
న్యూఢిల్లీ: టీమిండియా ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా తన బౌలింగ్ శైలిని మార్చుకోవాల్సిన అవసరం లేదని, అలా చేసినా అది పెద్దగా ఫలితం ఇవ్వదని మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా అన్నాడు. బుమ్రా గాయానికి తీరిక లేని క్రికెట్ ఆడటం అసలే కారణం కాదని, గాయం (స్ట్రెస్ ఫ్రాక్చర్)కు, యా క్షన్‌కు సంబంధం లేదని పేర్కొన్నాడు. ఓ ఫాస్ట్ బౌలర్‌గా సాంకేతిక అంశాలపై పట్టున్న నెహ్రా... ‘ఈ విషయంలో మన ఆలోచన మారాలి. పునరాగమనం చేశాక బుమ్రా ఇదే శైలితో ఇంతే తీవ్రతతో బంతులేయగలడు. అతడిదేమీ అసాధారణ యాక్షన్ కాదు.
బంతిని విసిరే సందర్భంలో తన శరీరం కచి్చతమైన దిశలో ఉంటుంది. ఎడమచేయి మరీ పైకి లేవదు. ఎడమ కాలును వంచుతూ జావెలిన్ త్రో తరహాలో బౌలింగ్ చేసే మలింగ కంటే బుమ్రా యాక్షన్ పది రెట్లు మెరుగైనది’ అని నెహ్రా విశ్లేíÙంచాడు. గాయంతో ఉన్న ఆటగాడికి కోలుకునే వ్యవధి నిర్దేశించడం వివేకం కాదని, మైదానంలో దిగేందుకు తన శరీరం వంద శాతం సంసిద్ధంగా ఉందా లేదా అనేది వారికే తెలుస్తుందని అన్నాడు. బుమ్రా తరహా ఇబ్బందులకు శస్త్రచికిత్సలు అవసరం లేదని, కేవలం విశ్రాంతి, పునరావస ప్రకియ సరిపోతుందని నెహ్రా వివరించాడు.
Comments
Please login to add a commentAdd a comment