Ashish Nehra
-
గుజరాత్ టైటాన్స్ కీలక నిర్ణయం.. ఆశిష్ నెహ్రాపై వేటు!
ఐపీఎల్-2025కు ముందు దాదాపు అన్ని ఫ్రాంచైజీలు భారీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గుజరాట్ టైటాన్స్ ఫ్రాంచైజీ సైతం తమ జట్టులో కీలక మార్పులు చేయనున్నట్లు సమాచారం.తమ జట్టు హెడ్‌కోచ్ ఆశిష్ నెహ్రా, క్రికెట్ డైరెక్టర్ విక్రమ్ సోలంకిని తప్పించాలని గుజరాత్ టైటాన్స్ నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మూడు సంవత్సరాల ఆశిష్ నెహ్రా కాంట్రాక్ట్ గడువు ముగిసినప్పటికీ దాన్ని రెన్యూవల్ చేయకపోవడం.. ఈ వార్తలకు మరింత ఊతమిస్తోంది. ఈ ఏడాది చివరలో జరగనున్న మెగా వేలానికి ముందు గుజరాత్ ఫ్రాంచైజీ నుంచి ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. కాగా గుజరాత్ హెడ్‌కోచ్‌గా నెహ్రా విజయవంతమయ్యాడనే చెప్పుకోవాలి. తమ అరంగేట్ర సీజన్లో గుజరాత్‌ను ఛాంపియన్‌గా నిలిపిన నెహ్రా.. తర్వాతి సీజన్లో జీటీ రన్నరప్ నిలిచింది.అయితే ఐపీఎల్ 2024లో మాత్రం గుజరాత్ దారుణ ప్రదర్శన కనబరిచింది. తొలిసారి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించడంలో గుజరాత్ విఫలమైంది. అందుకు కెప్టెన్సీ మార్పు కూడా ఓ కారణం కావచ్చు. ఈ ఏడాది సీజన్‌కు ముందు హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ ట్రేడ్ చేసుకోవడంతో గుజరాత్ కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ ఎంపికయ్యాడు. కానీ జట్టును నడిపించడంలో శుబ్‌మన్ ఎంపికయ్యాడు.ఇక గత మూడు సీజన్లలో మెంటార్‌గా వ్యవహరించిన గ్యారీ కిరెస్టన్ ఇప్పటికే తన పదవి నుంచి తప్పుకున్నాడు. పాకిస్తాన్ పరిమిత ఓవర్ల హెడ్‌కోచ్‌గా గ్యారీ బాధ్యతలు చేపట్టాడు. మరోవైపు గుజరాత్ యాజమాన్యంలో మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది.గుజరాత్ యాజమాన్యం సీవీసీ క్యాపిటల్స్ పార్టనర్స్ నుంచి కొంత వాటాను భారత వ్యాపార దిగ్గజం అదానీ గ్రూప్ కొనుగోలు చేయనున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ డీల్‌పై అధికారికంగా ప్రకటన విడుదల కానుందని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. -
రోహిత్- కోహ్లి విషయంలో గంభీర్ నిర్ణయం సరికాదు: మాజీ బౌలర్
శ్రీలంకతో వన్డే సిరీస్ కోసం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలను జట్టులోకి పిలిపించడం సరైన నిర్ణయం కాదేమోనని టీమిండియా మాజీ బౌలర్ ఆశిష్ నెహ్రా అన్నాడు. ఈ దిగ్గజ బ్యాటర్లకు విశ్రాంతి ఇవ్వకుండా నూతన కోచ్ గౌతం గంభీర్ తప్పుచేశాడని అభిప్రాయపడ్డాడు. రోహిత్- కోహ్లి గంభీర్‌కు కొత్త కాదని.. వారి ఆట తీరు గురించి అతడికి అవగాహన ఉందని నెహ్రా పేర్కొన్నాడు.టీ20 ప్రపంచకప్-2024 తర్వాత అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి.. ఈ టోర్నీ తర్వాత సెలవులు తీసుకున్నారు. భార్య రితిక, కూతురు సమైరాలతో కలిసి రోహిత్ అమెరికాకు వెళ్లిపోగా.. కోహ్లి లండన్‌లో ఉన్న తన సతీమణి అనుష్క శర్మ, పిల్లలు వామిక, అకాయ్‌ల దగ్గరకు వెళ్లాడు.ఈ నేపథ్యంలో వీరిద్దరు శ్రీలంకతో వన్డే సిరీస్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపించాయి. కుటుంబాలతో మరికొన్నాళ్లు ఎక్కువ సమయం గడపాలని భావించిన కోహ్లి- రోహిత్.. ఈ విషయాన్ని ముందుగానే బీసీసీఐతో చర్చించినట్లు సమాచారం. అయితే, చాంపియన్స్ ట్రోఫీ-2025కి ముందు టీమిండియాకు శ్రీలంక, ఇంగ్లండ్‌తో మాత్రమే మ్యాచ్(3+3)లు మిగిలి ఉండటంతో.. గంభీర్ వీరిద్దరిని వెనక్కిపిలిపించాడని తెలిసింది.సీనియర్లు జట్టులో ఉండాలని అతడు భావించాడని.. తన ఆలోచనను కోహ్లి- రోహిత్‌లతో పంచుకోగా వారు లంక పర్యటనకు వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆశిష్ నెహ్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘టీమిండియా తదుపరి వన్డే సిరీస్‌కు 2- 3 నెలల సమయం ఉంది. నిజానికి ఇలాంటివి అరుదుగా జరుగుతూ ఉంటాయి.అంతకంటే ముందు టెస్టు, టీ20 సిరీస్‌లు జరుగనున్నాయి. అలాంటపుడు రోహిత్, కోహ్లిలను హడావుడిగా రప్పించాల్సిన అవసరం లేదు. నిజానికి శ్రీలంక సిరీస్ ద్వారా ఇతర ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇస్తే బాగుండేది. గంభీర్ కొత్తగా కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో అతడు ఎక్కువ సమయం గడపాలని భావించడం సహజం.అయితే, రోహిత్- కోహ్లి గురించి అతడికి ముందే తెలుసు కదా! ఈ ఇద్దరితో ఎక్కువ సమయం గడిపి వారి ఆట తీరును పరిశీలించిందేకు తనేమీ విదేశీ కోచ్ కాదు. స్వదేశీ సిరీస్‌లు మొదలైన తర్వాత కోహ్లి- రోహిత్ ఎలాగో ఆడతారు. అప్పటిదాకా వేరే వాళ్లకు అవకాశం ఇస్తే బాగుండేది. ఈ విషయంలో నేను గంభీర్‌ను తప్పుబట్టడం లేదు. అయితే, ఇలాంటి వ్యూహాల వల్ల జట్టుకు మేలే చేకూరుతుంది’’ అని ఆశిష్ నెహ్రా సోనీ స్పోర్ట్స్ షోలో వ్యాఖ్యానించాడు. కాగా శ్రీలంకతో ఇప్పటిదాకా రెండు వన్డేల్లో రోహిత్ 122 పరుగులతో రాణించగా.. కోహ్లి మాత్రం కేవలం 38 పరుగులు మాత్రమే చేశాడు. -
‘అందుకే అప్లై చేయలేదు.. నేను గంభీర్‌లా కాదు’
శ్రీలంక తాజా పర్యటనతో భారత క్రికెట్లో నూతన శకం ఆరంభం కానుంది. ఇంతవరకు కోచ్‌గా అనుభవం లేని మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ టీమిండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. అదే విధంగా.. దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రిటర్మెంట్ తర్వాత భారత్ తొలిసారి టీ20 సిరీస్‌లో పాల్గొననుంది.ఇక ఈ జట్టుకు నంబర్ వన్ టీ20 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ పూర్తిస్థాయికి కెప్టెన్‌గా నియమితుడైన విషయం తెలిసిందే. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను కాదని సూర్యకు టీ20 పగ్గాలు అప్పగించడంపై భిన్న స్పందనలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ బౌలర్ ఆశిష్ నెహ్రా సైతం తన అభిప్రాయం వ్యక్తపరిచాడు.ఆశ్చర్యం కలిగించలేదు‘‘హార్దిక్ పాండ్యా మూడు ఫార్మాట్లు ఆడలేకపోతున్నాడు. టెస్టులకు దూరమైన అతడు యాభై ఓవర్ల క్రికెట్లోనూ పూర్తిస్థాయిలో జట్టుకు అందుబాటులో ఉండటం లేదు. అలాంటి ఆటగాడి సేవలు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలనుకోవడం కత్తిమీద సాము లాంటిదే.అయినా క్రికెట్లో ఇవన్నీ సహజం. హార్దిక్‌పై వేటు వేయడం నాకేమీ ఆశ్చర్యం కలిగించలేదు. అయితే, టీ20 ప్రపంచకప్-2024లో వైస్ కెప్టెన్‌గా ఉన్న అతడిని ఇలా అకస్మాత్తుగా రేసు నుంచి తప్పించడం మాత్రం ఆశ్చర్యకరం. అయితే, కొత్త కోచ్ ఆలోచనలేమిటో మనకు తెలియదు. ప్రతి కోచ్, కెప్టెన్ అభిప్రాయాలు భిన్నంగా ఉంటాయి కదా’’ అని ఆశిష్ నెహ్రా పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. టీమిండియా హెడ్ కోచ్ రేసులో ఆశిష్ నెహ్రా పేరు కూడా వినిపించిన విషయం తెలిసిందే. అయితే, తాను మాత్రం ఈ పోస్టు కోసం దరఖాస్తు చేసుకోలేదని 45 ఏళ్ల నెహ్రా తెలిపాడు. ఇందుకు గల కారణాలు కూడా వెల్లడించాడు.నేను గంభీర్‌లా కాదు‘‘ఈ విషయం గురించి నేను ఎన్నడూ ఆలోచించనేలేదు. నా పిల్లలు ఇంకా చిన్నవాళ్లే. గౌతం గంభీర్ పిల్లలు కూడా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు. అయితే, ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు.ప్రస్తుతం నా పనులతో నేను బిజీగా, సంతోషంగా ఉన్నాను. జట్టుతో కలిసి తొమ్మిది నెలల పాటు ప్రయాణించే ఓపిక నాకు లేదు’’ అని ఆశిష్ నెహ్రా స్పష్టం చేశాడు. కాగా ఆశిష్ నెహ్రా ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌తో కలిసి పనిచేస్తున్నాడు.టైటాన్స్‌తో అనుబంధంఐపీఎల్-2022లో ఎంట్రీ ఇచ్చిన ఈ జట్టు నెహ్రా మార్గదర్శనంలోని హార్దిక్ పాండ్యా సారథ్యంలో చాంపియన్‌గా అవతరించింది. మరుసటి ఏడాది కూడా ఫైనల్ చేరింది. అయితే, ఐపీఎల్-2024లో పాండ్యా టైటాన్స్‌తో బంధం తెంచుకున్నాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు.చదవండి: ‘ప్రేమ’తో నటాషా పోస్ట్.. హార్దిక్ పాండ్యా కామెంట్ వైరల్ -
IPL 2025: గుజరాత్ హెడ్ కోచ్‌గా యువరాజ్ సింగ్..?
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి చాలా సమయం ఉన్నప్పటికీ అన్ని ఫ్రాంచైజీలు ప్రక్షాళన బాట పట్టాయి. కొన్ని ఫ్రాంచైజీలేమో ఆటగాళ్లను వదిలించుకోవాలని భావిస్తుంటే.. మరికొన్ని కోచింగ్ స్టాఫ్, మెంటార్లను మార్చే పనిలో పడ్డాయి. తాజాగా గుజరాత్ ఫ్రాంచైజీకి సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ వచ్చింది. హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా గుజరాత్ నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. అతనితో పాటు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ విక్రమ్ సోలంకి కూడా తప్పుకోనున్నట్లు సమాచారం. వీరిద్దరి పర్యవేక్షణలో గుజరాత్ తమ తొలి రెండు సీజన్లలో ఫైనల్స్‌కు చేరింది. 2022లో ఛాంపియన్‌గా, 2023లో రన్నరప్‌గా నిలిచింది. ఇంతటి విజయవంతమైన జోడీ ప్రస్తుతం గుజరాత్‌ను వీడాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. గత సీజన్లో (2024) వైఫల్యాల కారణంగా ఫ్రాంచైజీ యాజమాన్యం సైతం వీరిపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. మేనేజ్మెంట్ తప్పించాలని నిర్ణయం తీసుకునే లోపే తామే స్వచ్చందంగా తప్పుకుంటే గౌరవంగా ఉంటుందని వీరు భావిస్తుండవచ్చు. గుజరాత్ ఫ్రాంచైజీకి సంబంధించి ఈ టాపిక్ నడుస్తుండగానే మరో వార్త సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తుంది. నెహ్రా గుజరాత్ హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకుంటే టీమిండియా దిగ్గజం యువరాజ్ సింగ్ ఎంట్రీ ఇస్తాడని ప్రచారం జరుగుతుంది. యువరాజ్‌తో గుజరాత్ యాజమాన్యం సంప్రదింపులు కూడా పూర్తి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. యువీకి గతంలో ఏ జట్టుకు కోచింగ్ ఇచ్చిన అనుభవం లేదు. ఒకవేళ అతన్ని గుజరాత్ టైటాన్స్ పంచన చేర్చుకుంటే ఇదే అతనికి తొలి కోచింగ్ పదవి అవుతుంది. గుజరాత్ ఆఫర్‌పై యువీ కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది. కాగా, గుజరాత్ గత సీజన్లో ట్రేడింగ్ ద్వారా హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్‌కు అప్పజెప్పిన విషయం తెలిసిందే. హార్దిక్ ఎగ్జిట్‌తో శుభ్‌మన్ గిల్ గుజరాత్ నూతన కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. గిల్ నేతృత్వంలో గుజరాత్ గత సీజన్లో 14 మ్యాచ్‌ల్లో ఐదింట మాత్రమే విజయాలు సాధించి లీగ్ దశలోనే నిష్క్రమించింది. -
హెడ్‌కోచ్‌గా గంభీర్.. బౌలింగ్ కోచ్‌గా జహీర్ ఖాన్ బెటర్!
‘‘గంభీర్ పట్టిందల్లా బంగారమే అవుతుంది. అతడు ఏ జట్టుతో చేరితే.. ఆ జట్టు విజయాలు సాధిస్తుంది. అసలు టీమిండియాకు విదేశీ కోచ్‌ల అవసరమే లేదు.ఇండియాలోనే ఎంతో మంది ప్రతిభావంతులైన కోచ్‌లు ఉన్నారు. ద్రవిడ్ తర్వాత.. భారత జట్టు ప్రధాన కోచ్‌గా గౌతం గంభీర్ కంటే అత్యుత్తమ ఆప్షన్ ఇంకొకటి ఉంటుందనుకోను.అతడొక అద్భుతమైన ఆటగాడు. గొప్ప కోచ్ కూడా కాగలడు. ప్రస్తుతం టీమిండియాకు హెడ్ కోచ్‌గా అతడే సరైనోడు. గంభీర్ తొలుత లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా ఉన్నాడు.అతడి మార్గ నిర్దేశనంలో లక్నో జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. తర్వాత కేకేఆర్‌కు మెంటార్‌గా వెళ్లాడు. ఆ జట్టు ఏకంగా చాంపియన్‌గా నిలిచింది.గంభీర్‌ది అత్యద్భుతమైన క్రికెటింగ్ మైండ్. ప్రత్యర్థి జట్టును కచ్చితంగా అంచనా వేసి అందుకు తగ్గ ప్రణాళికలు రూపొందించడంలో దిట్ట. తనతో కలిసి ఆడిన అనుభవం నాకుంది.కలిసే భోజనం చేసేవాళ్లం. ఆట గురించి చర్చించుకునే వాళ్లం. ఇప్పటికీ మా ఇద్దరి మధ్య స్నేహ బంధం ఉంది. టచ్‌లోనే ఉంటాం’’ అని పాకిస్తాన్ వికెట్ కీపర్ బ్యాటర్ కమ్రాన్ అక్మల్ అన్నాడు.భారత క్రికెట్ జట్టు హెడ్‌కోచ్‌గా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ మాత్రమే సరైన ఆప్షన్ అని నొక్కి వక్కాణించాడు. అతడి మార్గదర్శనంలో టీమిండియా మరింత పటిష్టంగా మారుతుందని కమ్రాన్ అక్మల్ పేర్కొన్నాడు.బౌలింగ్ కోచ్‌గా వారిలో ఒకరు బెటర్ఇక గంభీర్ ప్రధాన కోచ్‌గా ఉంటే.. ఆశిష్ నెహ్రా లేదంటే జహీర్ ఖాన్లలో ఒకరిని బీసీసీఐ తమ బౌలింగ్ కోచ్‌గా ఎంచుకోవాలని సూచించాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ కమ్రాన్ అక్మల్ ఈ మేరకు తన అభిప్రాయాలు పంచుకున్నాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత టీమిండియా హెడ్‌కోచ్ బాధ్యతల నుంచి రాహుల్ ద్రవిడ్ తప్పుకోనున్నాడు. ఈ నేపథ్యంలో అతడి వారసుడిగా గౌతం గంభీర్ ఎంపిక దాదాపుగా ఖాయమైపోయింది.మెంటార్‌గా మాత్రమేఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లకు మెంటార్‌గా పనిచేశాడు గౌతీ. అయితే, కోచ్‌గా మాత్రం అతడికి అనుభవం లేదు. ఇక వరల్డ్‌కప్ టోర్నీలో విజయ వంతంగా ముందుకు సాగుతున్న టీమిండియా గురువారం సూపర్-8 దశలో తొలి మ్యాచ్ ఆడనుంది. అఫ్గనిస్తాన్‌తో బార్బడోస్ వేదికగా తలపడనుంది. -
ఎవరు పడితే వాళ్లు కోచ్ కాలేరు?.. గంగూలీ పోస్ట్ వైరల్
టీమిండియా కొత్త కోచ్ నియామకం నేపథ్యంలో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టు హెడ్ కోచ్ అంటే ఆషామాషీ కాదని.. ఈ విషయంలో తెలివిగా వ్యవహరించాలని బీసీసీఐకి సూచించాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత టీమిండియా ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ తప్పుకోనున్న విషయం తెలిసిందే. వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత అతడి పదవీ కాలం ముగిసినా బీసీసీఐ అభ్యర్థన మేరకు ప్రస్తుతం ద్రవిడ్ కోచ్‌గా కొనసాగుతున్నాడు.అయితే, మెగా టోర్నీ తర్వాత మాత్రం ద్రవిడ్ వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బోర్డు ఇప్పటికే కొత్త కోచ్ కోసం దరఖాస్తులు ఆహ్వానించగా.. మే 27తో గడువు ముగిసింది.గంభీర్ పేరు దాదాపు ఖరారైనట్లే!కానీ ఇంతవరకు కొత్త కోచ్ ఎవరన్నా అన్న విషయంపై ఎటువంటి స్పష్టత రాలేదు. విదేశీ కోచ్‌ల వైపు బీసీసీఐ మొగ్గుచూపుతుందనే వార్తలు వచ్చినా.. టీమిండియా మాజీ క్రికెటర్లు గౌతం గంభీర్, ఆశిష్ నెహ్రా పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.ఈ క్రమంలో.. ఐపీఎల్-2024 చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్ గంభీర్ టీమిండియా హెడ్‌కోచ్‌గా దాదాపు ఖరారైనట్లే అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.తెలివిగా వ్యవహరించాలి‘‘ఎవరి జీవితంలోనైనా కోచ్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. మైదానం లోపల.. వెలుపలా.. ఒక వ్యక్తికి మార్గదర్శనం చేస్తూ వారిని గొప్పగా తీర్చిదిద్దే బాధ్యత. కాబట్టి కోచ్‌ని ఎంచుకునేటపుడు తెలివిగా వ్యవహరించాలి’’ అని గంగూలీ ట్వీట్ చేశాడు. ఎవరు పడితే వాళ్లను కోచ్‌లుగా నియమించొద్దని పరోక్షంగా బీసీసీఐకి సూచించాడు.ఇందుకు స్పందించిన నెటిజన్లు.. ‘‘గంభీర్‌కు వ్యతిరేకంగానే మీరు ఈ పోస్ట్ పెట్టారు కదా? ఆయన హెడ్‌కోచ్ అవటం మీకు ఇష్టం లేదా?’’ అంటూ గంగూలీపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే, దాదా అభిమానులు మాత్రం.. ‘‘గ్రెగ్ చాపెల్ మాదిరి ఇంకో కోచ్ వస్తే ఆటగాళ్లను విభజించి జట్టును భిన్న వర్గాలుగా విడదీస్తాడనే భయంతోనే గంగూలీ ఇలా జాగ్రత్తలు చెబుతున్నారు’’ అని మద్దతుగా నిలుస్తున్నారు.చదవండి: T20 WC 2024: టీమిండియాతో పాటు ఏయే జట్లు? రూల్స్ ఏంటి?.. పూర్తి వివరాలుThe coach's significance in one's life, their guidance, and relentless training shape the future of any person, both on and off the field. So choose the coach and institution wisely…— Sourav Ganguly (@SGanguly99) May 30, 2024 -
పాండ్యాను ఒప్పించే ప్రయత్నం చేయలేదు!
అహ్మదాబాద్: ఐపీఎల్లో ఎంతో అనుభవం ఉన్న హార్దిక్ పాండ్యా జట్టుకు దూరమైన లోటు కనిపిస్తుందని, అయితే అతను వెళ్లకుండా తాము ఒప్పించే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదని గుజరాట్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా అన్నాడు. గత రెండు సీజన్లలో టైటాన్స్‌కు కెప్టెన్ గా వ్యవహరించిన హార్దిక్ ఈ సీజన్‌నుంచి ముంబై ఇండియన్స్ సారథిగా బరిలోకి దిగనున్నాడు. ఏ క్రీడలోనైనా కొన్ని అంశాలను పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోవాల్సిందేనని నెహ్రా అభిప్రాయ పడ్డాడు. ‘మా జట్టుతో ఉండిపొమ్మని పాండ్యాను ఒప్పించే ప్రయత్నం నేను ఎప్పుడూ చేయలేదు. మరో ఇతర ఫ్రాంచైజీకి వెళితే అలా చేసేవాడినేమో కానీ గుజరాత్‌కు ముందు 5–6 సీజన్లు ఆడిన ముంబైకి అతను వెళ్లిపోయాడు. అతను అక్కడ మళ్లీ కొత్తగా ఏదైనా నేర్చుకుంటాడేమో. కెపె్టన్‌గా రాటుదేలేందుకు గిల్‌కు ఇది మంచి అవకాశం’ అని నెహ్రా వ్యాఖ్యానించాడు. -
ముంబై కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా: తొలిసారి స్పందించిన నెహ్రా
GT Coach Ashish Nehra Comments: గుజరాత్ టైటాన్స్ సారథిగా టీమిండియా ఓపెనర్ శుబ్‌మన్ గిల్ సరైన వాడని ఆ జట్టు హెడ్‌కోచ్ ఆశిష్ నెహ్రా అన్నాడు. హార్దిక్ పాండ్యా లాంటి అనుభవజ్ఞుడైన, అద్భుతమైన నైపుణ్యాలు గల ఆటగాడి స్థానాన్ని భర్తీ చేయడం కష్టమేనని.. అయితే, కెప్టెన్‌గా అతడు లేని లోటును గిల్ పూడ్చగలడని పేర్కొన్నాడు. అందుకే యువ క్రికెటర్ అయినప్పటికీ అతడిపై నమ్మకంతో గుజరాత్ టైటాన్స్ ఇంత పెద్ద బాధ్యతను గిల్‌కు అప్పగించిందని తెలిపాడు. ఫలితాలతో సంబంధం లేకుండా అతడికి తమ ప్రోత్సాహం ఉంటుందని ఆశిష్ నెహ్రా ఈ సందర్భంగా వెల్లడించాడు. కాగా ఐపీఎల్-2024 వేలానికి ముందు హార్దిక్ పాండ్యా టైటాన్స్‌కు షాకిచ్చిన విషయం తెలిసిందే. ఊహించని విధంగా తాను గతంలో ప్రాతినిథ్యం వహించిన ముంబై ఇండియన్స్‌తో భారీ ఒప్పందం కుదుర్చుకుని ట్రేడింగ్ ద్వారా సొంత గూటికి వెళ్లిపోయాడు. రోహిత్ శర్మ స్థానంలో ముంబై కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టాడు. ఈ నేపథ్యంలో.... తమ అరంగేట్ర సీజన్లోనే టైటిల్ విజేతగా నిలపడంతో పాటు రెండో ఎడిషన్‌లో ఫైనల్ తీసుకువెళ్లిన పాండ్యా జట్టును వీడటంతో గుజరాత్ టైటాన్స్ శుబ్‌మన్ గిల్‌ను తమ నాయకుడిగా ప్రకటించింది. హార్దిక్ స్థానాన్ని భర్తీ చేయడం కష్టం.. అయితే గిల్.. ఈ విషయాల గురించి తొలిసారిగా స్పందించిన టైటాన్స్ హెడ్‌కోచ్ ఆశిష్ నెహ్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘హార్దిక్ పాండ్యా వంటి ప్రతిభావంతుడైన, అనుభవం గల ఆటగాడి స్థానాన్ని భర్తీ చేయడం చాలా కష్టం. అయితే, గత మూడు- నాలుగేళ్లలో గిల్ క్రికెటర్‌గా ఎదిగిన విధానం చూస్తూనే ఉన్నాం. అతడి వయసు ప్రస్తుతం 24- 25 ఏళ్ల మధ్య ఉంటుంది. అయితే, ఈ యువ ఆటగాడి నైపుణ్యాలపై మాకు నమ్మకం ఉంది. అందుకే అతడిని కెప్టెన్‌ను చేశాం. ప్రతిసారి ఫలితాలను బట్టే ముందుకు సాగడం కుదరదు. కెప్టెన్‌గా ఉన్నపుడు జట్టును విజయవంతంగా ముందుకు నడపాల్సి ఉంటుందన్నది వాస్తవమే. గిల్‌పై మాకు నమ్మకం ఉంది అయితే, సారథిగా ఉన్నపుడు కేవలం ఫలితాల గురించి మాత్రమే ఆలోచించకుండా ఒక్కోసారి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. గిల్ అలాంటి వాడే. గుజరాత్ కెప్టెన్‌గా అతడు సరైన వాడని మేము నమ్ముతున్నాం’’ అని నెహ్రా పేర్కొన్నాడు. స్టార్క్‌కు అంత మొత్తం పెట్టొచ్చు ఇక ఐపీఎల్-2024 వేలంలో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ కోసం తాము పోటీపడటాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘ఐపీఎల్లో అధిక ధర అన్న దానికి కొలమానం లేదు. స్టార్క్ ఎలాంటి బౌలరో అందరికీ తెలుసు. మాకు సమర్థవంతమైన ఫాస్ట్ బౌలర్ అవసరం ఉంది. జట్టు ప్రయోజనాలు, వ్యూహాలకు అనుగుణంగా అతడిని కొనుగోలు చేయాలని భావించాం. అయితే, ఇప్పుడు మా దగ్గర ఉన్న పేస్ దళంతో మేము సంతృప్తిగానే ఉన్నాం. ఏదేమైనా స్టార్క్ వంటి బౌలర్‌కు అంత మొత్తం చెల్లించడం నన్నేమీ ఆశ్చర్యపరచలేదు’’ అని ఆశిష్ నెహ్రా చెప్పుకొచ్చాడు. కాగా మిచెల్ స్టార్క్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ ఏకంగా రూ. 24.75 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్-2024 వేలంలో గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసిన ఆటగాళ్ల జాబితా: 1. అజ్మతుల్లా ఒమర్జాయ్ (రూ.50 లక్షలు) 2. ఉమేశ్ యాదవ్ (రూ.5.8 కోట్లు) 3. షారూఖ్ ఖాన్ (రూ.7.4 కోట్లు) 4. సుశాంత్ మిశ్రా (రూ.2.2 కోట్లు) 5. కార్తీక్ త్యాగి (రూ.60 లక్షలు) 6. మానవ్ సుతార్ (రూ.20 లక్షలు) 7. రాబిన్ మింజ్ (రూ.3.6 కోట్లు) 8. స్పెన్సర్ జాన్సన్ (రూ.10 కోట్లు). వేలానికి ముందు రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు: అభినవ్ సదారంగని, బి.సాయి సుదర్శన్, దర్శన్ నల్కండే, డేవిడ్ మిల్లర్, జయంత్ యాదవ్, జాషువా లిటిల్, కేన్ విలియమ్సన్, మాథ్యూ వేడ్, మహ్మద్ షమీ, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, ఆర్ సాయి కిషోర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), విజయ్ శంకర్, వృద్ధిమాన్ సాహా. గుజరాత్ టైటాన్స్ రిలీజ్ చేసిన ఆటగాళ్లు: అల్జారీ జోసెఫ్, దసున్ షనక, కోన శ్రీకర్ భరత్, ఒడియన్ స్మిత్, ప్రదీప్ సంగ్వాన్, శివమ్ మావి, ఉర్విల్ పటేల్, యశ్ దయాళ్. ట్రేడ్ చేసిన ప్లేయర్: హార్దిక్ పాండ్యా(ముంబై ఇండియన్స్‌కు). చదవండి: తండ్రిది పాన్ షాప్.. గ్లవ్స్ కొనేందుకు కూడా డబ్బులు లేవు! ఇప్పుడు ఏకంగా రూ.5 కోట్లు -
‘సెలక్టర్లు అతడిని మర్చిపోవద్దు.. సౌతాఫ్రికా టూర్‌కు పంపాల్సింది’
India tour of South Africa, 2023-24: సౌతాఫ్రికా పర్యటనకు ఎంపిక చేసిన భారత ‘జట్ల’పై టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా స్పందించాడు. ప్రొటిస్ గడ్డపై వరుస సిరీస్‌లు ఆడేందుకు బీసీసీఐ ఒక్కో ఫార్మాట్‌కు ఒక్కో జట్టును సెలక్ట్ చేస్తుందని ముందే ఊహించానని పేర్కొన్నాడు. అయితే, మూడు జట్లలోనూ ఓ కీలక ఆటగాడి పేరు మాత్రం మిస్ అయిందని.. అతడు ఉంటే జట్టు మరింత పటిష్టమయ్యేదని నెహ్రా అభిప్రాయపడ్డాడు. కాగా డిసెంబరు 10 నుంచి జనవరి 7 వరకు టీమిండియా సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. మూడు ఫార్మాట్లకు మూడు జట్లు ఇందులో భాగంగా మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడనుంది. ఇందుకోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇప్పటికే మూడు జట్లను ప్రకటించింది. రెగుల్యర్ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పరిమిత ఓవర్ల సిరీస్‌కు దూరంగా ఉండనున్నట్లు తెలిపింది. ఇక రోహిత్ గైర్హాజరీలో టీ20లకు సూర్యకుమార్ యాదవ్, వన్డేలకు కేఎల్ రాహుల్ నాయకులుగా వ్యవహరించనున్నారు. టెస్టు సిరీస్‌తో రోహిత్, కోహ్లి రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ఆశిష్ నెహ్రా జియో సినిమా షోలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. అందరికీ సంతోషమే.. ఆ ఒక్కడికి తప్ప ‘‘సౌతాఫ్రికా పర్యటన కోసం టీమిండియా సెలక్టర్లు మూడు వేర్వేరు జట్లను ఎంపిక చేయడం నన్నేమీ ఆశ్చర్యపరచలేదు. జట్టులో చోటు ఆశించిన చాలా మందికి సంతోషం దక్కింది. అయితే, ఈ టూర్ గురించి వినగానే నా మదిలో మెదిలిన పేరు భువనేశ్వర్ కుమార్. సౌతాఫ్రికాకు వెళ్తున్నామంటే జట్టులో ఎక్కువగా ఫాస్ట్‌బౌలర్లు ఉండాలి. అయితే, కొత్త బంతితో ఫలితం రాబట్టగల అర్ష్‌దీప్ సింగ్, ముకేశ్ కుమార్ వంటి యువ బౌలర్ల రూపంలో మంచి ఆప్షన్లు అందుబాటులో ఉన్నమాట వాస్తవమే. భువీ లాంటి అనుభవజ్ఞుడిని మర్చిపోకండి కానీ భువనేశ్వర్ కుమార్ వంటి అనుభవజ్ఞుడైన ఫాస్ట్‌బౌలర్ జట్టులో ఉంటే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. సెలక్టర్లు అతడి పేరును పూర్తిగా విస్మరించడం తగదు. ముఖ్యంగా టీ20, వన్డేలలో అతడి అవసరం జట్టుకు ఉంది’’ అని మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా సెలక్టర్లను ఉద్దేశించి మాట్లాడాడు. దేశవాళీ టోర్నీలో అదరగొట్టినా కాగా గతేడాది టీ20 ప్రపంచకప్‌లో నిరాశజనక ప్రదర్శన తర్వాత సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన భువీ.. ఇప్పటి వరకు రీఎంట్రీ ఇవ్వలేకపోయాడు. స్థానిక లీగ్, దేశవాళీ మ్యాచ్‌లలో అద్భుతంగా ఆడుతున్నప్పటికీ టీమిండియాలో చోటు కోసం యువ బౌలర్లతో పోటీలో మాత్రం వెనుకబడిపోయాడు. ఇటీవల ముగిసిన టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భువీ.. మొత్తంగా 16 వికెట్లు తీశాడు. చదవండి: సౌతాఫ్రికా టూర్: వన్డేలకు రాహుల్ సారథి.. జట్ల వివరాలివే చదవండి: WTC: టీమిండియాను ‘వెనక్కి’నెట్టిన బంగ్లాదేశ్! టాప్‌లో పాకిస్తాన్.. -
నెహ్రా వద్దన్నాడు.. మళ్లీ ద్రవిడే దిక్కయ్యాడు..!
టీమిండియా కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ రెండేళ్ల పదవీకాలం ప్రపంచకప్-2023 ఫైనల్‌తో ముగిసిన విషయం తెలిసిందే. అనంతర పరిణామాల్లో భారత కోచ్‌గా మరో దఫా కొనసాగాలని బీసీసీఐ ద్రవిడ్‌ను కోరింది. అయితే అతని నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో బీసీసీఐ పెద్దలు ప్రత్యామ్నాయాన్ని వెతికే పనిలో పడ్డారు. స్వదేశంలో ఆసీస్‌తో జరుగుతున్న సిరీస్‌కు తాత్కాలిక కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్‌కు బాధ్యతలు అప్పజెప్పిన బీసీసీఐ.. ఫుల్ టైమ్ కోచ్ వేటలో నిమగ్నమై ఉంది. ఈ క్రమంలోనే బీసీసీఐ పెద్దలు టీమిండియా మాజీ పేసర్, గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రాను కలిశారు. భారత్ జట్టు కోచింగ్ బాధ్యతలు స్వీకరించాలని ఆహ్వానించారు. అయితే ఈ ప్రతిపాదనను నెహ్రా తిరస్కరించినట్లు తెలుస్తుంది. తన ఐపీఎల్ కమిట్మెంట్ల కారణంగా ఈ పదవిని స్వీకరించలేనని చెప్పినట్లు వినికిడి. దీంతో గత్యంతరం లేక బీసీసీఐ మళ్లీ ద్రవిడ్‌నే సంప్రదించినట్లు సమాచారం. త్వరలో ప్రారంభమయ్యే దక్షిణాఫ్రికా పర్యటనలో భారత కోచ్‌గా వ్యవహరించాలని ద్రవిడ్‌కు కబురు పంపారని తెలుస్తుంది. దక్షిణాఫ్రికా పర్యటన కోసం అతనికి వీసా కూడా తీశారని సమాచారం. ఒకవేళ ద్రవిడ్ దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఓకే చెబితే కోచింగ్ స్టాఫ్‌గా విక్రమ్ రాథోడ్ (బ్యాటింగ్ కోచ్), పరాస్ మాంబ్రే (బౌలింగ్ కోచ్), టి దిలీప్ (ఫీల్డింగ్ కోచ్) ఉంటారని బీసీసీఐ స్పష్టం చేసింది. -
వాళ్లిద్దరు రిటైర్మెంట్ ప్రకటిస్తేనే తప్ప: ఆశిష్ నెహ్రా కీలక వ్యాఖ్యలు
Rohit Sharma- Virat Kohli: అంతర్జాతీయ టీ20 క్రికెట్లో టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి భవితవ్యంపై మాజీ బౌలర్ ఆశిష్ నెహ్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత ఫామ్ దృష్ట్యా వారిద్దరు ఇంకొన్నాళ్లు పొట్టి ఫార్మాట్లో కొనసాగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. కాగా గతేడాది ప్రపంచకప్-2022 తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, కోహ్లి ఇంటర్నేషనల్ క్రికెట్‌కు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. గత సీజన్లో ఐపీఎల్ ఆడిన ఈ ఇద్దరు స్టార్ బ్యాటర్లు.. టీమిండియా తరఫున మాత్రం ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఈ సీనియర్ ప్లేయర్ల గైర్హాజరీలో యువ ఆటగాళ్లు వరుస అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు సాగుతున్నారు. వచ్చే ఏడాది జరుగనున్న వరల్డ్‌కప్‌నకు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు. అంతర్జాతీయ టీ20లకు గుడ్‌బై? ఈ క్రమంలో వన్డే వరల్డ్‌కప్-2023 ముగిసిన తర్వాత.. 36 ఏళ్ల రోహిత్ అంతర్జాతీయ టీ20లకు పూర్తిగా దూరం కానున్నాడనే వార్తలు వస్తున్నాయి. 35 ఏళ్ల కోహ్లి కూడా పొట్టి ఫార్మాట్ నుంచి తప్పుకోవాలనే ఉద్దేశంతో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ వదంతులపై ఆశిష్ నెహ్రా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఒక క్యాలెండర్ ఇయర్లో విరాట్ కోహ్లి 800- 1000 పరుగులు చేస్తున్నాడు. ఇక రోహిత్ శర్మ బ్యాటింగ్ చూస్తుంటే ఏ సెలక్టర్ అయినా అతడి ఎంపిక విషయంలో టెంప్ట్ కాకుండా ఎలా ఉంటాడు? వాళ్లిద్దరు రిటైర్మెంట్ ప్రకటిస్తేనే తప్ప కోహ్లి, రోహిత్ ఈ ఫార్మాట్లో కొనసాగుతారో లేదో తెలియదు కానీ.. రెస్ట్ తీసుకోవాలని మాత్రం భావిస్తున్నారని చెప్పవచ్చు. తమకు తాముగా అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటిస్తేనే తప్ప.. వాళ్లను దూరం పెట్టే ప్రసక్తే లేదు. వాళ్లిద్దరు ఇంకొన్నాళ్లు పొట్టి ఫార్మాట్లో కొనసాగే సత్తా ఉన్న వాళ్లే’’ అని ఆశిష్ నెహ్రా అభిప్రాయపడ్డాడు. వైజాగ్ వేదికగా ఆస్ట్రేలియాతో టీమిండియా టీ20 సిరీస్ ఆరంభం సందర్భంగా ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. ఇక రోహిత్ శర్మ గైర్హాజరీ, హార్దిక్ పాండ్యా గాయం నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ తొలిసారి భారత టీ20 జట్టుకు సారథ్యం వహించాడు. ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపిన తొలి టీ20లో సూర్య సేన 2 వికెట్ల తేడాతో గెలిచింది. చదవండి: యూట్యూబర్‌ను పెళ్లాడిన టీమిండియా పేసర్.. సిరాజ్ విషెస్ -
‘టీమిండియా హెడ్‌కోచ్ పదవి వద్దు’.. ఆసక్తి లేదన్న మాజీ పేసర్! కారణం?
Team India Head Coach: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోచ్‌గా అవతారమెత్తిన టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా అనూహ్యరీతిలో ముందుకు దూసుకుపోతున్న విషయం విదితమే. అరంగేట్ర సీజన్లోనే గుజరాత్ టైటాన్స్‌ను జట్టును చాంపియన్‌గా నిలిపిన ఘనత అతడిది. మలి ప్రయత్నంలోనూ నెహ్రా మార్గదర్శనం చేసిన టీమ్ రన్నరప్‌గా నిలవడం విశేషం. టీమిండియా కోచ్ అయితే బాగుంటుంది ఈ నేపథ్యంలో నెహ్రా కోచింగ్ నైపుణ్యాలకు ఫిదా అయిన హర్భజన్ సింగ్ వంటి మాజీ క్రికెటర్లు భవిష్యత్తులో అతడికి టీమిండియా కోచింగ్ బాధ్యతలు అప్పజెపితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మాదిరే.. వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు కోచ్‌లను నియమిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని సూచించారు. ఈ క్రమంలో టీ20 ఫార్మాట్లో రాహుల్ ద్రవిడ్ కంటే ఎక్కువ అనుభవం ఉన్న నెహ్రాను పరిమిత ఓవర్ల కోచ్‌గా నియమించాలని భజ్జీ గతంలో సూచించాడు. ఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత టీమిండియా హెడ్‌కోచ్‌గా ద్రవిడ్ పదవీకాలం ముగియనుంది. తెరమీదకు నెహ్రా పేరు ఈ నేపథ్యంలో మెగా టోర్నీ తర్వాత అతడు కోచ్‌గా కొనసాగడానికి ఇష్టపడతాడా? లేదంటే బాధ్యతల నుంచి తప్పుకొంటాడా? అన్న సందేహాల నడుమ ఆశిష్ నెహ్రా పేరు తెరమీదకు వచ్చింది. ఒకవేళ ద్రవిడ్ కాంట్రాక్ట్ పునురుద్ధరించుకుంటే.. టెస్టు జట్టు కోచ్‌గా అతడు ఉంటే.. నెహ్రాకు వన్డే, టీ20 బాధ్యతలు అప్పగించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆసక్తి లేదన్న నెహ్రా! కారణమిదే ఈ క్రమంలో ఆశిష్ నెహ్రా మాత్రం తన సన్నిహితుల వద్ద.. తాను టీమిండియా హెడ్‌కోచ్ పదవిపై ఆసక్తిగా లేనని చెప్పినట్లు సమాచారం. గుజరాత్ టైటాన్స్‌తో 2025 వరకు ఒప్పందం ఉన్న కారణంగా ఈ మేరకు బీసీసీఐ పదవిని నెహ్రా తిరస్కరించే అవకాశం ఉన్నట్లు పీటీఐ కథనంలో పేర్కొంది. తొలి సీజన్లో ట్రోఫీ గెలిచి కాగా అహ్మదాబాద్ ఫ్రాంఛైజీకి చెందిన గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్-2022 సందర్భంగా క్యాష్ రిచ్‌లీగ్‌లో ఎంట్రీ ఇచ్చింది. టీమిండియా హార్దిక్ పాండ్యా సారథ్యంలో నెహ్రా మార్గదర్శనంలో తమ తొలి సీజన్లో టైటిల్ గెలిచి సత్తా చాటింది. ఇదిలా ఉంటే.. అక్టోబరు 5- నవంబరు 19 వరకు భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్-2023 జరుగనుంది. ఈ టోర్నీ ముగిసిన తర్వాతే ద్రవిడ్ కోచ్‌గా కొనసాగుతాడా లేదా అన్న విషయం తేలుతుంది. ఈలోపే ఇలా ఊహాగానాలు వెలువడటం గమనార్హం. చదవండి: WC 2023: తిలక్ ఉండగా అతడిని ఎలా సెలక్ట్ చేస్తారు: ఆసీస్ మాజీ క్రికెటర్ -
స్కూటీపై చక్కర్లు; ఆ ఇద్దరు గుజరాత్ బలం.. జాగ్రత్త
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా మరికొద్ది గంటల్లో సీఎస్కే, గుజరాత్ టైటాన్స్ ఫైనల్లో తలపడనున్నాయి. మరి ఫైనల్లో ఎవరు విజేత అనేది ఆసక్తికరంగా మారింది. సీఎస్కే ఐదోసారి ఛాంపియన్‌గా నిలిచి ముంబై ఇండియన్స్ రికార్డును సమం చేస్తుందా లేక గుజరాత్ టైటాన్స్ రెండోసారి టైటిల్ గెలుస్తుందా అనేది చూడాలి. ఈ విషయం పక్కనబెడితే.. గుజరాత్ టైటాన్స్ హెడ్‌కోచ్ ఆశిష్ నెహ్రా ఫైనల్ మ్యాచ్‌కు ముందు అహ్మదాబాద్‌లోని నరేంద్ర స్టేడియంలో స్కూటీపై చక్కర్లు కొట్టడం వైరల్‌గా మారింది, పైగా నెహ్రాకు తోడుగా స్కూటీపై మోహిత్ శర్మ, రషీద్ ఖాన్లు కూడా ఉండడం ఆసక్తి కలిగించింది. కాగా ఈ వీడియోనూ జియో సినిమా స్వయంగా ట్విటర్లో షేర్ చేస్తూ.. ''గుజరాత్ టైటాన్స్ ON Their Way To #IPLFinal Like..'' అంటూ క్యాప్షన్ జత చేసింది. ఇక గుజరాత్ టైటాన్స్‌కు బౌలింగ్ పెద్ద బలం అని చెప్పొచ్చు. పర్పుల్‌క్యాప్ రేసులో గుజరాత్ టైటాన్స్ నుంచే ముగ్గురు బౌలర్లు ఉండడం విశేషం. మహ్మద్ షమీ 28 వికెట్లతో టాప్‌లో ఉండగా.. రషీద్ ఖాన్ 27, మోహిత్ శర్మ 24 వికెట్లతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. వీడియో చూసిన అభిమానులు.. ''ఆ ఇద్దరు గుజరాత్ టైటాన్స్‌కు బలం.. కాస్త జాగ్రత్త'' అంటూ కామెంట్ చేశారు #GujaratTitans on their way to the #IPLFinal like... pic.twitter.com/nldijNxMR8 — JioCinema (@JioCinema) May 27, 2023 చదవండి: సీఎస్కే ఐదోసారి కొడుతుందా లేక గుజరాత్ డబుల్ ధమాకానా? -
గుజరాత్ గెలిచినా.. నెహ్రాలో కనిపించని సంతోషం
గుజరాత్ టైటాన్స్ కోచ్ ఆశిష్ నెహ్రా సోమవారం ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో జట్టు బ్యాటింగ్ ప్రదర్శనపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మ్యాచ్‌లో గిల్ సెంచరీ చేసినప్పటికి.. గుజరాత్ గెలిచినప్పటికి నెహ్రా మొహంలో మాత్రం సంతోషం కనిపించలేదు. అందుకు కారణం గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ ఆఖర్లో కుప్పకూలడమేనంట. తొలి ఇన్నింగ్స్ అనంతరం కెప్టెన్ పాండ్యాతో ఆశిష్ నెహ్రా డగౌట్లో నిలబడి సీరియస్‌గా చర్చించడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వాస్తవానికి ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. సాహా డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో గిల్-సాయికిషోర్‌లు వేగంగా ఆడుతూ రెండో వికెట్‌కు 14 ఓవర్లలోనే 147 పరుగులు జోడించారు. వీరి దూకుడు చూసి గుజరాత్ స్కోరు ఈజీగా 220-240 మధ్య ఉంటుందని భావించారు. కానీ సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. సెంచరీ కోసం గిల్ మెళ్లగా ఆడడం.. అదే సమయంలో చివరి ఆరు ఓవర్లలో కేవలం 41 పరుగులు మాత్రమే చేసి ఎనిమిది వికెట్లు కోల్పోయింది. అందులో నాలుగు వికెట్లు చివరి ఓవర్లో పోగొట్టుకోవడం గుజరాత్ బ్యాటింగ్ వీక్నెస్ను బయటపెట్టింది. ఇదే నెహ్రా కోపానికి కారణమయింది. గిల్ 58 బంతుల్లో సెంచరీ మార్క్ చేసి ఐపీఎల్లో తొలి సెంచరీ సాధించినప్పటికి నెహ్రా అభినందించకపోవడం కెమెరాలకు చిక్కింది. అంతేకాదు సాయికిషోర్, పాండ్యాలు ఔటయ్యాకా గుజరాత్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలడంపై నెహ్రా సీరియస్ అయ్యాడు. బ్యాటింగ్ విఫలంపై పాండ్యాతో చాలాసేపు చర్చించాడు. ఎందుకంటే నెహ్రా ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌ను సీరియస్‌గా తీసుకున్నాడు. ప్లేఆఫ్ చేరే క్రమంలో ప్రతీ మ్యాచ్ ముఖ్యం.. అందునా ఎస్ఆర్హెచ్ ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియదు కాబట్టే నెహ్రా అంత ఆగ్రహానికి లోనయ్యాడు. ఈ మ్యాచ్‌లో గెలిచిన గుజరాత్ టైటాన్స్ సీజన్లో ప్లేఆఫ్‌లో అడుగుపెట్టింది. అయితే ఇలాంటి బ్యాటింగ్‌తో టైటిల్ కొట్టలేమని పాండ్యాతో నెహ్రా అన్నట్లు తెలిసింది. అయితే పాండ్యా కూడా తమ బ్యాటింగ్ ఫెయిల్యూర్‌పై దృష్టి పెడుతామని నెహ్రాకు వివరించినట్లు తెలుస్తోంది. pic.twitter.com/huFccqaJzy — ChhalRaheHainMujhe (@ChhalRahaHuMain) May 16, 2023 చదవండి: 'చెప్పి మరి సిక్సర్ కొట్టడం సంతోషంగా అనిపించింది' -
ఆశిష్ నెహ్రా వల్లే ఇదంతా
-
ఒకప్పుడు పర్పుల్ క్యాప్ విన్నర్.. తర్వాత నెట్‌బౌలర్! 6.5 కోట్ల నుంచి 50 లక్షల ధరకు..
From Purple Cap To Net Bowler To IPL Return- Mohit Sharma Comeback Story: ‘‘ఎప్పుడెప్పుడు మైదానంలో అడుగుపెడతానా అన్న ఆతురత ఓవైపు.. చాలా ఏళ్ల తర్వాత పునరాగమనం చేస్తున్నా కదా.. పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో అన్న బెరుకు మరోవైపు.. వెన్ను నొప్పి నుంచి కోలుకున్న తర్వాత గతేడాది దేశవాళీ క్రికెట్ ఆడాను.. అతికొద్ది మందికి మాత్రమే నేను డొమెస్టిక్ క్రికెట్ ఆడుతున్నానని తెలుసు. వారిలో అషూ పా ఒకరు. అషూ పా నాకు కాల్ చేసి జట్టుతో కలిసి ప్రయాణం చేయాలని చెప్పారు. నాకు కూడా.. ‘‘ఇంట్లో కూర్చుని పెద్దగా చేసేది కూడా ఏం లేదు కదా’’ అని అనిపించింది. అందుకే ఇంట్లో ఖాళీగా ఉండే బదులు జట్టుతో ఉండాలని నిర్ణయించుకున్నా. గతేడాది గుజరాత్ టైటాన్స్ నెట్ బౌలర్‌గా సేవలు అందించా. నెట్ బౌలర్‌గా ఉండటం అవమానకరంగా భావించాల్సిన విషయమేమీ కాదు. పైగా మనకు కావాల్సినంత ఎక్స్పోజర్ దొరుకుతుంది. గుజరాత్ టైటాన్స్‌తో కలిసి పనిచేయడం అద్భుతంగా ఉంది’’ అని టీమిండియా పేసర్ మోహిత్ శర్మ అన్నాడు. ఐపీఎల్లో తన పునరాగమనానికి కారణం ఆశిష్ నెహ్రా భయ్యా అని చెప్పుకొచ్చాడు. అంతా ఆయన వల్లే టైటాన్స్ డ్రెస్సింగ్ రూంలో వాతావరణం ఎంతో బాగుంటుందని కోచ్ నెహ్రా, కెప్టెన్ హార్దిక్ పాండ్యా సహాయ సహకారాల వల్లే తను అనుకున్నది చేయగలిగానని తెలిపాడు. కాగా గతంలో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన మోహిత్ శర్మ 2014 సీజన్లో పర్పుల్ క్యాప్ గెలిచాడు. సీఎస్కే తరఫున 16 మ్యాచ్‌లలో 23 వికెట్లు పడగొట్టి ఆ ఏడాది అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు. చెన్నైకి ప్రాతినిథ్యం వహిస్తూ తన ప్రతిభను నిరూపించుకున్న ఈ ఫాస్ట్‌బౌలర్ 2015 వరల్డ్‌కప్ జట్టుకు ఎంపికయ్యాడు కూడా! పర్పుల్ క్యాప్ విన్నర్ నుంచి నెట్ బౌలర్‌గా చివరిగా.. 2015లో టీమిండియాకు ఆడిన ఈ హర్యానా బౌలర్ ఐపీఎల్-2020 సీజన్ తర్వాత క్యాష్ రిచ్ లీగ్‌కు కూడా దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో గతేడాది గుజరాత్ టైటాన్స్‌కు నెట్ బౌలర్‌గా ఉన్న మోహిత్ శర్మ.. ఆశిష్ నెహ్రా సూచన మేరకు దేశవాళీ క్రికెట్లో ఆటను కొనసాగించాడు. ఘనంగా పునరాగమనం ఈ క్రమంలో ఐపీఎల్-2023లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌తో గుజరాత్ తరఫున అరంగేట్రం చేస్తూ ఐపీఎల్లో రీఎంట్రీ ఇచ్చాడు. వచ్చీ రాగానే తన సత్తా ఏమిటో మరోసారి నిరూపించుకున్నాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లో మొత్తంగా నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసిన మోహిత్.. 18 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు పంజాబ్ వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ(25), ఆల్‌రౌండర్ సామ్ కర్రన్ (22)లను అవుట్ చేశాడు. తద్వారా పంజాబ్‌ను తక్కువ స్కోరుకు కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. జట్టు విజయంలో తన వంతు సాయం అందించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అప్పుడు ఆరున్నర కోట్లు.. ఇప్పుడు 50 లక్షలు ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. తన రీఎంట్రీ, విజయం వెనుక ఆశిష్ నెహ్రా సహకారం ఉందంటూ కృతజ్ఞతా భావం చాటుకున్నాడు మోహిత్ శర్మ. కాగా 2016లో 6.5 కోట్ల రూపాయల(కింగ్స్ ఎలెవన్)కు అమ్ముడుపోయిన రైట్ఆర్మ్ మీడియం పేసర్ మోహిత్‌ను.. గుజరాత్ ఈ ఏడాది మినీ వేలంలో 50 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది. స్టార్ బౌలర్‌గా భారీ ధర పలికిన మోహిత్.. నెట్ బౌలర్‌గా పనిచేసి ప్రస్తుతం 50 లక్షల ప్లేయర్‌గా మారడం గమనార్హం. ఏదేమైనా గుజరాత్ టైటాన్స్ రూపంలో వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటే మోహిత్‌కు పూర్వ వైభవం వచ్చే దాఖలాలు లేకపోలేదు. పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ స్కోర్లు టాస్: గుజరాత్- బౌలింగ్ పంజాబ్: 153/8 (20) గుజరాత్: 154/4 (19.5) విజేత: గుజరాత్ టైటాన్స్.. 6 వికెట్ల తేడాతో గెలుపు చదవండి: కేకేఆర్‌తో మ్యాచ్.. 13 కోట్ల ఆటగాడికి నో ఛాన్స్! సన్‌రైజర్స్ తుది జట్టు ఇదే An impressive Mohit Sharma debut for #GT ✅ An elegant Shubman Gill half-century ✅ A Trademark Tewatia Finish ✅ We have got the #PBKSvGT clash summed up for you 📽️🔽 #TATAIPL pic.twitter.com/RhpipfO2Ze — IndianPremierLeague (@IPL) April 14, 2023 -
జీరో నుండి హీరోగా 3D ప్లేయర్ విజయ్ శంకర్...సీక్రెట్ ఏంటి?
-
#VijayShankar: ఎంత మార్పు.. అంతా నెహ్రా చలవేనట!
ఐపీఎల్ 16వ సీజన్లో గుజరాత్ టైటాన్స్ ఆల్‌రౌండర్ విజయ్‌శంకర్ మంచి జోరుమీద ఉన్నాడు. గత సీజన్లకు భిన్నంగా అతని బ్యాటింగ్ సాగుతుంది. తాజాగా ఆదివారం కేకేఆర్‌తో మ్యాచ్‌లో విజయ్ శంకర్ పూనకం వచ్చినట్లుగా చెలరేగాడు. కేవలం 21 బంతుల్లోనే అర్థశతకం మార్క్ అందుకున్న విజయ్ శంకర్ ఓవరాల్‌గా 24 బంతుల్లోనే 63 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలో గుజరాత్ టైటాన్స్ తరపున ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. Photo: IPL Twitter అయితే ఒకప్పుడు విజయ్ శంకర్ వేరు. క్రీజులో కుదురుకునే వరకు బంతులు తింటాడనే పేరు బలంగా వినిపించేది. గతంలో ఎస్ఆర్హెచ్లో ఉన్నప్పుడు విజయ్ శంకర్ ఒక్క మ్యాచ్‌లో కూడా మెరిసింది లేదు. టీమిండియాలోకి కూడా ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. అలా అని అతనిలో టాలెంట్ లేదని కాదు.. ఉంది కానీ బయటపెట్టడంలో ఇబ్బందులు ఎదుర్కొనేవాడు. పైగా త్రీడీ ప్లేయర్ అంటూ అందరు అతన్ని ట్రోల్ చేసేవారు. అంతలా ట్రోల్స్ బారిన పడ్డ విజయ్ శంకర్ ఈ సీజన్లో మాత్రం కాస్త కొత్తగా కనిపిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ తన ఇంపాక్ట్‌ను బలంగా చూపించాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఎలా ఆడినా.. ఇవాళ కేకేఆర్‌తో మ్యాచ్‌లో మాత్రం తన బ్యాటింగ్ పవర్‌ను ప్రదర్శించాడు విజయ్ శంకర్. Photo: IPL Twitter మరి ఇంతలా విజయ్ శంకర్ బ్యాటింగ్ మారడానికి కారణం గుజరాత్ టైటాన్స్ కోచ్ ఆశిష్ నెహ్రానే అని అభిమానులు ట్విటర్లో పేర్కొన్నారు. నిజానికి గత సీజన్లోనే విజయ్ శంకర్‌ను గుజరాత్ టైటాన్స్ రూ. 1.4 కోట్లకు కొనుగోలు చేసింది. విజయ్ శంకర్‌ను కొనుగోలు చేయడం వెనుకు పరోక్షంగా నెహ్రా హస్తం ఉన్నట్లు తేలింది. గత సీజన్లో అక్కడక్కడా మెరిసిన విజయ్ శంకర్‌ను కరెక్ట్‌గా వాడితే ప్రయోజనం ఉంటుందని కోచ్ నెహ్రా నమ్మాడు. అందుకు తగ్గట్లే విజయ్ శంకర్ తన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. గతేడాది మినీ వేలానికి ముందు విజయ్ శంకర్‌ను రిటైన్ చేసుకున్న తర్వాత ఒక మీడియా సమావేశంలో ఆశిష్ నెహ్రా మాట్లాడాడు.'' విజయ్ శంకర్‌ను వెనుకేసుకు రావడానికి ఒక కారణం ఉంది. అతను టీమిండియాకు ఆడాడు. అతనిలో ఏదో తెలియని టాలెంట్ దాగుంది. దానిని వెలికితీయాలనుకుంటున్నా.. అవకాశాలు ఇస్తేనే కదా తెలిసేది.. ఏదో ఒకరోజు తనను తాను నిరూపించుకుంటాడు.. ఆ నమ్మకం నాకుంది.. అంటూ పేర్కొన్నాడు. తాజాగా ఆశిష్ నెహ్రా వ్యాఖ్యలు నిజమయ్యాయి ఇక తొలి ఇన్నింగ్స్ అనంతరం విజయ్ శంకర్ మాట్లాడుతూ.. ''ఈ సీజన్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నా. కొందరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునే పనిలో ఉన్నా. గతేడాది నాకు కలిసి రాలేదు. కానీ ఈ ఏడాది డొమొస్టిక్ సీజన్లో చాలా పరుగులు చేశాను. ఫ్రాంచైజీ నన్ను రిటైన్ చేసుకోవడంతోనే వారు నాపై కాన్ఫిడెంట్‌గా ఉన్నారని అర్థమైంది. ఒకప్పుడు వరల్డ్‌కప్‌లో గాయపడిన నేను ఆ తర్వాత ఐపీఎల్లో ఘోరంగా విఫలమయ్యాను. ఈ ప్రదర్శనతో టీమిండియాలోకి తిరిగి వస్తాననేది చెప్పలేను. అవకాశమొస్తే మాత్రం వదులుకోను. ఇక కోచ్ ఆశిష్ నెహ్రా మద్దతు నాకు చాలా ఉంది. అతను నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నా గత ఐపీఎల్ తర్వాత నాకు సర్జరీ అయింది. ఆ తర్వాత కొన్ని నెలల పాటు ఆటకు దూరంగా ఉండాల్సి వచ్చింది. దేశవాలీ క్రికెట్లో రాణించి మళ్లీ ఫామ్‌ను అందుకున్నా'' అంటూ ముగించాడు. 𝐒𝐇𝐀𝐍𝐊𝐀𝐑 𝐏𝐎𝐖𝐄𝐑 💪💥 The ball flew to all parts of Motera as Vijay Shankar powered @gujarat_titans to their 𝐡𝐢𝐠𝐡𝐞𝐬𝐭-𝐞𝐯𝐞𝐫 #TATAIPL total 😱 Enjoy the chase in #GTvKKR, LIVE & FREE with #IPLonJioCinema - for all telecom operators!#IPL2023 | @vijayshankar260 pic.twitter.com/3fGqVAW2vj — JioCinema (@JioCinema) April 9, 2023 This man's magical powers have brought out a different Vijay Shankar to the IPL 🙏🏼 pic.twitter.com/B9suXfzODv — Saurabh Malhotra (@MalhotraSaurabh) April 9, 2023 Vijay Shankar unleashed pic.twitter.com/oElwVsvDEp — Ethical Joker (Perry's version) (@Jokeresque_) April 9, 2023 -
టీ20 జట్టు కోచ్‌గా ద్రవిడ్ కంటే అతనే బెటర్..!
టీమిండియా కోచ్ పదవిపై టీమిండియా మాజీ స్పిన్నర్, ప్రస్తుత ఎంపీ హర్భజన్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. భారత టీ20 జట్టు కోచ్‌గా తన మాజీ సహచరుడు ఆశిష్ నెహ్రా అయితే బెటర్‌గా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను తక్కువ చేయాలన్నది తన ఉద్దేశం కాదని, నెహ్రా అయితే టీ20 జట్టు కోచ్ పదవికి పూర్తి న్యాయం చేయగలడని భావిస్తున్నానని మనసులో మాటను బయటపెట్టాడు. నెహ్రాకు పొట్టి ఫార్మాట్‌పై మంచి పట్టు ఉందని, కెరీర్ చరమాంకంలో అతను టీ20ల్లో అద్భుతంగా రాణించాడని, కేవలం ఇదే కారణంగానే ద్రవిడ్ బదులు నెహ్రాకు తను ఓటు వేస్తానని చెప్పుకొచ్చాడు. మూడు ఫార్మాట్లకు ముగ్గురు వేర్వేరు కోచ్‌ల ప్రతిపాదన తెరపైకి వస్తున్న నేపథ్యంలో.. తన అభిప్రాయాన్ని మాత్రమే వెల్లడించానని, ఇందులో ఎవ్వరినీ కించపరచాలన్నది తన ఉద్దేశం కాదని అన్నాడు. ఒకవేళ బీసీసీఐ ముగ్గురు కోచ్‌ల ప్రతిపాదనకు అంగీకారం తెలిపితే.. ద్రవిడ్‌తో పాటు నెహ్రాకు అవకాశం కల్పిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. సుదీర్ఘ ఫార్మాట్లో అపార అనుభవమున్న ద్రవిడ్‌ను భారత టెస్ట్ జట్టు కోచ్‌గా, నెహ్రాను టీ20 టీమ్ కోచ్‌గా నియమిస్తే..భారత్‌కు రెండు ఫార్మాట్లలో తిరుగుండదని అన్నాడు. ఇదే సందర్భంగా సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్‌పై కూడా భజ్జీ స్పందించాడు. మొదటి మూడూ స్థానాల్లో వచ్చే వీరు స్ట్రయిక్ రేట్ మరింత పెంచుకోవాలని, తద్వారా 4, 5 స్థానాల్లో వచ్చే బ్యాటర్లపై ఒత్తిడి తగ్గుతుందని సూచించాడు. కాగా, టీ20 వరల్డ్‌కప్-2022లో భారత్ సెమీస్‌లో నిష్క్రమించాక కోచ్‌తో సహా జట్టు మొత్తాన్ని ప్రక్షాళన చేయాలని అభిమానులు, విశ్లేషకులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. 2024 టీ20 వరల్డ్‌కప్ నేపథ్యంలో ఇప్పటినుంచే కొత్తవారికి అవకాశం కల్పించేందుకు సీనియర్లను ఈ ఫార్మాట్ నుంచి తప్పించాలని, కోచ్‌గా ద్రవిడ్ కూడా ఈ ఫార్మాట్‌కు సూట్ కావట్లేదని అభిమానులు చర్చించుకుంటున్నారు. -
హార్దిక్ పూర్తిగా మారిపోయాడు.. ఈ మార్పునకు కారణం అతడే: మాజీ పేసర్
Asia Cup 2022- Hardik Pandya: ‘‘కాలం.. అనుభవం మనిషికి అన్ని విషయాలు నేర్పిస్తాయి. ఇందుకు పాండ్యా కూడా అతీతుడు కాడు. వ్యక్తిగా.. ఆటగాడిగా తనలో వచ్చిన మార్పులను నేను స్పష్టంగా చూశాను’’ అని టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా అన్నాడు. భారత జట్టు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడు. తండ్రిగా మారిన తర్వాత హార్దిక్ పరిణితి చెందాడని.. ఆటపై మరింత దృష్టి సారించాడని పేర్కొన్నాడు. చేదు అనుభవాలు ఎదుర్కొని.. కాగా గడ్డు పరిస్థితులను దాటుకుని ఐపీఎల్-2022లో గుజరాత్ టైటాన్స్ ఫ్రాంఛైజీ ఇచ్చిన అవకాశంతో మరోసాని తానేంటో నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్యా. అదే జోష్‌లో రెట్టించిన ఉత్సాహంతో కెరీర్లో ముందుకు సాగున్నాడు. అరంగేట్ర సీజన్లోనే గుజరాత్‌ను టైటిల్ విజేతగా నిలిపిన కెప్టెన్‌గా ఘనత వహించి.. టీమిండియాలో పునరగామనం చేశాడు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీ టీ20 ఫార్మాట్లో ఏకంగా టీమిండియా పగ్గాలు చేపట్టి వరుస విజయాలు నమోదు చేశాడు. అంతేకాదు.. ఆసియాకప్-2022లో భాగంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో భారత్ గెలుపులో కీలక పాత్ర పోషించి తన విలువ చాటుకున్నాడు. అయితే, గతంలో మాదిరి మరీ దూకుడుగా కాకుండా.. వివాదాల జోలికి పోకుండా.. కాస్త కామ్‌గా ఉంటూనే తన పనిని తాను చక్కబెట్టుకుంటున్నాడు. ఆశిష్ నెహ్రా, హార్దిక్ పాండ్యా(PC: IPL/BCCI) ఒకేలా ఉంటానంటే కుదరదు! ఈ నేపథ్యంలో.. గుజరాత్ టైటాన్స్ కోచ్‌గా హార్దిక్‌కు మరింత సన్నిహితంగా మెలిగిన ఆశిష్ నెహ్రా.. తమ కెప్టెన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కొడుకు అగస్త్య రాకతో హార్దిక్ పూర్తిగా మారిపోయాడన్నాడు. ఐసీసీ వీడియోలో మాట్లాడుతూ.. ‘‘మనిషికి మార్పు అవసరం. అన్ని పరిస్థితుల్లోనూ ఒకేలా ఉంటానంటే కుదరదు. పాండ్యా విషయంలోనూ అదే జరిగింది. అగస్త్య వచ్చాకే! అనుభం తనకు చాలా నేర్పిందన్న విషయాన్ని అతడే స్వయంగా పలు సందర్భాల్లో చెప్పాడు కూడా! తను ఇప్పుడు వివాహితుడు.. ఓ బిడ్డకు తండ్రి.. అలాగే పరిణితి కలిగిన వ్యక్తి. నిజంగా అగస్త్య రాకతో తను చాలా మారిపోయాడు. తన పని ఏమిటో తాను చూసుకుంటూ.. కెరీర్‌పై మరింత దృష్టి సారించాడు. ఈ విషయాలను నేను దగ్గరగా గమనించాను’’ అని హార్దిక్ పాండ్యా గురించి నెహ్రా చెప్పుకొచ్చాడు. భార్య నటాషా, కొడుకు అగస్త్యతో పాండ్యా(PC: Natasa instagram ) ఇక పాండ్యా వయసు ఇంకా 28 ఏళ్లేనన్న నెహ్రా.. ఆటను ఇలాగే కొనసాగిస్తే.. కెరీర్ మరింత ఉజ్వలంగా సాగుతుందన్నాడు. కఠిన శ్రమకు ఓర్వడంతో పాటుగా నైపుణ్యాలకు ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుకునే తత్వం గలవాడని హార్దిక్‌ను కొనియాడాడు. కాగా హార్దిక్ పాండ్యా సెర్బియన్ మోడల్ నటాషాను పెళ్లాడాడు. వీరికి కొడుకు అగస్త్య సంతానం. ఇక హార్దిక్‌కు తన కొడుకంటే పంచప్రాణాలు. ఆట నుంచి విరామం దొరికితే కుటుంబానికే మొత్తం సమయం కేటాయిస్తాడు పాండ్యా. భార్య నటాషా, కొడుకు అగస్త్యతో పాండ్యా(PC: Natasa instagram ) చదవండి: Nazibulla Zardan: ఆరు సిక్సర్లతో ప్రపంచ రికార్డు సాధించిన అఫ్గన్ బ్యాటర్ Asia Cup 2022: శ్రీలంకతో మ్యాచ్! మాకు చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4771481161.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'టీ20 ప్రపంచకప్ భారత జట్టులో అతడికి చోటు దక్కదు'
ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు భారత్ ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న టీ20 సిరీస్‌కు యువ ఆటగాళ్లకి బీసీసీఐ అవకాశం ఇచ్చింది. ఉమ్రాన్ మాలిక్, ఆర్ష్‌దీప్ సింగ్,ఆవేష్ ఖాన్ వంటి యువ పేసర్లు జట్టులోకి వచ్చారు. టీ20 ప్రపంచకప్ జట్టులో వెటరన్ పేసర్ మహ్మద్ షమీ స్థానం సందిగ్థంలో పడింది. అదే విధంగా హార్షల్ పటేల్,ఆవేష్ ఖాన్ వంటి యువ పేసర్ల నుంచి షమీకి గట్టి పోటీ ఎదురుకానుంది. ఈ నేపథ్యంలో భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా ఆసక్తికర వాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్‌కు షమీకి చోటు దక్కకపోయినా.. వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు అతడు జట్టులో ఖచ్చితంగా ఉండాలని నెహ్రా తెలిపాడు. ఇక స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న టీ20 సిరీస్‌కు షమీకి సెలెక్టెర్లు విశ్రాంతి ఇచ్చారు. "టీ20 ప్రపంచకప్ కోసం భారత ప్రణాళికలో షమీ లేనట్లు కనిపిస్తోంది. ఒక వేళ అతడిని ఎంపిక చేసినా.. అద్భుతంగా రాణిస్తాడు. అతడు టెస్టు, వన్డే క్రికెట్ ఆడుతూనే ఉంటాడు. క ఈ మెగా టోర్నమెంట్లో యువ ఆటగాళ్లకి అవకాశం ఇచ్చినా..వచ్చే ఏడాది జరిగే 50 ఓవర్ల ప్రపంచకప్‌కు అతడిని తప్పకుండా ఎంపిక చేయాలి. ఐపీఎల్ తర్వాత షమీ విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే ఈ ఏడాదిలో పెద్దగా వన్డే సిరీస్‌లు లేవు. ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టు మ్యాచ్ తర్వాత జరగునున్న వన్డే సిరీస్‌కు షమీకి చోటు దక్కవచ్చు. ఇంగ్లండ్ వంటి మేటి జట్టును ఓడించాలంటే ఖఛ్చితంగా షమీ లాంటి బౌలర్ జట్టులో ఉండాలి" అని నెహ్రా పేర్కొన్నాడు. చదవండి: T20 World Cup2022: 'భారత్ ప్రపంచకప్ గెలవాలంటే అతడు ఖచ్చితంగా జట్టులో ఉండాలి' -
IPL 2022: ఐపీఎల్ అత్యుత్తమ కోచ్‌లలో తనూ ఒకడు! ఎందుకంటే!
IPL 2022- Gujarat Titans: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ గుజరాత్ టైటాన్స్ హెడ్‌కోచ్ ఆశిష్ నెహ్రాపై ఆ జట్టు మెంటార్ గ్యారీ కిర్‌స్టన్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతడు ఏ పనిచేసినా మనసు పెట్టి అంకితభావంతో పూర్తి చేస్తాడని కితాబిచ్చాడు. నెహ్రాతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్న కిర్‌స్టన్.. ఐపీఎల్‌లోని బెస్ట్ కోచ్‌లలో అతడూ ఒకడంటూ ఆకాశానికెత్తాడు. ఆశిష్ నెహ్రా మార్గదర్శనంలోని కొత్త ఫ్రాంఛైజీ గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్-2022లో అదరగొట్టిన సంగతి తెలిసిందే. అరంగేట్ర సీజన్లోనే లీగ్ దశలో టాపర్‌గా నిలిచి.. ఆపై రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన ఫైనల్లోనూ సత్తా చాటింది. క్యాష్ రిచ్ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చిన తొలి ఎడిషన్‌లోనే ట్రోఫీని ముద్దాడి మధుర జ్ఞాపకంగా మిగుల్చుకుంది. గుజరాత్ టైటిల్ గెలవడంలో గ్యారీ కిర్‌స్టన్, నెహ్రాదే కీలక పాత్ర అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐసీసీ వరల్డ్‌కప్-2011 సమయంలో టీమిండియా కోచ్‌గా ఉన్న కిర్‌స్టన్, అప్పటి భారత జట్టులో సభ్యుడైన ఆశిష్ నెహ్రా 2018లో ఆర్సీబీ కోచింగ్ సిబ్బందిలో భాగమయ్యారు. ఆ తర్వాత ఐపీఎల్-2022లో గుజరాత్ టైటాన్స్ హెడ్‌కోచ్‌గా నెహ్రా బాధ్యతలు స్వీకరిస్తే.. మెంటార్‌గా కిర్‌స్టన్ సేవలు అందించాడు. ఈ నేపథ్యంలో గ్యారీ కిర్‌స్టన్ క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ.. ‘‘ఆశిష్ నాకు ప్రాణ స్నేహితుడు. మా ఇద్దరిది సుదీర్ఘ ప్రయాణం. ఆటను అర్థం చేసుకోవడంలో.. అత్యంత ప్రొఫెషనల్‌గా వ్యవహరించడంలో తనకు తానే సాటి. తను మనసు పెట్టి పని చేస్తాడు. కోచ్‌గా కూడా అంతే! ఎల్లప్పుడూ తన జట్టులోని ఆటగాళ్ల గురించి, వాళ్లకు మెలకువలు నేర్పడం గురించే ఆలోచిస్తూ ఉంటాడు. తను ఎప్పుడూ లో ప్రొఫైల్‌లోనే ఉంటాడు. అందరి దృష్టిలో పడాలనుకోవడం తనకు పెద్దగా ఇష్టం ఉండదు. అత్యంత నేర్పరులుగా వ్యవహరించే ఐపీఎల్ అత్యుత్తమ కోచ్‌లలో ఆశిష్ నెహ్రా కూడా ఒకడు’’ అని నెహ్రాపై ప్రశంసల వర్షం కురిపించాడు. చదవండి 👇 IPL 2023: ఏడు కోట్లా! అంత సీన్ లేదు! సిరాజ్‌ను వదిలేస్తే.. చీప్‌గానే కొనుక్కోవచ్చు! వైభవంగా టీమిండియా క్రికెటర్ పెళ్లి.. ఫోటోలు వైరల్ Kal ki yeh yaadgar shaam, aap ke pyaar aur support ke naam 🥰😁 Jald lautenge, tab tak khayal rakhna Amdavad 💙#SeasonOfFirsts #AavaDe pic.twitter.com/IMgH0izYAL — Gujarat Titans (@gujarat_titans) May 31, 2022 -
IPL 2022: క్రెడిట్ మొత్తం ఆయనకేనన్న హార్దిక్.. అంతా అబద్ధం!
IPL 2022 Winner GT: ‘‘మొదటి సీజన్లోనే మనం సిక్సర్ కొట్టాము. చాంపియన్లుగా నిలిచాం. ఇది మనకు గర్వకారణం. మన బ్యాటింగ్, బౌలింగ్ విభాగం మరీ అంత గొప్పగా ఏమీ లేదని చాలా మంది అన్నారు. అయినా మనం ట్రోఫీ గెలిచాం. నిజంగా ఇది చాలా బాగుంది కదా’’ అని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. తమ కోచ్ ఆశిష్ నెహ్రాతో ముచ్చటిస్తూ ఐపీఎల్-2022లో తమ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నాడు. కాగా కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ ఆరంభం నుంచి ఆధిక్యం కనబరిచి.. రాజస్తాన్ రాయల్స్‌తో ఫైనల్ మ్యాచ్‌లో గెలుపొంది ట్రోఫీ కైవసం చేసుకుంది. దీంతో తమ మొదటి సీజన్లోనే టైటిల్ సాధించి చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ఆశిష్ నెహ్రా- హార్దిక్ పాండ్యా సరదాగా ముచ్చటించారు. ఈ క్రమంలో ఆశిష్ నెహ్రాపై పాండ్యా ప్రశంసలు కురిపించాడు. ‘‘మాలో మొదట ప్రాక్టీసుకు వెళ్లేది నెహ్రా. 20 నిమిషాల సమయం ఉన్నా సరే ప్రాక్టీసు అయిపోయినా మళ్లీ మళ్లీ బ్యాటింగ్ చేయమంటారు. నిజానికి ఈ క్రెడిట్ మొత్తం ఆయనకే దక్కుతుంది. అంకితభావంతో పనిచేశారు. మాలో ప్రతి ఒక్కరు హార్డ్‌వర్క్ చేసేలా ప్రోత్సహించారు’’ అని చెప్పుకొచ్చాడు. అయితే, హార్దిక్ పాండ్యా మాటలకు మొహమాటపడిన నెహ్రా.. ‘‘ఇదంతా అబద్ధం’’ అంటూ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అబద్ధం కాదు నిజమే! హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా, టీమ్ డైరెక్టర్ విక్రమ్ సోలంకి వేలం రోజు నుంచి గుజరాత్ విజేతగా నిలిచే క్రమంలో తమదైన రీతిలో జట్టును తీర్చిదిద్దారు. లీగ్ సాగినంత కాలం జట్టు యాజమాన్యం ‘సీవీసీ క్యాపిటల్స్’ నుంచి ఒక్క వ్యక్తి కూడా ‘చిత్రం’లో ఎక్కడా కనిపించలేదు. అంతా వీరిద్దరికే అప్పగించారు. బ్యాటింగ్ కోచ్‌గా గ్యారీ కిర్‌స్టెన్ ఉన్నా... నిర్ణయాత్మక పాత్ర పై ఇద్దరిదే. చాలా మంది కోచ్‌లతో పోలిస్తే పూర్తి భిన్నమైన శైలితో నెహ్రా పని చేశాడు. ఆధునిక కోచ్‌ల తరహాలో చేతిలో పెన్నూ, పేపర్‌తో నోట్స్ రాసుకోవడం, ప్రతీ దానిని విశ్లేషణాత్మకంగా చూడటం అతను ఎప్పుడూ చేయలేదు. తాను చెప్పదల్చుకున్న అంశంపై డ్రెస్సింగ్ రూమ్‌లోనే ఒకే ఒక స్పష్టతనిచ్చేయడం, అమలు చేసే అంశాన్ని ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆటగాళ్లకే వదిలేసి పూర్తి స్వేచ్ఛనిచ్చాడు. సరిగ్గా చూస్తే గుజరాత్ టైటాన్స్ టీమ్‌లో ఫలానా ఆటగాడు ఘోరంగా విఫలమయ్యాడని ఒక్కరిని కూడా వేలెత్తి చూపలేం! వేలంలో 37 మంది పేర్లు వచ్చినప్పుడు గుజరాత్ పోటీ పడినా... చివరకు తమ అవసరాలను అనుగుణంగా కచ్చితంగా ఎంచుకుంటూ 20 మందినే తీసుకోవడంలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ సోలంకిదే ముఖ్య భూమిక. ఆటతో పాటు అన్నీ కలిసొచ్చిన గుజరాత్ సొంత అభిమానుల సమక్షంలో ఐపీఎల్ ట్రోఫీని అందుకోగలిగింది. ఐపీఎల్-2022: గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్ ►టాస్: రాజస్తాన్ ►రాజస్తాన్ స్కోరు: 130/9 (20) ►గుజరాత్ స్కోరు: 133/3 (18.1) ►విజేత: ఏడు వికెట్ల తేడాతో గెలిచి ఐపీఎల్-2022 చాంపియన్‌గా గుజరాత్ ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: హార్దిక్ పాండ్యా(4 ఓవర్లలో 17 పరుగులు ఇచ్చి 3 వికెట్లు, 30 బంతుల్లో 34 పరుగులు) చదవండి 👇 IPL 2022 Final Prize Money, Awards: ఐపీఎల్ ‘విజేతలు’.. ఎవరెవరి ప్రైజ్‌మనీ ఎంతంటే! Hardik Pandya-Natasa Stankovic:'అవమానాలు తట్టుకుని నా భర్త విజయం సాధించాడు.. అందుకే' View this post on Instagram A post shared by IPL (@iplt20) Let's ꜱᴀᴠᴇ this forever, #TitansFAM! 💙pic.twitter.com/66X3QqQXH7 — Gujarat Titans (@gujarat_titans) May 29, 2022 -
బుమ్రాను ఆడించడం ఏమిటి.. నిజంగా ఆశ్చర్యపోయా.. వాళ్ల సంగతి ఏంటి?
India Vs Sri Lanka T20 Series: శ్రీలంకతో టీ20 సిరీస్‌లో టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ఆడించడం పట్ల భారత మాజీ ఫాస్ట్‌బౌలర్ ఆశిష్ నెహ్రా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. టీ20 ప్రపంచకప్-2022 సమీపిస్తున్న తరుణంలో ప్రయోగాలు చేయాల్సి ఉందని, మిగతా ఆప్షన్లు కూడా పరిశీలించాలని అభిప్రాయపడ్డాడు. ఇక శ్రీలంకతో రెండు టెస్టులు ఆడాల్సి ఉన్న నేపథ్యంలో బుమ్రాకు విశ్రాంతినిచ్చి ఉంటే బాగుండేదని పేర్కొన్నాడు. ఈ మేరకు నెహ్రా క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ... ‘‘శ్రీలంకతో టీ20 సిరీస్‌లో బుమ్రాను ఆడించడం నాకు ఆశ్చర్యం కలిగించింది. భారత జట్టులో చాలా మంది ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. వారికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలి. భువనేశ్వర్ కుమార్, మహ్మద్ సిరాజ్ ఉన్నారు. ఇక ఆవేశ్ ఖాన్ కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. బుమ్రా జట్టులోకి వస్తే వీరిలో చాలా మంది బెంచ్‌కే పరిమితం కావాల్సి వస్తుంది. మెగా టోర్నీకి సన్నద్ధమయ్యే క్రమంలో అన్ని ఆప్షన్లు పరిశీలించాల్సి ఉంటుంది’’ అని పేర్కొన్నాడు. ఇక స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా పునరాగమనం సంతోషం కలిగిచిందన్న నెహ్రా... ‘‘జడేజా జట్టులోకి తిరిగి రావడం సంతోషాన్నిచ్చింది. అన్ని ఫార్మాట్లలో అతడు మెరుగ్గా రాణించగలడు. బ్యాటింగ్ పరంగా ఎంతో మెరుగయ్యాడు. ఏడు లేదంటే ఎనిమిదో స్థానంలో కాదు.. ఆరో స్థానంలో కూడా బ్యాటింగ్ చేయగల సత్తా అతడికి ఉంది’’ అని ప్రశంసలు కురిపించాడు. కాగా శ్రీలంకతో మొదటి టీ20లో భారత్ 62 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బుమ్రా 3 ఓవర్లు బౌలింగ్ చేసి 19 పరుగులు ఇవ్వగా... జడేజా 4 ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 3 పరుగులతో అజేయంగా నిలిచాడు. చదవండి: Ravindra Jadeja: రీఎంట్రీ ఇచ్చాడు.. 'తగ్గేదేలే' అన్నాడు.. వీడియో వైరల్ -
IPL 2022: అహ్మదాబాద్ హెడ్ కోచ్‌గా టీమిండియా మాజీ పేసర్..!
Ashish Nehra: ఐపీఎల్ 2022 ద్వారా క్యాష్ రిచ్ లీగ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్న అహ్మదాబాద్ ఫ్రాంఛైజీ.. జట్టు హెడ్ కోచ్, సహాయక సిబ్బంది విషయంలో ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. జట్టు హెడ్ కోచ్‌గా టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రాని, మెంటార్‌గా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు, టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టన్‌ను ఎంచుకున్నట్టు సమాచారం. ఈ ఇద్దరి ఎంపిక లాంఛనమేనని ఫ్రాంఛైజీ వర్గాలు ద్వారా తెలుస్తోంది. మరోవైపు కోచ్, సహాయక సిబ్బందిని ఎంచుకునే విషయంలో మరో అరంగేట్రం జట్టు లక్నో ఓ రెండు అడుగులు ముందే ఉంది. ఆ జట్టు తమ ఫ్రాంఛైజీ హెడ్ కోచ్‌గా జింబాబ్వే మాజీ ఆటగాడు ఆండీ ఫ్లవర్‌ను, మెంటర్‌గా టీమిండియా మాజీ ఓపెనర్, ప్రస్తుతం ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్‌ను ఎంపిక చేసుకుంది. కాగా, లక్నో జట్టును ఆర్పీఎస్జీ గోయెంకా గ్రూప్ గ్రూప్ రూ.7090 కోట్లకు కొనుగోలు చేస్తే, అహ్మదాబాద్ ఫ్రాంఛైజీని సీవీసీ క్యాపిటల్ రూ.5625 కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఐపీఎల్లో ఈ రెండు జట్లు చేరడంతో మొత్తం ఐపీఎల్ జట్ల సంఖ్య 8కి చేరింది. చదవండి: కుంబ్లే సరసన శార్దూల్.. అరుదైన ఘనత సాధించిన బౌలర్‌గా రికార్డు