నెహ్రా వుయ్‌ మిస్‌ యూ! ఈ విజయం నీకే అంకితం!! | Yuvraj Singh Dedicates IPL Title Win to Ashish Nehra | Sakshi
Sakshi News home page

నెహ్రా వుయ్‌ మిస్‌ యూ! ఈ విజయం నీకే అంకితం!!

Published Mon, May 30 2016 5:49 PM | Last Updated on Mon, Sep 4 2017 1:16 AM

నెహ్రా వుయ్‌ మిస్‌ యూ! ఈ విజయం నీకే అంకితం!!

నెహ్రా వుయ్‌ మిస్‌ యూ! ఈ విజయం నీకే అంకితం!!

8 పరుగుల తేడాతో బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌ను హైదరాబాద్ సన్‌ రైజర్స్‌ ఓడించడంతో సంబరాలు మిన్నంటాయి. తొలిసారిగా ఐపీఎల్‌ టైటిల్‌ గెలుచుకున్న ఆనందంలో హైదరాబాద్‌ జట్టంతా ఓలలాడుతుండగా.. ఒక్క క్రికెటర్‌ మాత్రం ఈ సంబరాలకు దూరంగా ఉండిపోయాడు. అతనే  ఆశిష్ నెహ్రా.
 
ఈ నెల 15న పంజాబ్‌ తో జరిగిన మ్యాచ్‌లో తీవ్రంగా గాయపడటంతో నెహ్రా మొత్తం టోర్నీకి దూరమయ్యాడు. అయినా నెహ్రాను హైదరాబాద్ సన్‌ రైజర్స్‌ జట్టు మరువలేదు. ఐపీఎల్‌ టైటిల్‌ను గెలువగానే సన్‌రైజర్స్‌ ఆటగాడు యువరాజ్‌ సింగ్‌ ఈ బౌలింగ్‌ లెజండ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో కృతజ్ఞతలు తెలిపాడు.  'నెహ్రా వుయ్‌ మిస్‌ యూ. ఈ విజయం నీ కోసమే. హైదరాబాద్ సన్‌రైజర్స్‌ జట్టుకు శుభాకాంక్షలు. అద్భుతంగా ఆడారు' అంటూ యూవీ పేర్కొన్నాడు. తమ విజయానందంలోని ఫొటోను షేర్‌ చేశాడు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement