఐపీఎల్‌ను బీసీసీ అధికారంగా లాంఛ్ చేసింది. నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (NBA) ఫార్మాట్ ఆధారంగా ఐపీఎల్ ఫార్మాట్‌ను మోడీ తీర్చిదిద్దాడు. మొదటి ఐపీఎల్ వేలం జనవరి 24, 2008న జరిగింది. 2008లో ప్రారంభమైన తొలి సీజన్లో మొత్తం 8 జట్లు పాల్గొనున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్,డెక్కన్ ఛార్జర్స్,ఢిల్లీ డేర్ డెవిల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కోల్‌కతా నైటరైడర్స్ జట్లు, ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు మొదటి సీజనన్‌లో భాగమయ్యాయి. ఈ క్యాష్‌రిచ్ లీగ్ విజేతగా దివంగత షేన్ వార్న్ సారధ్యంలోని రాజస్తాన్ రాయల్స్ నిలిచింది. ప్రస్తుతం ఐపీఎల్లో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ రూపంలో మరో రెండు జట్లు ఈ లీగ్‌లో భాగమయ్యాయి. ఇప్పటివరకు 16 సీజన్లలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ చెరో ఐదు సార్లు ఛాంపియన్స్‌గా నిలవగా.. కోల్‌కతా, డెక్కన్ ఛార్జర్స్ రెండు సార్లు, రాజస్తాన్, గుజరాత్ ఒక్కసారి టైటిల్‌ను సొంతం చేసుకున్నాయి. యువ క్రికెటర్లు ఎంట్రీ.. యువ క్రికెటర్లు తమ టాలెంట్‌ను నిరూపించుకోవడానికి ఐపీఎల్ ఒక సరైన వేదిక. ఎంతో మంది ఆటగాళ్లు ఇదే వేదికపై సత్తాచాటి జాతీయ జట్టులో చోటు దక్కించకున్నారు. ప్రతీ ఐపీఎల్ సీజన్ నుంచి సరికొత్త యంగ్ టాలెంట్ ప్రపంచానికి పరిచయవుతోంది. ముఖ్యంగా సీనియర్ క్రికెటర్లతో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోవడంతో యువ ఆటగాళ్లు చాలా విషయాలు నేర్చకుంటున్నారు. భారత్ మాత్రమే కాకుండా విదేశీ యువ క్రికెటర్లు కూడా ఐపీఎల్లో దుమ్మురేపుతున్నారు. బీసీసీఐపై కాసుల వర్షం... ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెటర్లపైనే కాకుండా భారత క్రికెట్ బోర్డుపై కాసుల వర్షం కురిపిస్తోంది. బీసీసీఐను ప్రపంచక్రికెట్లో ధనిక బోర్డుగా ఐపీఎల్ మార్చేసేంది. బీసీసీఐకు ఐపీఎల్ బంగారు బాతు. ఐపీఎల్ మీడియా హక్కుల వేలం ద్వారా బీసీసీఐ భారీగా అర్జిస్తోంది. తాజాగా ఐపీఎల్ ఐదేళ్ల(2023-27) మీడియా రైట్స్‌ను రూ. 48,390 కోట్లకు బీసీసీఐ విక్రయించింది. అంతేకాకుండా ఫ్రాంజైలు, కార్పొరేట్ స్పాన్సర్స్‌ల నుంచి వేల కోట్లు బీసీసీఐ ఖాజానాలో వచ్చి చేరుతున్నాయి. అభిమానులకు పండగే.. ప్రతీ ఏడాది క్రికెట్ అభిమానులను రెండు నెలల పాటు ఈ క్యాష్‌రిచ్ లీగ్ అలరిస్తోంది. మార్చిలో మొదలై మేలో ఈ వరల్డ్ ఫేమస్ లీగ్ ముగుస్తుంది. మ్యాచ్‌లో సమయంలో అభిమానులు టీవీలకు అతుక్కుపోతారు. ప్రతీ జట్టుకు స్పెషల్ ఫాలోయింగ్ ఉంటుంది. ఐపీఎల్ వల్ల నష్టాలు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో, అన్నే నష్టాలు కూడా ఉన్నాయి. ఐపీఎల్ విజయవంతం కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్‌లు పుట్టగొడుగుల్లా పుట్టుకు వచ్చాయి. ఈ ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్‌లలో మోజులో పడి ఆటగాళ్లు తమ దేశం తరపున ఆడేందుకు విముఖత చూపుతున్నారు. కొంతమంది అయితే ఈ లీగ్‌ల్లో భాగం కావడానికి ఏకంగా అంతర్జాతీయ క్రికెట్‌కే విడ్కోలు పలుకుతున్నారు. ఒకప్పుడు తమ దేశం తరపున ఆడితే చాలని భావించిన క్రికెటర్లు.. ఇప్పుడు ఐపీఎల్ వంటి ఫ్రాంచైజీ లీగ్ల్లొ ఆడితే చాలని అనుకుంటున్నారు. అంతే కాకుండా ఐపీఎల్లో విరామం లేకుండా రెండు నెలలపాటు ఆడటంతో ఆటగాళ్లు అలసటకు గురవుతున్నారు. అంతేకాకుండా ఈ లీగ్‌లో గాయపడి దేశం తరపున ఆడే కీలక టోర్నీలకు దూరం అవుతున్నారు. అదే విధంగా ఈ ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్‌లు వల్ల టెస్టుక్రికెట్ కూడా ఆడేందుకు ఆటగాళ్లు ముందుకు రావడం లేదు. చాలా కెరీర్ ఉన్నప్పటికీ ముందుగానే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారు. బెట్టింగ్‌లు జోరుగా ఇక ఐపీఎల్లో మొదలైతే చాలు బెట్టింగ్ రాయులకు పండగే. ఈ క్రికెట్ పండగ జరిగే రెండు నెలలపాటు దేశవ్యాప్తంగా బెట్టింగ్ జోరుగా సాగుతోంది. చాలా మంది బెట్టింగ్ బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఐపీఎల్లో చీకటి కోణాలు.. ఇక విజయవంతంగా దూసుకుపోతున్న ఐపీఎల్లో వినోదం మాత్రమే కాదు ఎన్నో చీకటి కోణాలు కూడా ఉన్నాయి. సరిగ్గా పదేళ్ల క్రితం 2013 సీజన్లో మ్యాచ్ ఫిక్సింగ్ తీవ్ర కలకలం రేపింది. రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు శ్రీశాంత్, అజయ్ చండీలా, అంకిత్ చౌహాన్ బుకీల నుంచి డబ్బు తీసుకుని ఫిక్సింగ్‌కు పాల్పడ్డారు. దీంతో బీసీసీఐ వారిపై జీవితకాల నిషేధం విధించింది. అలాగే రాజస్థాన్, చెన్నై సూపర్‌కింగ్స్ జట్లపై రెండేళ్ల పాటు నిషేధం కూడా విధించారు. ఐపీఎల్ లో ఓ సారి రాహుల్ శర్మ, దక్షిణాఫ్రికా ప్లేయర్ వైన్ పార్నెల్ ఓ రేవ్ పార్టీలో పోలీసులకు పట్టుబడ్డారు. ఆ పార్టీలో డ్రగ్స్ కూడా దొరికాయి. ఈ విషయాన్ని బీసీసీఐ సీరియస్‌గా తీసుకుంది. అదే విధంగా ఛీర్ గర్ల్స్ ఊదంతం కూడా ఐపీఎల్ ను ఓ ఊపు ఊపేసింది. కొంతమంది ఆటగాళ్లు తామతో అసభ్య ప్రవర్తన చేశారని ఛీర్ గర్ల్స్ గతంలో ఆరోపణలు చేశారు. చదవండి: PV Sindhu Headlines This List: అప్పుడు వాళ్లు అలా! ఇప్పుడు వీరిలా.. తలెత్తుకునేలా చేశారు.. శెభాష్! -
కప్ కొట్టేది ఎవరు ?
-
IPL 2023: ‘రన్’రంగం రె‘ఢీ’... ఐపీఎల్ పూర్తి షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్ విశేషాలు
కరోనా నేపథ్యంలో గత మూడు సీజన్లు పలు ఆంక్షల మధ్య జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 క్రికెట్ టోర్నీకి మళ్లీ పూర్వ వైభవం వచ్చింది. ఈసారి ఎలాంటి ఆంక్షలు లేకుండా అభిమానులకు పూర్తిస్థాయిలో వేసవిలో పరుగుల విందు అందించడానికి ఐపీఎల్ జట్లు సిద్ధమయ్యాయి. శుక్రవారం అహ్మదాబాద్‌లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్, నాలుగుసార్లు విజేత చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి మ్యాచ్‌తో ఐపీఎల్ 16వ సీజన్‌కు తెర లేవనుంది. మొత్తం 10 జట్ల మధ్య 12 నగరాల్లో 74 మ్యాచ్‌లు జరగనున్నాయి. లీగ్ దశలో 70 మ్యాచ్‌లు ఉండగా... ప్లే ఆఫ్ దశలో నాలుగు మ్యాచ్‌లతో (క్వాలిఫయర్–1, ఎలిమినేటర్, క్వాలిఫయర్–2, ఫైనల్) టోర్నీ ముగుస్తుంది. రాజస్తాన్ రాయల్స్ జట్టు జైపూర్‌తోపాటు గువాహటిలో... పంజాబ్ కింగ్స్ జట్టు మొహాలితోపాటు ధర్మశాలలో కూడా మ్యాచ్‌లు ఆడతాయి. కరోనా కంటే ముందు ఐపీఎల్లో ఇంటా, బయటా పద్ధతిలో ఆయా ఫ్రాంచైజీల మధ్య మ్యాచ్‌లు జరిగేవి. కరోనా కారణంగా ఈ పద్ధతికి విరామం ఇచ్చారు. ఇప్పుడు అంతా బాగుండటంతో నిర్వాహకులు మళ్లీ పాత పద్ధతిలో ఐపీఎల్‌ను నిర్వహించనున్నారు. నోట్: ప్లే ఆఫ్ (క్వాలిఫయర్–1, ఎలిమినేటర్, క్వాలిఫయర్–2) మూడు మ్యాచ్‌ల తేదీలను, వేదికలను తర్వాత ప్రకటిస్తారు. ఫైనల్ మ్యాచ్ మే 28న జరుగుతుంది. ఫైనల్ మ్యాచ్ వేదికను కూడా తర్వాత ప్రకటిస్తారు. మ్యాచ్‌లన్నీ స్టార్ స్పోర్ట్స్ చానెల్స్‌లో, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
నేటి నుంచి ఐపీఎల్–2021
-
మార్చి 29 నుంచి ఐపీఎల్
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 షెడ్యూల్ విడుదలైంది. మార్చి 29న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, గత ఏడాది రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడుతుంది. ప్రస్తుతానికి లీగ్ మ్యాచ్‌ల షెడ్యూల్‌నే విడుదల చేయగా, నాకౌట్ మ్యాచ్‌ల వివరాలను తర్వాత ప్రకటిస్తారు. మే 17న ఆఖరి లీగ్ మ్యాచ్ జరుగుతుంది. అయితే ఫైనల్ మాత్రం మే 24న నిర్వహించడం ఖాయమైంది. గతంతో పోలిస్తే ఈ సారి ‘డబుల్ హెడర్’ మ్యాచ్‌ల (ఒకే రోజు 4 గంటలకు, 8 గంటలకు రెండు మ్యాచ్‌లు) సంఖ్యను బాగా తగ్గించారు. ఇప్పుడు తొలి రోజు, చివరి రోజు మినహాయించి మిగిలిన ఆదివారాల్లో మాత్రమే డబుల్ హెడర్లు జరుగుతాయి. దాంతో లీగ్ దశ రోజుల సంఖ్య పెరిగింది. ఇప్పటి వరకు 44 రోజుల్లో లీగ్ మ్యాచ్‌లను ముగిస్తుండగా, ఇప్పుడు అది 50 రోజులు కానుంది. మరోవైపు రాజస్తాన్ మినహా మిగిలిన ఏడు ఐపీఎల్ జట్లన్నీ తమ సొంత వేదికలను కొనసాగించనున్నాయి. రాజస్తాన్ మాత్రం జైపూర్‌తో పాటు రెండు మ్యాచ్‌లను గువాహటి వేదికగా నిర్వహించాలని నిర్ణయించుకుంది. అయితే ఇలా రెండో నగరాన్ని హోం గ్రౌండ్‌గా వాడుకోవడం కుదరదంటూ రాజస్తాన్ క్రికెట్ సంఘం కోర్టులో కేసు దాఖలు చేసింది. ఏప్రిల్ 1 నుంచి హైదరాబాద్‌లో...: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తమ ‘హోం’ మ్యాచ్‌లను ఎప్పటిలాగే ఉప్పల్ స్టేడియంలో ఆడనుంది. హైదరాబాద్‌లో ఈ ఏడు మ్యాచ్‌లు ఏప్రిల్ 1, 12, 16, 26, 30, మే 5, 12 తేదీల్లో జరుగుతాయి. ఇతర వేదికల్లో ఏప్రిల్ 4, 7, 19, 21, మే 3, 9, 15 తేదీల్లో సన్‌రైజర్స్ తమ మ్యాచ్‌లు ఆడుతుంది. -
మార్చి 29 నుంచి ఐపీఎల్!
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ షెడ్యూల్ దాదాపుగా ఖరారైంది. మార్చి 29న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్‌తో లీగ్ మొదలవుతుంది. మే 24న ముంబైలోనే ఫైనల్ నిర్వహిస్తారు. టోర్నీ ఆనవాయితీ ప్రకారం డిఫెండింగ్ చాంపియన్ జట్టుకు తర్వాతి సీజన్లో ప్రారంభ మ్యాచ్‌తోపాటు ఫైనల్ మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చే అవకాశం దక్కుతుంది. 2019 ఐపీఎల్ టోర్నీలో ముంబై ఇండియన్స్ చాంపియన్‌గా నిలువడంతో ఈ ఏడాది ముంబైలో ఆరంభ మ్యాచ్‌ను, ఫైనల్‌ను నిర్వహిస్తారు. మొత్తం 57 రోజుల పాటు టోర్నీ జరగనుంది. ఎప్పటిలా రాత్రి 8 గంటల నుంచి కాకుండా ఈ సారి 7.30 నుంచి మ్యాచ్‌లు మొదలు చేసే అవకాశం ఉంది. పలు ఫ్రాంచైజీలతో పాటు ప్రసారకర్త స్టార్ స్పోర్ట్స్ కూడా ఇదే సరైన సమయంగా భావిస్తోంది. ఈసారి లీగ్ వ్యవధి పెరిగినా... సాధ్యమైనంత వరకు రోజూ ఒకటే మ్యాచ్ ఉండేలా షెడ్యూల్ రూపొందించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. వన్డే ప్రపంచ కప్ నేపథ్యంలో 2019 ఐపీఎల్ మార్చి 23 నుంచే మొదలైంది. -
పుట్టింట్లోనే టి20 పండుగ
న్యూఢిల్లీ: దేశంలోని క్రికెట్ వీరాభిమానులకు సంతోషకర వార్త. తరలింపు ఊహాగానాలకు తెరదించుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్–2019) ఈ ఏడాది పూర్తిగా భారత్‌లోనే జరుగనుంది. అత్యంత జనాకర్షక టోర్నీ 12వ ఎడిషన్‌కు మార్చి 23న తెరలేవనుంది. వినోద్ రాయ్, డయానా ఎడుల్జీలతో కూడిన ఇద్దరు సభ్యుల క్రికెట్ పాలకుల మండలి (సీఓఏ) మంగళవారం ఇక్కడ సమావేశమై బీసీసీఐ తరఫున ఈ మేరకు ప్రకటించింది. ఎన్నికలకు అడ్డు రాకుండా... సహజంగా ఐపీఎల్ ఏటా ఏప్రిల్ మధ్యలో ప్రారంభమై మే చివరి వారంలో ముగుస్తుంది. అయితే, ఈసారి దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు, కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో లీగ్‌ను దక్షిణాఫ్రికా, యూఏఈలకు తరలిస్తారనే ఊహాగానాలు వచ్చాయి. మే 30 నుంచి వన్డే ప్రపంచ కప్ ప్రారంభం కానుండటం షెడ్యూల్‌పై ఒత్తిడి పెంచింది. దీంతో రెండింటికీ అడ్డురాకుండా చూసుకుంటూనే టోర్నీని స్వదేశంలోనే నిర్వహించాలని బీసీసీఐ తీర్మానించుకుంది. అందులో భాగంగానే దాదాపు 20 రోజుల ముందే లీగ్‌ను ప్రారంభించాలని నిర్ణయించింది. ‘మ్యాచ్‌ల కోసం అన్ని ప్రాథమిక వేదికలతో పాటు ప్రత్యామ్నాయ వేదికల జాబితానూ సిద్ధం చేశాం. వీవీఐపీల ఎన్నికల ప్రచారం, పోలింగ్ వంటి కారణాలతో ఇబ్బంది తలెత్తితే మార్పు కోసమే ఈ ఏర్పాటు. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు, భద్రతా వర్గాలనూ సంప్రదించాం’ అని రాయ్ తెలిపారు. ఖరారైన వేదికల సమాచారం, మ్యాచ్‌ల తేదీలను ప్రభుత్వ వర్గాలను సంప్రదించాక ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. ఫ్రాంచైజీలతో విస్తృతంగా చర్చించి షెడ్యూల్ విడుదల చేస్తామని వివరించారు. ఫైనల్ మే 12–15 మధ్య... ఊహాగానాల ప్రకారం 8 ప్రధాన... 4 లేదా 6 ప్రత్యామ్నాయ వేదికల వివరాలతో షెడ్యూల్ ఫిబ్రవరి తొలి వారంలో విడుదలవుతుంది. ఎన్నికల సంఘం పోలింగ్ తేదీలను ప్రకటించాక అవసరాన్ని బట్టి వీటిలో మార్పు చేర్పులు చేస్తుంది. ఎప్పటిలాగే డిఫెండింగ్ చాంపియన్ సొంత మైదానంలో ప్రారంభ, ముగింపు మ్యాచ్‌లు ఉంటాయి. దీని ప్రకారం ఈసారి తొలి మ్యాచ్ చెన్నైలో జరుగనుంది. మే 12 నుంచి 15వ తేదీ మధ్య ఫైనల్ జరిగే అవకాశం ఉంది. అయితే, ఇది కూడా పోలింగ్ తేదీలపై ఆధారపడి ఉంటుంది. దీనికి తగ్గట్లుగా సిద్ధంగా ఉండమని రాష్ట్రాల క్రికెట్ సంఘాలు, ఫ్రాంచైజీలకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. మార్పు తప్పింది... సాధారణ ఎన్నికల కారణంగానే 2009లో లీగ్‌ను పూర్తిగా దక్షిణాఫ్రికాలో నిర్వహించారు. 2014లో సగ భాగం యూఏఈలో జరిగింది. ఇప్పుడు కూడా పలు ప్రత్యామ్నాయ ప్రణాళికలు ఆలోచించారు. చివరకు ఇక్కడే నిర్వహించేందుకు మొగ్గుచూపారు. విదేశీ ఆటగాళ్ల అందుబాటెంతో? వన్డే ప్రపంచ కప్ మే 30 నుంచి ప్రారంభం కానుంది. మరోవైపు ఐపీఎల్ ప్రపంచకప్‌కు 15 రోజుల ముందే ముగుస్తుంది. తమ జట్లను ప్రపంచ కప్‌నకు సంసిద్ధం చేయాలని ఆయా దేశాలు భావిస్తాయి. ఇప్పటికే న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్ మినహా మిగతా దేశాలన్నీ లీగ్ నుంచి ముందుగానే రావాలని తమ ఆటగాళ్లకు సూచనలిచ్చాయి. ఈ నేపథ్యంలో టోర్నీ చివరకు వచ్చేసరికి విదేశీ ఆటగాళ్ల అందుబాటు ఎంతవరకు ఉంటుందో అనే అనుమానం నెలకొంది. -
వాలీబాల్ లీగ్ అంబాసిడర్‌గా సింధు
ముంబై: ఇప్పటికే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్), ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్), ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్)లు విజయవంతంగా సాగుతున్న తరుణంలో మరో కొత్త లీగ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రొ వాలీబాల్ లీగ్ సీజన్–1 ప్రారంభం కానుంది. ఈ లీగ్‌కు రియో ఒలింపిక్స్ రజత పతక విజేత, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, అమెరికన్ స్టార్ స్పైకర్ డేవిడ్ లీ బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించనున్నారు. ‘నా తల్లిదండ్రులు రమణ, విజయ వాలీబాల్ ఆటగాళ్లు కావడంతో చిన్నప్పటి నుంచి ఈ ఆట అంటే చాలా ఇష్టం. అంతర్జాతీయ ప్లేయర్లతో కలిసి ఆడేందుకు భారత ఆటగాళ్లకు ఇది చక్కటి అవకాశం’ అని సింధు తెలిపింది. ‘భారత్‌లో వాలీబాల్ అభివృద్ధికి ఈ లీగ్ ఎంతో తోడ్పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా నేను అనేక లీగ్‌లలో పాల్గొన్నాను. ఇప్పుడు అది ఇక్కడ కూడా కొనసాగేందుకు ప్రయత్నిస్తా’ అని రెండుసార్లు ఒలింపిక్స్ పతక విజేత డేవిడ్ లీ అన్నాడు. -
హెట్‌మైర్ కోసం ఆ ఐపీఎల్ ఫ్రాంచైజీల వేట?
హైదరాబాద్ : వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ షిమ్రాన్ హెట్‌మైర్ ఐపీఎల్-2019 సీజన్‌కు హాట్ కేక్ కానున్నాడా? అంటే అవుననే అంటున్నారు.. క్రికెట్ విశ్లేషకులు. తాజాగా భారత్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఈ 21 ఏళ్ల కరేబియన్ ఆటగాడు తన విధ్వంసకర బ్యాటింగ్‌తో సత్తా చాటాడు. గువాహటి వేదికగా జరిగిన తొలి వన్డేలో సెంచరీ సాధించి తమ జట్టు భారీ స్కోర్ చేసేలా చేశాడు. ఇక రెండో వన్డే వైజాగ్‌లో దాదాపు భారత్‌ను ఓడించినంత పనిచేశాడు. తనదైన బ్యాటింగ్‌తో 7 సిక్సర్లతో భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అనవసర షాట్‌కు ప్రయత్నించి హెట్‌మైర్ శతకం వృథా చేసుకున్నాడు.. కానీ అతని సెంచరీ అయ్యుంటే ఈ మ్యాచ్‌లో భారత్ ఖచ్చితంగా ఓడిపోయిది. మిలియన్ డాలర్ బేబీ.. హెట్‌మైర్ ఈ తరహా ప్రదర్శనకు భారత మాజీ, సీనియర్ క్రికెటర్లతో పాటు అభిమానులు ఫిదా అయ్యారు. దీంతో అతను ఐపీఎల్-2019 సీజన్‌కు హాట్కేకని.. భారీ ధరనే పలకబోతున్నాడని అంచనా వేస్తున్నారు. ఇక భారత సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్ అయితే వచ్చే సీజన్‌కు హెట్‌మైర్ మిలియన్ డాలర్ బేబీ అని పేర్కొన్నాడు. హెట్‌మైర్ కోసం ముఖ్యంగా మూడు ఫ్రాంచైజీలు పోటీపడనున్నాయని క్రీడా ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్.. గత సీజన్ ఐపీఎల్లో ఫైనల్‌కు చేరి తృటిలో టైటిల్ చేజార్చుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ హెట్‌మైర్ కోసం పోటిపడనున్నట్లు తెలుస్తోంది. ఆ జట్టు కీలక బ్యాట్స్‌మన్, కెప్టెన్ డేవిడ్ వార్నర్ దూరంతో బాధ్యతలు చేపట్టిన కన్నె విలియమ్సన్ జట్టును ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే బ్యాటింగ్ బాధ్యతలను పూర్తిగా తన భుజాలపైనే మోసిన విలియమ్సన్కు మిడిలార్డర్ నుంచి సహాకారం దూరమైంది. దీంతో ఆ జట్టు ఫైనల్‌కు చేరిన టైటిల్ కొట్టలేక పోయింది. వచ్చే సీజన్లో వార్నర్ పునరాగమనంతో జట్టుకు బలం చేకూరనుంది. ఈ పరిస్థితుల్లో హెట్‌మైర్‌తో మిడిలార్డర్‌ను పటిష్టం చేయాలని ఆ జట్టు మేనేజ్మెంట్ భావిస్తోంది. ఇక ఆ జట్టు ప్రధాన కోచ్ టామ్ మూడీకి కరేబియన్ ప్రీమియర్ లీగ్‌తో సంబంధం ఉండటం.. హెట్‌మైర్‌పై పూర్తి అవగాహన ఉండటం కూడా కలిసొచ్చె అంశం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సైతం హెట్‌మైర్ కోసం పోటీ పడనుంది. అన్ని ఉన్నా అల్లుడి నోట్ల శని అన్నట్లు ఈ జట్టు పరిస్థితి. దిగ్గజ ఆటగాళ్లు కోహ్లి, డివిలియర్స్ ఉన్నప్పటికి ఆ జట్టు ఇప్పటి వరకు టైటిల్ కొట్టలేకపోయింది. 2019 సీజన్లో టైటిల్ లక్ష్యంగా భావిస్తున్న ఆర్సీబీ ఇప్పటికే ఆదిశగా కసరత్తులు మొదలు పెట్టింది. గ్యారీ కిరిస్టెన్‌కు పూర్తి స్థాయి కోచ్ బాధ్యతలు అప్పజెప్పింది. అలాగే ఆటగాళ్ల మార్పుపై కూడా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే తన హిట్టింగ్తో ఆకట్టుకున్న హెట్మైర్ను తీసుకోవాలని యోచిస్తోంది. గత సీజన్లో యువమంత్రం జపించిన ఢిల్లీ డేర్ డెవిల్స్ సైతం హెట్‌మైర్ కోసం పోటీపడనుంది. ఇప్పటికే ఆ జట్టులో పృథ్వీ షా, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్లు టాపార్డర్‌లో నిలకడగా రాణిస్తున్నారు. అయితే ఆ జట్టుకు మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చే బ్యాట్స్‌మన్ లేరు. దీంతో ఆ స్థానాన్ని హెట్‌మైర్‌తో భర్తీ చేయాలని భావిస్తోంది. తన ప్రదర్శనతో అందిరి దృష్టిలో పడ్డ హెట్‌మైర్ ఎవరి సొంతం అవుతాడో.. ఎంత పలుకుతాడో తెలియాలంటే వచ్చే సీజన్ వేలం వరకు ఆగాల్సిందే. -
గ్రౌండ్లో భర్త.. ఫ్లయింగ్ కిస్సెస్ విసిరిన నటి!
బెంగళూరు: ఐపీఎల్లో భాగంగా హోమ్‌గ్రౌండ్‌లో ఆడుతున్న బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టును బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఉత్సాహ పరిచారు. శుక్రవారం జరిగిన చిన్నస్వామి స్డేడియంలో బెంగళూరు-పంజాబ్ మ్యాచ్‌కు అనుష్క హాజరయ్యారు. ఈ సందర్భంగా అనుష్క ఎంతో ఉత్సాహంగా కనిపించారు. మ్యాచ్ ఆసాంతం ఆమె తన భర్త, బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లిని ఉత్సాహపరుస్తూ కనిపించారు. ఒక దశలో మైదానంలో ఉన్న కోహ్లి కోసం ఫ్లయింగ్ కిస్సెస్ పంపించారు. దీంతో గ్రౌండ్లో వాతావరణం ఒకింత ప్రేమభరితంగా మారిపోయింది. మ్యాచ్‌లోని ఓ దశలో కోహ్లి క్యాచ్ అందుకోవడంతో ఆనంద డొలికల్లో తేలిపోయిన అనుష్క గాలిలో తన భర్తకు ముద్దులు పంపించారు. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌ను ఓడించి.. హోమ్‌గ్రౌండ్‌లో విజయంతో ఐపీఎల్లో బెంగళూరు జట్టు బోణీ కొట్టింది. ఐపీఎల్లో భాగంగా సొంత మైదానంలో బెంగళూరు మ్యాచ్‌లు జరిగినప్పుడు అనుష్క హాజరవ్వడం పరిపాటే. గతంలోనూ బెంగళూరు మ్యాచ్‌ల సందర్భంగా స్టేడియంలోని స్టాండ్స్‌లో ఆమె దర్శనమిచ్చారు. బెంగళూరు జట్టును, ముఖ్యంగా కోహ్లిని ఉత్సాహపరిచేందుకు ఐపీఎల్ మ్యాచ్‌లకు హాజరవుతున్న అనుష్క పంజాబ్ తో మ్యాచ్ సందర్భంగా ప్రీతి జింతాతో కలిసి మ్యాచ్‌ను వీక్షించారు. -
‘డేర్ డెవిల్స్’ను పంచుకున్నారు
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2018 సీజన్ ఆరంభానికి నెల రోజుల ముందు ఫ్రాంచైజీ విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జీఎంఆర్ గ్రూప్‌కు చెందిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టులో 50 శాతం వాటాను జిందాల్ సౌత్ వెస్ట్ (జేఎస్‌డబ్ల్యూ) స్పోర్ట్స్ కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని జీఎంఆర్, జేఎల్‌డబ్ల్యూ సంయుక్తంగా ప్రకటించాయి. అయితే ఈ 50–50 ఒప్పందాన్ని బీసీసీఐ అధికారికంగా ఆమోదించాల్సి ఉంటుంది. ఈ నెల 16న జరిగే ఐపీఎల్ పాలకమండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం లాంఛనమే కావచ్చు. కొందరు వ్యక్తులు, సంస్థలు కన్సార్టియంగా ఏర్పడి రాజస్థాన్, పంజాబ్, కొచ్చి వంటి ఐపీఎల్ జట్లను కొనుగోలు చేయడం గతంలో జరిగినా... ఒక యాజమాన్యం మరొకరికి తమ జట్టులో వాటా అమ్మడం మాత్రం ఇదే తొలిసారి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ ఒప్పందానికి ముందు ప్రస్తుతం ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు విలువను రూ. 1100 కోట్లుగా నిర్ధారించారు. జేఎస్‌డబ్ల్యూ ఈ డీల్ కోసం రూ. 550 కోట్లను చెల్లించనుంది. తొలి ఐపీఎల్‌నుంచి పదేళ్ల పాటు లీగ్‌లో ఉన్నా డేర్‌డెవిల్స్ ఒక్కసారి కూడా విజేతగా నిలవలేదు. 2008లో ఆ జట్టు సెమీఫైనల్ చేరింది. 2012లో మూడో స్థానంలో నిలవడమే ఢిల్లీ అత్యుత్తమ ప్రదర్శన. -
ఐపీఎల్ నిర్వాహకులకు షాక్
సాక్షి, న్యూఢిల్లీ: నెల రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11 సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఆరంభ వేడుకలను అట్టహాసంగా జరుపడానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా వేదికగా ఏప్రిల్ 6 న అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించేందుకు బీసీసీఐ భావించింది. అయితే తాజాగా ప్రారంభ వేడుకలపై సుప్రీంకోర్టు నియమిత పాలక కమిటీ(సీవోఏ) తీసుకున్న నిర్ణయం బీసీసీఐను షాక్‌కు గురి చేసింది. అయితే ఏప్రిల్ 7న ఓపెనింగ్ మ్యాచ్ జరిగే రోజున వాంఖేడే స్టేడియంలో వేడుకలు నిర్వహించాలని సీవోఏ తాజాగా నిర్ణయించింది. అంతే కాకుండా రూ. 50 కోట్లతో ప్రారంభ వేడుకులు జరపాలన్న ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయానికి సీవోఏ బ్రేక్ వేస్తూ.. ఆ బడ్జెట్ మొత్తాన్ని రూ. 30 కోట్లకు కుదించింది. బడ్జెట్లో కోత, వేడుకల తేదీలో మార్పుతో లీగ్‌లో తొలి మ్యాచ్ (ఏప్రిల్ 7) ఆరంభానికి కొన్ని గంటల ముందే వేడుకలు నిర్వహించడానికి బీసీసీఐ ప్రస్తుతం సన్నాహాలు చేస్తోందని ఓ అధికారి తెలిపారు. కాగా ఐపీఎల్-11 సీజన్లో తొలి మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)ల మధ్య జరుగనుంది. రెండేళ్ల నిషేధం తర్వాత బరిలోకి దిగుతున్న సీఎస్కే సీజన్ తొలి మ్యాచ్‌లోనే సత్తాచాటేందుకు కసరత్తులు చేస్తోంది. -
ఐపీఎల్ వేళలపై మల్లగుల్లాలు..
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11 సీజన్‌కు సంబంధించి ఒకే రోజు రెండేసి జరిగే మ్యాచ్‌ల సమయాల్లో మార్పులు లేకపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఈ సీజన్లో రాత్రి 8 గం.లకు 48 మ్యాచ్‌లు, సాయంత్ర 4 గం.లకు 12 మ్యాచ్‌లను షెడ్యూల్ చేశారు. ఈ మేరకు మ్యాచ్ వేళల్ని మార్చాలన్న టోర్నీ ప్రసారుదారు స్టార్ స్పోర్ట్స్ గత నెలలో ఐపీఎల్ పాలక మండలికి విజ్ఞప్తి చేసింది. రోజూ వారీ షెడ్యూల్ ప్రకారం రెండో మ్యాచ్‌ను రాత్రి 7.00 గంటలకు ఆరంభించాలని, వేసవి వేడి దృష్ట్యా తొలి మ్యాచ్‌ను సాయంత్రం 5.30 ని.లకు ప్రారంభించాలని స్టార్ స్పోర్ట్స్ ప్రతిపాదించింది. దీనికి పాలకమండలి అంగీకారం కూడా తెలిపింది. రాత్రి మ్యాచ్‌లు త్వరగా ఆరంభమై.. త్వరగా ముగిస్తే కవరేజ్ కూడా బాగా వస్తుందని స్టార్‌స్పోర్ట్స్ భావించింది.కానీ ఐపీఎల్ షెడ్యూల్ ప్రకటించే క్రమంలో షెడ్యూల్లో ఎటువంటి మార్పులు లేకుంగా గతంలో మాదిరిగానే విడుదల చేసింది. ఇందుకు కారణం తమను సంప్రదించకుండానే ఐపీఎల్ పాలకమండలి.. స్టార్ స్పోర్ట్స్ నిర్ణయయానికి ఆమోదం తెలపడంతో ఐపీఎల్ రెవెన్యూ మోడల్లో వాటాదారులుగా ఉన్న సగం మంది వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఎందుకు మార్చాలనుకున్నారంటే.. మ్యాచ్ ముగిశాక ప్రేక్షకులు ఇళ్లకు, ఆటగాళ్లు హోటళ్లకు రాత్రి పూట ఆలస్యంగా చేరుకునే సమస్య తీరుతుందని స్టార్ స్పోర్ట్స్ ఆశించింది. అదే సమయంలో రెండో మ్యాచ్ త్వరగా ఆరంభిస్తే ఎక్కువ మంది వీక్షించే అవకాశం ఉంటుందనేది మరొక కారణం. ఒక రకంగా దీనికి ప్రజల నుంచి సానుకూల స్పందనే వచ్చింది. మ్యాచ్ కోసం అర్ధ రాత్రి వరకూ మెలకువగా ఉండడం, స్టేడియాలకు వెళ్లిన వారు తిరిగి తమ గమ్యస్థానాలకు చేరుకొనేందుకు పడే ఇబ్బందులు తొలుగుతాయని భావించారు. అయితే, ఫ్రాంచైజీల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో బీసీసీఐ పాత వేళలకే మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఐపీఎల్ షెడ్యూల్‌పై పలు ఫ్రాంచైజీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. -
ఏప్రిల్ 9 నుంచి హైదరాబాద్‌లో ఐపీఎల్ షో
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఐపీఎల్ 11వ సీజన్ పోటీలు ఏప్రిల్ 9 నుంచి జరుగనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూలును లీగ్ పాలకమండలి బుధవారం విడుదల చేసింది. ఏప్రిల్ 7న డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)ల మధ్య పోరుతో ఈ సీజన్ మొదలవుతుంది. వాంఖెడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. సీఎస్కేలాగే పునరాగమనం చేసిన రాజస్తాన్ రాయల్స్ తమ తొలి పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడుతుంది. ఉప్పల్ రాజీవ్‌గాంధీ స్టేడియంలో ఏప్రిల్ 9న ఈ మ్యాచ్ జరుగుతుంది. ముంబైలోని వాంఖెడేలో ఆరంభ మ్యాచ్‌తో పాటు తొలి క్వాలిఫయర్ (మే 22), టైటిల్ పోరు (27న) కూడా జరుగనుంది. అయితే మ్యాచ్‌ల టైమింగ్‌లో ఏమార్పూ లేదు. ఒక మ్యాచ్ ఉంటే రాత్రి 8 గంటలకు, రెండు మ్యాచ్‌లుంటే మొదటి మ్యాచ్ సాయంత్రం 4 గంటలకు మొదలవుతాయి. ఈ మ్యాచ్‌లన్నీ స్టార్ స్పోర్ట్స్ చానళ్లలో ప్రత్యక్ష ప్రసారమవుతాయి. ఇంతకుముందు సాయంత్రం మ్యాచ్‌ను 5 గంటల నుంచి, రాత్రి మ్యాచ్‌ను 7 గంటల నుంచి నిర్వహించాలనే ప్రతిపాదనలువచ్చాయి. కానీ విజయవంతమైన పది సీజన్లలాగే మ్యాచ్ టైమింగ్‌ను ఖరారు చేశారు. హైదరాబాద్‌లో ఐపీఎల్ షెడ్యూలు ఏప్రిల్ 9 రాజస్తాన్ రాయల్స్ రా.గం. 8 ఏప్రిల్ 12 ముంబై ఇండియన్స్ రా.గం. 8 ఏప్రిల్ 22 చెన్నై సూపర్‌కింగ్స్ సా.గం. 4 ఏప్రిల్ 26 కింగ్స్‌పంజాబ్ రా.గం. 8 మే 5 ఢిల్లీ డేర్‌డెవిల్స్ రా.గం. 8 మే 7 బెంగళూరు రా.గం.8 మే 19 కోల్‌కతా నైట్‌రైడర్స్ రా.గం.8 -
కోచ్‌గా కనిపించనున్న మలింగా!
ముంబై: శ్రీలంక పేస్ బౌలర్ లసిత్ మలింగా ఐపీఎల్-11 సీజన్లో కోచ్‌గా కనిపించనున్నాడు. ఈ సీజన్ కోసం నిర్వహించిన వేలంలో ఏ ఫ్రాంచైజీ ఈ సీనియర్ బౌలర్‌పై ఆసక్తి కనబర్చలేదు. దీంతో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయిన విషయం తెలిసిందే. అయితే 2009 నుంచి ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న మలింగా మెత్తం 110 మ్యాచ్‌లాడి 157 వికెట్లు పడగొట్టాడు. తమ జట్టులో ఇంతకాలం ఆటగాడిగా కొనసాగిన మలింగాను బౌలింగ్ కోచ్‌గా నియమిస్తున్నట్లు ముంబై జట్టు ప్రకటించింది. ఇప్పటికే ముంబై హెడ్ కోచ్‌గా శ్రీలంక క్రికెట్ దిగ్గజం జయవర్ధనే, బౌలింగ్ కోచ్‌గా షేన్ బాండ్ ఉన్నారు. ఇప్పుడు వీరిద్దరితోపాటు సహాక సిబ్బంది టీంలో మలింగా చేరనున్నాడు. తనను బౌలింగ్ కోచ్‌గా నియమించడంపై మలింగా స్పందిస్తూ.. ‘‘ముంబై ఇండియన్స్ జట్టులో కొనసాగడం గొప్ప అవకాశం. ముంబై గత దశాబ్ధంగా నా సొంత జట్టుగా ఉంది. ఇంతకాలం జట్టులో ఆటగాడిగా ఉండటం ఎంతో అనందంగా ఉంది. ఇప్పుడు మెంటర్‌గా ఉండటం కూడా సంతోషమే. నేను ఇప్పుడు మెంటర్‌గా కొత్త పని చేబట్టపోతున్నాను’’ అని పేర్కొన్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ 4 నుంచి ఐపీఎల్ 11వ సీజన్ ప్రారంభంకానుంది. -
క్రికెటర్లు సంతలో పశువులా?
సాక్షి, స్పోర్ట్స్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పై న్యూజిలాండ్ క్రికెటర్ల అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐపీఎల్ వేలంతో క్రికెటర్లను సంతలో పశువుల్లా మార్చారని అసోసియేషన్ అధ్యక్షుడు హీత్ మిల్స్ మండిపడ్డారు. స్థానిక హెరాల్డ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘ఐపీఎల్ వేలం పద్దతి ఆటగాళ్లందరినీ ఘోరంగా అవమానపరిచింది. ప్రపంచం ముందు సంతలో పశువుల్లా నిలబెట్టింది. ఐపీఎల్ వల్ల చాలా లాభాలున్నాయి. కానీ వేలం నిర్వహించే పద్దతి ఇది కాదు. అనైతిక చర్య’ అని మిల్స్ అభిప్రాయపడ్డారు. వేలం వల్ల ఏ జట్టుకు ఆడుతామో తెలియదని, యజమాని, కెప్టెన్ ఎవరో కూడా తెలియదని, కోచ్‌లతో సత్సంబంధాలు కూడా ఉండవని ఇది క్రికెట్‌కు మంచిది కాదని ఈ న్యూజిలాండ్ క్రికెటర్ చెప్పుకొచ్చారు. 10 ఏళ్లలో కొంతమంది ప్లేయర్లు అయితే ఏకంగా ఐదు, ఆరు జట్లకు ఆడటం చూశామని, ఇలా ఏ క్రీడాలీగ్‌లో జరగదని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆటగాళ్లు ఈ పద్దతి మారేలా చూడాలని కోరారు. ఐపీఎల్‌తో ఫిక్సింగ్, బెట్టింగ్‌లు బాగా ప్రాచుర్యం పొందాయని, మరి ఈ లీగ్‌తో క్రికెట్ ఆటకు ఒరిగిన ప్రయోజనమెంటో చూడాలని బాంబే హైకోర్టు కూడా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇక భారత దిగ్గజ క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ సైతం ఐపీఎల్ వేదికను మనీ ల్యాండరింగ్ కోసం ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. -
గంభీర్ చేజేతులా చేసుకున్నాడు!: కేకేఆర్
సాక్షి, కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అనగానే గుర్తొచ్చే ఆటగాళ్లలో గౌతం గంభీర్ కచ్చితంగా ఉంటాడు. అయితే తాజాగా జరిగిన ఐపీఎల్ వేలంలో అతడిని సొంతజట్టు కోల్‌కతా నైట్‌రైడర్స్ ( కేకేఆర్) తీసుకోక పోవడంపై తీవ్ర విమర్శలు, భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో రెండు సీజన్లలో కేకేఆర్‌కు ఐపీఎల్ టైటిల్స్ అందించిన క్రికెటర్‌కు అవమానం జరిగిందంటూ కొందరు కేకేఆర్ ఫ్యాన్స్ ట్వీట్లు చేశారు. అయితే దీనిపై కేకేఆర్ సీఈఓ వెంకీ మైసూర్ వివరణ ఇచ్చుకున్నారు. గంభీర్‌కు సారీ చెబుతూ కేకేఆర్ టీమ్ వదులుకోవడానికి ఆ క్రికెటరే కారణమని అది ఎలాగో వివరించాడు. సోషల్ మీడియాలో ఈ విషయాలు వైరల్ అవుతున్నాయి. ‘ఈ వేలంలో స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ గంభీర్‌ను తీసుకోవాలని ముందుగానే కేకేఆర్ యాజమాన్యం ప్లాన్ చేసుకుంది. అతడిపై మాకు ఎప్పటికీ నమ్మకం ఉంది. కానీ వేలానికి ముందు గంభీర్ తమకు కొన్ని విషయాలు చెప్పాడు. తన కోసం వేలంలో ఆసక్తి చూపించవద్దని, ఆర్టీఎం (రైట్ టు మ్యాచ్) ద్వారా కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించవద్దన్నాడు. గంభీర్ ప్లాన్స్ ఎలా ఉన్నాయో.. అతడు దేని కోసం ఎదురుచూస్తున్నాడో మాకు తెలియదు. దీంతో గౌతీకి ఏ విధంగా సాయం చేయలేకపోయామని, సారీ గంభీర్ అంటూ’ కేకేఆర్‌తో తమ ఏడేళ్ల అనుబంధాన్ని సీఈఓ గుర్తుచేసుకున్నాడు. కేకేఆర్ ఫ్యాన్స్ గంభీర్ నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గౌతీని ఢిల్లీ డేర్‌డెవిల్స్ రూ.2.8 కోట్లతో సొంతం చేసుకుంది. దీంతో గంభీర్ తిరిగి సొంతగూటికి చేరినట్లయింది. -
ఈసారి ఐపీఎల్ ట్రోఫీ మాదే: ఖరీదైన క్రికెటర్
సాక్షి, రాజ్‌కోట్: ఐపీఎల్-11 సీజన్ నేపథ్యంలో ఇటీవల జరిగిన వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాళ్లలో రెండోవాడు జయదేవ్ ఉనాద్కట్. పంజాబ్‌కే ఖాయం అనిపించిన దశలో అనూహ్యంగా రాజస్తాన్ రాయల్స్ ఏకంగా 11.5 కోట్లతో ఉనాద్కట్‌ను సొంతం చేసుకోవడంతో భారత్ నుంచి వేలంలో అత్యధిక ధర పలికిన క్రికెటర్‌గా నిలిచాడు. భారీ ప్యాకేజీతో తనను కొనుగోలు చేయడంపై టీమిండియా క్రికెటర్ ఉనాద్కట్ హర్షం వ్యక్తం చేశాడు. రెండేళ్ల నిషేధం తర్వాత బరిలోకి దిగుతున్న తమ జట్టు రాజస్తాన్ ఐపీఎల్-11 సీజన్ ట్రోఫీ నెగ్గుతుందని ధీమా వ్యక్తం చేశాడు. అత్యుత్తమ ప్రదర్శనతో జట్టుకు సాధ్యమైనన్ని విజయాలు అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. తొలిరోజు వేలంలో రూ.11 కోట్ల ధర పలికిన మనీశ్ పాండే, కేఎల్ రాహుల్‌లను రెండోరోజు జరిగిన ఐపీఎల్ వేలంలో అధిగమించాడు ఈ సౌరాష్ట్ర ప్లేయర్. రూ.11.5 కోట్ల ధరతో ఈ సీజన్ వేలంలో బెన్ స్టోక్స్ (రూ.12.5 కోట్లు) తర్వాత అత్యంత ఖరీదైన క్రికెటర్‌గా రికార్డులు తిరగరాశాడు ఉనాద్కట్. గత ఏడాది పుణే తరఫున ఆడిన ఉనాద్కట్ హ్యాట్రిక్ సహా 7.02 ఎకానమీతో 24 వికెట్లు పడగొట్టి భువనేశ్వర్ (26) తర్వాత రెండో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుత వేలం ధరతో ఈ ఆటగాడిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. -
‘ఆ ఇద్దరితో ఆడాలనే నాకల నిజమైంది’
చెన్నై : గత ఐపీఎల్లో రైజింగ్ పుణే తరుపున ఆడి మహేంద్రసింగ్ ధోని, కెప్టెన్ స్టీవ్‌స్మిత్‌లను మెప్పించిన తమిళ యువకెరటం, స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ఈ ఏడు వేలంలో రూ.3.3 కోట్లు పలికాడు. ఈ ధరకు రాయల్‌ఛాలెంజర్స్ బెంగళూరు సుంధర్‌ను సొంతం చేసుకుంది. ఈ తరుణంలో కెప్టెన్ విరాట్ కోహ్లి, దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలయర్స్‌తో కలిసి ఆడాలనే తన కల నేరవేరిందని ఈ యంగ్ క్రికెటర్ ఆనందం వ్యక్తం చేశాడు. ‘నన్ను ఆర్సీబీ ఎంచుకోవడం ఆనందం కలిగించింది. నేను విరాట్ కోహ్లికి, ఏబీ డివిలియర్స్‌కు పెద్ద అభిమానిని. గతేడాది రైజింగ్‌పుణే తరుపున ధోనితో కలిసి ఆడటం ఇప్పుడు ఈ లెజెండ్స్‌తో ఆడే అవకాశం రావడం వెలకట్టలేని అనుభవమని’ వాషింగ్టన్ సుందర్ తెలిపాడు. ధోని దగ్గర నేర్చుకున్న మెళుకువలు ఆర్సీబీ జట్టుకు ఎంపిక చేశాయని, ఈ జట్టులో సైతం సీనియర్ ప్లేయర్ల ఆటను దగ్గర నుంచి చూసి మరింత నేర్చుకుంటున్నాని ఈ 18 ఏళ్ల యువస్పిన్నర్ చెప్పుకొచ్చాడు. తన లక్ష్యం మాత్రం భారత జట్టులో చోటు సంపాదించుకోవడమేనని, ఇందుకోసం వచ్చిన ప్రతి అవకాశాన్నిసద్వినియోగం చేసుకుంటానన్నాడు. ఇక సుంధర్ అత్యధిక ధర పలకడంపై అతని తండ్రి ఆనందం వ్యక్తం చేశారు. యువక్రికెటర్లకు ఐపీఎల్ చక్కని వేదికని, సుంధర్లాంటి క్రికెటర్లకు తమ టాలెంట్ నిరూపించుకోవాడనికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. -
ఐపీఎల్ వేలం: ఆటగాళ్ల ధర ఎంతంటే..!
-
ఐపీఎల్ వేలం: ఆటగాళ్ల ధర ఎంతంటే..!
సాక్షి, బెంగళూరు: ఐపీఎల్-11 సీజన్ ఆటగాళ్ల వేలంలో ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ అత్యధికంగా రూ.12.5 కోట్ల ధర పలికాడు. గత రెండు సీజన్లలో నిషేధం ఎదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్.. తాజా సీజన్ ఆరంభంలో భారీ ధరకు స్టోక్స్‌ను సొంతం చేసుకుంది. భారత యువ క్రికెటర్లు మనీశ్ పాండే, కేఎల్ రాహుల్‌లు రూ.11 కోట్లకు కొనుగోలు కాగా, సీనియర్ క్రికెటర్లు హర్భజన్, గంభీర్, టీ20 స్పెషలిస్టులు యువరాజ్, యూసఫ్ పఠాన్లు తక్కువ ధర పలకడం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి లోను చేసింది. అత్యల్పంగా స్టూవర్ట్ బిన్నీని రూ.50 లక్షల ధర పలికాడు. కనీస ధరకు రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది. ఆటగాళ్లు, వారి జట్ల వివరాలు బెన్ స్టోక్స్- రాజస్థాన్ రాయల్స్ -12.5 కోట్లు మనీశ్ పాండే- సన్‌రైజర్స్ హైదరాబాద్- 11 కోట్లు కేఎల్ రాహుల్- కింగ్స్ ఎలెవన్ పంజాబ్- రూ.11 కోట్లు క్రిస్‌లిన్- కోల్‌కతా నైట్‌రైడర్స్- 9.6 కోట్లు మిచెల్ స్టార్క్- కోల్‌కతా నైట్‌రైడర్స్- 9.4 కోట్లు గ్లెన్ మాక్స్వెల్ - ఢిల్లీ డేర్‌డెవిల్స్- 9 కోట్లు సంజూ శాంసన్- రాజస్థాన్ రాయల్స్ - 8 కోట్లు కేదార్ జాదవ్- చెన్నై సూపర్ కింగ్స్- 7.8 కోట్లు అశ్విన్- కింగ్స్ ఎలెవన్ పంజాబ్- 7.6 కోట్లు క్రిస్ వోక్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- 7.4 కోట్లు దినేశ్ కార్తీక్- కోల్‌కతా నైట్‌రైడర్స్- 7.4 కోట్లు డ్వేన్ బ్రేవో- చెన్నై సూపర్ కింగ్స్- 6.4 కోట్లు రాబిన్ ఉతప్ప- కోల్‌కతా నైట్‌రైడర్స్- 6.4 కోట్లు అరోన్ ఫించ్- కింగ్స్ ఎలెవన్ పంజాబ్- 6.2 కోట్లు మార్కస్ స్టోయినిస్- కింగ్స్ ఎలెవన్ పంజాబ్- 6.2 కోట్లు కరుణ్ నాయర్- కింగ్స్ ఎలెవన్ పంజాబ్- 5.6 కోట్లు కీరన్ పోలార్డ్ - ముంబై ఇండియన్స్- 5.4 కోట్లు శిఖర్ ధావన్- సన్‌రైజర్స్ హైదరాబాద్- 5.2 కోట్లు వృద్ధిమాన్ సాహా- సన్‌రైజర్స్ హైదరాబాద్- 5 కోట్లు అజింక్య రహానే- రాజస్థాన్ రాయల్స్ - 4 కోట్లు బ్రెండన్ మెకల్లమ్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- 3.6 కోట్లు డేవిడ్ మిల్లర్- కింగ్స్ ఎలెవన్ పంజాబ్- 3 కోట్లు గౌతం గంభీర్- ఢిల్లీ డేర్‌డెవిల్స్- 2.8 కోట్లు క్వింటన్ డికాక్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- 2.8 కోట్లు డి గ్రాండ్‌హోమ్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- 2.2 కోట్లు కార్లోస్ బ్రాత్‌వైట్- సన్‌రైజర్స్ హైదరాబాద్- 2 కోట్లు (కనీస ధర కోటి) షేన్ వాట్సన్- చెన్నై సూపర్ కింగ్స్- 2 కోట్లు (కనీస ధర కోటి) హర్భజన్ సింగ్- చెన్నై సూపర్ కింగ్స్- 2 కోట్లు యువరాజ్ సింగ్- కింగ్స్ ఎలెవన్ పంజాబ్- 2 కోట్లు షకీబ్ అల్ హసన్- సన్‌రైజర్స్ హైదరాబాద్- 2 కోట్లు (కనీస ధర కోటి) యూసఫ్ పఠాన్- సన్‌రైజర్స్ హైదరాబాద్- 1.9 కోట్లు మొయిన్ అలీ- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- 1.7 కోట్లు (కనీస ధర 1.5 కోట్లు) డుప్లెసిస్- చెన్నై సూపర్ కింగ్స్- రూ.1.6 కోట్లు జేసన్ రాయ్- ఢిల్లీ డేర్‌డెవిల్స్- 1.5 కోట్లు స్టూవర్ట్ బిన్నీ- రాజస్థాన్ రాయల్స్ - రూ. 50 లక్షలు (కనీస ధర 50 లక్షలు) ప్యాట్ కమిన్స్- ముంబై ఇండియన్స్ - రూ. 5.4 కోట్లు ఉమేశ్ యాదవ్-ఆర్సీబీ- రూ.4.2 కోట్లు మొహ్మద్ షమీ-డిల్లీ డేర్ డెవిల్స్-రూ. 3 కోట్లు పీయూష్ చావ్లా- కేకేఆర్- రూ.4.2 కోట్లు జాస్ బట్లర్- రాజస్థాన్ రాయల్స్- రూ. 4.4 కోట్లు అంబటి రాయుడు రూ. 2.2 కోట్లు-చెన్నై సూపర్ కింగ్స్ కరణ్ శర్మ-చెన్నై సూపర్ కింగ్స్-రూ.5 కోట్లు ఇమ్రాన్ తాహీర్-చెన్నై సూపర్ కింగ్స్-రూ. కోటి శుభ్‌మాన్ గిల్-కేకేఆర్-రూ. 1.8 కోట్లు సూర్యకుమార్ యాదవ్-ముంబై ఇండియన్స్-రూ.3.2 కోట్లు కుల్దీప్ యాదవ్-కేకేఆర్- రూ.5.8 కోట్లు యజ్వేంద్ర చాహల్-ఆర్సీబీ-రూ. 6 కోట్లు అమిత్ మిశ్రా- ఢిల్లీ- రూ. 4 కోట్లు రషీద్ ఖాన్- సన్ రైజర్స్-రూ. 9 కోట్లు రాహుల్ త్రిపాఠి- రాజస్థాన్ రాయల్స్-రూ. 3.4 కోట్లు మోహన్ వోహ్రా-ఆర్సీబీ-1.1 కోట్లు పృథ్వీ షా-ఢిల్లీ-రూ.1.2 కోట్లు మయాంక్ అగర్వాల్-కింగ్స్ పంజాబ్-రూ. కోటి కృనాల్ పాండ్యా-ముంబై ఇండియన్స్- రూ.8.8 కోట్లు నితీష్ రాణా-కేకేఆర్- రూ. 3.4 కోట్లు రాహుల్ త్రిపాఠీ- రాజస్థాన్ రాయల్స్- రూ.3.4 కోట్లు రాహల్ తెవాటియా- ఢిల్లీడేర్ డెవిల్స్-రూ. 3 కోట్లు దీపక్ హుడా- సన్రైజర్స్హైదరాబాద్- రూ.3.6 కోట్లు విజయ్ శంకర్- ఢిల్లీడేర్ డెవిల్స్- రూ. 3.2 కోట్లు డీఆర్సీ షార్ట్- రాజస్థాన్ రాయల్స్- రూ. 4 కోట్లు కమలేష్ నాగర్కోటి(అండర్-19)- కేకేఆర్- రూ.3.2 కోట్లు ఇషాన్ కిషన్-ముంబై ఇండియన్స్-రూ. 6.2 కోట్లు జోఫ్రా ఆర్చర్-రాజస్థాన్ రాయల్స్- రూ. 7.2 కోట్లు అంకిత్ రాజ్‌పుత్-కింగ్స్ పంజాబ్-రూ. 3 కోట్లు బాసిల్ థంపి- సన్ రైజర్స్- రూ.95 లక్షలు సిద్ధార్థ్ కౌల్-సన్ రైజర్స్- రూ. 3.8 కోట్లు -
ధోని టీమ్.. ఓ ప్రత్యేకత!
సాక్షి, బెంగళూరు: రెండేళ్ల నిషేధం తర్వాత చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు మళ్లీ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చేరాయి. ఈ రెండేళ్లలో జరిగిన సీజన్లలో గుజరాత్ లయన్స్, రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ జట్లు ఆడాయి. అయితే తాజాగా జరుగుతున్న ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలో టీమిండియా మాజీ కెప్టెన్ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ వినూత్న రీతిలో వేలంలో పాల్గొని ఆటగాళ్లను చేజిక్కించుకుంటోంది. ఇప్పటివరకూ జరిగిన వేలంలో చెన్నై ఫ్రాంచైజీ 30 ఏళ్లకు పైబడ్డ ఐదుగురు ఆటగాళ్లను దక్కించుకుంది. దీంతో వెటరన్ల ప్రదర్శనతో ధోనీ ఏం చేయబోతున్నాడని చర్చనీయాంశమైంది. చెన్నై ఫ్రాంచైజీ తీసుకున్న ఆటగాళ్ల వయసు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. హర్భజన్ సింగ్(37), షేన్ వాట్సన్(36), డ్వేన్ బ్రేవో(34), డుప్లెసిస్(33), కేదార్ జాదవ్(32). అనుభవం ఉన్న ఆటగాళ్లతో ధోనీ జట్టును నడిపించాలని భావిస్తున్నాడంటూ కామెంట్లు వస్తున్నాయి. కాగా, డుప్లెసిస్, డ్వేన్ బ్రేవోలు గత సీజన్లలో చెన్నైకి ప్రాతినిధ్యం వహించారు. ఇటీవల ఓ సిరీస్‌లో వేగంగా పరుగులు చేయని కారణంగా ధోని వయసు ప్రభావం వల్లే ఆటతీరు మారిందని రిటైర్ కావడమే ఉత్తమమంటూ మాజీ క్రికెటర్లు విమర్శించిన విషయం విదితమే. అత్యుత్తమ ప్రదర్శన ఇస్తున్నంత కాలం ఆటకు వయసు ఏమాత్రం అడ్డంకి కాదని నిరూపించాలన్న ధోని సలహా మేరకు చెన్నై మేనేజ్మెంట్ సీనియర్ క్రికెటర్లపై మొగ్గు చూపినట్లు కనిపిస్తోంది. -
రాహుల్, మనీశ్ పాండేల పంట పండింది!
-
రాహుల్, మనీశ్ పాండేల పంట పండింది!
సాక్షి, బెంగళూరు: ఐపీఎల్-11 సీజన్ ఆటగాళ్ల వేలంలో టీమిండియా సీనియర్ క్రికెటర్లకు తీవ్ర నిరాశే ఎదురుకాగా, యువ ఆటగాళ్లు భారీ ప్యాకేజీలు సొంతం చేసుకున్నారు. దీంతో వారిపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుత వేలంలో భారత యువ క్రికెటర్లు మనీశ్ పాండే, కేఎల్ రాహుల్‌లు ఊహించని రీతిలో రూ.11 కోట్ల ధరకు కొనుగోలు అయ్యారు. మనీశ్ పాండే కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవన్ జట్లు రేట్లు పెంచుకుంటూ పోగా పదికోట్ల మార్కు చేరుకున్నాక సన్‌రైజర్స్ హైదరాబాద్ అనూహ్యంగా రేసులోకి వచ్చింది. 11 కోట్ల ధరకు మనీశ్ పాండేను సన్‌రైజర్స్ సొంతం చేసుకుంది. టీమిండియా మరో యువ క్రికెటర్ కేఎల్ రాహుల్ కోసం జరిగిన వేలం ఆసక్తికరంగా జరిగింది. ముంబై ఇండియన్స్, పంజాబ్ జట్లు హోరాహోరీగా ధరను పెంచుతూ ఉత్కంఠ రేపారు. చివరికి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంచైజీ రూ.11 కోట్లతో రాహుల్‌ను దక్కించుకుని అతడిపై అంచనాలు పెంచేసింది. కరుణ్ నాయర్ ను సైతం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 5.6 కోట్లతో కొనుగోలు చేసింది. మరోవైపు ట్వంటీ20ల్లో మంచి పేరున్న హార్డ్ హిట్టర్ యూసఫ్ పఠాన్ కేవలం 1.9 కోట్లకు కోనుగోలు కావడం గమనార్హం. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తక్కువ ధరకు పఠాన్‌ను తీసుకుంది. -
ధర తగ్గినా..దుమ్మురేపిన స్టోక్స్!
-
సీనియర్ క్రికెటర్లకు తీవ్ర నిరాశ!
సాక్షి, బెంగళూరు: ఐపీఎల్-11 సీజన్ ఆటగాళ్ల వేలంలో టీమిండియా సీనియర్లకు ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. భారీ ధర పలకకున్నా, వారి స్థాయికి తగ్గట్లుగా రూ.4 నుంచి 5 కోట్ల వరకు ధర పలుకుతారని భావించినా కొందరు ఆటగాళ్లకు తీవ్ర నిరాశే ఎదురైంది. హర్భజన్ సింగ్, గౌతం గంభీర్, యువరాజ్ సింగ్ లను పాత ఫ్రాంచైజీలు తీసుకోకపోవడంతో పాటు వారి కొత్త యాజమాన్యాలు కనీస ధరలకే కొనుగోలు కావడం గమనార్హం. 10 సీజన్లు ముంబై ఇండియన్స్‌కు ఆడిన హర్భజన్ సింగ్ ను చెన్నై సూపర్ కింగ్స్ 2 కోట్లకు, సన్‌రైజర్స్ స్టార్ ప్లేయర్ యువరాజ్ సింగ్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 2 కోట్లకు సొంతం చేసుకున్నాయి. కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఐపీఎల్ ట్రోఫీలు అందించిన గౌతం గంభీర్‌ను ఢిల్లీ డేర్‌డెవిల్స్ 2.8 కోట్లకు కొనుగోలు చేసింది. గతేడాది భారీ ధర ఉన్న అజింక్య రహానేను రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ.4 కోట్లకు నమ్మకం ఉంచింది. వ విదేశీ ఆటగాళ్లలో దక్షిణాఫ్రికా క్రికెటర్ డుప్లెసిస్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.1.6 కోట్లకు, బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ 2 కోట్ల ధరకు తీసుకుంది. గతేడాదితో పోల్చితే ఈ 11వ సీజన్లో చాలామంది ఆటగాళ్ల ధరలు వేలంలో చాలా తగ్గినట్లు కనిపిస్తున్నా.. అనూహ్యంగా కొందరికి భారీ ప్యాకేజీలతో కోనుగోలు అవుతున్నారు. -
ఐపీఎల్ వేలం: ధర తగ్గినా.. దుమ్మురేపిన స్టోక్స్!
సాక్షి, బెంగళూరు: గతేడాది ఐపీఎల్ సీజన్లో రికార్డు ధర పలికిన ఆటగాడు, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ పై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అంచనాలను నిజం చేసినా స్టోక్స్ గతేడాది ధర రూ.14.5 కోట్లను అందుకోలేక పోయినా రికార్డు ధరతో అందర్నీ ఆశ్చర్యానికి లోను చేశాడు. పలు ఫ్రాంచైజీలు స్టార్ ఆల్ రౌండర్ కోసం వేలంలో పోటీ పడగా చివరికి రాజస్థాన్ రాయల్స్ జట్టు 12.5 కోట్లకు బెన్ స్టోక్స్ ను సొంతం చేసుకుంది. ఈ సీజన్లో నేటి వేలంలో ఇప్పటివరకూ అత్యధిక ధర స్టోక్స్‌దే కావడం గమనార్హం. ముంబై ఇండియన్స్ తమ ఆటగాడు కీరన్ పోలార్డ్పై మరోసారి నమ్మకం ఉంచింది. రూ.2 కోట్ల కనీస ధరతో వేలానికి వచ్చిన పోలార్డ్ ను నీతా అంబానీ ఫ్రాంచైజీ ముంబై రూ. 5.4 కోట్లకు దక్కించుకుంది. గతంలో ఎన్నో విజయాలు అందించిన పోలార్డ్ ఈ ఐపీఎల్‌లోనూ కీలకం కానున్నాడు. అంతకుముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ధావన్‌ను రూ. 5.2 కోట్లకు, అశ్విన్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 7.6 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. -
నా కెప్టెన్సీలో ట్రోఫీ అందించా.. జట్టులో ఉంటానో లేదో!
సాక్షి, ముంబై: 'పదేళ్లు ఆ జట్టుకు ఆడా. నా కెప్టెన్సీలో ట్రోఫీని అందించా. ఇప్పుడు ఆ జట్టులో ఉంటానో లేదో అర్థం కావడం లేదని' ముంబై ఇండియన్స్ ప్లేయర్ హర్భజన్ సింగ్ అన్నాడు. ముంబై ఇండియన్స్ అనగానే మనకు గుర్తొచ్చే పేర్లు రోహిత్ శర్మ, లసిత్ మలింగ, హర్భజన్ సింగ్. కానీ పదేళ్ల అనంతరం ఆ ఫ్రాంచైజీకి అతడు మళ్లీ ఆడతాడా లేదా అన్నది మరికొన్ని రోజుల్లో తేలనుంది. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్లో హర్భజన్ కెప్టెన్సీలో నాలుగు మ్యాచ్‌లాడిన పంజాబ్ మూడు విజయాలు సాధించి 12పాయింట్లతో ఉంది. త్వరలో నిర్వహించనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలంపై టీమిండియా క్రికెటర్ హర్భజన్ స్పందించాడు. 'ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాను. పదేళ్లు ఈ జట్టులో కొనసాగాను. ఐదు ట్రోఫీలు సాధించాం. అందులో ఒకటి నా కెప్టెన్సీలో వచ్చింది. ప్రతిక్షణం ఆటను ఆస్వాదించా. పదేళ్ల ముంబై ఇండియన్స్ అనుబంధం తర్వాత నేను ఏ జట్టుకు ఆడతానో తెలియని పరిస్థి ఏర్పడింది. నన్ను ఏ ఫ్రాంచైజీ సొంతం చేసుకుంటుందో త్వరలోనే తెలుస్తుందని' భజ్జీ వివరించాడు. పొట్టి ఫార్మాట్లోలోనూ బ్యాట్స్మెన్లు అందించిన విజయాలతో పోల్చితే బౌలర్ల వల్ల వచ్చినవే అధికమని ఈ ఆఫ్ స్పిన్నర్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ వేలంలో భజ్జీ కనీస ధర రూ.2 కోట్లుగా నిర్ణయించారు. వేలంలో ఏ జట్టు ఎక్కువ ధరకు అడిగితే ఆ ఫ్రాంచైజీకి భజ్జీ సొంతం అవుతాడు. మరికొందరు సీనియర్ క్రికెటర్ల పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. ముంబై ఇండియన్స్ జట్టు ఇప్పటివరకూ 3 ఐపీఎల్, 2 ఛాంపియన్స్ ట్రోఫీలను తమ ఖాతాలో వేసుకుంది. -
ఐపీఎల్ వేలానికి 1122 మంది క్రికెటర్లు
సాక్షి, బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ -2018 వేలానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 27, 28 తేదీల్లో బెంగళూరు వేదికగా వేలం పాట జరుగుతుంది. ఈ విషయాన్ని శనివారం బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది. ఈ వేలానికి టాప్ క్రికెటర్లతో పాటు మొత్తం 1122 మంది క్రికెటర్లు రిజిస్ట్రర్ చేసుకున్నారు. ఎనిమిది ఫ్రాంచైజీలు తాము అట్టి పెట్టుకున్న ఆటగాళ్లను బీసీసీఐకు సమర్పించాయి. ఈ జాబితాలో 281 మంది అంతర్జాతీయ ఆటగాళ్లతో పాటు, ఇంకా ఆరంగేట్రం చేయని 838 మంది కొత్తవారు ఉన్నట్లు బీసీసీఐ పేర్కొంది. ఐపీఎల్ వేలంలో భారత్ నుంచి 778 మంది ఆటగాళ్లు ఉన్నారని, అసోసియేట్ దేశాలకు చెందిన ముగ్గురు ఆటగాళ్లు ఉన్నట్లు బీసీసీఐ వెల్లడించింది. వేలానికి అందుబాటులో ఉండే ఆటగాళ్ల పూర్తి జాబితాను ఎనిమిది ఫ్రాంఛైజీలకి పంపినట్లు వివరించిన బోర్డు.. భారత్ తర్వాత ఆస్ట్రేలియా నుంచే ఎక్కువ మంది క్రికెటర్లు ఉన్నట్లు వెల్లడించింది. ఆస్ట్రేలియా నుంచి 58 మంది, దక్షిణాఫ్రికా (57), శ్రీలంక, వెస్టిండీస్ నుంచి 39 మంది చొప్పున వేలంలోకి రానున్నారు. న్యూజిలాండ్ (30), ఇంగ్లండ్ (26) ఆటగాళ్లు కూడా గతంతో పోలిస్తే.. ఈ ఏడాది ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నట్లు జాబితా స్పష్టం చేస్తోంది. ఈ వేలంలో క్రిస్‌గేల్, మాక్స్వెల్, హషీమ్ ఆమ్లా, కేన్ విలియమ్సన్, కొలిన్ మన్రో, టామ్ లాథమ్, రబడా తదితరులు వేలంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. భారత్ నుంచి గౌతమ్ గంభీర్, అశ్విన్, అజింక్య రహానే, చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్, ఓపెనర్లు కేఎల్ రాహుల్, మురళీ విజయ్‌ల మధ్య గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది. ఈ ఏడాది ఐపీఎల్-11వ సీజన్ ఏప్రిల్ 4 న ప్రారంభమై మే 31తో ముగుస్తుంది. ఏ ఆటగాళ్లు ఏ జట్టులో ఆడనున్నారో, ఈ సీజన్లో ఏ ప్లేయర్ ఎక్కువ ధర పలుకుతారో అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. -
కోహ్లీ నేతృత్వంలో టీమిండియా సరికొత్త డిమాండ్
సాక్షి, న్యూఢిల్లీ : తమ జీతాలు పెంచాలన్న సరికొత్త డిమాండ్‌ను టీమిండియా ఆటగాళ్లు తెరపైకి తీసుకొచ్చారు. భారత జట్టుకు అన్ని ఫార్మాట్లలో కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీ నేతృత్వంలోనే జట్టు ఆటగాళ్లు తమ కాంట్రాక్టు నగదును సవరించాలని కోరేందుకు సిద్ధంగా ఉన్నారట. కోహ్లీ, ధోనీ, రవిశాస్త్రిలు కలిసి బీసీసీఐ అధికారి వినోద్ రాయ్‌తో ఈ శుక్రవారం భేటీ అయ్యే అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని బోర్డుకు చెందిన ఓ సీనియర్ ఉద్యోగి వెల్లడించాడు. గత కొంత కాలం నుంచి టీమిండియా తీరికలేని షెడ్యూళ్లతో సిరీస్‌లు ఆడుతోంది. ఈ నేపథ్యంలో విశ్రాంతి కావాలని, తాను రోబోను కాదంటూ కోహ్లీ బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేయగా, మాజీ కెప్టెన్లు ఎంఎస్ ధోనీ, సౌరవ గంగూలీ, ప్రధాన కోచ్ రవిశాస్త్రిలు మద్ధతు తెలిపారు. ఈ క్రమంలో లంకతో వన్డే సిరీస్ నుంచి కోహ్లీకి విశ్రాంతి నిచ్చారు. అయితే తాజాగా బోర్డు తమ వేతనాలను సవరించాలని టీమిండియా అన్ని ఫార్మాట్ల ఆటగాళ్లు ఆశించడం తెరపైకి వచ్చింది. గత సెప్టెంబర్ 30తో ఆటగాళ్ల కాంట్రాక్ట్ గడువు ముగిసింది. స్టార్ ఇండియా చానెల్ 2018 నుంచి 2022 వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్స్ (ఐపీఎల్) ప్రసార హక్కులను బీసీసీఐకి భారీగా చెల్లించి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తమ వేతన కాంట్రాక్టు ముగియడంతో కొత్త వేతన కాంట్రాక్ట్‌లో తమ జీతభత్యాలు మరింత పెంచాలని ఆటగాళ్లు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ధోనీ, రవిశాస్త్రిలతో చర్చించిన అనంతరం ముగ్గురు కలిసి కాంట్రాక్ట్ వేతనాల పెంపుకోసం వినోద్ రాయ్‌తో భేటీ అవనున్నట్లు సమాచారం. మరోవైపు ఈ ఏడాది క్రికెటర్ల వేతనాలను బీసీసీఐ భారీ పెంచగా.. ఏ గ్రేడ్ (టాప్ ప్లేయర్స్) క్రికెటర్లు రూ. 1.93 కోట్ల వార్షిక ఆదాయాన్ని అందుకుంటున్నారు. -
మళ్లీ బరిలోకి చెన్నై, రాజస్థాన్
►వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్‌లోకి ►కొత్త జట్లు రావని ప్రకటించిన బీసీసీఐ ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో జట్ల సంఖ్యను పెంచే ఆలోచన లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పష్టం చేసింది. ఇప్పుడున్న తరహాలోనే వచ్చే ఏడాదినుంచి కూడా ఎనిమిది జట్లే కొనసాగుతాయని బోర్డు సీఈఓ రాహుల్ జోహ్రి వెల్లడించారు. 2017తో నిషేధం ముగుస్తున్న కారణంగా ఐపీఎల్–11నుంచి చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తిరిగి లీగ్‌లోకి వస్తాయని ఆయన చెప్పారు. ఫలితంగా రెండేళ్ల పాటు ఐపీఎల్లో ఉన్న పుణే సూపర్ జెయింట్, గుజరాత్ లయన్స్ జట్లను తప్పిస్తామని జోహ్రి అన్నారు. ‘నిషేధం ముగిసిపోతోందని కాబట్టి ఆ రెండు జట్లు యథావిధిగా మళ్లీ వచ్చేస్తాయి. జట్ల సంఖ్యను పదికి పెంచాల్సిన అవసరం లేదని బీసీసీఐ భావిస్తోంది. కాబట్టి గుజరాత్, పుణే ఇక ముందు కొనసాగవు’ అని జోహ్రి స్పష్టతనిచ్చారు. ఈ ఏడాదితో ఐపీఎల్లో పది సీజన్లు ముగియడంతో వచ్చే సంవత్సరంనుంచి అందరు ఆటగాళ్లు అందుబాటులోకి వస్తారు. వేలంలో మళ్లీ ప్రతీ జట్టు కొత్తగా క్రికెటర్లను ఎంచుకునేందుకు అవకాశం ఉంటుంది. -
ఐపీఎల్ వివాదం: సన్‌రైజర్స్‌కు ఝలక్!
హైదరాబాద్: ప్రస్తుతం కొనసాగుతున్న ఐపీఎల్ టోర్నమెంటు విషయంలో హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టు యాజమాన్యానికి, హైదరాబాద్ క్రికెట్ సంఘానికి (హెచ్‌సీఏ) మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఉప్పల్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌ల టికెట్ల విషయమై ఇరువర్గాల మధ్య వివాదం నెలకొన్నట్టు తెలుస్తోంది. టికెట్ల విషయంలో సన్‌రైజర్స్ జట్టు తమతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నదని హెచ్‌సీఏ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నది. సన్‌రైజర్స్ జట్టు యాజమాన్యం ఇలాగే ప్రవర్తిస్తే.. ఈ నెల 17న ఉప్పల్‌లో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌కు సహరించబోమంటూ హెచ్‌సీఏ షాకిచ్చింది. ఐపీఎల్ పదో ఎడిషన్ ఉప్పల్ స్టేడియంలో ఇటీవల ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నెల 17న ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ సన్‌రైజర్స్, కింగ్స్ పంజాబ్ ఎలెవన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. అప్పటిలోగా టికెట్ల వివాదాన్ని పరిష్కరించకుంటే సహాయ నిరాకరణ జెండా ఎగురవేస్తామని హెచ్‌సీఏ హెచ్చరిస్తోంది. -
ప్లీజ్ వాళ్లనూ ఐపీఎల్లో ఆడనివ్వండి!
దాయాది దేశాలైన భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల సరిహద్దుల్లో పాక్ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడినట్టు వార్తలు కూడా వచ్చాయి. అయితే, ఈ ఉద్రిక్తతలు ఎలా ఉన్నా.. ప్రస్తుతం కొనసాగుతున్న ఐపీఎల్-10వ ఎడిషన్‌లో దాయాది క్రికెటర్లను కూడా ఆడనివ్వాలని బాలీవుడ్ సీనియర్ నటుడు రిషీ కపూర్ అభిప్రాయపడ్డారు. 'ఐపీఎల్ ప్రపంచ క్రీడాకారులు ఆడుతున్నారు. ఆఖరికీ అఫ్ఘానిస్థాన్ ఆటగాళ్లు కూడా అరంగేట్రం చేస్తున్నారు. నా విజ్ఞప్తి ఏమిటంటే పాకిస్థాన్ ఆటగాళ్లను కూడా పరిగణనలోకి తీసుకోండి. క్రీడల్లో పెద్దతనం చాటుకుందాం. ప్లీజ్' అంటూ రిషీ కపూర్ ట్వీట్ చేశారు. భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో 2008 నుంచి పాకిస్థాన్ క్రికెటర్లు ఎవరూ ఐపీఎల్లో ఆడటం లేదు. తాజా ఐపీఎల్-2017లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున మహమ్మద్ నబీ, రషీద్ ఖాన్ అనే అఫ్ఘన్ క్రికెటర్లు ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ ఆటగాళ్లను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్న రిషీ కపూర్ విజ్ఞప్తిపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు క్రీడలు రాజకీయాలకు అతీతంగా ఉండాలంటే.. మరికొందరు ఇలా కామెంట్ చేయడం అవమానకరమని వ్యాఖ్యానిస్తున్నారు. -
కూలీ కొడుకును.. నాకు ఐపీఎల్ ఛాన్సా..!
న్యూఢిల్లీ: తనకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడే చాన్స్ వస్తుందని అసలు ఊహించలేదని తమిళనాడు ద్వితీయ శ్రేణి ఆటగాడు సంజయ్ సింగ్ యాదవ్ అంటున్నాడు. ఉత్తర ప్రదేశ్ లోని గోరఖ్ పూర్ నుంచి తన తండ్రి రామ్ సింగ్ యాదవ్, కుటుంబసభ్యులు బతుకుదెరువు కోసం తమిళనాడులోని హోసూరుకు వలసవచ్చారని తెలిపాడు. రోజువారి కూలీ కొడుకును అయిన తాను ఈ స్థాయికి చేరుకోవడంపై హర్షం వ్యక్తంచేశాడు. ఎందుకంటే రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో ఉన్న రామ్ సింగ్ కు కొడుకును క్రికెట్ అకాడమీ చేర్పించడం కూడా ఓ కలలాంటిదే. తాను తమిళనాడు టీఎన్ సీఏ లీగ్స్ లో సెకండ్ డివిజన్ జట్టు నుంచి ప్రాతినిధ్యం వహించేవాడనని.. అయితే ఐపీఎల్ లో ఆడాలంటే జాతీయ, అంతర్జాతీయ స్థాయి అనుభవం అవసరమని అభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్ లోనే కాదు బౌలింగ్ లోనూ తనది ఎడమచేతి వాటం అని సంజయ్ తెలిపాడు. ఐపీఎల్-10లో తాను కోల్ కతా నైట్ రైడర్స్ జట్టులో గౌతమ్ గంభీర్, యూసఫ్ పఠాన్ లాంటి టీమిండియా ఆటగాళ్లతో కలిసి ఆడబోతున్నందుక ఎంతో సంతోషంగా ఉందన్నాడు. ‘ టీఎస్ సీఎల్ లో వీబీ తిరువళ్లూర్ తరఫున ఆడేవాడిని. అందులో తన ప్రదర్శనతో తమిళనాడు ట్వంటీ20లకు ఎంపికయ్యాను. ప్రస్తుతం కేకేఆర్ ఫ్రాంచైజీ రూ.10 లక్షల కాంట్రాక్టుతో నన్ను జట్టులోకి తీసుకుంది. కేకేఆర్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ బౌలింగ్ కిటుకులు నేర్చుకుంటున్నాను. ఎంతో మంది అంతర్జాతీయ ఆటగాళ్ల నైపుణ్యాన్ని చాలా దగ్గర నుంచి గమనించే చాన్స్ దక్కింది. విరాట్ కోహ్లీ, అశ్విన్ లతో పాటు విదేశీ స్పిన్నర్లు షకీబ్ అల్ హసన్, సునీల్ నరైన్ లు తన అభిమాన క్రికెటర్లు’ అని ఆల్ రౌండర్ సంజయ్ యాదవ్ చెప్పుకొచ్చాడు. సంజయ్ చాలా పేదరిక నేపథ్యం నుంచి వచ్చిన క్రికెటర్. కోచింగ్ కు డబ్బులేక ఇబ్బందులు పడుతుంటే ఫ్యూచర్ ఇండియా క్రికెట్ అకాడమీ కోచ్ ప్రేమ్ నాథ్.. సంజయ్ కి అండగా నిలిచాడు. సంజయ్ ఆటతీరును, నైపుణ్యాన్ని గుర్తించిన ప్రేమ్ నాథ్ సంజయ్ నుంచి ఎలాంటి ఫీజు ఆశించకుండానే కోచింగ్ ఇచ్చాడు. స్పోర్ట్స్ కోటాలో లయోలా కాలేజ్ లో డిగ్రీ చదువుతున్నాడు. పూట గడవని ఫ్యామిలీ నుంచి వచ్చిన తాను ఏకంగా అంతర్జాతీయ క్రికెటర్లతో ఆడే అవకాశం రావడాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను.. అంతా కలలా ఉందంటాడు సంజయ్. తానేంటో నిరూపించుకోవాలని ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. -
ఐపీఎల్ నిర్వహణకు అడ్మినిస్ట్రేటర్లు
ఇద్దరిని నియమించిన హైకోర్టు హైదరాబాద్: హైదరాబాద్‌లో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్–2017) మ్యాచ్‌లను అడ్మినిస్ట్రేటర్స్ పర్యవేక్షణలోనే నిర్వహించాలని ఉమ్మడి హైకోర్టు గురువారం ఆదేశించింది. బీసీసీఐ సిఫార్సుల మేరకు సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ ఏఆర్ దవే, హైకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ జీవీ సీతాపతిలను అడ్మినిస్ట్రేటర్స్‌గా నియమించింది. ఈ మేరకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ షమీమ్ అక్తర్‌ల నేతృత్వంలోని ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) సంఘాల మధ్య ఉన్న వివాదం నేపథ్యంలో అడ్మినిస్ట్రేటర్‌ను నియమించాలంటూ బీసీసీఐ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. హెచ్‌సీఏలో లోధా కమిటీ సిఫార్సులు అమలు చేయకపోవడం కూడా అడ్మినిస్ట్రేటర్స్ నియమించడానికి కారణమని తెలిపింది. ‘‘హెచ్‌సీఏలో సరఫరాదారులు, సిబ్బందికి బకాయిలు చెల్లింపు బాధ్యత అడ్మినిస్ట్రేటర్స్దే. వాస్తవాలను పరిశీలించిన తర్వాతే బ్యాంకులో ఉన్న నగదు నిల్వల ఆధారంగా చెల్లింపులు చేయాలి. అవసరమనుకుంటే ఉత్తర్వుల సవరణకు తమను ఆశ్రయించవచ్చు. అడ్మినిస్ట్రేటర్స్ రవాణా ఖర్చులను హెచ్‌సీఏ చెల్లించాలి. ఇద్దరు అడ్మినిస్ట్రేటర్స్ బీసీసీఐని సంప్రదించి ఆర్థిక సలహాదారులను నియమించుకోవచ్చు. ఐపీఎల్ మ్యాచ్‌ల ఖాతాల నిర్వహణ బాధ్యత ఆర్థిక సలహాదారులే చూడాలి. హైదరాబాద్ క్రికెట్ ప్రేమికులు ఎలాంటి ఆటంకాలు లేకుండా మ్యాచ్‌లు చూసేందుకు అవకాశం కల్పించండి’’ అని ఉత్తర్వుల్లో పేర్కొంది. -
ఐపీఎల్‌కు ‘సీఓఏ’ అడ్డంకులు!
ముంబై: మరో నెల రోజుల్లో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్ నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. ఆయా రాష్ట్ర క్రికెట్ సంఘాల దగ్గర తగిన ఆర్థిక వనరులు లేకపోవడమే దీనికి కారణం. ఇటీవల ముంబైలో జరిగిన ఐపీఎల్ కమిటీ, క్రికెట్ సంఘాల మధ్య జరిగిన సమావేశంలో ఇదే అంశంపై చర్చ జరిగింది. వెంటనే బీసీసీఐ ఆయా సంఘాలకు నిధులను విడుదల చేయాలని, లేకుంటే లీగ్‌ను నిర్వహించే పరిస్థితి ఉండదని సంఘాలకు చెందిన సభ్యులు స్పష్టం చేశారు. ఆతిథ్యమిచ్చే క్రికెట్ సంఘాలకు ప్రతీ లీగ్ మ్యాచ్‌కు రూ.60 లక్షల చొప్పున గ్రాంట్ విడుదలయ్యేది. ఇందులో సగం బోర్డు ఇవ్వగా మిగతా సగం ఫ్రాం చైజీ ఇస్తుంది. అలాగే ఇంతకుముందు క్రికెట్ సంఘాలకు కొంచెం అడ్వాన్స్‌గా బోర్డు విడుదల చేసేది. కానీ లోధా ప్యానెల్ సంస్కరణల అమలు నేపథ్యంలో వీటికి కష్టాలు ప్రారంభమయ్యాయి. ‘గతంలో ఇది మాకు పెద్దగా సమస్యగా అనిపించేది కాదు. అడ్వాన్స్‌గా బోర్డు ఇచ్చే మొత్తం నుంచి మాకు కావాల్సిన పరికరాల కొనుగోలుతో పాటు మైదానం, డ్రెస్సింగ్ రూమ్, ఫ్లడ్‌లైట్లకు సంబంధించిన మరమ్మతులను పూర్తి చేసేవాళ్లం. ముందు మేం ఖర్చు పెట్టుకున్నా ఆ తర్వాత వారు ఇచ్చే పరిస్థితి ఉంటుందో లేదో తెలీడం లేదు. అన్నింటిని అరువుపై తెచ్చేందుకు ఏ క్రికెట్ సంఘం కూడా సిద్ధంగా లేదు’ అని పలు క్రికెట్ సంఘాలు పేర్కొన్నాయి. ‘పరిమిత’ ఆహ్వానంపై అసంతృప్తి ఈనెల 8న జరిగే బీసీసీఐ వార్షిక అవార్డుల కార్యక్రమానికి షరతులతో కూడిన ఆహ్వానంపై రాష్ట్ర క్రికెట్ సంఘాలు మండిపడుతున్నాయి. దీనికి నిరసనగా బాయ్‌కాట్ చేసే ఆలోచనలో సంఘాలున్నాయి. ‘సుప్రీం కోర్డు తీర్పునకు లోబడి అర్హత ఉన్న ఆఫీస్ బేరర్లు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరుకావాలని పరిపాలక కమిటీ (సీఓఏ) కోరుకుంటోంది’ అని బీసీసీఐ నుంచి వచ్చిన ఆహ్వానంతో సంఘాలు కంగుతిన్నాయి. ‘అవార్డు ఫంక్షన్లకు పిలిచేటప్పుడు ఇలా షరతులు విధించకూడదు. క్రికెట్ సంఘాలకు తమ తరఫున ప్రతి నిధులను పంపే విశేషాధికారం ఉంటుంది’ అని పలువురు క్రికెట్ సంఘాల సభ్యులు అన్నారు. -
ఐపీఎల్ థీమ్ సాంగ్ రెడీ
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్ కోసం థీమ్ సాంగ్ సిద్ధమైంది. బాలీవుడ్ సంగీత దర్శక ద్వయం సలీమ్– సులేమాన్ సంగీతం అందించిన ఈ పాటను సింగర్ బెన్నీ దయాళ్ పాడారు. లీగ్ పదేళ్ల ప్రస్థానాన్ని సూచిస్తూ.. ‘దస్ సాల్ ఆప్కే నామ్’... పల్లవితో ఈ పాటను రూపొందించారు. -
ఐపీఎల్ వేలంలో 'భారత్' వెలవెల..!
-
వేలంలో 'భారత్' వెలవెల..!
ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలంపాటలో భారత క్రికెటర్లకు చేదు అనుభవమే ఎదురైంది. సోమవారం ఇప్పటివరకు జరిగిన వేలంపాటలో విదేశీ ఆటగాళ్లకు రికార్డుస్థాయి ధరకు అమ్ముడుపోగా.. భారత క్రికెటర్లను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు మొగ్గు చూపలేదు. భారత్ స్టార్ బౌలర్ ఇషాంత్ శర్మను సైతం కొనుగోలు చేసేందుకు ఏ జట్టు ఆసక్తి చూపలేదు. అతని కనీస ధర రూ. 2 కోట్లు కావడంతో కొనుగోలుకు ఫ్రాంచైజీలు వెనుకడుగువేశాయి. ఇక మరో భారత క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్‌ను కూడా ఎవరూ కొనుగోలు చేయలేదు. అతని కనీస ధర రూ.50 లక్షలైనా ఫ్రాంచైజీలు ముందుకురాకపోవడం గమనార్హం. అదేవిధంగా భారత క్రికెటర్లు అయిన ప్రజ్ఞాన్ ఓజా, ఉన్ముక్త్ చంద్, పృథ్వీషా తదితరులకు కూడా చేదు అనుభవమే మిగిలింది. ఆయా క్రికెటర్లను కొనేందుకు ఇప్పటివరకు ఫ్రాంచేజీ యాజమాన్యాలు నిరాకరించాయి. ఇక పలువురు విదేశీ స్టార్ క్రికెటర్లకు కూడా ఈసారి వేలంలో నిరాశే ఎదురైంది. న్యూజిలాండ్ క్రికెటర్లు రాస్ టేలర్, మార్టిన్ గఫ్తిల్, ఇంగ్లండ్ ఆటగాళ్లు జాసన్ రాయ్ కు ఆశాభంగం తప్పలేదు. బ్రాడ్ హాగ్ (ఆస్ట్రేలియా), ఇమ్రాన్ తాహిర్ (దక్షిణాఫ్రికా), ఆండ్రూ ఫ్లెచర్ (వెస్టిండీస్)లను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచేజీలు ఆసక్తి చూపలేదు. -
అత్యంత విలువైన ఆటగాళ్లు వీళ్లే!
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్ కోసం ఈనెల 20న(సోమవారం) వేలం జరగనుంది. వేలానికి 351 మంది ఆటగాళ్లతో తుది జాబితా తయారు చేశారు. ఇందులో 122 మంది అంతర్జాతీయ క్రికెటర్లున్నారు. తొలిసారిగా అసోసియేట్ దేశాలకు చెందిన ఆరుగురు ఆటగాళ్లకు కొత్త జాబితాలో చోటు దక్కడం విశేషం. ఇటీవలి కాలంలో విశేషంగా రాణిస్తున్న అఫ్గానిస్తాన్ జట్టు నుంచి ఏకంగా ఐదుగురు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వచ్చే ఏడాది తమ ఆటగాళ్లతో అన్ని జట్లకు ఒప్పందం ముగుస్తుంది కాబట్టి ఈసారి వేలంలో ఆటగాళ్లను దక్కించుకునేందుకు భారీ మొత్తం చెల్లించే అవకాశం ఉండకపోవచ్చు. ఐపీఎల్ తాజా వేలం నేపథ్యంలో గతంలో అత్యధిక ధర పలికిన టాప్-5 ఆటగాళ్లను ఒకసారి గుర్తు చేసుకుందాం. 1. డాషింగ్ బ్యాట్స్ మన్ యువరాజ్ సింగ్ ను ఢిల్లీ డేర్ డెవిల్స్ 2015, ఐపీఎల్ లో రూ. 16 కోట్లుకు దక్కించుకుంది. 2. చెన్నై సూపర్ కింగ్స్ పై రెండేళ్లు నిషేధం పడడంతో ఎంఎస్ ధోనిని దక్కించుకునేందుకు రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ రూ. 12.5 కోట్లు వెచ్చించింది. 3. రెండుసార్లు టైటిల్ అందించిన గౌతమ్ గంభీర్ ను తమ వద్దే ఉంచుకునేందుకు కోల్ కతా నైట్ రైడర్స్ రూ. 11.05 కోట్లు ముట్టజెప్పింది. 4. బరోడా బ్లాస్టర్ యూసఫ్ పఠాన్ ను కోల్ కతా నైట్ రైడర్స్ 2011 ఐపీఎల్ లో రూ. 9.6 కోట్లుతో వేలంలో కొనుగోలు చేసింది. 5. రాబిన్ ఊతప్పను పుణే వారియర్స్ 2011 ఐపీఎల్ లో రూ. 9.66 కోట్లతో దక్కించుకుంది. అయితే ధరకు తగినట్టు రాణించలేదు. -
హైదరాబాద్ అభిమానులకు పండగ
నగరంలోనే ఐపీఎల్–10 తొలి మ్యాచ్ ఫైనల్ ఏప్రిల్ 5 నుంచి మే 21 వరకు టోర్నీ ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్–2017) పదో సీజన్ షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం విడుదల చేసింది. గత ఏడాది లీగ్ చాంపియన్‌గా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిబంధనల ప్రకారం తమ సొంతగడ్డపైనే తొలి మ్యాచ్ ఆడే అవకాశం దక్కించుకుంది. ఏప్రిల్ 5న ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే మొదటి పోరులో సన్‌రైజర్స్‌తో 2016 రన్నరప్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడుతుంది. ఐపీఎల్ పదో సీజన్లో మొత్తం 47 రోజుల పాటు 10 వేదికలలో లీగ్ నిర్వహిస్తారు. మే 21న ఫైనల్ మ్యాచ్ కూడా హైదరాబాద్‌లోనే జరుగుతుంది. రెండు క్వాలిఫయర్, ఎలిమినేటర్ మ్యాచ్‌ల వేదికలను తర్వాత ప్రకటిస్తారు. 2011 తర్వాత ఇండోర్‌లో మరోసారి ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనుండటం విశేషం. ఎప్పటిలాగే ప్రతీ జట్టు 14 లీగ్ మ్యాచ్‌లు ఆడుతుంది. ఇందులో 7 మ్యాచ్‌లను సొంతగడ్డపై, మరో 7 మ్యాచ్‌లను ప్రత్యర్థి మైదానాల్లో ఆడుతుంది. 2017 ఐపీఎల్ కోసం ఈ నెల 20న బెంగళూరులో ఆటగాళ్ల వేలం జరగనుంది. రూ.2 కోట్ల నుంచి రూ. 10 లక్షల మధ్య కనీస విలువతో వేలం కోసం మొత్తం 351 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. -
20న ఐపీఎల్ వేలం
76 మంది క్రికెటర్లకు అవకాశం న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్ కోసం జరిగే ఆటగాళ్ల వేలం ఈనెల 20న జరగనున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ వేలం నేడు (శనివారం) జరగాల్సి ఉండగా సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఏర్పడిన పరిణామాలతో తేదీని మార్చాల్సి వచ్చింది. ఇక ఈ వేలంలో పాల్గొనేందుకు 750 మంది క్రికెటర్లు రిజిస్టర్ చేసుకున్నారని బోర్డు తెలిపింది. అయితే ఒక్కో ఫ్రాంచైజీ తమ జట్టులో 27 మంది ఆటగాళ్లకు చోటిచ్చేందుకు అనుమతి ఉంది. ఇందులో తొమ్మిది మంది విదేశీ ఆటగాళ్లుంటారు. దీంతో ఆయా జట్లు తమ కోటాను పూర్తి చేసుకోవాలంటే వేలంలో 76 మందిని కొనుగోలు చేసేందుకు వీలుంది. కోల్‌కతా జట్టులో ఇప్పుడు 14 మంది ఆటగాళ్లే ఉండడంతో వారు అత్యధికంగా 13 మందిని తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఈ సీజన్‌కు గరిష్టంగా అన్ని జట్లు కలిపి రూ.143.33 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అందరికంటే ఎక్కువగా రూ.23.35 కోట్లు ఖర్చు చేసే అవకాశం ఉండగా... ముంబై మాత్రం రూ.11.55 కోట్లు మాత్రమే ఖర్చు చేసే వీలుంది. ఆటగాళ్ల వేలం అనంతరం 21న ఫ్రాంచైజీల వర్క్ షాప్ ఉంటుంది. -
ఐపీఎల్ వేలం వాయిదా
ఈనెల 20 నుంచి 25 మధ్య ఉండే అవకాశం ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్ కోసం ఆటగాళ్ల వేలం ప్రక్రియ వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 4న శనివారం జరగాల్సి ఉండగా మూడో వారంలో జరిగే అవకాశాలున్నట్టు సమాచారం. బీసీసీఐ ఈ విషయంలో తుది తేదీ ఖరారు చేయకపోయినా ఈనెల 20 నుంచి 25వ తేదీల మధ్య జరిపేందుకు సిద్ధమవుతోంది. లీగ్ ఏప్రిల్ 5 నుంచి మే 21 వరకు జరిపేందుకు గత నవంబర్‌లో నిర్వహించిన ఐపీఎల్ పాలకమండలిలో నిర్ణయించారు. అదే సమయంలో ఆటగాళ్ల వేలం ఈనెల 4న జరుగుతుందని ప్రకటించారు. అయితే ఈ ఏడాది ఆరంభంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో బీసీసీఐలో సమూల మార్పులు జరిగాయి. అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేలను వారి పదవుల నుంచి తొలగించింది. బోర్డు సీఈవోగా రాహుల్ జోహ్రిని నియమించి రోజువారీ కార్యకలాపాలను జరిపేలా ఆదేశించింది. అయితే వ్యవహారాల పర్యవేక్షణ కోసం కమిటీ సభ్యుల నియామకం షెడ్యూల్‌కన్నా ఆలస్యమవడంతో ఐపీఎల్ ఆటగాళ్ల వేలం మార్చాలని భావించారు. అయితే గత సోమవారం సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన నలుగురి సభ్యుల ‘కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీఓఏ) గురువారం సంబంధిత బీసీసీఐ అధికారులను కలుసుకుంది. ఐపీఎల్ 2017 తదితర అత్యవసర విషయాలను చర్చించారు. ఐపీఎల్ సన్నాహకాలను పరిశీలిస్తామని ఫ్రాంచైజీలకు సీఓఏ హామీ ఇచ్చింది. త్వరలోనే విధి విధానాలను పంపిస్తామని తెలిపింది’ అని బీసీసీఐ పేర్కొంది. మరోవైపు ఈ ఆలస్యం కారణంగా ఈనెల 18న ముగిసే ముస్తాక్ అలీ టి20 టోర్నీలో రాణించే దేశవాళీ ఆటగాళ్లను కూడా పరిశీలించే అవకాశం దొరుకుతుందని ఓ ఫ్రాంచైజీ అధికారి తెలిపారు. ఇంగ్లండ్ ఆటగాళ్లకు నష్టం లేదు: కోహ్లి భారత్‌తో జరిగిన చివరి టి20లో ఇంగ్లండ్ బ్యాటింగ్ కుప్పకూలినా ఐపీఎల్ వేలంలో వారి అవకాశాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని కెప్టెన్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. అది ఆయా ఫ్రాంచైజీల ఆలోచనాధోరణిపై ఆధారపడి ఉంటుందని, వారు తమ జట్ల సమతూకం కోసం ఆలోచించి ఆటగాళ్లను ఎంపిక చేసుకుంటారని చెప్పాడు. అలాగే బెన్ స్టోక్స్ కోసం అన్ని జట్లు పోటీపడి భారీ ధర పలికే అవకాశాలున్నాయని యువరాజ్ సింగ్ తెలిపాడు. బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు అద్భుత ఫీల్డర్‌గా పేరు తెచ్చుకున్నాడని, ఇతడి కోసం అన్ని జట్లు ఎగబడతాయని యువీ అన్నాడు. -
ముంబై ఇండియన్స్ కోచ్‌గా జయవర్ధనే
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వచ్చే సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టు చీఫ్ కోచ్‌గా శ్రీలంక మాజీ కెప్టెన్ మహేళ జయవర్ధనే నియమితుడయ్యాడు. ప్రస్తుత కోచ్ రికీ పాంటింగ్ ఒప్పందం త్వరలో పూర్తికానున్న నేపథ్యంలో ముంబై ఇండియన్స ఈ కొత్త నియామకాన్ని ప్రకటించింది. 39 ఏళ్ల జయవర్ధనే 2014 టి20 ప్రపంచ కప్ నెగ్గిన శ్రీలంక జట్టులో కీలక సభ్యుడిగా వ్యవహరించాడు. -
అన్ని హక్కులూ ఒక్కరికే
మారనున్న ఐపీఎల్ బిడ్డింగ్ విధానం ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టెండర్ల ప్రక్రియ పూర్తిగా మారబోతోంది. 2018 నుంచి అన్ని హక్కులూ ఒక్కరికే ఇవ్వాలని బోర్డు భావిస్తోంది. ఇంతకాలం భారత్‌లో టెలివిజన్ హక్కులు, డిజిటల్ బ్రాడ్కాస్ట్, అంతర్జాతీయ బ్రాడ్‌కాస్టింగ్, ఆన్లైన్ హక్కులు ఇలా రకరకాల పేర్లతో బిడ్లు పిలిచి అనేక సంస్థలకు హక్కులు ఇచ్చారు. ఇకపై అలా కాకుండా అన్ని హక్కులకు కలిపి ‘కన్సాలిడేటెడ్ బిడ్’ను ఆహ్వానించనుంది. దీని వల్ల స్టార్ ఇండియా, సోనీ బ్రాడ్‌కాస్టింగ్ సంస్థలకు లబ్ధిచేకూరనుంది. ఇందులో ఏదో ఒక సంస్థ ఈ హక్కులన్నీ చేజిక్కించుకునేందుకు మార్గం సులువైంది. మొత్తం మీద ఈ హక్కుల ద్వారా బీసీసీఐకి రూ. 20 వేల కోట్ల పైచిలుకు ఆదాయం లభించే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
వెంటనే కోహ్లీకి మెస్సేజ్ చేశాను!
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న బౌలర్లలో యుజువేంద్ర చాహల్ ఒకడు. 2015 సీజన్లో 23 వికెట్లు, 2016లో 21 వికెట్లు తీసి జట్టు విజయాలలో కీలకపాత్ర పోషించాడు. టీమిండియా జెర్సీ ధరించాలన్నది తన కల అని, నేటితో తన కల తీరనుందన్నాడు. హరారేలో నేడు జింబాబ్వేతో భారత్ తొలి వన్డే ఆడనుంది. అయితే టీమిండియాకు సెలక్ట్ అయ్యాయని తెలిసినప్పుడు విరాట్ కోహ్లీకి మెస్సేజ్ చేసి సంతోషాన్ని పంచుకున్నానని చెప్పాడు. కోహ్లీ తనను అభినందించాడని ఆ క్షణాలను గుర్తుచేసుకున్నాడు. కోహ్లీ నేతృత్వంలోని బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టులో చాహల్ కొనసాగుతున్నాడు. తాను టీమిండియాకు సెలెక్ట్ అవ్వడం ఐపీఎల్ చలవే అంటున్నాడు. తన బౌలింగ్ లో ఆటగాళ్లు భారీ సిక్సర్లు బాదినా కెప్టెన్ ఒక్కమాట కూడా అనేవాడు కాదని, అది కోహ్లీ తనపై ఉంచిన నమ్మకం అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ లాంటి భీకర ఆటగాళ్లకు ప్రాక్టీస్ సెషన్లలో బౌలింగ్ చేయడంతో మెరుగయ్యాయని లెగ్ స్పిన్నర్ అభిప్రాయపడ్డాడు. వారు హార్డ్ హిట్టర్స్ కనుక అందుకే వారికి ప్లాన్ ప్రకారం కచ్చితమైన అన్ అండ్ లెన్త్, ఫుల్ టాస్ బంతులు వేసేవాడినని చెప్పాడు. డివిలియర్స్, కోహ్లీ తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచారని చెప్పుకొచ్చాడు. కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మాత్రం అంతర్జాతీయ అనుభవం లేని యువ ఆటగాళ్లతో జింబాబ్వేపై సిరీస్ ను కైవసం చేసుకోవాలని భావిస్తున్నాడు. -
నెహ్రా వుయ్ మిస్ యూ! ఈ విజయం నీకే అంకితం!!
8 పరుగుల తేడాతో బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌ను హైదరాబాద్ సన్ రైజర్స్ ఓడించడంతో సంబరాలు మిన్నంటాయి. తొలిసారిగా ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న ఆనందంలో హైదరాబాద్ జట్టంతా ఓలలాడుతుండగా.. ఒక్క క్రికెటర్ మాత్రం ఈ సంబరాలకు దూరంగా ఉండిపోయాడు. అతనే ఆశిష్ నెహ్రా. ఈ నెల 15న పంజాబ్ తో జరిగిన మ్యాచ్‌లో తీవ్రంగా గాయపడటంతో నెహ్రా మొత్తం టోర్నీకి దూరమయ్యాడు. అయినా నెహ్రాను హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు మరువలేదు. ఐపీఎల్ టైటిల్‌ను గెలువగానే సన్‌రైజర్స్ ఆటగాడు యువరాజ్ సింగ్ ఈ బౌలింగ్ లెజండ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో కృతజ్ఞతలు తెలిపాడు. 'నెహ్రా వుయ్ మిస్ యూ. ఈ విజయం నీ కోసమే. హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టుకు శుభాకాంక్షలు. అద్భుతంగా ఆడారు' అంటూ యూవీ పేర్కొన్నాడు. తమ విజయానందంలోని ఫొటోను షేర్ చేశాడు. -
గుజరాత్‌కు సన్ రైజర్స్ మరో షాక్
ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో గుజరాత్ లయన్స్‌కు సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి షాకిచ్చింది. రెండో క్వాలిఫయర్ లో భాగంగా శుక్రవారం జరిగిన పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించి ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. లీగ్ దశలో ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్ ల్లోనూ విజయం సాధించిన హైదరాబాద్ అదే ఫలితాన్ని మరోసారి పునరావృతం చేసి తుదిపోరుకు సిద్ధమైంది. గుజరాత్ విసిరిన 163 పరుగుల లక్ష్యాన్ని సన్ రైజర్స్ ఆరు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. డేవిడ్ వార్నర్ ( 58 బంతుల్లో 93 పరుగులు నాటౌట్ ) ఓంటరి పోరు చేసి జట్టుకు విజయం సాధించి పెట్టాడు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన గుజరాత్ లయన్స్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. గుజరాత్ ఆదిలోనే ఓపెనర్ ఏకలవ్య ద్వివేది(5), సురేష్ రైనా(1) వికెట్లను కోల్పోయినా ఆ తరువాత తేరుకుంది. బ్రెండన్ మెకల్లమ్(32;29 బంతుల్లో5 ఫోర్లు), దినేష్ కార్తీక్(26;19 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్స్)తో ఫర్వాలేదనిపించారు. అటు తరువాత డ్వేన్ స్మిత్(1) నిరాశపరిచినా, అరోన్ ఫించ్(50;32 బంతుల్లో 7 ఫోర్లు, 2సిక్సర్లు) రాణించి జట్టు పరిస్థితిని చక్కదిద్దాడు. ఇక చివర్లో రవీంద్ర జడేజా(19 నాటౌట్;15 బంతుల్లో 1ఫోర్), డ్వేన్ బ్రేవో(20; 10 బంతుల్లో 4 ఫోర్లు) బ్యాట్ ఝుళిపించడంతో గుజరాత్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి గౌరవప్రదమైన స్కోరు చేసింది. -
సెక్స్ వ్యాఖ్యలు: ఐపీఎల్‌లోనూ గేల్‌కు కష్టాలు!
గత అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకోవడం వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్‌కు బొత్తిగా తెలిసినట్టు లేదు. గతంలో బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్) సందర్భంగా టీవీ యాంకర్‌ను డేటింగ్‌కు వస్తావా అని ప్రత్యక్ష ప్రసారంలో అడిగి ఇబ్బందులు కొనితెచ్చుకున్న గేల్.. తాజాగా బ్రిటన్ మహిళా జర్నలిస్టుతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆస్ట్రేలియా యాంకర్ మెల్ మెక్‌లాలిన్ తో అసభ్యంగా ప్రవర్తించినందుకు బీబీఎల్ లో మెల్బోర్న్ జట్టు తరఫున అతని కాంట్రాక్టును పునరుద్ధరించేందుకు ఆస్ట్రేలియా నిరాకరించింది. తమ జర్నలిస్టుతో అభ్యంతరకరంగా మాట్లాడినందుకు ఇంగ్లండ్ కూడా అతని చర్యలు తీసుకొనేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోనూ క్రిస్ గేల్‌కు చిక్కులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. నిత్యం అసభ్యకర వ్యాఖ్యలతో వివాదాస్పదుడిగా మారిన గేల్‌పై ఐపీఎల్‌లోనూ చర్యలు తీసుకునే అవకాశముందని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా సంకేతాలు ఇచ్చారు. భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తరఫున ఆడుతున్న గేల్ విషయంలో ఆంక్షలు కొరడా ఝళిపించే అవకాశముందని శుక్లా చెప్పారు. 'ఆటగాళ్లు సభ్యతతో ప్రవర్తించాల్సిన అవసరముంది. టోర్నమెంటు జరుగుతున్నప్పుడు ఆటగాళ్లు ప్రవర్తనా నియామళికి లోబడి సభ్యంగా నడుచుకుంటారని మేం భావిస్తాం. లీగ్ ప్రతిష్టను ఆటగాళ్లు కాపాడాల్సిన అవసరముంది. బహిరంగంగా అతను ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పూర్తి అవాంఛనీయం. ఈ విషయాన్ని బీసీసీఐ దృష్టికి తీసుకెళుతాం' అని శుక్లా ఓ ఆంగ్ల దినపత్రికకు తెలిపారు. మరోవైపు ఇది ఇద్దరు విదేశీయుల మధ్య జరిగిన అంశమే అయినా.. ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఈ విషయంలో చర్యలు తీసుకుంటామని బీసీసీఐ కార్యదర్శి అజయ్ షిర్కే స్పష్టం చేశారు. గేల్ ఇటీవల బ్రిటిష్ మహిళా జర్నలిస్టు చార్లెట్ ఎడ్వర్డ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెక్స్, మహిళలు, సమానత్వం గురించి వికృత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యల వివాదాన్ని గేల్ తోసిపుచ్చాడు. ఇవి సరదాగా చేసిన వ్యాఖ్యలు మాత్రమేనని, ఇందులో ఎలాంటి దురభిప్రాయాలకు తావు లేదని చెప్పుకొచ్చాడు. -
బంతి బంతికీ బెట్టింగ్ చేస్తూ...
చిత్తూరు జిల్లాలో జోరుగా ఐపీఎల్ బెట్టింగ్.. రోజుకు రూ.10 కోట్ల వరకు అమాయకుల జేబులు ఖాళీ జిల్లాలో మొత్తం 25 మంది బుకీలు? నియంత్రించలేకపోతున్న పోలీసులు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పై జిల్లాలో బెట్టింగుల పర్వం జోరుగా సాగుతోంది. లీగ్ ప్లేఆఫ్ దశకు చేరడంతో ముఖ్యమైన టీంలపై లక్షల్లో బెట్లు కట్టేందుకు కూడా యువకులు వెనకాడడం లేదు. రెట్టింపు స్థాయిలో డబ్బు ఎర చూపి బుకీలు అమాయకులను నిలువునా ముంచేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 25 మంది బుకీలు చిత్తూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో తిష్టవేసి కోట్ల రూపాయలు హాంఫట్ చేస్తున్నట్లు సమాచారం. చిత్తూరు: ఐపీఎల్ క్రికెట్ సందర్భంగా జిల్లావ్యాప్తంగా భారీగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. బంతి బంతికీ బెట్టింగ్ చేస్తూ పలువురు నిమిషాల్లో వేలు సంపాదిస్తుంటే.. మరికొంద రు బికారులుగా మారుతున్నారు. జిల్లావ్యాప్తంగా కోట్లలో బెట్టింగ్ జరుగుతోందని పోలీసులకు సమాచారం ఉన్నా.. తగినంత మంది సిబ్బంది లేక బెట్టింగును వారు నియంత్రించలేకపోతున్నారు. ముఖ్యంగా కర్ణాటక నుంచి బెట్టింగ్ రాయుళ్లు తిరుపతి, చిత్తూరు, మదనపల్లి, బంగారుపాళ్యం, పుత్తూరు, పుంగనూరులకు వచ్చి బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. బెట్టింగ్ చేసే విషయం, ఆ ముఠా తీసుకునే జాగ్రత్తలు తెలుసుకుంటే ఎవరైనా విస్మయానికి గురికావాల్సిందే. అమాయకులే టార్గెట్.. క్రికెట్ బెట్టింగ్ ద్వారా రాత్రికి రాత్రి కోటీశ్వరులు అయిపోవచ్చని బుకీలు అమాయకులకు వల వేస్తున్నారు. కొందరు యు వకులు ఈ రొంపిలో దిగి వదులుకోలేకపోతున్నారు. దీంతో బెట్టింగ్ ముఠా జేబులు నిండుతున్నాయి. అమాయకుల జేబులు ఖాళీ అవుతున్నాయి. బెట్టింగ్‌కు పాల్పడే రెండు పార్టీల నుంచి బుకీలు కమీషన్ తీసుకొని కోట్లకు పడగలెత్తుతున్నారు. జిల్లాలో సుమారు 25 మంది బుకీలు పని చేస్తున్నట్లు సమాచారం. వీరు కర్ణాటక ప్రాంతం నుంచి వచ్చి ఈ తంతును నడిపిస్తున్నారని తెలుస్తోంది. వీరందరూ తమకంటూ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. బెట్టింగ్ చేయాలనుకునే వారి నుంచి ముందస్తు రుసుం వసూలు చేసి సభ్యత్వం కల్పిస్తున్నారు. ఒక కంప్యూటర్, పదుల సంఖ్యలో సెల్ఫోన్లు అందుబాటులో ఉంచుకొని జోరుగా బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. ఏవిధంగా బెట్టింగ్ కట్టాలనుకుంటున్నారో సభ్యులు చెబితే వారు అదే విధంగా బెట్టింగ్ కట్టాలనుకునే వారితో ఒప్పందం కుదురుస్తారు. వీటిని ఎక్కడా రికార్డు చేయరు. కేవలం కోడ్ బాషను మాత్రమే ఉపయోగిస్తారు. మ్యాచ్ ఓడిన వారి నుంచి మరుసటి రోజు డబ్బులు వసూలు చేసి కమీషన్ పట్టుకొని మిగతా సొమ్మును పక్కాగా గెలిచిన వారికి అందిస్తున్నారు. అద్దె ఇళ్లు, టైలరింగ్ షాపులు.. బెట్టింగ్ నిర్వహించాలంటే కచ్చితంగా కంట్రోల్ రూం ఉండాల్సిందే. ఒకప్పుడు వీరు పెద్దపెద్ద హోటళ్లలో కార్యకలాపాలు చేస్తుండే వారు. వీరి గుట్టు అందరికీ తెలియడంతో చిన్నచిన్న అద్దె గృహాలు, మొబైల్ వాహనాలు, టైలరింగ్ షాపుల్లో వ్యవహారాలు నడిపిస్తున్నారు. కర్ణాటక నుంచి వచ్చే హైఫై ముఠా మొబైల్ వాహనాల్లో కథ నడిపిస్తున్నారు. సుమో, స్కార్పియో లాంటి వాహనాలకు డీ2హెచ్‌లను అమర్చుకొని డీల్స్ ఓకే చేస్తున్నారు. ఈ వాహనం ఒకే చోట కాకుండా జిల్లా మొత్తం తిరుగుతుంది. బెట్టింగ్ విషయాలు బయటికి పొక్కకుండా కేవలం ఫోన్లో మాత్రమే మాట్లాడతారు. మెసేజ్‌లు పెడతారు. తమ సభ్యుల్లో ఎవరిపైనైనా అనుమానం వారితో వెంటనే కార్యకలాపాలు ఆపేస్తారు. ఫోన్ నంబర్ మార్చి మిగతా సభ్యులకు కొత్త నంబర్ తెలియజేస్తారు. ఎవరూ నోరు మెదపడం లేదు.. సాధారణంగా జూదంలో ఓడిపోయిన వాడే పోలీసులకు సమాచారం ఇస్తాడు. దీని ద్వారా పోలీసులు చర్య లు తీసుకుంటారు. అయితే బెట్టింగ్ విషయంలో ఈ విషయాలన్నీ గోప్యంగా ఉంటాయి. బెట్ ఏంటన్నది బుకీలే బయటపెడతారు. బుకీలు ఎక్కడి నుంచి వ్యవహారం నడిపిస్తున్నారన్నది ఎవరికీ తెలియదు. వ్యవహారం మొత్తం రహస్యం. దీన్ని ఎవరూ దాటడానికి వీల్లేదు. దాటితే వారికపై కఠిన చర్యలు ఉంటాయి. చంపడానికైనా వెనకాడరు. ఒక వేళ ఓడిపోయిన వ్యక్తి బెట్టింగ్ మొత్తం చెల్లించకపోతే...మరోసారి బెట్టింగ్ చేయడానికి అతడు అనర్హుడు. ఇంకో బెట్టింగ్ ముఠా కూడా అతనిన బెట్టింగ్‌కు సభ్యత్వం ఇవ్వదు. దీనికోసం వారు సరికొత్త సాఫ్ట్‌వేర్‌నే ఉపయోగిస్తున్నారు. కొత్తవారు సభ్యులుగా చేరాలంటే పాత సభ్యుడి సిఫారసు ఉండాల్సిందే. ప్రొటోకాల్ పాటించడానికే.. ప్రొటోకాల్ పాటించడానికే సమయం మొత్తం సరిపోతోందని.. మరి ఇలాంటి విషయాలపై దృష్టిపెట్టడానికి టైమ్‌లేదని పోలీసులు వాపోతున్నారు. జిల్లా మొత్తం దాదాపు 3600 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. జిల్లా జనాభా 40 లక్షలు పైనే. ఈ లెక్కన ప్రతి 1111 మందికి ఒక పోలీసు ఉంటారు. జనాభా పెరుగుతున్నా పోలీసు నియామకాలపై ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు. దీనికి తోడు ఉన్న వారిపై పనిభారం పెరుగుతుండటంతో నేరాల కట్టడి అంతంత మాత్రంగానే ఉంది. -
బౌలింగ్ లో తిరుగులేని మొనగాడు!
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-9లో సన్ రైజర్స్ తరఫున ఆడుతున్న భారత వెటరన్ పేసర్ అశిష్ నెహ్రా తొలి నాలుగు మ్యాచుల్లో తీసింది రెండు వికెట్లు. దీంతో నెహ్రా బౌలింగ్ పదును తగ్గిందని భావించిన వారికి ఎప్పిటిలాగే బంతితోనే సమాధానం చెప్పాడు. ఆ తర్వాత ఆడిన రెండు కీలక మ్యాచుల్లో సరైన సమయంలో రాణించి మొత్తం ఆరు వికెట్లు పడగొట్టాడు. ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో హైదరాబాద్ బౌలర్ నెహ్రా తనదైన బంతులతో వైవిధ్యాన్ని చూపెట్టాడు. దీంతో ముంబై ఈ సీజన్లోలోనే దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్న జట్టుగా చెత్త రికార్డును నమోదు చేసుకుంది. విశాఖలోని వైఎస్ రాజశేఖరరెడ్డి స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్ అయితే దాదాపుగా పుణే గెలిచిందని ఆఖరికి సన్ రైజర్స్ కూడా భావించి ఆశలు వదిలేసుకుంది. ఎప్పటిలాగే నమ్మకస్తుడైన నెహ్రాకు కెప్టెన్ డేవిడ్ వార్నర్ బంతిని అందిస్తే అతడి నమ్మకాన్ని నిలబెట్టి తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. చివరి ఓవర్లో 14 పరుగులు చేస్తే పుణే విజయం సాధిస్తుంది.. మరోవైపు క్రీజులో ఉన్నది తిషారా పెరీరా, మహేంద్ర సింగ్ ధోనీ. ఈ ఇద్దరూ హార్డ్ హిట్టర్సే. కానీ, ఓ తెలివైన బంతితో పెరీరాను పెవిలియన్ కు పంపాడు నెహ్రా. ఆ వెంటనే ధోనీ సిక్స్ కొట్టి ఆశలు రేపినా.. రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. మ్యాచ చివరి బంతికి అడం జంపాను అవుట్ చేసి సన్ రైజర్స్ ను 4 పరుగుల తేడాతో గట్టెక్కించి అత్భుత విజయాన్ని అందించాడు. పుణే బౌలర్ జంపా ఐపీఎల్-9లో (6/19)తో బెస్ట్ గణాంకాలు నమోదు చేసినా హైదరాబాద్ ను పాయింట్ల పట్టికలో టాప్ లో నిలిపిన నెహ్రానే అందరి ప్రశంసలు అందుకున్న బౌలరయ్యాడు. -
ఐపీఎల్ మన దగ్గరే జరగాలి: సూపర్ స్టార్
తీవ్ర కరువు పరిస్థితులు వల్ల ఈసారి భారత్‌లో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు పలు అడ్డంకులు ఎదురయ్యాయి. నీటి కటకట వల్ల మహారాష్ట్రలో నిర్వహించే ఐపీఎల్ మ్యాచ్‌లను వేరే రాష్ట్రాలకు తరలించాలని బొంబాయి హైకోర్టు ఆదేశాలు కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఐపీఎల్ ను విదేశాల్లో నిర్వహిస్తామని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ సంకేతాలు ఇచ్చారు. దీంతో ఐపీఎల్ భారత్‌లోనే నిర్వహించాలా? లేక విదేశాలకు తరలించాలా? అన్న చర్చ నడుస్తోంది. దీనిపై తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్, కోల్‌కతా నైట్‌రైడర్ షారుఖ్ ఖాన్ స్పందించాడు. ఐపీఎల్‌ను విదేశాల్లో నిర్వహించడానికి తాను వ్యతిరేకమని ఆయన తేల్చిచెప్పాడు. 'వ్యాపారపరంగా, వీక్షకుల పరంగా భారత్‌లోనే క్రికెట్‌కు ఎక్కువ ఆదరణ ఉంది. కాబట్టి ఐపీఎల్‌ను ఇక్కడే నిర్వహించాలి. ఈ టీ-20 టోర్నమెంటును భారత్‌లో మొదలైంది. భారత్‌లోనే కొనసాగాలి' అని ఆయన అన్నాడు. కరువు, ఎన్నికలు, నీటి కటకట వంటి సమస్యలను దృష్టిలో పెట్టుకొని, అందరికీ సౌకర్యకరంగా ఉండేలా దేశంలోనే ఎక్కడోచోట ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహించవచ్చునని ఆయన చెప్పాడు. -
'హైదరాబాద్ లో ఐపీఎల్ మ్యాచ్ లు అడ్డుకుంటాం'
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో భాగంగా చీర్ గర్ల్స్ తో డ్యాన్స్ చేయిస్తే మ్యాచ్ లు అడ్డుకుంటామని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) హెచ్చరించింది. హైదరాబాద్ వేదికగా రాత్రి 8 గంటలకు ఉప్పల్ స్డేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో వీహెచ్‌పీ నేతలు ఈ వ్యాఖ్యలు చేశారు. హనుమాన్ శోభాయాత్ర నిర్వహణలో డీజేకు అనుమతి ఇవ్వకపోవడంపై వీహెచ్‌పీ ఆగ్రహంగా ఉండటమే ఈ వ్యాఖ్యలకు కారణమని తెలుస్తోంది. -
ధోనీ షాకిచ్చాడు...!
ఆకస్మికంగా టెస్టుల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించి మహేంద్రసింగ్ ధోనీ క్రికెట్ అభిమానులకు దిమ్మతిరిగేలా చేశాడు. ఇంత సడెన్‌గా ధోనీ ప్రకటించిన ఈ నిర్ణయం ఇటు అభిమానులనే కాదు.. టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రిని కూడా కలవర పరిచింది. తాజాగా ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో ఇష్టాగోష్టిగా మాట్లాడిన రవిశాస్త్రి.. టెస్టుల నుంచి ధోనీ రిటైర్మెంట్ నిర్ణయం ఆశ్చర్యపరచడమే కాదు షాక్‌కు గురిచేసిందని చెప్పాడు. 'నేను షాక్ తిన్నాను. మూడు ఫార్మెట్లలోనూ కొనసాగే సత్తా ధోనీలో ఉంది' అని శాస్త్రి చెప్పాడు. మాజీ టీమిండియా ఆల్‌రౌండర్ అయిన రవిశాస్త్రి ప్రస్తుతం భారత జట్టుకు డైరెక్టర్‌గా విశేషమైన సేవలందించారు. ఇటీవలికాలంలో ధోనీ సేన మళ్లీ విజయాల బాటపట్టడంలో రవిశాస్త్రి కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ ను వచ్చే ఏడాది విదేశాల్లో నిర్వహించనున్నారన్న కథనాలపై స్పందిస్తూ.. 'ఐపీఎల్ గ్లోబల్ ప్రాడక్ట్. దానిని ఎక్కడైనా నిర్వహించవచ్చు. విదేశాల్లో నిర్వహించకూడదనానికి ఎలాంటి కారణాలే లేవు' అని పేర్కొన్నాడు. ఐపీఎల్ ఇండస్ట్రీ లాంటిదని, దీనివల్ల హోటళ్లు, విమాన సంస్థలు నడుస్తాయని, వేలసంఖ్యలో ఉద్యోగులు వస్తాయని ఆయన చెప్పారు. -
ఆ మెరుపుల వెనుక కోహ్లి సలహా!
ముంబై: ఐపీఎల్లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తరఫున మెరుపులు మెరిపిస్తున్న యువ బ్యాట్స్‌మన్ సర్ఫరాజ్ ఖాన్ తాను బ్యాటింగ్‌లో మెరుగుపడటానికి కెప్టెన్ విరాట్ కోహ్లి సలహాలే కారణమని తెలిపాడు. మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్టు బ్యాటింగ్ చేయాల్సిందిగా బెంగళూరు కెప్టెన్ కోహ్లి తనకు సూచించాడని చెప్పాడు. హైదరాబాద్ సన్ రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 పరుగులు చేసి సర్ఫరాజ్ శెభాష్ అనిపించుకున్న సంగతి తెలిసిందే. గురువారం ముంబై ఇండియన్స్‌తో ఐపీఎల్ మ్యాచ్‌కు సిద్ధమవుతున్న సర్ఫరాజ్ బుధవారం మీడియాతో మాట్లాడాడు. 'గడిచిన ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. అండర్ 19 వరల్డ్ కప్ లో భాగంగా కోచ్ రాహుల్ ద్రవిడ్ నుంచి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. మా జట్టు (బెంగళూరు)లోకి కొత్తగా షేన్ వాట్సన్ లాంటి అనుభవజ్ఞుడు రావడం ఎంతో నాకు మేలు చేసింది. అనుభవపరంగానూ ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాను' అని తెలిపాడు. 'గత ఏడాది ఐపీఎల్లో కొన్ని తప్పులు చేశాను. గత ఏడాది చేసిన తప్పులు ఈసారి పునరావృతం కాకుండా చూసుకుంటున్నాను. జట్టు సభ్యులు నాలో ఆత్మవిశ్వాసాన్ని పోద్రి చేస్తున్నారు. ప్రతి మ్యాచ్ తొలి మ్యాచ్ అని భావించి ఆడామని, జట్టు అవసరాలకు అనుగుణంగా బ్యాటింగ్ చేయమని నన్ను ప్రోత్సహిస్తున్నారు' అని సర్ఫరాజ్ చెప్పాడు. ముంబైతో మ్యాచ్‌లో తాను రాణించేందుకు ప్రయత్నిస్తానని, అయితే, తమ జట్టు టాప్ ఆర్డర్ అయిన విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్ ఫామ్‌లో ఉండటంతో బ్యాటింగ్ తనవరకు వచ్చే అవకాశాలు తక్కువని చెప్పాడు. -
ఐపీఎల్ బెట్టింగ్ రూ.100 కోట్లు
సిద్దిపేట రూరల్: ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) ఫోర్లు.. సిక్సర్ల హోరుతో జోరందుకుంది. బెట్టింగ్ కూడా అదే స్థాయిలో లక్షలు దాటి కోట్ల రూపాయలకు చేరింది. ఇటీవల ముగిసిన టీ-20 వరల్డ్ కప్‌లో మెదక్ జిల్లాలో రోజూ రూ.లక్షల్లో బెట్టింగ్ జరిగితే... ఐపీఎల్లో రూ. 2 కోట్ల మేర బెట్టింగ్ నడుస్తున్నట్లు సమాచారం. బెట్టింగ్ తీరిది... వరల్డ్‌కప్‌లో అయితే ఇండియా ఆడే మ్యాచ్‌లపై ఎక్కువగా బెట్టింగ్ నడుస్తుంది. కానీ, ఐపీఎల్‌లోని 8 జట్లలోనూ ఇండియా ఆటగాళ్లు ఉంటారు. దీంతో ప్రతీమ్యాచ్పైనా బెట్టింగ్ దందా ఉంటోంది. ఐపీఎల్ ప్రధానంగా నాలుగు జట్లు ఫెవరేట్‌గా ఉన్నాయి. బెట్టింగ్‌లో ప్రత్యర్థి జట్లుపై అధికంగా బెట్టింగ్ కాస్తారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్, ముంబై ఇండియన్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్, గుజరాత్ లయన్స్‌లో భారీ హిట్టర్లు ఉన్నారు. దీంతో ఇవి ఫెవరేట్ టీంలుగా బెట్టింగ్ రాయుళ్లు భావిస్తున్నారు. ఫేవరేట్ జట్ల మధ్య బెట్టింగ్ జోరుగా నడుస్త్తోంది. మరో నెల రోజులు ఇదే తీరు.. ఈ నెల 8న ప్రారంభమైన ఐపీఎల్ 45రోజుల పాటు జరగనుంది.మొదట్లో కాస్త నెమ్మదిగా ప్రారంభమైంది. భారీ స్కోర్లు లేవు. ఆర్సీబీ, సన్‌రైజర్స్ హైదారాబాద్ మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదు కావడంతో బెట్టింగ్ జోరందుకుంది. ఈ మ్యాచ్‌లో చాలా మంది హైదరాబాద్‌పై పందేలు కాశారు. అయితే ఆర్సీబీ గెలవడంతో భారీగా బెట్టింగ్ రాయుళ్లు జేబులు ఖాళీ చేసుకున్నారు. ఇప్పటి వరకూ రోజు ఒక మ్యాచ్ మాత్రమే నేటి నుంచి రోజుకు రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లలో జిల్లాలో రోజూ సుమారుగా రూ. 3కోట్లు మేర బెట్టింగ్ జరుగుతున్నట్లు సమాచారం. జిల్లాలో బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు పోలీసు వర్గాలు సైతం అంగీకరిస్తున్నాయి. లీగ్ మొత్తంపైన జిల్లాలో దాదాపు రూ. 100 కోట్ల మేర చేతులు మారే అవకాశం ఉందని అంచనా. ఈ ప్రాంతాల్లో బెట్టింగ్ అధికం... మెదక్ జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, తుప్రాన్, పటాన్చెరువు, జహీరాబాద్, రాంచంద్రానగర్, జోగిపేట ప్రాంతాల్లో బెట్టింగ్‌లు పెద్ద ఎత్తున నడుస్తున్నట్లు తెలుస్తోంది. బుకీలు ఈ ప్రాంతాల్లో మకాం వేశారు. కొంతమంది ఏజెంట్లను ఆయా ప్రాంతాల్లో నియమించుకున్నారు. మ్యాచ్‌కు రెండు గంటల ముందు బెట్టింగ్ తీరును చెప్పేస్తారు. ఈ మేరకు బెట్టింగ్ రాయుళ్లు ఏజెంట్లకు డబ్బులు ఇస్తారు. వీరు సబ్‌బుకీలకు చెల్లిస్తారు. మ్యాచ్ అనంతరం వెంటనే బెట్టింగ్ డబ్బులు ఇచ్చేస్తున్నారు. ఈ బెట్టింగ్‌ల వల్ల చాలా మంది నష్టపోతున్నారు. రోడ్డున పడుతున్న కుటుంబాలు... ఇటీవల వరంగల్ జిల్లా చేర్యాల మండలానికి చెందిన ఓ వ్యక్తి సిద్దిపేట ప్రాంతంలో నిర్వహించే బెట్టింగ్‌లో రూ.1.50 లక్షలు ఒకే రోజు పొగొట్టుకున్నట్లు సమాచారం. ఇవే కాకుండా ఇలాంటి ఘటనలు పట్టణ ప్రాంతాల్లో చాలా ఉన్నాయి. లాడ్జీలు, దాబాలు, ఇంటర్నెట్లు, మోబైల్ షాపుల్లో ఈ దందా నడుస్తోంది. బెట్టింగ్ ఎవరు, ఎక్కడ నిర్వహిస్తున్నారనేది స్థానిక పోలీసులకు తెలిసినప్పటికీ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని బాధిత కుటుంబాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. నిఘా ఉంచాం...: సిద్దిపేట పరిధిలో క్రికెట్ బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. పట్టణ పరిధిలో 10మంది బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లు తెలిసింది. వారిపై ఇప్పటికే నిఘా పెట్టాం. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ఆన్లైన్, సెల్ఫోన్ల ద్వారా బెట్టింగ్‌లు నడిపిస్తుండడం వల్ల పట్టుకోలేకపోతున్నాం. బాధితులెవరైనా ఉంటే మమ్మల్ని సంప్రదించాలి. వారికి పొగొట్టుకున్న డబ్బులు ఇప్పించడంతో పాటు వారి పేర్లను గోప్యంగా ఉంచుతాం. సమాచారం ఇస్తే హైదరాబాద్ నుంచి బెట్టింగ్ నడిపిస్తున్న అక్కడి పోలీసుల సాయంతో పట్టుకుంటాం. - సీహెచ్. శ్రీధర్, డీఎస్పీ సిద్దిపేట -
ఐపీఎల్ వల్లే ఇదంతా...
* కొత్త కుర్రాళ్ల ప్రదర్శనపై ధోని వ్యాఖ్య * పుణే టీమ్ జెర్సీ ఆవిష్కరణ న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కొన్ని సందర్భాల్లో చెడ్డపేరు మూట గట్టుకున్న మాట వాస్తవమేనని, అయితే కుర్రాళ్లకు తగిన అవకాశాలు రావడం ఈ లీగ్ వల్లే సాధ్యమైందని భారత కెప్టెన్ ఎమ్మెస్ ధోని అభిప్రాయపడ్డాడు. ‘మనం మంచిని కూడా చూడాలి. దేశవాళీలో ప్రతిభను ఐపీఎల్ వల్లే గుర్తించగలిగాం. కొత్త ఆటగాళ్లు ఒత్తిడిని తట్టుకుంటూ రాణించడం భారత క్రికెట్‌కు మంచి పరిణామం’ అని అతను వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ టీమ్ రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్ జెర్సీని సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ధోనితో పాటు జట్టు యజమాని సంజీవ్ గోయెంకా కూడా పాల్గొన్నారు. ఇన్నేళ్లుగా కుదురుకున్న జట్లతో పోలిస్తే కొత్త టీమ్‌లకు ఐపీఎల్లో కొంత ఇబ్బంది ఎదురవుతుందన్న ధోని, మాజీ సహచరుడు రైనాతో పోటీకి సిద్ధమన్నాడు. మరో వైపు లోధా కమిషన్ నివేదికపై మాట్లాడేందుకు ధోని నిరాకరించాడు. కమిషన్ తనకు నివేదిక ఇవ్వలేదని, ఏం చేయబోతున్నారో బీసీసీఐనే అడగాలని స్పష్టం చేశాడు. నా మనసు చెన్నైతోనే కొత్త జట్టుతో అంతా బాగుందని, చెన్నై అంతా గతమని తాను వ్యాఖ్యానిస్తే అది ఆత్మవంచన అవుతుందని ధోని అన్నాడు. ఆటతోనే కాకుండా మానసికంగా కూడా అక్కడివారితో బంధం ఏర్పడిపోయిందని అతను చెప్పాడు. -
8 సీజన్ల తర్వాత...
* ఐపీఎల్లో మరో జట్టుకు అందుబాటులో ధోని * పది మంది ఆటగాళ్లను నేడు ఎంచుకోనున్న పుణే, రాజ్‌కోట్ ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2008లో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకూ ధోని అంటే చెన్నై సూపర్ కింగ్స్. తొలి సీజన్లో అందరికంటే ఎక్కువ మొత్తం వెచ్చించి ధోనిని సొంతం చేసుకున్న చెన్నై... ప్రతి ఏటా అతణ్ని కొనసాగించుకుంది. ఎనిమిది సీజన్ల తర్వాత ధోని మళ్లీ వేరే జట్టుకు ఇంతకాలానికి అందుబాటులోకి వచ్చాడు. చెన్నై, రాజస్తాన్ రాయల్స్ జట్ల స్థానాల్లో వచ్చిన కొత్త జట్లు పుణే, రాజ్‌కోట్... నేడు పదిమంది క్రికెటర్లను ఎంచుకోనున్నాయి. చెన్నై, రాజస్తాన్ జట్లకు గత సీజన్లో ఆడిన మొత్తం 50 మంది క్రికెటర్లు అందుబాటులో ఉండగా... ఈ రెండు జట్లు ఐదుగురేసి ఆటగాళ్లను ఎంచుకోవాల్సి ఉంది. ధోని, అశ్విన్, సురేశ్ రైనా, రవీంద్ర జడేజా, బ్రెండన్ మెకల్లమ్, అజింక్య రహానే, షేన్ వాట్సన్, స్టీవ్ స్మిత్, డ్వేన్ బ్రే వో, డ్వేన్ స్మిత్‌ల మీద అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. పుణేకు తొలి అవకాశం నేడు జరిగే ఆటగాళ్ల ఎంపిక ప్రక్రియలో తొలి క్రికెటర్‌ను ఎంచుకునే అవకాశం పుణే జట్టుకు ఉంది. సంజీవ్ గోయెంకాకు చెందిన కంపెనీ రివర్స్ బిడ్డింగ్ ప్రక్రియలో మైనస్ 16 కోట్ల రూపాయలతో జట్టును పుణేను గెలిచింది. రాజ్‌కోట్‌ను కొనుక్కున్న ఇంటెక్స్ మొబైల్స్ (మైనస్ 10 కోట్ల రూపాయలు) కంటే ఎక్కువ మొత్తం పుణే జట్టు చెల్లిస్తోంది. కాబట్టి తొలి ఆటగాడిని పుణే ఎంచుకుంటే, రెండో క్రికెటర్‌ను రాజ్‌కోట్ తీసుకుంటుంది. ఆ తర్వాత పుణే, తిరిగి రాజ్‌కోట్ ఇలా ఆటగాళ్లను తీసుకుంటారు. పది మంది పూర్తయ్యాక... మిగిలిన 40 మంది క్రికెటర్లు ఫిబ్రవరిలో జరిగే వేలంలోకి వెళతారు. అక్కడ వీరితో పాటు మరింత మంది క్రికెటర్లు ఉంటారు. ఆ వేలంలో అన్ని జట్లూ పాల్గొంటాయి. జడేజాపై రాజ్‌కోట్ దృష్టి అందుబాటులో ఉన్న వారిలో అందరికంటే ఎక్కువ డిమాండ్ ఉన్న ఆటగాడు ధోని. కాబట్టి సహజంగానే ధోనిని పుణే తీసుకోవచ్చు. అయితే రాజ్‌కోట్ జట్టు తమ తొలి ఆటగాడిగా జడేజాను ఎంచుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇటీవల దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో జడేజా విశేషంగా రాణించడంతో పాటు... అతను రాజ్‌కోట్‌కే చెందిన వాడు కావడంతో తొలుత ఈ ఆల్‌రౌండర్‌ను తీసుకోవాలని భావిస్తున్నారు. మొత్తం మీద ఇన్ని సంవత్సరాల నుంచి కలిసి ఆడిన ఆటగాళ్లలో కొందరు ఇప్పుడు రెండు వేరు వేరు జట్లకు ఆడాల్సి వస్తుంది. కొత్త జట్టు ఆటగాళ్ల కోసం కనిష్టంగా రూ.40 కోట్లు, గరిష్టంగా రూ.60 కోట్లు ఖర్చు చేయాలి. నేడు జరిగే ఎంపిక ప్రక్రియలో తొలి క్రికెటర్‌ను తీసుకోగానే ఇందులో నుంచి రూ.12.5 కోట్లు తగ్గిపోతాయి. ఆ తర్వాత నలుగురు క్రికెటర్లను తీసుకోగానే వరుసగా రూ.9.5 కోట్లు, రూ.7.5 కోట్లు, రూ.5.5 కోట్లు, రూ.4 కోట్లు తగ్గిపోతాయి. ఫిబ్రవరిలో జరిగే వేలంలో ఈ మొత్తాన్ని తగ్గించుకుని మిగిలిన ఆటగాళ్లను కొనుక్కోవాలి. డిసెంబరు 31 వరకు ట్రాన్స్ఫర్ విండో ప్రతి ఏటా వివిధ జట్లు తమకు అవసరం లేని ఆటగాళ్లను వదిలేస్తాయి. వీళ్లని వేరే ఫ్రాంచైజీ ట్రాన్స్ఫర్ విండోలో కొనుక్కోవచ్చు. ఈసారి ట్రాన్స్ఫర్ విండో డిసెంబరు 15 నుంచి 31 వరకు ఉంటుంది. -
ఐపీఎల్‌లోకి కొత్త టీమ్‌లు వచ్చాయి..
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోకి రెండు కొత్త జట్లు వచ్చాయి. వచ్చే రెండు సీజన్లలో పుణె, రాజ్‌కోట్ ఫ్రాంచైజీలు ఆడుతాయని మంగళవారం బీసీసీఐ ప్రకటించింది. బెట్టింగ్ ఉదంతంలో రెండేళ్ల పాటు నిషేధానికి గురైన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల స్థానాల్లో ఈ రెండు జట్లను తీసుకున్నారు. పుణె టీమ్‌ను 16 కోట్ల రూపాయలకు న్యూ రైజింగ్ (సంజీవ్ గొయెంకా) సొంతం చేసుకోగా, రాజ్‌కోట్ జట్టును 10 కోట్ల రూపాయలకు ఇంటెక్స్ దక్కించుకుంది. చెన్నై, రాజస్థాన్ జట్లలోని టాప్-5 ఆటగాళ్లను.. పుణె, రాజ్‌కోట్ ఎంపిక చేసుకునే అవకాశముంది. ఈ నెల 15న ఆటగాళ్లను ఎంపిక చేయనున్నారు. -
రామన్ రాజీనామా
బీసీసీఐ ఆమోదం ఐపీఎల్ సీఓఓగా ఎనిమిదేళ్లు సేవలు ముంబై: భారత క్రికెట్లో మరో పెను మార్పు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆరంభం నుంచి దాని ముఖ్య కార్యనిర్వాహణాధికారి (సీఓఓ)గా పని చేసిన సుందర్ రామన్ తన పదవికి రాజీనామా చేశారు. సోమవారం సాయంత్రం నాగ్‌పూర్ వెళ్లి బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్‌కు రాజీనామా పత్రం అందించారు. దీనిని వెంటనే ఆమోదిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ‘సుందర్ తన రాజీనామాను శశాంక్‌కు అందించారు. దీనిని బీసీసీఐ ఆమోదించింది. ఐపీఎల్ కోసం రామన్ సర్వశక్తులూ ఒడ్డి కష్టపడ్డారు. ఇందుకు ఆయనను అభినందిస్తున్నాం’ అని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా చెప్పారు. అయితే రామన్ రాజీనామా విషయంలో ఎవరి బలవంతం లేదని అన్నారు. ‘రామన్‌కు వ్యతిరేకంగా ఎక్కడా ఎలాంటి నివేదికలు లేవు. బహుశా తన మనసులో వేరే ఆలోచన ఉండి ఉంటుంది. అందుకే ఇక్కడి నుంచి తప్పుకోవాలని అనుకున్నారు’ అని శుక్లా అన్నారు. స్పాట్ ఫిక్సింగ్ కేసులో రామన్ హస్తం ఉందని తేల్చిన జస్టిస్ ముద్గల్ కూడా రాజీనామా సరైన నిర్ణయమని అన్నారు. ‘రెండేళ్ల క్రితం నివేదికలో ఆయన పేరు వచ్చినప్పుడే రాజీనామా చేసి ఉంటే బాగుండేది. అయితే వ్యక్తిగత నిర్ణయాలు ఒక్కొక్కరివి ఒక్కోలా ఉంటాయి. ఏమైనా రామన్ రాజీనామా చేయడం మంచి పరిణామం’ అని ముద్గల్ అన్నారు. -
ఐపీఎల్ స్లెడ్జింగ్‌ను దూరం చేసింది: ధోని
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ద్వారా విశ్వవ్యాప్తంగా ఉన్న క్రికెటర్ల మధ్య స్నేహ సంబంధాలు పెరిగాయని భారత వన్డే జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అభిప్రాయపడ్డాడు. ఈ లీగ్ కారణంగా క్రికెట్లో స్లెడ్జింగ్ కూడా దూరమైందని అన్నాడు. ‘మేమంతా జంటిల్మెన్ గేమ్ ఆడుతున్నాం. గెలవాలని అందరికీ ఉంటుంది. అయితే ఇది సరైన రీతిలో ఉండాలి. నిజానికి ఐపీఎల్ అసహ్యకరమైన స్లెడ్జింగ్‌ను దూరం చేసింది. ఇలాంటి టి20 లీగ్స్ ద్వారా ఆటగాళ్ల మధ్య స్నేహాలు పెరుగుతున్నాయి. ప్రపంచంలోని వివిధ సంస్కతుల నేపథ్యం కలిగిన వారంతా ఒక్కచోట కలిసి ఉండడం ఆటగాళ్లకు లాభిస్తోంది. నేను కూడా చాలామంది ఆటగాళ్లకు సన్నిహితంగా మారాను’ అని వెస్టిండీస్ డాషింగ్ క్రికెటర్ క్రిస్ గేల్‌తో కలిసి ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ధోని తెలిపాడు. -
ఐపీఎల్ సహా అంతర్జాతీయ క్రికెట్ కు సెహ్వాగ్ వీడ్కోలు
-
ఐపీఎల్‌కు పెప్సీ రాం రాం!
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)తో మూడేళ్లుగా కొనసాగుతున్న తమ అనుబంధాన్ని తెగదెంపులు చేసుకోవాలని పెప్సీకో కంపెనీ నిర్ణయించుకుంది. ఈ మేరకు ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ నుంచి వైదొలుగుతున్నట్టు బీసీసీఐకి తెలిపింది. దీంతో వచ్చే ఏడాది సీజన్‌కు కొత్త స్పాన్సర్‌ను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2012లో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఐపీఎల్‌తో పెప్సీ 2017 వరకు కొనసాగాల్సి ఉంది. దీనికోసం బోర్డుతో రూ.396 కోట్ల భారీ మొత్తంతో డీల్ కుదుర్చుకుంది. అయితే స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం వెలుగు చూడడంతో ఐపీఎల్ ప్రతిష్టకు అపఖ్యాతి ఏర్పడిందన్న కారణంతో ఈ కూల్‌డ్రింక్ కంపెనీ తన మనసు మార్చుకుంది. వాస్తవానికి గతేడాదే ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పాలని అనుకున్నా బోర్డు ఒత్తిడితో కొనసాగింది. ప్రస్తుతం ఈ విషయంపై బీసీసీఐతో కంపెనీ చర్చలు జరుపుతోంది. మరోవైపు పెప్సీకో తప్పుకోవడం పెద్ద విషయం కాదని, తమకు ఇతర ఆలోచనలు ఉన్నాయని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా తెలిపారు. ఏం జరిగినా సామరస్యంగా జరుగుతుందని అన్నారు. మరోవైపు ఆసక్తి ఉన్న కంపెనీలతో చర్చించి పెప్సీ నుంచి హక్కులను వారికి బదలాయించే ఆలోచనలో బోర్డు ఉంది. 18న వర్కింగ్ కమిటీ సమావేశం ముంబై: బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశం ఈనెల 18న ముంబైలో జరుగనుంది. చాలా విషయాలు చర్చించే అవకాశాలు ఉండడంతో ఈ మీటింగ్ కీలకం కానుంది. కొత్త అధ్యక్షుడిగా నియమితులైన శశాంక్ మనోహర్ ఈ సందర్భంగా సభ్యులకు తన ప్రణాళికలను వెల్లడించనున్నారు. -
సహారా హోటల్స్ డీల్‌లో లలిత్‌మోదీ పేరు
- సుప్రీంకోర్టు ముందు వివరాలు తెలిపిన - అమెరికా ఇన్వెస్ట్మెంట్ సంస్థ తరఫు న్యాయవాది.. న్యూఢిల్లీ: లండన్, న్యూయార్క్ల్లోని సహారా హోటల్స్ అమ్మకాల వ్యవహారంలో ‘తీవ్ర రాజకీయ వివాదంలో’ ఉన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మాజీ చీఫ్ లలిత్ మోదీ పేరు తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే... సహారాకు లండన్‌లో గ్రోస్వీనార్ హౌస్ హోటల్, న్యూయార్క్‌లో న్యూయార్క్ ప్లాజా, డ్రీమ్ న్యూయార్క్ హోటల్స్ ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు సంవత్సన్నర కాలంలో తీహార్ జైలులో ఉంటున్న సహారా చీఫ్ సుబ్రతోరాయ్ బెయిల్‌పై విడుదలకు, రూ.10,000 కోట్లను సమీకరించడంలో భాగంగా ఈ హోటళ్ల విక్రయ ప్రతిపాదనలపై కసరత్తు జరుగుతోంది. ఈ హోటళ్లను తాము కొనుగోలు చేస్తామని విన్నవిస్తూ... బ్రిటన్‌కు చెందిన కేన్ కేపిటల్ పార్ట్నర్స్ లిమిటెడ్, అమెరికాకు చెందిన ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ మిడ్‌సన్ కేపిటల్ హోల్డింగ్ ఎల్ఎల్సీలు అత్యున్నత న్యాయస్థానంలో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిని సుప్రీంకోర్టు సోమవారం విచారణకు చేపట్టింది. మిడ్‌సన్ కేపిటల్ తరఫున వివరాలను కోర్టుకు తెలుపుతున్న న్యాయవాది... ఈ సందర్భంగా లలిత్ మోదీ పేరును జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని బెంచ్ ముందు ప్రస్తావించారు. సుబ్రతోరాయ్ కుమారుడు శుశాంతో రాయ్ విదేశీ హోటళ్ల విక్రయానికి సంబంధించి లలిత్ మోదీ సహాయాన్ని కోరినట్లు తెలిపారు. సహారా తరఫున మోదీనే డీల్ వ్యవహారాలు చూస్తున్నారని సైతం సూచించారు. తన క్లెయింట్ న్యూయార్క్‌లో హోటళ్ల కొనుగోలుకు 800 మిలియన్ డాలర్లను ఆఫర్ చేస్తూ... మోదీకి ఒక లేఖ రాశారని పేర్కొన్నాయి. అయితే మోదీ దీనికి ఒక మెయిల్లో జవాబిస్తూ... గ్రూప్ ఆఫర్ 965 మిలియన్ డాలర్లుగా ఉందని తెలియజేశారని, ఈ మెయిల్ శుశాంతోకు కూడా మార్క్ చేసి ఉందని విన్నవించారు. కాగా బ్రిటన్ హోటల్ కొనుగోలుకు ముందుకు వచ్చిన కేన్ కేపిటల్ పార్ట్నర్స్ ఈ డీల్‌కు సంబంధించి 637 మిలియన్ పౌండ్లను ఆఫర్ చేసింది. పూర్తిగా హోటళ్లను అమ్మబోం: సహారా ఈ ఆఫర్లను మీ క్లయింట్ ఆమోదిస్తున్నారా! అని ఈ సందర్భంగా సహారా తరఫు వాదనలు వినిపిస్తున్న కపిల్ సిబల్‌ను బెంచ్ ప్రశ్నించింది. ఈ సందర్భంగా సిబల్ సమాధానం చెబుతూ, హోటళ్లను పూర్తిగా అమ్మదలచుకోవడంలేదని తెలిపారు. మరింత అధిక మొత్తంతో మరో రెండు కొత్త ఆఫర్లు సైతం పెండింగులో ఉన్నట్లు తెలిపారు. కొన్ని సంస్థలు హోటళ్లను దురాక్రమణ చేయాలని భావిస్తున్నట్లు కూడా సహారా తరఫున సిబల్ కోర్టుకు ఈ సందర్భంగా తెలిపారు. హోటళ్ల విక్రయ ప్రతిపాదనల పురోగతి, చైనా బ్యాంక్‌తో రుణ లావాదేవీల అంశాలను ఎప్పటికప్పుడు అత్యున్నత న్యాయస్థానానికి తెలియజేయాలని ధర్మస్థానం ఆదేశించింది. కాగా ఆస్తుల విక్రయానికి సంబంధించి తీహార్ జైలు కాన్ఫరెన్స్ హాల్లో ప్రత్యేక సదుపాయాలను సహారా చీఫ్‌కు పొడిగించాలన్న కపిల్‌సిబల్ విజ్ఞప్తిని కోర్టు ఆమోదించింది. కేసు తదుపరి విచారణ వచ్చేనెల 14కు వాయిదా పడింది. -
అమ్మకానికి రాయల్ చాలెంజర్స్ టీమ్!
ఐపీఎల్ జట్టును కొననున్న జిందాల్ గ్రూప్ అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మరో అనూహ్య మార్పు! విజయ్ మాల్యాకు చెందిన ‘కలర్‌ఫుల్’ టీమ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు చేతులు మారనున్నట్లు తెలిసింది. లీగ్‌లో ప్రస్తుతం ఉన్న జట్లలో ఒకదానిని కొనుగోలు చేస్తున్నట్లు జేఎస్‌డబ్ల్యూ స్టీల్ (జిందాల్ గ్రూప్) ప్రకటించింది. ఆ సంస్థ చైర్మన్ సజ్జన్ జిందాల్ బుధవారం ఈ విషయాన్ని అధికారికంగా ఖరారు చేశారు. ‘మన దేశంలో క్రికెట్ నంబర్‌వన్ క్రీడ. అందుకే ఒక ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాం. డబ్బులు సమస్య కాదు. ఒక గుర్తింపు ఉన్న జట్టును తీసుకొని క్రీడలను ప్రోత్సహించాలనేది మా ఆలోచన.’ అని ఆయన చెప్పారు. తాను కొనే జట్టు ఏదనేది ఆయన స్పష్టంగా చెప్పకపోయినా... అది బెంగళూరు టీమ్ అని సమాచారం. ప్రస్తుతం ఫుట్‌బాల్ ఐ-లీగ్‌లోని బెంగళూరు ఎఫ్‌సీ ఈ గ్రూప్‌కు చెందిందే కావడం విశేషం. యూబీ గ్రూప్ అధినేత విజయ్ మాల్యా 2008లో 111.6 మిలియన్ డాలర్లకు బెంగళూరు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేశారు. విరాట్ కోహ్లి, క్రిస్ గేల్, డివిలియర్స్‌లాంటి స్టార్ ప్లేయర్లతో కూడిన ఈ జట్టు ఎనిమిది సీజన్లలో ఒక్కసారి కూడా చాంపియన్‌గా నిలవలేకపోయింది. ఇతర ఆర్థిక పరమైన సమస్యల కారణంగా కూడా మాల్యా ఐపీఎల్ నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. -
భళా... ఐపీఎల్!
భారత్‌లో క్రికెట్ ప్రేమికుల వేసవి వినోదం ముగిసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎనిమిదో ఎడిషన్ ద్వారా 50 రోజుల పాటు టి20 క్రికెట్ మజాను అభిమానులు పూర్తిగా ఆస్వాదించారు. ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించిన ముంబై ఇండియన్స్ జట్టు రెండోసారి టైటిల్ సాధించింది. ప్రతి సీజన్లోనూ నిలకడగా ఆడే చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి ఫైనల్‌కు వచ్చింది. ఎనిమిది సీజన్లలోనూ నాకౌట్‌కు అర్హత సాధించిన ధోనిసేన ఆరోసారి ఫైనల్ ఆడింది. అయితే ఇందులో నాలుగు ఓడిపోవడం ఆ జట్టు ఆలోచించాల్సిన అంశం. లీగ్ ఆరంభ దశలో వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిపోయి, ప్లే ఆఫ్లకు వెళ్లాలంటే కచ్చితంగా ప్రతి మ్యాచ్‌లోనూ గెలవాల్సిన స్థితిలో ఉండి కూడా ముంబై ఇండియన్స్ అద్భుతం చేసింది. చివరి దశలో వరుస విజయాలతో టైటిల్ హస్తగతం చేసుకుంది. బెంగళూరు రాయల్ చాలెంజర్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లు కూడా ప్లే ఆఫ్‌కు చేరుకున్నా... కొందరు క్రికెటర్ల వ్యక్తిగత ప్రదర్శనపై ఆధారపడి మూల్యం చెల్లించుకున్నాయి. క్రిస్‌గేల్, డివిలియర్స్, కోహ్లిల రూపంలో ముగ్గురు స్టార్స్ ఉండటం, ముగ్గురూ ఫామ్‌లో ఉండటంతో ఈ ఏడాది బెంగళూరు జట్టు అభిమానులను బాగా ఆకట్టుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుది మరో కథ. చివరి రెండుమ్యాచ్‌ల్లో ఒక్కటి గెలిచినా ప్లే ఆఫ్‌కు వెళ్లే పటిష్ట స్థితిలో ఈ జట్టు రెండు మ్యాచ్‌లూ ఓడింది. డేవిడ్ వార్నర్ లీగ్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచినా ఆ జట్టు ప్లే ఆఫ్ దశను దాటలేకపోయింది. బ్యాటింగ్ లైనప్‌లో భారత హిట్టర్స్ లేకపోవడం ఈ జట్టును వేధించింది. డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ కూడా సరిగ్గా హైదరాబాద్‌లాగే నిష్ర్కమించింది. ముంబై ఇండియన్స్‌పై ఆఖరి ఓవర్ వరకూ అద్భుతంగా ఆడి ఆ ఒక్క ఓవర్లో పీయూష్ చావ్లా పేలవ ఆటతీరు కారణంగా ఓడిపోయింది. ఆ ప్రభావం తర్వాతి మ్యాచ్‌లోనూ పడటంతో ఈసారి ప్లేఆఫ్‌లకు చేరలేకపోయింది. టోర్నీలో అందరికంటే పేలవంగా ఆడిన జట్లు ఢిల్లీ డేర్‌డెవిల్స్, పంజాబ్ కింగ్స్ ఎలెవన్. గత ఏడాది సంచలన ఆటతీరుతో ఫైనల్ వరకూ వచ్చిన పంజాబ్ ఈసారి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానానికి పరిమితమైపోయింది. మ్యాక్స్‌వెల్, బెయిలీ, మిల్లర్, సెహ్వాగ్‌లాంటి స్టార్ క్రికెటర్లెవరూ తమ స్థాయికి తగ్గట్లుగా ఆడకపోవడంతో పంజాబ్ నిరాశను మిగుల్చుకుంది. గత ఏడాది ప్రదర్శనతో ఈ సారి ఈ జట్టుకు అందరికంటే అత్యధికంగా 13 కంపెనీలు స్పాన్సర్స్‌గా వ్యవహరించాయి. ఆ కంపెనీలన్నింటినీ పంజాబ్ జట్టు నిరాశపరిచింది. గత ఏడాది పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన ఢిల్లీ ఈసారి జట్టును బాగా మార్చింది. డబ్బుకు వెరవకుండా వేలంలో యువరాజ్, మాథ్యూస్లను తీసుకొచ్చింది. అయినా ఫలితంలో మాత్రం పెద్దగా మార్పు రాలేదు. చివరి నుంచి రెండో స్థానంతో సరిపెట్టుకుంది. టి20 క్రికెట్ ఆడటానికి వయసుతో సంబంధం లేదని ఈ సీజన్లోనూ కొంతమంది నిరూపించారు. 44 ఏళ్ల వయసులో బ్రాడ్‌హాగ్, 43 ఏళ్ల ప్రవీణ్ తాంబే ఈ ఏడాది కూడా సత్తా చాటారు. 36 ఏళ్ల వయసున్న ఆశిష్ నెహ్రా 22 వికెట్లు తీసి తనలో చేవ తగ్గలేదని చూపించాడు. అయితే వయసు కారణంగా వీళ్ల ప్రతిభ కేవలం ఐపీఎల్‌కే పరిమితం కానుంది. భారత జట్టులోకి రావడానికి ఐపీఎల్ షార్ట్‌కట్‌గా మారింది. 2008లో తొలి సీజన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ ప్రతి సీజన్లోనూ కొత్త క్రికెటర్లు వెలుగులోకి వచ్చారు. అలాగే రెండేళ్లుగా భారత జట్టులో చోటు కోసం పరితపిస్తున్న హర్భజన్ సింగ్ ఈ సీజన్ ద్వారా మళ్లీ జట్టులో స్థానం సంపాదించాడు. ఇక వెలుగులోకి వచ్చిన యువ సంచలనాలకూ కొదవలేదు. ఢిల్లీ జట్టుకు ఆడిన ముంబై కుర్రాడు శ్రేయేష్ అయ్యర్ అందరినీ ఆకట్టుకున్నాడు. రాజస్తాన్‌కు ఆడిన దీపక్ హుడా, ముంబైకి ప్రాతినిథ్యం వహించిన హార్దిక్ పాండ్య, సుచిత్లతో పాటు బెంగళూరు జట్టులో ఆడిన హర్షల్ పటేల్, యజువేంద్ర చాహల్ కూడా సెలక్టర్ల దృష్టిలో పడ్డారు. వయసు, ఆటతీరును పరిగణనలోకి తీసుకుంటే వీరిలో అయ్యర్ చాలా త్వరలోనే భారత జట్టు తలుపు తట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. 17 ఏళ్ల సర్ఫరాజ్ ఖాన్ బెంగళూరు జట్టుకు ఆడి గేల్, డివిలియర్స్‌ల దగ్గర చాలా పాఠాలు నేర్చుకున్నాడు. ఐపీఎల్లో ఉన్న అందమే ఇది. భారత యువ క్రికెటర్లు దిగ్గజాలతో కలిసి డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోవడం ద్వారా అనుభవం గడిస్తున్నారు. ఈ ఏడాది అలాంటి అనుభవం యువ క్రికెటర్లకు దొరికింది. ఈసారి పెద్దగా వివాదాలు లేకుండానే టోర్నీ ముగియడం సంతోషించదగ్గ పరిణామం. లీగ్ ఆరంభానికి ముందే రాజస్తాన్ జట్టులోని ఓ యువ క్రికెటర్ని బుకీలు సంప్రదించారనే వార్త కలకలం రేపింది. క్రికెట్ అభిమానులను కలవరపరిచింది. అయితే, ఈసారి అలాంటి దొంగాటలకు ఆస్కారం లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ప్రతి మ్యాచ్‌లోనూ అవినీతి నిరోధక అధికారులు వేయికళ్లతో ఆటగాళ్లను గమనించారు. ఫలితంగా ఈసారి మచ్చ తెచ్చే వ్యవహారాలు జరిగినట్లుగా వార్తలు రాలేదు. అలాగే మైదానం బయట కూడా పార్టీల హడావుడి కూడా పెద్దగా లేదు. దీంతో పూర్తిగా క్రికెట్ మీదే ఫోకస్ పెట్టారు. గత సీజన్‌తో పోలిస్తే ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్‌లకు వీక్షకుల సంఖ్య పెరిగిందని, టోర్నీ ఘన విజయం సాధించిందని ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది. చిన్న పట్టణాలకు క్రికెట్‌ను విస్తరించాలనే ఆలోచన చాలా కాలంగా ఉంది. ఇందులో భాగంగానే 8 జట్లే ఉన్నా 12 నగరాల్లో 13 వేదికల్లో మ్యాచ్‌లు జరిగాయి. అలాగే ఈసారి కొత్తగా ఫ్యాన్పార్క్లను ఏర్పాటు చేశారు. మన దగ్గర గుంటూరు, వరంగల్‌లో ఫ్యాన్ పార్క్‌లు ఏర్పాటు చేశారు. గుంటూరులో దేశంలోనే అత్యధికంగా 20 వేల మంది ఈ ఫ్యాన్ పార్క్‌కు వచ్చి పెద్ద స్క్రీన్ మీద మ్యాచ్‌లు చూశారు. ఐపీఎల్ వ్యాపారాన్ని మరింత పెంచడానికి ఈ ఫ్యాన్ పార్క్‌లు ఉపయోగపడతాయని బీసీసీఐ ఆలోచన. ఆ కోణంలోంచి చూస్తే ఇవి కూడా హిట్ అయినట్లే. -
అక్కడ ఏదీ అసంబద్ధం కాదు
బహుళజాతి సంస్థలన్నీ రంగుల మాయ చేసేవే. వాటి ప్రధాన ధ్యేయం లాభాలు పెంచుకోవడమే. ఈ ప్రకటనలేవీ కూడా పక్షపాత దృష్టిని కల్పించవు, లేదా ప్రోత్సహించవు. అయితే ఎవరి వెర్రితనం మీదనైనా డబ్బు సంపాదించే మార్గాలు ఉంటే వాటిని తప్పనిసరిగా అవి ఉపయోగించుకుంటాయి. అలాగే మన బలహీనతను సొమ్ము చేసుకునే విధంగానే ప్రకటనలలోని కళాత్మకత అంతా ఉంటుంది. సాధారణ ప్రజలకు ఉండే భ్రాంతులను లాభాలుగా మార్చుకునే విద్యలు పెద్ద పెద్ద కంపెనీలకు బాగా తెలుసు. సమకాలీన పట్టణ భారతాన్ని ఈ రెండింటిలో ఏది బాగా దృశ్యీకరించగలుగుతుంది: క్రీడామైదానంలో ప్రజ లు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పటి దృశ్యాలా? ప్రతి ఓవర్ తరువాత ప్రసారంలో విరామం ఇచ్చి, లేదా ఇతర విరామ సమయాలలోనూ చూపించే వ్యాపార ప్రక టనలా? వీటినే ఆడంబరంగా వ్యూహాత్మక విరామాలని కూడా అంటారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) పూర్వీకులు చాలా ప్రత్యేకమైనవారు. రోమన్ చక్రవర్తులు పౌరులకి ఆహారంతో పాటు, సర్కస్ విన్యాసాలను అందుబాటు లో ఉంచడం ద్వారా తమ ఉనికిని నిలుపుకోవడం ఎలా గో బాగా తెలిసినవారిగా ప్రసిద్ధికెక్కారు. పురుషుడనే వాడు కేవలం ఆహారంతోనే సరిపుచ్చుకుని బతకలేడు. అదే శుభవార్తను ప్రస్తుతకాలంలో ఆడవారి గురించి కూడా చెప్పవచ్చు. ఇవాళ్టి సర్కస్ ఏమిటో సుస్పష్టమే. ఆ సర్కస్ కూడా అదే విధమైన ప్రయోజనకారి కూడా. క్రికె ట్ స్టేడియంను కూడా అచ్చంగా రోమన్ల గతకాలపు కొలోసియంల మాదిరిగానే నిర్మించారు. పాక్షిక పైకప్పు తప్ప మిగిలిన నిర్మాణంలో పెద్ద మార్పేమీ లేదు. అయితే హింసాస్వాదన పట్ల ఆధునిక కాలంలో ఉన్న ఆసక్తిలో కొంచెం భేదం ఉంది. అందుకే, మరీ రోమన్ల కాలంలోని గ్లాడియేటర్ యుద్ధవీరులు ధరించిన కవచాల మాదిరిగా కాకుండా, బ్యాట్స్‌మెన్ శిరస్త్రాణాలు ధరిస్తున్నారు. చంపుకోవడం ఇప్పుడు నిషిద్ధం కదా! కాబట్టి పైశాచికానం దాన్ని బ్యాట్స్‌మెన్ (అతడి యుద్ధ విన్యాసాలతో) మరణం కంటే, ఇన్నింగ్స్ మరణం మీదికి మళ్లిస్తున్నారు. అంపైర్‌కి తన బొటనవేలును నేలవైపు చూపడం కంటే, ఆకాశం వైపు చూపడానికే అధికారం ఉంది. రోమన్ కాలపు లక్షణానికీ, దీనికి పెద్ద తేడా లేదు. పాలక వర్గాలవారు ప్రత్యేకమైన బాక్సులలో కూర్చుని క్రీడను తిలకిస్తారు. పౌరులంతా కింద నుంచి పైవరకు శ్రేణులుగా అమర్చిన ఆసనాల మీద సొగసుగా ఆసీనులై ఉంటారు. కెమెరాలు పౌరుల గురించి మనకి ఏం చెబు తాయి? 21వ శతాబ్దపు యువ భారతీయులు ముమ్మాటికీ వారి తండ్రులూ, మామయ్యల కంటే చాలా బాగుంటా రు. ఇది జీవితంలో ఏదో ఒక దశకు సంబంధించి చెబు తున్నది కూడా కాదు. భవిష్యత్తుతో బంధం వల్ల యువకులు ఎప్పుడూ అందచందాలతో ఉంటారు. కానీ వయ సు మీరిన వారు అద్దానికి బందీలవుతారు. ఆరోగ్యం, వెలుగు మనిషి ఉన్నత స్థితిలో ఉన్న కాలాన్ని ప్రతిబిం బిస్తూ ఉంటాయి. స్త్రీపురుష సమానత్వమన్న ఆలోచనకు సంబంధించి ఒక జాతిగా మనం ఇప్పటికీ దానికి కొంత దూరం గానే ఉన్నాం. అయితే స్త్రీపురుష సహనం మాత్రం ఉంది. దాని గురించి నేను చెప్పదలుచుకున్నాను. 1950, 1960 నాటి సినిమాలలో చూస్తే అమ్మాయిలూ, అబ్బాయిలూ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో కూడా విడివిడిగానే కూర్చుని ఉన్నట్టు కనిపిస్తారు. వీటితో పోల్చుకుంటే నేటి యువతరం ఒకరితో ఒకరు చాలా సన్నిహితంగా ఉంటు న్నారనే చెప్పాలి. దీనిని పరిగణనలోనికి తీసుకోకపోతే ఏ రాజకీయవేత్తకు యువతరం ఓట్లు పడవు. అంటే, నైతిక వర్తనవాదులు ఆమోదించిన కాలం చెల్లిన గతాన్ని తప్ప, నాయకులు మరి దేనినీ గెలుచుకోలేరు. ఇది మంచి వార్త. అయితే భేషజానికి సంబంధించిన వాసనలు మనలను ఇంకా పూర్తిగా వీడిపోలేదు. సంకేతాలను అందుకుని గాలిలో ముద్దులు విసరడానికీ, డబ్బులు తీసుకుని వయ్యారంగా కన్నుగీటడానికి మహిళా చీర్లీడర్ల కిరాయి బృందాన్ని ప్రతి ఒక్క క్రికెట్ జట్టు ఏర్పాటు చేసుకుంటూ ఉంటుంది. అయితే ఈ బృందంలో ఉండే యువతులంతా విదేశీయులే. బుద్ధిమంతులైన మన బాలికలు అలాంటి కురచ బట్టలలో ఎప్పుడూ కనిపించ కూడదు. ప్రతివారూ ఏం చెబుతారు? ఇలాంటి బృందా లలో కలసి నిలబడడానికి మన అమ్మాయిలను అను మతిస్తే, వాళ్లు చీరలు ధరించి ఏదో సంప్రదాయిక విన్యాసం చేస్తారనే. ఆధునిక వస్త్రధారణ, ఆస్వాదించే కన్ను ఇంటర్వ్యూ పరిధికే పరిమితం. చీర్లీడర్లు ఉండే చోటులో వీరిని వెతనక్కరలేదు. అయితే ఇందుకు నిరాశ చెందనక్కరలేదు. ఇవాళో రేపో అనే గానీ, అదీ జరుగు తుంది. దీనికి ఆధారం ఏమిటి? మన వ్యాపార ప్రకటనలే. వాటిలో కనిపిస్తున్న భారతీయ మహిళలు చిన్న చిన్న చెడ్డీలతో కనిపిస్తున్నారు, పురుషుడు అనాఛ్చాదిత వక్షా న్ని ప్రదర్శిస్తున్నాడు. పురుషులు ఉపయోగించే ఒక పెర్ ఫ్యూమ్కు సంబంధించిన ఆ వ్యాపార ప్రకటనలో ఒక పురుషుడు ఠీవిగా కెమెరా కేసి నడిచి వస్తాడు. అతడిని ఒక ఎయిర్ హోస్టెస్ ఆరాధనగా చూస్తూ ఉంటుంది. అప్పుడు ఆమె చెప్పే మాట అస్పష్టంగా ఉంటుంది. నీవు మహిళలను ఆకర్షించడానికీ, నిజానికి మహిళలే నిన్ను ఆకర్షించడానికి ఆ పెర్ఫ్యూమ్లో మునిగి తేలితే చాలు నన్నదే దాని భావం. ఆ వ్యాపార ప్రకటన ప్రభావం చూపడం అని వార్యం. లేదంటే అది ప్రసారం కాదు. తెల్లతోలు లేదా శ్వేతవర్ణం దేనినైనా విజయవంతం గా విక్రయించడానికి దోహదపడుతుంది. యూరోపి యన్ బహుళజాతి సంస్థ ఫిలిప్. ఇది తను ఉత్పత్తి చేస్తు న్న ఎలక్ట్రిక్ షేవర్ (గెడ్డం గీసుకునే పరికరం) గురించి ప్రచారం చేయడానికి ఛానెళ్లలో సమయం తీసుకుం టుంది. అందుకు సంబంధించిన వ్యాపార ప్రకటనలో మొదటి దృశ్యం: ముఖమంతా గుబురుతో ముదురు చాక్లెట్ రంగు మనిషి కనిపిస్తాడు. ఇతడు తన గెడ్డాన్ని సంప్రదాయక పద్ధతులలో తొలగించడానికి ప్రయత్నిం చినపుడు అతడి చెంప మీద ఒక మెరుపు వస్తుంది. తరు వాత ఫిలిప్ షేవర్ వస్తుంది. అది అతడి గుబురు గెడ్డాన్ని పరమ సౌఖ్యంగా తొలగించడమే కాదు, ముఖంతో పాటు, భుజాల వరకు కూడా శరీరాన్ని కాంతిమంతం చేస్తుంది. ఈ అద్భుతం పూర్తయ్యే సరికి, అతడి చుబుకం మంచుముద్ద ఒంపు మాదిరిగా నున్నగా తయారవు తుంది. మరుక్షణం అతడు స్థానిక హాలెండ్ వాసిలా రూపుదాలుస్తాడు. నిజానికి అది గెడ్డం గీసుకోవడం అనిపించదు. ఆ పురుషుడు పునరుత్థానం చెందాడని అనిపిస్తుంది. ఈ వ్యాపార ప్రకటన కూడా తన ప్రభావం చూపు తుంది. లేదంటే అసలు ప్రసారం కాదు. దీనిని బట్టి భారతీయులు కూడా శరీరం లోపలే కాదు, బయట కూడా రంగుకు దాసులేనని ఇవన్నీ రుజువు చేస్తున్నాయి. బహుళజాతి సంస్థలన్నీ రంగుల మాయ చేసేవే. వాటి ప్రధాన ధ్యేయం లాభాలు పెంచుకోవడమే. ఈ ప్రకటనలేవీ కూడా పక్షపాత దృష్టిని కల్పించవు, లేదా ప్రోత్సహించవు. అయితే ఎవరి వెర్రితనం మీదనైనా డబ్బు సంపాదించే మార్గాలు ఉంటే వాటిని తప్పని సరిగా అవి ఉపయోగించుకుంటాయి. అలాగే మన బల హీనతను సొమ్ము చేసుకునే విధంగానే ప్రకటనలలోని కళాత్మకత అంతా ఉంటుంది. సాధారణ ప్రజలకు ఉండే భ్రాంతులను లాభాలుగా మార్చుకునే విద్యలు పెద్ద పెద్ద కంపెనీలకు బాగా తెలుసు. కాబట్టి కంపెనీలకు వ్యతిరేకంగా చట్టాలు రూపొందించవద్దు. వినియోగ దారు డనే మన బంగారం మంచిదైతే అదే చాలు. (వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు ఎం.జె.అక్బర్) -
పదవి నిలబెట్టుకున్న బిస్వాల్
ఐపీఎల్ చైర్మన్‌గా కొనసాగింపు న్యూఢిల్లీ: బీసీసీఐ కొత్త కార్యవర్గం ఎన్నికైనా... ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చైర్మన్ పదవిని మాత్రం రంజీబ్ బిస్వాల్ నిలబెట్టుకున్నారు. ఇందులో ప్రస్తుతానికి ఎలాంటి మార్పూ లేదని బోర్డు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. బోర్డు త్వరలోనే కొత్తగా వేర్వేరు సబ్ కమిటీలను ఏర్పాటు చేయనుంది. ‘ఈస్ట్ జోన్ సంఘాలన్నీ ఒకే తాటిపై ఉండాలని కోరుకుంటున్నాం. దాల్మియా అధ్యక్షుడు కావడానికి బిస్వాల్ కూడా సహకరించారు. ఐపీఎల్ చైర్మన్‌గా అతడినే కొనసాగించాలనేదే మా ఆలోచన. ఇప్పటి వరకు ఆ పదవిలో ఆయన బాగానే పని చేశారు కాబట్టి మార్పు అవసరం లేదు’ అని ఆయన చెప్పారు. మరో వైపు దాల్మియాకు, శ్రీనివాసన్‌కు మధ్య ‘వారధి’గా పని చేసేందుకు... బెంగాల్ క్రికెట్ సంఘం కోశాధికారి బిస్వరూప్ డే ను ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పేరుతో కొత్త పదవిలో నియమించడం విశేషం. సిరీస్‌లు ఖరారు చేయండి: పీసీబీ బీసీసీఐ అధ్యక్షుడిగా దాల్మియా ఎంపిక పట్ల పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) హర్షం వ్యక్తం చేసింది. ఆయన రాకతో భారత్, పాక్ సిరీస్‌ల పునరుద్ధరణలో పురోగతి ఆశిస్తున్నట్లు పీసీబీ అధ్యక్షుడు షహర్యార్ ఖాన్ అన్నారు. 2004లో భారత జట్టు పాక్‌లో పర్యటించినప్పుడు ఈ ఇద్దరే ఆయా బోర్డులకు అధ్యక్షులుగా ఉన్నారు. ఒకటి, రెండు రోజుల్లో షహర్యార్ భారత్ వచ్చి దాల్మియాను కలువనున్నారు. -
నేడు ఐపీఎల్-8 ఆటగాళ్ల వేలం
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఎనిమిదో సీజన్ కోసం నేడు (సోమవారం) ఆటగాళ్ల వేలం జరుగనుంది. డాషింగ్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్‌తో పాటు సూపర్ ఫామ్‌లో ఉన్న దక్షిణాఫ్రికా ఓపెనర్ హషీమ్ ఆమ్లా, ఆస్ట్రేలియా స్టార్ ఆరోన్ ఫించ్ ఈ వేలంలో ప్రత్యేక ఆకర్షణ కాబోతున్నారు. గతేడాది వేలంలో యువీని బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు అనూహ్యంగా రూ.14 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే అంచనాలకు తగ ్గట్టు రాణించకపోవడంతో యువీని ఆ జట్టు వదులుకుంది. వీరితో పాటు ఢిల్లీ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్, దినేశ్ కార్తీక్ కనీస ధర రూ.2 కోట్లుగా ఉంది. ఈ సీజన్ కోసం 122 మంది ఆటగాళ్లను ఆయా ఫ్రాంచైజీలు తమ దగ్గరే అట్టిపెట్టుకున్నాయి. వీరిలో 78 మంది భారత్, 44 మంది విదేశీ ఆటగాళ్లున్నారు. ఒక్కో జట్టు ఆటగాళ్ల కొనుగోలు కోసం గరిష్టంగా రూ. 63 కోట్లు ఖర్చు చేయవచ్చు. ఇది గత సీజన్‌కన్నా 5 శాతం ఎక్కువ. ఈ కార్యక్రమం సోనీ సిక్స్ ఎస్డీ, హెచ్డీ చానెల్స్‌లో ఉదయం 9.30 నుంచి ప్రత్యక్ష ప్రసారం కానుంది. -
పవార్ సలహాతోనే బిడ్ వేశాను
శ్రీనివాసన్ వ్యాఖ్య న్యూఢిల్లీ / చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేయడంలో తనకెలాంటి దురుద్దేశాలు లేవని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ ఎన్.శ్రీనివాసన్ స్పష్టం చేశారు. అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు శరద్ పవార్ సలహా మేరకే ముందుకెళ్లానని ఆయన తెలిపారు. తననో ప్రైవేట్ వ్యక్తిగా భావించి బిడ్ వేయమని పవార్ అనుమతించారని గుర్తుచేశారు. చెన్నైలో జరిగిన ఐసీసీ ఈవెంట్లో పాల్గొన్న శ్రీని విలేకరుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఇండియా సిమెంట్స్‌లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోని పాత్రపై వ్యాఖ్యానించేందుకు ఆయన నిరాకరించారు. ధోనిని రాజీనామా చేయాలని అడిగారా? అన్న ప్రశ్నకు శ్రీనివాసన్ స్పందిస్తూ.. ‘నేనెందుకు ధోనిని రాజీనామా చేయమని అడగాలి? ఇండియా సిమెంట్స్‌లో అతడి పాత్ర గురించి మీకెందుకు చెప్పాలి. అలాగే ఫిక్సింగ్ ఉదంతంతో భారత క్రికెట్‌కు వచ్చిన ముప్పేమీ లేదు’ అని తేల్చి చెప్పారు. స్పాట్ ఫిక్సింగ్ విచారణ కోర్టు పరిధిలో ఉండడంతో ఆ విషయంపై తానేమీ మాట్లాడనని చెప్పారు. సుప్రీం విచారణ 8కి వాయిదా జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ నివేదికపై సోమవారం మరోసారి సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఐపీఎల్లో బెట్టింగ్‌కు పాల్పడినట్టు తెలిసిన వెంటనే గురునాథ్ మెయ్యప్పన్, రాజ్‌కుంద్రాలపై బీసీసీఐ ఫిర్యాదు చేసిందని శ్రీనివాసన్ తరఫు న్యాయవాది కపిల్ సిబల్ కోర్టుకు తెలిపారు. అలాగే పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు సంబంధించి ముకుల్ ముద్గల్ కమిటీ లేక బాంబే హైకోర్టు కూడా శ్రీనివాసన్‌కు వ్యతిరేకంగా ఏమీ చెప్పలేదని ఆయన గుర్తుచేశారు. శ్రీనిని బోర్డు పదవి నుంచి తొలగించాలనే ఏకైక లక్ష్యం ప్రత్యర్థికి కనిపిస్తోందని వాదించారు. అయితే ఈ విషయంలో నిరూపించుకోవాల్సింది శ్రీనివాసనేనని జస్టిస్ టీఎస్ ఠాకూర్, కలీఫుల్లాలతో కూడి బెంచ్ వ్యాఖ్యానించింది. అయితే అరుణ్ జైట్లీ సూచనల మేరకు ఫిక్సింగ్, బెట్టింగ్ వివాదంపై బీసీసీఐ ప్యానెల్ ఏర్పాటైందని పదేపదే సిబల్ పేర్కొనడంపై కోర్టు ఘాటుగా స్పందించింది. కోర్టులో లేని వ్యక్తి గురించి, ఈ కేసుకు సంబంధం లేని వ్యక్తి గురించి అదే పనిగా మాట్లాడటం సరికాదని తెలిపింది. శ్రీనివాసన్ పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు సంబంధించి మాత్రమే ఈరోజు (సోమవారం) విచారణ జరుగుతుందని పేర్కొంది. విచారణను ఈనెల 8కి వాయిదా వేసింది. -
ఉన్ముక్త్, వినయ్ లను కొన్న ముంబై ఇండియన్స్
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో తొలిసారిగా ప్రవేశపెట్టిన 'ట్రేడింగ్ విండో' ద్వారా ఇద్దరు ఆటగాళ్లను ముంబై ఇండియన్స్ జట్టు దక్కించుకుంది. రాజస్థాన్ రాయల్స్ నుంచి ఉన్ముక్త్ చంద్, కోల్‌కతా నైట్ రైడర్స్ నుంచి ఆర్. వినయ్ కుమార్ ను కొనుగోలు చేసింది. తమ టీమ్ నుంచి ప్రవీణ్ కుమార్, మైఖేల్ హస్సీని రిలీజ్ చేసింది. వీరిద్దరిని 2015 క్రీడాకారుల వేలంలో వేరే జట్లు కొనుక్కోవచ్చు. 2015 ఎడిషన్ కోసం మొదటి 'ట్రేడింగ్ విండో' అక్టోబర్ లో తెరిచారు. దీని గడువు డిసెంబర్ 12తో ముగుస్తుందని బీసీసీఐ తెలిపింది. తదుపరి ఎపీఎల్ ఎడిషన్ ఏప్రిల్ 8 నుంచి మే 24 వరకు జరుగుతుందని వెల్లడించింది. -
బోథమ్‌పై బీసీసీఐ ఆగ్రహం
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రపంచ క్రికెట్‌ను నాశనం చేస్తోందన్న ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ బోథమ్ వ్యాఖ్యలపై బీసీసీఐ మండిపడింది. ముందు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితబోధ చేసింది. అన్ని జట్ల క్రికెటర్లు ఐపీఎల్‌కు బానిసలవుతున్నారని, ఆయా క్రికెట్ బోర్డులు కూడా లీగ్‌కు మద్దతు పలుకుతున్నాయని బోథమ్ ఆరోపించారు. ‘ఐపీఎల్లో ఆడేందుకు ఇతర బోర్డులు ఎందుకు అంగీకరించాయని ఆయన అడిగారు. ముందు బోథమ్ నిజాలు తెలుసుకోవాలి. విదేశీ ఆటగాళ్లను లీగ్‌లో ఆడేందుకు అనుమతించినందుకు మేం ఆయా బోర్డులకు పది వేల యూఎస్ డాలర్ల చొప్పున నష్టపరిహారం కింద చెల్లించాం. మాకు సూచనలు ఇచ్చేందుకు దిగ్గజ ఆటగాళ్లున్నారు. బోథమ్లాంటి వ్యక్తుల సలహాలు మాకు అక్కరలేదు’ అని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ స్పష్టం చేశారు. -
‘చాలెంజ్’ చేస్తారా!
రాయల్ చాలెంజర్స్ ఓనర్: విజయ్ మాల్యా (యూబీ గ్రూప్) కెప్టెన్: కోహ్లి కోచ్: వెటోరి గత ఉత్తమ ప్రదర్శన: రన్నరప్ (2009, 2011), సెమీఫైనల్ (2010) కీలక ఆటగాళ్లు: కోహ్లి, క్రిస్ గేల్, డివిలియర్స్, యువరాజ్, రవి రాంపాల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత దురదృష్టకరమైన జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. రెండుసార్లు ఫైనల్ (2009, 2011)కు చేరినా టైటిల్ మాత్రం చేజిక్కించుకోలేకపోయింది. ఈ రెండు సీజన్లలో అద్భుతంగా ఆడినప్పటికీ.. ఒత్తిడికి తలొగ్గి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. ఈసారి ఎలాగైనా చాంపియన్‌గా నిలవాలని పట్టుదలగా ఉన్న ఓనర్ విజయ్ మాల్యా వేలం పాటలో కొందరు కీలక ఆటగాళ్లను చేజిక్కించుకున్నారు. దీంతో రాయల్ చాలెంజర్స్ జట్టు అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. ఇక రాయల్ చాలెంజర్స్ గత ఫిబ్రవరిలో జరిగిన వేలం పాటలో అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇందుకు కారణం.. స్టార్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్‌పై విజయ్ మాల్యా కోట్లాది రూపాయలు కుమ్మరించడమే. టి20లో ఆల్‌రౌండ్ ఆటతీరుతో ఆకట్టుకునే యువరాజ్‌ను రికార్డు స్థాయిలో రూ. 14 కోట్లకు కొనుగోలు చేశారు. ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్‌ను రూ. 5 కోట్లకు, దక్షి ణాఫ్రికా ఆల్‌రౌండర్ అల్బీ మోర్కెల్‌ను రూ. 2.4 కోట్లకు దక్కించుకున్నారు. వేలం పాటకు ముందు ముగ్గురు కీలక ఆటగాళ్లు విరాట్ కోహ్లి, క్రిస్‌గేల్, డివిలియర్స్‌లను రిటైన్ చేసుకుంది. అందరి దృష్టి వారిపైనే..! క్రిస్ గేల్... విరాట్ కోహ్లి... యువరాజ్ సింగ్... డివిలియర్స్.. ఈ నలుగురు ఆటగాళ్లపైనే రాయల్ చాలెంజర్స్ యాజమాన్యం ప్రధానంగా భారం వేసింది. పరుగుల సునామీ సృష్టించే క్రిస్‌గేల్‌కు ఐపీఎల్లో మంచి రికార్డు ఉండటం... వేదిక ఏదైనా నిలకడగా రాణించే సత్తా కోహ్లి, డివిలియర్స్‌లలో ఉండటం.. తనదైన రోజున సిక్సర్ల వర్షం కురిపించి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే దమ్ము యువీలో ఉండటంతో రాయల్ చాలెంజర్స్‌ను టైటిల్ రేసులో ముందుండేలా చేస్తోంది. సారథిగా మెప్పిస్తాడా..? నిలకడైన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకున్న విరాట్ కోహ్లి.. ఐపీఎల్లో కెప్టెన్‌గా మాత్రం విఫలమయ్యాడు. ఐపీఎల్-5లో కొన్ని మ్యాచ్‌లకు, ఐపీఎల్-6లో అన్ని మ్యాచ్‌లకు కోహ్లి కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ రెండు సీజన్లలోనూ సారథిగా కోహ్లి మెప్పించలేకపోయాడు. అయితే ఏడాది కాలంలో కోహ్లి కెప్టెన్‌గా పరిణితి సాధించడంతో ఈసారి చాలెంజర్స్‌ను ముందుండి నడిపిస్తాడని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. బలాలు... క్రిస్ గేల్ బీభత్సమైన బ్యాటింగ్... విరాట్ కోహ్లి నిలకడైన ఆట... యువరాజ్ దూకుడు... మిచెల్ స్టార్క్, వరణ్ ఆరోన్ వేగం.. ప్రత్యర్థిని బోల్తా కొట్టించే రవి రాంపాల్... మురళీధరన్, జకాటి స్పిన్ మాయాజాలం.. ఇలా రాయల్ చాలెంజర్స్ అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తోంది. బలహీనతలు... పెద్దగా ఏమీ లేవు.. ఆరు సీజన్లలో విజేతగా నిలవకపోవడంతో ఈ సారైనా ట్రోఫీ సాధించాలన్న ఒత్తిడి.. బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు: భారత్‌కు ఆడిన క్రికెటర్లు: విరాట్ కోహ్లి (కెప్టెన్), యువరాజ్ సింగ్, వరుణ్ ఆరోన్, అశోక్ దిండా, పార్థివ్ పటేల్. విదేశీ క్రికెటర్లు: ఏబీ డివిలియర్స్, ఆల్బీ మోర్కెల్ (దక్షిణాఫ్రికా), క్రిస్ గేల్, రవి రాంపాల్, (వెస్టిండీస్), మిచెల్ స్టార్క్, నిక్ మ్యాడిన్సన్ (ఆస్ట్రేలియా), మురళీధరన్ (శ్రీలంక). భారత దేశవాళీ క్రికెటర్లు: హర్షల్ పటేల్, విజయ్ జోల్, అబూ నెచిమ్ అహ్మద్, సచిన్ రాణా, షాదాబ్ జకాతి, సందీప్ వారియర్, తన్మయ్ మిశ్రా, యోగేష్ టకవాలే, యజువేంద్ర సింగ్ చహల్. -
‘రైజింగ్’కు సిద్ధం
స్టెయిన్ పర్యవేక్షణలో రాణిస్తాం వేదిక ఏదైనా పర్వాలేదు ఇషాంత్, ఇర్ఫాన్ ఆశాభావం సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మంచి విజయావకాశాలు ఉన్నాయని ఆ జట్టు పేసర్లు ఇషాంత్ శర్మ, ఇర్ఫాన్ పఠాన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇషాంత్ గత నాలుగేళ్లుగా హైదరాబాద్ జట్టుతో కొనసాగుతుండగా, పఠాన్ తొలిసారి రైజర్స్‌తో జత కలిశాడు. స్టెయిన్‌తో కలిసి జట్టును విజయాలబాటలో నడిపిస్తామని ఇషాంత్, ఇర్ఫాన్ అంటున్నారు. ఐపీఎల్-7 కోసం సన్‌రైజర్స్ శనివారం దుబాయ్ బయల్దేరి వెళ్లనుంది. ఈ నేపథ్యంలో వీరు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. విశేషాలు వారి మాటల్లోనే... ఇషాంత్ శర్మ ఐపీఎల్‌కు సన్నాహకాలు: అంతర్జాతీయ క్రికెటర్లకు ప్రత్యేక సన్నాహకాలు పెద్దగా అవసరం లేదు. ఈ సారి జట్టులో చాలా మంది కొత్త ఆటగాళ్లు ఉన్నారు కాబట్టి వారితో సమన్వయం చేసుకోవడమే ముఖ్యం. కోచ్ మూడీ అదే పనిలో ఉన్నారు. అసలు మ్యాచ్‌లకు ముందు స్వల్ప కాలిక క్యాంప్ జరగడం కొంత ఉపయోగపడుతుంది. నా వరకు ఇటీవల ముస్తాక్ అలీ ఆడి టి20తో టచ్‌లోనే ఉన్నాను. జట్టు అవకాశాలు: గత ఏడాది సన్‌రైజర్స్ టీమ్‌గా తొలిసారి బరిలోకి దిగినా టాప్-4లో నిలవగలిగాం. ఈసారి కచ్చితంగా మా ప్రదర్శన మెరుగవుతుందనే ఆశిస్తున్నా. యూఏఈ వేదికలపై: షార్జా, దుబాయ్‌లలో నేను ఎప్పుడూ ఆడలేదు. అయితే కొంత మంది నా జూనియర్ సహచరులు చెప్పినదాని ప్రకారం చూస్తే అక్కడ కూడా భారత్‌ను పోలిన వికెట్లే ఉంటాయి. అయినా టి20ల్లో వికెట్వంటి అంశాలు పెద్దగా ప్రభావం చూపవు. ఇర్ఫాన్ పఠాన్ జట్టు మారడంపై: ఐపీఎల్లో ఇది నా మూడో జట్టు. గత ఆరు ఎడిషన్లలో వ్యక్తిగతంగా కొన్ని చెప్పుకోదగ్గ ప్రదర్శనలు నమోదు చేశాను. అయితే విజేతగా నిలిచిన జట్టులో భాగం కాలేకపోయాను. ఈ సారి ఆ కోరిక తీరుతుందని నా విశ్వాసం. సన్‌రైజర్స్ సభ్యులపై: మా జట్టు ఆల్‌రౌండర్లతో సమతూకంగా ఉంది. టి20కి సరిగ్గా సరిపోయే ఆటగాళ్లు ఉన్నారు. నా పరంగా చూస్తే బౌలింగ్‌తో పాటు టాపార్డర్‌లో బ్యాటింగ్ చేయాలని కోరుకుంటున్నా. ఇప్పుడున్న కూర్పును బట్టి నాలుగు, ఐదు స్థానాల్లో అవకాశం దక్కితే మంచిది. తొలి సారి స్టెయిన్‌తో ఆడనుండటం: ఈ సీజన్లో నన్ను అన్నింటికంటే ఎక్కువగా ఉద్వేగానికి గురి చేస్తున్న విషయం అదే. అతని వెంట పడి మరీ కొత్తగా నేర్చుకునేందుకు ప్రయత్నిస్తా. ప్రపంచ నంబర్‌వన్ బౌలర్‌గా ఉన్నా ప్రతీ బంతికి అతను కష్టపడే తీరు, అతనిలోని ఎనర్జీ నిజంగా గ్రేట్. -
రాజసం తిరిగొస్తుందా ?
రాజస్థాన్ రాయల్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఎప్పుడూ లో ప్రొఫైల్‌లో ఉండే జట్టు ఏదైనా ఉందంటే అది రాజస్థాన్ రాయల్సే. అంచనాలేమీ లేకుండానే బరిలోకి దిగడం. అనామకులతోనే ప్రత్యర్థికి చుక్కలు చూపించడంలో ఈ టీమ్‌ది అందెవేసిన చేయి. టి20లకు స్టార్లు అవసరం లేదని, నైపుణ్యం ఉన్న యువ క్రికెటర్లను స్టార్లను చేయొచ్చని రాజస్థాన్ చేసి చూపించింది. అంతేకాదు అత్యంత పొదుపైన జట్టు కూడా ఇదే. ఆటగాళ్లపై తక్కువగా ఖర్చుచేసి.. ఎక్కువగా ప్రతిఫలాన్ని పొందడం రాయల్స్ ఫ్రాంచైజీకి వెన్నతో పెట్టిన విద్య. ‘షేన్’ సెంటిమెంట్ ఫలించేనా? ఐపీఎల్ ఆరో సీజన్ వరకు రాజస్థాన్ జట్టును దిగ్గజ క్రికెటర్లు ముందుండి నడిపించారు. తొలుత ఆసీస్ స్పిన్ దిగ్గజం షేన్‌వార్న్, ఆ తర్వాత భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ కెప్టెన్లుగా వ్యవహరించారు. వీరి ఆధ్వర్యంలో రాజస్థాన్ రాయల్స్ అంచనాలకు మించి రాణించింది. ఐపీఎల్-1లో రాయల్స్‌ను వార్న్ విజేతగా నిలపగా.. గత సీజన్లో చాంపియన్స్ లీగ్ టి20లో రన్నరప్‌గా నిలిచింది ద్రవిడ్ కెప్టెన్సీలోనే. అయితే ద్రవిడ్ ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పడంతో ఈసారి జట్టు యాజమాన్యం ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ షేన్‌వాట్సన్‌కు పగ్గాలు అప్పగించింది. ఐపీఎల్ ఆరంభం నుంచి వాట్సన్ ఈ జట్టుతోనే ఉన్నాడు. దీంతో పాటు ‘షేన్’ సెంటిమెంట్ కలిసొస్తుందని యాజమాన్యం భావిస్తోంది. ఇక రాయల్స్ ఫ్రాంచైజీ షేన్ వాట్సన్‌తో పాటు జేమ్స్ ఫాల్క్‌నర్, అజింక్యా రహానె, సంజు శామ్సన్, స్టువర్ట్ బిన్నీలను కొనసాగించుకుంది. వేలంలో మరోసారి దేశవాళీ క్రికెటర్లకే పెద్దపీట వేసింది. అదే సమయంలో టి20లకు సరిగ్గా సరిపోయే విదేశీ ఆటగాళ్లను దక్కించుకుంది. వివాదాలకు కేరాఫ్... రాజస్థాన్ రాయల్స్‌ను ముందు నుంచీ వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2013 సీజన్లోనైతే ఈ జట్టు పతాక శీర్షికలకు ఎక్కింది. ఇందుకు కారణం రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు మ్యాచ్ ఫిక్సింగ్‌లో ఇరుక్కోవడం.. అలాగే జట్టు యజమాని రాజ్‌కుంద్రాపై బెట్టింగ్ ఆరోపణలతో రాజస్థాన్ రాయల్స్ ఉక్కిరిబిక్కిరైంది. సుప్రీం గడప తొక్కిన ఈ వ్యవహారంలో సస్పెన్షన్ నుంచి కాస్తలో తప్పించుకుంది. బలాలు... షేన్ వాట్సన్‌తో పాటు మిగిలిన విదేశీ ఆటగాళ్లు రాజస్థాన్ రాయల్స్ ప్రధాన బలం. భారత ఆటగాడు అజింక్యా రహానే నిలకడైన ఆట.. ఎప్పటిలాగే యువ ఆటగాళ్లపైనే ఆధారపడటం రాయల్స్ బలాలుగా చెప్పవచ్చు. బలహీనతలు... విదేశీ ఆటగాళ్లపైనే ఆధారపడటం.. రహానేను మినహాయిస్తే భారత స్టార్లు లేకపోవడం. ముఖ్యంగా భారత జట్టుకు ఆడిన ప్రధాన బౌలర్లు లేకపోవడం బలహీనత. జట్టు: భారత్‌కు ఆడిన క్రికెటర్ల్లు: అజింక్యా రహానే, స్టువర్ట్ బిన్నీ, అభిషేక్ నాయర్. విదేశీ క్రికెటర్లు: షేన్ వాట్సన్, జేమ్స్ ఫాల్క్‌నర్, స్టీవెన్ స్మిత్, బ్రాడ్ హాడ్జ్, కేన్ రిచర్డ్సన్, బెన్ కటింగ్ (ఆస్ట్రేలియా), టిమ్ సౌతీ(న్యూజిలాండ్), కెవాన్ కూపర్(వెస్టిండీస్). భారత దేశవాళీ క్రికెటర్లు: సంజు శామ్సన్, రజత్ భాటియా, ధావల్ కులకర్ణి, కరుణ్ నాయర్, ఉన్ముక్త్ చంద్, ఇక్బాల్ అబ్దుల్లా, దీపక్ హుడా, దిశాంత్ యాగ్నిక్, విక్రమ్‌జీత్ మాలిక్, అంకిత్ శర్మ, రాహుల్ తెవాటియా, అంకుశ్ బైన్స్, ఎ. మిశ్రా, ప్రవీణ్ తాంబే. -
సన్‌రైజర్స్ సందడి
టీమ్ ప్రాక్టీస్ ప్రారంభం 14 మంది ఆటగాళ్లు హాజరు సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్-7) కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తమ సన్నాహాలు మొదలు పెట్టింది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో ఆ జట్టు బుధవారం ప్రాక్టీస్ ప్రారంభించింది. జట్టులోని మొత్తం 24 మంది సభ్యులలో 14 మంది ఈ శిక్షణ శిబిరానికి హాజరయ్యారు. శుక్రవారం వరకు మూడు రోజుల పాటు ఈ సెషన్ కొనసాగుతుంది. అనంతరం రైజర్స్ దుబాయ్ బయల్దేరి వెళుతుంది. ఈ నెల 18న అబుదాబిలో రాజస్థాన్ రాయల్స్‌తో హైదరాబాద్ జట్టు ఐపీఎల్ తొలి మ్యాచ్ ఆడనుంది. సరదాగా... సీరియస్‌గా... సన్‌రైజర్స్ తొలిరోజు ప్రాక్టీస్ సెషన్ దాదాపు రెండున్నర గంటల పాటు సాగింది. ముందుగా టీమ్ ట్రైనర్ జేడ్ రాబర్ట్స్ ఆటగాళ్లతో కొద్దిసేపు ఫిట్నెస్ ఎక్సర్సైజ్లు చేయించాడు. చిన్నపిల్లల ఆటల తరహాలో కొన్ని సరదా విన్యాసాలతో శిక్షణను మొదలు పెట్టిన అతను ఆ తర్వాత సీరియస్‌గా కసరత్తు చేయించాడు. అనంతరం ప్రధాన కోచ్ టామ్ మూడీ, అసిస్టెంట్ కోచ్ హెల్మట్ కలిసి మైదానంలో ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేయించారు. దాదాపు గంటపాటు సాధన చేసిన అనంతరం జట్టు సభ్యులు నెట్స్‌లోకి వెళ్లారు. మరో గంటన్నర పాటు ఆటగాళ్లు బ్యాటింగ్ సాధనలో పాల్గొన్నారు. జట్టు మెంటర్లు శ్రీకాంత్, వీవీఎస్ లక్ష్మణ్ ఈ మొత్తం శిక్షణను పర్యవేక్షించారు. ముఖ్యంగా లక్ష్మణ్ బౌలర్లకు సూచనలిస్తూ వారిని ప్రోత్సహించే ప్రయత్నం చేశాడు. నేరుగా దుబాయ్‌కే... తొలిరోజు భారత ఆటగాళ్లు ఇర్ఫాన్ పఠాన్, ఇషాంత్ శర్మలతో పాటు దేశవాళీ ఆటగాళ్లు కరణ్ శర్మ, నమన్ ఓజా, అనిరుధ శ్రీకాంత్, పర్వేజ్ రసూల్, ప్రశాంత్ పరమేశ్వరన్, మన్‌ప్రీత్ జునేజా, కేఎల్ రాహుల్, అమిత్ పౌనికర్ హాజరయ్యారు. వీరితో పాటు ఆంధ్రప్రదేశ్ క్రికెటర్లు వేణుగోపాలరావు, ఆశిష్ రెడ్డి, సీవీ మిలింద్, రికీ భుయ్ కూడా పాల్గొన్నారు. జట్టు కెప్టెన్ శిఖర్ ధావన్‌తో పాటు అమిత్ మిశ్రా, భువనేశ్వర్ కుమార్ గురువారం లేదా చివరి రోజు జట్టుతో చేరే అవకాశం ఉంది. సన్‌రైజర్స్‌లో సభ్యులుగా ఉన్న విదేశీ ఆటగాళ్లు ఫించ్, బ్రెండన్ టేలర్, స్టెయిన్, స్యామీ, వార్నర్, హోల్డర్, హెన్రిక్స్ ఈ స్వల్ప కాలిక క్యాంప్‌కు హాజరు కావడం లేదు. వారు నేరుగా దుబాయ్‌లోనే జట్టుతో కలుస్తారని రైజర్స్ మేనేజ్మెంట్ వెల్లడించింది. -
ఐపీఎల్‌ను నిలిపివేయండి!
శశాంక్ మనోహర్ తీవ్ర వ్యాఖ్య యూఏఈలో మ్యాచ్‌లపై అభ్యంతరం న్యూఢిల్లీ: ఫిక్సింగ్ వ్యవహారాలపై సీబీఐతో పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చే వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను రద్దు చేయాలని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ డిమాండ్ చేశారు. క్రికెట్‌పై ప్రజల్లో నమ్మకం పెంచే వరకు ఈ టోర్నీని జరపకపోవడమే మంచిదని ఆయన సూచించారు. ‘సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు చాలా తీవ్రమైనవి. స్పాట్, మ్యాచ్ ఫిక్సింగ్‌లతో ప్రజలకు ఆటపై విశ్వాసం పోయింది. ఈ నేపథ్యంలో 2014 ఐపీఎల్‌ను రద్దు చేయాలి. క్రికెట్‌కు ప్రాచుర్యం కల్పించడమే తమ ప్రధాన బాధ్యత తప్ప డబ్బు, లాభాలు కాదని బీసీసీఐ సభ్యులు ఈ చర్యతో నిరూపించవచ్చు’ అని మనోహర్ వ్యాఖ్యానించారు. ఫిక్సింగ్ వివాదం వెలుగులోకి రాగానే ఐపీఎల్ అన్ని మ్యాచ్‌లపై విచారణ జరపాలని తాను గతంలోనే కోరినట్లు ఆయన అన్నారు. యూఏఈలో మ్యాచ్‌లు నిర్వహిస్తే ఐపీఎల్‌కు ఇంకా చెడ్డ పేరు వస్తుందని శశాంక్ అభిప్రాయపడ్డారు. ‘మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్‌ల కారణంగా మధ్య ప్రాచ్యంలో మ్యాచ్‌లు నిర్వహించవద్దని బీసీసీఐ గతంలోనే నిర్ణయం తీసుకుంది. నాకు తెలిసి ఆ నిర్ణయంలో ఎలాంటి మార్పూ జరగలేదు. కానీ ఇప్పుడు ఐపీఎల్ జరుపుతున్నారు. ఇప్పటికే లీగ్‌కు ఉన్న చెడ్డ పేరు సరిపోదా’ అని బోర్డు మాజీ అధ్యక్షుడు ప్రశ్నించారు. -
ఐపీఎల్ కన్నా దేశవాళీ మిన్న: గంభీర్
న్యూఢిల్లీ: భారత జట్టులో పునరాగమనానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను వేదికగా చేసుకోబోనని కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ స్పష్టం చేశాడు. దేశవాళీ క్రికెట్లో రాణించడం ద్వారానే అంతర్జాతీయ క్రికెట్లోకి తిరిగి అడుగుపెడతానన్నాడు. ‘జట్టులో పునరాగమనానికి ఐపీఎల్‌ను వేదికగా ఎంచుకోను. నైట్‌రైడర్స్ జట్టు విజయం కోసమే ఐపీఎల్ ఆడతా. రీ ఎంట్రీకి దేశవాళీ క్రికెట్ ఒక్కటే మార్గం. ఇప్పుడు నా దృష్టంతా దేవ్‌ధర్ ట్రోఫీ, ఐపీఎల్‌పైనే ఉంది’ అని గంభీర్ చెప్పాడు. చెత్త ఫామ్‌తో ఏడాది కాలంగా జట్టుకు దూరమైన గౌతీ ఇంగ్లండ్ పర్యటన కల్లా జట్టులో స్థానం సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇక గంభీర్, 110 మీటర్ల హర్డిల్స్‌లో ప్రపంచ మాజీ చాంపియన్ కొలిన్ జాక్సన్, షట్లర్ అశ్విని పొన్నప్పతో కలిసి ఢిల్లీలో జరిగిన ‘వింగ్స్ ఫర్ లైఫ్ వరల్డ్ రన్’ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నాడు. వెన్నెముక పరిశోధనకు అవసరమైన నిధుల సేకరణ కోసం మే 4న భారత్ (సొనేపట్లో)తో పాటు ప్రపంచవ్యాప్తంగా 34 దేశాల్లోని 40 నగరాల్లో రన్‌ను నిర్వహించనున్నారు. ఈ రేస్‌కు గంభీర్, అశ్విని అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. -
యూఏఈలో 20 మ్యాచ్‌లు
ఆరంభ మ్యాచ్‌లో ముంబైతో కోల్‌కతా ఢీ ఐపీఎల్ తొలి విడత షెడ్యూల్ విడుదల చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఏడో సీజన్ కౌంట్‌డౌన్ మొదలైంది. చెన్నైలో సమావేశమైన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ యూఏఈ వేదికగా జరిగే తొలి విడత మ్యాచ్‌ల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఏప్రిల్ 16న డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య అబుదాబిలో జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్-7 మొదలవుతుంది. ఏప్రిల్ 30న ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య దుబాయ్‌లో జరిగే మ్యాచ్‌తో తొలి అంచె పూర్తవుతుంది. ఇక మే 1 నుంచి 12 వరకు జరిగే రెండో విడత మ్యాచ్‌లను భారత్‌లోనే నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ పూర్తయిన రాష్ట్రాల్లో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు అవసరమైన భద్రత కల్పించేందుకు స్థానిక ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నట్లు బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ చెప్పారు. ఒకవేళ రెండో విడత మ్యాచ్‌ల నిర్వహణ భారత్‌లో సాధ్యం కాకపోతే ప్రత్యామ్నాయ వేదికగా బంగ్లాదేశ్‌ను బీసీసీఐ ఇప్పటికే ఎంపిక చేసింది. చివరి విడత (మే 13 నుంచి జూన్ 1)లో జరిగే లీగ్ మ్యాచ్‌లు, ప్లే ఆఫ్‌లు, ఫైనల్ భారత్‌లోనే నిర్వహించనున్నారు. ఏప్రిల్ 15న అబుదాబిలో ఐపీఎల్-7 ఆరంభ వేడుక.దుబాయ్, అబుదాబి, షార్జా వేదికలుగా 20 మ్యాచ్‌లకు యూఏఈ ఆతిథ్యం.దుబాయ్, అబుదాబిల్లో ఏడేసి మ్యాచ్‌లు, షార్జాలో ఆరు మ్యాచ్‌ల నిర్వహణ.గతంలో మ్యాచ్ ఫిక్సింగ్ అనుభవాల దృష్ట్యా షార్జాలో మ్యాచ్‌ల నిర్వహణపై తొలుత బీసీసీఐ వెనకడుగు వేసినా, యూఏఈ ప్రభుత్వ హామీతో పచ్చజెండా ఊపింది. సాధారణ రోజుల్లో ఒక మ్యాచ్ , వారాంతపు(శుక్ర, శని, ఆదివారాల్లో) రోజుల్లో రెండేసి మ్యాచ్‌లను నిర్వహిస్తారు. వారాంతపు రోజుల్లో తొలి మ్యాచ్ మధ్యాహ్నం గం. 2.30 (భారత కాలమానం ప్రకారం సా. గం. 4.00)కు, రెండో మ్యాచ్ సాయంత్రం గం. 6.30 (భారత కాలమానం ప్రకారం రాత్రి. గం. 8.00)కు ప్రారంభమవుతాయి. సాధారణ రోజుల్లో మ్యాచ్ సా. గం. 6.30 (భారత కాలమానం ప్రకారం రాత్రి. గం. 8.00)కు మొదలవుతుంది. రెండు, మూడో విడతల్లో జరిగే 40 మ్యాచ్‌ల షెడ్యూల్ త్వరలో ప్రకటించనున్న గవర్నింగ్ కౌన్సిల్. -
ఐపీఎల్ తొలి పోరులో కోల్‌కతా, ముంబై ఢీ
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఏడో ఎడిషన్ మొదటి దశ షెడ్యూల్ విడుదలయింది. సార్వత్రిక ఎన్నికల కారణంగా మొదటి దశలో జరిగే మ్యాచ్‌లను దుబాయ్‌లో నిర్వహించనున్నారు. 20 మ్యాచ్‌లను దుబాయ్‌లోని మూడు మైదానాల్లో నిర్వహించనున్నట్టు ఐపీఎల్ పాలక మండలి తెలిపింది. ఏప్రిల్ 16న జరిగే ఆరంభ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో డిపెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు ఇక్కడ మ్యాచ్‌లు జరుగుతాయి. మే 1 నుంచి 12 వరకు రెండో విడత మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లు బంగ్లాదేశ్‌లో నిర్వహించనున్నారు. కేంద్ర హోం శాఖ అనుమతిస్తే ఈ మ్యాచ్‌లను భారత్‌లో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ఐపీఎల్ మ్యాచ్‌లను విదేశాల్లో నిర్వహించడం ఇది రెండోసారి. 2009లో సార్వత్రిక ఎన్నికల కారణంగా రెండో సీజన్‌ను పూర్తిగా దక్షిణాఫ్రికాలోనే నిర్వహించాల్సి వచ్చింది. -
నిరూపించుకోవాల్సిన అవసరం లేదు
మరో 2-3 ఏళ్లు ఆడతా ఢిల్లీ విస్మరించడం బాధించింది సెహ్వాగ్ వ్యాఖ్య న్యూఢిల్లీ: చెత్త ఆటతో భారత జట్టులో చోటు కోల్పోయి... ఏడాది కాలంగా దేశవాళీ క్రికెట్‌కే పరిమితమైన డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పునరాగమనంపై దృష్టి పెట్టాడు. ఏప్రిల్ 16న ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఏడో సీజన్లో సత్తా చాటి జాతీయ జట్టులో తిరిగి చోటు సంపాదించాలని పట్టుదలగా ఉన్నాడు. ‘ఇంకా రెండు, మూడేళ్లు ఆడే సత్తా నాలో ఉంది. రిటైర్మెంట్ ఆలోచన లేదు. ఇప్పుడు నా దృష్టంతా ఐపీఎల్-7పైనే. ఈ టోర్నీలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ చాంపియన్ అయ్యేందుకు నా వంతు సహకారం అందిస్తా’ అని సెహ్వాగ్ చెప్పాడు. పలు అంశాలపై సెహ్వాగ్ అభిప్రాయాలు అతని మాటల్లోనే.... నేను ఆరేళ్లు ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున ఆడా. జట్టులో ఐకాన్ ఆటగాడిని. ఈసారి వారు నన్ను తీసుకోకపోవడం అసంతృప్తికి గురిచేసింది. ప్రస్తుతం ఫిట్నెస్, బ్యాటింగ్‌పై దృష్టి పెట్టా. ఆటతీరు మెరుగుపర్చుకునేందుకు, బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు గంటలకొద్దీ సాధన చేస్తున్నా. 2015 ప్రపంచకప్‌లో నేను ఆడొచ్చు.. ఆడకపోవచ్చు. జాతీయ జట్టులో చోటు సాధిస్తానన్న నమ్మకం ఉంది. రెండు ‘ట్రిపుల్’ సెంచరీలు, ఆరు ‘డబుల్’ సెంచరీలు చేసిన నాకు భారీ స్కోర్లు ఎలా చేయాలో తెలుసు. ఒక్క ఇన్నింగ్స్‌తో అంతా మారిపోతుంది. నేను ఎవరికోసమో ఆడాల్సిన అవసరం లేదు. నా సత్తాను నిరూపించుకోవాల్సిన పనిలేదు. భారత్ ఆడే మ్యాచ్‌ల్ని నేనూ ఒక ప్రేక్షకుడిలా చూస్తున్నాను. -
సర్వశక్తులతో సత్తా చాటుతాం
ఐపీఎల్ అనుభవం చాలు టి20 ప్రపంచ అవకాశాలపై కెప్టెన్ ధోని వ్యాఖ్య బంగ్లాదేశ్ చేరిన భారత జట్టు ఢాకా: ఇటీవలి కాలంలో అంతర్జాతీయ టి20లు ఆడకపోయినా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) గతానుభవం ప్రపంచకప్‌లో ఉపయోగపడుతుందని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని అన్నాడు. ఈ నెల 16 నుంచి జరిగే టి20 ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు ధోని సారథ్యంలోని భారత జట్టు బంగ్లాదేశ్‌లో అడుగుపెట్టింది. టోర్నీకి ముందు తొలిసారిగా మీడియాతో మాట్లాడిన ధోని ‘జట్టులో ఉన్న ఆటగాళ్లు ఐపీఎల్లో చాలా మ్యాచ్‌లు ఆడారు. అవి అంతర్జాతీయ టి20లు కాకపోయినా, ఆ అనుభవం భారత్‌కు ఉపయోగపడుతుంది’ అని అన్నాడు. గత టి20 ప్రపంచకప్ నుంచి భారత్ కేవలం ఐదు అంతర్జాతీయ టి20లు మాత్రమే ఆడింది. 2013లో భారత్ కేవలం ఒకే ఒక అంతర్జాతీయ టి20లో బరిలోకి దిగింది. అయితే అంతర్జాతీయ టి20లు అంతగా ఆడకపోయినా ఇక్కడి వాతావరణ పరిస్థితులు, పిచ్‌లు భారత్‌లోలాగే ఉండటం తమ జట్టుకు ప్రయోజనకరమని ధోని చెప్పాడు. వివిధ అంశాలపై ధోని అభిప్రాయాలు అతని మాటల్లోనే... టోర్నీకి ముందు శ్రీలంక (మార్చి 17న), ఇంగ్లండ్ (మార్చి 19న)తో సన్నాహక టి20లు ఆడతాం. ఈ మ్యాచ్‌ల్లో అందరినీ పరీక్షిస్తాం. పలు ప్రయోగాలు కూడా చేస్తాం. జట్టుకు ఏది ఉపయోగమో ఈ మ్యాచ్‌ల ద్వారా తెలుస్తుంది. టి20 ప్రపంచకప్ ప్రతీ మ్యాచ్ కీలకమే. టోర్నీలో సత్తా చాటాలంటే ప్రతీ ఒక్కరు చివరివరకు కష్టపడాల్సిందే. గత ప్రపంచకప్‌లో ఒక్క మ్యాచ్‌లోనే ఓడినా టోర్నీని నిష్ర్కమించాల్సి వచ్చింది. ఈసారి చాలా కష్టమైన గ్రూప్ (పాకిస్థాన్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్)లో ఉన్నాం. ఒక్క మ్యాచ్‌లో ఓడినా తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే టోర్నీలో సర్వశక్తులు ఒడ్డి సత్తా చాటుతాం. చాలా జట్లు ఎక్కువగా టి20 మ్యాచ్‌లు ఆడవు. బిజీ షెడ్యూల్ కారణంగా మేము ఒక సిరీస్‌లో ఒకటి లేదా రెండు మ్యాచ్‌లే ఆడతాం. అదే సమయంలో మేము ఎక్కువగా ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడతాం. అంతర్జాతీయ ఆటగాళ్లు కూడా ఐపీఎల్లో పాల్గొంటారు. ఈ అనుభవం మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇటీవలి కాలంలో కష్టకాలాన్ని ఎదుర్కొన్నాం. సిరీస్‌లు గెలిచే సత్తా ఉన్నా దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ పర్యటనలో చెత్త క్రికెట్ ఆడాం. ఒత్తిడి ఎప్పుడూ ఉంటుంది. దాన్ని అధిగమిస్తాంగాయం కారణంగా నాకు విశ్రాంతి దొరికింది. ఇది టి20 ప్రపంచకప్‌లో రాణించేందుకు ఉపయోగపడుతుందని అశిస్తున్నాను. -
మూడు దేశాల్లో IPL - 7
-
మూడు దేశాల్లో ఐపీఎల్ పోటీలు!
న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌పై ప్రభావం చూపాయి. భద్రత కారణాల రీత్యా ఎన్నికల సమయంలో భారత్‌లో ఐపీఎల్ నిర్వహణకు అనుమతి లభించలేదు. దీంతో పోటీలు మూడు దేశాల్లో నిర్వహించే అవకాశముంది. ఐపీఎల్ ఏడో అంచె పోటీలు ఏప్రిల్ 16 నుంచి జూన్ 1 వరకు జరగనున్నాయి. ఐపీఎల్-7 తొలి సగభాగం యూఏఈలో నిర్వహిస్తారు. ఏప్రిల్ 1 నుంచి 30 వరకు పోటీలు అక్కడే ఉంటాయి. రెండో సగభాగం పోటీలు మే 1 నుంచి 12 వరకు బంగ్లాదేశ్ లేదా భారత్‌లో ఉంటాయి. మే 13 నుంచి చివరి దశ పోరు భారత్‌లో జరగనుంది. ఇదిలావుండగా, ఎన్నికలు ముగిసిన రాష్ట్రాల్లో మే 1 తర్వాత ఐపీఎల్ పోటీల నిర్వహణకు అనుమతి ఇవ్వాల్సిందిగా బీసీసీఐ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. 2009లో కూడా ఐపీఎల్‌కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఆ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరిగిన దృష్ట్యా భద్రతకారణాల రీత్యా పోటీలకు అనుమతివ్వలేదు. దీంతో దక్షిణాఫ్రికాలో పోటీలు నిర్వహించారు. -
షారుఖ్ X గంగూలీ
ఫుట్‌బాల్ జట్టు కోసం పోటీ కోల్‌కతా: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఫుట్‌బాల్ ఫ్రాంచైజీ కోసం పోటీపడుతున్నారు. కొత్తగా రాబోతున్న ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో కోల్‌కతా ఫ్రాంచైజీని దక్కించుకునేందుకు ఇద్దరూ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఈస్ట్ బెంగాల్, మోహన్ బగాన్ క్లబ్స్‌తో వీరు మాట్లాడినట్టు సమాచారం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సందర్భంగా వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు కెప్టెన్‌గా దాదా విఫలం కావడంతో ఆ స్థానం నుంచి తొలగించడమే కాకుండా వేలంలోనూ షారుఖ్ అతడిని కొనుగోలు చేయలేదు. ఆ తర్వాత గంగూలీ సహారా ఫుణే వారియర్స్ తరఫున ఆడాడు. ఇదే ఫ్రాంచైజీ కోసం ఐ-లీగ్ క్లబ్ మొహమ్మదన్ స్పోర్టింగ్ కూడా పోటీ పడుతోంది. వచ్చే వారం తమ పాలక మండలిలో ఈ విషయం చర్చిస్తామని క్లబ్ అధ్యక్షుడు సుల్తాన్ అహ్మద్ తెలిపారు. ఏప్రిల్ తొలి వారంలో బిడ్డింగ్ విజేతలను ప్రకటిస్తారు. -
ప్రతిసారీ కొత్త చాంపియన్
గత మూడు వరల్డ్‌కప్‌లలో వేర్వేరు విజేతలు రెండుసార్లు ఫైనల్స్‌లో ఓడిన శ్రీలంక భారత్‌కు అన్నింటా నిరాశే మొదటి ప్రపంచ కప్ విజయవంతం కావడంతో ఆ తర్వాతి వరల్డ్ కప్ టోర్నీలపై సహజంగానే ఆసక్తి పెరిగింది. భారత్ డిఫెండింగ్ చాంపియన్ కావడం, అంతకు ముందు ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రపంచ క్రికెట్‌ను ఊపేయడంతో టి20 క్రేజ్ అమాంతం ఆకాశాన్నంటింది. ఇదే క్రమంలో అనేక మంది యువ క్రికెటర్లు, స్టార్లు పుట్టుకొచ్చారు. లీగ్ స్థాయి టోర్నీలో ఎంత చెలరేగినా... జాతీయ జట్టు తరఫున సత్తా చాటి హీరోలుగా మారేందుకు ఆటగాళ్లకు వరల్డ్ కప్‌లు సరైన వేదికగా నిలిచాయి. 2009, 2010, 2012లలో జరిగిన వరల్డ్ కప్‌లలో మూడు వేర్వేరు జట్లు విజేతలుగా నిలవడం విశేషం. తొలి సారి చివరి మెట్టుపై చతికిలపడిన పాకిస్థాన్ తర్వాతి టోర్నీని సాధించడం, క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లండ్ తొలి ఐసీసీ టైటిల్ నెగ్గడం, 29 ఏళ్ల తర్వాత విండీస్‌కు వరల్డ్ కప్ యోగం పట్టడం ఈ మూడు టోర్నీల విశేషాలు. అయితే ధోని సారథ్యంలో తొలి సారి విజేతగా నిలిచిన టీమిండియా అదే కెప్టెన్ నేతృత్వంలో ఆ తర్వాత అంచనాలు నిలబెట్టుకోలేకపోయింది. ఐపీఎల్లో మన ఆటగాళ్లు ఎన్ని రికార్డులు బద్దలు కొట్టినా ఆ అనుభవం వరల్డ్ కప్ మ్యాచ్‌లకు పనికి రాలేదు. ఫలితంగా గత మూడు టోర్నీల్లోనూ భారత్ కనీసం సెమీఫైనల్‌కు కూడా చేరకుండా దాదాపు ఒకే తరహా ఫలితాన్ని పునరావృతం చేసింది. 2009 ప్రపంచ కప్ వేదిక: ఇంగ్లండ్ విజేత: పాకిస్థాన్ పాల్గొన్న జట్లు: 12 సెమీస్‌కు చేరిన జట్లు: పాకిస్థాన్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ ఫైనల్: లార్డ్స్ మైదానంలో ముందుగా శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్లకు 138 పరుగులు చేసింది. అనంతరం పాక్ 18.4 ఓవర్లలో 2 వికెట్లకు 139 పరుగులు చేసి ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ: తిలకరత్నే దిల్షాన్ భారత్ ప్రదర్శన: లీగ్ దశలో ఐర్లండ్, బంగ్లాదేశ్‌లను ఓడించి భారత్ సూపర్ ఎయిట్‌కు అర్హత సాధించింది. ఆ తర్వాత ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ చేతుల్లో ఓడి ఒక్క విజయం లేకుండానే నిష్ర్కమించింది. టోర్నీకి ముందే సెహ్వాగ్ గాయంతో స్వదేశం తిరిగి రావడం జట్టుపై ప్రభావం చూపించింది. విశేషాలు: ఇంగ్లండ్ పిచ్‌లపై బ్యాట్స్‌మెన్‌కు బాదుడు సాధ్యం కాలేదు. చక్కటి ప్రదర్శనతో బౌలర్లు కట్టడి చేయగలిగారు. ఫలితంగా సిక్స్‌ల సంఖ్య తగ్గింది. గత టోర్నీలో 265 సిక్స్‌లు బాదితే, ఈ సారి అది 166కే పరిమితమైంది. లీగ్ దశలో ఇంగ్లండ్‌పై నెదర్లాండ్స్ సంచలన విజయం సాధించింది. వెస్టిండీస్‌తో సెమీఫైనల్ మ్యాచ్ తొలి ఓవర్లోనే శ్రీలంక బౌలర్ మాథ్యూస్ 3 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. కివీస్‌పై పాక్ బౌలర్ ఉమర్‌గుల్ 6 పరుగులకే 5 వికెట్లు తీశాడు. దిల్షాన్ ఈ టోర్నీలో పదే పదే ప్రయోగించి కొత్త తరహా షాట్ దిల్స్కూప్ను ప్రాచుర్యంలోకి తెచ్చాడు. తొలి సారి మహిళల టి20 ప్రపంచకప్ ప్రారంభమైంది. మహిళా ప్రపంచ కప్ విజేత: ఇంగ్లండ్ 2010 ప్రపంచ కప్ వేదిక: వెస్టిండీస్ విజేత: ఇంగ్లండ్ పాల్గొన్న జట్లు: 12 సెమీస్‌కు చేరిన జట్లు: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, శ్రీలంక ఫైనల్: బ్రిడ్జ్‌టౌన్‌లో జరిగిన తుది పోరులో ముందుగా ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 6 వికెట్లకు 147 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లండ్ 17 ఓవర్లలో 3 వికెట్లకు 148 పరుగులు చేసి తొలి సారి ఐసీసీ టైటిల్ అందుకుంది. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ: కెవిన్ పీటర్సన్ భారత్ ప్రదర్శన: గత వరల్డ్ కప్‌కు జిరాక్స్ కాపీలాగే ఈ టోర్నీలోనూ భారత్ ప్రదర్శన సాగింది. లీగ్ దశలో దక్షిణాఫ్రికా, అఫ్ఘానిస్థాన్‌లపై గెలిచి సూపర్ ఎయిట్‌కు చేరింది. అక్కడ ఆస్ట్రేలియా, శ్రీలంక, వెస్టిండీస్‌ల చేతిలో ఓడి వెనుదిరిగింది. విశేషాలు: సంవత్సరానికి కనీసం ఒక ఐసీసీ టోర్నీ నిర్వహించాలన్న ప్రసారకర్తల ఒప్పందం మేరకు ఒక్క ఏడాదికే (9 నెలలకే జరిగింది) టి20 ప్రపంచకప్ నిర్వహించాల్సి వచ్చింది. భారత్‌లో టీవీ ప్రసారాల అనుకూలత కోసం వెస్టిండీస్‌లో ఉదయం 9.30కే మ్యాచ్‌లు నిర్వహించడం అక్కడి అభిమానులను ఆగ్రహానికి గురి చేసింది.భారత క్రికెటర్లు పబ్‌లో అభిమానులతో గొడవపడ్డారు. సురేశ్ రైనా భారత్ తరఫున టి20ల్లో తొలి సెంచరీ చేసిన క్రికెటర్‌గా అవతరించాడు. తీవ్రవాద నీడలోంచి బయటపడి అఫ్ఘానిస్థాన్ ఈ టోర్నీతోనే తొలి సారి ఒక టెస్టు జట్టుతో (భారత్) తలపడే అవకాశం దక్కించుకుంది. పాక్‌తో సెమీ ఫైనల్లో మైక్ హస్సీ టి20 చరిత్రలోనే అద్భుత ఇన్నింగ్స్ (24 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 60 నాటౌట్) ఆడటం ఈ టోర్నీకే హైలైట్‌గా నిలిచింది. మహిళా ప్రపంచ కప్ విజేత: ఆస్ట్రేలియా 2012 ప్రపంచ కప్ వేదిక: శ్రీలంక విజేత: వెస్టిండీస్ పాల్గొన్న జట్లు: 12 సెమీస్‌కు చేరిన జట్లు: వెస్టిండీస్, శ్రీలంక, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ ఫైనల్: కొలంబోలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ముందుగా వెస్టిండీస్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 137 పరుగులు చేసింది. అనంతరం శ్రీలంక 18.4 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలడంతో సొంతగడ్డపై వారికి నిరాశే ఎదురైంది. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ: షేన్ వాట్సన్ భారత్ ప్రదర్శన: గత రెండు టోర్నీలతో పోలిస్తే ఈ సారి ధోని సేన కొంత మెరుగైన ప్రదర్శన ఇచ్చినా సెమీస్‌కు మాత్రం చేరలేకపోయింది. గ్రూప్ దశలో ఇంగ్లండ్, అఫ్ఘానిస్థాన్‌లపై జట్టు నెగ్గింది. సూపర్ ఎయిట్‌లో కూడా పాకిస్థాన్, దక్షిణాఫ్రికాలను ఓడించినా ఆసీస్ చేతిలో చిత్తుగా ఓడటంతో రన్‌రేట్‌లో వెనుకబడి తప్పుకుంది. విశేషాలు తొలిసారి ఈ టోర్నీలో సూపర్ ఓవర్ పద్ధతిని ప్రవేశపెట్టారు. న్యూజిలాండ్ సూపర్ ఓవర్‌తోనే రెండు మ్యాచ్‌లు ఓడిపోవడం విశేషం. బంగ్లాదేశ్‌పై బ్రెండన్ మెకల్లమ్ సూపర్ సెంచరీ (58 బంతుల్లో 123) హైలైట్‌గా నిలిచింది. అజంతా మెండిస్ జింబాబ్వేపై 8 పరుగులకు 6 వికెట్లు తీసి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. షేన్ వాట్సన్ వరుసగా నాలుగు సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. మహిళా ప్రపంచ కప్ విజేత: ఆస్ట్రేలియా -
బయటికెళితే మాకు నష్టం
ఐపీఎల్ తరలింపుపై ఫ్రాంచైజీలు ముంబై : భద్రతా కారణాల రీత్యా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఏడో సీజన్‌ను భారత్ నుంచి తరలిస్తే తమకు నష్టమేనని ఆయా ఫ్రాంచైజీలు అభిప్రాయపడుతున్నాయి. దేశంలో సాధారణ ఎన్నికల సమయంలోనే ఐపీఎల్ జరుగబోతున్న దృష్ట్యా తగినంత భద్రత ఇవ్వలేమని హోం శాఖ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రారంభ మ్యాచ్‌లను దక్షిణాఫ్రికాలో జరిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ‘లీగ్ భారత్‌లో కాకుండా ఎక్కడ నిర్వహించినా మాకు నష్టమే. ఇది ఎంత అనేది ఆయా జట్లను బట్టి రకరకాలుగా ఉంటుంది. దాదాపుగా 40 నుంచి 50 శాతం ఆదాయాన్ని మేం కోల్పోవాల్సి ఉంటుంది’ అని ఓ ఫ్రాంచైజీ అధికారి పేర్కొన్నారు. మరోవైపు టోర్నీని తమ దగ్గర నిర్వహించేందుకు కొన్ని రాష్ట్రాలు సుముఖంగానే ఉన్నాయి. ఈ విషయంలో పశ్చిమ బెంగాల్ ఎక్కువ ఆసక్తిగా ఉంది. ‘భద్రత అనేది ఆయా రాష్ట్రాలకు సంబంధించిన విషయం. అదీకాకుండా మా ప్రజలు కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుతో మమేకమయ్యారు. ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ మ్యాచ్‌లు జరిగితే చూడాలని కోరుకుంటున్నారు. అదీగాకుండా వినోదం పన్ను కింద రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదాయం కోల్పోవాల్సి ఉంటుంది’ అని తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ప్రతినిధి ఒకరు తెలిపారు. కాంగ్రేసేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో లీగ్‌ను నిర్వహించాలనే ఆలోచన కూడా బీసీసీఐకి ఉంది. -
ఐపీఎల్‌కు భద్రత ఇవ్వలేం
స్పష్టం చేసిన కేంద్రం ప్రారంభ మ్యాచ్‌లు దక్షిణాఫ్రికాలో! న్యూఢిల్లీ: లోక్‌సభ సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఏడో సీజన్‌కు భద్రత కల్పించలేమని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాలతో గురువారం జరిగిన సమావేశంలో హోం మంత్రి షిండే ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ‘ఏప్రిల్-మేలో ఎన్నికల కారణంగా ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం తగినంత భద్రతా సిబ్బందిని కేటాయించలేము. ఎన్నికలు ముగిశాకే అది వీలవుతుంది’ అని హోం మంత్రి షిండే తెలిపారు. మేనెల మధ్యలో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. ప్రత్యామ్నాయ వేదికను చూసుకోవాలని ఇప్పటికే బీసీసీఐకి హోం శాఖ సమాచారం ఇచ్చింది. దీంతో అప్పటిదాకా మ్యాచ్‌లను దక్షిణాఫ్రికాలో నిర్వహించే అవకాశాలున్నాయి. 2009లోనూ ఎన్నికల కారణంతో లీగ్‌ను ఆ దేశంలోనే జరిపారు. అయితే ఈనెల 28న భువనేశ్వర్‌లో జరిగే ఐపీఎల్ పాలక మండలి సమావేశంలో వేదికపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ‘వేదికపై ఇతర బోర్డులతో చర్చిస్తున్నాం’ లీగ్ భద్రతపై కేంద్రం చేతులెత్తేయడంతో ప్రత్యామ్నాయ వేదికలపై బీసీసీఐ కసరత్తు ప్రారంభించింది. దీంట్లో భాగంగా ఇతర దేశాల బోర్డులతో సంప్రదింపులు జరుపుతోంది. ‘కేంద్రం వ్యక్తం చేసిన అభిప్రాయంతో ఐపీఎల్ నిర్వహణ కోసం వివిధ దేశాల బోర్డులతో మాట్లాడడం జరుగుతోంది. దక్షిణాఫ్రికా ఫేవరెట్‌గా ఉన్నా ఇతర ప్రత్యామ్నాయం గురించి కూడా ఆలోచిస్తున్నాం’ అని లీగ్ చైర్మన్ రంజిబ్ బిస్వాల్ అన్నారు. -
'ఐపీఎల్-7 కు భద్రత ఇవ్వలేం'
న్యూఢిల్లీ : ఇండియన్ ప్రీమియర్ లీగ్-7 క్రికెట్ మ్యాచ్‌లకు భద్రత కల్పించలేమని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. ఏప్రిల్-మే నెలల్లో దేశంలో సాధారణ ఎన్నికలు జరుగనున్నందున్న ఐపీఎల్ మ్యాచ్‌లకు భద్రత కల్పించటం కష్టమని ఆయన శుక్రవారమిక్కడ తెలిపారు. ఐపీఎల్-7ను మరోదేశంలో నిర్వహించుకుంటే మంచిదని షిండే అభిప్రాయపడ్డారు. దాంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్-7 ట్వెంటీ20 క్రికెట్ టోర్నిని ఈసారి భారత్ లో నిర్వహించడానికి అనుకూలంగా లేనందున దక్షిణాఫ్రికాలో నిర్వహించాలని ఐపీఎల్ యోచిస్తోంది. దక్షిణాఫ్రికాతో పాటు శ్రీలంకను కూడా పరిశీలిస్తోంది. కాగా సాధారణ ఎన్నికలు, భద్రతా కారణాల దృష్ట్యా 2009 సంవత్సరంలో దక్షిణాఫ్రికాలో ఐపీఎల్ టోర్నిని నిర్వహించిన సంగతి తెలిసిందే. -
అసలు లాభం బోర్డుకే!
రెండు రోజుల్లో ఎనిమిది ఐపీఎల్ ఫ్రాంచైజీలు కలిసి ఆటగాళ్లపై ఏకంగా రూ.468 కోట్లు కుమ్మరించాయి. ఇవి కాక బోర్డుకు చెల్లించాల్సిన ఫీజు, మ్యాచ్‌ల నిర్వహణ, ప్రయాణ ఖర్చులూ అన్నీ అదనమే. మరి ఇంత ఖర్చు పెడుతున్న ఫ్రాంచైజీలకు తిరిగి ఏమొస్తుంది? ఇది లాభసాటి వ్యాపారమేనా? సాక్షి క్రీడావిభాగం ముక్కూ మొహం తెలియని క్రీడాకారులకు కూడా కోట్ల రూపాయలు వ స్తున్నాయి. అంతర్జాతీయ క్రికెటర్లకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చేసిన మేలు ఇది. మరి ఈ డబ్బులు ఇస్తున్న ఫ్రాంచైజీల సంగతేంటి? రెండు రోజుల పాటు బెంగళూరులో జరిగిన వేలం చూసిన తర్వాత సగటు క్రికెట్ అభిమాని మదిని తొలిచిన ప్రశ్న ఇది. దీనికి సమాధానాలను అంశాల వారీగా చూద్దాం. ఈ కథనంలో రాస్తున్న అంకెలన్నీ మార్కెట్ వర్గాల అంచనాలు, వివిధ జట్ల ప్రతినిధులు ఏదో ఒక సందర్భంలో చెప్పిన లెక్కలు. అసలు కచ్చితమైన ఆదాయం, వ్యయం గురించి ఏ జట్టూ ఇప్పటివరకు అధికారికంగా ఏమీ చెప్పలేదు. బీసీసీఐకు ఆదాయం వస్తుందిలా.... ఐపీఎల్ ద్వారా ఏ ఆదాయమైనా మొదటగా వచ్చేది బీసీసీఐ చేతికి. 2008లో లీగ్ ప్రారంభమైన ఏడాదే బోర్డు టెలివిజన్ హక్కులను వరల్డ్ స్పోర్ట్స్ గ్రూప్‌నకు తొలుత రూ.5000 కోట్లకు కేటాయించింది. కానీ తర్వాత రకరకాల వివాదాలు, హక్కుల విషయంలో వచ్చిన విభేదాలతో ఈ ఒప్పందం కాస్తా అదే కంపెనీతో పదేళ్ల కాలానికి రూ.8700 కోట్ల రూపాయలకు పెరిగింది.టైటిల్ స్పాన్సర్షిప్ కోసం డీఎల్ఎఫ్ సంస్థ మొదటి ఐదు సంవత్సరాలు ఏడాదికి రూ. 50 కోట్లు చెల్లించింది.చివరి ఐదు సంవత్సరాల కోసం ఏడాదికి రూ. 80 కోట్లు చెల్లించేందుకు పెప్సీ ముందుకొచ్చింది. 2011-14 వరకు టైమ్స్ గ్రూప్ మొబైల్, ఇంటర్నెట్, రేడియో, బ్రాడ్‌బాండ్ హక్కులను తీసుకుంది. దీని కోసం సుమారు ఏడాదికి రూ.65 కోట్లు చెల్లిస్తోంది.టీమ్స్ ప్రతి ఏడాదీ ఫ్రాంచైజీ ఫీజు కింద డబ్బు చెల్లిస్తాయి. (ఇది ఒక్కో టీమ్‌కు ఒక్కోలా ఉంది. అప్పట్లో టీమ్‌ను ఎంతకు కొన్నారన్న అంశంపై ఆధారపడి ఉంది)ఓవరాల్‌గా బీసీసీఐ ఏడాదికి కేవలం ఐపీఎల్ ద్వారా సుమారు రూ.200 కోట్లు లాభాన్ని గడిస్తోంది. ఇది బోర్డు అధికారికంగా ప్రకటించిన మొత్తం. కాబట్టి ఫ్రాంచైజీలు, ఆటగాళ్లు ఎలా ఉన్నా బోర్డు ఆదాయానికి మాత్రం ఢోకా లేదు. ఫ్రాంచైజీల సంగతేంటి? ఖర్చులు ప్రతి జట్టూ తొలుత బీసీసీఐకి వార్షిక ఫీజు చెల్లించాలి. చెన్నై ఏడాదికి రూ.45 కోట్లు చెల్లిస్తే... సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.80 కోట్లు ఇస్తోంది. అదే విధంగా ముంబై రూ. 56 కోట్లు ఇస్తోంది. అందరికంటే తక్కువ చెల్లించే జట్టు రాజస్థాన్. ఈ జట్టు ఏడాదికి కేవలం రూ.33 కోట్లు మాత్రమే చెల్లిస్తోంది. ఆయా జట్లు తాము జట్టును కొనుక్కున్నప్పటి ఒప్పందాలను బట్టి ఈ మొత్తం ఉంటుంది. ఆటగాళ్లను కొనుగోలు చేయాలి. దీనికి ఒక్కో జట్టు ఈ ఏడాది దాదాపు రూ.60 కోట్లు ఖర్చు చేశాయి. మ్యాచ్‌లను నిర్వహించాలి. దీనికోసం స్టేడియాలకు అద్దె చెల్లించాలి. భద్రతకు డబ్బులు చెల్లించాలి. మ్యాచ్‌లు జరిగే స్టేడియాలు బీసీసీఐకి చెందినవే అయినా... ఏర్పాట్లకు బీసీసీఐకి సంబంధం ఉండదు. ఒక్కో మ్యాచ్ నిర్వహణకు ఒక్కో జట్టుకు సుమారు రూ. కోటి నుంచి రెండు కోట్ల రూపాయలు అయ్యే అవకాశం ఉంది. ఆటగాళ్లకు వసతి, ప్రయాణ ఖర్చులు, టీమ్ ప్రమోషన్. ప్రతి జట్టూ స్టార్ హోటల్స్‌లో తమ ఆటగాళ్లకు వసతి ఏర్పాటు చేయాలి. అలాగే వేరే నగరాల్లో మ్యాచ్‌లకు విమాన ఖర్చులు, విదేశీ ఆటగాళ్లకు టిక్కెట్లు వగైరా ఖర్చులు చూసుకోవాలి. వీటికి ఏడాది సుమారు రూ.10 నుంచి 15 కోట్లు కావచ్చని అంచనా. ఓవరాల్‌గా అన్ని జట్లనూ కలిపి ఒక్కో జట్టు సగటున జట్టు కోసం ఏడాదికి రూ.45 కోట్లు చెల్లిస్తుందని అనుకుంటే. ఆటగాళ్ల కొనుగోలు (రూ.60 కోట్లు), సగటున మ్యాచ్‌ల నిర్వహణ ఖర్చులు (రూ. 8 కోట్లు), వసతి, ప్రయాణాలు వగైరా (సగటున రూ.12 కోట్లు)... ఇవన్నీ కలిపి ఒక్కో జట్టు సగటున ఏడాదికి రూ. 125 కోట్లు ఖర్చు చేస్తున్నాయి. ఆదాయం బీసీసీఐ టీవీ రైట్స్ ఆదాయంలో 60 శాతం జట్లకు పంచుతుంది. తొలి రెండు సంవత్సరాలు 70 శాతం, ఆ తర్వాత ఎనిమిదేళ్లకు 60 శాతం ఆదాయాన్ని ఇచ్చేట్లు ఒప్పందం ఉంది. కాబట్టి దీని ద్వారా బీసీసీఐ... ఫ్రాం ఛైజీలకు ఏడాదికి రూ.510 కోట్లు ఇస్తుంది. అలాగే టైటిల్ స్పాన్సర్షిప్ రూ.60 కోట్లలో 60 శాతం అంటే రూ.36 కోట్లు ఫ్రాంఛైజీలకు వస్తుంది. ఈ రెండు ప్రధాన ఆదాయ మార్గాలు. వీటి ద్వారా ఒక్కో జట్టుకు సుమారు రూ.70 కోట్లు సమకూరుతుంది. మ్యాచ్‌ల నిర్వహణ (టిక్కెట్ల డబ్బు), మర్కండైజ్ (టీషర్ట్లు వగైరా) ద్వారా ఒక్కో జట్టుకు ఏడాదికి సగటున రూ.10 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా. ఇక ప్రతి జట్టూ వ్యక్తిగతంగా స్పాన్సర్‌ను తెచ్చుకోవచ్చు. దాదాపు అన్ని జట్లకూ తొలి ఏడాది నుంచీ స్పాన్సర్స్ ఉన్నారు. అయితే ఇది ఎంత మొత్తం అనేది పూర్తిగా వ్యక్తిగతం. కానీ సగటున ఒక్కో జట్టు ఏడాదికి స్పాన్సర్షిప్ ద్వారా కనీసం రూ.30 కోట్లు సంపాదిస్తుందని అంచనా. ఈ రకమైన అన్ని ఆదాయాలు కలిపితే సగటున ఫ్రాంఛైజీ ఏడాది రూ.110 కోట్లు సంపాదిస్తుంది. ఆదాయాన్ని, వ్యయాన్ని రెండింటినీ పరిశీలిస్తే... సుమారు రూ.10 నుంచి రూ.15 కోట్లు నష్టం వస్తుంది. ఒకవేళ జట్టు ఆ ఏడాది టైటిల్ గెలిస్తే బీసీసీఐ ఇచ్చే ప్రైజ్‌మనీ రూ.10 కోట్లు.... రన్నరప్‌గా నిలిస్తే రూ.7.5 కోట్లు, అలాగే చాంపియన్స్ లీగ్ ఆడటం ద్వారా డబ్బు... ఇవన్నీ కలిపి చాలా ఫ్రాంఛైజీలు తమ లోటును పూడ్చుకుని బ్రేక్ ఈవెన్‌కు చేరుతున్నాయి. అందరికీ లాభాల్లేవు మార్కెట్ వర్గాల నుంచి ఉన్న అంచనా ప్రకారం వేసిన లెక్కలతో సగటున జట్లకు పెద్దగా లాభంగానీ, నష్టంగానీ లేదు. అయితే ఈ పరిస్థితి అన్ని జట్లకూ లేదు. కానీ సగం జట్లు లాభాల్లో, సగం జట్లు నష్టాల్లో ఉన్నాయి. కోల్‌కతా నైట్‌రైడర్స్ తొలి సీజన్ నుంచి మార్కెటింగ్ బాగా చేసింది. షారూఖ్ ఇమేజ్ తోడవడంతో తొలి సీజన్లోనే లాభాలు సాధించింది. డబ్బు పొదుపు చేస్తే... సంపాదించినట్లే... రాజస్థాన్ ఈ ఫార్ములాతో ఉంది. ఆటగాళ్ల కోసం తక్కువ ఖర్చు చేయడం, తక్కువ రేటుకు ఫ్రాంఛైజీని దక్కించుకోవడం, తొలి సీజన్లో టైటిల్ గెలవడంతో మార్కెట్ పెరగడం ఇవన్నీ కలిపి రాయల్స్‌ను ఒడ్డున పడేశాయి. చెన్నై జట్టుకూ ఆది నుంచి స్పాన్సర్లు బాగానే ఉన్నారు. దీనికి తోడు ఈ జట్టు ప్రతి సీజన్లోనూ నిలకడగా ఆడుతోంది. లీగ్‌లో భారీగా ప్రైజ్‌మనీ సంపాదించడం చెన్నైను గట్టెక్కిస్తోంది. పంజాబ్ కూడా తొలుత బాగా ఖర్చుపెట్టినా, తర్వాత రాజస్థాన్ శైలిలో పొదుపు బాట పట్టింది. బెంగళూరు మాత్రం డబ్బును మంచినీళ్లలా ఖర్చు చేస్తోంది. ఆటగాళ్ల కోసం భారీగా ఖర్చు చేయడంతో పాటు... మూడు, నాలుగు జట్లకు కో స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నారు. కాబట్టి లాభాలు ఆశించడం కష్టం. ఇక ముంబై కూడా టైటిల్ నెగ్గడం కోసం ఆటగాళ్ల కోసం భారీగా ఖర్చు చేసింది. కాకపోతే ఈ జట్టుకు బ్రాండ్ ఇమేజ్ బాగా పెరిగింది. ఈ జట్టు కూడా లాభాల్లో ఉండకపోవచ్చు. అయితే బెంగళూరు, ముంబై రెండూ పారిశ్రామిక దిగ్గజాల జట్లు కావడం వల్ల డబ్బు కంటే ఇక్కడ ప్రచారం బాగా ఎక్కువగా దొరుకుతోంది. ఆ పరంగా వీళ్లూ నిరాశచెందలేదు. ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు కూడా మొదట్నించీ డబ్బు బాగా ఖర్చు చేసింది. ప్రదర్శన సరిగా లేకపోవడం వల్ల పెద్దగా బ్రాండ్ ఇమేజ్ పెరగలేదు. సన్‌రైజర్స్ జట్టు గత ఏడాదే లీగ్‌లో అడుగుపెట్టిం ది. ఏడాదికి వార్షిక ఫీజు కూడా మిగిలిన జట్లతో పోలిస్తే ఎక్కువ చెల్లిస్తోంది. కాబట్టి అప్పుడే లాభాలను ఆశించకపోవచ్చు. -
భారత్‌లో కుదరకపోతే దక్షిణాఫ్రికాలో..
ఐపీఎల్-7పై చైర్మన్ బిస్వాల్ బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఏడో సీజన్ ఎక్కడ జరుగుతుందనే విషయంలో అనిశ్చితి కొనసాగుతోంది. ఏప్రిల్ 9 నుంచి జూన్ 3 వరకు ఐపీఎల్ జరగాల్సి ఉన్నా ఇదే సమయంలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో మ్యాచ్‌లకు భద్రత విషయంలో ఇబ్బంది ఎదురవనుంది. మరోవైపు వేదికపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఐపీఎల్ అధికారులు వచ్చే వారం హోం మంత్రిత్వ శాఖతో సమావేశం కానున్నారు. ‘మేం చాలా ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తున్నాం. షిండేతో సమావేశమయ్యాక మాకు వీలయ్యే తేదీల గురించి తెలుసుకుంటాం. ఆ తర్వాతే పాలక మండలి ద్వారా కచ్చితమైన షెడ్యూల్ విడుదలవుతుంది. సాధ్యమైనంత మేరకు భారత్‌లోనే అన్ని మ్యాచ్‌లను జరపాలని చూస్తున్నాం. ఒకవేళ వీలు కాకుంటే దక్షిణాఫ్రికాలో జరుపుతాం’ అని లీగ్ చైర్మన్ రంజీబ్ బిస్వాల్ తెలిపారు. -
దక్షిణాఫ్రికాలో ఐపీఎల్-7 టోర్ని?
ఇండియన్ ప్రీమియర్ లీగ్-7 ట్వెంటీ20 క్రికెట్ టోర్నిని ఈసారి భారత్ లో నిర్వహించడానికి అనుకూలంగా లేనందున దక్షిణాఫ్రికాలో నిర్వహించాలని అనుకుంటున్నట్టు ఐపీఎల్ చైర్మన్ రంజిబ్ బిస్వాల్ తెలిపారు. ఏప్రిల్-మే నెలల్లో దేశంలో సాధారణ ఎన్నికలు జరుగనున్నందున్న ఐపీఎల్-7ను దక్షిణాఫ్రికాకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు బిస్వాల్ వెల్లడించారు. తుది నిర్ణయం, వేదికలను, ఐపీఎల్ షెడ్యూల్ ను పది రోజుల్లోపల వెల్లడిస్తామని ఆయన తెలిపారు. దక్షిణాఫ్రికాలో ఐపీఎల్ నిర్వహణ కోసం హోంశాఖ అధికారులను కలువనున్నామని బిస్వాల్ తెలిపారు. భారత్ లో కూడా ఐపీఎల్ నిర్వహించే అంశాలను, సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామన్నారు. ఏప్రిల్, మే నెలల్లో భారత్ లో ఐపీఎల్ నిర్వహణకు అనుకూలంగా లేకపోతే దక్షిణాఫ్రికాలో నిర్వహించడానికి తగిన చర్యలు తీసుకుంటాం అని అన్నారు. యూఏఈ, బంగ్లాదేశ్ లో ఐపీఎల్ నిర్వహించే ఆలోచనే రాలేదని ఓ ప్రశ్న తలెత్తలేదని ఆయన అన్నారు. సాధారణ ఎన్నికలు, భద్రతా కారణాల దృష్ట్యా 2009 సంవత్సరంలో దక్షిణాఫ్రికాలో ఐపీఎల్ టోర్నిని నిర్వహించిన సంగతి తెలిసిందే. -
సెహ్వాగ్ కనీస ధర రూ. 2 కోట్లు
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలంలో పాల్గొనే ఆటగాళ్ల కనీస ధర జాబితాను లీగ్ కౌన్సిల్ ఫ్రాంఛైజీలకు అందించింది. భారత జట్టులో స్థానం కోల్పోయిన వీరేంద్ర సెహ్వాగ్‌తో పాటు డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తమ కనీసధరను రూ. 2 కోట్లుగా పేర్కొన్నారు. మొత్తం 208 మంది అంతర్జాతీయ ఆటగాళ్లతో కూడిన జాబితాలో 48 మంది భారత జట్టుకు ఆడిన, ఆడుతున్న క్రికెటర్లు ఉన్నారు. మొత్తం 11 మంది భారత క్రికెటర్లు తమ కనీస ధరను రూ. 2 కోట్లుగా పేర్కొన్నారు. ఓజా, ఉతప్ప, నెహ్రా, మనోజ్ తివారీ, యూసుఫ్ పఠాన్, అమిత్ మిశ్రా, దినేశ్ కార్తీక్, ప్రవీణ్ కుమార్, మురళీ విజయ్ ఈ జాబితాలో ఉన్నారు. ఐపీఎల్ వేలం ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరులో జరుగుతుంది. ఇర్ఫాన్ పఠాన్, భువనేశ్వర్, జహీర్, పుజారా తమ కనీసధరను రూ.1.5 కోట్లుగా పేర్కొన్నారు. వరుణ్ ఆరోన్ వేలం జాబితాలో లేడు. ఉమేశ్ యాదవ్ తన కనీస రేటును పేర్కొనలేదు. బరోడా వికెట్ కీపర్ పినాల్ షా పేరును ఈ జాబితాలో చూపించారు. తర్వాత తప్పు సరిదిద్దుకున్నారు. -
అంతా లీగ్‌ల మయం
మెల్బోర్న్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) విజయవంతమైన తీరు దేశంలోని ఇతర క్రీడలనూ విశేషంగా ఆకర్షిస్తోంది. ఇప్పటికే ఈ బాటలో బ్యాడ్మింటన్, హాకీ లీగ్‌లు అభిమానులు ఆకట్టుకుంటుండగా తాజాగా టెన్నిస్, రెజ్లింగ్‌లోనూ రాబోతున్నాయి. అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్) పేరిట భారత్‌కు చెందిన డబుల్స్ స్టార్ మహేశ్ భూపతి, జర్మనీ దిగ్గజం బోరిస్ బెకర్ ఆధ్వర్యంలో ఓ టోర్నీ రాబోతుంది. గత మేలోనే ఐపీటీఎల్ను లాంఛనంగా ప్రకటించారు. లీగ్‌లో ఐదు జట్లు పాల్గొంటాయి. ముంబై, బ్యాంకాక్, సింగపూర్, కౌలాలంపూర్లతో పాటు మధ్య ప్రాచ్య దేశంలోని ఓ నగరం పేరును త్వరలో ప్రకటించనున్నారు. పురుషులు, మహిళా ఆటగాళ్లతో కలిసి ఉండే ఈ జట్లు అత్యంత నాణ్యమైన టెన్నిస్‌ను అభిమానులకు అందిస్తాయని నిర్వాహకులు చెబుతున్నారు. ఆసీస్ ఆటగాడు లీటన్ హెవిట్ ఇప్పటికే ఈ లీగ్‌కు తన అంగీకారాన్ని తెలిపాడు. 2014 ఫిఫా ప్రపంచకప్, ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్, ఫ్రెంచ్ ఓపెన్లాంటి ప్రముఖ క్రీడా ఈవెంట్లను ప్రసారం చేసే ఎంపీ అండ్ సిల్వ ఈ లీగ్ ప్రసార హక్కులు తీసుకుంది. -
ఐపీఎల్ వైపు మిట్టల్ చూపు!
ముంబై: అత్యంత విజయవంతమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ పారిశ్రామిక వేత్త లక్ష్మీ మిట్టల్ కూడా ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ లీగ్‌లో ముకేశ్ అంబానీతో పాటు విజయ్ మాల్యా లాంటి వ్యాపార దిగ్గజాలు ఉన్నారు. అయితే ఐపీఎల్లో ఆట పరంగా, ఆర్థికంగానూ అంత లాభసాటిగా లేని ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టులో వాటా తీసుకునేందుకు మిట్టల్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంలో ఆయన అల్లుడు అమిత్ శర్మ జీఎంఆర్ గ్రూప్‌తో చర్చలు జరిపినట్టు తెలిసింది. ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్‌లో క్వీన్స్ పార్క్ రేంజర్స్ జట్టులోనూ మిట్టల్‌కు వాటాలున్నాయి. అయితే ఆ జట్టు ప్రదర్శన కూడా పేలవంగా ఉంది. మరోవైపు ఆర్పీజీ గ్రూపు పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టులో భాగస్వామ్యం కోసం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అటు కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు కూడా తమ ఆర్థిక భారాన్ని పంచుకునేందుకు వాటాదార్ల కోసం చూస్తున్నట్టు వినికిడి. -
శ్రీశాంత్ కు పెళ్లి కుదిరింది!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారంతో నిషేధం ఎదుర్కొంటున్న కేరళ ఫాస్ట్ బౌలర్ పెళ్లి కుదిరింది. రాజస్థాన్ కు చెందిన ఓ రాయల్ కుటుంబానికి చెందిన నయన్ తో గురువాయూర్ లోని శ్రీ కృష్ణ ఆలయంలో డిసెంబర్ 12 తేదిన పెళ్లి జరుగుతుంది అని శ్రీశాంత్ తల్లి సావిత్రి దేవి తెలిపారు. గత కొద్ది సంవత్సరాలుగా వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతోందని.. ఐపీఎల్ ఆరవ ఎడిషన్ లో స్పాట్ ఫిక్సింగ్ పాల్పడి.. జైలుకెళ్లిన సమయంలో కూడా శ్రీశాంత్ కు నయన్ బాసటగా నిలిచినట్టు తెలిసింది. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో క్రికెట్ ఆడకుండా బీసీసీఐ సెప్టెంబర్ లో నిషేధం విధించింది. స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో ప్రస్తుతం శ్రీశాంత్ బెయిల్ పై ఉన్నారు. శ్రీశాంత్ పై మోకా (మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజడ్ క్రైమ్ యాక్ట్) కింద కేసు నమోదైంది. ఈ కేసు డిసెంబర్ 18 తేదిన విచారణకు రానుంది. -
లాంఛనం ముగిసింది
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పుణే వారియర్స్ కథ ముగిసింది. ఈ ఫ్రాంచైజీని రద్దు చేస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. శనివారం చెన్నైలో జరిగిన బోర్డు వర్కింగ్ కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. లీగ్‌లో కొనసాగాలంటే బ్యాంకు పూచీకత్తు సొమ్మును జమ చేయాల్సిందిగా బోర్డు పలుమార్లు గుర్తు చేసినా సహారా స్పందించకపోవడంతో వారి జట్టును తప్పించేందుకే నిర్ణయించారు. ఈ సమావేశానికి ఐపీఎల్ పాలక మండలి సభ్యులు కూడా హాజరయ్యారు. ఓవరాల్‌గా ఐపీఎల్ నుంచి బయటకు వెళ్లిన మూడో జట్టుగా పుణే పేరు తెచ్చుకుంది. గతంలో వివిధ కారణాల రీత్యా కొచ్చి టస్కర్స్, డెక్కన్ చార్జర్స్‌పై కూడా వేటు పడింది. దీంతో ఇక ఐపీఎల్లో ఎనిమిది జట్లే మిగిలాయి. రాబోయే సీజన్‌కు సిద్ధం కావాలంటే పుణే జట్టుపై ఏదో ఒక నిర్ణయానికి రావాల్సి ఉందని బోర్డు అభిప్రాయపడింది. ‘2014 సీజన్లో పుణే ఫ్రాంచైజీ బరిలో ఉండాలంటే రూ.170.2 కోట్ల బ్యాంకు పూచీకత్తు సొమ్మును గత మార్చిలోనే జమ చేయాల్సి ఉంది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఇప్పటికి ఐదు సార్లు ఈ విషయమై వారికి గుర్తు చేశాం. అయినా స్పందన లేదు. అందుకే బోర్డు వారి బ్యాంకు పూచీకత్తును సొమ్ము చేసుకుంది’ అని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ పేర్కొన్నారు. విభేదాలు మొదలయ్యాయిలా... ఫ్రాంచైజీ ఫీజు చెల్లించని కారణంగా ఐపీఎల్ ఆరో సీజన్ కోసం సహారా బ్యాంకు పూచీకత్తును బోర్డు సొమ్ము చేసుకోవడంతో ఇరువురి మధ్య విభేదాలు నెలకొన్నాయి. అప్పుడే ఐపీఎల్ నుంచి తాము తప్పుకుంటున్నట్టు సహారా ప్రకటించింది. అయితే బోర్డుకు మాత్రం అధికారికంగా చెప్పలేదు. మరోవైపు మ్యాచ్‌ల సంఖ్య తగ్గించడంతో తమకు ఆర్థికంగా నష్టం చేకూరుతుంది కాబట్టి ఫ్రాంచైజీ ఫీజు తగ్గించాలని సహారా వాదించింది. ఈ సమస్యను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని ఇరు వర్గాలు భావించినా ఫలితం లేకపోయింది. ఐపీఎల్ చరిత్రలోనే పుణే వారియర్స్ అత్యంత ఖరీదైన (రూ.1702 కోట్లు) జట్టుగా ఉండడంతో... ఈ నిర్ణయంతో అటు బీసీసీఐకి కూడా ఆర్థికంగా నష్టం కలుగనుంది. బోర్డు నమ్మకద్రోహం చేసింది న్యూఢిల్లీ: ఐపీఎల్ నుంచి తమ జట్టును తీసేయడంతో సహారా గ్రూప్ బీసీసీఐపై ధ్వజమెత్తింది. బోర్డు నమ్మక ద్రోహానికి పాల్పడడమే కాకుండా ఎప్పుడూ తమ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చలేదని ఆరోపించింది. -
పుణె వారియర్స్‌పై బీసీసీఐ వేటు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మరో వికెట్ పడింది. కోచి టస్కర్స్, డెక్కన్ చార్జర్స్ బాటలో పుణె వారియర్స్ కథ ముగిసింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పుణెతో ఒప్పందాన్ని రద్దు చేసింది. బ్యాంక్ పూచికత్తును సమర్పించని కారణంగా పుణెపై వేటు వేసింది. శనివారం సమావేశమైన బీసీసీఐ వర్కింగ్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. బోర్డు 30 రోజుల ఉద్వాసన నోటీసును పుణెకు జారీ చేసింది. కాగా బోర్డుతో విబేధాల కారణంగా ఐపీఎల్ నుంచి తప్పుకోనున్నట్టు పుణె యాజమాన్యం ఇదివరకే ప్రకటించింది. ఐపీఎల్లో ప్రస్తుతం ఎనిమిది జట్లే మిగిలాయి. 2010 సీజన్లో సహారా గ్రూపు భారీ మొత్తానికి జట్టును కొనుగోలు చేసింది. ఒప్పందం ప్రకారం 18 మ్యాచ్‌లకు బదులు 16 మ్యాచ్‌లే ఆడిస్తుండటంతో ఫీజు తగ్గించాలని డిమాండ్ చేసింది. ఫ్రాంచైజీ ఫీజు చెల్లించని కారణంగా పుణె ఇచ్చిన బ్యాంక్ గ్యారెంటీని బోర్డు సొమ్ము చేసుకుంది. అనంతరం ఐపీఎల్ నుంచి వైదొలగనున్నట్టు పుణె యాజమాన్యం ప్రకటించినా బోర్డుకు ఈ విషయాన్ని తెలియజేయలేదు. వచ్చే సీజన్లో పుణె ఆడాలంటే 170.2 కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారెంటీని సమకూర్చాలని బోర్డు తెలియజేసింది. పుణె యాజమాన్యం స్పందించకపోవడంతో వేటు వేయాలని బీసీసీఐ తాజాగా నిర్ణయించింది. -
ఐపీఎల్ నుంచి పుణే అవుట్!
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పుణే వారియర్స్ ఫ్రాంచైజీ ఉండేది.. లేనిది నేడు (శనివారం) జరిగే బీసీసీఐ వర్కింగ్ కమిటీలో తేలనుంది. ఫ్రాంచైజీ ఫీజు చెల్లించని కారణంగా గత మేలో బోర్డు... పుణే ఇచ్చిన బ్యాంకు గ్యారెంటీ మొత్తాన్ని సొమ్ము చేసుకుంది. దీంతో ఐపీఎల్ నుంచి తప్పుకోవాలని సహారా గ్రూప్ నిర్ణయించుకుంది. ఈ మేరకు బహిరంగ ప్రకటన చేసినప్పటికీ బీసీసీఐకి మాత్రం తమ ఉద్దేశాన్ని చెప్పలేదు. సాంకేతికంగా పుణే జట్టు ఇంకా ఐపీఎల్లో ఉన్నప్పటికీ వచ్చే సీజన్లో బరిలో ఉండేదుకు రూ.170.2 కోట్ల బ్యాంకు గ్యారెంటీని ఇప్పటిదాకా సమకూర్చలేదు. గత ఐదు నెలలుగా ఈ మొత్తంపై సహారా గ్రూప్‌నకు బీసీసీఐ గుర్తు చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఫ్రాంచైజీ భవితవ్యం తేల్చేందుకు ఐపీఎల్ పాలకమండలి సభ్యులంతా వర్కింగ్ కమిటీకి అందుబాటులో ఉండాలని బోర్డు ఆదేశించింది. ‘వారికి జట్టును నడపాలనే ఉద్దేశం ఎంతమాత్రం లేదు. బ్యాంకు గ్యారెంటీని సొమ్ము చేసుకున్నప్పటికీ వచ్చే సీజన్లో ఉండేందుకు మరోసారి గ్యారెంటీ సొమ్మును జమ చేసేందుకు వారికే మాత్రం ఆసక్తి లేదు’ అని ఐపీఎల్ అధికారి ఒకరు తెలిపారు. నేటి కమిటీలో చర్చించిన తర్వాత పుణే జట్టుకు 30 రోజుల ఉద్వాసన నోటీస్ ఇచ్చే అవకాశం ఉంది. -
ఐపీఎల్‌కు దూరంగా ఉండండి!
న్యూఢిల్లీ: బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా... ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కార్యకలాపాలకు మాత్రం దూరంగా ఉండాలని ఎన్. శ్రీనివాసన్‌ను న్యాయస్థానం ఆదేశించింది. స్పాట్ ఫిక్సింగ్ విచారణ మరింత పారదర్శకంగా ఉండేందుకు ఈ అంశంలో ఆయన జోక్యం చేసుకోరాదని స్పష్టం చేసింది. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో బీసీసీఐ తన విశ్వసనీయతను కోల్పోయిందని ఏకే పట్నాయక్, కేఎస్ కేహార్‌లతో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది. ‘శ్రీనివాసన్ బోర్డు అధ్యక్షుడిగా కొనసాగవచ్చు. అయితే ఐపీఎల్ వ్యవహారాల్లో పాల్గొనరాదు. ఫిక్సింగ్ విచారణను అధ్యక్షుడిగా ఆయన ఏ మేరకు ప్రభావితం చేస్తారో చూడాలి. ఒకటి మాత్రం స్పష్టం. ఐపీఎల్‌కు సంబంధించి అనేక అంశాలు బయటికి వస్తున్నాయి. మొత్తానికి బీసీసీఐ ద్వారా ఏదో పెద్ద తప్పే జరిగింది. బోర్డు ఈ తరహాలో ఎందుకు విశ్వసనీయత కోల్పోయిందో చెప్పగలరా’ అని కోర్టు వ్యాఖ్యానించింది. మరో వైపు స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారాన్ని విచారించేందుకు అరుణ్ జైట్లీ లేదా వినయ్ దత్తా నేతృత్వంలో ఒక కమిటీ వేస్తామంటూ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బీహార్ (సీఏబీ)కు శ్రీనివాసన్ సూచించడాన్ని కూడా న్యాయస్థానం ప్రశ్నించింది. ‘అంతగా తొందర పడవద్దు. మీ ప్రతిపాదనను మాత్రమే సీఏబీకి చెప్పండి. దానిని పరిశీలించే అవకాశం వారికి ఇవ్వండి’ అని సూచించింది. మరో వైపు సీఏబీ తరఫు న్యాయవాదిగా వ్యవహరిస్తున్న హరీష్ సాల్వే...ఐపీఎల్ కూడా బీసీసీఐలో భాగమేనని, కాబట్టి మొత్తం విచారణనంతటినీ బోర్డు పరిధి నుంచి తప్పించాలని కోరారు. తదుపరి విచారణను ఈ నెల 7కు వాయిదా వేశారు. -
ఆశలు సజీవం
చాంపియన్స్ లీగ్‌లో ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ విజయాల బోణీ చేసింది. చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో లయన్స్‌ను చిత్తు చేసింది. ముంబై ప్రస్తుతానికి రేసులో నిలిచినా...ఇతర జట్ల ఫలితాలపైనే జట్టు నాకౌట్ ఆశలు ఆధారపడి ఉన్నాయి. తాజా పరాజయంతో హైవెల్డ్ లయన్స్ చాంపియన్స్ లీగ్ టి20 నుంచి నిష్ర్కమించింది. జైపూర్: ఐపీఎల్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌కు సీఎల్‌టి20లో తొలి విజయం దక్కింది. శుక్రవారం సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన కీలక మ్యాచ్‌లో ముంబై 7 వికెట్ల తేడాతో హైవెల్డ్ లయన్స్‌పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన లయన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 140 పరుగులు చేసింది. పీటర్సన్ (27 బంతుల్లో 35 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), ప్రిటోరియస్ (21 బంతుల్లో 31 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) మాత్రమే రాణించారు. ముంబై 18.3 ఓవర్లలో 3 వికెట్లకు 141 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ డ్వేన్ స్మిత్ (47 బంతుల్లో 63 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) ముంబైని గెలిపిం చాడు. పొలార్డ్ (20 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) అతనికి సహకరించాడు. మెరుపులే లేవు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన లయన్స్ ఇన్నింగ్స్ ఆద్యంతం పడుతూ, లేస్తూ సాగింది. ముంబై బౌలర్లు రిషి ధావన్, హర్భజన్ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టి పడేశారు. ఫలితంగా లయన్స్ 13.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 81 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ దశలో కెప్టెన్ పీటర్సన్, ప్రిటోరియస్ కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. స్మిత్ జోరు ముంబై ఇండియన్స్ కూడా ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. తన్వీర్ వేసిన అద్భుతమైన బంతికి సచిన్ (5) క్లీన్ బౌల్డయ్యాడు. ఆ తర్వాత దినేశ్ కార్తీక్ (13), రోహిత్ శర్మ (17 బంతుల్లో 20; 2 ఫోర్లు) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయారు. అయితే మరో వైపు డ్వేన్ స్మిత్ మాత్రం తన జోరును కొనసాగించాడు. 33 బంతుల్లో స్మిత్ అర్ధ సెంచరీ చేశాడు. స్కోరు వివరాలు: హైవెల్డ్ లయన్స్ ఇన్నింగ్స్: డూసెన్ (సి) రిషి ధావన్ (బి) జాన్సన్ 13; డి కాక్ (ఎల్బీ) (బి) హర్భజన్ 19; మెకెంజీ (బి) రిషి ధావన్ 15; సైమ్స్ (బి) ఓజా 14; పీటర్సన్ (నాటౌట్) 35; తన్వీర్ (సి) స్మిత్ (బి) ఓజా 2; ప్రిటోరియస్ (నాటౌట్) 31; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 140. వికెట్ల పతనం: 1-29; 2-41; 3-62; 4-71; 5-81. బౌలింగ్: జాన్సన్ 4-0-33-1; కౌల్టర్ 4-0-25-0; రిషి ధావన్ 4-1-21-1; హర్భజన్ 4-0-19-1; ఓజా 3-0-26-2; పొలార్డ్ 1-0-12-0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: స్మిత్ (నాటౌట్) 63; సచిన్ (బి) తన్వీర్ 5; కార్తీక్ (సి) పీటర్సన్ (బి) తాహిర్ 13; రోహిత్ (సి) (సబ్) బావుమా (బి) ప్రిటోరియస్ 20; పొలార్డ్ (నాటౌట్) 31; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (18.3 ఓవర్లలో 3 వికెట్లకు) 141. వికెట్ల పతనం: 1-15; 2-47; 3-90; బౌలింగ్: తన్వీర్ 3.3-0-15-1; సోట్సోబ్ 3-0-25-0; విల్జోన్ 4-0-36-0; తాహిర్ 4-0-23-1; ఫాంగిసో 1-0-10-0; ప్రిటోరియస్ 3-0-26-1. చాంపియన్స్ లీగ్‌లో నేడు టైటాన్స్ x సన్‌రైజర్స్ సా. గం. 4.00 నుంచి బ్రిస్బేన్ x చెన్నై రా. గం. 8.00 నుంచి వేదిక: రాంచీ స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
ఎదురులేని రాయల్స్
జైపూర్: గత ఐపీఎల్లో సొంతగడ్డపై ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని రికార్డును... చాంపియన్స్ లీగ్‌లోనూ రాజస్థాన్ రాయల్స్ కొనసాగిస్తోంది. వరుసగా రెండో మ్యాచ్‌లో గెలిచి సెమీస్‌కు చేరువయింది. మాన్సింగ్ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ద్రవిడ్ సేన 30 పరుగుల తేడాతో హైవీల్డ్ లయన్స్‌పై గెలిచింది. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. కెప్టెన్ ద్రవిడ్ (30 బంతుల్లో 31; 5 ఫోర్లు), వాట్సన్ (24 బంతుల్లో 33; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. స్టువర్ట్ బిన్నీ (20 బంతుల్లో 38; 5 ఫోర్లు, 1 సిక్సర్), బ్రాడ్ హాడ్జ్ (23 బంతుల్లో 46 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగి ఆడి జట్టుకు భారీ స్కోరు అందించారు. లయన్స్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసి ఓడిపోయింది. కెప్టెన్ అల్విరో పీటర్సన్ (28 బంతుల్లో 40; 4 ఫోర్లు) మినహా బ్యాట్స్‌మెన్ అంతా విఫలమయ్యారు. రాజస్థాన్ స్పిన్నర్ ప్రవీణ్ తాంబె (4/15) నాలుగు వికెట్లతో రాణించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కించుకున్నాడు. స్కోరు వివరాలు రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్: ద్రవిడ్ (సి) పీటర్సన్ (బి) ప్రిటోరియస్ 31; రహానే (సి) విజియోన్ (బి) తన్వీర్ 6; శామ్సన్ (సి) సొలెకిలె (బి) సోట్సోబ్ 12; వాట్సన్ (సి) సెమైస్ (బి) సోట్సోబ్ 33; బిన్నీ (బి) ప్రిటోరియస్ 38; హాడ్జ్ నాటౌట్ 46; మేనరియా నాటౌట్ 6; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో ఐదు వికెట్లకు) 183. వికెట్ల పతనం: 1-21; 2-36; 3-67; 4-110; 5-145. బౌలింగ్: సోట్సోబ్ 4-0-26-2; తన్వీర్ 4-0-36-1; విజియోన్ 4-0-41-0; ప్రిటోరియస్ 4-0-27-2; ఫాంగిసో 4-0-52-0. హైవీల్డ్ లయన్స్ ఇన్నింగ్స్: వాన్‌డెర్ డుసెన్ (సి) ద్రవిడ్ (బి) మాలిక్ 14; డి కాక్ (సి) మేనరియా (బి) వాట్సన్ 18; బవుమా (సి) శామ్సన్ (బి) మాలిక్ 0; విజియోన్ (బి) తాంబె 24; పీటర్సన్ (బి) తాంబె 40; సెమైస్ (సి) బిన్నీ (బి) తాంబె 3; తన్వీర్ ఎల్బీడబ్ల్యు (బి) తాంబె 0; సొలెకిలె (బి) ఫౌల్కనర్ 21; ప్రిటోరియస్ (సి) హాడ్జ్ (బి) ఫాల్క్‌నర్ 19; ఫాంగిసో నాటౌట్ 4; సోట్సోబ్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 153. వికెట్ల పతనం: 1-25; 2-36; 3-36; 4-89; 5-101; 6-101; 7-120; 8-137; 9-152. బౌలింగ్: విక్రమ్‌జీత్ మాలిక్ 3-0-26-2; ఫౌల్కనర్ 4-0-22-2; వాట్సన్ 4-0-27-1; బిన్నీ 2-0-17-0; కూపర్ 4-0-39-0; ప్రవీణ్ తాంబె 3-0-15-4. చాంపియన్స్ లీగ్‌లో నేడు చెన్నై x సన్‌రైజర్స్ రా. గం. 8.00 నుంచి వేదిక: రాంచీ స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
'శ్రీశాంత్ పై నిషేధంలో బీసీసీఐ చీఫ్ శ్రీనివాసన్ దే కీలక పాత్ర'
కోచి: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలను ఎదుర్కొంటున్న భారత ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ పై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు విధించిన నిషేధంపై కోర్టులో సవాల్ చేయనున్నాడని అతని తరపు న్యాయవాదులు తెలిపారు. బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై కోర్టులో పిటిషన్ వేయనున్నట్టు శ్రీశాంత్ న్యాయవాది రెబెకా జాన్ ఢిల్లీలో స్థానిక మీడియా టెలివిజన్ కు తెలిపారు. అంతేకాక శ్రీశాంత్ పై జీవిత కాల నిషేధం విధించడంలో బీసీసీఐ చీఫ్ ఎన్ శ్రీనివాసన్ దే కీలక పాత్ర అని ఆరోపించారు. కోర్టు తీర్పుకోసం వేచిచూడకుండా.. ఢిల్లీ పోలీసులు ఇచ్చిన కొన్ని పేపర్ల ఆధారంగా శ్రీశాంత్ పై వేటు వేయడం అన్యాయం అని అన్నారు. ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన శ్రీశాంత్, అంకిత్ చవాన్ లపై బీసీసీఐ శుక్రవారం జీవితకాలపు నిషేధాన్ని విధించిన సంగతి తెలిసిందే. -
క్రికెటర్ నుంచి బుకీ... అమిత్ సింగ్
కర్ణాటకలో జన్మించి గుజరాత్‌కు ఆడిన 30 ఏళ్ల అమిత్ సింగ్ 2009 నుంచి 2012 వరకు ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడాడు. అంతకుముందు కేవలం 15 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉన్న అమిత్ తాను ఆడిన తొలి ఐపీఎల్ ఐదు మ్యాచ్‌ల్లో తొమ్మిది వికెట్లు తీయడంతో అప్పటి కెప్టెన్ వార్న్ ప్రశంసలు పొందాడు. ఆ సీజన్లోనే రెండు సార్లు అనుమానాస్పద బౌలింగ్ శైలితో వార్తల్లోకెక్కాడు. 2012లో అమిత్‌ను రాజస్థాన్ వదులుకుంది. అనంతరం బుకీ అవతారమెత్తి నిషేధం ఎదుర్కొన్నాడు. -
ఖేల్ ఖతం
అడ్డదారుల్లో సులువుగా డబ్బు సంపాదించాలని ఆరాటపడిన భారత క్రికెటర్, రాజస్థాన్ రాయల్స్ జట్టు సభ్యుడు శ్రీశాంత్... అతని సహచరుడు అంకిత్ చవాన్ తగిన మూల్యం చెల్లించుకున్నారు. ఐపీఎల్-6లో బెట్టింగ్ ఉచ్చులో పడి స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన వీరిపై బీసీసీఐ కొరడా ఝళిపించింది. జీవిత కాలంలో వీరు క్రికెట్ ఆడరాదంటూ ఆదేశించింది. తద్వారా ఈ ఆటగాళ్లు తమ కెరీర్‌ను అర్ధాంతరంగా ముగించుకున్నట్టయ్యింది. న్యూఢిల్లీ: వివాదాస్పద పేసర్‌గా పేరు తెచ్చుకున్న శ్రీశాంత్ క్రికెట్ కెరీర్ అవమానకర రీతిలో ముగిసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆరో సీజన్లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినందుకు ఈ కేరళ ఆటగాడిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొరడా ఝుళిపించింది. ఫిక్సర్లపై కఠినంగా వ్యవహరిస్తామని ఆది నుంచీ చెబుతూ వస్తున్న బోర్డు అందుకు తగ్గట్టుగానే శ్రీశాంత్‌పై క్రికెట్ నుంచి జీవితకాల నిషేధం విధించింది. అతనితోపాటు రాజస్థాన్ రాయల్స్‌కు ఆడిన ముంబై రంజీ జట్టు స్పిన్నర్ అంకిత్ చవాన్ కూడా ఇదే శిక్షను ఎదుర్కోనున్నాడు. శుక్రవారం జరిగిన బోర్డు క్రమశిక్షణ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వీరిద్దరితోపాటు బుకీగా మారిన రాజస్థాన్ రాయల్స్ జట్టు మాజీ సభ్యుడు, గుజరాత్ క్రికెటర్ అమిత్ సింగ్‌పై ఐదేళ్ల నిషేధం... విషయం తెలిసినప్పటికీ అధికారులకు తెలపకుండా ఉన్న రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్ సిద్ధార్థ్ త్రివేదిపై ఏడాది పాటు వేటు పడింది. తమపై ఉన్న నిషేధం సమయంలో వీరు ఎలాంటి క్రికెట్ మ్యాచ్‌ల్లో పాలుపంచుకోకూడదు. అలాగే బోర్డు దాని గుర్తింపు సంఘాలతో కలిసి ఎలాంటి కార్యక్రమాల్లోనూ కనిపించేందుకు అనుమతి ఉండదు. మరోవైపు సరైన ఆధారాలు లేని కారణంగా స్పిన్నర్ హర్మీత్ సింగ్‌కు ఊరట లభించింది. బుకీలు సంప్రదించిన విషయాన్ని వెల్లడించనందుకు అతడిని మందలించారు. చండిలాపై త్వరలో నిర్ణయం... దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ వ్యవహారం గత మే నెలలో బయటపడగానే బీసీసీఐ తమ అవినీతి వ్యతిరేక యూనిట్ చీఫ్ రవి సవానీ నేతృత్వంలో విచారణ కమిటీ వేసింది. ఆయన ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకుని బోర్డు క్రమశిక్షణ కమిటీ తమ నిర్ణయాన్ని వెల్లడించింది. విచారణ సమయంలో అజిత్ చండిలా జైలులో ఉండడంతో అతడిని వ్యక్తిగతంగా కలుసుకునే అవకాశం చిక్కలేదు. దీంతో ఈ ఆటగాడిపై నిర్ణయాన్ని వాయిదా వేశారు. అయితే ప్రస్తుతం అతడు కూడా బెయిల్‌పై విడుదల కావడంతో త్వరలోనే రవి సవానీ కలుసుకునే అవకాశం ఉంది. ‘తగిన సాక్ష్యాధారాలతో పాటు స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో ఇరుక్కున్న ఆటగాళ్లను వ్యక్తిగతంగా కలిసి రూపొందించిన నివేదికను పరిగణనలోకి తీసుకున్నాం. క్షుణ్ణంగా పరిశీలించాకే క్రమశిక్షణ కమిటీ ఈమేరకు నిర్ణయం తీసుకుంది’ అని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ తెలిపారు. గత నెలలో కోల్‌కతాలో జరిగిన వర్కింగ్ కమిటీ సమావేశంలో సవానీ ఈ నివేదికను సమర్పించారు. దయ చూపాల్సిన అవసరం లేదు: సవానీ స్పాట్ ఫిక్సర్లపై బోర్డు తరఫున విచారణ చేసిన అవినీతి వ్యతిరేక యూనిట్ చీఫ్ రవి సవానీ తన నివేదికలో పలు విషయాలు పేర్కొన్నారు. ‘ఫిక్సింగ్‌కు పాల్పడిన ఈ ఆటగాళ్లకు ఎలాంటి మినహాయింపు ఇవ్వాల్సిన అవసరం లేదు. శ్రీశాంత్ ఇప్పటికే చాలా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. అలాగే తొలి టి20 ప్రపంచకప్ టోర్నీ, 2011లో వన్డే ప్రపంచకప్ గెలుచుకున్న భారత జట్టులో సభ్యుడుగా ఉన్నాడు. చాలా సందర్భాల్లో ఐసీసీ ఏసీఎస్‌యూ అవగాహన కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఐపీఎల్-6కు ముందు కూడా తనతోపాటు ఫిక్సింగ్ చేసిన ఇతర ఆటగాళ్లు ఈ అవగాహన శిబిరంలో ఉన్నారు. అవినీతి నిరోధక పాఠాలు వీరిపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాయి. అందుకే వీరిపై ఎలాంటి దయ చూపాల్సిన అవసరం లేదు’ అని సవానీ నివేదికలో పేర్కొన్నారు. ఈ ఆటగాళ్లపై ఐదేళ్ల నుంచి జీవితకాల నిషేధం విధించాలని బోర్డుకు సూచించారు. బీసీసీఐ వేటు ఆశ్చర్యకరం: శ్రీశాంత్ బీసీసీఐ తనపై జీవిత కాల నిషేధం విధించడం పట్ల పేసర్ శ్రీశాంత్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ‘న్యూస్ చానెల్స్ చూస్తుండగా విషయం తెలిసింది. నాపై జీవిత కాల బహిష్కరణా..? చాలా ఆశ్చర్యంగా ఉంది’ అని ట్విట్టర్లో పేర్కొన్నాడు. అయితే వెంటనే ఈ ట్వీట్‌ను శ్రీశాంత్ తొలగించాడు. కమిటీ ముందు హాజరైన ఆటగాళ్లు బీసీసీఐ నిర్ణయానికి ముందు శ్రీశాంత్, అంకిత్ చవాన్, చండిలా, హర్మీత్ సింగ్, సిద్ధార్థ్ త్రివేది క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై తమ వాదనలు వినిపించారు. ‘కమిటీ సభ్యులు ఎంతో సహకరించారు. వారికి నా వాదనను సమర్థవంతంగా వినిపించాను. భారత్‌కు ఆడాలనేది నా చిన్నప్పటి కల. అలాంటిది క్రికెట్‌ను నేను ఎప్పటికీ మోసం చేయలేను. వారు నిషేధం గురించి ఏమీ చెప్పలేదు. బీసీసీఐతో పాటు భారత న్యాయ వ్యవస్థపై నాకు నమ్మకం ఉంది. ఈ మొత్తం వ్యవహారం నుంచి సచ్ఛీలుడిగా బయటపడతాను’ అని కమిటీ ముందు హాజరైన అనంతరం శ్రీశాంత్ అన్నాడు. సమావేశానికి హాజరైన శ్రీనివాసన్ బీసీసీఐ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న ఎన్.శ్రీనివాసన్ శుక్రవారం జరిగిన క్రమశిక్షణ కమిటీకి హాజరయ్యారు. వాస్తవానికి ఉపాధ్యక్షులు అరుణ్ జైట్లీ, నిరంజన్ షా సభ్యులుగా ఉన్న ఈ కమిటీకి బోర్డు అధ్యక్షుడి హోదాలో ఆయనే నేతృత్వం వహించాలి. కానీ అల్లుడు గురునాథ్ బెట్టింగ్ వ్యవహారంలో ఆయన పదవి నుంచి తాత్కాలికంగా తప్పుకోవడంతో ఇద్దరు సభ్యులు మాత్రమే హాజరవుతారని భావించినా శ్రీనివాసన్ కమిటీకి అధ్యక్షత వహించారు. -
ఫిక్సింగే లేదు: చండీలా
న్యూఢిల్లీ: ఇండి యన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అసలు ఫిక్సింగే జరగలేదని, తన పాత్ర ఏమీ లేకపోయినా పూర్తిగా తప్పుడు కేసులో ఇరికించారని అజిత్ చండీలా వ్యాఖ్యానించాడు. ఇటీవలే బెయిల్‌పై జైలు నుంచి విడుదలైన చండీలా...‘నేను సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్‌లాంటి మేటి క్రికెటర్ల వికెట్లు తీశాను. నా ప్రదర్శన చూస్తే చాలు నేనే తప్పూ చేయలేదని తెలుస్తుంది. పోలీసులు చెప్పేవన్నీ అబద్ధాలే’ అన్నాడు. రెండు నిమిషాలు అజ్ఞాత వ్యక్తులతో మాట్లాడటం తనను దోషిగా రుజువు చేయలేదని, త్వరలోనే నిజాయితీ నిరూపించుకుంటానని చండీలా చెప్పాడు. మరో వైపు ఫిక్సింగ్పై విచారణ నిమిత్తం బీసీసీఐ ఏర్పాటు చేసిన కమిటీ అక్రమమా, కాదా అన్న అంశంపై విచారణను సుప్రీం కోర్టు రెండు వారాల పాటు వాయిదా వేసింది. -
మళ్లీ చిక్కుల్లో బీసీసీఐ చీఫ్ శ్రీనివాసన్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరైన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు చైర్మన్ ఎన్ శ్రీనివాసన్ చిక్కుల్లో పడ్డారు. వైఎస్ జగన్ ఆస్టుల కేసులో మంగళవారం దాఖలు చేసిన మూడు చార్జిషీట్లలో ఓ చార్జిషీట్ లో శ్రీనివాసన్ పేరును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ప్రత్యేక కోర్టు చేర్చింది. ఇండియా సిమెంట్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో తాజా సీబీఐ చార్జిషీట్ లో మూడవ వ్యక్తిగా శ్రీనివాసన్ పేరును చేర్చింది. ఇండియా సిమెంట్ కంపెనీ అధినేత శ్రీనివాసన్ భారీగా పెట్టుబడులను పెట్టినట్టు సీబీఐ ఆరోపణలు చేస్తోంది. తాజా చార్జిషీట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంత్రి పొన్నాల లక్ష్మయ్య పేరును సీబీఐ మినహాయించింది. ఇప్పటికే ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో కష్టాల్లో పడిన శ్రీనివాసన్ కు తాజా వ్యవహారం ఇబ్బంది కలిగించే విషయమే.