
న్యూఢిల్లీ: ఇటీవల భారత క్రికెట్ జట్టులోకి వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రా పునరాగమనం చేసిన సంగతి తెలిసిందే. ఆసీస్ తో మూడు టీ 20ల సిరీస్ లో భాగంగా నెహ్రాను జట్టులోకి తీసుకున్నారు. ఇక్కడ వెటరన్ ఆటగాళ్లు యువరాజ్ సింగ్, సురేశ్ రైనాలను కాదని, నెహ్రాకు చోటు కల్పించడంపై విమర్శలు సైతం చెలరేగాయి. దాదాపు 9నెలల విరామం తరువాతం అంతర్జాతీయ క్రికెట్ లోకి పునరాగమనం చేసిన ఆశిష్..తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని సీరియస్ గా పరిగణిస్తున్నాడట. రాబోవు న్యూజిలాండ్ తో సిరీస్ లో వీడ్కోలు చెప్పడానికి సిద్ధమవుతున్నట్లు ముంబై మిర్రర్ ఓ కథనాన్ని ప్రచురించింది. న్యూజిలాండ్ తో తన స్వస్థలం ఢిల్లీలో జరిగే మ్యాచ్ ద్వారా రిటైర్మెంట్ కు యోచిస్తున్నట్లు స్పష్టం చేసింది. న్యూజిలాండ్ తో ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో భారత్ కు ఒక టీ 20 మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్ ద్వారా వీడ్కోలు తీసుకుని అభిమానులకు ఘనమైన ముగింపు ఇవ్వడానికి నెహ్రా సన్నద్ధం అవుతున్నట్లు కథనంలో పేర్కొంది.
ఇప్పటికే ఆసీస్ తో టీ 20 సిరీస్ లో నెహ్రాకు ప్రాబబుల్స్ లో చోటు కల్పించినా, తొలి రెండు టీ 20లకు నెహ్రాకు చోటు దక్కని విషయం గమనార్హం. ప్రస్తుతం 38 ఒడిలో ఉన్న నెహ్రా అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్నడా?లేదా? అనేది త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
,
Comments
Please login to add a commentAdd a comment